ఉద్యోగ సందడి
Published Sat, Dec 28 2013 4:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవె న్యూ, గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ తెలి పారు. శుక్రవారం తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 77 వీఆర్వో పోస్టులు, 176 వీఆర్‌ఎ పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. రాత పరీక్షల ద్వా రా ఈ నియామకాలు జరుగుతాయని, వంద మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, రోస్టర్, మెరిట్ ఆధారంగా చేపడతామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఆర్‌ఏలకు రాత పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలను జిల్లా కేంద్రంలో, దరఖాస్తుల సంఖ్యను బట్టి డివిజన్ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలి పారు. ఈ నెల 28 నుంచి జనవరి 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్ http://w-w-w,-s-r-ika-k-ulam-c-ollect-ora-t-e,com లో చూడాలన్నారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ 1800 425 6625 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని సూచించారు.
పరీక్ష రుసుం:
వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగాలకు ఓసీ అభ్యర్థులకు రూ.300, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించాలన్నారు. వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుందని, సదరం వికలాంగ ధ్రువీకరణ పత్రం విధిగా జతపర్చాలన్నారు. రెండు ఉద్యోగాలకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేయవచ్చునని, రెండింటికీ రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. రెండు పోస్టులకు స్థానిక ధ్రువ పత్రం తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
వయసు
* వీఆర్వో పోస్టుకు 1 జూలై 2013 నాటికి దరఖాస్తుదారు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు వయసు, మాజీ సైనికోద్యోగులకు 39 ఏళ్లు (సైన్యంలో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని) సడలింపు ఉంటుందన్నారు. జిల్లా యూనిట్‌గా రోస్టర్ ప్రకారం నియామకాలు ఉంటాయని తెలిపా రు. అభ్యర్థి కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్, తత్సమాన విద్యార్హతలు ఉండాలన్నారు.
* వీఆర్వో ఉద్యోగానికి 1 జూలై 2013 నాటికి 18 నుంచి 37 ఏళ్ల మధ్యవారై, పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టు ఉన్న రెవెన్యూ గ్రామ పరిధిలోని అభ్యర్థికి రోస్టర్ మేర దరఖాస్తు చేసోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 42 ఏళ్లు, మాజీ సైనికులు 40 ఏళ్లు (సైన్యంలో పని చేసిన కాలం కలిపి), వికలాంగులకు 47 ఏళ్ల వరకు వయోపరిమితి ఉందన్నారు. రోస్టర్ పాయింట్ మండల యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి నూరు బాషా కాశీం, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎన్.లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆబ్జెక్టివ్ టైపు రాతపరీక్ష
2014 ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వో ఉద్యోగాలకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఆర్‌ఏలకు పరీక్ష జరుగుతుంది. వంద ప్రశ్నలు వంద మార్కులు. అన్ని అబ్జెక్టివ్ ప్రశ్నలే ఉంటాయి.వీఆర్వో, వీఆర్‌ఏ నియామక పరీక్షలకు సిలబస్ ఒకే విధంగా ఉన్నా ప్రశ్నల కఠినత్వ స్థాయి వీఆర్‌ఏ పరీక్ష కన్నా వీఆర్వో పరీక్షకు ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Advertisement