KRS Dam Leakage: Kumaraswamy Sensational Comments On MP Sumalatha - Sakshi
Sakshi News home page

‘ఎంపీని అడ్డుగా పడుకోబెడితే లీకేజీ బంద్‌’

Published Tue, Jul 6 2021 2:04 AM | Last Updated on Tue, Jul 6 2021 12:25 PM

Kumaraswamy Locks Horns With Mandya MP Sumalatha Over KRS - Sakshi

శివాజీనగర: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ లీకేజ్‌ అవుతోందని, మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు.  

కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు.  మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement