Rajagopal
-
శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
-
రూ.164 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ 2032 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు (రూ.164 లక్షల కోట్లు) చేరుకుంటుందని రిటైల్ వర్తకుల అసోసియేషన్ (రాయ్), ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదిలో పేర్కొన్నాయి. 2021 నాటికి రిటైల్ మార్కెట్ పరిమాణం 690 బిలియన్ డాలర్లు (56.5 లక్షల కోట్లు)గా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రిటైల్ రంగం విక్రయాలు 2021–22 నాటికి 52 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2028 నాటికి 136 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని పేర్కొంది. వచ్చే 4–5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 25 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో కొత్త మాల్ వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అంచనా వేసింది. 2022లో ఈ ఏడు పట్టణాల్లో 2.6 మిలియన్ చదరపు అడుగుల కొత్త మాల్ విస్తీర్ణం తోడైనట్టు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది. 2022 చివర్లో పండుగల సమయంలో విక్రయాల విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని, గతేడాదితో పోలిస్తే ఇది 2.5 రెట్లు అధికమని అనరాక్ రిటైల్ సీఈవో, ఎండీ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. సంఘటిత రిటైల్ మార్కెట్ ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చూస్తుందని చెప్పారు. మూడు పట్టణాల్లో ఎక్కువ వసతులు భారత రిటైల్ రంగం 2019 నుంచి 2022 మధ్య 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 51 మిలియ్ చదరపు అడుగులకు పైన మాల్ వసతులు ఉంటే, అందులో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు 62 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు చెప్పారు. 2022లో సగటున మాల్ అద్దె 15 శాతం పెరిగిందని, బెంగళూరులో అత్యధికంగా అద్దెలు 27 శాతం పెరిగితే, ఆ తర్వాత కోల్‌కతాలో 20 శాతం అధికమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ–రిటైల్ మార్కెట్ పరిమాణం 2025–26 నాటికి 120–140 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
రాజగోపాల్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
-
సినిమా – బయోపిక్: దోసె కింగ్ పై ఆమె యుద్ధం
ఇరవై ఏళ్లు ఆమె న్యాయం కోసం యుద్ధం చేసింది. ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, రెస్టరెంట్ రంగానికి సమ్రాట్, వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్. కాని ఆయన వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె న్యాయపోరాటం చేసింది. ఆమె కథ ఇప్పుడు ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘దోసె కింగ్’గా చిత్ర రూపం దాలుస్తోంది. ఆమె పేరు జీవజ్యోతి శాంతకుమార్. ఇది ఆమె పోరాటగాథ. ‘శరవణ భవన్’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది. ఆమె పేరు జీవజ్యోతి జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. శరవణ భవన్లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది. ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. శాంతకుమార్ కూడా. 2001లో హత్య జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది. సుదీర్ఘ పోరాటం రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. సినిమా పేరు ‘దోసె కింగ్’ జంగిల్ పిక్చర్స్ వారు జీవ జ్యోతి నుంచి బయోపిక్ రైట్స్ కొనుక్కుని ‘జై భీమ్’ దర్శకుడు టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీయనున్నారు. తారాగణం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.‘నా పోరాటం సినిమాగా రానుండటం నాకు సంతోషంగా ఉంది’ అంది జీవ జ్యోతి. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఒక రోజైనా జైలులో ఉండకుండా రాజగోపాల్ మరణించడం పట్ల ఆమెకు ఇంకా అసంతృప్తే ఉంది. -
King Dosa: భర్తను చంపిన మూర్ఖుడిపై పోరాటమే సినిమాగా..
కొన్ని కథలు సినిమా కంటెంట్‌గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆడియొన్స్‌ను మెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు బోల్తా పడుతుంటాయి. కానీ, వ్యథలు, పోరాటాలతో కూడిన వాస్తవ గాథలు మాత్రం తెరపై భావోద్వేగాలను పండించి ఆడియొన్స్‌ను మెప్పించిన సందర్భాలే ఎక్కువ!. సూర్య ‘జై భీమ్’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు ‘దోశ కింగ్’ అంటూ మరో వాస్తవ ఘటనను సిల్వర్ స్క్రీన్‌పైకి తేబోతున్నాడు. దోశ కింగ్.. వ్యవస్థలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఓ వ్యక్తికి ఎదురు తిరిగి ఓ ఒంటరి అబల చేసిన పోరాటం. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసిన ఓ మూర్ఖుడిపై సాధించిన విజయం. పీ రాజగోపాల్.. శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్ జిల్లాలో ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. రాజగోపాల్ తండ్రి ఉల్లిపాయల వ్యాపారి.. తల్లి గృహిణి. వ్యవసాయంలో కూడబెట్టిన తల్లిదండ్రుల డబ్బు తీసుకుని మద్రాస్ రైలెక్కాడు. కేకే నగర్లో పచారీ కొట్టుతో మొదలుపెట్టి.. చిరు వ్యాపారిగా ఎదిగాడు. శరవణ భవన్ పేరిట ఓ రెస్టారెంట్ మొదలుపెట్టి.. 22 దేశాల్లో 111 రెస్టారెంట్లున్న ఫ్రాంచైజీగా దానిని విస్తరించాడు. హోటల్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన రాజగోపాల్ అంటే అందరికీ గౌరవమే అయినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదం.. విమర్శల మయమే!. జాతకాల పిచ్చితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అదీ తన దగ్గర అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న రామసామి చిన్న కూతురిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. అయితే అప్పటికే జీవజ్యోతికి పెళ్లి అయ్యింది. అందుకే రాజగోపాల్ ప్రతిపాదనను ఆమె ఛీ కొట్టింది. దీంతో పగ పెంచుకున్న రాజగోపాల్.. బెదిరింపులు, దాడులు, చేతబడి లాంటి పిచ్చి ప్రయత్నాలెన్నో చేశాడు. అయినా జీవజ్యోతి లొంగలేదు. దీంతో.. ఆ భర్త అడ్డు తొలగించుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. 2001 అక్టోబర్ 26న బలవంతంగా కిడ్నాప్ చేయించి మరీ జీవజ్యోతి భర్త ప్రిన్స్ శాంతకుమార్‌ను హత్య చేయించాడు. జీవజ్యోతిని లైంగిక వేధించడం, హత్యా నేరారోపణలపై దోశ కింగ్‌గా పేరున్న రాజగోపాల్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ నేరారోపణలతో శరవణ భవన్ పేరు ప్రతిష్టలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. మద్రాస్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే అనారోగ్యంతో బెయిల్ మీద కొన్నాళ్లూ బయట తిరిగాడు. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో.. తిరిగి 2019లో పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. పోలీసులకు లొంగిపోయిన నాలుగు రోజులకే గుండెపోటు.. ఆపై మరో ఐదు రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశాడు దోశ కింగ్ రాజగోపాల్. అతను (రాజగోపాల్) తన ఉద్యోగులతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ కారణంతో నా పోరాటాన్ని చాలామంది తప్పుబట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. అందుకే సినిమా తెర మీదకు రావాల్సిన అవసరం ఉందని జీవజ్యోతి చెబుతోంది. ప్రస్తుతం ఆమె తంజావూర్లో ఓ టైలరింగ్ యూనిట్ నడిపిస్తూ.. తల్లి నడిపిస్తున్న హోటల్ వ్యవహరాలను చూసుకుంటోంది. ఆమె పోరాటమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది. -
పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి’ అనే ప్రాచీన నానుడిలో కొద్దిగా మార్పు చేస్తే ‘తింటే హోటల్ శరవణ భవన్‌లోనే తినాలి...’అన్నంతగా తీర్చిదిద్దాడు ఆ హోటల్ అధినేత రాజగోపాల్. అయితే అన్నంపెట్టే ఆ చేయి కాలక్రమంలో హత్య కూడా చేసింది. జోస్యుడు చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడు. పరువు ప్రతిష్టలను, చివరకు యావజ్జీవ శిక్షా ఖైదీగా ప్రాణాలను సైతంపోగొట్టుకున్నాడు. సినిమా ఫక్కీలో చోటుచేసుకున్న ఉదంతాలతో రాజగోపాల్ జీవిత చరమాకం విషాదకరంగా ముగిసింది. క్లీనర్ టూ ఓనర్: తూత్తుకూడి జిల్లా పున్నైనగర్ అనే చిన్నపాటి గ్రామంలో జన్మించిన రాజగోపాల్ తన 12 ఏళ్ల వయస్సు నుంచి కాయకష్టం పనులకు దిగాడు. పొట్టకూటి కోసం చెన్నైకి చేరుకుని చిన్నపాటి హోటల్లో క్లీనర్‌గా పనికి చేరాడు. ఆ తరువాత టీ మాస్టర్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత చెన్నై కేకే నగర్లో ఫలసరుకుల దుకాణాన్ని తెరిచాడు. 1981లో ఒక వినియోగదారుడు వచ్చి ‘అర్జంటుగా సరుకులు ఇవ్వండి, వండుకుని తినాలి, ఈ ప్రాంతంలో ఒక్క హోటల్ కూడా లేదు’ అని చెప్పిన మాటలు రాజగోపాల్ చేత హోటల్ పెట్టించాయి. వేరే వ్యక్తి నడుపుతున్న కామాక్షి భవన్ అనే హోటల్‌ను కొనుగోలుచేసి నడుపుతూ కొన్నేళ్ల తరువాత దానినే హోటల్ శరవణభవన్గా పేరు మార్చాడు. ఆ హోటల్ అంచలంచెలుగా, శాఖోపశాఖలుగా ఎదుగుతూ విదేశీ శాఖల స్థాయికి విస్తరించింది. చెన్నైలోని 25 శాఖలను కలుపుకుని దేశ విదేశాల్లో మొత్తం 46 శాఖలున్నాయి. శాఖాహారం అంటేనే శరవణ భవన్ అనే పేరు తెచ్చుకుంది. పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం: ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాజగోపాల్ జీవితాన్ని ఓ వ్యక్తి చెప్పిన జోస్యం అథఃపాతాళానికి నెట్టివేసింది. రెండు పెళ్లిళ్లతో సంతృప్తి చెందక మూడోపెళ్లి కోసం వెంపర్లాట హంతకుడిగా మార్చివేసింది. నాగపట్నం జిల్లా వేదారణ్యంకు చెందిన వ్యక్తి హోటల్ శరవణ భవన్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఈరకంగా మేనేజర్ కుమార్తె జీవజ్యోతితో రాజగోపాల్‌కు పరిచయం ఏర్పడగా, అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న ఆయన జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలని తలంచి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే జీవజ్యోతి ప్రిన్స్ శాంతకుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. దీంతో కక్ష పెంచుకున్న రాజగోపాల్ ఎలాగైనా జీవజ్యోతిని సొంతం చేసుకోవాలని కుట్రపన్నాడు. జీవజ్యోతిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ప్రిన్స్ శాంతకుమార్‌ను బెదిరించాడు. అయితే ఇందుకు అతను ససేమిరా అన్నాడు. ఇదిలా ఉండగా 2001 అక్టోబరు 26వ తేదీన శాంతకుమార్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో భార్య జీవజ్యోతి చెన్నై వేలాచ్చేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తరువాత శాంతకుమార్ శవం కొడైక్కెనాల్ కొండగుట్టలో లభ్యమైంది. హతుడి భార్య జీవజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించిన చెన్నై పూందమల్లి కోర్టు... ప్రధాన నిందితుడు రాజగోపాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.55 లక్షల జరిమానా విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజగోపాల్ తదితరులు మద్రాసు హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టు ఇచ్చిన 10 ఏళ్ల జైలు శిక్ష తీర్పును యావజ్జీవ శిక్షగా పెంచుతూ 2009లో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాజగోపాల్ సహా నిందితులంతా సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, ఈ అప్పీలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఖరారుచేసింది. అంతేగాక జూలై 7వ తేదీన కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు 9 మంది నిందితులు 7వ తేదీన చెన్నై 4వ అదనపు కోర్టులో లొంగిపోగా వారందరినీ వెంటనే జైల్లో పెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజగోపాల్ మాత్రం అనారోగ్యకారణాలను చూపుతూ ఈనెల 7వ తేదీన సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ గడువు పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాలు మూసుకుపోవడంతో రాజగోపాల్ ఈనెల 9వ తేదీన చెన్నైలోని సిటీ సివిల్ కోర్టుకు స్ట్రెచర్‌పై పడుకుని వచ్చి లొంగిపోయాడు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన రాజగోపాల్‌ను మాత్రం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స సరిలేదు, ప్రయివేటు అసుపత్రికి తరలించేందుకు అనుమతివ్వాల్సిందిగా ఆయన కుమారుడు ఈనెల 15 తేదీన పిటిషన్ వేయగా 16న కోర్టు అనుమతించింది. అయితే ఇక్కడి నుంచి తరలిస్తే ప్రాణాలకు ముప్పువస్తుందని ఆసుపత్రి డీన్ హెచ్చరించినా అందుకు తానే బాధ్యత వహిస్తానని కుమారుడు హామీ ఇచ్చి చెన్నైలోని మరో ప్రయివేటు ఆసుపత్రిలో బుధవారం చేర్పించాడు.అయితే 24 గంటలు ముగిసేలోపే గురువారం ఉదయం రాజగోపాల్ ప్రాణాలువిడిచాడు. ఒక్కరోజుకూడా జైల్లో ఉండలేదు: జీవజ్యోతి నా భర్తను దారుణంగా హత్యచేసిన కేసులో ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా రాజగోపాల్ మరణించడాన్ని తాను సహించలేక పోతున్నానని హతుడు ప్రిన్స్ శాంతకుమార్ భార్య జీవజ్యోతి ఈ సందర్బంగా గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ‘శాంతకుమార్‌ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే న న్ను మూడో పెళ్లి చేసుకునేందుకు రాజగోపాల్ అనేకరకాల వత్తిడిచేశారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని సంసార జీవితాన్ని నెట్టుకొచ్చాను. అయితే దీన్ని సహించలేని రాజగోపాల్ తన మనుషులతో భర్తను కిడ్నాప్ చేయించి కిరాతకంగా హత్యచేశాడు. చిన్న వయసులో నా చుట్టూ ఏర్పడిన సమస్యలతో జీవితాన్ని దారుణంగా నష్టపోయాను. అయితే వాటన్నింటినీ తట్టుకుని న్యాయపోరాటం చేసి రాజగోపాల్‌ను దోషిగా నిలబెట్టగలిగాను. అయితే తన అనారోగ్యాన్ని కారణంగా చూపిన రాజగోపాల్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. అంతేగాక రాజగోపాల్ మరణం వల్ల నా భర్త ఆత్మశాంతించదు, నాకు హృదయానికి మానని గాయంగా మిగిలిపోగలదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్ హోటళ్ల గ్రూప్ అధినేత పి.రాజగోపాల్ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్ స్థాపించిన శరవణ భవన్ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. -
‘శరవణ’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ‘శరవణ భవన్’ హోటళ్ల యజమాని పి.రాజగోపాల్ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని సెషన్‌కోర్టులో లొంగిపోయారు. దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్ ఓ హత్య కేసులో దోషి. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. 2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది. -
శరవణ భవన్స్ అధినేత రాజగోపాల్‌కి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
శరవణభవన్ యజమానికి యావజ్జీవం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్ శరవణభవన్ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. జూలై 7వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. హోటల్ శరవణభవన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. చెన్నై వాసి ప్రిన్స్ శాంతకుమార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లాడాలని ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. దీంతో రాజగోపాల్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన చెన్నై పూందమల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రాజగోపాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. తర్వాత నిందితులు మద్రాసు హైకోర్టుకు, తదనంతరకాలంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఇచ్చిన యావజ్జీవశిక్షను సమర్ధించింది. శరవణభవన్ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. -
సింగ్ సోదరులను అరెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ సోదరులిద్దరు నిర్ణీత గడువులోగా రూ. 472 కోట్లు చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో వారి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థ కోరింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని, అలాగే ఈ విషయంలో వ్యక్తిగతంగా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. సెబీ చట్టంలోని సెక్ష న్ 28ఎ ని ప్రయోగించడం ద్వారా సింగ్ సోదరులతో పాటు ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, శివి హోల్డింగ్స్, మాలవ్ హోల్డింగ్స్, రెలిగేర్ ఫిన్వెస్ట్, బెస్ట్ హెల్త్‌కేర్, ఫెర్న్ హెల్త్‌కేర్, మోడ్‌ల్యాండ్ వేర్స్ నుంచి నిధులను రికవర్ చేయాలని కోరింది. ‘గతేడాది అక్టోబర్, డిసెంబర్లలో సెబీ ఆదేశాల మేరకు డబ్బు రికవరీ కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. తొమ్మిది పార్టీలకు నోటీసులు పంపించాం. సింగ్ సోదరుల అవకతవకలపై లూథ్రా అండ్ లూథ్రా లా ఏజెన్సీ నివేదిక ప్రాతిపదికగా డబ్బును రాబట్టుకునేందుకు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నియంత్రణ సంస్థలను ఆశ్రయిస్తున్నాం. ఇప్పటికే సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐస్కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు నివేదిక కాపీలు కూడా ఇచ్చాం. ఫెర్న్, మోడ్‌ల్యాండ్, బెస్ట్ సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాం‘ అని ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ రవి రాజగోపాల్ తెలిపారు. ఫోర్టిస్ నుంచి మోసపూరితంగా నిధులు మళ్లించారని సింగ్ సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని వడ్డీతో పాటు మూడు నెలల్లోగా తిరిగి చెల్లించాలంటూ సింగ్ సోదరులను అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం .. సెక్షన్ 28ఎ అంశంపై శివీందర్ సింగ్ స్పందించారు. ఫోర్టిస్ సొంతంగా జరిపిన విచారణ నివేదిక కాపీలు తనకి ఇంత వరకూ అందజేయలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తన వాదన వినిపించే అవకాశాలు లేకుండా సెక్షన్ 28ఎ ని ప్రయోగించడమనేది అసమంజసమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘2015 సెప్టెంబర్‌లో ఫోర్టిస్లోని అన్ని ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను. అప్పట్నుంచీ మిగతా నాన్–ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల హోదాతోనే ఉన్నాను. వివాదాస్పద లావాదేవీల గురించి మిగతా బోర్డు సభ్యుల్లాగానే నాక్కూడా ఎటువంటి సమాచారం లేదు‘ అని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ విషయం ఫోర్టిస్‌కు కూడా తెలుసని, మిగతావారు తీసుకున్న నిర్ణయాలకు తనను బాధ్యుణ్ని చేయడం సరికాదని శివీందర్ సింగ్ చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆత్మహత్య
అమరావతి: అప్పుల బాధను భరించలేక తన వేదనను ముఖ్యమంత్రితో చెప్పుకుందామని వచ్చిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు తనువు చాలించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అపాయింట్మెంట్ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెలగపూడిలోని సచివాలయం వద్ద వేచి చూసిన రాజగోపాల్‌కు మొండి చేయి ఎదురైంది. దీంతో వెక్కిరిస్తున్న కష్టాలు ఆయన్ను ఆత్మహత్యకు ఉసిగొలిపాయి. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అక్కడికక్కడే తాగేశారు. రాజగోపాల్ పురుగుల మందు తాగడం గమనించిన సచివాలయ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజగోపాల్ స్వస్ధలం నెల్లూరు జిల్లాగా అధికారులు గుర్తించారు. -
విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీతో ఒప్పందం
బుక్కరాయసముద్రం: నూతన సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు. శాస్త్ర సాంకేతిక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగంలో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీ సంస్థతో వర్సిటీ యాజమాన్యం ఒప్పందం కుదుర్చకుంది. ఈ సందర్భంగా స్థానిక సిద్ధరాంపురం రోడ్డు సమీపంలో ఉన్న ఆర్డీటీ పాఠశాలలో విదేశీ భాషల అభ్యసనపై తరగతులను బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వంద యూనివర్సీటీల జాబితాలో ఎస్కేయూకు చోటు దక్కిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి వర్సిటీ పలు చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే విదేశీ భాషల అభ్యసనకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశీ భాషలపై 2012 నుంచి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు విదేశీ భాషపై పట్టు సాధించి, దేశ, విదేశాల్లోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్డీటీ మంచి భవిష్యత్తు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ తదితర భాషలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు ఆర్డీటీ సమకూరుస్తుందని అన్నారు. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎస్కేయూ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, దశరథరాముడు, నిర్మల్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు నారాయణరెడ్డి, మహబూబీ, ప్రమీల కుమారి, వన్నూరప్ప ఏటీఎల్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొంత మోదం.. మరికొంత ఖేదం.!
– ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ పదవీ కాలానికి రేపటితో రెండేళ్లు – భర్తీ చేయని టీచర్ పోస్టులు – ప్రైవేట్ సెక్యూరిటీ నియామకంతో నిధులు వృథా – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) వైస్ చాన్స్‌లర్‌గా ఆచార్య కె. రాజగోపాల్ బాధ్యతలు చేపట్టి గురువారంతో రెండు సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ రెండేళ్లలో కంపెనీలు ఆశించిన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాభివృద్ధి కల్పనకు దోహదపడేలా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఆయన చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాబోవు రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే అద్భుత ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణ డిగ్రీతోనే టీసీఎస్ కంపెనీలో 380 మంది ఉద్యోగాలు దక్కించుకున్నారంటే ఈ సెంటర్ పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండేళ్లలో ఎస్కేయూ అభివృద్ధి పథంలో కొనసాగడంతో పాటు మరికొంత వెనుకబాటు కూడా ఉండడం గమనార్హం. - ఎస్కేయూ మౌలిక వసతుల కల్పనకు నిధుల వెల్లువ – రాష్ట్రీయ ఉచ్ఛారతా శిక్షా అభియాన్ పథకం (రూసా) ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్ల మేర నిధులు అందించింది. దీంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు – పాలక భవనంలో వీసీ, రెక్టార్ , రిజిస్ట్రార్ల ఛాంబర్లు ఆధునీకరించారు – ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు రెండు ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణానికి అనుమతి – అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల ఆధునికీకరణ – ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు డైరెక్టర్ నియామకం. రెండు దఫాలుగా రీసెట్ నిర్వహణ, తాజాగా ఆన్లైన్ విధానం ద్వారా రీసెట్ విజయవంతం – జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట. నూతనంగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్ విధానం ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపే ప్రక్రియ విజయవంతం ఉద్యోగాల కల్పన – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి 270 మంది వివిధ కంపెనీల్లో, టీసీఎస్‌లో 380 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, డిజటల్ డిజైన్, సీ లాంగ్వేజ్, సాప్ట్వేర్ టెస్టింగ్, వంటి కోర్సులపై ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు – గత రెండేళ్లలో 640 మంది విద్యార్థులకు రైల్వే, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించారు – రెండు దఫాలుగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులు – రెండు దశాబ్దాలుగా నోటిఫికేషన్‌కు నోచుకోక పోయిన నాన్‌టీచింగ్ పర్మినెంట్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 72 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు విభజించినా.. ఫలితం శూన్యం ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్హాక్ లెక్చరర్లను నియామకాన్ని పారదర్శకంగా చేపట్టారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఫార్మసీ కళాశాలకు అనుమతి పొందారు. లా కళాశాలకు బార్ కౌన్సిల్ అనుమతి మంజూరుకు చొరవ చూపారు. క్యాంపస్‌లో ఆర్ట్స్, సైన్స్ కళాశాలను వేరు చేసి ఇద్దరేసి ప్రిన్సిపళ్లు, వైస్ ప్రిన్సిపళ్ల నియామకం చేసినా... పాలనా పరంగా జాప్యం చోటు చేసుకుంటోంది. నూతనంగా హాస్టల్ మేనేజర్స్‌ను నియమించినప్పటికీ... నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమయ్యారు. దీంతో తిరిగి హాస్టల్ మేనేజర్స్‌ను రద్దు చేసి.. యథాతథంగా వార్డెన్స్‌ను నియమించారు. ఆర్థిక వనరులు వృథా ఆర్థిక సంస్కరణలతో వర్సిటీ అభివృద్ధి గాడిలో పడింది. వర్సిటీ ప్రతిష్ట రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్)లో తొలి సారిగా 100 లోపు ర్యాంకు వచ్చింది. అయితే కొన్ని విధానాల అమలులో ఆర్థిక వనరులు వృథా అయ్యాయన్న ఆరోపణలూ లేకపోలేదు. వర్సిటీలోని హాస్టళ్లు, ఇతర కార్యాలయాల్లో 70 మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించారు. దీంతో ఏటా రూ.84 లక్షలు ఖర్చు అవుతోంది. వాస్తవానికి ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి చెల్లించే మొత్తానికి, ఉద్యోగులకు ఏజెన్సీ వారు చెల్లించే జీతాలకు భారీ వ్యత్యాసం ఉన్నా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. టెండర్ల ద్వారా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి కట్టబెట్టకపోవడం వివాదాలకు దారితీసింది. ఔట్ సోర్సింగ్ నిర్వాహకుడు ఉద్యోగుల పీఎఫ్ మొత్తాన్ని కాజేసి పత్తా లేకుండా పోయాడు. ఏజెన్సీ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతేడాది న్యాక్ పర్యటన నిమిత్తం లక్షలాది రూపాయలు అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. తొందరగా పూర్తి చేయాలనే ఆత్రుతతో నామినేషన్ పద్దతి మీద పనులు కట్టబెట్టారు. ఇవి కూడా వివాదస్పదమయ్యాయి. యూజీ పరీక్షల విభాగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందనేది నిష్ఠూర సత్యం. రెండేళ్ల క్రితం పరీక్షలకు గైర్హాజరైన వారు సైతం ఉత్తీర్ణులయ్యారు. 2016–17 క్యాంపస్‌లో అన్ని విభాగాలకు బయోమెట్రిక్ విధానం అమలు చేసినప్పటికీ.. ప్రస్తుతం ఏ ఒక్క పరికరం కూడా పనిచేయలేదు. దీంతో రూ.3.19 లక్షల నిధులు వృథా అయ్యాయి. 2016–17 విద్యాసంవత్సరంలో దూరవిద్యకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వర్సిటీ కోల్పోయింది. విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు: ఎస్కేయూకు వీసీగా ఉన్న సమయంలోనే ఎస్వీ, యోగివేమన వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీగా కె.రాజగోపాల్‌ను నియమించారు. తాజాగా జేఎన్టీయూ(ఎ)కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎస్కేయూపై పూర్తి సమయాన్ని కేటాయించకపోడంతో రెండో ఏడాదిలో వర్సిటీ పురోగతి ఆశాజనకంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 30 దేశీయ, విదేశీ వర్సిటీ, పారిశ్రామిక సంస్థలతో ఉపాధి అవకాశాల మెరుగు, నైపుణ్యాల పెంపుదలకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. అయితే ఇవి అమలు జరిగిన దాఖలాలు లేవు. అవగాహన ఒప్పందాలు జరగడమే తప్ప వీటి వల్ల విద్యార్థులకు లబ్ధి చేకూరలేదనే విమర్శలూ ఉన్నాయి. -
ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం
ఎస్కేయూ : ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ సాంబయ్య పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నెల 11న నిర్వాహకులు పురస్కారాన్ని వీసీకి అందజేశారు. విద్య, వైద్య, వైజ్ఞానిక సేవా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సీహెచ్ సాంబయ్య స్మారక పురస్కారాన్ని ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాదికి ఎస్కేయూ వీసీని ఎంపిక చేశారు. విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించి, పాలనదక్షులుగా ఎస్కేయూను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్‌ను పలువురు అభినందించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
లైన్మెన్ రాజగోపాల్ సస్పెన్షన్
లేపాక్షి : లేపాక్షిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్‌మన్‌గా పని చేసే రాజగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు హిందూపురం ట్రాన్స్‌కో డివిజనల్ డీఈఈ ఆర్ఎన్ శేషగిరిరావు గురువారం తెలిపారు. రాజగోపాల్ తన రెండో భార్య మంజులను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు వివరించారు. -
24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్
కమాన్‌చౌరస్తా: ఎంసెట్ తుది దశ కౌన్సిలింగ్ ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎంసెట్ మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ బుధవారం తెలిపారు. గతంలో హాజరుకానీ అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. 24, 25 తేదీల్లో వె»Œ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 27న జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చలానా గడువు నేటితో ఆఖరు ఇంజినీరింగ్ మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు ఎస్బీహెచ్లో చలానా చెల్లించడానికి గురువారంతో గడువు ముగియనుందని మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ తెలిపారు. కళాశాలలో చేరేందుకు ఈ నెల 22వరకు గడువు ఉందని పేర్కొన్నారు. నేడు బ్రాహ్మణ సంఘం సమావేశం కరీంనగర్‌సిటీ : అఖిల బ్రాహ్మణ సేవాసంఘం జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం గురువారం కరీంనగర్‌లోని శ్రీగణేశ శారద శంకరమఠంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా, నగర కన్వీనర్లు బ్రహ్మన్నగారి బ్రహ్మయ్య, పురాణం మహేశ్వరశర్మ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. -
కోలన్ హైడ్రోథెరపీ.. సరికొత్త చికిత్స
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏ టాబ్లెట్‌లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ. జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్‌ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 35 నిమిషాలు పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. శుద్ద్కొలన్ కేర్ ఇప్పుడు శాద్‌నగర్‌లో అందుబాటులో ఉంది. కోలన్ థెరపీ యంత్రాలను కూడా ఇక్కడ తయారుచేస్తున్నారు. హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, స్లిమ్మింగ్ సెంటర్లు, స్పాలు... ఎవరికి అవసరమున్నా సప్లయి చేస్తున్నారు. ఇవీ ఫలితాలు... మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. వీరిలో ప్రతికూల సంకేతాలు ⇒ గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి ⇒సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు. ⇒హార్ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు ⇒రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్ ⇒తీవ్రమైన పైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు రాజగోపాల్ శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ : shuddh colon care opp GVK entry gate,Road No. 4, Banjara Hills,hyderabad 8008002032, 8008002033 షాద్‌నగర్ :9948328351 -
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా?
గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏ టాబ్లెట్‌లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే... ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ. జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్‌ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. ఇవీ ఫలితాలు... ⇒ మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. ⇒ వీరిలో ప్రతికూల సంకేతాలు ⇒ గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి ⇒ సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు. ⇒ హార్ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు ⇒ రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్ ⇒ తీవ్రమైన ైపైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు రాజగోపాల్ శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ : shuddh colon care opp GVK entry gate Road No. 4, Banjara Hills hyderabad. 8008002032, 8008002033 -
ఓంఎంసీ కేసు విచారణ 19కు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదుచేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియపై అభ్యంతరాలుంటే తెలపాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించారు. -
ఏజెన్సీలో రుణమాఫీ
భద్రాచలం: జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతరులకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు రీజనల్ మేనేజర్ జె. రాజగోపాల్ తెలిపారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం ఏబీజీవీబీ రీజనల్ పరిధిలోని 36 మండలాల్లో 42,135 మంది రైతులకు రూ.240 కోట్లు రుణాలను మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో తొలివిడతగా రూ.58.59 కోట్లు మంజూరయ్యాయని, 25 శాతం చొప్పున త్వరలోనే రైతుల ఖాతాలలో వీటిని జమ చేస్తామని తెలిపారు. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను అన్ని గ్రామీణ బ్యాంకుల పరిధిలో ఉంచామన్నారు. వీటిని రైతులు పరిశీలించుకోవచ్చన్నారు. అయితే రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటేనే మాఫీకి అర్హత ఉంటుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. రైతు రుణాలను ఏడాది కాలవ్యవధితోనే ఇస్తామని, ప్రస్తుతం కాలపరిమితి దాటినందను తీసుకున్న రుణంపై 14 శాతం వరకూ వడ్డీ లెక్కిస్తున్నామని తెలిపారు. సక్రమంగా రుణాలను చెల్లించిన వారికే ప్రభుత్వ రుణమాఫీ పథకంలో భాగంగా మూడు దఫాలుగా మంజూరయ్యే మాఫీ మొత్తాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. రైతులకు దీనిపై అవగాహన కల్పించేందుకు గ్రామాలలో టమాకా వేయించాలని రెవెన్యూ అధికారులను కోరారు. డిసెంబర్ 31లోపు రీషెడ్యూల్ చేసుకోండి... రీజియన్ పరిధిలోని 36 మండలాల్లో గల 65 శాఖలలో మొత్తం 54,856 మంది రైతులకు గాను 42,135 మంది రుణమాఫీకి అర్హత ఉందని, రెండవ దఫాగా మరో 9 వేల మందికి కూడా వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులు డిసెంబర్ 31 లోగా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. ముంపు మండ లాల్లో వర్తింపు లేదు... ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లో రుణమాఫీ వర్తింపు ఆ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నందున, తాము వారి జాబితాను వేరు చేశామని చెప్పారు. ఏపీకి బదలాయించిన 7 మండలాల్లో 10 బ్రాంచీలు పూర్తిగా, 1 బ్రాంచి పాక్షికంగా ఆంధ్రలోకి వెళ్తున్నాయని, వీటిలో సుమారు రూ.10 కోట్ల వరకు రైతు రుణాలు ఉంటాయని చెప్పారు. వీటిపై ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని, మహిళలు తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని కోరారు. -
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
స్నానం చేయగానే శరీరంపై ఉన్న మురికంతా పోయి హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా శరీరం లోపల స్నానం చేయించగ లిగితే బాగుంటుంది కదా. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఒకేసారి శుభ్రం చేస్తే పొట్ట అంతా రిలాక్స్ అవుతుంది. ఇదే ఐడియా ఒక కొత్త చికిత్సకు బీజం వేసింది. బయటకు రావడానికి బద్ధకించే మలాన్ని కడిగివేయడానికి అందుబాటులోకి వచ్చిన టెక్నికే కోలన్ హైడ్రోథెరపీ. మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలి వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా ఆహారం సరైన విధంగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. పెద్ద పేగు కేన్సర్ లాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. మల బద్ధకం ఎందుకు..? తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ ప్రసాద్. కోలన్ హైడ్రోథెరపీ మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ డాక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించిఅక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితం అయ్యే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజి చికిత్స తీసుకుంటున్న వారు ఫ్రీ ప్రోబయోటిక్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజి మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. మొదటి, రెండో సిట్టింగ్‌కు మధ్య ఒక వారం, రెండో దానికి మూడో సిట్టింగ్‌కు మధ్య రెండు వారాలు.. మూడు, నాలుగు మధ్య మూడు వారాలు, నాలుగు, ఐదు సిట్టింగ్‌ల మధ్య నాలుగు వారాల నిడివి ఉండాలి’ అని వివరించారు శుద్ధ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జి పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా..! ఇవీ ప్రయోజనాలు ౌ మలబద్దకం నుంచి ఉపశమనం ౌ ఒత్తిడి నుంచి విముక్తి ౌ జీర్ణక్రియ మెరుగవుతుంది ౌ పెద్దపేగులో కదలికలు మెరుగవుతాయి వీరికి పనికిరాదు గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు. - రాజగోపాల్ శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ : shuddh colon care opp GVK entry gate Road No. 4, Banjara Hills hyderabad ఫోన్: 8008002032 8008002033 -
అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు...
జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఓ రిజిస్ట్రర్ ఎయిర్ పార్సిలు చూసిన ఓ వ్యక్తి అవాక్కయిన ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక నివాసం ఉంటున్న ఇంటూరి రాజగోపాల్ బంధువులు అమెరికాలో ఉంటున్నారు. గత నెల 23న బంధువు ...రూ.60వేలు విలువ చేసే ఐ ఫోన్‌ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా రాజగోపాల్‌కు పంపాడు. పార్సిల్ తెరిచి చూసిన రాజగోపాల్ ...ఫోన్‌కు బదులు చెత్త కాగితాలు ఉండటంతో షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి బంధువుకు తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా ఫోన్ పోస్టాఫీసులో మిస్ అయ్యిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది. -
కాంగ్రెస్ నుంచి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలు