ఓ వైపు హైదరాబాద్ నగరంలో మంచినీరు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాత్రం మంచినీరు రోడ్డు పై వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం మధ్యాహ్నం బోరబండలో మంజీర వాటర్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో నీళ్లు వరదగా రోడ్డమీదికి వచ్చాయి. ఇది గుర్తించిన స్థానికులు నీటి సరఫరాను నిలిపి వేయాల్సిందిగా.. అధికారులకు సమాచారమిచ్చారు. అయితే.. గంటలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అధికారులు అలక్ష్యంగా ఉన్నారని విమర్శిస్తున్నారు.