మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
స్నానం చేయగానే శరీరంపై ఉన్న మురికంతా పోయి హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా శరీరం లోపల స్నానం చేయించగ లిగితే బాగుంటుంది కదా. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఒకేసారి శుభ్రం చేస్తే పొట్ట అంతా రిలాక్స్ అవుతుంది. ఇదే ఐడియా ఒక కొత్త చికిత్సకు బీజం వేసింది. బయటకు రావడానికి బద్ధకించే మలాన్ని కడిగివేయడానికి అందుబాటులోకి వచ్చిన టెక్నికే కోలన్ హైడ్రోథెరపీ.
మంచి ఆహారం తీసుకోవడం, అది సక్రమంగా జీర్ణం కావడం, వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం... ఇవన్నీ సరైన రీతిలో జరిగితే 90 శాతం జబ్బులను నివారించవచ్చంటే అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు ఆధునిక జీవనశైలి వీటిని పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా ఆహారం సరైన విధంగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం లాంటివి అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. పెద్ద పేగు కేన్సర్ లాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
మల బద్ధకం ఎందుకు..?
తగినన్ని నీళ్లు తాగకపోయినా, జీర్ణక్రియ సరిగా లేకపోయినా, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోయినా.. పేగుల్లో కదలికలు సరిపడినంత ఉండవు. అలాంటి సందర్భాల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. కొంతమంది పేగుల్లో కదలికలు కలిగి విసర్జించాల్సిన అవసరం ఉన్నప్పుడు విసర్జించకుండా పదే పదే ఆపుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు చేరే సంకేతాల తీరు మారుతుంది. అందువల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. స్మోకింగ్ ఇందుకు దారి తీస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పేగులలో కదలికలు లేకపోతే మలబద్ధకం అని భావించవచ్చంటున్నారు మెడికల్ డెరైక్టర్ ప్రసాద్.
కోలన్ హైడ్రోథెరపీ
మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలకు పేగులు శుభ్రపడి వాటి కదలికలు సాఫీగా ఉండటమే పరిష్కారం. ఇందుకోసం కోలన్ హైడ్రోథెరపీ మేలు చేస్తుందంటున్నారు శుద్ధ్ కోలన్ డెరైక్టర్ డాక్టర్ రాజగోపాల్. స్వచ్ఛమైన గోరువెచ్చని నీటిని మలద్వారం ద్వారా పెద్ద పేగు లోపలికి పంపించిఅక్కడ పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తారు. ఆ నీరు పెద్ద పేగు మొత్తాన్ని పూర్తిగా కడిగివేస్తూ బయటకి వచ్చేస్తుంది. దీంతో శరీరంలో మిగిలి ఉన్న మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ నీటిని పంపించడం కోసం ప్రతి పేషెంట్‌కి డిస్పోజబుల్ నాజిల్స్ వాడతారు కాబట్టి నాజిల్ కలుషితం అయ్యే అవకాశం ఉండదు.
ఈ ప్రక్రియకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ‘సమస్య తీవ్రంగా ఉన్నవారికి దీన్ని ప్యాకేజీ చికిత్సగా కూడా ఇస్తారు. పూర్తి ప్యాకేజి చికిత్స తీసుకుంటున్న వారు ఫ్రీ ప్రోబయోటిక్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ప్యాకేజి మొత్తంలో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. మొదటి, రెండో సిట్టింగ్‌కు మధ్య ఒక వారం, రెండో దానికి మూడో సిట్టింగ్‌కు మధ్య రెండు వారాలు.. మూడు, నాలుగు మధ్య మూడు వారాలు, నాలుగు, ఐదు సిట్టింగ్‌ల మధ్య నాలుగు వారాల నిడివి ఉండాలి’ అని వివరించారు శుద్ధ కోలన్ కేర్ డెరైక్టర్ రాజగోపాల్. ఈ ప్యాకే జి పూర్తి అయ్యే నాటికి శరీరంలోని అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా..!
ఇవీ ప్రయోజనాలు
ౌ మలబద్దకం నుంచి ఉపశమనం
ౌ ఒత్తిడి నుంచి విముక్తి
ౌ జీర్ణక్రియ మెరుగవుతుంది
ౌ పెద్దపేగులో కదలికలు మెరుగవుతాయి
వీరికి పనికిరాదు
గర్భవతులు, పెద్దపేగు మలద్వార క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అల్సరేటివ్ కొలిటీస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి కోలన్ హైడ్రో థెరపీ పనికిరాదు.
- రాజగోపాల్
శుద్ధ్ కోలన్ కేర్ డెరైక్టర్
mail id: info@shuddhcoloncare.com
website: www.shuddhcoloncare.com
అడ్రస్ : shuddh colon care
opp GVK entry gate
Road No. 4, Banjara Hills
hyderabad
ఫోన్: 8008002032
8008002033