digestive system
-
Yoga: కొలెస్ట్రాల్‌కు చెక్
రోజూ గంటల తరబడి డెస్క్ జాబ్ చేసేవారికి నడుం నొప్పి, పోట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి విముక్తికి ఈ వక్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ట్విస్టెడ్ పోజ్ అని కూడా అంటారు. పది నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత యోగాసనాలను సాధన చేయాలి.వెన్నెముక బలంగా అవడానికి, మెడ నరాల పనితీరు మెరుగుదలకూ సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల పోట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. నిటారుగా.. నిదానంగా! విశ్రాంతిగా కూర్చొని ఒక కాలును పోట్ట దగ్గర నుంచి రెండవ కాలు మీదుగా తీసుకెళ్లి ఉంచాలి. చేతులను వ్యతిరేక దశలో ఉంచడంతో నడుము భాగం ట్విస్ట్ అవుతుంది. ఎడమచేతితో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను భుజం మీదుగా సాధ్యమైనంత వెనుకకు తిప్పి, దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేత్తో కుడి మోకాలిని పోట్టవైపు నెడుతూ ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. – జి.అనూషా కార్తీక్, యోగా గురు -
Health: డొక్క శుద్ధి.. బుర్రకు బుద్ధి!
బలమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ‘గట్ ఫీలింగ్’ అంటుంటారు. అభిప్రాయాలూ, ఆలోచనలు కలగడం మెదడు పని కాబట్టి ఆ మాట మెదడునూ సూచిస్తుంది. గట్ అనే కడుపు (జీర్ణాశయ) భాగాన్ని మెదడుకు ముడిపెట్టే మాటలు ఎందుకోగానీ తెలుగులోనూ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... ‘కడుపులోంచి దుఃఖం తన్నుకువస్తోంది’... ‘కడుపులో ఎంత బాధ దాచుకున్నాడో’... ‘కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు’... ‘ఆ అమ్మకడుపు చల్లగా’... వంటి ప్రయోగాలతో పాటు, నేర్పు, విద్యకు సంబంధించి... చదువు, లెక్కలు వంటివి వస్తే ‘డొక్కశుద్ధి’ ఉందనీ, విద్య లేకపోతే ‘పొట్టకోస్తే అక్షరం ముక్క రాద’నీ... ఇలా ఎన్నో. జీర్ణవ్యవస్థకూ, మెదడు చేసే పనులకూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలతో పాటూ కడుపు ఆరోగ్యం బాగుంటేనే మెదడు ఆలోచనలూ, పూర్తి ఆరోగ్యమూ బాగుటుందని ఆధునిక వైద్యనిపుణులూ పేర్కొంటున్నారు. ఆ ఉదాహరణలను చూద్దాం..కడుపు–మెదడు కనక్షన్ ఇలా..– కడుపు ఖాళీ అవ్వగానే ఖాళీ అయ్యిందంటూ కడుపు మెదడుకు చెబుతుంది. మెదడు ‘గ్రెలిన్’ అనే హార్మోన్ విడుదల చేయగానే ఆకలేస్తుంది – కడుపు నిండగానే ‘జీఎల్పీ–1’ అనే మరో హార్మోన్ విడుదలై ఇక భోజనం చాలనిపిస్తుంది.– తిన్న వెంటనే పేగులకు రక్త ప్రసరణ పెరుగుతుంది.అందుకే తిన్న వెంటనే మందకొడిగా, స్థబ్దంగా మారడానికి ఈ కనెక్షనే కారణం.– ఒత్తిడికీ, లేదా ఆందోళనకూ లోనైనప్పుడు పెద్ద మెదడు నుంచి భిన్నమైన సిగ్నళ్లు వెలువడి రెండో మెదడులా పనిచేసే గట్ బ్రెయిన్ ప్రభావితమవుతుంది.ఇలా ఎందుకు జరుగుతుందంటే..మెడడు నుంచి వేగస్ నర్వ్ ద్వారా న్యూరోట్రాన్స్ మీటర్లు పేగులకు వెళ్తాయి. వేగస్ నాడి మెదడుకు కడుపునకూ (గట్కూ) మధ్య టెలిఫోన్ తీగలా పని చేస్తూ ఉంటుంది. దీనికి తోడు పేగులకు కూడా ‘ఎంటెరిక్ నెర్వస్ సిస్టమ్’ అనే సొంత నాడీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మెదడు నుంచి అందుకునే సమాచారంతో పేగుల్లోని నాడీ వ్యవస్థ ప్రభావితమవుతూ ఉంటుంది. అందుకునే మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలకు గురైనప్పుడు జీర్ణ సమస్యలైన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’, వాంతులు, నీళ్లవిరేచనాలూ, కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) లాంటి సమస్యలు తలెత్తుతాయి.గట్ హెల్త్ దెబ్బతింటే..పేగుల్లో కోటానుకోట్ల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పాలంటే పది పక్కన పధ్నాలుగు సున్నాలు (టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్) సంఖ్య ఎంత పెద్దదో అన్ని సూక్ష్మజీవులుంటాయి. కడుపులోని ఈ సూక్ష్మజీవుల సముదాయాన్నే ‘గట్ మైక్రోబియం’ అంటారు. ఈ గట్ మైక్రోబియమే రోగనిరోధక వ్యవస్థ మొదలు మెటబాలిజం వరకూ శరీరంలోని పలు జీవక్రియావ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉన్నంత కాలం ఎంతటి తీవ్రమైన రుగ్మతలతోనైనా పోరాడటం సాధ్యమవుతుంది. పేగుల్లోని మైక్రోబియం హెచ్చుతగ్గులకు లోనైతే చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇన్ఫ్లమేటరీ సమస్యలు మొదలుకొని మధుమేహం, ఉబ్బసంలాంటి వాటితో పాటు... చివరకు మానసిక వ్యాధుల బారిన పడతారు. అయితే గట్ హెల్త్ దెబ్బతిని మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి ఆలోచనలూ, మానసికారోగ్యాలూ, భావోద్వేగాలు ప్రభావితం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అవేమిటంటే...– యాంటీబయాటిక్స్: వీటితో దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.– ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిడులు, ఆఫీసుల్లో సహోద్యోగుల వల్ల తలెత్తే ఒత్తిడులు, సామాజిక ఒత్తిళ్లు.. వీటన్నింటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.– ఆందోళన: మానసిక ఆందోళన కలగగానే... గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కు రక్త సరఫరా సక్రమంగా జరగదు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఆందోళనలు లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు (స్ట్రెస్ కెమికల్స్) వ్యాధినిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా దేహానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాతో వ్యాధినిరోధకశక్తి పోరాడలేదు. ఆందోళనలకు గురయ్యేవారిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అదేపనిగా కొనసాగుతుంటే కడుపు, పేగుల్లో పుండ్లు (అల్సర్స్) రావచ్చు. ఒక్కోసారి అక్కడ అల్సర్ మరింతగా పెరిగి కడుపులో రంధ్రం పడవచ్చు.– ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు:సెరటోనిన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా డిప్రెషన్, యాంగై్జటీ మొదలవుతాయి. మెదడులోనే ఉత్పత్తి అవుతుందని అందరూ అనుకునే సెరటోనిన్‌లో 95 శాతం పేగుల్లోనే తయారవుతుంది. అంతేకాదు... సెరటోనిన్, డోపమైన్ అనే ఈ హ్యాపీ హార్మోన్ల తయారీకి తోడ్పడే విటమిన్లు, అమినో యాసిడ్లను... నిజానికి పేగుల్లోని మంచి బ్యాక్టీరియానే ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గితే, సెరటోనిన్ కూడా తగ్గి మానసిక సమస్యలూ మొదలవుతాయి.గట్ రక్షణకు పరిష్కార మార్గాలివి..ఆహారపరమైనవి: పెరుగు తినడం వల్ల పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మజ్జిగ, పెరుగు వంటి వాటిని ‘్రపో–బయోటిక్స్’ అంటుంటారు. వీటితో పాటు పీచు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మలబద్దకం ఉండదు. పొద్దున్నే సుఖవిరేచనం అవుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి భోజనంలో మూడింట ఒక వంతు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌లో కివి, ఆఫ్రికాట్లతో పాటు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి తరచూ తింటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా తీసుకోవడం మూడ్స్‌ను బాగు చేస్తుంది. ఇందుకోసం చేపలు తినాలి. ∙వ్యాయామం ఎండార్ఫిన్స్‌ను వెలువరించడం వల్ల హాయి, సంతోషం లాంటి ఫీలింగ్స్ కలిగించడమే కాకుండా కడుపును తేలిగ్గా ఉంచుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్దకంతో మూడ్స్ చెడిపోతుంటే వైద్యులను సంప్రదించాలి.ఇవి చదవండి: Health: చీకటి పొర చీల్చండి.. -
పెరుగుతో జత చేయకూడని ఆహార పదార్థాలు ఇవే..!
కొంతమంది అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లేదా కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ప్రోటీన్, కాల్షియంల పవర్‌హౌస్ అయిన పెరుగుతో ఈ ఆహార పదార్థాలను జోడించడం వల్ల ఈ సమస్య తీవ్రతరమయ్యి, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా కూడా పెరుగుతో ఇలాంటి పదార్థాలను జోడించడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భారీ భోజనం లేదా మంచి స్పైసీతో కూడిన ఆయిలీ ఫుడ్స్ తినేటప్పుడు పెరుగులో కలపి అస్సలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పెరుగుతో జత చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో సవివరంగా చూద్దామా..!కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. కడుపులోని ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది. ఐతే కడుపులో జీర్ణక్రియ ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మాత్రం పెరుగుకి ఈ పదార్థాలు అస్సలు జత చెయ్యకండి.ఉల్లిపాయలు..ఉల్లిపాయ రైతా ఒక రుచికరమైన లంచ్ టైం డిష్. కూరగాయలు, రోటీలతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పెరుగు శరీరంలో చల్లదనం తీసుకొస్తే..ఉల్లి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే..అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తీవ్రతరం అవ్వడం లేదా రావడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.మామిడికాయలునిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిని పెరుగుతో జత చేసి అస్సలు తినకూడదు. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, పీహెచ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. మామిడికాయలో పులుపు, పెరుగులోని ఆమ్లం వల్ల పీహెచ్ స్థాయిల్లో అసమతుల్యతకు కారణమవుతుంది. మామిడి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఇది కూడా జీర్ణక్రియకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఇలా తినడం ఫుడ్ పాయిజన్‌కు దారితీసి, దద్దుర్లు, తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. చేపశాకాహారంతో నాన్‌వెజ్ మూలాన్ని ఎట్టిపరిస్థితుల్లో జత చేయకూడదు. చేపలు, పెరుగులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఇది కూడా కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పండ్లు..చాలా పండ్లలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల పండ్లను కూడా పెరుగుతో కలపడకూడదు. ఈ కలయిక జీర్ణక్రియకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కూడా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుతందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఇష్టంగా తాగే మిల్క్ షేక్‌లో ఎక్కువగా పాలు, అరటిపండ్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా పొట్టకు ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్..పెరుగులో బాగా వేయించిన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వడలు కలిపిన బ్రేక్‌ఫాస్ట్‌లు తీసుకున్నా పొట్టలో చాలా భారంగా ఉంటుంది. పైగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది కూడా. అంతేగాదు ఆయిల్ ఫుడ్స్‌తో కూడిన పెరుగు జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి నీరసం తెప్పించేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!) -
పురుషులకే క్యాన్సర్ ముప్పు అధికం.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లక్షణాలేంటంటే?
యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ. కారణాలు... ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి. పీఎస్ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు. 1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం. 2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం 4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం 5. మలవిసర్జనలో రక్తస్రావం 6. తీవ్రమైన అజీర్తి 7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం 8. నోటిలో మానని పుండ్లు 9. ఎముకల్లో నొప్పులు. పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. -
సరైన జీర్ణ వ్యవస్థకు లీ హెల్త్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న లీ హెల్త్ డొమెయిన్ సరైన జీర్ణ వ్యవస్థ కోసం ఎంజైమ్యాక్ట్ పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శాఖాహార పదార్థాల నుంచి సేకరించిన ఎంజైమ్స్‌తో ఈ ఉత్పాదనను రూపొందించినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ‘ప్యాంక్రియాటిక్ ఎక్సోక్రిన్ లోపం ఉన్న వ్యక్తులకు డైజెస్టివ్ ఎంజైమ్‌లు లేకపోవడం, సిస్టిక్ ఫైబ్రోసిస్, ప్యాంక్రియాస్ తొలగించడం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటిటిస్ వల్ల ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. మార్కెట్లో ఉన్న జంతు కణ ఆధారిత ప్యాంక్రియాటిన్ ఔషధాల వాడకంతో సమస్యలొస్తున్నాయి. అలాగే వీటిలో మందుల అవశేషాలు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే శాఖాహార ఆధారిత ప్యాంక్రియాటిన్ తో ఎంజైమ్యాక్ట్ తయారు చేశాం’ అని తెలిపారు. -
కోవిడ్ నుంచి కోలుకున్నారా? ఇడ్లీ, దోశ, మజ్జిగ,పెరుగు తింటున్నారా?
కరోనా వైరస్ మన దేహంలోకి ప్రవేశించగానే సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస అందకపోవడం వంటివి చాలామందిలో కనిపించాయి. అందుకే తొలుత దాన్ని ఓ ఫ్లూ లాంటి జలుబుగా పరిగణించారు. కానీ మరికొంత మందిలో నీళ్ల విరేచనాలు, గొంతులో మంట, యాసిడ్ బయటకు తన్నినట్లుగా అనిపించడం, ఛాతీ బరువుగా ఉండటం, ఛాతీలో మంట, పొట్ట/ఛాతీ భాగంలోని కండరాలు పట్టేయడం (క్రాంప్స్), వికారం (వాంతి అవుతున్నట్లుగా అనిపించడం) వంటి లక్షణాలూ కనిపించాయి. కొంత పరిశీలన తర్వాత నిపుణులు వీటిని కూడా కరోనాకు సూచనగా పరిగణించడం మొదలుపెట్టారు. అయితే వీటిలో నీళ్ల విరేచనాలు, వికారం వంటి కొన్నింటిని మినహాయిస్తే... మిగతావి గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలు కూడా కావడంతో... కరోనా గుండె, రక్తప్రసరణ వ్యవస్థనూ దెబ్బతీసి కొందరిలో గుండెపోటుకూ కారణమవుతుందని వెల్లడైంది. క్రమంగా వైరస్‌లో కనిపించిన జన్యుమార్పుల వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాలు సైతం ఎక్కువగానే కనిపించడం మొదలైంది. అదేవిధంగా కరోనా అనంతరం మిగతా అవయవాలపై దుష్ప్రభావాలు ఉన్నట్లే... జీర్ణవ్యవస్థపై కూడా ఈ వైరస్ కొన్ని ప్రతికూల ప్రభావాలను వదిలిపెట్టి వెళ్లడాన్ని శాస్త్రవేత్తలు, నిపుణులు గమనించారు. ఈ విషయమై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి కూడా. కరోనా తర్వాతా కొనసాగే లక్షణాలు... సాధారణంగా కరోనా వైరస్ సోకిన 14 రోజుల్లోనే దాని ప్రభావం తగ్గడం, నిర్ధారణ పరీక్షలు చేయిస్తే నెగెటివ్ రావడం, అంతకు ముందునుంచే లక్షణాలు క్రమంగా తగ్గడం వంటివి జరుగుతుంది. కానీ కొందరిలో దాదాపు అన్ని వ్యవస్థలకు చెందిన కొన్ని రకాల అనర్థాలు కనిపించినట్టే జీర్ణవ్యవస్థలోనూ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు యాసిడ్ పైకి ఎగజిమ్మేలా చేసే యాసిడ్ రిఫ్లక్స్, వికారం, కడుపు ఉబ్బరించినట్లుగా ఉండటం (బ్లోటింగ్), పొట్టలో తీవ్రమైన నొప్పి (అబ్డామినల్ పెయిన్), తరచూ విరేచనాలు కావడం వంటి లక్షణాలు... ఇటీవల చాలామందిలో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా కనిపిస్తున్నాయి. ఇక మరికొందరిలోనైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత కూడా అడపాదడపా పునరావృతం కావడం జరిగింది. లక్షణాలు ఎందుకు కనిపిస్తాయంటే? వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఈ లక్షణాలు ఉంటాయి. ఓ వ్యక్తిలో వైరస్ పరిమాణం మరీ ఎక్కువగా ఉండటం కారణంగా జీర్ణవ్యవస్థలోని పలు భాగాలు ఇన్ఫ్లమేషన్కు గురికావచ్చు. ఆ వైరస్ దేహంలో చాలాకాలం పాటు ఉండటం కూడా ఓ కారణం కావచ్చు. అప్పుడు ఏదైనా భాగం ఇన్ఫ్లమేషన్కు గురైనప్పుడు వాపు, మంట, ఎర్రబారడం జరుగుతుందన్న విషయం తెలిసిందే. జీర్ణవ్యవస్థలోనూ ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా జీర్ణవ్యవస్థలోని కీలకమైన భాగాలు ప్రభావితమవుతాయి. హైపాక్సియా కూడా ఓ కారణమే... ఇటీవల కరోనా కారణంగా ‘హైపాక్సియా’ అనే కండిషన్ గురించి ప్రజలందరికీ తెలిసి వచ్చింది. దేహంలోని అన్ని కణాలకూ ఆక్సిజన్ తగినంత పరిమాణంలో అందకపోవడమే ‘హైపాక్సియా’. ఇటీవల కరోనా తర్వాత అన్ని ప్రచార, ప్రసార సాధనాల ద్వారా మన రక్తంలో ఆక్సిజన్ పరిమాణం దాదాపు 95 శాతానికి మించి ఉండాలనీ, అంతకంటే తగ్గితే... బాధితుడిని తక్షణం హాస్పిటల్‌కు తరలించాలన్న అవగాహన అందరికీ తెలిసింది ఈ కరోనా సమయంలోనే. మనకు తెలిసిందల్లా రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గితే... శ్వాస అందకపోవడం, ఆయాసం, ఛాతీనొప్పి, గుండెకు కలిగే నష్టం గురించే తెలుసు. కానీ దీని వల్ల గుండె, ఊపిరితిత్తులకే కాదు... జీర్ణవ్యవస్థ మొత్తానికి (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్‌కు) తీరని నష్టం కలుగుతుంది. హైపాక్సియా కారణంగానే బాధితుడు అస్థిమితంగా ఉండటం, కంగారు కంగారుగా వ్యవహరించడం, యాసిడ్ పైకి ఎగజిమ్మినట్టుగా కావడంతో పాటు ఇతర జీర్ణవ్యవస్థ తాలూకు లక్షణాలు వ్యక్తమవుతుంటాయని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల పరిశీలనల్లో, పరిశోధనల్లో తేలింది. ఇలా ఆక్సిజన్ తగ్గడం వల్ల తీవ్రమైన నిమోనియా వంటి లక్షణాలు, అనర్థాలు ఎంతగా కలుగతాయో... కరోనా వచ్చి తగ్గాక కూడా దీర్ఘకాలపు జీర్ణవ్యవస్థ సమస్యలూ అంతగానే సంభవిస్తాయి. మందుల దుష్ప్రభావాలు కూడా... కరోనా వచ్చినా... లేదా మరేదైనా సమస్య వచ్చినా దాన్ని నయం చేసుకోవడం కోసం మనం మందులు వాడుతుంటాం. మనం నోటి ద్వారా తీసుకున్న మందులన్నీ జీర్ణవ్యవస్థలోకి వెళ్లి... జీర్ణమై.. ఆ మందు ప్రభావాలన్నీ ఆయా రుగ్మతల మీద పనిచేయాలి. మనం విచ్చలవిడిగా మందులు వాడే ఈ క్రమంలో అవి కడుపులో పడగానే దాని రసాయన ప్రతికూలతలూ, ప్రభావాలు తొలుత పడేది జీర్ణవ్యవస్థలోని గోడల మీదే. అయితే జీర్ణవ్యవస్థలోని గోడలు ఎప్పటికప్పుడు తమను తాము రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ కారణంగా చాలావరకు వాటి దుష్ప్రభావాలు మనకు కనిపించవు... లేదా అతికొద్దికాలం పాటు కనిపించి అవే తగ్గిపోతాయి. కానీ కరోనా చికిత్సలో తీసుకునే కొన్ని మందులు మూత్రపిండాలపై దుష్ప్రభావం చూపినప్పుడు కూడా... ఆ దుష్ప్రభావాలు జీర్ణవ్యవస్థ తాలూకు లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కానీ మూత్రపిండాలు ప్రభావితమై ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని డాక్టర్లు చాలా నిశితంగా గమనించి, మూత్రపిండాలు మరింత దెబ్బతినకుండా రక్షించడం, అవి మరిన్ని దుష్ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాలేయంపైన కూడా... ఇవే మందులు కాలేయంపై కూడా తమ దుష్ప్రభావాలు చూపవచ్చు. ఉదాహరణకు కాలేయం వాచడం, దాని నుంచి కొన్ని ఎంజైములు అధికంగా స్రవించడం జరగవచ్చు. ప్రధానంగా దేహంలో స్రవించాల్సిన ఇన్సులిన్ మోతాదులు తగ్గినప్పుడు కూడా ఇలా జరగవచ్చు. దీనివల్ల కూడా జీర్ణవ్యవస్థలో కనిపించే సమస్యలు... అంటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఆకలి మందగించడం వంటివి కనిపించవచ్చు. . జీర్ణవ్యవస్థపై ఎందుకీ ప్రభావం? కరోనా వైరస్ అన్నది తన ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఏంజైమ్–2 (ఏసీఈ–2) రిసెప్టార్ల సహాయంతో దేహంలోకి ప్రవేశిస్తుందన్న అంశం తెలిసిందే. గుండెతో పాటు ఈ రిసెప్టార్లు మన జీర్ణవ్యవస్థలోని కడుపు (గట్) భాగంలో ఎఉ్కవగా ఉంటాయి. దాంతో కరోనా వైరస్‌కు ఉన్న కొమ్ముల్లాంటి భాగాలైన స్పైక్‌లతో ‘గట్’ను బలంగా అంటిపెట్టుకోడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకే వైరస్‌కు ఊపిరితిత్తులు, గుండెలాగే... జీర్ణవ్యవస్థను సైతం తేలిగ్గానే ప్రభావితం చేసేందుకు సాధ్యమైంది. ఫలితంగా జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కనిపించే నీళ్లవిరేచనాలు, యాసిడ్ పైకి రావడం (రిఫ్లక్స్), వికారం వంటివి కలగడం మొదలైంది. నిర్లక్ష్యం చేయడం సరికాదు... ఎందుకంటే? సాధారణంగా గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు కొద్దిపాటివి కనిపించినా బాధితులు మంచి జాగ్రత్తలు పాటిస్తారు. కానీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండరు. ఇది ఆ తర్వాతి కాలంలో చాలా చేటు చేయవచ్చు. ఎందుకంటే... మన దేహానికంతటికీ పోషణ ఇచ్చేది జీర్ణవ్యవస్థ. మనకు ఆహారంతో అందాల్సిన పోషకాలూ, అవసరమైన శక్తి–సామర్థ్యాలూ, వ్యాధినిరోధకత... ఇవన్నీ మనం తీసుకునే ఆహారం, అది జీర్ణమయ్యే తీరు, వంటికి పట్టే విధానంతోనే సాధ్యమవుతాయి. ఆ కార్యకలాపాలు సక్రమంగా జరగకపోతే మొత్తం దేహంతో పాటు... దాని అన్ని వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. దేహానికి అవసరమైన శక్తి అన్ని కీలక అవయవాలకు అందకపోవడంతో పాటు అనేక అనర్థాలు కలుగుతాయి. అందుకే జీర్ణవ్యవస్థకు సంబం«ధించి చిన్న సమస్యలుగా పరిగణించేవాటిని కూడా నిర్లక్ష్యం చేయడం తగదు. ఎదుర్కోవడం, చక్కదిద్దుకోవడం ఇలా... కరోనా అనంతరం వ్యక్తిలో కనిపించే ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు జీర్ణవ్యవస్థ సమస్యలపైనా అంతే శ్రద్ధ చూపాలి. ఇంకా చెప్పాలంటే, దేహానికంతా పోషకాలనూ, శక్తినిచ్చే కీలకమైన వ్యవస్థ కావడం వల్ల ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే చూపాలి. దీనికి అవసరమైన జాగ్రత్తలు కూడా చాలా సులువే. ఉదాహరణకు కొద్దిపాటి సమస్యగా పరిణమించే నీళ్లవిరేచనాల వంటివి కనిపించినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం, దేహం తన ద్రవాలను కోల్పోతున్నందున నీళ్లు ఎక్కువగా తాగుతూ, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. ఇక వాటితో పాటు విటమిన్–సి, విటమిన్–డి, విటమిన్–బి12, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకుంటూ ఉండాలి. ఇది పూర్తి దేహంతో పాటు జీర్ణవ్యవస్థకూ మేలు చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడే పీచుపదార్థాలు అందేలా కాయధాన్యాలు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. మన జీర్ణవ్యవస్థ పొడవునా... మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఇది జీర్ణప్రక్రియకూ ఉపయోగపడుతుందని తెలిసిందే. మనకు మేలు చేసే ఈ బ్యాక్టీరియానే ‘ప్రోబయోటిక్స్’ అంటారు. సాధారణంగా కాస్తంత పులియడానికి అవకాశం ఉన్న ఇడ్లీ, దోసెపిండి వంటి వాటితో పాటు మజ్జిగ, పెరుగుతో ఈ ప్రోబయాటిక్స్ మనకు స్వాభావికంగానే లభ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కరోనా అనంతరం కోలుకునే సమయంలో మన ఆహారంలో ఈ ప్రోబయాటిక్స్‌ను ఇచ్చే పదార్థాలు, వంటకాలు తీసుకుంటూ ఉండాలి. ప్రోబయాటిక్స్ అనేవి జీర్ణవ్యవస్థలో ఉపయోగపడటమే కాకుండా.. మొత్తం జీర్ణవ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉండటానికీ, వ్యవస్థ పాడైనప్పుడు దాన్ని వేగంగా నయం చేయడానికీ ఉపకరిస్తాయి. మన ఆహారంలో ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే జీర్ణం కావడానికి కాస్తంత ఎక్కువ సమయం పట్టే (హెవీ) ఆహారాలను వీలైనంతగా తగ్గించాలి. కరోనా నుంచి కోలుకునే సమయంలోనూ, అలాగే కరోనా అనంతరం జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలు కనిపిస్తున్న సమయంలోనూ వీలైనంతవరకు వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి. అసలే బాగాలేని జీర్ణవ్యవస్థకు అవి మరింత శ్రమ కలిగించే అవకాశం ఉంది. అందుకే కరోనా నుంచి కోలుకున్నవారూ, కరోనా తర్వాత కూడా సుదీర్ఘకాలంపాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపించేవారు మంచి పోషకాలు ఉన్న తేలికపాటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సమస్యలు మరీ తీవ్రంగా ఉంటే అవసరమైన రక్త, ఇతరత్రా పరీక్షలు చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
Senna Tea: సెన్నా టీ సిప్ చేశారా?
చాయ్ అంటే చటుక్కున తాగని వాళ్లుంటారా? చాయ్ మహత్యం ఏంటోకానీ, ఒక్కసారి కూడా టీ తాగనివాళ్లుకానీ, తాగిన తర్వాత అలవాటు కాని వాళ్లు కానీ అరుదు. సాదా చాయ్ అందరూ తాగుతారు, కానీ ఇటీవల కాలంలో పలురకాల ఫ్లేవర్ల టీలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోవలోకి చెందినదే సెన్నా టీ! ఈ టీతో పలు ఆరోగ్య సంబంధ ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్య మలబద్ధకం. అలాగే యువత, పిల్లల్లోనూ ఈ సమస్య అప్పుడప్పుడూ తొంగిచూస్తూ ఉంటుంది. దీని నివారణకు రకరకాల ఔషధాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆయుర్వేద పద్ధతిలో మలబద్ధకాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేదే సెన్నా టీ. సెన్నా అంటే తంగేడు చెట్టు. దీని ఆకులతో తయారుచేసేదే సెన్నా టీ. అలాగే తంగేడు పూలు, కాయలతోనూ దీనిని తయారుచేయొచ్చు. ఈ తంగేడు ఆకులు, పూలు, కాయలను మలబద్ధకం నివారణకు ఉపయోగించే మాత్రల్లో ఎక్కువగా వాడతారు. అలాగే బరువు తగ్గడానికి, శరీరంలోని విష కణాలను తొలగించడానికి సెన్నా ఉండే మాత్రలు పనిచేస్తాయని మార్కెట్లో ప్రచారం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. మలబద్ధకాన్ని ఎలా తగ్గిస్తుందంటే? తంగేడాకుల్లో ఎక్కువగా గ్లైకోసైడ్స్, సెన్నోసైడ్స్ ఉంటాయి. ఈ సెన్నోసైడ్స్ మనం తీసుకున్న టీ ద్వారా కడుపులోకి చేరి అక్కడ మలబద్ధకానికి కారణమవుతున్న బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా పేగులోపల కదలికలు ఏర్పడి సులభంగా విరేచనం అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ టీ తాగిన ఆరు నుంచి 12 గంటల్లోపు అది పనిచేస్తుంది. మార్కెట్లో లభించే మలబద్ధకం మాత్రల్లో అతి ముఖ్యమైన మూలకం సెన్నానే. అలాగే పురీషనాళంలో రక్తస్రావం, నొప్పి, దురదలు వంటి వాటికీ సెన్నా టీ విరుగుడు పనిచేస్తుందనే వాదన ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. బరువు తగ్గిస్తుందా? బరువు తగ్గేందుకు సెన్నా టీ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు. సెన్నా టీ, లేదా సెన్నా మూలకం ఉన్న మాత్రలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగై తద్వారా సులభంగా బరువు తగ్గొచ్చనే ప్రచారం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా సెన్నా టీ, సెన్నా మూలకాలున్న మాత్రలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, ఇలా బరువు తగ్గాలని చేసే ప్రయత్నం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాగా, బరువు తగ్గడం కోసం ఇలా ’సెన్నా’ను ఉపయోగిస్తున్న 10వేల మంది మహిళలపై జరిపిన ఓ సర్వే సైతం ఇదే విషయం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే వారిలో ఆకలి పెరిగి, ఇంకా ఎక్కువ తింటున్నట్లు గుర్తించింది. ఎవరికి సురక్షితం? సెన్నా టీ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తాగొచ్చు. అయితే, వీరిలోనూ కొందరికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. అందులో ముఖ్యమైనవి కడుపులో తిమ్మిరి, వికారం, అతిసారం. అయితే, ఈ లక్షణాలు ఎక్కువ సేపు ఉండవు. మరికొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్లు సెన్నాకు దూరంగా ఉండడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యమైనది సెన్నా టీని మలబద్ధకానికి విరుగుడుగా తీసుకునే తాత్కాలిక ఔషధంగా గుర్తుపెట్టుకోవడమే. ఈ టీని వరుసగా వారం కంటే ఎక్కువ రోజులు తాగకూడదు. ఎక్కువ రోజులు తీసుకుంటే కాలేయం దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్రత్యేకించి హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు సెన్నా టీనే కాదు, సెన్నా మూలకం ఉన్న ఏ ఉత్పత్తులనైనా వాడాలంటే వైద్యుని సలహాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే గర్భిణులు, బాలింతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్నా మూలకం ఉన్న ఉత్పత్తులు, టీని తీసుకోకూడదు. (చదవండి: అమెరికా అంటే.. ఐదు కావాల్సిందే!) -
నడుస్తూ ధ్యానం చేయవచ్చని తెలుసా?!
ధ్యానం.. మనలోని అనవసర ఆందోళనలు, భయాలు మాయం చేసిమనసుకు ప్రశాంతత చేకూర్చే చక్కని మార్గం. అందుకే భారతీయసంప్రదాయంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుషులు, మునులుసదా అనుసరించేదిదే. అలాగే బుద్ధిజంలోనూ దీని పాత్ర అధికం. చక్కని వాతావరణంలో పద్మాసనం వేసుకొని కూర్చొని కాసేపు కళ్లు మూసుకొని అన్నింటినీ మరచిపోయి శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా ఎక్కువ మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్ వాక్) ఉందనే విషయం అందరికీ తెలీదు. వాకింగ్ మెడిటేషన్‌ను బౌద్ధంలో ‘‘కిన్హిన్ ’’అంటారు. దీనికే ‘సూత్ర వాక్’ అని మరోపేరుంది. జెన్ మెడిటేషన్, ఛన్ బుద్ధిజం, వియత్నమీస్ థైన్ తదితర విభాగాల్లో మెడిటేషన్ వాక్ ఒక భాగంగా భావిస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసే బదులుగా మధ్య మధ్యలో ఇలా వాకింగ్ మెడిటేషన్నూ చేస్తారు. కిన్హిన్ అనేది జాజెన్కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ. ఎలా చేస్తారు? మెడిటేషన్ వాక్‌లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్‌వైజ్ డైరక్షన్లో నెమ్మదైన అడుగులు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతారు. ఒక్కో అడుగుకు ముందు ఒక బ్రీత్(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్ధం. అంటే మనం ప్రశాంతత గుండా ప్రయాణించడమని అర్ధం చేసుకోవచ్చు. ఉపయోగాలు: 1. రక్తప్రసరణ మెరుగుపర్చడం తరచూ వాకింగ్ మెడిటేషన్ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవడంలో తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది. అంతేకాదు శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. 2. జీర్ణశక్తిని పెంచుతుంది ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. అంతేకాదు మలబద్ధకం నివారిస్తుంది. 3. ఒత్తిడి తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని చేసే ధ్యానం కన్నా నడుస్తూ చేసే ధ్యానంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. 2017లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మధ్య వయస్కుల్లో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు వాకింగ్ మెడిటేషన్ ద్వారా సమర్థంగా తగ్గినట్లు తేలింది. అయితే, కనీసం 10 నిమిషాల సమయం మెడిటేషన్ వాక్ చేయాల్సి ఉంటుంది. 4. చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిల్ని బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియ సమర్థంగా నియంత్రించినట్లు 2016లో వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వారానికి మూడుసార్లు రోజూ కనీసం అరగంట చొప్పున సాధారణ వాకింగ్ చేసేవాళ్లతో పోలిస్తే బౌద్ధ మెడిటేషన్ వాక్ చేసిన వాళ్లలో మధుమేహం నియంత్రణ, చక్కటి రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించారు. 5. డిప్రెషన్ తొలగిస్తుంది 2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్తప్రసరణ, ఫిట్నెస్ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యుక్తవయసువారు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఈ బౌద్ధ మెడిటేషన్ వాక్ ప్రక్రియను వారానికి కనీసం మూడుసార్లు చొప్పున 12 వారాల పాటు వారు అనుసరించారు. 6. ఆరోగ్యాన్ని పెంచుతుంది ప్రకృతి(ఏదైనా పార్క్/తోట/ వనం)లో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సమతుల స్థితి చేకూరుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్ వాక్ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితోపాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత తదితర వాటినీ మెడిటేషన్ వాక్ మెరుగుపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
ఆహారం... ఒంటబట్టించుకుందామా..!
ఎవరైనా ఉండాల్సిన దానికంటే మరీ పీలగా కనిపిస్తూ ఉంటే అడిగే ప్రశ్న ఒకటుంది. ‘‘ఏంటి బాగా తినడం లేదా’’ అని. ఒకవేళ బాగానే తింటున్నానే అనే జవాబు వస్తే... ‘‘మరి తిన్నది ఒంటబట్టడం లేదా... ఒకసారి చూపించుకోకపోయావా?’’ అని. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమై... అది సరిగా ఒంటికి పడుతుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ తిన్నది అరగడం లేదా అన్న ప్రశ్న కొన్నిసార్లు నిందాపూర్వకంగా వినిపించవచ్చు. కానీ ఒంటికి పట్టడం లేదా అన్న ప్రశ్న మాత్రం సానుభూతితో వేసేదే. తిన్న ఆహారం ఒంటికి పట్టకపోతే తొలిదశల్లో ఒక చిన్న సమస్యే. కానీ అశ్రద్ధ చేస్తే అదో పెద్ద సమస్య అవుతుంది. దాంతో ఎన్నో ఇబ్బందులూ, ఇక్కట్లూ వస్తాయి. తిన్నది ఎలా ఒంటికి పడుతోంది మొదలుకొని ఒంటబట్టకపోతే వచ్చే సమస్యలూ వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కోసం ఈ కథనం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యాక... పేగుల నుంచి రక్తంలోకి వెళ్లి... అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, లవణాలు అన్ని కణాలకూ చేరతాయి. ఒకవేళ అలా చేరకపోవడాన్ని ఆ సమస్యను ‘మాల్అబ్జార్ప్షన్’ అంటారు. జీర్ణక్రియ విధానం... మనం తీసుకున్న ఆహారం చక్కగా అరిగే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. కానీ అలా జీర్ణం కాకపోతే రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. ఆహారాన్ని నోట్లో పెట్టుకుని నమలడం మొదలుపెట్టినప్పుడే జీర్ణక్రియ మొదలవుతుంది. ఎందుకంటే... మన పళ్లతో నమలటం వల్ల ఆహారాన్ని మరింత చిన్న చిన్న భాగాలుగా మనందరమూ చేస్తుంటాం. ఈ ప్రక్రియలో జీర్ణక్రియకు నోట్లో ఊరే లాలాజలం తోడ్పడుతుంది. ఇందులోని (సెలైవాలోని) కొన్ని ఎంజైములు ఆహారాన్ని మరింత చిన్నచిన్న రేణువులుగా చేస్తాయి. పొట్ట లేదా ఉదరం ఒక మిక్సర్లాగ పనిచేసి, అక్కడ ఊరే హైడ్రోక్లోరిక్ ఆమ్లం సహాయంతో ఆహారమంతా బాగా కలిసిపోయేలా చేస్తుంది. నోటిలోనూ, కడుపులోనూ జరిగే జీర్ణక్రియ కొంత యాంత్రికంగా జరుగుతుంది. అంటే పళ్ల ద్వారా నమిలే ప్రక్రియ యాంత్రికప్రక్రియ అనుకోవచ్చు. ఆ తర్వాత మరికొంత రసాయనికంగా కూడా జరుగుతుంది. అంటే లాలాజలంలోని ఎంజైముల ప్రభావం వల్ల జరిగే క్రియలన్నమాట. అలా పాక్షికంగా జీర్ణమైన ఆహారం... మన అన్నవాహికలో చేరే సమయానికి ఇంకా ‘అబ్జార్ప్షన్’ ప్రక్రియ మొదలుకాదు. అక్కడ కొద్దిపాటి ఘనరూపంలో ఉన్న ఈ పదార్థం చిన్నపేగులలోకి ప్రవేశించగానే అక్కడ ఉండే ఎంజైములు, పాంక్రియాటిక్ ఎంజైములు, పైత్యరసం (బైల్జ్యూసెస్)... వీటన్నిటి కారణంగా ఆహారం మరింత చిన్నచిన్న రేణువులుగా మారి, రక్తంలోకి విలీన మయ్యే స్థితికి చేరుకుంటుంది. ఈ ప్రక్రియకు చక్కెర పదార్థాలు, అమైనో యాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు కూడా సహాయపడతాయి. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా చిన్న పేగుల మొదటి భాగం నుంచి ప్రారంభమై చిన్నపేగు చివరిభాగం వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో బి 12 విటమిన్ తప్ప మిగతావన్నీ ‘ప్రాగ్జిమల్ చిన్నపేగు’ భాగంలో ఇంకుతాయి. చిన్నపేగు చివరి భాగమైన ‘ఇలియం’లో బైల్ సాల్ట్స్ ఇంకిపోతాయి. చిన్నపేగులో కోటానుకోట్ల సంఖ్యలో ఉండే ‘మైక్రోవిల్లీ’ అనే మన చితివేళ్లలా కనిపించే అత్యంత సన్నటి (మైక్రోస్కోపిక్) ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటిని చాపలా పరిస్తే చిన్నపేగు వైశాల్యం దాదాపు 500 చదరపు అడుగుల పైమాటే! కానీ అవన్నీ కేవలం అర చదరపు మీటరు ప్రాంతంలో కుదించుకుపోయి ఉంటాయి. చిన్నపేగు లోని మొదటి భాగాన్ని డియోడనమ్ అంటారు. చిన్నపేగులోని ఎక్కువ భాగాన్ని ఇది ఆక్రమించి ఉంటుంది. ఎంజైములు ఇక్కడే స్రవిస్తాయి. ఇక్కడే సుక్రోజ్, మాల్టేజ్, లాక్టేజ్ విడుదల అయ్యి ఆహారాన్ని చక్కెర రూపంలోకి మారుస్తాయి. చిన్నపేగుల్లో స్రవించే పెప్టిడేజ్ అనే ఎంజైమ్ ప్రోటిన్లు అమైనో యాసిడ్స్‌గా మారుస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వు పదార్థాలను గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్లుగా మారుస్తుంది. లాక్జోజ్ అనేది పాలల్లో ఉండే చక్కెరపదార్థం. లాక్టేజ్ అనే ఎంజైమే లేకపోతే మన జీర్ణప్రక్రియలో పాలు లేదా పాలపదార్థాలు అరగనే అరగవు. అలా చేసుకోలేకపోతే కడుపులో గ్యాస్ నిండినట్లయి కడుపు ఉబ్బరం వంటి భావన కలుగుతుంది. కడుపు నిండుగా ఉన్నట్లుగా, ఆనారోగ్యంగాను ఉన్న ఫీలింగ్ ఉంటుంది. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అనే సమస్య ఉన్నప్పుడు పాలు జీర్ణం కాకపోవడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఆహారం డియోడనమ్లోకి చేరగానే... కొన్ని హార్మోన్ల ప్రభావంతో బైల్ ఉత్తేజితం కావడం, పాంక్రియాటిక్ స్రావాలు స్రవించడం జరుగుతుంది. కాలేయం, పిత్తాశయాల నుంచి ‘బైల్’ స్రావం డియోడనమ్కు చేరి... అక్కడున్న కొవ్వుముద్దల పరిమాణాన్ని చిన్న చిన్న గోళాల సైజుకు మారుస్తుంది. చిన్నపేగులు ఆహారాన్ని పూర్తిగా ఇంకిపోయేలా చేసుకోవాలంటే... అది అత్యంత చిన్న రేణువులుగా ఉండితీరాలి. అలా జరగనప్పుడు దాన్ని అజీర్ణం / అజీర్తిగా పరిగణించవచ్చు. జీర్ణప్రక్రియ అనేది క్రమంగా ఒకదానితో మరొకటి ముడిపడిన అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. అందుకే జీర్ణ వ్యవస్థ ఓ అతి పెద్ద వ్యవస్థగా చెప్పవచ్చు. ఆ వ్యవస్థలోగాని, జీర్ణప్రక్రియల వరసల్లోగాని ఇక్కడైనా తేడా వస్తే అది అజీర్ణానికి దారి తీసి, ఒంటికి పట్టని పరిస్థితులు ఏర్పడతాయి. అలా ఆబ్బార్ప్షన్ సమస్య వస్తుంది. పరీక్షలు కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్ష, ఎండోస్కోపీ, రేడియలాజికల్ పరీక్షలతో ఆహారం ఇంకకుండా పోవడానికి గల కారణాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్సలు చేయాల్సి ఉంటుంది. చికిత్స చికిత్సలో రకరకాల పోషకాలు (న్యూట్రియంట్స్, విటమిన్లు), ఖనిజ లవణాలు (మినరల్స్, ఎలక్ట్రోలైట్లు), ద్రవాలు (ఫ్లూయిడ్లు) చాలా అవసరం. అహారాన్ని ఇంకేలా చేసుకునే అబ్జార్‌ప్టివ్ సర్ఫేస్ (చిన్నపేగుల్లో నుంచి రక్తంలోకి ఆహారాన్ని శోషణ చేసే ఉపరితలం) దెబ్బ తిన్నా, అక్కడ సర్జరీ అవసరమయినా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరమవుతుంది. అవసరాన్ని బట్టి పాంక్రియాటిక్ ఎంజైముల వంటి వాటిని నోటిద్వారా అందచేయాలి. కొన్ని సందర్భాలలో ఆహారనియమాలను ఖచ్చితంగా పాటింపజేయాల్సి రావచ్చు. సీలియాక్ వ్యాధి లేదా లాక్టోజ్ ఇన్టాలరెన్స్ వస్తే కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎప్పుటికీ తీసుకోకూడదు. బ్యాక్టీరియా విచ్చలవిడిగా పెరిగి, ఇన్ఫెక్షన్ల వంటివి సర్వసాధారణంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తగ్గుతాయి. వీటి వాడకం వల్ల క్రిములు పోతాయి. క్రోన్స్ లింఫోమా, టీబీ వంటి వాటికి తగు చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రోబయోటిక్స్ వాడటం ద్వారా పేగులలో జీర్ణక్రియకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా వృద్ధిచెంది పరిస్థితి బాగా చక్కబడుతుంది. మాల్ ఆబ్బార్ప్షన్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవి... ∙నీళ్ల విరేచనాలు (డయేరియా) ∙కడుపు ఉబ్బరంగా ఉండటం ∙కడుపు పట్టేసినట్టుగా ఉండటం ∙బరువు తగ్గడం ∙ఆయా విటమిన్లు, ఖనిజ లవణాల ఏయే అనారోగ్యాలు కనిపించాలో అవి కనిపించడం (ఉదాహరణకు ఐరన్ అందకపోవడం వల్ల రక్తహీనత (అనీమియా) ఏర్పడటం ∙చర్మం పాలిపోయినట్లుగా కనిపించడం ∙జింక్ వంటి పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు ఊడిపోవడం ∙విటమిన్–ఏ అందక రేచీకటి రావడం ∙విటమిన్ కె లోపం కారణంగా రక్తస్రావం ఆగకపోవడం ∙క్యాల్షియమ్ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు ∙చిన్నపేగుల్లో ఏవైనా సమస్యలుంటే మాల్అబ్జార్ప్షన్ కు ప్రధానంగా అవి కారణం కావచ్చు. చిన్న పేగుల్లో సమస్య వల్ల... అంటే కొందరిలో జియార్డియా అనే ఏకకణ జీవులు లేదా మరికొన్ని రకాల క్రిములు పేగుల్లోకి చేరడం, హెచ్ఐవీ, టీబీ, విపుల్స్ డిసీజ్ వల్ల పేగుల్లోంచి ఆహారం సరిగా రక్తంలో కలవకపోవచ్చు. దాంతోపాటు ఒక్కోసారి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా విపరీతంగా పెరగడం వల్ల కూడా మాల్అబ్జార్ప్షన్ సమస్య రావచ్చు. ∙కొందరిలో తీవ్రమైన కాలేయ సమస్య ఉన్నప్పుడు, పేగుల్లోకి బైల్, పాంక్రియాటిక్ జ్యూస్ సరిగా ప్రవహించకపోవడం వల్ల కూడా ఆహారం సరిగా ఒంటపట్టకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మట్టి రంగులో విరేచనం అవుతుంది. ఇది ఒకింత జిగటగా ఉంటుంది. ∙విటమిన్– కె తగ్గితే అప్పుడప్పుడు విరేచనంలో రక్తం కూడా కనపడవచ్చు. ∙కొంతమందికి గోధుమ సరిపడదు. ఇలా గోధుమ వల్ల అలర్జీ రావడాన్ని గ్లుటెన్ ఇన్టాలరెన్స్ అంటారు. (దీనినే సీలియాక్ వ్యాధి అంటారు). మరికొందరికి ఆవుపాలు, సోయాపాలు పడకపోవచ్చు. అలాగే... ఫ్రక్టోజ్ ఇన్టాలరెన్స్, క్రోన్స్ వ్యాధి, రేడియేషన్ ఎంటెరైటిస్, లాక్టోజ్, సుక్రోజ్ లోపించడం. పేగులలో ఉండే ఫిస్టులా, చిన్నపేగులు అతిగా స్పందిస్తూ ఉండటం, డైవర్టిక్యులోసిస్, లింఫొమా, ఐపిఎస్ఐడి వంటి పేగు క్యాన్సర్లు, ఇసినోఫిలిక్ గ్యాస్ట్రోఎంటిరైటిస్, సిస్టమిక్ ఎమిలోయిడోసిస్ వంటివాటితో పాటు, డయాబెటిస్, హైపర్‌థైరాయిడిజమ్ వంటి జబ్బులు కూడా మాల్అబ్జార్ప్షన్కి కారణం కావచ్చు. ∙కొన్ని రకాల మందులు సరిపడకపోవడం వల్ల కూడా మాల్అబ్జార్ప్షన్ సమస్య వస్తుంది. -
యుద్ధానికి సిద్ధమెలా?
కరోనా వైరస్ పేరు చెప్పగానే మనమంతా వణికి పోతున్నాం గానీ.. ఇవి మనకు కొత్తేమీ కాదు. యుగాలుగా మనపై దాడి చేస్తూనే ఉన్నాయి.. ప్రతి దాడితో మనిషి మరింత బలపడ్డాడు. కొత్త వాటిని అడ్డుకునే శక్తి సంపాదించుకున్నాడు అంతా మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఫలితం! ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏం చేస్తే బలహీన పడుతుంది? మరింత బలం పుంజుకోవడం ఎలా? యుద్ధంలో మాదిరిగానే ఈ రోగ నిరోధక వ్యవస్థలోనూ.. చతురంగ బలాలు ఉంటాయి. సూక్ష్మజీవుల ఎత్తులకు పైఎత్తులేయడం.. అస్త్రశస్త్రాలతో వాటిని చిత్తు చేయడం.. నిత్యం జరిగేవే. వేగులు, సైనికులు, సమాచారం సేకరించే వారు.. బోలెడన్ని ఆయుధ కర్మాగారా లు ఈ వ్యవస్థలో భాగాలే. కణాలు, కణజాలాలు, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్), అవయవాలతో కూడి ఉంటుంది ఈ వ్యవస్థ. సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని నాశనం చేయడం, లోపలికి చొరబడ్డ శత్రువు వివరాలను నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో మళ్లీ అదే శత్రువు వస్తే అడ్డుకోవడం, క్రిములను చంపేయడం, సమాచారం ఒక చోటి నుంచి ఇంకోచోటికి చేరవేయడం వంటి సుమారు 12 పనులను ఈ వ్యవస్థ చేస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు సుమారు 21 రకాల కణాలు అందుబాటులో ఉంటాయి. ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు శరీరంపై ఏదైనా గాటు పడితే.. ఆ వెంటనే దాని గుండా బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించి బాగా పెరుగుతాయి. వీటిని అడ్డుకునేందుకు సరిహద్దులో గస్తీ సైనికుల మాదిరిగా మాక్రోఫేగస్ కణాలు రంగంలోకి దిగుతాయి. కొంచెం పెద్ద సైజు (21 మైక్రోమీటర్లు) ఉండే ఈ మాక్రోఫేగస్ ఒక్కొక్కటి వంద వరకు బ్యాక్టీరియాలను మింగేసి ఎంజైమ్‌ల సాయంతో నాశనం చేస్తాయి. మంట/వాపు కలిగించడం ద్వారా నీళ్ల లాంటి ద్రవం విడుదల చేయాల్సిందిగా రక్త కణాలకు సమాచారం పంపుతాయి. బ్యాక్టీరియా తగ్గకపోతే.. కొంతకాలం తర్వాత మాక్రోఫేగస్ విడుదల చేసే మెసెంజర్ ప్రొటీన్లతో రక్తంలో ప్రవహిస్తున్న న్యూట్రోఫిల్స్‌ను అదనపు బలగాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు తమను తాము నాశనం చేసుకునేందుకు కూడా ఇవి వెనుకాడవు. ఇంత జరిగినా బ్యాక్టీరియా ప్రభావం తగ్గలేదనుకోండి.. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు మెదడు లాంటి డెండ్రటిక్ కణాలు రంగ ప్రవేశం చేస్తాయి. బ్యాక్టీరియా తాలూకు సమాచారం మొత్తం సేకరించి.. దగ్గరలోని శోషరస గ్రంథులను చేరుకుంటాయి. ఈ గ్రంథుల్లోని కోటాను కోట్ల హెల్పర్ టి–సెల్స్, కిల్లర్ టి–సెల్స్‌లో తగిన వాటిని గుర్తించి వాటిని చైతన్యపరుస్తాయి. ఈ టి, కిల్లర్ కణాలు గణనీయంగా వృద్ధి చెంది బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని శోషరస గ్రంథిలోనే ఉంటాయి. భవిష్యత్తులో ఇదే రకమైన బ్యాక్టీరియా దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని హెల్పర్ టి–కణాలు గ్రంథుల్లోని శక్తిమంతమైన బి–కణాలను చైతన్యపరచడంతో అవి యాంటీబాడీలను తయారు చేసి బ్యాక్టీరియాపైకి వదులుతాయి. ఇవి బ్యాక్టీరియాకు అతుక్కుపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయన్న మాట. దాడి చేసే సూక్ష్మజీవిని బట్టి రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వేర్వేరు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. బలహీనపడేది ఇలా.. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు వయసుతో పాటు ఒత్తిడి, దురలవాట్లు వంటి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, కొన్ని రకాల మందులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ వంటి రోగాలు కూడా కారణమే. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే కార్టిసోల్ వంటి మంచి చేసే హార్మోన్లు కూడా శరీరానికి హానికారకంగా మారిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు ఈ హార్మోన్‌కు అలవాటు పడిపోయి తగువిధంగా స్పందించవు. కొన్ని రకాల అలవాట్లు కూడా శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అయితే కొంతమందికి పుట్టుకతో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మరికొందరిలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా కీళ్లనొప్పులు, టైప్–1 మధుమేహం, మల్టిపుల్ స్లీ్కరోసిస్ వంటి రోగాలు వస్తూంటాయి. శక్తిమంతుడిగా మారాలంటే.. రోగ నిరోధక వ్యవస్థన బలపరుచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇందుకు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. తగిన పోషకాలున్న ఆహారం సగం సమస్యలు తీరుస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్లు.. రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని కణాలకు, ఇతర కణాలకు కూడా ప్రొటీన్లలో ఉండే ఎల్–ఆర్జినిన్ అవసరముంటుంది. ఈ ఎల్–ఆర్జినిన్ శరీరంలో హెల్పర్ టి–సెల్స్ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తగినంత మోతాదులో తీసుకోవడం (భారతీయులు రోజుకు కనీసం 400 గ్రాములు తీసుకోవాలి) వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది. రోగనిరోధక కణాల్లో సుమారు 70 శాతం మన కడుపు/పేగుల్లో ఉంటాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో సుమారు వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అత్యధికం శరీరానికి మేలు చేసేవే కాబట్టి.. వీటిలో సమతుల్యం ఉండేలా చూడాలి. పెరుగు తదితర ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలో సమతుల్యత చెడకుండా చూసుకోవచ్చు. విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు తగినన్ని శరీరానికి అందేలా చేయడం ముఖ్యమే. సూర్యరశ్మితో శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్–డి మరీ ముఖ్యం. వ్యాయామం కూడా శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మంచి ఆహారం తీసుకోవాలి.. తగినంత వ్యాయామం చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఇవన్నీ చేయగలిగితే కరోనాను దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు! – సాక్షి, హైదరాబాద్ -
స్పైరస్ ఎంటరోస్కోపీ అంటే ఏమిటి?
మావారి వయసు 42 ఏళ్లు. కొన్నేళ్లుగా తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నారు. తీవ్రమైన నీరసం, మలంతో పాటు రక్తం కారడం జరుగుతుండటంతో మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. వారు సిటీలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవమన్నారు. హైదరాబాద్‌లో చూపిస్తే అక్కడ కొన్ని పరీక్షలు చేసి, చిన్న పేగుల్లో సమస్య ఉందని చెప్పారు. కాప్సూ్యల్ ఎండోస్కోపీ కూడా చేశారు కానీ ఫలితం లేదు. చిన్నపేగులో క్యాన్సర్ లేదా పాలిప్ ఉండవచ్చని అంటున్నారు మావారికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఎంటిరోస్కోపీ అనే పరీక్ష వీలుకాదనీ, స్పైరస్ ఎంటిరోస్కోపీ అవసరమనీ, దాంతో అటు పరీక్ష, ఇటు చికిత్స... రెండూ జరుగుతాయని చెప్పారు. మాకెంతో ఆందోళనగా ఉంది. ఆ పరీక్ష/చికిత్స గురించి వివరాలు చెప్పండి. ‘స్పైరస్ ఎంటిరోస్కోపీ’ అనేది కూడా ఒక రకమైన ’ఎండోస్కోపీ’ పరీక్ష లాంటిదే. ఇది చిన్నపేగును పరీక్షించేందుకు ఉపకరించే ఓ ప్రభావవంతమైన పరీక్షాసాధనం. మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అది సరిగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మీవారిలాగే చాలామంది కడుపునొప్పితో ఏళ్లతరబడి బాధపడుతూ కూడా... తమకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల లేదా మరో కారణం వల్ల ఇలా జరుగుతోందం టూ చిట్కావైద్యాలు చేసుకుంటూ చాలా అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఏళ్ల తరబడి తరచూ కడుపునొప్పి వస్తుంటే తప్పక డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని, తగిన సలహా / చికిత్స తీసుకోవాలి. మీవారికి మలంతో పాటు రక్తం రావడమనే లక్షణంతో పాటు, నీరసంగా ఉండటం అనేది చిన్నపేగుల్లోని సమస్యను సూచిస్తోంది. సాధారణంగా కడుపులో సమస్య ఉంటే ‘ఎండోస్కోపీ’ అనే పరీక్ష ద్వారా నోరు, అన్నవాహిక నుంచి జీర్ణాశయం వరకు ఉన్న సమస్యలను తెలుసుకోవచ్చు. మలద్వారం గుండా చేసే ‘కొలనోస్కోపీ’ పరీక్ష ద్వారా పెద్దపేగుకు ఏవైనా సమస్యలుంటే తెలుసుకోడానికి వీలవుతుంది. అయితే చిన్నపేగుల్లో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించాలంటే ప్రత్యేకమైన ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అందులో క్యాప్సూల్ ఎండోస్కోపీ ఒకటి. అయితే మీవారి విషయంలో ఆ పరీక్ష చేసినా ఫలితం రాలేదని రాశారు. సాధారణంగా క్యాప్సూల్ ఎండోస్కోపీతో మొత్తం జీర్ణవ్యవస్థలో ఉండే అన్ని అవయవాల సమస్యలూ తెలుసుకోవచ్చు. ఒక్కోసారి క్యాప్సూల్ వెళ్లే మార్గంలో ఏ భాగమైనా మూసుకుపోతే అక్కడ క్యాప్సూల్ ఇరుక్కుపోతుంది. మీవారి విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఇది కాకుండా చిన్నపేగులో మాత్రమే ఉండే సమస్యలను తెలుసుకోడానికి చేసే మరో పరీక్షే ‘ఎంటిరోస్కోపీ’. బెలూన్ సహాయంతో చేసే ఈ పరీక్ష కొంతమందికి సూట్ కాదు. టైమ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మీవారిలాగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష వీలుకాదు. అందుకే మీవారికి పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీ అనే పరీక్షను సూచించి ఉంటారు. ఇది చాల సరళమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన వైద్యపరీక్ష. చాలా తక్కువ సమయంలోనే దీన్ని చేయవచ్చు. ఈ ఎండోస్కోపీలో బెలూన్‌కు బదులు ఓవర్ట్యూబ్ను ఉపయోగిస్తారు. ఈ ఓవర్ట్యూబ్ సహాయంతో చిన్నపేగులోని మొత్తం దృశ్యాలను క్యాప్చర్ చేసి అక్కడి సమస్యలను స్పష్టంగా రికార్డు చేయవచ్చు. సాధారణ ఎంటిరోస్కోపీకి మూడు గంటల సమయం పడితే దీన్ని కేవలం గంటలోనే పూర్తిచేయవచ్చు. ఈ పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీతో కేవలం పరీక్ష మాత్రమే కాకుండా, చికిత్స కూడా చేయవచ్చు. దీంతో చాలా ప్రొసిజర్లను చేసి, చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కూడా అందించవచ్చు. ఈ విధానంలో రోగికి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నపేగుల్లో ట్యూమర్గానీ, పాలిప్స్గానీ, పుండుగానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి, మంచి చికిత్స అందించవచ్చు. చిన్నపేగులో ఎక్కడైనా మూసుకుపోతే, ఆ ప్రదేశంలో దీనిసాయంతో వెడల్పు చేయవచ్చు. డాక్టర్‌కు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా, చికిత్స చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి సీటీ, ఎమ్మారైలలో కూడా కనుగొనలేని (మిస్ అయ్యే) సూక్ష్మసమస్యలను సైతం ఈ పరికరంతో గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. మీవారి విషయంలో డాక్టర్లు క్యాన్సర్ లేదా పాలిప్స్‌ను అనుమానిస్తున్నారని మీరు రాశారు. ఆ రెండు సందర్భాల్లోనూ ఈ స్పైరస్ ఎంటిరోస్కోపీతో చాలా సమర్థమైన చికిత్సను అందించే అవకాశం ఉంది. దీనితో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా మీవారికి అవసరమైన చికిత్స చేయించండి. డాక్టర్ బి. రవిశంకర్, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
సూక్ష్మజీవులను నింపుకుంటే వ్యాధులు దూరం!
మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యునైటెడ్ కింగ్డమ్కు చెందిన బ్రాబ్రహమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా చేర్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందని.. తద్వారా వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడం వీలవుతుందని ఈ పరిశోధన చెబుతోంది. తక్కువ వయసున్న ఎలుకల వ్యర్థాల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను వయసు మీదపడిన ఎలుకల్లోకి జొప్పించినప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపించిందని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త మరిసా స్టెబెగ్ తెలిపారు. పేవుల్లోని బ్యాక్టీరియాకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య నిత్యం సమాచార వినిమయం జరుగుతూంటుందని వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని మరిసా తెలిపారు. ఎలుకల్లో బాగా పనిచేసిన ఈ పద్ధతి మనుషుల్లోనూ పనిచేస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు పేవుల్లోని బ్యాక్టీరియాకు, వయసుతోపాటు వచ్చే సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
గ్యాస్ట్రయిటిస్ నయం అవుతుందా?
నా వయసు 47 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోతో నయమవుతుందా? జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: ►20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ►పైత్య రసం వెనక్కి ప్రవహించడం ►కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపు నొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ కాళ్లపై రక్తనాళాలు ఉబ్బుతున్నాయి... ఎందుకిలా? నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది. సిరలు నలుపు/ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పితో నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది.సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట... తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
గ్యాస్ట్రిక్ అల్సర్ నయమవుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో తీవ్రంగా మంట వస్తోంది. వికారంగా కూడా ఉంటోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో అల్సర్లు పెరుగుతాయి. కారణాలు : 80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి. ►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది. ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు : కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ►కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మైగ్రేన్‌కు చికిత్స ఉందా? నా వయసు 33 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపున విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. ►పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు: ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. ►పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. ►పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ శస్త్రచికిత్స లేకుండా యానల్ ఫిషర్ తగ్గుతుందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మలద్వారం దగ్గర చీరుకుపోయిందనీ, ఇది యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఆరోగ్యానికి తోడు
గడ్డపెరుగు చూశాక ఎప్పుడెప్పుడు భోజనం చివరికొస్తుందా... ఒకింత ఎక్కువ పెరుగన్నం తినేద్దామా అని అనుకోని వారుండరు. కొందరికైతే అసలు పెరుగు తినకుండా భోజనం పూర్తయిన ఫీలింగే ఉండదు. పైగా చలికాలం ముగింపునకొస్తూ... వేసవిలోకి ప్రవేశించబోతున్న ఈ తరుణంలో శీతాకాలం తాత్కాలికంగా పెరుగు తిననివారు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రపడే పెరుగు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. వాటిలో ఇవి కొన్ని... మన జీర్ణవ్యవస్థ పొడవునా మనకు మేలు చేసే బ్యాక్టీరియా కోటానుకోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటినే ప్రోబయోటిక్స్ అంటారు. పెరుగు నిండా మనకు మేలు చేసే బ్యాక్టీరియా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూస్తుంది. అంతేకాదు... కడుపులో మంటను తగ్గిస్తుంది.పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. రోజూ పెరుగు తినేవారికి మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో ఎప్పుడూ తేమ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందంటున్నారు ఆహార నిపుణులు. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31శాతం తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే... హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్నం మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. చివరగా చిన్నమాట... గడ్డపెరుగు చూశాక టెంప్ట్ అయి వేసుకున్నా... కనీసం చెంచా నీళ్లయినా అందులో కలుపుకుంటే మంచిదనీ, అది వాతాన్ని హరిస్తుందన్నది పెద్దల మాట. నమ్మితే ఆచరించండి. నమ్మకపోతే రుచిని ఆస్వాదించండి. ఎందుకంటే పెరుగులో కీడు చేసే అంశం దాదాపుగా లేనే లేదు. -
గ్యాస్ట్రయిటిస్ నయమవుతుందా?
నా వయసు 44 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు : – 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు : కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు సమయానికి ఆహారం తీసుకోవాలి .కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, ఎప్పుడూ ఏదోఆలోచిస్తోంది... సమస్య నయమవుతుందా? మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. మాట్లాడినా ఆ మాటలు తీవ్రమైన నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్ మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటాయి. బైపోలార్ డిజార్డర్ : ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. చికిత్స : హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), సైనసైటిస్‌కు చికిత్స ఉందా? నా వయసు 33 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు. శాశ్వతంగా తగ్గేందుకు హోమియోలో చికిత్స ఉందా? సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. లక్షణాలు : సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య నొప్పి రావడం తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. పరీక్షలు : ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. చికిత్స : సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచనా విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... హెపార్ సల్ఫూరికమ్ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. ∙మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. -
సత్తువకు బత్తాయి
హాస్పిటల్లో ఉన్న రోగులకూ, కోలుకుంటున్న వ్యక్తులకూ ఇచ్చే పళ్ల రసం సాక్షాత్తూ బత్తాయి రసమే తప్ప మరోటీ ఇంకోటీ కాదు. బత్తాయితో ఒనగూరే ఆరోగ్యప్రయోజనాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదూ! బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇంకా అనేకం ఉన్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండే బత్తాయితో రోగనిరోధక శక్తి సమకూరుతుందన్న సంగతి తెలిసిందే. రోగులకు దీనిని ఇచ్చేందుకు మరో కారణమూ ఉంది. గ్లూకోజ్‌తో తేలిగ్గా కలిసిపోయే ఇందులోని లిమోనాయిడ్స్ అనే పోషకాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. బత్తాయిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని పెంపొందించి జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. అజీర్తి, పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం (ఇర్రెగ్యులర్ బవెల్ మూవ్మెంట్స్) వంటి సమస్యలను బత్తాయి సమర్థంగా చక్కదిద్దుతుంది. ఒంట్లోని విషపదార్థాలను బయటకు సమర్థంగా పంపడంలో బత్తాయి బాగా తోడ్పడుతుంది. అందుకే దీన్ని శక్తిమంతమైన డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. బత్తాయిలోని విటమిన్–సి ఇన్ఫ్లమేషన్నూ (నొప్పి, మంట, వాపు)లను తేలిగ్గా తగ్గిస్తుంది. బత్తాయిలోని ఈ గుణం వల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కోసం పళ్ల రసాన్ని ఇస్తుంటారు. బత్తాయి రసంలో కొలెస్ట్రాల్ పాళ్లను అదుపు చేసే స్వభావం ఉంది. అలాగే దీనిలో పోటాషియమ్ కూడా పుష్కలంగా ఉంది. ఈ కారణంగా బత్తాయికి రక్తపోటును నివారించే గుణమూ ఉంది. బత్తాయిలోని పొటాషియమ్ మూత్రపిండాల్లోని అనేక విషాలను బయటకు నెట్టేస్తుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్–సి యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని క్యాల్షియమ్ ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు... ఇదే క్యాల్షియమ్ ప్రత్యేకంగా గర్భవతుల్లో పిండం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మెదడూ, నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి బత్తాయి బాగా సహాయపడుతుంది. -
జీర్ణ వ్యవస్థకు అంజీర్
అంజీర్ రుచి ఎంత బాగుంటుందో... దానివల్ల సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ అంత ఎక్కువగా ఉంటాయి. అంజీర్లతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇక్కడ చెప్పినవి కొన్ని మాత్రమే. చర్మంపై ముడుతలు రావడం వంటి వయసు పెరగడం వల్ల కనిపించే అనర్థాలను నివారించి, అంజీర్ దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది. అంజీర్‌లో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే అంజీర్ తినడం వల్ల మలబద్దకాన్ని తేలిగ్గా తగ్గిస్తుంది. అంతేకాదు... అంజీర్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా శుభ్రం అవుతుంది. నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్యలూ తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తినడం మంచిది. మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటికి వచ్చే అనేక వ్యాధులను నివారిస్తుంది. అంజీర్‌లో కొలెస్ట్రాల్‌తో పాటు కొవ్వులు చాలా తక్కువ. అందువల్ల ఇది చాలా రకాల గుండెజబ్బులను, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులను తగ్గిస్తుంది. కొవ్వులు తక్కువగా ఉండటంతో పాటు ఫీనాల్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాల కారణంగా గుండెజబ్బులు నివారితమవుతాయి. అంజీర్‌తో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ను నివారించే ఎన్నో యాంటీఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. అంజీర్‌లో పొటాషియమ్ ఎక్కువ. సోడియమ్ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో దాని తీవ్రతను తగ్గించడానికి, క్రమంగా నివారించడానికి అంజీర్ బాగా తోడ్పడుతుంది. వీటిల్లో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత (అనీమియా)తో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్‌ను సిఫార్సు చేస్తుంటారు. మూత్రంలో క్యాల్షియమ్ వృధాగా పోవడాన్ని అంజీర్ సమర్థంగా అరికడుతుంది. అంజీర్‌లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది. అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియమ్ వంటి అనేక ఖనిజాలు ఉండటంతో పాటు చాలా మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. -
రోగాల పీచమణిచే పీచు పదార్థాలు
పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. పీచు పదార్థాలు మరో మేలు కూడా చేస్తాయని ఒక తాజా పరిశోధనలో బయటపడింది. జీర్ణ వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా అవి రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీచు పదార్థాలు తెల్ల రక్తకణాల సంఖ్యను వృద్ధి చేస్తాయని, అందువల్ల ఆహారంలో పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకునే వారు సాధారణమైన జలుబు మొదలుకొని రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోగలుగుతారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీచు పదార్థాలను బాగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా బాగుంటుందని ఉబ్బసం సహా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను వారు సమర్థంగా తట్టుకుని, త్వరగా తేరుకోగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పొట్టు తీయని ధాన్యాలు, గింజ ధాన్యాలు, అవిసెగింజలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయని, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే వీటిని రోజూ తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. -
పాలిచ్చే తల్లులకు
మంచి రుచికరమైన ధాన్యాల్లో సజ్జలు ముఖ్యమైనవి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ. దాంతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియమ్, సోడియం, పొటాషియమ్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–ఈ, విటమిన్–కె కూడా ఎక్కువే. సజ్జలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నివి. పాలిచ్చే తల్లులు రొమ్ముపాలు పుష్కలంగా పడేలా చేసే గుణం సజ్జలకు ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియమ్ వల్ల మహిళల్లో రుతుసమయంలో వచ్చే ‘మెన్స్ట్రువల్ క్రాంప్స్’ తగ్గుతాయి. సజ్జల్లో ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. అంతేకాదు.. సజ్జలు కండరాలను మరింత శక్తిమంతంగా చేస్తాయి. సజ్జలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించి, గుండెజబ్బులను నివారిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పాళ్లను పెంచి రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడతాయి. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పైల్స్, పెద్దపేగు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సజ్జల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోఎంజైమ్ త్వరగా కడుపు నిండేలా చేసి, సంతృప్తభావనను పెంచుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారికి సజ్జలు మంచి ఆహారం. ఇదే ఎంజైమ్ ఒత్తిడిని తగ్గించి, బాగా నిద్రపట్టేలా కూడా చేస్తుంది. తరచూ ఆహారంలో సజ్జలు తీసుకునేవారిలో గాల్‌స్టోన్స్ ఏర్పడటం చాలా తక్కువ. -
ఈ బ్యాక్టీరియా మంచిదే!
కన్ను, ముక్కు, నోరు, మెదడు, గుండె.. మన శరీరంలోని వేర్వేరు భాగాలివి. ఒక్కోటి ఒక్కో వ్యవస్థలో భాగాలు. అవేం చేస్తాయో మనకు తెలుసు. కానీ మనం పెద్దగా ఊహించని, మనకు అత్యవసరమైన మరో వ్యవస్థ కూడా మన శరీరంలో ఉంది. శరీరంలోనే ఉన్నా మనది కాని ఆ వ్యవస్థతో ఎంతో మేలు జరుగుతుంది. దానిలో తేడా వస్తే ఎన్నో అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. మరి ఆ వ్యవస్థ ఏమిటో తెలుసా.. మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు.. అదే మైక్రోబయోమ్ వ్యవస్థ. మన శరీరం తగిన స్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరమైన ఈ సూక్ష్మ జీవ ప్రపంచం.. మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తింటే మేలు చేసే సూక్ష్మజీవుల శాతం పెరిగి.. మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదే సమయంలో పలు రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు విస్తృతమైన అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. మరి ఈ మైక్రోబయోమ్ వ్యవస్థ ఏంటి, దాని వల్ల లాభాలేంటి, మంచి ఆరోగ్యం కోసం మనం చేయాల్సిందేమిటనే అంశాలపై ఈ వారం ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ 10,00,00,00,00,00,000 ఒకటి పక్కన పద్నాలుగు సున్నాలు.. అంటే కోటి కోట్లు.. మన శరీరంలోని సూక్ష్మజీవుల సంఖ్య ఇది. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వంటివన్నమాట. మన శరీరంలో ఉండే మన శరీర కణాల కంటే.. ఇలా ఇతర జీవుల కణాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ సూక్ష్మజీవుల్లోనూ మనకు ఎక్కువగా తెలిసినవి, ఉపయోగకరమైనవి బ్యాక్టీరియా. ఇందులోనూ అత్యధికంగా ఉండేవి ఫెర్మీక్యూట్స్, బ్యాక్టీరియడైట్స్. ఒకటేమో గ్రామ్ పాజిటివ్. రెండోది నెగటివ్ అంటారు. ఇంకోలా చెప్పాలంటే బ్యాక్టీరియాను చూసేందుకు చేసే పరీక్షలో వంకాయ రంగులో కనిపించేవి గ్రామ్ పాజిటివ్, వేరే రంగులో కనిపించేవి నెగటివ్. ఇక మన శరీరంలో ఉండే సూక్ష్మజీవుల్లో దాదాపు 80% ఉండేది మన జీర్ణ వ్యవస్థలోనే! అంటే నోటి నుంచి జీర్ణాశయం, చిన్నపేగులు, పెద్దపేగు చివరి వరకు ఉండే వ్యవస్థలోనే. ఎన్నో ఉపయోగాలు.. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లను శరీరానికి వంటబట్టేలా చేయడం, కీలకమైన అమినోయాసిడ్లను తయారు చేయడం మన పేగుల్లోని సూక్ష్మజీవులు చేసే ముఖ్యమైన పనులు. చిన్నపేగులో జీర్ణం కాగా మిగిలిన ఆహారం నుంచి జీవక్రియలకు అవసరమైన రసాయనాలను కూడా సూక్ష్మజీవులే తయారు చేస్తాయి. పేగుల గోడలు బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని కాపాడేందుకూ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని అంచనా. ఆహారం మారితే ఇబ్బందే.. ఒక రోజు పూర్తిగా మాంసాహారం తిని, తర్వాతి రోజు పూర్తిగా శాకాహారం తింటే.. పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతలో తేడాలు వచ్చేస్తాయి. అంతా సర్దుకోవాలంటే రెండు రోజులు పడుతుందట. కొవ్వు పదార్థాలు బాగా లాగించినా, చక్కెరలు ఎక్కువగా తీసుకున్నా.. మన శరీర గడియారం గందరగోళానికి గురవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్లూ మనలోని బ్యాక్టీరియా వైవిధ్యతను మార్చేస్తాయి. తగిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచుకోవచ్చు. హాని కలిగించే వాటిని తగ్గించు కోవచ్చు. తినే తిండి, జీవనశైలి మనకొచ్చే రోగాలను నిర్ణయిస్తాయని గుర్తుంచుకోవాలి. మోతాదుల్లో తేడా వస్తే.. కీళ్ల నొప్పులు మొదలుకొని ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వరకు అనేక సమస్యలకు.. పేగుల్లోని సూక్ష్మజీవ వ్యవస్థలో జరిగే మార్పులకు మధ్య గట్టి సంబంధం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (కడుపునొప్పి, అతిసారం వంటి లక్షణాలతో కూడిన వ్యాధి)’ని ఉదాహరణగా తీసుకుంటే... ఈ సమస్యతో బాధపడేవారిలో ఫెర్మిక్యూట్స్, బ్యాక్టీరియోడైట్స్ తక్కువగా ఉంటాయి. ఈ రెండు రకాల బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే బ్యూటరైట్ రసాయనానికి వాపు/మంటలను తగ్గించే లక్షణముంది. ఊబకాయుల్లోనూ ఈ రెండు బ్యాక్టీరియాల నిష్పత్తిలో తేడా ఉంటుందని గుర్తించారు. ఇక మధుమేహంతో బాధపడుతున్నవారిలోనూ బ్యూటరైట్ శరీరానికి వంటబట్టకుండా పోతుందని, విటమిన్ల శోషణ సక్రమంగా ఉండదని తేలింది. కొవ్వులతో ప్రభావం ఎక్కువే.. ఆహారంలోని కొవ్వుల విషయానికి వస్తే.. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ఫ్యాట్లు ఎక్కువైతే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండె జబ్బులకు దారితీస్తుందని తరచూ వింటూ ఉంటాం. ఈ రకమైన కొవ్వుల వల్ల పేగుల్లో ఆక్సిజన్ అవసరం లేని సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోవడం కూడా జబ్బులకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేర్వేరు మోతాదుల్లో కొవ్వులు తినే వారిపై పరిశోధనలు జరిపినప్పుడు.. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకునే వారిలో ఒక రకమైన బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్యాక్టీరియా వైవిధ్యతలో పెద్దగా మార్పుల్లేవుగానీ.. చెడు కొలెస్ట్రాల్ మాత్రం తగ్గిందని తేల్చారు. సాల్మన్ వంటి చేపల్లో మోనో, పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్లే ఆ చేపలు తినేవారి కొలెస్ట్రాల్ మోతాదులు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ అధిక కొవ్వులతో కూడిన ఆహారంతో శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా పెరిగినట్లు వెల్లడైంది. పోషకాలకు బ్యాక్టీరియాకు లింకేమిటి? ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు... మనం తినే ఆహారంలోని ముఖ్యమైన పోషకాలివే. దేని ప్రత్యేకత, అవసరం దానిదే. అయితే కొన్ని రకాల పోషకాలు పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతాయి. 1977లో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుందని తెలిసింది. మాంసం ద్వారా అందే ప్రొటీన్లతో పోలిస్తే.. పాల నుంచి తయారుచేసే ‘వే ప్రొటీన్’, శనగల ప్రొటీన్లు కొన్ని రకాల హానికారక బ్యాక్టీరియాను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాకాహార ప్రొటీన్లతో పేగుల్లో వాపు/మంటను తగ్గించే రసాయనాల ఉత్పత్తికి సాయపడుతుందని నిర్ధారించారు. అయితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ రకమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తవుతుందని, అలాంటి వారికి మధుమేహం, కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక శాకరిన్, సుక్రోజ్ వంటి కృత్రిమ చక్కెరలు పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యతను తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి చేటు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పబ్మెడ్ ఆధారంగా అధ్యయనం.. ఇంటర్నెట్లో పబ్మెడ్ అని ఒక సెర్చింజన్ ఉంది. వైద్య సంబంధిత పరిశోధనలన్నింటి సమాచారాన్ని దాని ద్వారా సులువుగా సేకరించవచ్చు. పేగుల్లో సూక్ష్మజీవులకు, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పబ్మెడ్లో విస్తృతంగా వెతికారు. ఆహారంలోని వేర్వేరు పదార్థాల పేర్లతోపాటు కొన్ని ఇతర కీలకమైన పదాలను ఉపయోగించారు. అలా లభించిన పరిశోధనా పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షించారు. 1970 నుంచి 2015 మధ్యకాలంలో ప్రచురితమైన పరిశోధన వ్యాసాలను పరిశీలించారు. మొత్తంగా 188 పరిశోధనల సారాంశాన్ని వెలికితీసి.. ఒక పద్ధతి ప్రకారం అమర్చారు. ముఖ్యంగా జంతువులపై కాకుండా మనుషులపై జరిగిన పరిశోధనలను, ఇంగ్లిష్‌లో ఉన్న పరిశోధనా పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్తలు రస్నిక్ సింగ్, టినా భూటానీలు కూడా పాల్గొన్నారు. మెడిటరేనియన్ డైట్‌తో మేలు తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువగా వినియోగిస్తాం. ఉత్తరాదివారైతే గోధుమ ఉత్పత్తులు.. అమెరికా, యూరప్ దేశాల్లో మాంసం ఉత్పత్తులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరి ఈ వేర్వేరు ఆహారపు అలవాట్లు బ్యాక్టీరియా సంతతిపై ప్రభావం చూపుతాయా.. అంటే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. జంతువుల ద్వారా వచ్చే కొవ్వు పదార్థాలు ఎక్కువగా, పీచు పదార్థాలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహారపు అలవాట్లు పేగుల్లోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అంతేగాకుండా కేన్సర్ కారక నైట్రోసమైన్స్ ఉత్పత్తిని పెంచుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. గోధుమల్లో కనిపించే గ్లూటెన్ అనే పదార్థం లేని ఆహారం తీసుకున్నా మేలుచేసే బ్యాక్టీరియా తగ్గిపోయినట్లు మరో పరిశోధన చెబుతోంది. శాకాహారంపై చేసిన పరిశోధనలోనూ కొన్ని రకాల బ్యాక్టీరియా తక్కువైనట్లు గుర్తించారు. ప్రపంచం మొత్తమ్మీద మంచి ఆహారంగా చెప్పే మెడిటరేనియన్ డైట్ మాత్రం మేలు చేసే బ్యాక్టీరియా సంతతిని పెంచుతున్నట్లు తెలిసింది. మెడిటరేనియన్ డైట్ అంటే.. మధ్యధరా సముద్ర ప్రాంతంలోని దేశాలవారీ ఆహార అలవాట్లుగా చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా శాకాహారం.. అందులో కూరగాయలు, పళ్లు, పొట్టు తీయని ధాన్యాలు, చిక్కుడు జాతికి చెందిన గింజలు, ఆలివ్ నూనె, అవిసె నూనెలను ఎక్కువగా ఉంటాయి. చేపలు, చికెన్ వంటి వాటిని కొంతవరకు, ఇతర మాంసాహారం వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇక వీటన్నింటితోపాటు సరైన శారీరక శ్రమ, వ్యాయామం కూడా మెడిటరేనియన్ డైట్లో భాగమనే చెప్పవచ్చు. మంచి బ్యాక్టీరియా పెంచుకోవాలంటే.. ♦ ఒకే రకమైన ఆహార అలవాట్లకు పరిమితం కాకుండా.. అందుబాటులో ఉండే అన్ని రకాల ఆహా రం తీసుకోవాలి. చిక్కుళ్లు, బీన్స్, పండ్లు ఎక్కువగా తింటే బైఫైడో బ్యాక్టీరియా పెరుగుతుంది. ♦ పెరుగుతోపాటు ఊరబెట్టిన, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల లాక్టోబాసిల్లీ బ్యాక్టీరియా పెరిగి మేలు జరుగుతుంది. దీనివల్ల హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది కూడా. ♦ కృత్రిమ చక్కెరలు ఒక రకమైన బ్యాక్టీరియాను పెంచడం ద్వారా రక్తంలో చక్కెరల శాతాన్ని పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ♦ అరటిపండ్లు, ఓట్స్, యాపిల్స్ వంటివి ప్రీ బయాటిక్స్‌గా వ్యవహరిస్తాయి కాబట్టి పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. ♦ నవజాత శిశువులకు తొలి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల వారి పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యత పెరుగుతుంది. ♦ పాలిష్ చేయని ముడి ధాన్యం/గింజలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం, బీటా గ్లూకన్ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. ఫలితంగా మధుమేహం, కేన్సర్ వ్యాధికారక రసాయనాల ఉత్పత్తిని అడ్డుకోవచ్చు. ♦ శాకాహారం వల్ల ఈ–కోలీ వంటి బ్యాక్టీరియా తగ్గుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ మోతాదులు నియంత్రణలోకి వస్తాయి. అదే సమయంలో వేర్వేరు వ్యాధులకు కారణమైన వాపు/మంటలను పరిహరించవచ్చు. ♦ మరీ అత్యవసరమైతేనే యాంటీ బయాటిక్ మందులను వాడాలి. ఈ మందులు పేగుల్లో అన్ని రకాల బ్యాక్టీరియా రకాలను నాశనం చేస్తాయి. ♦ గ్రీన్‌టీ, రెడ్‌వైన్, డార్క్ చాకోలెట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారంలో ఉండే పాలీఫినాల్స్ను పేగుల్లోని సూక్ష్మజీవులు నమిలేస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు సాయపడతాయి. ప్రీ బయాటిక్స్‌తో ఎంతో మేలు.. ప్రీ బయాటిక్స్‌లో అత్యధిక శాతం సరిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్లే. అంటే పీచు, పిండి పదార్థాలు అని చెప్పవచ్చు. వీటిలోనూ జీర్ణమయ్యేవి, కానివని రెండు రకాలు. మొదటి రకం వాటికి బియ్యం మంచి ఉదాహరణ. చిన్న పేగుల్లో కొన్ని ఎంజైమ్లతో కలసినప్పుడు ఈ కార్బోహైడ్రేట్లు.. గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోస్ వంటి చక్కెరలుగా మారిపోతాయి. ఇవి రక్తంలోకి చేరడంతో శరీరం స్పందించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సహజ చ క్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బైఫైడో బ్యాక్టీరియా ఎక్కువ కాగా.. బ్యాక్టీరియోడైస్ తక్కువయ్యాయి. ఇక సరిగా జీర్ణం కాని పీచు, పిండి పదార్థాలు నేరుగా పెద్దపేగుల్లోకి చేరతాయి. అక్కడి సూక్ష్మజీవులు ఈ పదార్థాలను పులిసిపోయేలా చేస్తాయి. పీచు ఎక్కువగా తింటే పేగుల్లోని బ్యాక్టీరియా అంతే చురుకుగా పనిచేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ప్రీ బయాటిక్స్ పదార్థాలు వాపు/మంటకు కారణమయ్యే సైటోకైన్ ఐఎల్–6 ను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతా యని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రీ బయాటిక్ పదార్థాల వల్ల పేగుల్లో ‘షార్ట్ చెయిన్డ్ ఫ్యాటీ యాసిడ్ల’ ఉత్పత్తి ఎక్కువై రోగ నిరోధక వ్యవస్థకు, జీర్ణక్రియకు సాయపడుతుందని పలు కొన్ని పరిశోధనల్లో తేలింది. ‘మీరు తీసుకునే ఆహారంలో పావు వంతు మిమ్మల్ని బతికిస్తుంది. మిగిలిన మూడొంతులు వైద్యులు బతికేలా చేస్తుంది!’ – డాక్టర్ ఆండ్రూ సాల్! ‘తినే తిండి బాగోలేకపోతే ఏ మందూ పనిచేయదు... సరైన తిండే ఉంటే మందుల అవసరమే ఉండదు!’ – ఆయుర్వేదం -
అనీమియాను తగ్గించే బెల్లం
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యకరమని చాలామంది అంటూంటారు. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. అందుకే భుక్తాయాసం కలిగేలా తిన్న తర్వాత కాస్తంత బెల్లాన్ని తినిపిస్తారు పెద్దలు. ∙బెల్లం శ్వాసకోశవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే దీన్ని మంచి క్లెన్సర్‌గా అభివర్ణిస్తారు ∙చక్కెరలో కంటే బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్ర పరుస్తుంది ∙బెల్లంలో ఖనిజ లవణాలు ముఖ్యంగా ఐరన్ ఎక్కువ. అందుకే రుతుసమస్యలతో బాధపడే మహిళలకు బెల్లంతో చేసిన పల్లీపట్టి వంటివి తినమని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది ∙బెల్లం, ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ∙బెల్లంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇది తక్షణ శక్తిని సమకూరుస్తుంది. బెల్లం మంచి శక్తివనరు. ∙డయాబెటిస్ రోగులకు చక్కెర కంటే బెల్లం మంచిదని కొందరు చెప్పినప్పటికీ దీని కెలరిఫిక్ విలువ ఎక్కువే. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదు. -
అడ్రినల్...ఆరోగ్యం
రెండు కిడ్నీలకు పై భాగంలో 2 1/2 అంగుళాల వెడల్పుతో ఆనుకుని ఉన్న అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వలన వచ్చే సమస్యే అడ్రినల్ ఫాటిగ్. అడ్రినల్ గ్రంథులు సెక్స్ సంబంధిత డిహెచ్ఇఆర్ హార్మోన్‌ను, స్లీప్ సైకిల్‌కు సంబంధించిన కార్టికో స్టిరాయిడ్ హార్మోన్‌ను, న్యూరో ట్రాన్స్‌మీటర్ అయిన అడ్రినలిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. నిరంతరంగా మోతాదుకు మించి కార్టిజోల్ హార్మోన్ ఉత్పత్తి అయితే (స్ట్రెస్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు) రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్, హైగ్లిజరైడ్స్ పెరిగి రోగనిరోధక శక్తి, ఎముకల సాంద్రత తగ్గుతుంది. స్థూలకాయం, గుండె జబ్బులకు దారి తీస్తుంది. హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండడం కూడా స్థూలకాయానికి దారితీయవచ్చు. ఇంతే కాకుండా కండరాల బలహీనత, థైరాయిడ్, నిద్రలేమికి కూడా దారితీస్తుంది. ఆహారంలో మార్పులతో పాటు, డిహెచ్ఇఆర్, మెలటోనిన్ వంటి హార్మోన్ సప్లిమెంట్స్‌ను, బి కాంప్లెక్స్, విటమిన్–సి సప్లిమెంట్స్‌ను, ఎల్–థియానిన్, ఒమెగా–3, కాల్షియమ్, మెగ్నిషియమ్ మినరల్ సప్లిమెంట్స్‌ను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఈ గ్రంథుల పనితీరు సరిగ్గా ఉండాలంటే యోగా వంటి వ్యాయామం తప్ప వేరే మార్గం లేదు. పదినిమిషాల పాటు ప్రశాంతంగా రోజూ ధ్యానం చేయడం ద్వారా కూడా సమస్య పరిష్కారంలో ఉపకరిస్తుంది. ఇక ఆసనాల విషయానికి వస్తే.. అడ్రినల్ గ్రంథుల మీద డైరెక్ట్‌గా పనిచేసే ఆసనాలు జానుశిరాసనం, పశ్చిమోత్తనాసనం, యోగముద్ర, భరద్వాజాసనం. ఫాటిగ్(అలసట)ని తగ్గించడానికి బాలాసనం, శశంకాసనం, విపరీత కర్ణి (గోడను లేదా కుర్చీని ఆధారంగా చేసుకుని), సుఖాసనం, సేతుబంధాసనం, శవాసనం లేదా యోగనిద్ర వంటివి చక్కగా ఉపయోగపడ్తాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆసనాల గురించి, అవి చేసే విధానం గురించి తెలుసుకుందాం. 1 జాను శీర్షాసనం కుడికాలు ముందుకు స్ట్రెచ్ చేసి ఎడమ మడమ పెరీనియం( జననేంద్రియానికి, గుద భాగానికి మధ్య భాగం) కు దగ్గరగా ఉంచి శ్వాస తీసుకుని చేతులు పైకి తీసుకువెళ్ళి నడుము భాగాన్ని బాగా పైకి సాగదీస్తూ శ్వాస వదులుతూ తల చేతులు కలిపి నెమ్మదిగా ముందుకు వంగి రెండు చేతులతో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. శిరస్సు లేదా గడ్డం మోకాలుకి దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల చేతులు కలిపి మళ్ళీ పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ రెండు చేతులు పక్క నుండి కిందకు తీసుకురావలెను. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: ∙ఔ1– ఔ5 భాగంలో సమస్య, లోయర్ బ్యాక్‌లో సమస్య, పించ్ నర్వ్ లేదా సయాటికా సమస్య ఉన్నా కుడికాలిని స్ట్రెయిట్‌గా మోకాలిని పైకి లేపి ఉంచడం చాలా ముఖ్యం ∙ఇక ఎటువంటి నడుము నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కాలు నిటారుగా ఉంచి, ఒక వేళ రెండు చేతులతో పట్టుకోవడానికి అందకపోతే తాడును కాని, బెల్టుని కాని ఉపయోగించి శ్వాస వదులుతూ కొంచెం కొంచెం ముందుకు వంగడానికి ప్రయత్నించవచ్చు ∙గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఈ ఆసనం చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ ఆసనం చేసేటప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా అండము గర్భాశయంలోకి చేరడాన్ని నివారిస్తుంది. ఉపయోగాలు: కిడ్నీలు, అడ్రినల్ గ్రంథులు, కాలేయం, పాంక్రియాజ్ పనితీరు మెరుగవుతుంది. 2 పశ్చిమోత్త నాసనం పశ్చిమ అంటే వెనుక భాగం లేదా వీపు. ఉత్తాన అంటే సాగదీయడం, ఈ ఆసనం చేసేటప్పుడు వీపు భాగం సాగదీయబడుతుంది. కాబట్టి దీనికా ఆ పేరు. కాళ్ళు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పక్కల నుండి పైకి తీసుకువెళ్ళి భుజాలు రెండూ తలకు ఇరువైపులా ఆనించి, నడుమును చేతులను పైకి సాగదీస్తూ, శ్వాస వదులుతూ నెమ్మదిగా తల చేతులు కలిపి ముందుకు వంగుతూ రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. నుదురు మోకాళ్లకు దగ్గరగా, మోచేతులు రెండూ భూమికి దగ్గరగా తేవాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల చేతులు కలిపి పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ రెండు చేతులు పక్కల నుండి కిందకు నడుముకు ఇరువైపులకు తీసుకురావాలి. జాగ్రత్తలు: ఔ1– ఔ5లో సమస్య ఉన్నవాళ్ళు సయాటికా సమస్య ఉన్నవాళ్లు మోకాళ్లు పైకి లేపి ఉంచడం మంచిది. ఎంతవరకు సుఖ పూర్వకంగా వంగగలరో అంతవరకే చేయడం మంచిది. గట్టి ప్రయత్నం చేయదలచినవారు తాడును కాని, బెల్టును కాని పాదాల వెనుక నుండి పోనించి రెండు కొసలను చేతులతో పట్టుకుని ముందుకు వంగే ప్రయత్నం చేయవచ్చు. ఉపయోగాలు: కిడ్నీలు, అడ్రినల్ గ్రంథుల మీద మంచి ప్రభావం. జీర్ణ వ్యవస్థకు మంచిది. 3 సేతు బంధాసనం వెల్లికిలా పడుకుని మోకాళ్ళు రెండూ పైకి ఉంచి రెండు పాదాలు పూర్తిగా భూమి మీద ఆనేటట్లుగా జాగ్రత్త తీసుకుంటూ మడమలు రెండూ (పిరుదులకు) హిప్స్‌కు వీలైనంత దగ్గరగా ఉంచి రెండు చేతులతో మడమలను పట్టుకుని (ఒకవేళ పట్టుకోలేక పోయినా ఫరవాలేదు) లేదా దగ్గరగా ఉంచి శ్వాస తీసుకుంటూ సీటు భాగాన్ని, నడుమును, వీపు భాగాన్ని వీలైనంత పైకి లేపి శ్వాస వదులుతూ ఒక్కొక్క వెన్నుపూస పై నుండి కిందకు నెమ్మదిగా భూమి మీద తగిలే విధంగా కిందకు రావలెను. దీనిని 5 నుండి 10 సార్లు రిపీట్ చేయాలి. గమనిక: ఒక వేళ సీటు భాగం వీపు భాగం అసలు పైకి లేపలేనివారు ఎల్తైన కుషన్‌ను లేదా బాలిస్టర్ను ఉపయోగించి ఈ స్థితిలో 5 నిమిషాలు విశ్రాంత స్థితిలో ఉండవచ్చు. ఉపయోగాలు: స్ట్రెస్, మైల్డ్ డిప్రెషన్‌ని తీసివేస్తుంది. మనసు ప్రశాంత స్థితిని అనుభవిస్తుంది. రుతుసమస్యలకు, వెన్ను సమస్యకు, నిద్రలేమి సమస్యకు మంచిది. అడ్రినల్ గ్రంథుల మీద పనిచేయడం వలననే పై ఉపయోగాలు కల్గుతాయి. – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: ఈషా హిందోచా – ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
దొండకాయ
గుడ్‌ఫుడ్ మనకు జ్వరం వచ్చి నార్మల్ అయ్యే సమయంలో తీసుకొమ్మని చెప్పే కూరగాయల్లో దొండకాయ ఒకటి. జ్వరం వల్ల మనం కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగి వచ్చేలా చేసే అద్భుతమైన కూరగాయ దొండ. దానివల్ల ఒనగూరే మరికొన్ని ఇతర ప్రయోజనాలివి... దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది.దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు.శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది.దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ శ్రేయస్కరం. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. -
మెదడుకు చురుకుదనం
⇔ అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. ⇔ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ⇔ డిప్రెషన్ వ్యాధిగ్రస్తుల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందు, తిన్న తర్వాత గణనీయమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ⇔ ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది. ⇔ ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. రెండు వందల మంది విద్యార్థుల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్థారణ అయింది. క్రమం తప్పకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కాని, మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారిలో మెదడు మరింత చురుకుగా పని చేస్తుందట.