24 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సిలింగ్‌ | emcet final phase start 24 | Sakshi
Sakshi News home page

24 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సిలింగ్‌

Published Wed, Jul 20 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

emcet final phase start 24

కమాన్‌చౌరస్తా: ఎంసెట్‌ తుది దశ కౌన్సిలింగ్‌ ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎంసెట్‌ మహిళా పాలిటెక్నిక్‌ సహాయ కేంద్రం కోఆర్టినేటర్‌ బి.రాజ్‌గోపాల్‌ బుధవారం తెలిపారు. గతంలో హాజరుకానీ అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. 24, 25 తేదీల్లో వె»Œ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 27న జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్‌ చలానా గడువు నేటితో ఆఖరు
ఇంజినీరింగ్‌ మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు ఎస్‌బీహెచ్‌లో చలానా చెల్లించడానికి గురువారంతో గడువు ముగియనుందని మహిళా పాలిటెక్నిక్‌ సహాయ కేంద్రం కోఆర్టినేటర్‌ బి.రాజ్‌గోపాల్‌ తెలిపారు. కళాశాలలో చేరేందుకు ఈ నెల 22వరకు గడువు ఉందని పేర్కొన్నారు. 
 
 నేడు బ్రాహ్మణ సంఘం సమావేశం
కరీంనగర్‌సిటీ : అఖిల బ్రాహ్మణ సేవాసంఘం జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం గురువారం కరీంనగర్‌లోని శ్రీగణేశ శారద శంకరమఠంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా, నగర కన్వీనర్లు బ్రహ్మన్నగారి బ్రహ్మయ్య, పురాణం మహేశ్వరశర్మ  తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement