అమరావతిలో హెల్త్‌సిటీకి భూమిపూజ | Rs 1,000 crore healthcare city in Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో హెల్త్‌సిటీకి భూమిపూజ

Published Wed, Aug 16 2017 11:45 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Rs 1,000 crore healthcare city in Amaravati

అమరావతి: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు బుధవారం భూమిపూజ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో-యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్‌ సిటీకి ఆ సంస్థ సీఈవో అజయ్‌ రాజన్‌ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి భూమిపూజ చేశారు. మూడుదశల్లో 150 ఎకరాల్లో నిర్మించే ఆస్పత్రి నిర్మాణానికి మొత్తం రూ.1,700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.500 కోట్ల వ్యయంతో 50 ఎకరాల్లో అత్యాధునిక ఆస్పత్రి నిర్మించనున్నారు.
 
2019లోపు తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తారు. నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతులను సీఆర్‌డీఏ అధికారులు సమకూర్చుతారు. తొలిదశలో 250 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు. ఇందులో 20 శాతం భూములిచ్చిన రైతులు, స్థానికులకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. 2022 లోపు మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement