certificate verification
-
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
నేటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. స్లాట్ బుక్ చేసుకున్న తేదీల్లోనే ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు స్పెషల్ కేటగిరి విద్యార్థు లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, వారు కూడా ఫీజు చెల్లించినప్పుడే స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 26, 27వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపిక, 28వ తేదీన ఆప్షన్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఈనెల 29న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులంతా 31వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. 31వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. రేపు ఐసెట్ సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 15న సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ప్రవేశాల కోసం 16,800 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, అందులో 15,067 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను tsicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. -
నత్తనడకన మెడికల్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడి దాదాపు 3 వారాలు పూర్తయినా ఇప్పటికీ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆలిండియా కోటాలో మొదటిదశ ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆలిండి యా కోటాలో మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన వెంటనే, రాష్ట్రంలోనూ మొదటి విడత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వాలి. ఈసారి మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విద్యార్థుల సమక్షంలో జరగ్గా, ఇప్పుడు కరోనా కారణంగా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతోంది. దీంతో విద్యార్థులు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయలేదంటున్నారు. చాలావరకు తప్పుల తడకగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉంటాయి. కానీ కొందరు సంబం ధిత జిల్లాలో లేని కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో ధ్రువపత్రాల్లోనూ తప్పులు ఉన్నాయి. కొందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కూడా ఈడబ్లు్యఎస్ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేశారు. వారికి ఈడబ్లు్యఎస్‌కు సంబంధం లేకున్నా తహసీల్దార్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు ఉండాల్సి ఉండగా, రూ.10 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు కొందరు ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి వాటిని గుర్తించి, విద్యార్థులకు ఫోన్లు చేసి చక్కదిద్దడానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. (చదవండి: ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..) 28 నుంచి వెబ్ ఆప్షన్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ ఆప్షన్లను ఈ నెల 28 నుంచి నిర్వహించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించడానికి మరో రెండ్రోజులు సమయం తీసుకుంటారు. అనంతరం మెడికల్ కాలేజీని ఎంచుకోవడానికి వచ్చే సోమవారం నుంచి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నెలాఖరులో మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కన్వీనర్ కోటాలో తొలివిడత పూర్తయిన తర్వాత ప్రైవేటు వైద్యకళాశాలల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల భర్తీకి ప్రకటన జారీచేస్తారు. (చదవండి: పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా) రెండో విడత ప్రవేశాలు.. ఆలిండియా మెడికల్ ప్రవేశాల్లో రెండో విడత శుక్రవారం నుంచి నిర్వహిస్తారు. ఈ నెల 24 వరకూ రెండో విడతలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 27న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. 28 నుంచి వచ్చే నెల 8లోగా కేటాయించిన మెడికల్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు. (చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం) జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు (శుక్రవారం) ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు (24)న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది. -
4 నుంచి మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 4 నుంచి 7 వరకు మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. వెరిఫికేషన్ హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఉంటుందని పేర్కొంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు మార్చి 8న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యతలను బట్టి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. -
నేడు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, కర్నూలు(అర్బన్): గ్రామ, వార్డు సచివాలయ రెండవ విడత పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28వ తేదీన ఐదు రకాల పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. శనివారం ఆయన తన చాంబర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, పంచాయితీ కార్యదర్శి గ్రేడ్–6 (డిజిటల్ అసిస్టెంట్) పోస్టులకు మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు, మెసేజ్‌లు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. స్థానిక జిలా పరిషత్‌లోని డీపీఆర్సీ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ – 5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 పోస్టులకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అలాగే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు స్థానిక కలెక్టరేట్లోని సెరికల్చర్ డీడీ కార్యాలయం రూం నెంబర్: 121, 126 గదుల్లో, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు జెడ్పీ ప్రాంçగణంలోని డీపీఆర్సీ భవనంలో, అలాగే మహిళా పోలీసులకు సంబంధించి కొండా రెడ్డి బురుజు సమీపంలోని ఎస్సీ ఆఫీసు వద్ద సర్టిఫికెట్ల పరిశీలన జరుగతాయన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 పోస్టులకు 85 మంది, గ్రేడ్–6కు 127, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు 1, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు 199 మందికి కాల్ లెటర్లు ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపించడం జరిగిందన్నారు. కాగా ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 20 శాతం మార్కులను అర్హతగా గుర్తించడం, స్లైడింగ్ సిస్టమ్‌లో కేటగిరీ –1లోని ఈ పోస్టుల్లో ఇప్పటికే విధుల్లో చేరిన వారిలో కొందరికి పోస్టులు, ప్లేసులు మారే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ వివరించారు. కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన స్థానిక జెడ్పీలోని డీపీఆర్సీ భవనంలో శనివారం వార్డు అమెనిటీస్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు అందిన అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఈ నెల 26వ తేదీన జరిగిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరైన వారి కోసం శనివారం కూడా స్థానిక విశ్వేశ్వరయ్య భవన్లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. -
సచివాలయ ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురూ
సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం మంగళవారం ఐదు జిల్లాల్లో ప్రారంభమైంది. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇందుకు శ్రీకారం చుట్టగా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో పోస్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలను అభ్యర్థుల హాల్‌టికెట్ నంబరు, జిల్లా ర్యాంకుల వివరాలతో అధికారులు ఆన్లైన్లో ఉంచుతున్నారు. 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌లిస్టును తయారుచేసి ప్రకటించాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన వారితో కూడిన 105 షార్ట్‌లిస్టులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ల ప్రకారం, రోస్టర్ పాయింట్ల ఆధారంగా జాబితాల రూపకల్పన సంక్లిష్టంగా మారడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, అన్ని జిల్లాల్లో అన్ని రకాల పోస్టులకు షార్ట్‌లిస్టు బుధవారం సాయంత్రానికి ఖరారయ్యే అవకాశముందని వారంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలంటూ అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతారు. మరోవైపు.. ముందుగా నిర్ణయించినట్లుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైన చోట కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు ఈ ప్రక్రియను 24 నుంచి 26 వరకు జరుపుకోవడానికి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అవసరమైతే 27వ తేదీ వరకు కూడా జరిపినా 29వ తేదీకల్లా మొత్తం ప్రక్రియను పూర్తిచేసి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు. -
ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల బోర్డు నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్) తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 14వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్ ప్రక్రియ కోసం అభ్యర్థులు హాజరుకావాల్సిన 18 కేంద్రాల వివరాలను ఆదివారం వెల్లడించింది. ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి హాజరుకావాల్సిన అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్స్‌ను పంపించింది. ఈ లెటర్స్ "httpr://www.trprb.in/'లో వ్యక్తిగత ఖాతాల్లో జూన్ 12న ఉదయం 8 గంటల నుంచి నుంచి జూన్ 13న రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, ఎడిటింగ్ కోసం దరఖాస్తు చేసిన ఏ–టైప్ అభ్యర్థులకు జూన్ 20, 21 తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ కేంద్రాల వివరాలు.. ఆదిలాబాద్: ఏఆర్ హెడ్‌కార్టర్స్, ఎస్పీ ఆఫీసు, ఆదిలాబాద్; సైబరాబాద్: సీపీ ఆఫీస్, గచ్చిబౌలి, హైదరాబాద్; హైదరాబాద్: మెట్రో బ్యారక్స్, బేగంపేట మెట్రోస్టేషన్ పక్కన, హైదరాబాద్; కరీంనగర్: సీపీ కార్యాలయం, కరీంనగర్; ఖమ్మం: సీపీ కార్యాలయం, ఖమ్మం; కొత్తగూడెం: సీఆర్క్లబ్, ప్రకాశం స్టేడియం ఎదురుగా, పోస్టాఫీసు సమీపంలో; మహబూబాబాద్: ఎస్పీ కార్యాలయం, మహబూబాబాద్; మహబూబ్‌నగర్: ఎస్పీ కార్యాలయం, మహబూబ్‌నగర్; నాగర్‌కర్నూల్: ముస్లిం మైనార్టీ కాలేజ్, ఈద్గా వద్ద, సిరిపురం రోడ్డు, నాగర్‌కర్నూల్; నల్లగొండ: ఎస్పీ కార్యాలయం, నల్లగొండ; నిజామాబాద్: సీపీ ఆఫీస్, నిజామాబాద్; రాచకొండ: సీపీ క్యాంప్ ఆఫీస్, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఎల్బీనగర్; రామగుండం: సీపీ ఆఫీస్, రామగుండం; సంగారెడ్డి: ఎస్పీ ఆఫీస్, సంగారెడ్డి; సిద్దిపేట: టీటీసీ బిల్డింగ్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా, బైపాస్ రోడ్; సూర్యాపేట్: ఎస్పీ ఆఫీస్, వరంగల్; టీఎస్ఎల్పీఆర్బీ: సీపీ ఆఫీస్ గచ్చిబౌలి, హైదరాబాద్; వరంగల్: సీపీ ఆఫీస్, వరంగల్. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. - ఇంటిమేషన్ లెటర్లు అందిన పోలీసు అభ్యర్థులు ప్రకటించిన తేదీల్లో ఉదయం 9 గంటల కల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. - ఎడిటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత పత్రం (ట్రాన్సెక్షన్ ఫాం)తో అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాలి. - డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు హెవీమోటార్ వెహికల్ లైసెన్స్‌ను తప్పకుండా తీసుకురావాలి. - ఫొటోలు, విద్యార్హత, స్టడీ/బోనఫైడ్, కులం, స్థానికత, ఆధార్, ఏజెన్సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, హోంగార్డు, ఎన్సీసీ తదితర సర్టిఫికెట్లు సంబంధిత ఇతర అన్ని పత్రాలు తీసుకురావాలని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. - అన్ని ధ్రువీకరణపత్రాలు 2014 జూన్ 2 తరువాత జారీ చేసినవై ఉండాలి. -
17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రవేశాల కమిటీ జారీ చేసింది. మంగళవారం నుంచే ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ పూర్తి కాకపోవడంతో ఈ నెల 17 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు మంగళవారం సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 17న ఆన్లైన్లో విద్యార్థుల సమాచారం నమోదు చేయడం, ఫీజు చెల్లింపును ప్రారంభిస్తామని పేర్కొంది. 17వ తేదీ నుంచి 19 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్లో స్లాట్‌బుకింగ్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొంది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ సమయంలో విద్యార్థులు దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలని, నిర్ణీత సమయాన్ని ఎంచుకొని ఆ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజున వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని వెల్లడించింది. 24వ తేదీ రాత్రికి ఆప్షన్ల ముగింపు ఉంటుందని, ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వివరించింది. సీట్లు పొం దిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలి పింది. విద్యార్థులు జూన్ 1న రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించింది. ఈ సర్టిఫికెట్లు మరచిపోవద్దు: బి.శ్రీనివాస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు వెబ్సైట్లో పేర్కొన్న సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నివాసధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) వెంట తీసుకెళ్లాలని సూచించారు. రెగ్యులర్‌గా చదువుకోని వారు అయితే ఏడేళ్ల నివాస ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.300, ఇతరులకు రూ. 600గా నిర్ణయించినట్లు వివరించారు. -
యువనేస్తం.. అస్తవ్యస్తం
ఏఎన్‌యూ(గుంటూరు): నిరుద్యోగులకు చేయూత పేరుతో ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం అస్తవ్యస్తంగా తయారయ్యింది. యువనేస్తం కింద ఆర్థిక సహాయం చేసే సంగతి దేవుడెరుగు.. కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా సక్రమంగా అమలు చేయటం లేదంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారని విమర్శిస్తున్నారు. పలు రకాల నిబంధనలు విధిస్తూ నెలల తరబడి దరఖాస్తు కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వర్సిటీ కళాశాలల్లో చదివారని.. యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులైన వారు గత ఏడాది సెప్టెంబర్‌లోనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. తమను ఎందుకు ఎంపిక చేయలేదని యువనేస్తం టోల్‌ఫ్రీ నంబర్, సంబంధిత అధికారులను సంప్రదించగా మీరు తెలంగాణ ప్రాంతంలోని వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాల్లో డిగ్రీ చదివారని కొందరికి, దూరవిద్యాకేంద్రం ద్వారా డిగ్రీ చదివారని మరికొందరికి సమాధానాలొచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ వరకు ఏపీ ప్రాంతంలో చదివి డిగ్రీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో చదివిన విద్యార్థులు కూడా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయారు. పరిశీలన పేరుతో.. తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో, దూరవిద్యలో డిగ్రీలు చదివిన వారి దరఖాస్తులు ఆమోదించకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని బాధిత నిరుద్యోగులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫై చేసేందుకు సంబంధిత యూనివర్సిటీలు డేటా పంపలేదని, జన్యూనిటీ వెరిఫై చేయించుకుని రావాలని సలహా ఇచ్చినట్లు బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని యూనివర్సిటీలు, ఏపీలోని యువనేస్తం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే.. తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి, పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు దారులకు సర్టిఫికెట్ల పరిశీలన, అప్‌లోడ్‌కు హాజరుకావాలని రెండు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్‌లు వచ్చాయి. దీనికి సంబంధిత షెడ్యూల్, సర్టిఫికెట్ల పరిశీలన జరిగే కేంద్రాల జాబితా ఉన్న వెబ్‌సైట్‌ను నిరుద్యోగులకు పంపించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వందల మంది మంగళవారం ఏఎన్‌యూ ఆన్లైన్ సెంటర్లో ఉన్న యువనేస్తం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అప్‌లోడ్‌కు సంబంధించి ఎవరు సమాచారమిచ్చారో తమకు తెలియదని రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల చెప్పగా వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు అవాక్కయ్యారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమ వద్ద సమాచారమేమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో కొందరు విద్యార్థులు యువనేస్తం పథకానికి సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించగా షెడ్యూల్ ఎవరిచ్చారో తమకు కూడా తెలియదని సమాధానం వచ్చింది. ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చిందని చెప్పగా వారినే సంప్రదించండని చెప్పడం గమనార్హం. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగాలని భావిస్తున తరుణంలో ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తు ప్రక్రియలోనే స్పష్టత లేకపోతే ఇక లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత అధికారులు ఏం శ్రద్ధ తీసుకుంటారని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపేయడమేంటి? తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేయని కారణంగా ఈ పథకానికి ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. కానీ, జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో బీటెక్ చదివిన మా స్నేహితుడిని ఎంపిక చేశారు. కొందరి దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారో సరైన కారణం చెప్పే వారే లేరు. మేం మాత్రం ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.–టి.కిషోర్, తిరువూరు స్పష్టత లేని సమాచారంతో ఇబ్బందులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని మూడు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో నా మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. దగ్గర్లోని సెంటర్‌కు ఎక్కడికైనా వెళ్లి పరిశీలన చేయించుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో నేను ఏఎన్‌యూకి వచ్చాను. సెంటర్‌కు తాళాం వేసి ఉంది. ఎవర్ని అడిగినా మాకు తెలియదని చెబుతున్నారు. ఇప్పటికి ఐదు నెలలుగా తిరుగుతూ ఉన్నాం. –కె.రాజశేఖర్‌రెడ్డి, నందిగామ ఉన్నత విద్యామండలికి కూడా తెలియదట.. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని రెండు రోజుల కిందట నాకు ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చింది. ఏఎన్‌యూకి వస్తే ఈ విషయంపై మాకు సమాచారం లేదన్నారు. దీంతో మా స్నేహితులతో కలిసి తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లాం. అక్కడ ఉన్న ఉద్యోగి దీనిపై మాకు సమాచారం లేదని టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎవరు మెస్సేజ్ చేశారో వాళ్లనే అడగాలని చెప్పారు. – ఈ.అశోక్ రెడ్డి, నందిగామ -
23న ఎఫ్‌బీవో సర్టిఫికెట్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 22న జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 22న సెలవు ప్రకటించిన కారణంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలలో జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23కి వాయిదా వేసినట్లు తెలిపింది. -
ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రేపటి నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 186 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, గత నెలలో నిర్వహించిన మొదటి దశ కౌన్సెలింగ్‌లో 52,621 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. మరో 12,325 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. పైగా సీట్లు పొందిన వారిలో 38,705 మంది విద్యార్థులే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. దీంతో ఖాళీగా ఉన్న వాటితో పాటు విద్యార్థులు చేరని సీట్లు కలుపుకొని కన్వీనర్ కోటాలో 26,241 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి భర్తీకి ఈ నెల 6 నుంచి రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాలకు మూడో దశ కౌన్సెలింగ్ కూడా నిర్వహించాలని ఇప్పటికే ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. అయితే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు ఈ నెల 19తో పూర్తి కానున్నాయి. ఆ తర్వాతే మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇదీ రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూల్.. 6–7–2018 నుంచి 8–7–2018 వరకు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 7–7–2018 నుంచి 8–7–2018 వరకు: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 7–7–2018 నుంచి 10–7–2018 వరకు: వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లు 12–7–2018: సీట్ల కేటాయింపు 12–7–2018 నుంచి 14–7–2018: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ 13–7–2018 నుంచి 15–7–2018: సీట్లు లభించిన కాలేజీల్లో రిపోర్టింగ్ 16–7–2018 నుంచి: తరగతులు ప్రారంభం -
నేడు 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 22 వేల ర్యాంకులోపు విద్యార్థులు 6,633 మంది హాజరైనట్లు పాలీసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నేడు 22,001 ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. -
రేపటి నుంచి ఓయూసెట్ వెరిఫికేషన్
హైదరాబాద్: ఓయూసెట్–2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. రెండో విడత వెబ్ ఆప్షన్స్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 23, 24, 27, 28 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలను www.osmania.ac.inలో చూడవచ్చు. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : ఎస్కేయూ సెట్ (2017) కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన రెండో రోజూ కొనసాగింది. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు సంబంధించి మొత్తం 679 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 381 మంది హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు. -
పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం టౌన్ : ఉపాధి హామీ కింద పని చేస్తున్న పీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు, వాటర్‌షెడ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం డ్వామా మీటింగ్ హాల్లో పీడీ నాగభూషణం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెరీర్ అడ్వాన్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఏ విద్యార్హత ఉన్న వారు ఏ పోస్టుకు అర్హులో తెలియజేశారు. అనంతరం సుమారు 80 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. -
లా ప్రవేశాలకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
31 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు.. వచ్చే నెల 5న సీట్ల కేటాయింపు.. సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసినట్లు వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించినట్లు వివరించారు. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 4 వర కు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని... వచ్చే నెల 5న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. వచ్చే నెల 8 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రెండోదశ కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 14, 15 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతర విద్యార్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, ఏవీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కూకట్పల్లి జేఎన్టీయూహెచ్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కోర్సు కాలేజీలు సీట్లు అర్హులైన అభ్యర్థులు మూడేళ్ల ఎల్ఎల్బీ 22 3,320 9,897 ఐదేళ్ల ఎల్ఎల్బీ 15 1740 2811 ఎల్ఎల్ఎం 12 560 1620 -
ఎంసెట్ ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-3లో అర్హత సాధించిన స్పెషల్ కేటగిరీ విద్యార్ధులకు శనివారం కౌన్సిలింగ్లో భాగంగా అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కూకట్పల్లి జేఎన్టీయూ అడ్మిషన్స్ విభాగంలో ఉదయం నుంచి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ర్యాంకుల వారీగా హాజరై అధికారుల వద్ద తమ సర్టిఫికెట్లను అందజేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కేటగిరీలో శనివారం ఆంగ్లో ఇండియన్స్, క్రీడా విభాగంలో 10000 ర్యాంకు వరకూ విద్యార్దులు హాజరయ్యారు. సోమవారం వరకూ మిగిలిన ర్యాంకులతో పాటు ఇతర విభాగాలైన ఎన్సీసీ, దివ్యాంగులు, ఆర్మీ, పీఎంసీ విభాగాల విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం
-
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ - ఈ నెల 15న ర్యాంకుల వెల్లడి - 17 నుంచి 20 వరకు వెరిఫికేషన్ - ఆ వెంటనే వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ - అడ్మిషన్లకు నెలరోజుల గడువు కోరుతూ సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15న ఎంసెట్-3 ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో తమ ఆప్షన్లను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా వైద్య సీట్ల భర్తీ పూర్తి కావాల్సి ఉన్నందున.. వెరిఫికేషన్‌కు తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు వచ్చే నెలాఖరుకు సమయం ఇస్తే ఆ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు గడువుపై తీర్పు ఇచ్చే వరకు వేచి చూడకుండా వేగంగానే సీట్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. అడ్మిషన్లకు నెల రోజులు గడువు కోరుతూ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకు కూడా నేడో రేపో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నోటిఫికేషన్ జారీకానుంది. వెరిఫికేషన్ కేంద్రాలు ఇవీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 4, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ పీజీఆర్ఆర్సీడీఈ కేంద్రం, మారేడుపల్లిలోని ప్రభుత్వ ప్రింటింగ్ టెక్నాలజీ సంస్థ, గగన్‌మహల్‌లోని ఎ.వి.ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజీ, కూకట్పల్లి జేఎన్టీయూలో, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో నిర్వహిస్తారు. వెరిఫికేషన్ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ వారికి జేఎన్టీయూలో, నాన్ లోకల్ వారికి విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీలో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు వెరిఫికేషన్ సందర్భంగా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.వెయ్యి చెల్లించాలి. ఈ ఆరు కేంద్రాల్లో ఏ రోజు ఎన్ని ర్యాంకుల వారు హాజరుకావాలో నోటిఫికేషన్లో ప్రస్తావించారు. 17న 1 నుంచి 2 వేల వరకు ర్యాంకులు పొందిన అభ్యర్థులు హాజరుకావాలి. 18న 2,001 నుంచి 4,500 ర్యాంకుల వరకు, 19న 4,501 ర్యాంకు నుంచి 9 వేల ర్యాంకు వరకు హాజరుకావాలి. చివరిరోజు 20న 9 వేల ర్యాంకులకు పైబడిన వారు హాజరుకావాలి. -
20న విశాఖలో డీ పార్మశీ విద్యార్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన
ఎచ్చెర్ల: జిల్లాలోని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళలు పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్ల ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు కళాశాలల్లో డీ ఫార్మశీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 20న విశాఖపట్నంలోని కంచరపాలేం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో జరగనుంది. ఇక్కడ ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.త్రినాథరావు తెలిపారు. గతం లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు హా జరు కావాలని సూచించారు. ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం, విద్యార్థులు కళాశాలల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఒకే రోజులు పత్రాలు పరిశీలిస్తారని తెలిపారు. ఒరిజనల్ ధృవీ కరణ పత్రాలు, జిరాక్సు పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు హాజరు కావాలని సూచించారు. -
ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల : ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ ఏడాది ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. తొమ్మిది మంది విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 8 మంది, ఎస్సీ, ఎస్సీ కేటగిరిలో ఒకరు హాజరయ్యారు. ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపు ఆఫీసర్ ఆర్.త్రినాధరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. -
మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ నో
కోర్టుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: తమ విద్యార్థుల కోసం మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మరోసారి నిర్వహించాలని తెలంగాణ సర్కారు చేసిన విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ మెడికల్ ఎంసెట్‌లో అనేక మంది తెలంగాణ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. వీరు తెలంగాణ ఎంసెట్-2లోనూ టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు. దీంతో తెలంగాణలోనే సీట్లు వస్తాయని భావించిన విద్యార్థులు.. ఏపీ మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశమున్నా వదులుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌కు ముందుగా నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు చాలామంది తెలంగాణ విద్యార్థులు హాజరుకాలేదు. అయితే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకై.. పరీక్ష రద్దు కావడంతో వారి పరిస్థితి తలకిందులైంది. తమకు ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చినందున అక్కడి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డిని కోరారు. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. పరిశీలిస్తానని కామినేని హామీ ఇవ్వడంతో కాళోజీ వర్సిటీ వీసీ.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజుకు లేఖ రాశారు. అయితే తెలంగాణ విద్యార్థుల కోసం మరోసారి వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వలేమని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎన్టీఆర్ వర్సిటీ నుంచి తిరస్కరణ జవాబు వచ్చిందని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కోర్టుకు వెళ్లాలని సూచన..: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తిరస్కరించడంతో ఏం చేయాలన్న దానిపై కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే కౌన్సెలింగ్ ఇంకా పూర్తికాలేదని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే తాము కోరుతున్నామని, దీన్ని మానవతాదృక్పథంతో పరిశీలిస్తే బాగుండేదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.పైగా ఈ నెల 6, 7, 8 తేదీల్లోనే కౌన్సెలింగ్ ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సూచిస్తోంది. -
టి-మెడికల్ అభ్యర్థులకు ఏపీ వెసులుబాటు
హైదరాబాద్: మెడికల్ సీట్ల భర్తీకి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను తమ విద్యార్థుల కోసం మరోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. లక్ష్మారెడ్డి విన్నపానికి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. ఎంసెట్-2 రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కామినేనితో లక్ష్మారెడ్డి మాట్లాడాక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి శనివారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రవిరాజుకు లేఖ రాశారు. అయితే అంగీకారం తెలుపుతూ అక్కడి నుంచి అధికారికంగా సమాచారం రాలేదని తెలిసింది. ఏపీలో మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ 6, 7, 8 తేదీల్లో జరుగనుంది. ఆ లోపు తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాల్సివుంటుంది. ఇక్కడ వస్తుందనుకుని అక్కడ వదులుకున్నారు.. తెలంగాణ ఎంసెట్-2లో మెడికల్ టాప్ ర్యాంకులు సాధించుకున్న విద్యార్థులు అనేక మంది ఏపీ ఎంసెట్‌లోనూ టాప్ ర్యాంకులు పొందారు. ఏపీ ఎంసెట్ కంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు అక్కడి సీట్లను వదులుకోవానలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ విద్యార్థులు అనేకమంది హాజరుకాలేదు. దురదష్టవశాత్తు ఏపీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఊహించని రీతిలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇది విద్యార్థులకు పిడుగుపాటు అయింది. ఏపీలో సీటును వదులుకోవడం.. తెలంగాణలో ఎంసెట్-2 రద్దుతో రెండు చోట్లా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఏపీలో ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగియలేదు. కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి. వెరిఫికేషన్‌లో పాల్గొనని కొందరు విద్యార్థులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వీసీ కరుణాకర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 15 శాతం సీట్లలో ఓపెన్ కాంపిటీషన్.. ఏపీలో ఉన్న మెడికల్ సీట్ల మొత్తంలో 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ లో పొందే వీలుంది. ఆ ప్రకారం తెలంగాణకు చెందిన ఏపీ ఎంసెట్ టాప్ ర్యాంకర్లు కౌన్సిలింగ్ లో సీట్లు పొందొచ్చు. తెలంగాణ ఎంసెట్-2లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అనేకమంది ఏపీ కౌన్సిలింగ్ కు హజరుకాలేదు. దీంతో ఇప్పుడు ఆ సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు మాత్రం తమ రాష్ట్ర విద్యార్థుల సీట్లకు కోత పడతాయన్న ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరుతోంది. -
ఇదేం విచారణ ?
ఫోన్లో సమాచారం తీసుకుంటే సరిపోతుందా బాధితులను కలిసిన సందర్భమే లేదు ఎంసెట్–2 లీకేజీపై బాధిత తల్లిదండ్రుల పెదవి విరుపు ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు? పరకాల : ఎంసెట్–2 పేపర్ లీకేజీపై సీఐడీ కొనసాగిస్తున్న విచారణ పట్ల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని ఆధారాలతో బయటపెట్టినా నామమాత్రపు విచారణే చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బాధితులను, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సైతం కలిసిన సందర్భాలు లేవని, లీకేజీ వ్యవహారంలో పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలను సందర్శించిన దాఖాలు లేవని అంటున్నారు. మొక్కుబడి విచారణ జరిపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్–2లో తమ పిల్లలతోపాటే కోచింగ్ తీసుకొని పరీక్షకు సరిగ్గా వారం రోజుల ముందే రహస్య ప్రాంతాలకు తరలిపోవడం, తమకు తెలియని ప్రాంతంలో పరీక్షకు హాజరు కావడం, ఫలితాల్లో మార్కులతోపాటు ర్యాంకులు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసి తాము నిజాయితీతో విచారణ జరిపించామనే వాదనను వినిపించడం కోసం తాత్కాలికంగా అలా ప్రకటన చేశారని కొందరు చెబుతున్నారు. ఎక్కడో ఉండి ఫోన్లో సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకున్నారని, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో నుంచి ర్యాంకుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి వివరాలు సేకరించలేదని చెబుతున్నారు. ఎంసెట్–2లో లీకేజీపై లోతైన విచారణకు అధికారులు దూరంగా ఉన్నట్లు తెలుస్తుందని ఓ బాధిత విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. విచారణను నిష్పాక్షపాతంగా జరిపించడం కోసం అవసరమైతే ప్రత్యక్ష్యంగా ఆందోళన చేపడుతామని చెబుతున్నారు. ఇప్పటికే ఎంసెట్–2లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి నిరసన తెలుపాలని భావిస్తున్నారు. –ప్రైవేటులో చేద్దామని దళారుల చేతికి డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. తమ పిల్లలను ఎలాగైన ఎంబీబీఎస్ చదివించాలనే లక్ష్యంతో కొందరు విద్యార్థుల తండ్రులు దళారులను ఆశ్రయించారని తెలుస్తోంది. డబ్బుకు కొదవ లేని ఆ కుటుంబాలు.. దళారులు అడిగినంత డబ్బు సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేటులో లక్షలు ఖర్చవుతాయని, అవే డబ్బులు తమకిస్తే గవర్నమెంటు సీటు లభిస్తుందని చెప్పిన దళారుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంసెట్–2లో జరిగిన అక్రమాల వల్ల తమ పిల్లలకు మంచి ర్యాంకులు రాలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో చివరకు సర్టిఫికెట్ల పరిశీలన వాయిదాపడే వరకు వెళ్లింది. కానీ ఎంసెట్–2లో ఫలితాలను తారుమారు చేసిన బాధ్యులను ఇంకా గుర్తించలేదు. -
24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్
కమాన్‌చౌరస్తా: ఎంసెట్ తుది దశ కౌన్సిలింగ్ ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎంసెట్ మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ బుధవారం తెలిపారు. గతంలో హాజరుకానీ అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. 24, 25 తేదీల్లో వె»Œ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 27న జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చలానా గడువు నేటితో ఆఖరు ఇంజినీరింగ్ మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులకు ఎస్బీహెచ్లో చలానా చెల్లించడానికి గురువారంతో గడువు ముగియనుందని మహిళా పాలిటెక్నిక్ సహాయ కేంద్రం కోఆర్టినేటర్ బి.రాజ్‌గోపాల్ తెలిపారు. కళాశాలలో చేరేందుకు ఈ నెల 22వరకు గడువు ఉందని పేర్కొన్నారు. నేడు బ్రాహ్మణ సంఘం సమావేశం కరీంనగర్‌సిటీ : అఖిల బ్రాహ్మణ సేవాసంఘం జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం గురువారం కరీంనగర్‌లోని శ్రీగణేశ శారద శంకరమఠంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా, నగర కన్వీనర్లు బ్రహ్మన్నగారి బ్రహ్మయ్య, పురాణం మహేశ్వరశర్మ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి బీ-ఫార్మసీ కౌన్సెలింగ్
15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 వరకు వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు 20న సీట్లు కేటాయించనుంది. రాష్ట్రంలోని 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఫార్మసీలో 2,060, ఫార్మ్-డీలో 330, బయో టెక్నాలజీలో 42 సీట్లు భర్తీ చేయనుంది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్, కులం, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఇదీ షెడ్యూల్.. 15న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 15, 16న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16, 17న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17,18న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 18న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు. ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు.. మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం (రుద్రంపూర్), వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్‌లోని బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చందూలాల్ బారాదరిలోని క్యూ క్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా భవన్. -
14,721 పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
- నోటిఫికేషన్ జారీ.. - ‘స్పాట్’లో చేరే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిపోయిన 14,721 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు పాలిసెట్ ప్రవేశాల కమిటీ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాలేజీల వారీగా ఖాళీల వివరాలను ఈనెల 14న పాలిసెట్ వెబ్సైట్లో (్టటఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ) వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు విద్యార్థులు 14 నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, సంబంధిత విద్యా సంస్థల్లో 20వ తేదీన స్పాట్ అడ్మిషన్లను నిర్వహించాలని తెలిపింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 12న తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్పాట్ అడ్మిషన్లలో భాగంగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. కాగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కాకముందే ప్రభుత్వ కౌన్సెలింగ్‌ను ముగించి, స్పాట్ అవకాశం ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారు స్పాట్లో పాలిటెక్నిక్‌లో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు 13 వరకు పెంపు... ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రవేశాల కమిటీ పొడిగించింది. అన్ని ర్యాంకుల వారిలో ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు తాజాగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారు మార్పులు చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. అవసరమైతే 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 16న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 68,186 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 65,297 మంది 32,33,074 వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేపు ఈసెట్ సీట్ల కేటాయింపు పాలిసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ఈనెల 12న ప్రకటించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 16,786 మందిలో 8,703 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు పేర్కొన్నారు. -
25 నుంచి ఓయూ పీజీ తరగతులు
ఓయూ పరిధిలో ఈ నెల 25 నుంచి వివిధ పీజీ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 14 నుంచి జరిగే సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్‌లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో అడ్మిట్ కార్డునును అందచేయాలి. ఇదిలా ఉండగా ఓయూసెట్-2016 కౌన్సెలింగ్‌లో భాగంగా వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు పొందిన 16 వేల మంది విద్యార్థుల మొదటి జాబితాను ప్రకటించారు. సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 14 నుంచి 20 వరకు ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టీఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. ఈ ఏడాది ఆదాయం సర్టీఫిక్కెట్ గల అభ్యర్థులు రూ.700 ఫీజును, సర్టీఫిక్కెట్లు లేని అభ్యర్థులు పూర్తి ఫీజును చెల్లించాలని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు, ఒరిజినల్ టీసీతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంటతెచ్చుకోవాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు
- ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 61.03 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరు - గతేడాది హాజరైనవారు 72.53 శాతం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరేందుకు రాష్ట్రంలో 63,777 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. జూన్ 22 నుంచి శుక్రవారం వరకు ఎంసెట్‌లో అర్హత సాధించి, ర్యాంకులు పొందిన 1,04,500 మంది విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసే వరకు 63,777 మంది విద్యార్థులు మాత్రమే (61.03 శాతం) వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. గతేడాది కంటే తక్కువే.. గతేడాది కంటే ఈ సారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారి సంఖ్య తగ్గింది. గతేడాది మొత్తం అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యతో పోల్చితే వెరిఫికేషన్‌కు హాజరైన వారి శాతం బాగా తగ్గిపోయింది. గత ఏడాది ఎంసెట్‌లో 91,556 మంది అర్హత సాధించగా అందులో 66,410(72.53 శాతం) మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ సారి 1,04,500 మంది అర్హత సాధించినా 63,777(61.03 శాతం) మందే వెరిఫికేషన్‌కు హాజరు కావడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యతో కలుపుకుని 72.53 శాతం మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ర్యాంకులు పొందిన 6,618 మందిని కలుపుకున్నా గతేడాది కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. వెబ్సైట్లో వివరాలు కాలేజీలవారీగా చివరి ర్యాంకు వివరాలు, కోర్సు, కేటగిరీ, జెండర్‌వారీగా గత ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను తమ వెబ్సైట్లో (https://tseamcet.nic.in) అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్‌సైట్‌లోని ఆ వివరాలను పరిశీలించి, ఓ అవగాహనకు వచ్చాకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ వారికి 5 నుంచి.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రవేశాల విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు మొదటి దశ వెబ్ ఆప్షన్లలోనే ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఇంజనీరింగ్ ఫీజుల జీవో! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. శుక్రవారం జరిగిన ప్రవేశాలు, ఫీజుల నియం త్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సమావేశంలో కాలేజీల వారీగా ఫీజులను నిర్ణయించారు. ఫీజుల ప్రతిపాదనలను శుక్రవారం సాయంత్రమే ప్రభుత్వానికి పంపడంతో శనివారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపిస్తే ఆదివారం లేదా సోమవారాల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన ఏఎఫ్ఆర్సీ సమావేశంలో సీబీఐటీ కాలేజీ ఫీజును గతంలో ఉన్నట్లు రూ.1,13,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొదట్లో తమ కాలేజీ ఫీజును రూ.2.59 లక్షలకు పెంచాలని యాజమాన్యం ప్రతిపాదనలు పంపించింది. కాలేజీ ఆదాయ వ్యయాలను పరిశీలించిన ఏఎఫ్ఆర్సీ మొదట కాలేజీ వార్షిక ఫీజు రూ.1,09,000గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరించలేదు. చివరకు యాజమాన్యం వివరణలు పరిశీలించాక రూ. 1,13,500గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరిస్తూ సంతకం చేసినట్లు తెలిసింది. -
22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
♦ నోటిఫికేషన్ జారీ.. షెడ్యూల్ విడుదల ♦ జూలై 1 వరకు సాగనున్న ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి జూలై 1 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు షెడ్యూల్‌ను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన 1,03,923 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తరువాత ప్రకటి స్తామని కమిటీ పేర్కొంది. ప్రతి రోజూ రెండు దఫాలుగా వెరిఫికేషన్ చేపడతామని వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తేదీలు, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో పొందుపరిచింది. వెరిఫికేషన్ కోసం తీసుకురావాల్సిన సర్టిఫికెట్లతోపాటు ఇతర వివరాలనూ అందులో పేర్కొంది. జేఎన్టీయూహెచ్ నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధించిన సమాచారం అందకపోవడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. జూలై 15 తరువాతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు... వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజును పెంచాలని (ఏపీలో పెంచడంతో) కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు రూ. 100, బీసీ, ఓసీ విద్యార్థులకు రూ. 200 మేర పెంచింది. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రిజిస్ట్రేషన్‌కు రూ. 500, బీసీ, ఓసీ విద్యార్థులు రూ. 1,000 చెల్లించాల్సి రానుంది. యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే కాలేజీలు, సీట ్ల సంఖ్య ఖరారైనందున ఏఐసీటీఈ అనుమతిచ్చిన కాలేజీలు, సీట్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది. అలాగే వెబ్ ఆప్షన్లు ప్రారంభించే లోగా కాలేజీల జాబితాలు, వాటిల్లో ఫీజుల వివరాలు ఏఎఫ్ఆర్సీ ఇవ్వాలని సూచించింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఎఫ్ఆర్సీ భేటీ వాయిదా బుధవారం జరగాల్సిన ఏఎఫ్ఆర్సీ సమావేశం ఈ నెల 22కు వాయిదా పడింది. ఆ రోజు కాలేజీలవారీగా ఫీజులను ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ఎన్సీసీ, వికలాంగులు, స్పోర్ట్స్ తదితర స్పెషల్ కేటగిరీల వారికి మాసబ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుంది. తేదీల వారీగా, ర్యాంకుల వారీగా వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వివరాల పరిశీలన పరీక్ష సమయంలో సేకరించిన విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పోల్చి చూడాలి. ఇక పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోని విద్యార్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వారి నుంచి బయోమెట్రిక్ వివరాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సిబ్బంది తీసుకోవాలి. అలాగే విద్యార్థుల నుంచి తానే ఆ విద్యార్థి అని అండర్‌టేకింగ్ తీసుకోవాలి. ఆధారాలు పరిశీలించాలి. ఈసారి విద్యార్థుల ఆధార్ నెంబరు తీసుకోవాల్సిందే. వెరిఫికేషన్ సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. ♦ వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్లు ♦ ఎంసెట్ ర్యాంకు కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ♦ ఆధార్ కార్డు, పదో తరగతిమార్కుల మెమో, ♦ ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, ♦ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2016 జనవరి 1వ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్ (ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారికి), కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (వర్తించే వారు), నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తెలంగాణలో ఉన్న పదేళ్ల కాలానికి నివాసం సర్టిఫికెట్, ♦ విద్యా సంస్థల్లో రెగ్యులర్‌గా చదవని వారి నివాసం సర్టిఫికెట్. -
22 నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
- అందుకు అనుగుణంగా చర్యలు - చేపట్టాలని కడియం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 22వ తేదీ నుంచే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూహెచ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ విభాగం తనిఖీలు పూర్తి చేసి జేఎన్టీయూహెచ్ నివేదికలతో సరిపోల్చి అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని, నెలాఖరులో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశంపై వారం తర్వాత మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు తెలిసింది. -
22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి చౌటుప్పల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాబ్ మేళాను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి, జూలై మొదటి వారంలో మొదటి విడత కౌన్సెంగ్ను, రెండో వారంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామన్నారు. ఆగష్టు 15వ తేదీ నుంచి కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్సు తనిఖీలు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు నడుపుతున్న కళాశాలలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సమావేశంలో జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జగ్మోహన్దాస్, కళాశాల చైర్మన్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
ఈసారి మిగిలేవెన్నో?
* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ‘గుర్తింపు’ గుబులు * 237 కాలేజీల విజ్ఞప్తుల మేరకు పునః పరిశీలన * ఈనెల 28న సాయంత్రానికి సీట్లు,కాలేజీలపై స్పష్టత * ఆ తరువాతే విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. 2015-16లో ప్రవేశాలు చేపట్టేందుకు ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుంది, ఎన్ని కాలేజీలను పక్కన పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా గతేడాది 145 కాలేజీలకే గుర్తింపు ఇచ్చిన హైదరాబాద్ జేఎన్టీయూ.. వివిధ లోపాల కారణంగా 143 కాలేజీలను నిరాకరించింది. ఆ కాలేజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నా.. మరోసారి చేసిన తనిఖీలోనూ లోపాలు బయటపడడంతో మిన్నకుండిపోయాయి. ఈసారి వాటిలోని పలు కాలేజీలు లోపాలను సరిదిద్దుకున్నాయి. అయితే ఈసారి దాదాపు 150 కాలేజీలు, లక్ష సీట్లకే గుర్తింపును పరిమితం చేస్తారన్న ఊహాగానాలతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఏదో ఒక లోపం.. జేఎన్టీయూహెచ్ తమ పరిధిలోని 237 కాలేజీల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, రెండు రోజుల్లో వాటిని సవరించుకోవాలంటూ ఈనెల 9న నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పలు కాలేజీలు.. గతేడాది చూపిన లోపాలను సవరించుకున్నామని, ఇప్పుడు మళ్లీ లోపాలు ఉన్నాయని, అదీ రెండు రోజుల్లో సవరించుకోవాలని అంటే ఎలాగంటూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాలేజీలు నోటీసులపై ఈనెల 20 నాటికి జేఎన్టీయూకు అప్పీలు చేసుకోవాలని.. జేఎన్టీయూ వాటిపై ఈనెల 28 నాటికి పరిశీలన జరిపి పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాలేజీల నుంచి శనివారం వరకు అప్పీళ్లు స్వీకరించిన జేఎన్టీయూహెచ్.. సోమవారం నుంచి పరిశీలన జరపనుంది, ఆయా లోపాలపై ఏం సమాధానం ఇచ్చారు, ఏయే చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా కాలేజీల్లో మళ్లీ పరిశీలన జరుపనుంది. ఈ ప్రక్రియను ఈనెల 28 నాటికి పూర్తి చేసి.. అనుబంధ గుర్తింపు లభించే కాలేజీలు, సీట్ల వివరాలను వెల్లడించనుంది. ఆ తర్వాత ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇప్పటికే 51 కాలేజీలు మూత జేఎన్టీయూహెచ్ పరిధిలో 288 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఈసారి గుర్తింపు కోసం 237 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లెక్కన 51 కాలేజీలు మూతపడి, వాటిలోని దాదాపు 30 వేల సీట్లు ఈసారికి లేనట్లే. ఇక ఈనెల 28 వరకు చేపట్టనున్న పునః పరిశీలనలో ఎన్ని కాలేజీల్లో లోపాలు బయట పడతాయి, ఎన్నింటికి గుర్తింపు రద్దుచేస్తారు, ఎన్నింటిలో బ్రాంచీలను రద్దు చేస్తారన్న విషయంపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆదివారం సమావేశమై చర్చించాయి. విద్యార్థులూ తక్కువే! ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1.28 లక్షల మంది హాజరుకాగా.. అందులో 90,556 మందే అర్హత సాధించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆదివారం వరకు 60 వేల ర్యాంకు వరకు పిలవగా.. 45 వేల మందే హాజరయ్యా రు. ఇంకా 2 రోజులు వెరిఫికేషన్ గడువు ఉన్నందున మరో 15 వేల విద్యార్థులు రావొచ్చని అధికారులు భావి స్తున్నారు. ఈ లెక్కన ఈసారి 60 వేల నుంచి 65 వేల మంది మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది. -
నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నేటి నుంచి (18వ తేదీ) 23 వర కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది. ప్రతిరోజూ రెండు దశలుగా వెరిఫికేషన్‌ను కమిటీ చేపట్టనుంది. ఉదయం 9 గంటలకు తొలిదశ వెరిఫికేషన్, మధ్యాహ్నం 12:30 గంటలకు రెండో దశ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ల వెరి ఫికేషన్ చేపట్టే హెల్ప్‌లైన్ కేంద్రాలు, ఇతర పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (tseamcet. nic.in) పొందవచ్చని కమిటీ పేర్కొంది. విద్యార్థులకు సూచనలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి. అలా గే ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం మొదలైనవాటిని వెంట తెచ్చుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 400 చెల్లిం చాలి. వికలాంగులు, ఎన్సీసీ కోటా, ఆంగ్లో-ఇండియన్, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు 18 నుంచి 23 వరకు ర్యాంకులవారీగా నిర్ణీత కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ, ఎస్టీ విద్యార్థులకు వేర్వేరుగా హెల్ప్లైన్కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివరాలను వెబ్సైట్లో (tseamcet. nic.in) పొందవచ్చు. -
టీఎస్ ఎంసెట్-2015 వెబ్ కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం)- 2015 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన 1,04,373 అభ్యర్థులకు.. పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఎంత కృషి చేశారో.. అంతే స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై, వెబ్ ఆప్షన్స్ ఎంపికలో అప్రమత్తతో వ్యవహరిస్తూ సరైన కాలేజీని, కోర్సును ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ విషయంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలు.. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలి దశ అయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేడు ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ ర్యాంకుల ప్రకారం పేర్కొన్న హెల్ప్‌లైన్ సెంటర్లకు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాలి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నిటిని ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆ హెల్ప్‌లైన్ సెంటర్లలోనే హాజరు కావాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు: ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లో మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి: వెబ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవుతున్న అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు.. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ ఇంటర్మీడియెట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో నాన్ లోకల్ విద్యార్థులై, తల్లిదండ్రులు పదేళ్లుగా తెలంగాణలో నివసిస్తుంటే సంబంధిత రెసిడెన్స్ సర్టిఫికెట్ 2015, జనవరి 1 తర్వాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు.. నిర్దేశిత అధికారులు జారీచేసిన సర్టిఫికెట్లు. ఒరిజినల్ కాపీలతోపాటు రెండు సెట్ల జి రాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. రిజిస్ట్రేషన్ టు వెబ్ ఆప్షన్స్: సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరవ్వాలి. నిర్దేశిత ఫీజు చెల్లించి (ఓసీ/బీసీ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.400) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత తమ ర్యాంకును పిలిచినప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ వద్ద తమ ధ్రువపత్రాలను తనిఖీ చేయించుకుని రిసీట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫామ్ తీసుకోవాలి. అందులోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దీని ఆధారంగానే తదుపరి దశలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి వీలవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ: సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు తమ ర్యాంకుల ఆధారంగా నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో ఆప్షన్స్ (కాలేజీ, కోర్సుల ప్రాధాన్యతలు) ఇచ్చే అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించి దశల వారీ ప్రక్రియలు.. ముందుగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయాలి. తర్వాత తమ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలతో పాస్వర్డ్ జనరేట్ చేసుకోని లాగ్ అవుట్ అవ్వాలి. తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసి.. తాము సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు పంపిన లాగిన్ ఐడీ, తాము జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ వివరాలు పొందుపరిచి డిస్ప్లే ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ బటన్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు కళాశాలలు, కోర్సుల వివరాలతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ఆధారంగా వాటిని పూరించాలి. ఇలా ఎన్ని ఆప్షన్లయినా ఇవ్వొచ్చు. ఎలాంటి పరిమితి లేదు. అన్ని ఆప్షన్లు ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ లాగ్ అవుట్, కన్ఫర్మ్ అండ్ లాగ్ అవుట్ బటన్లపై క్లిక్ చేస్తే తాము ఇచ్చిన ఆప్షన్లతో కూడిన ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకుని లాగ్ అవుట్ అవ్వొచ్చు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఎన్నిసార్లయినా లాగిన్ అయి ఆప్షన్లు మార్చుకోవచ్చు. అదే విధంగా ఆప్షన్ల ఎంట్రీ తేదీలు ముగిసిన తర్వాత కూడా తాము ఇచ్చిన ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లాలి. సీట్ అలాట్మెంట్ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, వారి ర్యాంకు అందుబాటులో సీట్లు ఆధారంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దీనికి నిర్దేశిత తేదీలు ప్రకటిస్తారు. ఆ తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకొని, సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్లో లేదా అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత కళాశాలలో చేరినప్పుడు మాత్రమే ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. తొలి దశలో సీటు లభించి రిపోర్ట్ చేసినా మలి దశ కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనొచ్చు. ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్ ఎంపిక అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి సమయం అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీ, బ్రాంచ్ విషయంలో కసరత్తు చేయాలి. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. కళాశాలలకు సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా అభ్యర్థులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందే ఉంటుంది. కాబట్టి వాటిని వెల్లడించగానే సదరు కళాశాలల నాణ్యత, ప్రమాణాల గురించి పరిశీలించి మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి. పీజీ కోర్సులు కూడా ఉన్న కళాశాలలైతే ల్యాబ్స్, ఫ్యాకల్టీ పరంగా మరింత సదుపాయాలు ఉంటాయి. - ప్రొఫెసర్ ఎన్.వి.రమణ రావు, టీఎస్ ఎంసెట్-2015 కన్వీనర్. -
ఘోర రోడ్డు ప్రమాదం
బీఈడీ కళాశాల బస్సును ఢీకొన్న లారీ ప్రిన్సిపాల్ మృతి, 13 మందికి గాయాలు మదనపల్లెక్రైం: మదనపల్లె కొత్త బైపాస్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఈడీ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో ప్రిన్సిపాల్ మృతి చెం దారు. 13 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అంగళ్లు సమీపంలోని విశ్వం విద్యా సంస్థల్లోని బీఈడీ కళాశాల విద్యార్థుల రికార్డులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కళాశాల ప్రిన్సిపాల్, 8 మంది అధ్యాపకులు కళాశాల బస్సులో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరారు. ఉదయం 10.30 గంటల సమయంలో తట్టివారిపల్లె సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డు కూడలిలో పుంగనూరు రోడ్డు నుంచి అంగళ్లు వైపు వేగంగా వెళుతున్న లారీ బస్సును ఢీకొంది. బస్సు అవతలి రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. లారీ అవతలి వైపు రోడ్డు డివైడర్ ఎక్కి ఆగిపోయింది. ఈ ఘటనలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ఎండీ.షరీఫ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. అధ్యాపకులు అనంతప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి , రామకృష్ణ, మహేంద్ర, విశ్వనాథ్, వెంకటరవిశంకర్, విజయలక్ష్మి, ఆమె భర్త నాగేంద్ర, విద్యార్థి రాఘవేంద్ర, బస్సుడ్రైవర్ ఖలీల్, క్లీనర్లు శశికుమార్, రెడ్డిశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో రాఘవేంద్ర, వెంకట రవిశంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరితోపాటు రామకృష్ణ, మహేంద్రను బెంగళూరుకు రెఫర్ చేశారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు తొలగించడమే కారణం.. బైపాస్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతుండడంతో ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. ఎందుకనో వారం రోజుల క్రితం ఆ స్పీడ్ బ్రేకర్లను తొలగించారు. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు ధర్నా చేశారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. -
ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం
ప్రొవిజనల్ సర్టిఫికెట్ తెస్తేనే వెరిఫికేషన్ అంటున్న అధికారులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యార్థులు హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తేవడం లేదనే సాకుతో అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వె రిఫై చేసేందుకు హెల్ప్ లైన్ కేంద్రాల్లోని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 269 పీజీ ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. పీజీఈసెట్ రాసిన విద్యార్థులకు 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన ఫీజులను విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొదట్లో యాజమాన్యాలు మెలిక పెట్టిన నేపథ్యంలో సర్టిఫికెట్లు లేకపోయినా, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో చేసేదేమీ లేక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇపుడు విద్యార్థులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని అధికారులే ఇబ్బందులు పెడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాకుండా సంబంధిత యూనివర్సిటీ జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకురాలేదనే సాకుతో వెరిఫికేషన్‌కు తిరస్కరిస్తుండటంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ సర్టిఫికెట్ తరువాత అందజేసేందుకు వీలు కల్పించాలని, మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆప్షన్లు ఇచ్చిన 31వేల మంది
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆది, సోమవారాల్లో 31,600 మంది విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు 32,272 మందికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 31,600 మంది నమోదు చేసుకున్నారు. ఇక సోమవారం 75,001వ ర్యాంకు లక్ష ర్యాంకు వరకు 9,935 మంది విద్యార్థులను సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 6,627 మంది హాజరయ్యారు. మొత్తం ఒకటి నుంచి లక్షర్యాంకు వరకు 41,595 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 29,351 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. 24న పాలిసెట్ సీట్లు కేటాయింపు,ఆప్షన్ల మార్పునకు అవకాశం పాలిసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. గతంలో వెరిఫికేషన్‌కు హాజరై ఆప్షన్లు ఇవ్వని వారు ఇపుడు ఆప్షన్లను ఇవ్వవచ్చు. ఒకటి నుంచి 76 వేల ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 22న, 76,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చు. ఇక ఈనెల 24న రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తారు. ఆ వివరాలు జ్ట్టిఞట://ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని తరువాతి దశ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. ఈసెట్ ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం, 22న సీట్ల కేటాయింపు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు ఇపుడు మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వారు కూడా ఇపుడు ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు ఈనెల 20, 21 తేదీల్లో ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల క్యాంపు ముఖ్యాధికారి రఘునాథ్ తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ మార్పులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
వెబ్ ఆప్షన్లపై తస్మాత్ జాగ్రత్త
శాతవాహన యూనివర్సిటీ: జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరవుతున్నారు. కొందరు విద్యార్థులు గతంలో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికె ట్ల పరిశీలనతోనే ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం కాదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలిన ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ నితిన్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాంబయ్య సూచిస్తున్నారు. ఆదివారం నుంచే వెబ్ఆప్షన్లు ప్రారంభ మ య్యా యి.సందేహాలుంటే 9666670193నిసంప్రదించొచ్చు. కొత్తగా వన్ టైం పాస్వర్డ్.. గతంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టడానికి స్క్రాచ్ కార్డు ఇచ్చేవారు. అందులోని సీక్రెట్ కోడ్ ద్వారా విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేవారు. కానీ దీనిలో పీఆర్వోల జోక్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు విన్పించాయి. దీంతో ఈసారి పీఆర్వోలకు చెక్ పెడుతూ రాష్ర్ట ఉన్నత మండలి.. వన్‌టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ తెచ్చింది. ఈ విధానంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థి ఇచ్చే ఫోన్ నంబరే కీలకం. ఒకసారే ఉపయోగించకునేలా ఒక సీక్రెట్ పాస్వర్డ్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వస్తుంది. ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించుకుని విద్యార్థి నచ్చిన కోర్సులో... కోరుకున్న కళాశాలలో చేరొచ్చు. కాబట్టి విద్యార్థి తన ఫోన్ నెంబర్విషయంలో గోప్యతను పాటిస్తూ కౌన్సెలింగ్ సెంటర్లో ఇవ్వాలి. విద్యార్థి ఎంచుకునే ఆప్షన్లను లేదా కళాశాలను మార్చాలనుకున్న మళ్లీ వన్‌టైం పాస్వర్డ్ మొదటి ఇచ్చిన నంబర్‌కు మాత్రమే వస్తుంది. తమ కళాశాలలో చేర్చుకోవడానికి యత్నించే పీఆర్వోలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన వారికి తాయిలాలిచ్చేందుకూ పలు కళాశాలల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు.... ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల, ఉజ్వల పార్క్ సమీపంలోని పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ ఆప్షన్లను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్తో కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 17, 18వ తే దీల్లో 1 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 20, 21 తే దీల్లో 50001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 22, 23 తేదీల్లో 100001 వ ర్యాంకు నుంచి 1,50, 000 ర్యాంకు వరకు, 24, 25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల మొదట ఉంచిన ఆప్షన్లు మార్చాలనుకుంటే 26 వ తే దీన 1 వ ర్యాంకు నుంచి లక్ష లోపు ర్యాంకులు ఉన్న వాళ్లు, 27న లక్ష ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు వారి ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ నెల 30న విద్యార్థులకు ఏ కళాశాలల సీటు వచ్చిందనే మేసేజ్ వస్తుంది. సెప్టెంబర్ 1 సంబంధిత క ళాశాలకు వెళ్లి అన్ని విషయాలు కనుక్కోవచ్చు. విద్యార్థికి కళాశాల నచ్చకుంటే రెండో కౌన్సెలింగ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. తనిఖీలతో ఆరు కళాశాలలు ఔట్.? కౌన్సెలింగ్‌కు ముందు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 6 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి రద్దు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 12 ఇంజనీరింగ్ కళాశాలలకే వెబ్ ఆప్షన్ పెట్టాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అనుమతి రాని కళాశాలల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. వసతులు సమకూర్చి మళ్లీ అనుమతులను తెచ్చుకునేందకు ఆయా కళాశాల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్‌కు 699 మంది హాజరు ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లావ్యాప్తంగా 699 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సారార్ కళాశాల సెంటర్లో 348 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో 351 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 మంది ఉన ్నట్లు క్యాంపు ఆఫీసర్ తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
ఖమ్మం : ఎంసెట్ కౌన్సెలింగ్ బుధవారం జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 25 వేల లోపు ర్యాంకుల వారికి జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 505 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 401 మంది, భద్రాచలం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 39 మంది, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 65 మంది విద్యార్థులు హాజరయ్యారని ఖమ్మం సెంటర్ ఎంసెట్ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవని, తిరిగి ఈనెల 16న కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. శనివారం 25,001వ ర్యాంకు నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. ఈనెల 17 నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలో వివరించేందుకు కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు వెబ్ ఆప్షన్ సందర్భంగా తలెత్తే అనుమానాలు, ఇతర విషయాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో పలువురు విద్యార్థులు ఆయా పత్రాలను చూపించలేక పోయారు. ఈ విషయం కౌన్సెలింగ్ సెంటర్ అధికారుల దృష్టికి తీసుకరావడంతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని సర్టిఫికెట్లు పరిశీలించారు. -
అయోమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులు
కోదాడటౌన్ :వెంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదేనేమో.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మార్పుల కోసం జరుగుతున్న కసరత్తు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి లాటర్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు సంకటంగా మారింది. వీరు ప్రవేశం పొందే ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండవ సంవత్సరం తరగతులు ప్రారంభమై నెల రోజులు దాటింది. కానీ ఈసెట్ రాసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు నేటికీ సీట్లు అలాట్ కాకపోవడంతో అయోమయంలో పడిపోయారు. జిల్లాలో 8 మంది డిప్లమా విద్యార్థులు జిల్లాలో ఉన్న 46 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సుమారు 8400 మంది ఉన్నారు. డిప్లమా హోల్డర్స్‌గా పిలువబడే వీరు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. కాగా పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో మేలో ఈసెట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. జూన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ వెంటనే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చారు. ర్యాంక్ సాధించిన వారితో లాటరల్ ఎంట్రీ ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 700 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 48వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో తలెత్తిన వివాదం తో వీరికి నేటికీ సీట్లు కేటాయించలేదు. దీంతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. నెలరోజులుగా తరగతులు ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం తరగతులు జూలై 4వ తేదీ నుంచి జరగుతున్నాయి. వీరికి మొదటి సెమిస్టర్ తరగతులు అక్టోబర్‌లో పూర్తవుతాయి. ఆ వెంటనే పరీక్షలు నిర్వహించాలని యూనివర్శిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈసెట్ అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నది అధికారులకు కూడా తెలియడం లేదు. -
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది. ఈనెల 28 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ఇదిలాఉండగా, డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 28 నుంచి చేపట్టాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. 28వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని, 5వ తేదీన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై మూడో వారంలో ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గురువారం ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విద్యా కమిషనర్లు శైలజా రామయ్యర్, అజయ్‌జైన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, ప్రవేశాల క్యాంపు ప్రధాన అధికారి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 22నుంచే ప్రారంభించాలని ముందుగా భావించినా.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన పలు ఉత్తర్వులు (జీఓలు) వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. వాటికి యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్ రావాల్సి ఉంది. మేనేజ్మెంట్స్ కన్సార్షియంగా ఏర్పడి నిర్వహించుకునే సొంత పరీక్షపైనా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ ్యంలో 29వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టాలని, ఈలోగా ప్రభుత్వాలను సంప్రదించి అన్నింటికి ఉత్తర్వులు జారీ చేసేలా చ ర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 23 నుంచి; ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై మూడో వారంలో చేపట్టాలని నిర్ణయించారు. ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రవేశాల కమిటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల్లో ఒకరు కన్వీనర్‌గా, మరొకరు కో కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టేలా మండలి చైర్మన్‌కు అధికారాలు కల్పించారు. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
మెరిట్ అభ్యర్థులకు ఫోన్లో సమాచారం 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 29లోగా నియామకం భర్తీ కానున్న 65 వీఆర్ఓ, 94 వీఆర్ఏ పోస్టులు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రా మ రెవెన్యూ సహా యకులు (వీఆర్ఏ) ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను జ్డ్చీఝ్చఛ్చఛీ.జీఛి.జీ వెబ్సైట్లో పొందుపరిచారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 65, వీఆర్ఏ పోస్టులు 94 భర్తీ కానున్నాయి. వీఆర్వో ఫలితాల్లో దోమకొండకు చెందిన శ్రావణ్ కుమార్ చౌకీ (హెచ్.నెం.2281229911) 96 మార్కులు, నందిపేటకు చెందిన పృథ్వీరాజ్‌గౌడ్ 96 మార్కులు సాధించారు. వీఆర్ఏ ఫలితాల్లోనిజామాబాద్కు చెందిన డి. రామకృష్ణ (హెచ్.నం.218100235) 96 మార్కులు సాధించారు. మెరిట్‌లిస్టు-రోస్టర్ పాయింట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు నోటీసు ద్వారా, ఫోన్లో సమాచారం అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఈనెల 25న నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఇంటర్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. మాజీ సైనిక కుటుంబాల వారు, వికలాంగులు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మెరిట్ అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లతో హాజరుకావాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎంపికైన వారి వివరాల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మొబైల్ ద్వారా సమాచారం అందిస్తామని, లేదా ఎస్ఎంఎస్ చేస్తామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఈనెల 29లోగా ప్రాథమిక నియామకం ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున ఆలోగా వీఆర్ఏ, వీఆర్ఓ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఫోన్ ద్వారా సమాచారం అందించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపిస్తున్నారు. ఈనెల 2న పరీక్షలు జరిగాయి. వీఆర్వో పోస్టులకు 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది పరీక్ష రాశారు. వీఆర్ఏ పోస్టులకు 2823 దరఖాస్తు చేసుకోగా 2,518 మంది పరీక్షకు హాజరయ్యారు. పృథ్వీరాజ్గౌడ్కు మూడవ ర్యాంకు నందిపేట మండల కేంద్రానికి చెందిన తాడ్వాయి పృథ్వీరాజ్ గౌడ్ వీఆర్ఓ ఫలితాలలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించారు. విశ్వప్రసాద్ గౌడ్,నీలా దంపతుల కుమారుడైన పృథ్వీరాజ్‌గౌడ్ గత ఏడాది బిటెక్ పూర్తి చేశారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు నెలల క్రితం ప్రకటిం చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలలోనూ ఆయనకు జిల్లాలో మొదటి ర్యాంకు లభించింది. 20 రోజలు క్రితం రైల్వే శాఖలో గ్రూప్ ‘డి’ పోస్టుకు ఎంపికయ్యారు. ఇపుడు వీఆర్ఓ ఫలితాలలోనూ మూడవ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బంధుంవులు, మిత్రులు అభినందన లు తెలియజేశారు. -న్యూస్‌లైన్, నందిపేట ప్రతిభచాటిన శ్రావణ్‌కుమార్ వీఆర్ఓ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షలో దోమకొండ మం డల కేంద్రానికి చెందిన చౌకి శ్రావణ్‌కుమార్ (హాల్ టికెట్ నెం.118122991) జిల్లా టాపర్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం వెలువడిన ఫలితాలలో ఆయన 96 మార్కులు సాధిం చారు. ఏంబీఏ పూర్తి చేసిన శ్రావణ్‌కుమార్ తండ్రి రాజయ్య ఉప్పల్వాయిలో రె సిడెన్షియల్ పాఠశాలలో జూనియ ర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి వరలక్ష్మి బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గు రు సంతానం. శ్రావణ్ మూడవవారు కాగా, పెద్ద కుమారుడు రాజేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకుని శని వారమే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఎస్‌గా చేరారు. కాగా, శ్రావణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతే భవిష్యత్తులో మరింత మంచి ఉద్యోగం సాధిస్తాననే ధీమాను వ్యక్తపరిచారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్నాన్నారు. -న్యూస్‌లైన్, దోమకొండ -
సర్టిఫికెట్ల పరిశీలనకు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కుంటి నడక నడుస్తున్న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ నేటి నుంచి సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 19న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవగా.. సీమాంధ్ర ప్రాంతంలో 34 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయలేదు. ఈ సహాయక కేంద్రాలన్నీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉండడం, ఆ కళాశాలల అధ్యాపక సిబ్బంది ఎంసెట్ విధుల బహిష్కరణకు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో మరో నాలుగు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తనిఖీ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం పూర్తిస్థాయిలో సాగడం లేదు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అయిన అజయ్ జైన్, జాయింట్ డెరైక్టర్ యూవీఎస్ఎన్ మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) ఛైర్మన్, ప్రతినిధి బృందంతో మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. బుధవారం నుంచి విధుల్లో చేరేందుకు ‘పాలా’ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు అజయ్‌జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు విధుల్లో చేరేందుకు అంగీకరించినందున ఎంసెట్ సహాయక కేంద్రాలన్నీ బుధవారం నుంచి సజావుగా పనిచేస్తాయని తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు పనిచేయని కేంద్రాల్లో 1 నుంచి 1,60,000 లోపు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారందరికీ కొత్తగా షెడ్యూలు జారీ చేస్తామని తెలిపారు. అతి త్వరలోనే ఈ షెడ్యూలు వెలువడుతుందన్నారు. 30న నిర్ణయం..: మరోవైపు మంగళవారం సాయంత్రం ఉన్నత విద్యామండలిలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్ జైన్ సమీక్ష జరిపారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ సజావుగా సాగే పక్షంలో ఈ నెల 30న మరోసారి సమీక్ష జరిపి, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ షెడ్యూలు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాని విద్యార్థులు వెంటనే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచిస్తూ విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్.ఎం.ఎస్. పంపించాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు 9వ రోజు మొత్తం 11,512 మంది హాజరయ్యారు. సీమాంధ్రలో 38 కేంద్రాలకు గాను 19 కేంద్రాలు పనిచేయగా వీటిలో 6,051 మంది హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,461 మంది హాజరయ్యారు. బీ-కేటగిరీపై ప్రభుత్వానికి నివేదన: ఇంజనీరింగ్ బీ-కేటగిరీ సీట్ల భర్తీపై ఈనెల 13న నోటిఫికేషన్ వెలువడిన తరువాత హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పునకు అనుగుణంగా తిరిగి నోటిఫికేషన్ జారీచేయాలా? లేక 13 నాటి నోటిఫికేషన్‌ను కొనసాగించాలా? కొత్త నోటిఫికేషన్ జారీచేస్తే 13 నాటి నోటిఫికేషన్‌కు అనుగుణంగా భర్తీ అయిన ప్రవేశాల పరిస్థితి ఏంటి? తదితర విషయాలపై న్యాయ సలహా తీసుకొని స్పష్టత ఇవ్వాల్సిందిగా ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఇచ్చే స్పష్టత ఆధారంగా బీ-కేటగిరీ సీట్లపై నిర్ణయం తీసుకుంటామని మండలి ైచైర్మన్ జయప్రకాశ్‌రావు తెలిపారు. -
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎదురుచూపు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలల ఎంపికకు ఉద్దేశించిన వెబ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన మొదలై ఎనిమిది రోజులు పూర్తయినప్పటికీ వెబ్ కౌన్సెలింగ్ ఊసేలేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సోమవారానికి 1,40,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 22న ప్రారంభ కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యాశాఖ వాయిదా వేసి, నూతన షెడ్యూల్ జారీ చేస్తామని ప్రకటించిందే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారిన పక్షంలో అసలు జరుగుతుందో లేదోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 30తో సర్టిఫికెట్ల పరిశీలన ముగియనుంది. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 463మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రం సమన్వయకర్త సీహెల్ పుల్లారెడ్డి పర్యవేక్షణలో అధ్యాపకులు సర్టిఫికెట్లను పరిశీలించారు. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 1,40,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 1,40,001 నుంచి 1,45,000, 1,55,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1,45,001 నుంచి 1,55,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు 465 మంది హాజరు ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 465మంది హాజరయ్యారని కౌన్సెలింగ్ కేంద్రం అధికారి డాక్టర్ సింహాచలం తెలిపారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు కేటాయించిన ర్యాంకులకు ఏఎన్‌యూ కేంద్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
సర్టిఫికెట్ల తనిఖీకి పెరిగిన హాజరు
నేటి నుంచి విశాఖపట్నంలో కొత్త కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నడుస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నాలుగో రోజు విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్య మం కారణంగా 37 కేంద్రాలకుగానూ 20 కేంద్రాల్లో సర్టిఫికెట్ తనిఖీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే 17 కేంద్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. ఈ 17 కేంద్రాల్లో గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 4,791 మంది విద్యార్థులు హాజరుకాగా.. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 4,702 మంది హాజరైనట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. ఎంసెట్ సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం. డోబ్రియాల్, సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం చైర్మన్ జయప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. శుక్రవారం నుంచి విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవనుందని వెల్లడించారు. కాకినాడలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.