
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 22న జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 22న సెలవు ప్రకటించిన కారణంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలలో జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23కి వాయిదా వేసినట్లు తెలిపింది.