హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగంలో ఉన్న లీ హెల్త్ డొమెయిన్ సరైన జీర్ణ వ్యవస్థ కోసం ఎంజైమ్యాక్ట్ పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శాఖాహార పదార్థాల నుంచి సేకరించిన ఎంజైమ్స్‌తో ఈ ఉత్పాదనను రూపొందించినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ‘ప్యాంక్రియాటిక్ ఎక్సోక్రిన్ లోపం ఉన్న వ్యక్తులకు డైజెస్టివ్ ఎంజైమ్‌లు లేకపోవడం, సిస్టిక్ ఫైబ్రోసిస్, ప్యాంక్రియాస్ తొలగించడం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటిటిస్ వల్ల ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. మార్కెట్లో ఉన్న జంతు కణ ఆధారిత ప్యాంక్రియాటిన్ ఔషధాల వాడకంతో సమస్యలొస్తున్నాయి. అలాగే వీటిలో మందుల అవశేషాలు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే శాఖాహార ఆధారిత ప్యాంక్రియాటిన్ తో ఎంజైమ్యాక్ట్ తయారు చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment