వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల | vro/vra results are out | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల

Published Sun, Feb 23 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

vro/vra results are out

  మెరిట్ అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం
     25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
     29లోగా నియామకం
     భర్తీ కానున్న 65 వీఆర్‌ఓ, 94 వీఆర్‌ఏ పోస్టులు
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
 నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రా మ రెవెన్యూ సహా యకులు (వీఆర్‌ఏ) ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను జ్డ్చీఝ్చఛ్చఛీ.జీఛి.జీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 65, వీఆర్‌ఏ పోస్టులు 94 భర్తీ కానున్నాయి. వీఆర్వో ఫలితాల్లో దోమకొండకు చెందిన శ్రావణ్ కుమార్ చౌకీ (హెచ్.నెం.2281229911) 96 మార్కులు, నందిపేటకు చెందిన పృథ్వీరాజ్‌గౌడ్ 96 మార్కులు సాధించారు. వీఆర్‌ఏ ఫలితాల్లోనిజామాబాద్‌కు చెందిన డి. రామకృష్ణ (హెచ్.నం.218100235) 96 మార్కులు సాధించారు. మెరిట్‌లిస్టు-రోస్టర్ పాయింట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు నోటీసు ద్వారా, ఫోన్‌లో సమాచారం అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఈనెల 25న  నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
 
 అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. మాజీ సైనిక కుటుంబాల వారు, వికలాంగులు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మెరిట్ అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లతో హాజరుకావాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎంపికైన వారి వివరాల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మొబైల్ ద్వారా సమాచారం అందిస్తామని, లేదా ఎస్‌ఎంఎస్ చేస్తామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఈనెల 29లోగా ప్రాథమిక నియామకం ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున ఆలోగా వీఆర్‌ఏ, వీఆర్‌ఓ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిస్తే ఆలస్యమవుతుందనే  ఉద్దేశంతో ఫోన్ ద్వారా సమాచారం అందించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపిస్తున్నారు. ఈనెల 2న పరీక్షలు జరిగాయి. వీఆర్వో పోస్టులకు 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది పరీక్ష  రాశారు. వీఆర్‌ఏ పోస్టులకు 2823  దరఖాస్తు చేసుకోగా  2,518 మంది పరీక్షకు హాజరయ్యారు.
 
 పృథ్వీరాజ్‌గౌడ్‌కు మూడవ ర్యాంకు
 నందిపేట మండల కేంద్రానికి చెందిన తాడ్వాయి పృథ్వీరాజ్ గౌడ్ వీఆర్‌ఓ ఫలితాలలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించారు. విశ్వప్రసాద్ గౌడ్,నీలా దంపతుల కుమారుడైన పృథ్వీరాజ్‌గౌడ్ గత ఏడాది బిటెక్ పూర్తి చేశారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు నెలల క్రితం ప్రకటిం చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలలోనూ ఆయనకు జిల్లాలో మొదటి ర్యాంకు లభించింది. 20 రోజలు క్రితం రైల్వే శాఖలో గ్రూప్ ‘డి’ పోస్టుకు ఎంపికయ్యారు. ఇపుడు వీఆర్‌ఓ ఫలితాలలోనూ మూడవ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బంధుంవులు, మిత్రులు అభినందన లు తెలియజేశారు.
 -న్యూస్‌లైన్, నందిపేట
 
 ప్రతిభచాటిన శ్రావణ్‌కుమార్
 వీఆర్‌ఓ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షలో దోమకొండ మం డల కేంద్రానికి చెందిన చౌకి శ్రావణ్‌కుమార్ (హాల్ టికెట్ నెం.118122991)  జిల్లా టాపర్‌గా నిలిచారు.
 
 శనివారం సాయంత్రం వెలువడిన ఫలితాలలో ఆయన 96 మార్కులు సాధిం చారు. ఏంబీఏ పూర్తి చేసిన శ్రావణ్‌కుమార్ తండ్రి రాజయ్య ఉప్పల్‌వాయిలో రె సిడెన్షియల్ పాఠశాలలో జూనియ ర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి వరలక్ష్మి బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గు రు సంతానం. శ్రావణ్ మూడవవారు కాగా, పెద్ద కుమారుడు రాజేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకుని శని వారమే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఎస్‌గా చేరారు. కాగా, శ్రావణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతే భవిష్యత్తులో మరింత మంచి ఉద్యోగం సాధిస్తాననే ధీమాను వ్యక్తపరిచారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్నాన్నారు.
 -న్యూస్‌లైన్, దోమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement