కొలువుల జాతర
Published Tue, Dec 31 2013 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొలువుల జాతరకు తెర తీసింది. ఇటీవల వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా పంచాయతీ కార్యదర్శుల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2677 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు. దీని ప్రకారం శ్రీకాకుళం జిల్లా లో మొత్తం 209 కార్యదర్శుల పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ పూర్తిచేసి.. 01.07.2013 నాటికి 18-36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఠీఠీఠీ. www. apspsc.gov.inవెబ్‌సైట్ ద్వారా జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతి అభ్యర్థి రూ.100 తప్పనిసరిగా చెల్లించాలి. పరీక్ష ఫీజు కింద మరో రూ.80 చలానా తీసి దరఖాస్తుతో సబమిట్ చేయాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందినవారు, తెల్ల రేషన్ కార్డు దారులు పరీక్ష ఫీజు (రూ.80) చెల్లించనక్కర్లేదు. ఫీజుల చలానాలను జనవరి 20లోగా తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ర్యాంకింగ్ జాబితాను మార్చి 24న విడుదల చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు అన్ని రకాల ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
పాత నోటిఫికేషన్ రద్దేనా...!
గ్రేడ్-4 కార్యదర్శుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇంతకుముందు జారీ చేసిన నోటిఫికేషన్ సంగతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే స్థాయి కార్యదర్శుల పోస్టులను డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం గత నెల 4 వరకు రూ. 50 ఫీజుతో అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ మేరకు జిల్లాలో ఉన్న 160 పోస్టులకు 9వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇదే ప్రక్రియ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ జరిగింది. తాజా నోటిఫికేషన్‌తో ఆ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నోటిఫికేషన్ జారీతో పాతది రద్దయినట్లేనని పంచాయతీరాజ్ అధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ చెప్పారు. అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
కేటగిరీ పురుషులు మహిళలు మొత్తం
ఓసీ 61 33 94
బీసీ(ఎ) 10 05 15
బీసీ(బి) 12 08 20
బీసీ(సి) 02 00 02
బీసీ(డి) 10 04 14
బీసీ(ఇ) 06 02 08
ఎస్సీ 19 13 32
ఎస్టీ 08 05 13
పీహెచ్ 04 03 07
ఎక్స్ సర్వీస్‌మెన్ 02 02 04
-------------------------- ------
మొత్తం 134 75 209
Advertisement
Advertisement