
ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం
ఎస్కేయూ : ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ సాంబయ్య పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నెల 11న నిర్వాహకులు పురస్కారాన్ని వీసీకి అందజేశారు. విద్య, వైద్య, వైజ్ఞానిక సేవా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సీహెచ్ సాంబయ్య స్మారక పురస్కారాన్ని ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాదికి ఎస్కేయూ వీసీని ఎంపిక చేశారు. విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించి, పాలనదక్షులుగా ఎస్కేయూను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్‌ను పలువురు అభినందించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.