KRS DAM
-
‘ఎంపీని అడ్డుగా పడుకోబెడితే లీకేజీ బంద్’
శివాజీనగర: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ లీకేజ్ అవుతోందని, మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు. -
కర్ణాటకను విలన్‌గా చూస్తున్నారు: సిద్ధరామయ్య
బెంగళూరు: ‘మైసూరు నగర నిర్మాత దివంగత నల్వడి కృష్ణదత్త రాజ ఒడెయార్ బంగారు నగలను తాకట్టు పెట్టి కే.ఆర్.ఎస్ డ్యాంను నిర్మించారు. ఇక హారంగి, కబిని, హేమావతిలను కూడా మన సొంత డబ్బు ఖర్చుపెట్టి నిర్మించుకున్నాం. ఈ నాలుగు జలాశయాల నిర్మాణానికి కేంద్ర ప్రభత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అయినా నీటిని సేకరించి ఈ నాలుగు జలాశయాల్లో నిల్వ చేసి పొరుగున ఉన్న తమిళనాడుకు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కావేరి విషయంలో కర్ణాటక బలిపశువయ్యింది.’ అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని గాంధీ భవన్లో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సాధారణంగా ‘కావేరి’ జలాశయాల్లో ఈశాన్య రుతుపనాలు బాగా పడితే 257 టీఎంసీల నీరు ఉండాలని, అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 129 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ మొదటి వరకూ నీటిని వదిలామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ నాలుగు జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవన్నారు. ఈ విషయాలన్నీ చెప్పినా కూడా కావేరి నీటిని తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఎందుకు ఆదేశిస్తోందో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ కర్ణాటకను ప్రతి ఒక్కరూ ఒక విలన్‌గా చూస్తున్నారన్నారు. అయితే కావేరి విషయంలో కర్ణాటక బలిపశువన్నదే సత్యమని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. -
లోక్‌సభ ఎన్నికల అనంతరం సిద్ధుకు పదవీ త్యాగం తప్పదు
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయకతప్పదని మాజీ సీఎం, ప్రతిపక్షనేత కుమారస్వామి జోస్యం చెప్పారు. విధానసౌధలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీలేవీ సిద్ధును పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు రచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆయన్ను పదవి నుంచి తొలగించడానికి తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారన్నారు. జేడీఎస్ పార్టీ వల్ల తాను రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినట్లు సిద్ధరామయ్య చెప్పుకోవడం సత్యదూరమన్నారు. జేడీఎస్ జాతీయ అధ్యక్షుడైన దేవెగౌడపై ఆరోపణలు చేయడం మంచిదికాదని హితవు పలికారు. ఈ విషమై చర్చించడానికి ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని సిద్ధరామయ్యకు కుమారస్వామి సవాల్ విసిరారు. కేఆర్ఎస్ డ్యాంలో రోజురోజుకూ నీటిమట్టం తగ్గిపోతోందన్నారు. దీంతో బెంగళూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న తొమ్మిది జిల్లాల ప్రజలు వేసవి రాకుండానే తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో కావేరి ప్రవహిస్తున్నా తాగునీటి కోసం పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కేంద్రప్రభుత్వ సవతితల్లి ప్రేమే కారణమన్నారు. రాహుల్ మేనియ రాష్ట్రంలో పనిచేయదన్నారు. పదేళ్ల తర్వాత కర్ణాటకపై ఆయనకు ప్రేమ పుట్టుకు వచ్చిందా అని కుమారస్వామి వ్యంగ్యంగా అన్నారు.