VRA/VRO posts
-
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
మెరిట్ అభ్యర్థులకు ఫోన్లో సమాచారం 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 29లోగా నియామకం భర్తీ కానున్న 65 వీఆర్ఓ, 94 వీఆర్ఏ పోస్టులు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రా మ రెవెన్యూ సహా యకులు (వీఆర్ఏ) ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను జ్డ్చీఝ్చఛ్చఛీ.జీఛి.జీ వెబ్సైట్లో పొందుపరిచారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 65, వీఆర్ఏ పోస్టులు 94 భర్తీ కానున్నాయి. వీఆర్వో ఫలితాల్లో దోమకొండకు చెందిన శ్రావణ్ కుమార్ చౌకీ (హెచ్.నెం.2281229911) 96 మార్కులు, నందిపేటకు చెందిన పృథ్వీరాజ్‌గౌడ్ 96 మార్కులు సాధించారు. వీఆర్ఏ ఫలితాల్లోనిజామాబాద్కు చెందిన డి. రామకృష్ణ (హెచ్.నం.218100235) 96 మార్కులు సాధించారు. మెరిట్‌లిస్టు-రోస్టర్ పాయింట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు నోటీసు ద్వారా, ఫోన్లో సమాచారం అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఈనెల 25న నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఇంటర్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. మాజీ సైనిక కుటుంబాల వారు, వికలాంగులు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మెరిట్ అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లతో హాజరుకావాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎంపికైన వారి వివరాల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మొబైల్ ద్వారా సమాచారం అందిస్తామని, లేదా ఎస్ఎంఎస్ చేస్తామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఈనెల 29లోగా ప్రాథమిక నియామకం ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున ఆలోగా వీఆర్ఏ, వీఆర్ఓ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఫోన్ ద్వారా సమాచారం అందించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపిస్తున్నారు. ఈనెల 2న పరీక్షలు జరిగాయి. వీఆర్వో పోస్టులకు 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది పరీక్ష రాశారు. వీఆర్ఏ పోస్టులకు 2823 దరఖాస్తు చేసుకోగా 2,518 మంది పరీక్షకు హాజరయ్యారు. పృథ్వీరాజ్గౌడ్కు మూడవ ర్యాంకు నందిపేట మండల కేంద్రానికి చెందిన తాడ్వాయి పృథ్వీరాజ్ గౌడ్ వీఆర్ఓ ఫలితాలలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించారు. విశ్వప్రసాద్ గౌడ్,నీలా దంపతుల కుమారుడైన పృథ్వీరాజ్‌గౌడ్ గత ఏడాది బిటెక్ పూర్తి చేశారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు నెలల క్రితం ప్రకటిం చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలలోనూ ఆయనకు జిల్లాలో మొదటి ర్యాంకు లభించింది. 20 రోజలు క్రితం రైల్వే శాఖలో గ్రూప్ ‘డి’ పోస్టుకు ఎంపికయ్యారు. ఇపుడు వీఆర్ఓ ఫలితాలలోనూ మూడవ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బంధుంవులు, మిత్రులు అభినందన లు తెలియజేశారు. -న్యూస్‌లైన్, నందిపేట ప్రతిభచాటిన శ్రావణ్‌కుమార్ వీఆర్ఓ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షలో దోమకొండ మం డల కేంద్రానికి చెందిన చౌకి శ్రావణ్‌కుమార్ (హాల్ టికెట్ నెం.118122991) జిల్లా టాపర్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం వెలువడిన ఫలితాలలో ఆయన 96 మార్కులు సాధిం చారు. ఏంబీఏ పూర్తి చేసిన శ్రావణ్‌కుమార్ తండ్రి రాజయ్య ఉప్పల్వాయిలో రె సిడెన్షియల్ పాఠశాలలో జూనియ ర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి వరలక్ష్మి బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గు రు సంతానం. శ్రావణ్ మూడవవారు కాగా, పెద్ద కుమారుడు రాజేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండవ కుమారుడు శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకుని శని వారమే మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఎస్‌గా చేరారు. కాగా, శ్రావణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతే భవిష్యత్తులో మరింత మంచి ఉద్యోగం సాధిస్తాననే ధీమాను వ్యక్తపరిచారు. ఆదివారం పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్నాన్నారు. -న్యూస్‌లైన్, దోమకొండ -
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు ఫిబ్రవరి-2న జరగనున్న రాతపరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 168 కేంద్రాలను ఖరారు చేశారు. తొలుత జిల్లావ్యాప్తంగా 186 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీటిలో 168 కేంద్రాలను ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమోద ముద్ర లభించింది. పార్వతీపురం డివిజన్లో 71 కేంద్రాలు, విజయనగరం డివిజన్లో 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాల, పాఠశాల ప్రధానోపాధ్యాయులే చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. జిల్లాను 10 రూట్లుగా విభజించి, రూట్ ఆఫీసర్లుగా తహశీల్దార్, ఎంపీడీఓలను నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్లుగా పరీక్షా కేంద్రానికి ఒక డిప్యూటీ తహశీల్దార్ అధికారిని, పర్యవేక్షకులుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. వీరు కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్విహ స్తారు. 15 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను సైతం నియమించారు. విజయనగరం డివిజన్లో ఆర్డీఓ జె.వెంకటరావు, పార్వతీపురం డివిజన్‌ను సబ్ కలెక్టర్ శ్వేతామహంతి పర్యవేక్షిస్తారు. కన్వీనర్‌గా జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్ఎస్ వెంకటరావు వ్యవహరిస్తారు. వీఆర్వో పోస్టుకు ఉదయం, వీఆర్ఏ పోస్టులకు మధ్యాహ్నం పరీక్ష జరుగుతుంది. ఈ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 45,655 దరఖాస్తులు అందాయి. వీఆర్వో 90 పోస్టులకు 43647, వీఆర్ఏ 137 పోస్టులకు గానూ 1364 మంది దరఖాస్తు చేసకున్నారు. రెండింటికి 644 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలో 27 వీఆర్వో పోస్టులకు దరఖాస్తులు అందలేదు. దృష్టిలోపం ఉన్న వారికి కేటాయించిన 13, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఆరు ఖాళీలకు, వివిధ కేటగిరీలకు చెందిన మరో ఎనిమిది పోస్టులకు దరఖాస్తులు అందలేదు. అలాగే కొన్ని గ్రామాల్లో వీఆర్ఏలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. -
