ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15న ఎంసెట్-3 ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో తమ ఆప్షన్లను తెలియజేయాల్సి ఉంటుంది.
Published Tue, Sep 13 2016 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement