
సీఎం బ్లాక్ లోకి నీళ్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో లీకేజీలు బయటపడుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధులు నిర్వర్తించే బ్లాక్ లోకే వాటర్ లీకయింది. నీళ్ల ట్యాంకు నుంచి భారీగా సీఎం బ్లాక్ లోకి చేరడంతో అదుపుచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది.
వాటర్ లీకేజీని అదుపు చేసిన తర్వాత బ్లాక్ ను శుభ్రం చేశారు. సచివాలయం ప్రారంభమై కొద్ది నెలలైనా గడవకముందే లీకేజీలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హడావుడిగా పనులు పూర్తి చేయడంతో సచివాలయం నిర్మాణంలో రాజీపడ్డారన్న ఆరోపణలకు ఇటువంటి ఘటనలు బలాన్నిస్తున్నాయి.