ఉద్యోగ సందడి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవె న్యూ, గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్ఎస్ రాజ్‌కుమార్ తెలి పారు. శుక్రవారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 77 వీఆర్వో పోస్టులు, 176 వీఆర్ఎ పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. రాత పరీక్షల ద్వా రా ఈ నియామకాలు జరుగుతాయని, వంద మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, రోస్టర్, మెరిట్ ఆధారంగా చేపడతామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఆర్ఏలకు రాత పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలను జిల్లా కేంద్రంలో, దరఖాస్తుల సంఖ్యను బట్టి డివిజన్ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలి పారు. ఈ నెల 28 నుంచి జనవరి 13 వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వెబ్సైట్ http://w-w-w,-s-r-ika-k-ulam-c-ollect-ora-t-e,com లో చూడాలన్నారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ 1800 425 6625 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సూచించారు. పరీక్ష రుసుం: వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు ఓసీ అభ్యర్థులకు రూ.300, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించాలన్నారు. వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుందని, సదరం వికలాంగ ధ్రువీకరణ పత్రం విధిగా జతపర్చాలన్నారు. రెండు ఉద్యోగాలకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేయవచ్చునని, రెండింటికీ రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. రెండు పోస్టులకు స్థానిక ధ్రువ పత్రం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వయసు * వీఆర్వో పోస్టుకు 1 జూలై 2013 నాటికి దరఖాస్తుదారు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు వయసు, మాజీ సైనికోద్యోగులకు 39 ఏళ్లు (సైన్యంలో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని) సడలింపు ఉంటుందన్నారు. జిల్లా యూనిట్‌గా రోస్టర్ ప్రకారం నియామకాలు ఉంటాయని తెలిపా రు. అభ్యర్థి కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్, తత్సమాన విద్యార్హతలు ఉండాలన్నారు. * వీఆర్వో ఉద్యోగానికి 1 జూలై 2013 నాటికి 18 నుంచి 37 ఏళ్ల మధ్యవారై, పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టు ఉన్న రెవెన్యూ గ్రామ పరిధిలోని అభ్యర్థికి రోస్టర్ మేర దరఖాస్తు చేసోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 42 ఏళ్లు, మాజీ సైనికులు 40 ఏళ్లు (సైన్యంలో పని చేసిన కాలం కలిపి), వికలాంగులకు 47 ఏళ్ల వరకు వయోపరిమితి ఉందన్నారు. రోస్టర్ పాయింట్ మండల యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి నూరు బాషా కాశీం, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎన్.లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఆబ్జెక్టివ్ టైపు రాతపరీక్ష 2014 ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వో ఉద్యోగాలకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఆర్ఏలకు పరీక్ష జరుగుతుంది. వంద ప్రశ్నలు వంద మార్కులు. అన్ని అబ్జెక్టివ్ ప్రశ్నలే ఉంటాయి.వీఆర్వో, వీఆర్ఏ నియామక పరీక్షలకు సిలబస్ ఒకే విధంగా ఉన్నా ప్రశ్నల కఠినత్వ స్థాయి వీఆర్ఏ పరీక్ష కన్నా వీఆర్వో పరీక్షకు ఎక్కువగా ఉంటుంది. -
వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి రేపే నోటిఫికేషన్
సాక్షి, నిజామాబాద్: నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ పోస్టుల భర్తీ షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. అభ్యర్థులు జనవరి 12లోగా పరీక్ష ఫీజును చెల్లించి, 13లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షను ఫిబ్రవరి 2న నిర్వహిస్తామని, పది రోజుల్లో మెరిట్ జాబితా ప్రకటిస్తామని అన్నారు. ఫిబ్రవరి 25 వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఫిబ్రవరి నెలాఖరులోగా వారికి పోస్టింగ్‌లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 65 వీఆర్ఓ, 94 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాత పరీక్షను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించగా, దరఖాస్తుల ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ ద్వారా కొనసాగుతుందని అన్నారు. గత ఏడాది నియామకాలను బట్టి పరిశీలిస్తే ఈసారి జిల్లాలో 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లాలోని పట్టణ కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని, ఇందుకు అవసరమైన ఇన్విజిలెటర్లు, రూట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్ల నియామకం చేపడతామన్నారు. అభ్యర్థులు రూ. 300 చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, వికలాంగుల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పోస్టులకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుందని, అభ్యర్థులు ఈ సైట్లో చూసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవా కేంద్రాలు తీసుకోవాల్సిన రుసుమును త్వరలో ప్రకటిస్తామని ప్రద్యుమ్న పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు.