ఖమ్మం : ఎంసెట్ కౌన్సెలింగ్ బుధవారం జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 25 వేల లోపు ర్యాంకుల వారికి జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 505 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 401 మంది, భద్రాచలం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 39 మంది, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 65 మంది విద్యార్థులు హాజరయ్యారని ఖమ్మం సెంటర్ ఎంసెట్ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవని, తిరిగి ఈనెల 16న కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. శనివారం 25,001వ ర్యాంకు నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. ఈనెల 17 నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలో వివరించేందుకు కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు వెబ్ ఆప్షన్ సందర్భంగా తలెత్తే అనుమానాలు, ఇతర విషయాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో పలువురు విద్యార్థులు ఆయా పత్రాలను చూపించలేక పోయారు. ఈ విషయం కౌన్సెలింగ్ సెంటర్ అధికారుల దృష్టికి తీసుకరావడంతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని సర్టిఫికెట్లు పరిశీలించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
Published Fri, Aug 15 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement
Advertisement