
సాక్షి, అమరావతి : ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్‌లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్‌లోకి వర్షలు నీరు వచ్చి చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment