ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆత్మహత్య | RMP doctor commits suicide at AP Secretariat | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆత్మహత్య

Published Sat, Aug 19 2017 8:18 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆత్మహత్య - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆత్మహత్య

అమరావతి: అప్పుల బాధను భరించలేక తన వేదనను ముఖ్యమంత్రితో చెప్పుకుందామని వచ్చిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు తనువు చాలించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్‌మెంట్‌ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెలగపూడిలోని సచివాలయం వద్ద వేచి చూసిన రాజగోపాల్‌కు మొండి చేయి ఎదురైంది.

దీంతో వెక్కిరిస్తున్న కష్టాలు ఆయన్ను ఆత్మహత్యకు ఉసిగొలిపాయి. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అక్కడికక్కడే తాగేశారు. రాజగోపాల్‌ పురుగుల మందు తాగడం గమనించిన సచివాలయ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజగోపాల్‌ స్వస్ధలం నెల్లూరు జిల్లాగా అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement