పెరుగుతో జత చేయకూడని ఆహార పదార్థాలు ఇవే..! | Never Pair These Foods With Yogurt, It Can Disrupt Your Digestive System | Sakshi
Sakshi News home page

ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!

Published Thu, Jun 13 2024 4:25 PM | Last Updated on Thu, Jun 13 2024 4:46 PM

Never Pair These Foods With Yogurt, It Can Disrupt Your Digestive System

కొంతమంది అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లేదా కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ప్రోటీన్‌, కాల్షియంల పవర్‌హౌస్‌ అయిన పెరుగుతో ఈ ఆహార పదార్థాలను జోడించడం వల్ల ఈ సమస్య తీవ్రతరమయ్యి, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా కూడా పెరుగుతో ఇలాంటి పదార్థాలను జోడించడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భారీ భోజనం లేదా మంచి స్పైసీతో కూడిన ఆయిలీ ఫుడ్స్‌‌ తినేటప్పుడు పెరుగులో కలపి అస్సలు ఇలాంటివి అస్సలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పెరుగుతో జత చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో సవివరంగా  చూద్దామా..!

కాల్షియం, ప్రోబయోటిక్స్‌ ఉండే పెరుగు శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. కడుపులోని ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది. ఐతే కడుపులో జీర్ణక్రియ ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మాత్రం పెరుగుకి ఈ పదార్థాలు అస్సలు జత చెయ్యకండి.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయ రైతా ఒక రుచికరమైన లంచ్‌ టైం డిష్‌. కూరగాయలు, రోటీలతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పెరుగు శరీరంలో చల్లదనం తీసుకొస్తే..ఉల్లి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకుంటే..అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తీవ్రతరం అవ్వడం లేదా రావడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మామిడికాయలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిని పెరుగుతో జత చేసి అస్సలు తినకూడదు. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, పీహెచ్‌ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. మామిడికాయలో పులుపు, పెరుగులోని ఆమ్లం వల్ల పీహెచ్‌ స్థాయిల్లో అసమతుల్యతకు కారణమవుతుంది. మామిడి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఇది కూడా జీర్ణక్రియకు సమస్యాత్మకంగా ఉంటుంది. ఇలా తినడం ఫుడ్‌ పాయిజన్‌కు దారితీసి, దద్దుర్లు, తామర లేదా సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది.  

చేప
శాకాహారంతో నాన్‌వెజ్‌ మూలాన్ని ఎట్టిపరిస్థితుల్లో జత చేయకూడదు. చేపలు, పెరుగులో అధిక ప్రోటీన్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఇది కూడా కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. 

పండ్లు..
చాలా పండ్లలలో ఫ్రక్టోజ్‌ ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల పండ్లను కూడా పెరుగుతో కలపడకూడదు. ఈ కలయిక జీర్ణక్రియకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇది కూడా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుతందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఇష్టంగా తాగే మిల్క్‌ షేక్‌లో ఎక్కువగా పాలు, అరటిపండ్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా పొట్టకు ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు. 

డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌..
పెరుగులో బాగా వేయించిన డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌, వడలు కలిపిన బ్రేక్‌ఫాస్ట్‌లు తీసుకున్నా పొట్టలో చాలా భారంగా ఉంటుంది. పైగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది కూడా. అంతేగాదు ఆయిల్‌ ఫుడ్స్‌తో కూడిన పెరుగు జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి నీరసం తెప్పించేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  

(చదవండి: నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement