Government Medical College
-
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
తొలి నుంచీ అదే విముఖత
‘‘ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుంది. దాని నిర్వహణ కోసం ఏటా రూ. 30 కోట్లు కావాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలలఏర్పాటుకు అనుమతులిస్తాం.’’– వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా అసెంబ్లీలో నాటి వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు‘‘పులివెందుల కళాశాలకు అనుమతులు రావడం విస్మయం కలిగించింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. అయినా అనుమతులు వచ్చాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ పరిధిలో కొనసాగించడానికి నిధుల్లేవు. అందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహించాలని నిర్ణయించాం. – ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలుఅవకాశాలను కాలరాసిన బాబువైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014–19 మధ్య విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపలేదు. 2019కు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలని రాబట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి అసెంబ్లీ సాక్షిగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.విభజన చట్టం కింద కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. గతంలో ప్రైవేట్‌లో వైద్య కళాశాలలను ప్రోత్సహించిన బాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైద్య విద్య అవకాశాలను కాలరాశారని నీట్ యూజీ ర్యాంకర్లు ధ్వజమెత్తుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించేలా గత ప్రభుత్వంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. ఆ కళాశాలలకు అడ్డుపడి ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ కుటుంబం చెరగని ముద్రఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ వంటి వ్యవస్థలను ప్రారంభించి వైద్య రంగంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలోనే కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న తండ్రి ఆశయాన్ని వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ, 104, 108 వ్యవస్థలతో పాటు, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉండగా కుట్రపూరితంగా బాబు ప్రభుత్వం అడ్డుపడింది. -
ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ కన్వినర్ (ఎ కేటగిరి) సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.దివ్యాంగ, మరికొన్ని ప్రత్యేక విభాగాల్లో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకూ పెండింగ్‌లో ఉంచారు. మొత్తం 3,879 సీట్లకు గాను తొలి దశ కౌన్సెలింగ్‌లో 3,507 సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. -
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో ప్రభుత్వానికి నష్టమా?
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.మీకు నష్టమేంటి బాబూ?ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్‌పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్షమించరాని నేరంజగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంవైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
ర్యాలీలతో హోరెత్తిన కోల్‌కతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో వైద్యురాలి హత్యోదంతంపై కోల్‌కతా నగరంలో ఆదివారం మరోమారు నిరసనలు మిన్నంటాయి. విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, కుమ్మరి కారి్మకులు, రిక్షావాలాలు... ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం వీటిలో పాల్గొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. పలు ర్యాలీలో అమ్మాయిలు దుర్గా మాత వేషాల్లో పాల్గొన్నారు. ‘ఇంకెంత కాలం?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పశి్చమబెంగాల్‌లోని పలు పట్టణాల్లోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంపై రాష్ట్ర కేబినెట్‌ను అత్యవసరంగా సమావేశపరిచి చర్చించాలని మమత సర్కారును గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదేశించారు. -
కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిరీ్వర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాలల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎంస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు.నిజానికి ఈ విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకొచ్చేవి. ప్రైవేట్‌పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతి ఇచి్చంది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో వంతే అందుబాటులోకొచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచి్చంది. ఇక ఉచిత వైద్యం ఊసుండదు ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి, ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కాగా, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యా, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళితే ఉచిత వైద్యం ఊసే ఉండదని, పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. బాబు హయాంలో ప్రైవేట్‌కు పచ్చజెండా గతంలో 1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం 2014–19 విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగినా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో 17 కొత్త కాలేజీలు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదింటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. -
రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఇటు ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థి నిరసనకారులు, అటు వారిని అడ్డుకునేందుకు వేలాదిగా మోహరించిన పోలీసులతో పరిస్థితి యుద్ధరంగాన్ని తలపించింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. వాటిని బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళలపై అకృత్యాలను అడ్డుకోవడం చేతగాని మమతా సర్కారు విద్యార్థులపై మాత్రం ప్రతాపం చూపుతోందంటూ దుయ్యబట్టింది.‘‘పోలీసు హింసాకాండకు బాధ్యత వహి స్తూ మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి. వైద్యురాలి హత్యలో నిజాలు వెలు గు చూసేందుకు వీలుగా పాలీ టెస్టులకు సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే రా ష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించింది. బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ర్యాలీ బీజేపీ గేమ్ప్లానేనని చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను దిగజార్చేందుకే ఆ పార్టీ కంకణం కట్టుకుంది’’ అంటూ మండిపడింది. బంద్ జ రగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ కుండబద్దలు కొట్టారు! ఉదయం నుంచే... విద్యార్థి సంఘమైన పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ర్యాలీ తలపెట్టారు. మరోవైపు డీఏ తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అసమ్మతి వేదిక ‘సంగ్రామీ జౌతా మంచా’ కూడా మంగళవారమే చలో సచివాలయానికి పిలుపునిచ్చింది. నిరసనకారులంతా కోల్‌కతాలో పలు ప్రాంతాల నుంచి ఒక్క ఉదుటున సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటిని భగ్నం చేసేందుకు ఏకంగా 6,000 మందికి పై చిలుకు బలగాలు రంగంలోకి దిగాయి. హౌరా బ్రిడ్జి, సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలో పలుచోట్ల బారికేడ్లతో పోలీసులు ముందుగానే రోడ్లను దిగ్బంధించారు. బారికేడ్లపైకెక్కి దూకేందుకు ప్రయత్నించిన నిరసనకారులను నిలువరించేందుకు లాఠీచార్జీ చేయ డంతో చాలామంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు రాళ్లతో పాటు ఇటు కలు కూడా విసరడంతో 30 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. ఎంజీ రోడ్, హేస్టి ంగ్స్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ తదితర ప్రాంతాలన్నీ ఘర్షణలకు వేదికగా మారాయి. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ‘‘మేమేమీ చట్టాలను అత్రికమించలేదు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే విచక్షణారహితంగా కొట్టారు’’ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. 33 మంది మహిళలతో పాటు మొత్తం 126 మంది ఛాత్ర సమాజ్ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి 200 పైచిలుకు మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపిస్టులకు మమత అండ: నడ్డా విద్యార్థుల శాంతియుత ర్యాలీపై పోలీసులు జులుం ప్రదర్శించారని బీజేపీ అధ్యక్షుడు జే పీ నడ్డా ఆరోపించారు. ‘‘మమత పాలనలో రేపిస్టులు, క్రిమినల్స్‌కు వ్యవస్థే అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మహిళల భద్రత కో సం గళమెత్తడం బెంగాల్లో క్షమించరాని నేరంగా మారింది’’ అంటూ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్ప డ్డ వారిని మమత సర్కా రే కాపాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. చెవిటి సర్కారు: బీజేపీ మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచి్చనట్టు తెలిపారు. విద్యార్థుల ర్యాలీపై పోలీసుల అణచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్ బజార్ ప్రాంతంలో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. టియర్ గ్యాస్ ధాటికి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా అక్కడే బైఠాయించారు. మరోవైపు బుధవారం రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెపె్టంబర్ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను మంగళవారం రాత్రే పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాటిని పోలీసులు ఖండించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై...ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయం వైద్యురాలి కేసులో సీబీఐ నిర్ణయం కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించిన డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ప్రధాన నిందితు డు సంజయ్ రాయ్ తనంత తానుగా నే ఘోరానికి పాల్పడ్డాడా, అతని వెనక ఎవరన్నా ఉన్నారా అన్నదానిపై పక్కాగా నిర్ధారణకు వచ్చేందుకు వారిచ్చే నివేదిక ఉపయోగపడొచ్చని భావిస్తోంది. సంజయ్‌కి సన్నిహితుడైన ఏఎస్సై అనూప్ దత్తా కూడా ఈ ఘోరంలో అతనికి సా యపడ్డట్టు సీబీఐ అనుమానిస్తోంది. దత్తాకు పాలి టెస్టులు చేసేందుకు కోర్టు ను ఇప్పటికే అనుమతి కోరింది. మరో వైపు ఘోష్ హయాంలో ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై తాజాగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ‘కమిషనర్’ బైక్‌పై నిందితుడు! కోల్‌కతా: అత్యాచారం, హత్య జరిగిన రాత్రి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టరైన బైక్‌ను వాడినట్టు తేలడం ఆందోళనకరమని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. వైద్యుల భద్రతపై టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం భాగస్వామ్యపక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం మంగళవారం జరిగింది. భద్రతపై ప్రొటోకాల్ రూపొందించడానికి భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది సభ్యులతో ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో జరిగిన తొలి సమావేశానికి సభ్యులందరితోపాటు కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు సైతం హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతపై చర్చించారు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ భాగస్వామ్యపక్షాలతో మాట్లాడామని, తమకు దాదాపు 400 సలహాలు సూచనలు అందాయని టాస్‌్కఫోర్స్ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు. -
కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసేలా ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. కేబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి వివరించారు. ఫేజ్–1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో (150 సీట్లు) నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలకు గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందన్నారు. ఫేజ్–2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెల్లో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తొలి ఏడాది ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించేందుకు మంత్రి మండలి అంగీకరించిందని చెప్పారు. మంత్రి పార్థసారథి వెల్లడించిన మేరకు మంత్రి మండలి నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు ⇒ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు అర్బన్ లోకల్ బాడీస్‌తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. సంతానోత్పత్తి రేటు, పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం తగదని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. ⇒ 2014–19తో పోలిస్తే ప్రస్తుత మద్యం పాలసీ లోపభూయిష్టంగా, పారదర్శకత లోపించింది. భవిష్యత్తులో మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానంలోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. సెపె్టంబర్ 5 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తాం. ఇకపై మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు ప్రవేశ పెడతాం. ⇒ గత ప్రభుత్వంలో రూ.22.95 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిచేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ నిషేధిత జాబితా భూములపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో గ్రామ సభలు నిర్వహిస్తాం. అప్పటి వరకు 22ఏ నుంచి మినహాయిస్తూ భూములకు ఎటువంటి రిజి్రస్టేషన్లు నిర్వహించం. ⇒ మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం జారీ చేసిన 144, 217 జీవోలను రద్దు చేస్తున్నాం. చేప పిల్లల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు దళారీ వ్యవస్థ లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. ⇒ నంద్యాల జిల్లా సున్నిపెంట (శ్రీశైలం ప్రాజెక్టు) గ్రామ పంచాయతీకి 208.74 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం 2023 మే 11న జారీ చేసిన జీవో 40ని రద్దు చేసి, ఆ భూమిని నీటి పారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని పర్యాటకాభివృద్ధి కోసం బదలాయించి టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.⇒వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంస్థలపై మరో ఏడాది నిషేధాన్ని పొడిగించాం. పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యమే లక్ష్యం గత ప్రభుత్వంలో ఆ దిశగా వైఎస్ జగన్ చర్యలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడమే లక్ష్యంగా 17 కొత్త వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. రోజు రోజుకు వైద్య విద్యకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా ఉండింది. ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక, తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేర్పించే వారు. మధ్య తరగతి కుటుంబాల వారైతే అప్పులు చేసి రష్యా, ఫిలిపైన్స్ వంటి దేశాలకు పిల్లలను పంపేవారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేలా కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేగంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం రెండో దశ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా కావాలనే నిర్లక్ష్యం చేసింది. దీనికితోడు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలోనే నడిపి, విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు, పేదలకు ఉచితంగా> సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడం జగన్ విధానం. ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలను, బోధనాస్పత్రులను పెడితే పేదలకు ఉచిత వైద్య సేవలు కరువయ్యే అవకాశం ఉంది. అవసరమైన మేరకు ఉద్యోగుల బదిలీలుసాక్షి, అమరావతి: వీలైనంత లో ప్రొఫైల్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు దగ్గరకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన వారితో కొద్దిసేపు రాజకీయ అంశాలపై మాట్లాడారు. తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ చెబుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. వాళ్లు చేసినట్లు చేయకూడదని పదేపదే చెబుతున్నా, కొందరు వినడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగే చేస్తే ఇబ్బందులు వస్తాయని అన్నట్లు తెలిసింది. ‘ఉద్యోగుల బదిలీలను అవసరమైన మేరకు చేసుకోవాలి. నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఏపీ ఎన్నికల్లో వచ్చింది నిశ్శబ్ద విప్లవమైతే.. బంగ్లాదేశ్‌లో వైలెంట్ విప్లవం చూశాం. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా జల హారతుల కార్యక్రమాలు నిర్వహిస్తాం. రీ సర్వే వివాదాలు మూడు నెలల్లో పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహిద్దాం. రీ సర్వేకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాటిని కూడా అధ్యయనం చేయాలి. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దాం’ అని సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. -
ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్
-
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
మరో 8 మెడికల్ కాలేజీలకు నిధులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తికానుంది. రెండు రోజుల కిందే తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రక టించారు. రూ.1,447 కోట్లతో ఈ 8 మెడికల్ కాలే జీలకు భవనాలు, హాస్టళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పరి పాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండగా.. వచ్చే ఏడాది నాటికి ఏకంగా 34కు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించుకున్న మరుసటి రోజే మరో ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతుల మంజూరు చేసేలా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపేట్, ములుగు, మెదక్‌లలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీల కోసం రూ. 180 కోట్ల చొప్పున.. గద్వాల, నర్సంపేట, యాదాద్రిలలో కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్ కాలేజీకి రూ.182 కోట్లు, మహేశ్వరం కాలేజీకి రూ. 176 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు కాలేజీలు, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ 8 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీడబ్ల్యూసీ భేటీ పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులు హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులకు పాల్పడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కుదరదని, రాష్ట్రానికి పర్మనెంట్ గ్యారంటీ కేసీఆరేనని చెప్పా రు. ఎవరెన్ని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
5 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వ తేదీ (శుక్రవారం) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీ (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల)లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. -
15న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తొలి విడతలో నిర్మాణం పూర్తయిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తారని, ఇక్కడి నుంచే రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సంవత్సరానికి మిగతా ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను ఆమె శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి రజిని తెలిపారు. -
అయ్యయ్యో.. ఇదేమి బాధ రామోజీ!!
సాక్షి, అమరావతి : ప్రత్యేక జిల్లాతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నంద్యాల ప్రజల చిరకాల వాంఛ. దశాబ్దాల వీరి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు మెడికల్ కళాశాలా మంజూరు చేశారు. ఇప్పటికే తొలి దశ నిర్మాణం పూర్తయి, ఈ ఏడాది నుంచి తరగతులు కూడా మొదలవుతున్నాయి. మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలు కేటాయించారు. దీనికి ప్రతిగా వ్యవసాయ పరిశోధన స్థానానికి మరోచోట 60 ఎకరాలు ఇచ్చారు. ఓ పెద్ద ప్రభుత్వ వైద్య కళాశాల, కలెక్టరేట్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రదే శంలో నిర్మించడాన్ని రామోజీ సహించలేకపోయారు. ఇదేదో నేరమైనట్టు, ఈ భూ ములను చంద్రబాబుమాదిరిగా ప్రైవేటు వ్య క్తు లు, సంస్థలకు పప్పు బెల్లాల్లా పంచేస్తున్నట్టుగా ప్రభుత్వంపై బురద జల్లుతూ ఈనాడులో కథనాన్ని అచ్చేశారు. మెడికల్ కళాశాల, ప్రజలకు అందుబాటులో వైద్య సౌకర్యాలు రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఈ కథనం అచ్చేశారు. వాస్తవాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతో ఉపయోగకరం. దీని ద్వారా రాయలసీమ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల మెడికల్ కళాశాల మంజూరు చేశారు. మెడికల్ కళాశాలకు 50 ఎకరాలు, సమగ్ర కలెక్టరేట్ నిర్మాణానికి మరో 10 ఎకరాలు అవసరమని గుర్తించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన 60 ఎకరాలను వీటికి కేటాయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా తంగడంచ వద్ద మరో 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశోధన స్థానానికి కేటాయించారు. వీటి బదిలీ ప్రక్రియ కూడా మొదలైంది. పరిశోధన స్థానానికి ఇంకా ఎంత భూములు అవసరమైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తప్పేమీ లేదు. అయితే, ఎలాగైనా మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు భూములు ఇవ్వడాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అండతో కొందరు హైకోర్టులో కూడా కేసులు వేశారు. ఈ కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మెడికల్ కళాశాల నిర్మాణానికి అనుమతించింది. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక పూర్తిగా విస్మరించింది. రూ.475 కోట్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇక్కడ అధునాతన సౌకర్యాలతో కూడిన మెడికల్ కళాశాల నిర్మిస్తోంది. ఈ కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రిని జీజీహెచ్‌గా స్థాయి పెంచారు. 11.93 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ భవనాలు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోనే తొలి సంవత్సరం ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. 150 మంది విద్యార్థులు ఇక్కడ తొలి ఏడాది వైద్య విద్యను అభ్యసించబోతున్నారు. మరో వైపు ఇక్కడే 10 ఎకరాల్లో సమగ్ర కలెక్టరేట్ కూడా నిర్మిస్తోంది. దీన్నికూడా ఈనాడు తప్పుబడుతోంది. నిత్యం వందలాది ప్రజలు రాకపోకలు సాగించే మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అదే ఈనాడుకు కంటగింపయింది. ఒక ప్రభుత్వ వ్యవస్థలకు చెందిన భూములను మరో ప్రభుత్వ వ్యవస్థకు కేటాయిస్తే తప్పుపట్టడం ఈనాడుకే చెల్లింది. -
మెడికల్ కాలేజీలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మూడు బయోమెట్రిక్ మిషన్లు, ఒక్కొక్క ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌తోపాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే హాజరు నమోదు చేస్తుండగా, వీటిని నేరుగా డీఎంఈకి అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇకపై వీరి పర్యవేక్షణను జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) కమాండ్ కంట్రోల్ నుంచే చేసేలా చర్యలు తీసుకుంటోంది. నేరుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఉద్యోగుల హాజరును పరిశీలించనున్నారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు హాజరైనప్పుడు ఒకసారి, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేసి, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. గత నెలలోనే ఇందుకు సంబంధించిన అధునాతన బయోమెట్రిక్ పరికరాలను బిగించి, సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేశారు. ఉద్యోగుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి వినియోగిస్తున్నారు. ఏ సమయానికి హాజరు అవుతున్నారు అనే దానితోపాటు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరుకు చెక్ మంచిర్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది 100 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇటీవల నీట్ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది చేరనున్నారు. ప్రతియేటా పెరుగుతున్న మెడిసిన్ విద్యార్థులకు అనుగుణంగా, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం 130 పడకలతో కొనసాగుతోంది. నె లలో 400కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ప్రతీ రోజు 150 మందికి పైగా గర్భిణులు ఓపీకి వస్తున్నా రు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 280 పడకలతో వైద్య సేవలు అందిస్తుండగా, అన్ని విభాగాల్లో అ సోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులను నియమిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 11 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 49 మంది, సీనియర్ రెసిడెంట్లు 44, ట్యూటర్లు 4, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 16 మంది ఉండగా, ఇతర వైద్య సిబ్బంది 20 మందికి పైగా ఉన్నారు. బయోమెట్రిక్ పరికరాలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాజరు సరిగ్గా పాటించని ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సమయపాలన పాటిస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేందుకు ఇప్పటికే మూడు చోట్ల బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నాం. డీఎంఈ నుంచి హాజరును పర్యవేక్షిస్తున్నారు. ఎన్ఎంసీకి అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం లాగిన్‌ఐడీ వస్తే, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదును డీఎంఈతోపాటు ఢిల్లీలోని ఎన్ఎంసీ పరిశీలిస్తారు. – డాక్టర్ ఎండీ సులేమాన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగాల్లో మరో మైలురాయి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ ప్రారంభించేందుకు జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) అనుమతులు లభించినట్లు మంగళవారం ఆమె వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ బృందం.. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించింది. ఆ టైంలో.. అక్కడి నిర్మాణాలు, బోధనా, బోధనేతర సిబ్బంది, వసతులు, ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టళ్లు, ఆస్పత్రి, బోధనా సిబ్బంది అనుభవం, వారి పబ్లికేషన్లు, అందుబాటులో ఉన్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది.. ఇలా అన్నిఅంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెంది.. ఈ ఏడాది నుంచే తరగుతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు ప్రభుత్వానికి అందినట్లు ఆమె తెలిపారు. విజయనగరం మెడికల్ కళాశాలకు మొత్తం 150 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసిందన్నారామె. ఇక.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని పేర్కొన్నారు. అందులో భాగంగానే.. విజయనగరంలో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు అనుమతులు లభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.8,500 కోట్లతో.. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని జగనన్న చేపట్టారని, ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం కళాశాలకు తొలి అనుమతులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. మరో నాలుగు కళాశాలలకు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చుతున్నామన్నారు. ఇందుకోసం అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరయ్యేలా సిబ్బంది నియామకాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, వైద్య పరికరాల కొనుగోలు... ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే.. పీజీ సీట్లను రాష్ట్రంలో గణనీయంగా పెంచుకునే విషయంలోనూ సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249 కు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామని వివరించారామె. -
జోగునాథుని పాలెంలో సీఎం జగన్ సభ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్‌కి సీఎం జగన్ ఫిదా
-
చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు. 12:12 PM నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ అన్నారు. 12:01 PM మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. 11:47AM ►సభాస్థలికి చేరుకున్న సీఎ జగన్ 11:27AM ►రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు ►రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్‌కి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ►ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తున్న సీఎం జగన్ 11:17AM అనకాపల్లి: ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్ ►బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరిన సీఎం.. ►మరికాసేపట్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. 10:56AM ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నర్సీపట్నం బయల్దేరారు. 09:23AM తాడేపల్లి: నర్సీపట్నం బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం ►అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించిన మెస్ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. మహిళా ఉద్యోగి రాజీనామా... ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎల్రక్టీషియన్ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్ 20న రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం బయోమెట్రిక్ నుంచి మినహాయింపు రూల్ ఈజ్ రూల్...రూల్ ఫర్ ఆల్...కానీ ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు. ఆరోపణలన్నీ అవాస్తవమే.. నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. – డాక్టర్ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్ -
Fact Check: ‘పచ్చ పత్రిక’ తప్పుడు ప్రచారం.. వాస్తవం ఇదే..
సాక్షి, అమరావతి: నరసాపురం పర్యటన సందర్భంగా పాలకొల్లులో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ పచ్చపత్రిక తప్పుడు ప్రచారానికి దిగింది. అయితే ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు ఓ సారి గమనిస్తే.. వైద్యశాఖలో సమూల మార్పులకు సీఎం జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం కింద 17 కొత్త వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.475 కోట్లతో ప్రభుత్వం వైద్యకళాశాల నిర్మాణం చేపట్టింది. ప్యాకేజ్–3 కింద పాలకొల్లు, ఏలూరు వైద్యకళాశాలల నిర్మాణం చేపడుతుండగా ఈ కాంట్రాక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ 28వ తేదీన ఆ సంస్థకు ఎల్వోఏ జారీచేశారు. పాలకొల్లు వైద్యకళాశాల నిర్మాణానికి నాబార్డు ఈ ఏడాది సెప్టెంబర్ 27న రూ.275 కోట్ల రుణం మంజూరు చేసింది. దీంతో వైద్యకళాశాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాలకొల్లులో వైద్య కళాశాల నిర్మాణం కోసం పనులు జరుగుతున్న దృశ్యాలు ప్రీ కన్స్ట్రక్షన్ కార్యకలాపాలను ప్రారంభించి మానవ, ఇతర వనరులను సమకూరుస్తోంది. పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వరంగంలో అందించడమే లక్ష్యంగా కొత్త వైద్యకళాశాలల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ఇటీవల వరదల నేపథ్యంలో ఆ ప్రదేశంలో నీరు చేరడంతో పనులు ఆలస్యమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టచతుష్టయం పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జనరల్ మెడిసిన్‌కు డిమాండ్!
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఈ ఏడాది జనరల్ మెడిసిన్ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జనరల్ మెడిసిన్ చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేసేందుకు అవకాశాలుంటాయి. జనరల్ మెడిసిన్(ఎండీ) పూర్తయ్యాక గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, మెడికల్ అంకాలజీ, కార్డియాలజీ, వంటి సూపర్ స్పెషాలిటీ(డీఎం) కోర్సులు చేసేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో తొలి కౌన్సెలింగ్‌లోనే జనరల్ మెడిసిన్ సీట్లు భర్తీ అవుతున్నాయి. వైద్య విద్యార్థుల రెండో ప్రాధాన్యంలో రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి, గైనకాలజీ(ఓబీజీ), పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ కోర్సులుంటున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి నీట్ పీజీ–2022లో 8,636 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 13 ప్రైవేట్, ఒక మైనారిటీ వైద్య కళాశాలలున్నాయి. వీటిలో 2,207 పీజీ ఎండీ/ఎంఎస్ సీట్లున్నాయి. వీటిలో ఆలిండియా కోటా కింద 475 సీట్లు భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 1,138 సీట్లు కన్వీనర్ కోటాలో, 594 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్య కళాశాల, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీపడతారు. మరో వైపు రాష్ట్రం నుంచి నీట్ ఎండీఎస్–2022లో 896 మంది అర్హత సాధించారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలలో రెండు డెంటల్ కళాశాలలున్నాయి. ఈ రెండు కళాశాలలు, ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో 400 వరకూ ఎండీఎస్ సీట్లున్నాయి. ఇన్ సర్వీస్ సీట్ల భర్తీ ఇలా.. రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఇన్–సర్వీస్ అభ్యర్థులకు కేటాయించారు. మరో వైపు ఇన్–సర్వీస్ కోటా నిబంధనల్లో ప్రభుత్వం ఈ ఏడాది మార్పులు చేసింది. గిరిజన ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన వైద్యులకు ఇన్ సర్వీస్ కోటా కింద ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, ఏపీ వైద్య, ఆరోగ్య సేవలు, ఏపీవీవీపీ, ఏపీ ఇన్‌స్రూ?న్స్ మెడికల్ సర్వీసెస్, యూనివర్సిటీల్లో నిరంతరాయంగా ఆరేళ్లు సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాలో ప్రవేశాలు కల్పించనున్నారు. స్పెషలైజేషన్ పూర్తయ్యాక ఇన్‌సర్వీస్ కోటా కోసం పని చేసినట్టు చూపిన ప్రాంతంలోనే ఆరేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. -
పైడితల్లి అమ్మవారి సాక్షిగా మాటిచ్చారు.. ఆ మేరకు రూ.500 కోట్లతో..
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా గాజులరేగ సమీపంలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం చకచకా సాగుతోంది. మాస్ కాంక్రీట్ పనులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మాట మీద నిలబడే నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పైడితల్లి అమ్మవారి సాక్షిగా జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారన్నారు. ఆ మేరకు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. 70 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో పనులు సాగుతున్నాయన్నారు. వైద్యకళాశాల మొత్తం విస్తీర్ణం 14 లక్షల చదరపు అడుగులు కాగా, తొలివిడతగా 6 లక్షల చదరపు అడుగుల కాంక్రీట్ పనులను ప్రారంభించామని చెప్పారు. తమది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వంగా పేర్కొన్నారు. మూడేళ్లలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంత వరకు 2023–24 విద్యా సంవతర్సం నుంచి జిల్లా కేంద్రాస్పత్రిలో బోధన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కేంద్రాస్పత్రి ఆధునికీకరణ పనులు, ప్రీ ఇంజినీరింగ్ బిల్లిండ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఓ వైపు వైద్యకళాశాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుంటే, వైద్య కళాశాల ఎక్కడని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి టీడీపీ నాయకులు వస్తే కళాశాల ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు మాదిరి ఎన్నికల ముందు ఉత్తుత్తి జీఓలను జారీ చేసి, ప్రజలను మోసం చేసే అలవాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ప్రకటించారని, ఆ తర్వాత మూడేళ్లు పట్టించుకోలేదన్నారు. అనంతరం అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ట్రస్టు వారు వైద్యకళాశాల నిర్మిస్తారని చెప్పారని, అది కూడా అమలు కాలేదన్నారు. 2019 ఏప్రిల్ 11లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఫిబ్రవరిలో వైద్య కళాశాలకోసం ఓ లేఖ విడుదల చేశారని, చంద్రబాబు మోసపూరిత మాటలను జనం బాగా గమనించి 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పారన్నారు. వైద్య కళాశాల నిర్మించడం లేదని అప్పట్లో చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు లేఖరాసిన విషయం ఇప్పుడు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. జిల్లాను పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలవద్దకు వెళ్లారన్నారు. గరివిడి వేదికగా ఎన్టీఆర్‌ను గద్దెదించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యారని, ఆయన నాయకులు కూడా ఆవిధంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ►ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ప్రజలు కలగంటున్నారని తెలిపారు. ప్రజల ఆశలను నేరవేరుస్తూ.. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను సీఎం మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే జిల్లా ప్రజలకు బోధనాస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు నాలుగు ఇటుకులు, రెండు సిమ్మెంట్ బస్తాలువేసి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అప్పటి సీఎం వైఎస్సార్, మంత్రి బొత్సల కృషితో తోటపల్లి ప్రాజెక్టు కల సాకరమయిందని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ చివరిదశకు వచ్చిందని, త్వరలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో జిల్లాకు జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం మంజూరైందని, గిరిజన విశ్వవిద్యాలయం పనులు కూడా చేపడతామని చెప్పారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుటుంబం స్వయంగా డాక్టర్లు అయి ఉండి కూడా కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో దాక్కొని జిల్లా ప్రజలను గాలికివదిలేశారని విమర్శించారు. ఒక్కపేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని గుర్తుచేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి ప్రజల చిరకాలవాంఛ తీర్చారన్నారు. తను సీఎంగా ఉంటే కరోనా వచ్చేదా అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనా మహమ్మారికి ప్రపంచమే వణికి పోయిన విషయం హైదరాబాద్‌లో దాక్కొన్న చంద్రబాబుకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. వయసు పైబడడంతో మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ మాదిరి వైద్యకళాశాల కోసం తూతూమంత్రంగా ప్రకటనలు చేయలేదన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా సాగుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు భారతి, జేసీ మయూర్‌అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ సత్యప్రభాకర్, కేవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వైద్యకళాశాల కాంక్రీట్ పనులను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం
-
MBBS: ఎంబీబీఎస్.. అనంత బెస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేరడానికి ఒకప్పుడు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇతర ప్రాంతాల్లో అవకాశం లేకపోతేనే ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అనంతపురం మెడికల్ కాలేజీ మిగతా కళాశాలలకు దీటుగా పోటీ పడుతోంది. వసతులు భేష్ అనంత మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటైంది. మెరుగైన వైద్యవిద్య అభ్యసించేందుకు ఇది దోహదపడుతోంది. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భారీగా అధ్యాపకుల నియామకం చేపట్టింది. ఇటీవల జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో 60 మందికి పైగా అనంతలోనే నియమితులయ్యారు. తాజాగా అదనపు పోస్టులు కూడా మంజూరు చేసింది. నర్సింగ్ సేవలకూ పెద్దపీట వేస్తూ వంద మంది కొత్త నర్సులను నియమిస్తోంది. ఈ పరిణామాలతో అనంత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకూ ఆంధ్రా మెడికల్ కాలేజీ (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కాలేజీ (గుంటూరు) మొదటి వరుసలో కొనసాగుతున్నాయి. రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), కర్నూలు మెడికల్ కాలేజీ (కర్నూలు) వంటి వాటిలో రెండో అవకాశం కింద చేరుతున్నారు. ఈ తరహాలోనే అనంతపురం మెడికల్ కాలేజీలోనూ చేరడానికి ఎంతోమంది సుముఖత చూపుతున్నారు. గత ఏడాది జాతీయ ర్యాంకులను పరిశీలిస్తే రాష్ట్రంలోని మూడు రిమ్స్‌లతో పోలిస్తే అనంత మెడికల్ కాలేజీలోనే మెరుగైన ర్యాంకర్లు చేరారు. మెరుగైన ర్యాంకర్లు ఇక్కడికే.. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది ర్యాంకులు (నీట్) పరిశీలిస్తే.. అనంతపురం చాలా కాలేజీల కంటే మెరుగ్గా ఉన్నట్టు తేలింది. రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఒంగోలు, రిమ్స్ కడప, రిమ్స్ శ్రీకాకుళం, ఏసీఎస్ఆర్ నెల్లూరుతో పోలిస్తే అనంతపురం వైద్య కళాశాలలోనే వివిధ కేటగిరీలకు చెందిన మెరుగైన ర్యాంకర్లు చేరారు. ఉదాహరణకు నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో బీసీ–ఈ అభ్యర్థి 68,665 ర్యాంకుతో చివరి సీటు పొందారు. అదే అనంతపురంలో 60,586 ర్యాంకుకే బీసీ–ఈ సీట్లు పూర్తయ్యాయి. అదే శ్రీకాకుళం రిమ్స్‌లో అయితే ఏకంగా 1,15,113 ర్యాంకు వచ్చిన బీసీ–ఈ అభ్యర్థికి చివరి సీటు లభించింది. దీన్నిబట్టి అనంతలో వైద్యవిద్య అభ్యసించడానికి మెరుగైన ర్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారన్నది స్పష్టమవుతోంది. -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్.. ఇది ఎంతో మంది విద్యార్థుల కల. వారి కలలను నిజం చేసే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీ కూడా ఇప్పటికే వచ్చేసింది. సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్’ జరగనుంది. గతేడాది కంటే ఈసారి మరింత పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో సీట్లు రాని చాలా మంది విద్యార్థులు.. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీటు కోసం పోటీ పడుతున్నారు. దంత వైద్య సీటు వచ్చినా చేరకుండా.. ఎంబీబీఎస్ కోసం వేచిచూస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. గతేడాది దాదాపు 60 వేల మంది రాష్ట్రం నుంచి నీట్‌కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య 70 వేలకు చేరే అవకాశముంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 4,858 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్టు తేలింది. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185, ప్రైవేటులో 2,673 సీట్లున్నాయి. పద్మావతి మహిళా వైద్య కళాశాల(అటానమస్)లో 152 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ(కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్‌లో 120 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి కాలేజీలో 10 శాతం.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం 2,185 ఎంబీబీఎస్ సీట్లలో.. 324 సీట్లు నేషనల్ పూల్(ఆల్ ఇండియా కోటా) కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ప్రతి వైద్య కళాశాలలో 10 శాతం చొప్పున మరో 335 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అటానమస్ అయిన పద్మావతి మహిళా వైద్య కళాశాలలోని 152 సీట్ల(ఈడబ్ల్యూఎస్‌తో కలిపి)లో నేషనల్ పూల్‌కు 26 కేటాయిస్తారు. మిగిలిన 126 సీట్లు రాష్ట్ర కోటాలోనే భర్తీ చేస్తారు. ‘ప్రైవేటు’ యాజమాన్య కోటాలో 921 సీట్లు.. రాష్ట్రంలోని 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2,673 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 50 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తీసుకునే ఫీజులే.. కన్వీనర్ కోటా సీట్లకు కూడా వర్తిస్తాయి. యాజమాన్య కోటా కింద 921 సీట్లు, ప్రవాస భారతీయ(ఎన్నారై) కోటా కింద 427 సీట్లు భర్తీ చేస్తారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అత్యధిక సీట్లు(250) నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలోనే ఉన్నాయి. తమ ఎంబీబీఎస్ కలను నెరవేర్చుకునేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ నీట్‌కు సిద్ధమవుతున్నారు. -
ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్ల వ్యయంతో ఒకేసారి ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వైద్య విద్యా రంగంలో పెను మార్పులకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ వైద్య విద్యా రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రభ్వుత్వ సామాజిక బాద్యతగా చేపట్టి భావి తరాల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై పలు సార్లు సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. కార్పొరేట్‌కు ధీటుగా 50 ఎకరాల్లో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలపై జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం కోసం పంపారు. పాడేరు, మచిలీపట్నం కాలేజీలపై కూడా ఈ నెలలోనే జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపనున్నారు. ఈ నాలుగు కాలేజీలకు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం బాపట్ల మెడికల్ కాలేజీల జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్లో టెండర్లను ఆహ్వానించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల నిర్మాణాలపై జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం జనవరిలో టెండర్లు ఆహ్వానించేలా కార్యాచరణ రూపొందించారు. -
ప్రభుత్వ, కన్వీనర్ కోటా సీట్లు 3,662
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు కలిపి 3,662 ఉన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్‌లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారిలో కొందరు ఇప్పటికే వివరణ ఇవ్వగా, ఇంకొందరు స్పందించలేదు. దీంతో వారిపై వేటు వేసేందుకు వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) కార్యాలయం రంగం సిద్ధం చేసింది. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తెప్పించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా వారిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తీవ్ర సంచలనంగా మారింది. అనుభవం ఉండి, సీనియర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏడాదికిపైగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వారికి ఉద్వాసన పలకక తప్పట్లేదని డీఎంఈ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
మెడికల్ కాలేజీకి మృతదేహాల తరలింపు
సాక్షి, మహబూబ్‌నగర్ : ‘దిశ’కేసులో ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు నిందితుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల పహారా మధ్య శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు, అధికారుల రాకపోకల కారణంగా జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగడంతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే మృతదేహాలను మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర శివారులో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. సోమవారం వరకు మృతదేహాలను అక్కడే భద్రపరచనున్నారని సమాచారం. -
అభివృద్ధి బాట
-
పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీనికి డిసెంబర్లో శంకుస్థాపన చేయాలని చెప్పారు. పులివెందుల శిల్పారామానికి సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సూచించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ (పాడా)పై ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. పాడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్’
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తాం. రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తాం. ఇదివరకెన్నడూ ఇలాంటి సౌకర్యం లేదు. పేదలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్నాళ్లు పనులకు వెళ్లలేరు. ఆ సమయంలో వారి ఇల్లు గడవడం కష్టం. అందుకే మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. సుమారు 100కు పైగా సిఫార్సులతో 182 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుమారు 3 గంటల పాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని చెప్పారు. కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో 2 వేల వ్యాధులకు వైద్యం అందిస్తామని, వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అనంతరం లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు 1200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, ఆ తర్వాత 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందాలన్న లక్ష్యం మేరకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం వెల్లడించారు. పెన్షన్ పరిధిలోకి మరికొన్ని వ్యాధులు ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నామని, ఇకపై మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పుట్టుకతోనే వచ్చే హెచ్చ్వీ, పక్షవాతం బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్ ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధిగ్రస్తుల జాబితాను రూపొందించాలని, వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు సంతృప్తికర వేతనాలు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహించకూడదన్న విధానం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఇక్కడ కూడా అమలు చేస్తే బావుంటుందని నిపుణుల కమిటీ సీఎంకు సూచించింది. ఈ మేరకు వారికి సంతృప్తికరంగా వేతనాలు పెంచి, ఆ విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ఎంత మేరకు వేతనాలు పెంచాలో అధికారులు నివేదిక ఇస్తే, దాని ప్రకారం పెంచి, ప్రైవేట్ ప్రాక్టీసును రద్దు చేస్తామన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కోసం తక్షణమే నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వాసుపత్రులు కొత్తకళను సంతరించుకునేలా మార్పులు తీసుకురావాలని చెప్పారు. 104, 108 వాహనాల నిర్వహణకు సమర్థ యంత్రాంగం ఉండాలని, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాటి నిర్వహణ ముఖ్యమైనదని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పీపీపీ ప్రాజెక్టుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను కమిటీ ముఖ్యమంత్రికి వివరించగా.. వీటిపై చర్యలు తీసుకోవాలని, ఇకపై నాణ్యమైన మందులను కొనుగోలు చేయాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలసి ఆరోగ్య శాఖలో సంస్కరణలపై నివేదిక అందజేస్తున్న నిపుణుల కమిటీ. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు మూడు కొత్త వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఇప్పటికే పాడేరు, గురజాల, విజయనగరంలలో కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవికాక పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల కేంద్రం 75 కొత్త వైద్య కళాశాలలను ప్రకటించిందని, వాటిల్లో మనకు వచ్చే అవకాశం లేదని అధికారులు వివరించగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఎందుకు ఇవ్వరు.. మనం వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి కళాశాలలు ఇవ్వాలని కోరదాం.. కచ్చితంగా ఇస్తారన్న నమ్మకముంది’ అని సీఎం అన్నారు. వీలైనంత త్వరలో ఆ ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్)లు తయారు చేయాలని ఆదేశించారు. కొత్తగా స్విమ్స్ హెల్త్ యూనివర్శిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మాత్రమే ఉంది. ఈ యూనివర్శిటీ పరిధిలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇకపై స్విమ్స్ ఆస్పత్రి కేంద్రంగా కొత్త హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వైద్య కళాశాలలన్నీ స్విమ్స్ యూనివర్శిటీ పరిధిలోకి, మిగతా జిల్లాల వైద్య కళాశాలలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల పర్యవేక్షణ, నిర్వహణ మరింత సులభంగా ఉంటుందని అధికారులకు సూచించారు. ఈ దిశగా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించారు. రోగి ప్రభుత్వాసుపత్రికి మాత్రమే వెళ్లేలా వాటి రూపు రేఖలు మార్చడంతో పాటు సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తేనే మంచి వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించాలి. ప్రతి వైద్య కళాశాలలోనూ నర్సింగ్ కళాశాల కూడా ఉండాలి. గ్రామీణ స్థాయిలో సరైన వైద్యసేవలు అందేలా ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇటీవల రాజమండ్రి ఆస్పత్రికి వెళ్లా.. పాత పడకలు, తిరగని ఫ్యాన్లు, బూజుపట్టిన కిటికీలు.. చూడ్డానికి ఏమాత్రం బాగోలేదు. ఇలా ఉంటే రోగులు ఎలా వస్తారు? ఇలా కాదు..ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను మార్చండి. నిధుల కొరత రాకుండా చూస్తాము. -
మెడికల్ కళాశాలలో రాగింగ్ కలకలం
-
ఫస్ట్ ప్రైవేటుకా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తికాకముందే ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ అయిపోయాకగానీ ప్రైవేటు సీట్ల వైపు విద్యార్థులు వెళ్లరు. ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మూడో విడత, ఆ తర్వాత నాలుగో విడత కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. పైగా జాతీయస్థాయిలో నీట్ రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత, నేషనల్ పూల్‌కు రాష్ట్రం నుంచి ఇచ్చిన 15 శాతం సీట్లల్లో భర్తీ కాకుండా మిగిలే సీట్లను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వాటిని కూడా మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతోపాటు భర్తీ చేస్తారు. అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 190 సీట్లు, ఎన్సీసీ సీట్లు ఉన్నాయి. వాటన్నింటికీ మూడో విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఇవన్నీ ఉండగా.. వాటి కౌన్సెలింగ్ పూర్తికాకముందే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లను నింపడం కోసం ముందస్తుగానే కౌన్సెలింగ్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు కన్వీనర్ కోటాలో రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే పూర్తయింది. రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 24 లోగా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మూడో విడత ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానుంది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీలకు ఈ నెల 25 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోతామని ఆందోళన.. మూడో విడతలో సీటు వస్తుందన్న ఆశ ఉన్నప్పటికీ, ఏదో భయంతో బీ, సీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరుకాక తప్పని పరిస్థితి. ఒకవేళ అందులో సీటు వస్తే చేరాలా? వద్దా? ఒకవేళ చేరితే కన్వీనర్ కోటాలో మూడో విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీటు వస్తే ఏమవుతుందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏ కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో రూ.10 వేలు, ప్రైవేట్ కాలేజీల్లో రూ.60 వేలుగా ఫీజు ఉంది. అదే బీ కేటగిరీ అయితే ఏడాదికి రూ.12 లక్షలు, సీ కేటగిరీకి రూ.24 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంది. బీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే రూ.40 వేలు డీడీనీ యూనివర్సిటీ ఫీజు కింద చెల్లించాలి. సీటు వచ్చిందంటే రూ.12 లక్షలు కాలేజీ ఫీజు, రెండో ఏడాదికి మరో రూ.12 లక్షల గ్యారంటీతో ఆగస్టు రెండో తేదీలోపు ఆయా ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేరాలి. అప్పటివరకు ఏ కేటగిరీ మూడో విడత కౌన్సెలింగ్ జరగదు. ఒకవేళ బీ కేటగిరీలో చేరిన తర్వాత ఏ కేటగిరీలో సీటు వస్తే రూ.40 వేలు, కాలేజీకి సంబంధించిన ఇతరత్రా ఫీజులు దాదాపు రూ.50 వేలు వదులుకోవాల్సిందే. అలా అని వదిలేస్తే సీటు పోతుందేమోనని భయం. ఎటూ తేల్చుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకవేళ వదులుకోవాలని ప్రయత్నిస్తే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. పైపెచ్చు బీ, సీ కేటగిరీ సీట్లకు డబ్బులు సమకూర్చుకోవడం, చెల్లించడం, బ్యాంకు గ్యారంటీ చూపడం తప్పదు. ఇదంతా కూడా మధ్యతరగతి ప్రజలకు అత్యంత భారం కానుంది. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. బీ, సీ కేటగిరీ సీట్లు నింపకపోతే సమస్య.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించాలి. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ. అప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్లను భర్తీ చేయకపోతే ఏకంగా ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు నిండే అవకాశం ఉండదు. అంత తక్కువతో కాలేజీలను ఎలా ప్రారంభించగలం? కన్వీనర్ కోటాలో సీటు వస్తుందా? రాదా? అన్నది విద్యార్థులు వారివారి ర్యాంకులను బట్టి అంచనాకు వచ్చే అవకాశముంది. ఆ ప్రకారం కన్వీనర్ కోటాలో వచ్చేట్లయితే బీ, సీ కేటగిరీలో చేరకుండా ఉండాలి. అంచనా వేయలేని పరిస్థితుల్లో బీ కేటగిరీలో చేరి.. మూడో దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీటు వస్తే చెల్లించిన డొనేషన్‌ను ప్రైవేటు కాలేజీలు తిరిగి వెనక్కి ఇస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. –డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ -
యూనిట్ల లెక్క తప్పింది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్లు కాపాడుకునేందుకు ఇచ్చిన తప్పుడు లెక్కలు ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ ఉన్నట్లు చూపించి సీట్లను కాపాడుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్) కింద 10 శాతం కోటా కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం పీజీ వైద్యసీట్లను అదనంగా 10 శాతం పెంచుతామని ప్రకటించింది. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పీజీ వైద్యసీట్లు, యూనిట్లు, అధ్యాపకులు, బెడ్లు ఇలా అన్ని వివరాలను తక్షణమే పంపించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 శాతం ఈబీసీ కోటా అమలు చేయాలని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 శాతం సీట్లు పెంచాలన్నది కేంద్రం ఆలోచన. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో స్పెషాలిటీల వారీగా అదనంగా 3 సీట్లు వస్తాయి. ప్రతి స్పెషాలిటీలో ప్రతి కళాశాలలో సీట్లు పెరుగుతాయి. ఈ ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిక్కుల్లో పడింది. ఒక పీజీ వైద్య సీటుపెరగాలంటే ఫ్యాకల్టీ నుంచి యూనిట్ల వరకూ లెక్కలుండాలి. ఇదివరకే రాష్ట్రంలో తక్కువ యూనిట్లున్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించి పీజీ వైద్య సీట్లను నిలుపుకుంది. కొన్ని కాలేజీల్లో యూనిట్ల లెక్కలు ప్రభుత్వం నిధులిచ్చేనా? రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 820 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా, ఈబీసీ కోటా కింద 10 శాతం అదనంగా.. అంటే 82 పీజీ వైద్యసీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, ఈ 82 సీట్లకు సంబంధించిన వసతులు కల్పించే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే మౌలిక వసతులు, వైద్య పరికరాలకు అవసరమైన నిధులే ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈబీసీ కోటా సీట్లకు కావాల్సిన వసతులు ఏ మేరకు కల్పిస్తారోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యసీట్లలో ఈబీసీ కోటా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ కోటా కోసం పెరగాల్సిన సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో కష్టాలు తప్పవంటున్నారు. 10 శాతం అదనపు సీట్లకు యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? యూనిట్లు కావాలంటే అదనపు సిబ్బంది కావాలి, నర్సులు పెరగాలి, పడకలు పెరగాలి, ఇవన్నీ చెయ్యాలంటే నిధులు కావాలి, ఏం చేద్దాం అంటూ వైద్య విద్యా శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. ఉన్న సీట్లనే కాపాడుకోవడానికి లేని యూనిట్లను చూపిస్తున్నాం, మళ్లీ కొత్త సీట్లు కావాలంటే ఉన్నవి కూడా పోయే ప్రమాదం ఉంటుందేమో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేషనల్ పూల్‌లోకి 173 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మరో 15 బీడీఎస్ సీట్లు కూడా పూల్‌లో చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య విద్య అదనపు జనరల్ కార్యాలయం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మొదటిసారిగా రాష్ట్రం నేషనల్ పూల్‌లోకి వెళ్లడంతో 173 ఎంబీబీఎస్, 15 బీడీఎస్ సీట్లకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడతారు. ఇప్పటికే నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కానీ మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్ పూల్‌లో చేర్చలేదు. తాజాగా చేర్చడంతో వచ్చే నెల 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్ కౌన్సెలింగ్ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 4,890 సీట్లు అందుబాటులోకి.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం ప్రకారం 4,890 సీట్లు నేషనల్ పూల్‌లోకి వచ్చాయి. ఆయా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని, ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 ప్రభుత్వ సీట్లకే పోటీ పడే తెలంగాణ విద్యార్థులకు, ఇక దేశంలోని దాదాపు 5 వేల నేషనల్ పూల్ సీట్లలో కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. 28 వరకు ఈసెట్ వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈ నెల 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయినవారు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు(లెటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ సోమ వారం మొదలైంది. 1 నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను వెరిఫికేషన్‌కు ఆహ్వానించగా 4,811 మంది హాజరయ్యారని కమిటీ తెలిపింది. నేడు 6,001వ ర్యాంకు నుంచి 14 వేల ర్యాంకు వరకు సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ‘పార్ట్‌టైం’ టీచర్ పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్లో పార్ట్‌టైం టీచ ర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.సుజాత తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూప్–4 వంటి పోటీ పరీక్షలకు సంబంధించి పాఠాలను భోధించడానికి అనుభవం కలిగిన లెక్చరర్లు అర్హులన్నారు. పేపర్–1లో జనరల్ నాలెడ్జ్(కరంట్ ఎఫైర్స్), పేపర్– 2లో మెంటల్ ఎబిలిటీ, వెర్బల్–నాన్ వెర్బల్ తదితర సబ్జెకులను బోధించడానికి ఆసక్తి గల వారు తమ బయోడేటాను bcstudycircle&hyd@yahoo. co.in కు మెయిల్ చేయాలని తెలిపారు. ఈ నెల 28 లోగా అర్హతలు, అనుభవంతో కూడిన సర్టిఫికెట్ల కాపీ లను మెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 2018–19 విద్యాసంవత్సరానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో అడ్మిషన్లు స్వీకరించేందుకు సోమవారం వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 29 మధ్యాహ్నం రెండు గంటల నుంచి జూలై 12 సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. అర్హుల జాబితాను జూలై 15న వెబ్సైట్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను జూలై 16 నుంచి 19 వరకు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఫలితాలు 27న విడుదల చేస్తామన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆగస్టు 10న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 16 నుంచి తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.knruhs.in లో సంప్రదించాలన్నారు. నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఎస్సీ విద్యార్థులకు ఇవ్వనున్న నీట్లాంగ్టర్మ్ కోచింగ్ 2018–19 ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం 2 లక్షలలోపు ఉండి, నీట్లో 250 మార్కులకు పైగా, తెలంగాణ ఎంసెట్‌లో 80 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు ఈ కోచింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www. tswreis.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. 28 నుంచి హాస్టల్ వెల్ఫేర్ దరఖాస్తుల్లో సవరణలు సాక్షి, హైదరాబాద్: బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న కొంత మంది అభ్యర్థుల బయోడేటా వివరాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పీడీఎఫ్ రూపంలో ఉండే తమ బయోడేటా వివరాలను సరిచూసుకుని తప్పులు ఉంటే ఈ నెల 28 నుంచి 30 వరకు సవరించుకోవాలని సూచించింది. వెబ్సైట్లో ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని సవరించుకోవాలని పేర్కొంది. రెండు శాఖల్లోని పోస్టులకు వచ్చే నెల 29న ఒకే పరీక్షను(ఉదయం, మధ్యాహ్నం) నిర్వహించనున్నట్లు వివరించింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 28న వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 28న రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10కి వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. 9 నుంచి ఎడ్‌సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వచ్చే నెల 9 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామంది. 9 నుంచి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని, అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. నేడు డీసెట్ ఎడిట్ ఆప్షన్ సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి డీసెట్ అభ్యర్థులకు మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని డీసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు http://deecet.cdse.telangana.gov.in లో చూడాలని, సందేహాలకు 6300767628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కాలునే దిండుగా..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఝాన్సీ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాలును తొలగించిన వైద్యులు.. ఆ కాలును తలగడగా వినియోగించి మరోసారి అమానవీయంగా వ్యవహరించారు. క్యాజువాలిటీ వార్డ్‌లో స్ట్రెచర్‌పై పడుకున్న రోగి.. ఆయన తలగడగా తొలగించిన కాలున్న వీడియోను ఓ స్థానిక టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ ఆసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ స్కూలు బస్సుకు క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. శనివారం బస్సు ప్రమాదంలో కాలు విరగటంతో హుటాహుటిన ఝాన్సీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్లు వెంటనే కాలు తీసేశారు. అనంతరం, బెడ్‌పై కాకుండా స్ట్రెచర్‌పైనే ఆ వ్యక్తికి చికిత్సనందించిన డాక్టర్లు.. ఆ వ్యక్తికి ఆయన కాలునే తలగడగా పెట్టారు. దీన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తొలగించిన కాలు ఎలా గదిలోకి వచ్చిందో తెలియదని డాక్టర్లంటున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రిలోనే కాలు తొలగించామని, లోపలకు ఎలా వచ్చిందో తెలియదని చెబుతుండగా.. ప్రమాదం జరిగిన చోటే కాలు తెగిపోయిందని, కుటుంబ సభ్యులు దీన్ని తీసుకొచ్చి ఉంటారని మరికొందరంటున్నారు. అయితే.. ఈ ఆసుపత్రిలో స్వీపర్లు, వార్డ్బాయ్లే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. -
అమ్మ కోసం సాహసోపేత నిర్ణయం
-
అధ్యాపకుల కొరతపై ఏం చేస్తున్నారు?
- పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి - ప్రభుత్వం, ఎంసీఐలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని మంగళ వారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులను 70 ఏళ్ల వరకు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డాక్టర్ జి.హరికిషన్ గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకుండానే, మరో 3 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల కొరత ఉందని, వాటి భర్తీకి చర్యలు తీసుకోకుండా మళ్లీ కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడం సమస్యను జటిలం చేయడమేనన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యే వ్యక్తి ఎండీ/ ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ పూర్తి చేసి ఉండాలని, ఇవి పూర్తి చేసేందుకు ఓ విద్యార్థికి 12 ఏళ్లు పడుతుందన్నారు. అన్నీ పూర్తయి సర్వీసులో చేరే నాటికి 45 సంవత్సరాల వయస్సు వస్తోందని, పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లని ఆయన తెలిపారు. ఇలా రిటైర్ అయిన వారిని ప్రైవేటు కాలేజీలు నియమించుకోవడం ద్వారా ఆ కాలేజీలు లబ్ధి పొందుతున్నాయన్నారు. దీంతో అనుభవజ్ఞులు లేక ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే సామాన్యులు నష్టపోతున్నారని తెలిపారు. వచ్చే విద్యా ఏడాదికి నిజామా బాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో 3 వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంసీఐ నిబంధనల అమల్లో భాగంగా అధ్యాపకులను డిప్యుటేషన్‌పై తీసుకుంటోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవ హారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఎంసీఐలను ఆదేశించింది. -
'పొన్నం సుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి'
కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మూడో రోజుకు చేరింది. పొన్నం ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేశం ఆయనకు వైద్య పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ పడిపోయాయని, నీళ్లు తాగుతుండాలని, దీక్ష విరమించుకోవాలని సూచించారు. లేకుంటే మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతుందన్నారు. వైద్య పరీక్షల నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని డాక్టర్ రాజేశం తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని పొన్నం స్పష్టం చేశారు. -
ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం మెడికల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్) ట్రైనింగ్ కళాశాలలో ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుజాత గురువారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 21లోపు దరఖాస్తులు తీసుకొని సెప్టెంబర్ 4వ తేదీలోపు కళాశాలలో అందజేయాలన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.50 డీడీని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అమరావతి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంక్‌లో తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి చేసి ఉండి 30 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. ఇంటర్ (ఏ గ్రూప్ అయినా అర్హులే), తత్సమాన అర్హత ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 7981178492, 7386099469లో సంప్రదించాలన్నారు. -
సీట్లు కాపాడుకునేందుకు పాట్లు!
⇒ నిబంధనలు పాటించకపోవడంతో ⇒ తాజాగా కాకతీయ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది. ప్రతీ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు రావడం.. లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. 3 నెలల కిందట ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 100 సీట్లను 2017–18 సంవత్సరానికి పునరుద్ధరించడానికి ఎంసీఐ నిరాకరించింది. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, కొత్తగా ఏర్పడిన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల పునరుద్ధరణకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, ఉస్మానియాల్లోని ఎంబీబీఎస్ సీట్ల అనుమతి కోసం లేఖ రాయగా.. తాజాగా తిరస్కరించిన మహబూబ్‌నగర్, కాకతీయ మెడికల్ కాలేజీల్లోని సీట్ల పునరుద్ధరణకు లేఖ రాయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లను బుధవారం ఆదేశించారు. వారితో ఆయన సమావేశం నిర్వహించారు. తరచూ ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోందని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్లే.. కాకతీయ మెడికల్ కాలేజీలో 19.06 శాతం బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 30.85 శాతం బోధన సిబ్బంది.. 17.02 శాతం రెసిడెంట్ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్ సూపరింటెండెంట్‌గా నియమించారు. గతంలో ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేకపోవడంతో ఎంసీఐ సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పట్లో లేఖ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు ఉస్మానియా, నిజామాబాద్ కాలేజీ సీట్ల పునరుద్ధరణకు అనుమతిచ్చారు. -
వైద్య విద్యలో పరిశోధనకు ‘మెరిట్’!
రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించనున్న సర్కారు ⇒ ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల కోసం రూపకల్పన ⇒ దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేక కార్యాచరణ ⇒ నాలుగు విభాగాల్లో పరిశోధనలకు అవకాశం ⇒ ఇప్పటికే పలు అంశాలపై 170 దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు వివిధ అంశాలపై పరిశోధన చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో వైద్య విద్య, పరిశోధన (మెరిట్) అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వ్యక్తులుగా, గ్రూపులుగా ఏర్పడి వివిధ అంశాలపై పరిశోధన చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇందుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం (స్కాలర్షిప్) అందిస్తారు. దీనికోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా.. 170 మంది ముందుకు వచ్చారు. దరఖాస్తులతో పాటు తాము ఏ అంశంపై పరిశోధన చేయాలనుకుంటున్నారో కూడా పేర్కొన్నారు. అధికారులు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసి.. స్కాలర్షిప్ అందజేస్తారు. అభ్యర్థులు వారు పేర్కొన్న అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిశోధన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రశంసించిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి అంశాలు రక్తహీనత, మలేరియా ‘మెరిట్’ స్కాలర్‌షిప్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. ఇందులో వివిధ విభాగాల్లో పరిశోధనకు అవకాశం కల్పించారు. అడ్హాక్ రీసెర్చ్ విభాగంలో విద్యార్థులు నచ్చిన అంశంపై పరిశోధన చేయవచ్చు. దీనికి ఇప్పటివరకు 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. టాలెంట్ రీసెర్చ్ విభాగంలో ఇద్దరు ముగ్గురు కలసి సీసీఎంబీ, ఐఐసీటీలతో ఉమ్మడిగా పరిశోధన కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకోసం 53 మంది దరఖాస్తు చేసుకున్నారు. అడ్వాన్స్డ్ రీసెర్చ్ విభాగంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు విటమిన్ల లోపంతో బాధపడే వారికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన అంశాలను ఎలా అమలు చేయాలో పరిశోధిస్తారు. ఈ విభాగం కింద 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక టాస్క్‌ఫోర్స్ రీసెర్చ్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈసారి రక్తహీనత, మలేరియాలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. దీనికి 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. అవసరమైతే మరింత సాయం.. ‘మెరిట్’కింద జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి కూడా విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన చేయవచ్చు. అవసరమైతే రూ.లక్షకు మించి కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యరంగం ఎదుర్కొంటున్న కీలకమైన అంశాలపై అధ్యయనం, పరిశోధన చేయాలనేది మంత్రి లక్ష్మారెడ్డి ఉద్దేశమని.. దానికి అనుగుణంగా ఆయన సీఎంతో చర్చించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ఈ పరిశోధన కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించాయి. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ‘వైవా’ దందా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో యథేచ్ఛగా ‘వైవా’ దందా నడుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే వైవా పరీక్షల్లో మార్కులు వెయ్యబోమని ప్రొఫెసర్లు బెదిరిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరుగుతున్న తతంగం తాజాగా ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. మంగళవారం పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ జరిగాయి. పీడియాట్రిక్స్‌లో 40 మార్కులకు థియరీ, 30 మార్కులకు ప్రాక్టికల్స్, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 10 మార్కులకు వైవా జరుగుతుంది. జనరల్ సర్జరీలో 60 మార్కులకు థియరీ, 60 మార్కులకు ప్రాక్టికల్స్, మరో 60 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్, 20 మార్కులకు వైవా ఉంటుంది. వైవా మార్కులు మాత్రమే థియరీ మార్కులకు కలుపుతారు. దీంతో సాధారణంగా వైవాలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. వీరి అవసరాన్ని గమనించిన పలువురు ప్రొఫెసర్లు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. పీడియాట్రిక్స్‌లో 10కి 8 మార్కులేయాలంటే రూ. 3 వేలు, 9 మార్కులేయాలంటే రూ.4వేలు వసూలు చేశారు. జనరల్ సర్జరీలోనూ 20కి 16 మార్కుల నుంచి బేరాలు నడిచాయి. ఇందులోనూ రూ.4వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేశారు. ఈ పరిస్థితి ఒక్క రిమ్స్‌లోనే కాదు, అన్ని వైద్య కళాశాలల్లో ఉందని విద్యార్థులు వాపోయారు. కొందరికింకా ఆ జాడ్యం పోలేదు కాగా, దీనిపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్. సుబ్బారావు స్పందిస్తూ.. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇంకా వసూళ్ల జాడ్యం పోలేదన్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017– 18 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఏదాది 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. మొత్తం 11 వైద్య కళాశాలలుండగా అందు లో 8 కళాశాలల్లో మాత్రమే ప్రధాన విభాగాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్
- ఎంసీఐ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం - ఎంసీఐ ఆదేశంతో కదిలిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని.. ఉన్న కాలేజీల్లో పకడ్బందీగా కార్యరూపంలోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణరుుంచింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించిన తనిఖీల్లో సిబ్బంది కొరత.. వైద్య అధ్యాపకుల్లో కొందరి గైర్హాజరుతో ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడిన విషయం తెలిసిందే. అధ్యాపకుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంసీఐ తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ‘బయోమెట్రిక్’ ప్రవేశపెట్టాలని, ఢిల్లీలోని ఎంసీఐ కేంద్ర కార్యాలయంతో వాటిని అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. బయోమెట్రిక్ విధానానికి ఏర్పాట్లు చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు... వైద్య అధ్యాపకులు, పారామెడికల్, నర్సులు పూర్తి స్థారుులో లేకపోవడం.. మౌలిక వసతుల లేమితో 2017-18 సంవత్సరానికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ నిరాకరించింది. నవంబర్ 26న ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో కొందరు వైద్య అధ్యాపకులు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిజామాబాద్‌కు వెళ్లడం, మరికొందరు సెలవు పెట్టకుండానే గైర్హాజరు కావడం.. వైద్య బోధన సిబ్బంది, రెసిడెంట్ వైద్యుల కొరత 21 శాతం ఉండటంతో ఎంసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల కోతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని సర్కారు యోచిస్తోంది. ఎంబీబీఎస్ సీట్లకు కోత నేపథ్యంలో ఈ విషయమై సూచన ప్రాయంగా నిర్ణరుుంచింది. పాక్షిక స్వయం ప్రతిపత్తితో ఉద్యోగంలో చేరే వైద్య సిబ్బంది.. విరమణ పొందే వరకు అందులోనే పనిచేయాలి. బదిలీ అడిగే అవకాశం ఉండదు కాబట్టి సమస్యలు రావని సర్కారు యోచిస్తోంది. -
150 ఎంబీబీఎస్ సీట్లకు కోత
- 2017-18కుగాను అనుమతి నిరాకరించిన ఎంసీఐ - ఉస్మానియాలో తగ్గిపోయిన 50 ఎంబీబీఎస్ సీట్లు - నిజామాబాద్ కాలేజీలోని మొత్తం 100 సీట్లూ గల్లంతు - తగిన సిబ్బంది, మౌలిక సదుపాయాల లేమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 150 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని మొత్తం 100 ఎంబీబీఎస్ సీట్లకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి నిరాకరించింది. లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మౌలిక వసతులు లేకపోవడంపై ఈ సందర్భంగా ఎంసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించరా? వచ్చే ఏడాదికిగాను మెడికల్ సీట్ల భర్తీకి అనుమతి కోసం ఈ కాలేజీలు ఎంసీఐకి దరఖాస్తు చేసుకున్నారుు. ఈ మేరకు ఆయా కాలేజీల్లో పరిస్థితులపై పరిశీలన జరిపిన ఎంసీఐ.. నిబంధనల మేరకు లేకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలలో మొత్తంగా 250 ఎంబీబీఎస్ సీట్లుండగా.. అందులో 50 సీట్లకు కోత పడింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని మొత్తం 100 ఎంబీబీఎస్ సీట్లూ రద్దయ్యారుు. వాస్తవానికి 2013-14లో ఉస్మానియాలో 50 సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లకు అనుగుణంగా మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఎంసీఐ నిబంధనలకు తగ్గట్లుగా చర్యలు చేపట్టలేదు. ప్రమాణాలకు పాతర ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంసెట్ టాప్ ర్యాంకర్లు చేరుతుంటారు. అలాంటి కాలేజీలో మౌలిక సదుపాయాలు లేకపోతే ఎలా, దీనికి బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నారుు. ఎంసీఐ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలో నిర్ణీత సంఖ్యలో పడకలు, లేబొరేటరీలు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. సెంట్రల్ లైబ్రరీ, హాస్టల్ భవనం, తరగతి గదులు, రెసిడెన్షియల్ క్వార్టర్లు, మందులు నిర్ణీత పరిమాణంలో తప్పనిసరిగా ఉండాలి. ఎంసీఐ నిబంధనల ప్రకారం 100 సీట్లున్న మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ ప్రారంభ మయ్యేప్పుడు ఫ్యాకల్టీ 58 మంది, రెసిడెంట్లు 45 మంది ఉండాలి. మొదటి ఏడాది రెన్యువల్ చేసే సమయంలో రెండో బ్యాచ్ ప్రారంభ సమయంలో ఇవే సీట్లకు 85 మంది ఫ్యాకల్టీ, 47 మంది రెసిడెంట్లు ఉండాలి. ఇలా ఐదో బ్యాచ్ వచ్చే సమయానికి (నాలుగో ఏట నుంచి ఐదో ఏడాదికి రెన్యువల్ సమయానికి) 105 మంది ఫ్యాకల్టీ, 67 మంది రెసిడెంట్లు ఉండాలి. కానీ ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పు డు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సగానికి మించి ఉండటం లేదనే విమర్శలున్నారుు. దాంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర అధ్యాపక సిబ్బందిని తాత్కాలికంగా బయటి నుంచి తీసుకొచ్చి చూపి ఎంసీఐని పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆరోపణలున్నారుు. మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి? రెండేళ్ల క్రితం ఉస్మానియా, కాక తీయ మెడికల్ కాలేజీల్లో మౌలిక వస తులు లేకపోవడంపై ఎంసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైం ది. కానీ ఇప్పటివరకు పూర్తిస్థారుులో మౌలిక వసతులు సమకూర్చలేదు. మొత్తం 400పైగా అధ్యాపక, అధ్యాపకే తర సిబ్బందిని నియమించాలని నిర్ణ రుుంచినా... చాలా మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తున్నారు. అలాగే అక్కడ భవనాల నిర్మాణం, మౌలిక సదు పాయాల కల్పన వంటివీ పూర్తికాలేదు. జిల్లా ఆస్పత్రినే బోధనాస్పత్రిగా చూపించడం గమనార్హం. -
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 74 మంది ప్రొఫెసర్లు
- పదోన్నతులతో నియమించిన వైద్య ఆరోగ్యశాఖ - ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 74 ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో 14, కాకతీయ మెడికల్ కాలేజీలో 17, కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 4, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 23, ఆదిలాబాద్ రిమ్స్‌లో 2, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 14 ప్రొఫెసర్ పోస్టుల్లో ఈ నియామకాలు జరుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో ప్రొఫెసర్ల నియామకం జరిగినట్లయింది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం పోస్టులు ఖాళీగా ఉంటే సీట్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని భర్తీ చేసింది. మరికొన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఇక 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతాయి. నేడు రెండో విడత సీట్ల కేటాయింపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం జరిగింది. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించినా.. విద్యార్థులు చేరకపోవడంతో 95 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు మిగిలాయి. వీటికోసం నిర్వహించిన రెండో కౌన్సెలింగ్‌లో 7 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మంగళవారం ఉదయమే విద్యార్థులకు వచ్చిన సీటు వివరాలను వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిస్తారు. వెబ్సైట్లో జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులు మంగళవారమే వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డెంటల్ సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. నీట్ ద్వారా ర్యాంకుల పొందినవారెవరూ బీడీఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపడం లేదని.. ఆ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఏదో ఓ చోట ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు ప్రయత్నిస్తుండడమే దీనికి కారణమని చెబుతున్నారు. 29న బీ కేటగిరీ రెండో విడత కౌన్సెలింగ్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లు మిగిలితే వాటిని ఎన్నారై కోటాలోకి మార్చుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో... ఈ నెల 29న రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తొలి కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్లన్నీ భర్తీ అయ్యాయని, బీడీఎస్ సీట్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. సీటు వచ్చిన విద్యార్థులెవరైనా కాలేజీల్లో చేరకపోతే.. ఎంబీబీఎస్ సీట్లు మిగులుతాయని, లేకుంటే బీడీఎస్ సీట్లకే రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. కాగా ఆయుర్వేద, హోమియో వైద్య విద్య సీట్లకు వచ్చే నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. -
పీజీ వైద్య సీట్ల భర్తీ ఎప్పుడు?
ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ వైద్య సీట్లు మిగిలిన వైనం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 118 పీజీ సీట్లు మిగిలిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలు కౌన్సెలింగ్ నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి తొలిసారిగా 2016-17లో వెబ్ కౌన్సెలింగ్ పెట్టారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఏపీలో 86 పీజీ సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మిగిలిపోయాయి. అయినప్పటికీ మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించే దిశగా వర్సిటీలు చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు విద్యార్థులు జూలై 13న హైకోర్టును ఆశ్రయించారు. రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ జరపాలని హైకోర్టు ధర్మాసనం అదేనెల 23న తీర్పునిచ్చింది. అయితే ఎంసీఐ హైకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఈనెల 8న తీర్పునిచ్చింది. చివరి విడత కౌన్సెలింగ్‌ను రెండువారాల్లోగా నిర్వహించి సీట్లను భర్తీ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌కు పూనుకోకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు ముగిశాక ఆర్డర్ కాపీ వచ్చింది సుప్రీంకోర్టు 2 వారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పింది. కానీ ఆ ఉత్తర్వుల కాపీ గడువు ముగిశాక వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును వివరణ కోరాం. కోర్టు ఆదేశాలు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. - డాక్టర్ టి.రవిరాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
17 నుంచి ఎంసెట్-3 కౌన్సెలింగ్
- 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు - 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపు.. 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 17న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్-3 ఫలితాలు, ర్యాంకులు విడుదల చేశాక.. 17 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా వారి మొబై ల్ నంబర్‌కు పాస్వర్డ్ పంపిస్తా రు. విద్యార్థులు 20, 21 తేదీల్లో ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22, 23 తేదీల్లో సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. నిర్ధారించిన రోజున విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 23, 24 తేదీల్లో బీ కేటగిరీకి ఆప్షన్లు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు నేటి నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి 19 వరకు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించి, మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆ జాబితా ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఉస్మానియా వర్సిటీలోని దూర విద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ప్రైవేటు కాలేజీల సంఘం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. సీటు పొందిన వారు వెంటనే మొదటి ఏడాది ఫీజును చెల్లించాలని, మరో ఏడాదికి గ్యారంటీ చూపించాల్సి ఉంటుందని ప్రైవేటు మెడికల్ కాలేజీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నాటికి కాలేజీల్లో చేరాలన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 15 శాతం ఎన్నారై కోటా సీట్లకు ప్రత్యేకంగా కాలేజీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారని వెల్లడించారు. గడువులోగా పూర్తి చేసేందుకే.. నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో అడ్మిషన్లను ఈ నెలాఖరుకే పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహిం చడంతో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువులోగా ప్రవేశాలు పూర్తి చేయడం సాధ్యం కాదని భావించిన సర్కారు.. అదనంగా నెల సమయం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీం నుంచి అనుమతి వస్తుందో, రాదోననే సందేహంతో.. ఈ నెలాఖరులోగానే ప్రవేశాలు పూర్తి చేసేలా ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. -
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం
-
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధం
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ జారీ - ఈ నెల 15న ర్యాంకుల వెల్లడి - 17 నుంచి 20 వరకు వెరిఫికేషన్ - ఆ వెంటనే వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ - అడ్మిషన్లకు నెలరోజుల గడువు కోరుతూ సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 15న ఎంసెట్-3 ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకానుంది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. విద్యార్థులు ఈ నెల 21, 22 తేదీల్లో తమ ఆప్షన్లను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా వైద్య సీట్ల భర్తీ పూర్తి కావాల్సి ఉన్నందున.. వెరిఫికేషన్‌కు తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు వచ్చే నెలాఖరుకు సమయం ఇస్తే ఆ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు గడువుపై తీర్పు ఇచ్చే వరకు వేచి చూడకుండా వేగంగానే సీట్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. అడ్మిషన్లకు నెల రోజులు గడువు కోరుతూ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకు కూడా నేడో రేపో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నోటిఫికేషన్ జారీకానుంది. వెరిఫికేషన్ కేంద్రాలు ఇవీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 4, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీ పీజీఆర్ఆర్సీడీఈ కేంద్రం, మారేడుపల్లిలోని ప్రభుత్వ ప్రింటింగ్ టెక్నాలజీ సంస్థ, గగన్‌మహల్‌లోని ఎ.వి.ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజీ, కూకట్పల్లి జేఎన్టీయూలో, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో నిర్వహిస్తారు. వెరిఫికేషన్ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ వారికి జేఎన్టీయూలో, నాన్ లోకల్ వారికి విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీలో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. విద్యార్థులు వెరిఫికేషన్ సందర్భంగా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.వెయ్యి చెల్లించాలి. ఈ ఆరు కేంద్రాల్లో ఏ రోజు ఎన్ని ర్యాంకుల వారు హాజరుకావాలో నోటిఫికేషన్లో ప్రస్తావించారు. 17న 1 నుంచి 2 వేల వరకు ర్యాంకులు పొందిన అభ్యర్థులు హాజరుకావాలి. 18న 2,001 నుంచి 4,500 ర్యాంకుల వరకు, 19న 4,501 ర్యాంకు నుంచి 9 వేల ర్యాంకు వరకు హాజరుకావాలి. చివరిరోజు 20న 9 వేల ర్యాంకులకు పైబడిన వారు హాజరుకావాలి. -
ఎన్నారై సీటుకు కోటి కట్టాల్సిందే!
- ఎంబీబీఎస్ ఫీజులు పెంచిన సర్కారు - ఎన్నారై సీటుకు రూ.1.4 కోట్ల వరకూ చెల్లించాల్సిందే - యాజమాన్య కోటాలో సీటుకు రూ.70 లక్షల దాకా కట్టాలి - కన్వీనర్ కోటాకు మాత్రమే ఊరట.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజుల మోత మోగింది. యాజమాన్య, ఎన్నారై కోటా ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాన్ మైనారిటీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో వార్షిక ఫీజును రూ.11 లక్షలకు, మైనారిటీ కాలేజీల్లో రూ.14 లక్షలకు పెంచింది. ఎన్నారై కోటా సీట్లకు యాజమాన్య కోటాలోని ఫీజుకు రెండింతల వరకూ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వైద్య విద్య మరింత భారంగా మారిపోతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు ప్రయోజనం కలిగిం చేందుకే ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్య రం గాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 కాలేజీలు.. 3,500 సీట్లు తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 సీట్లు, 3 మైనారిటీ కాలేజీల్లో 400 సీట్లు ఉన్నా యి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.60 వేల వార్షిక ఫీజు వసూలు చేస్తారు. 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 2,050 ఎంబీబీఎస్ సీట్ల లో 50% అంటే 1,025 సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటాలో.. మిగతా 50% (35% బీ కేటగిరీ, 15% ఎన్నారై కోటా) అంటే 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక మైనారిటీ కాలేజీల్లో 60% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 40% (25% బీ కేటగిరీ, 15%ఎన్నారై కేటగిరీ) సీట్లను నీట్ ద్వారా భర్తీ చేయాలి. అడ్మిషన్ల సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాకు ఊరట ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా వార్షిక ఫీజులను ప్రస్తుతమున్నట్లుగానే రూ.60 వేలు వసూలు చేస్తారు. అంటే ఎంబీబీఎస్ ఐదేళ్ల కోర్సు పూర్తయ్యే నాటికి రూ.3 లక్షలు చెల్లించాలి. ఇక నాన్ మైనారిటీ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు గతేడాది రూ.9 లక్షల వార్షిక ఫీజు ఉండగా.. తాజాగా రూ.11లక్షలకు పెంచారు. అంటే ఐదేళ్లకు రూ.55 లక్షలు కట్టాల్సిందే. మైనారిటీ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్లకు గతంలో వార్షిక ఫీజు రూ.11 లక్షలుగా ఉండగా.. తాజాగా రూ.14 లక్షలకు పెంచారు. అంటే ఐదేళ్లకు రూ.70 లక్షలు చెల్లించాల్సిందే. ఎన్నారై కోటా ఫీజులను యాజమాన్య కోటా సీట్ల ఫీజుతో పోలిస్తే రెండింతల వరకూ వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంటే నాన్ మైనారిటీ కాలేజీల్లో ఎన్నారై కోటా సీటు కోసం ఏటా రూ.22 లక్షల వరకు చెల్లించాల్సిందే. అంటే ఐదేళ్లకు కలిపి అధికారికంగానే రూ.1.10 కోట్లు కట్టాలి. ఇదే మైనారిటీ కాలేజీల్లో ఎన్నారై కోటా సీటుకు రూ.28 లక్షల వార్షిక ఫీజు చెల్లించాలి. అంటే ఐదేళ్లకు కలిపి రూ.1.4 కోట్లు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పెరిగిన ఫీజులు 2016-17 వైద్య విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
వైద్య ప్రొఫెసర్లకు హార్వర్డ్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న 100 మంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాత న వైద్యచికిత్స పద్ధతులపై శిక్షణ ఇచ్చేటట్లు గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో వందమంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్య సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన విధించిన ట్లు తెలిపారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచన - స్వయంగా సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం - బదిలీలు, డిప్యుటేషన్లకు నో - ఒకసారి నియమితులైతే రిటైరయ్యే వరకు అక్కడే విధులు - అవసరమైన సౌకర్యాలు, పరిపాలనా నిర్ణయాలు తీసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. పరిపాలన, విధానపరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడంతోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీనీ చేపట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనిని ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులకు స్వయం ప్రతిపత్తిని అమలు చేస్తున్నారు. దీంతో అక్కడ మంచి ఫలితాలు వ స్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బదిలీలు, బాదరబందీలు ఉండవు రాష్ట్రంలో మొత్తం 18 మెడికల్ కాలేజీలుండగా.. వాటన్నింటిలో కలిపి 2,750 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (కొత్తగా వచ్చే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలుపుకొని) వెయ్యి ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రయోగాత్మకంగా స్వయం ప్రతిపత్తి విధానాన్ని అమలు చేస్తారు. అక్కడ విజయవంతమైతే మిగతా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అమల్లోకి తెస్తారు. మరోవైపు ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది కొంతకాలానికే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడమో, డిప్యుటేషన్లపై వెళ్లడమో చేస్తున్నారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇది వైద్య విద్యార్థులకు, బోధనాసుపత్రులకు వస్తున్న రోగులకు శాపంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే స్వయం ప్రతిపత్తి విధానం వైపు సర్కారు మొగ్గుతోంది. ఇది అమల్లోకి వస్తే ఆయా మెడికల్ కాలేజీల్లో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా.. రిటైరయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే ఉద్యోగంలో చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి ఈ ఏడాది దాదాపు 400 మందికిపైగా ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తారు. ఆ కాలేజీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే వారంతా రిటైరయ్యే వరకూ అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిమ్స్‌లో ఇటువంటి విధానమే అమలవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసి వీలైనంత త్వరలో జీవో జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. పాలమూరు కాలేజీలో ప్రయోగాత్మకంగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్ణాటకలో అలాంటి విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా రాబోయే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో దానిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నాం. - లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
తరగతులు ఈ ఏడాది నుంచే
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి తరగతులు నిర్వహించాలని సర్కారు సంకల్పించింది. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. అయితే అక్కడ భవనాల నిర్మా ణం, మౌలిక సదుపాయాల కల్పన వంటివి పూర్తికాలేదు. జిల్లా ఆసుపత్రిని మాత్రమే బోధనాసుపత్రిగా చూపించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఎంసీఐ ఇటీవల తనిఖీలు చేసి, చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది నుంచి అక్కడ ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు ఎంసీఐ ఒప్పుకొనే పరిస్థితి లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నుంచే అక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి తరగతులు నిర్వహించాలనేది సర్కారు సంకల్పం. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్, అడ్మిషన్లు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన మేర భవనాలు పూర్తిచేస్తామని ఎంసీఐకి హామీ పత్రం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వైద్య విద్య డెరైక్టర్ రమణి తదితరులు గురువారం ఢిల్లీ వెళ్లిహామీ పత్రం ఇస్తారని సమాచారం. -
హైడ్రామా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం హైడ్రామా నడిచింది. ప్రిన్సిపల్కో న్యాయం.. ప్రొఫెసర్కిఇంకో న్యాయం జరిగింది. మెడికల్ కళాశాల ప్రొఫెసర్ టీడీపీ నగర నేత బంధువు కావటంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తలొగ్గారు. వేళకు రాలేదని ఉదయం ప్రొఫెసర్ని సస్పెండ్ చేసిన మంత్రి ఆవేశం సాయంత్రానికి చల్లారింది. ప్రొఫెసర్ సస్పెన్షన్ ఎత్తేసినట్లు మంత్రి కామినేని ప్రకటించటం గమనార్హం. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, మెడికల్ కళాశాలలను మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉదయం 9.30కు ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. 10 గంటలకు మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మంత్రి తనిఖీ చేసిన సమయంలో ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన మంత్రి శ్రీనివాస్ ఆయనను వెంటనే రిలీవ్ చేయమని ఆశాఖ డీఎంకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్ శశికాంత్ వేళకు రాలేదని గమనించిన మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు మంత్రి కామినేని ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాలకు వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ అక్కడ లేరు. మంత్రి కళాశాలకు వచ్చిన వెంటనే హాజరుపట్టీని తీసుకుని చెక్‌చేశారు. అందులో విధుల్లో ఉండి సంతకం చేయని వారి పేర్లు పక్కన మంత్రి నోట్ పెట్టారు. మంత్రి తనిఖీకి వచ్చారని తెలుసుకున్న ప్రొఫెసర్ శశికాంత్ 10.15కు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కామినేని సిబ్బంది, అధికారులతో మాట్లాడుతుండగా.. ప్రొఫెసర్ రిజిస్టర్ తీసుకుని పక్కకు వెళ్లి సంతకం చేశారు. గమనించిన మంత్రి సెక్యూరిటీ విషయాన్ని కామినేనికి తెలిపారు. ఆగ్రహించిన మంత్రి ప్రొఫెసర్ శశికాంత్‌ని పిలిచి ‘ఇంతలా బరితెగిస్తారా? దొంగల్లా వ్యవహరిస్తున్నారే’ అంటూ మండిపడ్డారు. తాను పొస్టుమార్టానికి వెళ్లానని, అందుకే ఆలస్యమైందని ప్రొఫెసర్ సమాధానం చెప్పారు. వెంటనే మంత్రి తన పీఏని అక్కడికెళ్లి విచారించుకుని రమ్మని ఆదేశించారు. వెంటనే ప్రొఫెసర్ అక్కడికి వెళ్లలేదని, పొరపాటైందని ప్రాధేయపడ్డారు. మంత్రికి మరింత ఆగ్రహానికి గురై ‘నిన్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నా’ అంటూ వెళ్లిపోయారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు.. మంత్రి రాజీ ప్రొఫెసర్ శశికాంత్ నగర టీడీపీ నేతకు స్వయాన సోదరుడు. అతను ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. సోదరుని ద్వారా ప్రొఫెసర్ రాజీయత్నాలు ప్రారంభించారు. సోమిరెడ్డి, బీజేపీ నాయకుల నుంచి ఒత్తిడి చేయించినట్లు సమాచారం. సాయంత్రానికి మంత్రి చల్లబడ్డారు. ప్రొఫెసర్ శశికాంత్ సస్పెండ్ని ఎత్తివేసినట్లు స్వయంగా మంత్రి కామినేని సాక్షి విలేకరికి ఫోన్లో వెల్లడించారు. తాను విజిట్‌కి వచ్చిన సమయంలో ప్రొఫెసర్ శశికాంత్ పోస్టుమార్టానికి వెళ్లినట్లు సీఐ చెప్పారని తెలిపారు. అందుకే అతని సస్పెన్షన్ ఎత్తేసినట్లు చెప్పారు. ప్రిన్సిపల్‌ని మాత్రం రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మంత్రి పీఏని విచారించి రమ్మని చెప్పిన సమయంలో ప్రొఫెసర్ ‘సారీ సార్ పొరబాటైంది క్షమించండి’ అని అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్న ప్రొఫెసర్.. సాయంత్రానికి అది ఎలా నిజమైందని కళాశాలలో పనిచేసే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. బంధువులకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ వైద్య కళాశాల కావాల్సిందే...
సాలూరు: విజయనగరం జిల్లాలో ప్రైవేటు వైద్య కళాశాలను ఎవరూ కోరుకోవడం లేదని, ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉన్నందున ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సోమవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పీవీజీ రాజుపై అధికార పార్టీ నాయకులకు నిజంగా గౌరవం ఉంటే ఆయన చిర కాల వాంఛ అయిన గిరిజన వర్సిటీని జిల్లాలో సకాలంలో నెలకొల్పాలని సూచించారు. ప్రైవేటు వైద్య కళాశాల ఎవరూ కోరని విషయాన్ని గు ర్తుంచుకోవాలని అన్నారు. పాచిపెంట మండలంలో గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 3వేల ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చేందుకు పీవీజీ రాజు కుటుంబీకులు సిద్ధపడ్డారని, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు సైతం భూములను పరిశీలించారన్నారు. దీనిపై ఎందుకు మాట్లాడరని ఆయన నిలదీసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అందుకే జిల్లాకు ప్రైవేటు వైద్యకళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడం సరైన చర్య కాదని అన్నారు. -
ఎందుకా ఇంట్రస్ట్!
జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్యకళాశాల ఏర్పాటు చేయకుండా మాన్సాస్‌కు ఇవ్వడంపై చర్చ ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రస్తావన చర్చకు దారితీసింది. అధికార, విపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంత జరిగినా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల డిమాండ్‌కు మద్దతివ్వలేదు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వేసిన ప్రశ్నకు ఆర్థిక పరిస్థితి కారణంగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం లేదని, మాన్సాస్ ట్రస్టు దరఖాస్తు మేరకు ప్రైవేటు కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కామినేని సమాధానం చెప్పారు. దానిపై సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వైద్యకళాశాల ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందని, ప్ర స్తుతం విశాఖనగరంలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని సభ దృష్టికి తీసుకెళ్లా రు. ఇప్పటికే జిల్లాలో ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉందని, రెండోది కూడా ప్రైవేటు కళాశాలైతే పేద విద్యార్థులు ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి నెలకోనుందన్నారు. జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి ఉండదని, ఇప్పుడా పరిస్థితిని వైద్య కళాశాల విషయంలో కూడా వచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ట్రస్టు దరఖాస్తు చేసిందని ఇచ్చేస్తే ఎలా, ఏదైనా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోండని చెప్పి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకుంటారని, ప్రమాణాల మేరకు వాటిలో ఏది మంచిదో తెలుసుకుని మంజూరు చేస్తే బాగుండేదన్న అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని టీడీపీకి చెందిన గజపతిరాజులకిచ్చి, అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గజపతిరాజులు, మాన్సాస్ ట్రస్టు గురించి పాలకపక్షం గొప్పగా చెబుతుండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకుని బొబ్బిలి రాజా వారికీ మంచి పేరే ఉందని, వారి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, వారికి కూడా ప్రైవేటు కళాశాల అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో అధికార, విపక్షాల మధ్య కొంతసేపు వాదోపవాదాలు సాగాయి. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి ప్రభుత్వ వైద్య కళాశాలే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుజయ కృష్ణ రంగారావుకు మద్దతుగా నిలిచారు. కానీ, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ ఈ విషయమై నోరు మెదపలేదు. కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అవసరమన్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. వారడగలేకపోయినా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌కైనా మద్దతిచ్చే ఉంటే బాగుండేదని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని, జిల్లా ప్రజల వాణి విన్పించలేకపోయారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజుల్లోగా జనన వివరాలు నమోదు చేయాలివిజయనగరం ఆరోగ్యం: శిశువు పుట్టిన 21 రోజుల్లోగా వివరాలు నమోదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డీడీ రాంబాబు అన్నారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలకు జనన, మరణ నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరణాల వివరాలను వారం రోజుల్లోగా నమోదు చేయాలన్నారు. ముద్రించిన ఫారాల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని సూచించారు. జన్మించిన వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందించాలన్నారు. వివరాల నమోదులో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఎస్.ఓ దేవవరప్రసాద్, ఏఎస్ఓ కైలాష్ తదితరులు పాల్గొన్నారు. -
బొబ్బిలి రాజావారికి అంతే మంచిపేరు: వైఎస్ జగన్
-
మెస్ బిల్లుల దందా
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ (కేఎంసీ) హాస్టళ్లలో మెస్ బిల్లుల దందా నడుస్తోంది. అక్కడ హాస్టల్ కాంట్రాక్టర్ చెప్పిందే వేదం. హాస్టల్ వార్డెన్లుగా వ్యవహరి స్తున్న ప్రొఫెసర్లు కూడా కాంట్రాక్టర్‌కే అండగా నిలుస్తున్నారు. హాస్టల్లో తింటే ఓకే. బిల్లు చెల్లించవచ్చు. మరి తినకపోతే.. దాంతో సంబంధం లేదు. తినకపోయినా బిల్లు మాత్రం కట్టాల్సిందే. ఇదెక్కడి గొడవని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. మీరు పరీక్షల్లో పాసు కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్‌కే వార్డెన్లు వత్తాసు పలుకుతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం బెదిరిం పుల వ్యవహారాన్ని కొందరు వైద్య విద్యార్థులు వీడియో రికార్డు చేసినట్టు సమాచారం. ఈ వీడియో రికార్డ్‌ను తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. నెల రోజుల బిల్లు కట్టాల్సిందే...! కేఎంసీకి చెందిన హాస్టళ్లలో సుమారు 500 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. వీరందరూ వివిధ హాస్టళ్లల్లో ఉంటున్నారు. వీరందరూ నెలకు మెస్ బిల్లుకు గానూ రూ. 1800 చెల్లిస్తున్నారు. అయితే, నెలలో సొంత పనుల రీత్యా ఊరికి వెళ్లినా, ఆరోగ్యం బాగోలేక మెస్‌లో భోజనం చేయకపోయినా... పండుగ సెలవులైనా నెల బిల్లు మాత్రం విద్యార్థులు కట్టాల్సిందే. ఈ వ్యవహారాన్ని గతంలో పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి ఫలితం లేదని వైద్య విద్యార్థులు అంటున్నారు. తాజాగా జనవరి నెల బిల్లులో ఏకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పది రోజులు లేకపోయినా మొత్తం బిల్లు కట్టమని విద్యార్థులపై కాంట్రాక్టరు ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై హాస్టల్ వార్డెన్లుగా ఉంటున్న అసిస్టెంటు ప్రొఫెసరు, ప్రొఫెసర్లకు తాజాగా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే, బిల్లు కట్టాల్సిందేనని వార్డెన్లు కూడా అనడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అంతేకాకుండా మెస్ బిల్లు కట్టకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కూడా బెదిరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారాన్ని కొందరు విద్యార్థులు తమ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. ఈ రికార్డ్‌ను తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అయితే, నేరుగా ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఎలాగైనా పోస్టు ద్వారానైనా రికార్డ్ చేసిన సీడీతో పాటు లేఖను పంపుతామని కూడా వైద్య విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసిన సందర్భంగా పేర్కొనడం గమనార్హం. దీనిని గమనిస్తే వారు ఎంతో భయాందోళనకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నెలలోనే 3 లక్షల కుంభకోణం...! ఒక్క జనవరి నెలలోనే ఏకంగా రూ. 3 లక్షల మేరకు కుంభకోణం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పండుగ సందర్భంగా సుమారు పది రోజుల పాటు విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో మెస్‌లో భోజనం చేయలేదు. వాస్తవానికి నెలకు మెస్ బిల్లు కింద రూ. 1800 చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు రూ. 60 అన్నమాట. అంటే పది రోజులకు ఒక్కో విద్యార్థికి రూ. 600 అవుతుంది. ఈ మొత్తాన్ని కట్టాల్సిందేనని కాంట్రాక్టరు అంటున్నారు. రూ. 600 చొప్పున మొత్తం 500 మంది విద్యార్థుల నుంచి రూ. 3 లక్షల మేరకు అవుతుంది. తమకు భోజనం పెట్టకపోయినా ఈ మొత్తాన్ని కాంట్రాక్టరుకు చెల్లించాలని వార్డెన్లు కూడా వత్తాసు పలకడం దారుణమని పేరు చెప్పేందుకు భయపడుతూ వైద్య విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి వాపోయారు. ఇదే విధంగా గతంలో కూడా దసరా, దీపావళి వంటి పండుగలు, ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటికి వెళ్లినా మెస్ బిల్లు మాత్రం యథావిధిగా కట్టాల్సి వస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వీరు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వమని ఆదేశించా - రాంప్రసాద్, కేఎంసీ ప్రిన్సిపల్ మెస్ బిల్లులపై గొడవ జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై సోమవారం నాటికి నివేదిక ఇవ్వమని వైస్ ప్రిన్సిపల్‌ను ఆదేశించాను. దీనిని పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాను. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
అధికారం..ఇష్టారాజ్యం
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని డీఎస్ఆర్ ప్రభుత్వ ప్రధానాస్పప్రతి ఆవరణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరుగుతున్న చిత్రాలు అన్నీఇన్నీ కావు. కాలేజీ పరిపాలన వ్యవహారాల్లో అధికార పార్టీ జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది. జీతాలు ఇచ్చేందుకు తమ వద్ద బడ్జెట్ లేదని ఔట్సోర్సింగ్ సిబ్బందిలో కొంతమందిని తొలగించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. తొలగించిన సిబ్బంది తమకు అన్యాయం చేశారంటూ దీనిపై గగ్గోలు పెడుతున్నారు. తొమ్మిది మంది తొలగింపు మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్‌టెక్నీషియన్, వివిధ విభాగాల అటెండర్లుగా పనిచేసేందుకు గతేడాది నవంబర్‌లో 16 మందిని నెల్లూరుకు చెందిన ఉత్తమ్ ఔట్ సోర్సింగ్ ఏజన్సీ ద్వారా తీసుకున్నారు. వీరిలో ఆరుగురు తమకు అవసరం లేదంటూ డిసెంబర్లో తొలగించారు. మిగిలిన పదిమంది చేత పనులు చేయించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈ పది మందిలో 9మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ని తొలగించాలని ఉత్తమ్ ఏజెన్సీకు ప్రిన్సిపాల్ వద్ద నుంచి లేఖ వెళ్లింది. కొత్తగా సిబ్బంది అవసరమైతే కబురు చేస్తామని లేఖలో రాశారు. తమను తొలగిస్తున్నటు ్లగా ముందుగా చెప్పలేదని ఔట్సోర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. ఏజెన్సీ వాళ్లను సిబ్బంది అడిగితే జీతాలు ఇచ్చేందుకు బడ్జెట్ లేదని నిలిపివేయాలని చెప్పారు. దీంతో వాళ్లు ఏంచేయాలో తెలియక నిమ్మకుండిపోయారు. ఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న సిబ్బందికి ఇప్ప టివరకు జీతాలు ఇవ్వలేదు. ప్రతినెలా తమ కు రావాల్సిన జీతం బిల్లును కళాశా ల అధికారులకు పంపుతూ వచ్చారు. నోటిఫికేషన్ లేకుండా నియామకాలు జీతాలు ఇచ్చేందుకు బడ్జెట్ లేదని ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించి రోజులు గడవకముందే నాలుగు రోజుల క్రితం కొత్తగా 15మందిని ఔట్సోర్సింగ్ కింద అటెం డర్లు, స్వీపర్లుగా తీసుకున్నారు. నోటిఫికేషన్ లేకుండానే వీరిని విజయవాడకు చెందిన చైతన్య ఏజన్సీ ద్వారా నియమించినట్లుగా చెబుతున్నారు. హడావుడిగా వీరిని వైస్ ప్రిన్సిపాల్ ఒకరు నామమాత్రంగా ఇంటర్వ్యూలు జరిపి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల సిఫార్సులతోనే వీరిని తీసుకున్నట్లుగా తెలిసింది. అలాగే నోటిఫికేషన్ లేకుండానే తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఉన్నవారిని తొలగించి తమకు కావాల్సిన వారిని నియమించారని ఆరోపణలున్నాయి. అవసరం లేదని తీసేశాం: -ఎన్. ప్రభాకర్‌రావు, ప్రిన్సిపాల్ కాలేజీ ప్రారంభానికి ముందు అవసరమ ని ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకున్నాం. ప్రారంభమయ్యాక కొంత మంది రెగ్యులర్ స్టాఫ్ రావడంతో ఔట్సోర్సింగ్ సి బ్బందిలో కొంత మంది అవసరం లేదని తీసేశాం. కొత్త వారిని తీసుకొనేందుకు నో టిఫికేషన్ ఇవ్వలేదు. ఏజన్సీ ద్వారా వచ్చా రు. పాత సిబ్బందికి జీతాలు ఇస్తాం. -
వైద్య కళాశాలకు మరో 50 సీట్లు
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. దీనికి సంబంధించి డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల విన్నపం మేరకు ఎంసీఐ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యాసంవత్స రం నుండి అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవలే మెడికల్ కళాశాలలో ఎంసీఐ బృం దం మూడవ సంవత్సరం అనుమతి కోసం పరిశీలన చేపట్టింది. అనంతరం పరిశీలన ముగిసినమూడు రోజుల తరువాత డీఎంఈ అధికారులు అదనపు సీట్ల కోసం ప్రతిపాదనలు సూచించారు. పరిశీలన అనంతరం అదనపు 50 సీట్లకు ఎంసీఐ ఇటీవలే సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 సీట్లు అదనంగా 50 సీట్లతో మొత్తం 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే డీఎన్బీ(డిప్లొమా నేషనల్ బోర్డు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 15 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణ జరిగే అవకాశం ఉంది. మూడవ సంవత్సరానికి మార్గం సుముగం.. మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం అనుమతికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పరిశీలన చేపట్టిన ఎంసీఐ బృందం అదనపు సీట్లకు అనుమతి ఇవ్వడంతో మూడవ సంవత్సరానికి అనుమతి క్లియర్ అయినట్లు తెలుస్తుంది. అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే, ఎంసీఐ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలైతేనే ఈ అదనపు సీట్లకు అనుమతి రావడం, మూడవ సంవత్సరానికి అనుమతి ఇచ్చే అవకాశాన్ని ఎంసీఐ పరిశీలిస్తుంది. అనుమతి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాల అనుమతికి కష్టాలు తొలగిపోయాయి. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. -
కోట్లు ఇస్తేనే సీట్లు!
* ప్రభుత్వ వైద్య కళాశాలలపై కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ * 9 కాలేజీలకు మొత్తం రూ. 945 కోట్లు అవసరమని నివేదిక * మూడు కాలేజీల్లో 50 చొప్పున సీట్లు పెంచాలని వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను నిలబెట్టుకోవటం అధికారులకు భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వదు, కేంద్రం నుంచి ఇంకా రాలేదు. ఈ పరిస్థితుల్లో సీట్లను నిలబెట్టుకోవడానికి రూ. 945 ఇవ్వాలంటూ కేంద్రం మీదే భారమేస్తూ నివేదిక ఇచ్చారు. వాస్తవానికి వైద్య కళాశాలలకు సీట్లు కేటాయించిన మూడు నెలలో వసతులు కల్పించాలని భారతీయ వైద్యమండలి నిబంధనలు విధించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పట్లో రాతపూర్వక హామీ ఇచ్చారు కూడా. ఆ తర్వాత రాష్ట్ర అధికారులు ఈ ఏడాది రాష్ట్రం విడిపోయిన కారణంగా పలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని, సిబ్బంది, మౌలిక వసతుల కల్పన, నిధులు సమకూర్చటంలో ఇబ్బందులున్నాయని.. కాబట్టి ఈ ఏడాది కాస్త సడలింపునివ్వాలని కోరుతూ ఎంసీఐకి లేఖ రాశారు. వచ్చే ఏడాదికైనా వసతుల కల్పన కష్టం గా ఉన్న నేపథ్యంలో తమకు తక్షణమే ఆర్థిక సా యం అందించాలని కేంద్రాన్ని కోరారు. వచ్చిన సీట్లనూ మీ ఖాతాలోనే వేసుకోండి దేశవ్యాప్తంగా ఈ ఏడాది వైద్య కళాశాలల్లో సీట్లు పెంచుకోవచ్చునని, వాటికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద నిధిలిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ఇందుకు ఒక్కో సీటుకు రూ. 1.20 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో 70 శాతం కేంద్రం ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే అప్పటికే మన రాష్ట్రంలో వైద్య కళాశాలలకు అదనంగా 300 సీట్లు వచ్చాయి. ఈ సీట్లను కూడా సీఎస్ఎస్ స్కీంలో కలిపేసి నిధులివ్వాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల, రిమ్స్ శ్రీకాకుళం, రిమ్స్ కడప కళాశాలలకు అదనంగా 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని కోరింది. వచ్చిన సీట్లను నిలబెట్టుకోవాలన్నా, అదనపు సీట్లను పొందాలన్నా ప్రస్తుత అంచనా ల ప్రకారం రూ. 945 కోట్లు అవసరమని వైద్య విద్యాశాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. -
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల!
రూసా కింద ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రతిపాదనలు మండలిలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, రాజయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చే సేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలో ఏడు ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకో ప్రభుత్వ ఇం జనీరింగ్ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గామార్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేసే అంశంకూడా ప్రభుత్వపరిశీలనలో ఉందన్నారు. వచ్చే ఏడాది వరంగల్ వర్సిటీలో అడ్మిషన్లు వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందని, వచ్చే ఏడా ది నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి రాజయ్య చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే 126 ఎకరాల స్థలంలో ఈ హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు నమోదైనప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించలేదన్నా రు. ఎక్కడా మందులు, సిబ్బంది కొరత లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికే ఆరోగ్యశ్రీకి నిధులను తగ్గించామన్నారు. వైఎస్ హయాంలో ప్రైవేటు ఆసుపత్రుల కోసమే ఆరోగ్యశ్రీ పెట్టారని ఆరోపణలు వచ్చాయని మంత్రి అనడంతో... ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు కొందరు ఎ మ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత రాజయ్య మాట్లాడుతూ... వైఎస్ మహానుభావుడని, ఆయన పెట్టిన పథకం అమలుపై ఆరోపణలొచ్చాయే గానీ, పథకం ఎంతోమంది పేదలకు మేలు చేకూర్చిందని వివరించారు. 85 శాతం కొలువులు స్థానికులకే: కేటీఆర్ ఐటీ కంపెనీల్లో 85 శాతం సెమీస్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేందుకు పలు సం స్థలు సానుకూలత వ్యక్తం చేశాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిభట్లలో టీసీఎస్ సంస్థ 28 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం గల ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిందని, అందులో స్థానికులకు అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు వివరించారు. విత్తన భాండాగారంగా రాష్ర్టం: పోచారం తెలంగాణను దేశానికే విత్తన భాండాగారంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని వ్యవసాయ మంత్రి పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. పంటలకు నాణ్యమైన విత్తనాలను తయారు చేసేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచిస్తోందన్నారు. మూతపడిన సీడ్ ఫామ్స్‌ను తెరిపిస్తామని, పది హెక్టార్లు యూని ట్‌గా సీడ్ విలేజ్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
మౌనం వెనుక మర్మమేమిటో..!
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 128మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కేటాయించారు. వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు కళాశాలకు వచ్చిన వీరిలో చాలామంది ఆ తరువాత మొహం చాటేశారు. కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పరిశీలనకు వచ్చిన రెండుసార్లు మాత్రమే పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఏడాది కాలంగా వైద్యవిద్య బోధన, రోగులకు వైద్యసేవలు అందించడానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు రావడం లేదు. వాస్తవానికి ఇక్కడికి కేటాయించిన ప్రొఫెసర్లందరూ కళాశాలలోనే తమకు కేటాయించిన నివాస గృహాల్లో ఉండాలి. అందుకు అనుగుణంగానే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో సకాల సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. కానీ ఉండే వారు లేక అవి బోసిపోతున్నాయి. చాలామంది వైద్యులు జిల్లాకే రావడం లేదు. హైదరాబాద్‌కు చెందిన 32మంది ప్రొఫెసర్లు అక్కడే ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీసుల్లో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లను ఇక్కడికి కేటాయించగా వీరు రెండుసార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఒక ప్రొఫెసర్‌ను ఇక్కడికి కేటాయించారు. ఆయన వైద్యవిద్యలో భాగమైన పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రసిద్ధి. ఈ సేవలను అందించేందుకు ఇక్కడికి కేటాయించగా ఇప్పటి వరకు ఆయన కళాశాల వైపు చూడలేదు. నలుగురు స్త్రీ వైద్యనిపుణులు ఇక్కడికి కేటాయించగా, వీరు రెండు నెలల పాటు వైద్యసేవలు అందించి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. ప్రస్తు తం ఆస్పత్రిలో 12 మంది స్త్రీ వైద్యనిపుణులు ఉం డాల్సింది, కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉన్న ప్రొఫెసర్లు కూడా ఉదయం ఒక గంట మాత్రమే ఆస్పత్రికి వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల మౌనం మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చ ర్యలు తీసుకోవడంలో కళాశాల అధికారులు స్పందిం చడం లేదు. గతంలో వీరిపై చర్య తీసుకుంటే ఉన్నఫలంగా వెళ్లిపోతారని, దీంతో కళాశాలకు అనుమతికి ఇబ్బందులు వస్తాయని భావించారు. ప్రస్తుతం కళాశాలకు పూర్తిస్థాయి అనుమతి లభించింది. అయినా ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. విధులకు రాకుండా రిజిష్టరులో సంతకాలు లేకుండానే ప్రతి నెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. ఆయన వీరిపై కళాశాల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవడం లేదు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై గత మార్చిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సుబ్రమణ్యం నివేదిక అందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కళాశాల అధికారులు సాహసించలేదు. ఇటీవల కొంతమంది ప్రొఫెసర్లు తమ యూనియన్ నాయకులను తీసుకవచ్చి ఎవరూ ఏమనకూడదన్నట్లుగా వైద్యాధికారులపై చిందులు వేయించారు. అప్పటి నుంచి ప్రొఫెసర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా త యారైందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన పెద్దాస్పత్రి, వైద్యకళాశాలలు సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పల్లెకుపోవాల్సిందే..
సాక్షి, ముంబై: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందేనని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కొత్త నియమాల ప్రకారం ఇక నుంచి ఒక సంవత్సరంపాటు వీరు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధనంతో చదువుకుని డాక్టర్లైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలనే నియమాలు గతం నుంచి అమలులో ఉన్నాయి. కాని కొందరు ఇష్టం లేని వారు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు. కేబినెట్లో తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి కచ్చితంగా సంవత్సర కాలం పాటు పల్లెటూర్లలో వైద్య సేవలు అందించాల్సిందే. అనేకమంది ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాల్లో చదువుకుని ఎంబీబీఎస్, ఎండీ, ఎం.ఎస్, గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. అందుకయ్యే ఖర్చులు స్వయంగా ప్రభుత్వమే భరిస్తోంది. అందుకుగాను చదు వు పూర్తయిన తర్వాత సంవత్సర కాలంపాటు గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలు అందిస్తామని లేదంటే తగిన జరిమా నా చెల్లిస్తామని ఈ విద్యార్థుల నుంచి హామీ పత్రాన్ని (బాండ్) రాయిం చుకుంటుంది. కాగా, ఇష్టం లేని కొందరు ప్రభుత్వం నిర్ధేశించిన రూ.10 లక్షల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించి పల్లెల్లో పనిచేయకుండా తప్పించుకుంటున్నారు. ఎండీ వంటి పోస్టు గ్రాడ్యుయేట్లు రూ.50 లక్షల వరకు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రూ.కోటికిపైగా జరిమానా చెల్లించి తప్పుకుంటున్నారు. అణగారిన వర్గా ల డాక్టర్లు మొత్తం ఇంత మొత్తం చెల్లించలేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలీస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు ఎన్నో రెట్లు తక్కువగా ఉంటుంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు వెళ్లే వారి సంఖ్య 50 శాతం మాత్రమే ఉంటోంది. ప్రభుత్వ నిర్నయంపై గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామీణ వైద్యశాలల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బం ది లేకపోవడంతో పల్లెవాసులకు సరైన వైద్యసదుపాయాలు అందడంలేదు. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు మైళ్లకొద్దీ ప్రయాణించి, పట్టణాల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో సరైన వైద్యం అందక పలువురు ప్రాణా లు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. -
జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల
ఖమ్మం వైరారోడ్: జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక మామిళ్లగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ పది పడకల ఆస్పత్రిని ఆయన శనివారం ప్రారంభించారు. ఆయుర్వేదిక్ వైద్యశాల మీటింగ్ హాల్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అక్కడి గిరిజనుల్లో వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తొలిదశలో కరీంనగర్‌తో పాటు జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 19న జరిగే సోషల్ ఎకనామిక్ సర్వేకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకే సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అంటువ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డాక్టర్ల సమస్యలేంటో తనకు తెలుసునని, సీనియారిటీ ఉన్నా వేతనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లు రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవా దృక్పథంతో ముందుకు పోవాలని కోరారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, డయేరియా తదితర వ్యాధుల నివారణకు ముందస్తుగా మందులు పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులు, మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్‌ను అభినందించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్ఆర్హెచ్ఎం, కేంద్రం నుంచి రావాల్సిన ఇతర నిధులను తెప్పించి వైద్యసేవల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంగన్వాడీ సెంటర్లకు డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధి నివారణ మెడికల్ కిట్లను అందజేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు 1982లో తాను ఖమ్మం ఆస్పత్రికి వచ్చానని, నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని కోరారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవాదృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పీహెచ్‌సీలను బలోపేతం చేసి అక్కడ ఆరోగ్యశ్రీ సేవలను తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, డీఎంహెచ్‌వో భానుప్రకాష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీడీ విజయ్‌కుమార్, ఆయుష్ ఏడీ రాజేందర్‌రెడ్డి, ఆయుర్వేదిక్ వైద్యశాల సీనియర్ డాక్టర్ లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు. -
మీ రాక కోసం
- ఎదురుచూస్తున్న ఇందూరు ప్రజలు - ముఖ్యమంత్రి తొలి పర్యటనపై సర్వత్రా ఆసక్తి - పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యల పరిష్కారంపై ఆశ - జిల్లాపై వరాల జల్లు కురిసేనా! - హామీల అమలుకు మాట ఇస్తారా? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలి పర్యటన పై జిల్లా ప్రజలలో ఆసక్తి నెలకొంది. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో భారీ మెజార్టీ ఇచ్చిన ఇందూరు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలపై ‘ కేసీఆర్ ఏమంటారో’ అన్న చర్చ జరుగుతోంది. జడ్పీ చైర్మన్, నగర మే యర్ సహా మెజార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న నేపథ్యంలో గులాబీ దళపతి ఇందూరుపై వరాల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇవేకాకుండా, నిజామాబాద్ బైపాస్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు ఏడేళ్లుగా పెండింగులో ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే ఎర్రజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.10.83 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్న హామీపై రైతులు ఆసక్తితో ఉన్నారు. తమ ప్రభుత్వం రాగానే, లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ఇందూరు నుంచే ప్రకటించా రు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.754 కోట్లు కేటాయించినా, ఆ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఆసియాలో అతిపెద్దదైన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సందేహాలున్నాయి. కౌలాస్‌నాల సామర్థ్యం పెం చి, ప్రాణహిత, లెండి తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పసుపు, చెరుకు రైతులకు భరోసా ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సందర్భంగా నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం తెచ్చి చెరు కు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, తద్వారా మెరుగైన వంగడాలు, మద్దతు ధర వచ్చేలా చూస్తామని కేసీఆర్ చెప్పా రు. గల్ఫ్‌బాధితులు, బీడి కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులు, వైద్య సిబ్బంది లేక మెరుగైన అత్యవసర వైద్యసేవలు అందడం లేదు. గత ప్రభుత్వం 838 పోస్టుల భర్తీకి 150 జీవోను విడుదల చేయగా, ఆర్థికశాఖ అనుమతిం చినా నేటికి నియామకాలు లేవు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించి మంజూరు చేసిన తెలంగా ణ యూనివర్సిటీని ఆయన మరణానంత రం వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా తెలంగాణ యూని వర్సిటీకి పూర్థిస్థాయి సదుపాయాలు క ల్పించాలని కోరుతున్నారు. వీటన్నింటితో పాటు ఇటీవల పెరిగిన విద్యుత్ కోతలు, వ్యవసాయం జీవనాధారంగా ఉన్న జిల్లా లో ఈసారి వర్షాలు లేక నెలకొన్న ప్రతి కూల పరిస్థితుల నేపథ్యంలో సీఎంపై ఇం దూరు ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. -
భయపెడుతున్న డెంగీ
మరో 11కేసుల నమోదు అనంతపురం అర్బన్: జిల్లాను డెంగీ భూతం బెంబేలెత్తిస్తోంది. కొద్దిరోజులుగా ఈ వ్యాధి విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం మరో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. ఆది, సోమవారాలకు సంబంధించి 86 శ్యాంపిల్స్ తీసుకోగా.. అందులో 11 పాజిటివ్‌గా, ఒక అనుమానాస్పద కేసుగా తేలాయి. అనంతపురం నగరంలోనూ డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. స్థానిక బేబీ హాస్పిటల్లో 3, హృదయ ఆస్పత్రిలో ఒక కేసు నమోదైనట్లు తెలిసింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఒక కేసు అనుమానాస్పద డెంగీగా నమోదైంది. ఏడు కేసులు రూరల్ ప్రాంతాల నుంచి నమోదయ్యాయి. కాంపొనెంట్స్‌కు అనుమతి రానట్లే సర్వజనాస్పత్రిలోని కాంపొనెంట్స్(రక్తశుద్ధి పరికరాలు)కు ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కన్పించడం లేదు. ఆస్పత్రిలో నాలుగేళ్లుగా రూ. 80 లక్షల విలువ గల 18 రకాల పరికరాలు మూలనపడ్డాయి. వీటిని సోమవారం సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాసన్, అనంతపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ హరిహరతేజ మరోసారి పరిశీలించారు. వీటి వాడకానికి అనుమతించాలంటే టెక్నికల్ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన మన జిల్లాలో ఎక్కువ మంది గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. చదువుపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఒకటి, రెండు కాదు ఏకంగా 177 స్కూళ్లు జిల్లాలో మూతపడ్డాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది. బోధన సరిగా లేదని.. పేద వర్గాల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళాహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వందలాది స్కూళ్లు పిల్లలు లేని కారణంగా మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 ప్రకారం జిల్లాలో 177 స్కూళ్లు విద్యార్థులు లేక, 10 మందిలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న కారణంగా క్లోజ్ చేశారు. బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థీ లేనికారణంగా క్లోజ్ చేశారు. మూతపడిన ప్రాథమిక పాఠశాలలివే : అగళి మండలం గొల్లహట్టి, లక్ష్మీపురం, బీరనపల్లి, ఎంకె గొల్ల హట్టి, హుళికెరదేవరహ ళ్లి, ఎంఎం పాల్యం. అమడగూరు మండలం బావిచెరువుపల్లి, సీతిరెడ్డిపల్లి, దుడరగుట్టపల్లి, అమరాపురం మండలం కదతడహళి,్ల అనంతపురం మండలం జంగాలపల్లి, ఆత్మకూరు మండలం దొద్దెకొట్టాల, బత్తలపల్లి మండలం చీమలనాగేపల్లి, రామాంజుంపల్లి, కళ్యాణదుర్గం మండలం పింజరికొట్టాల, కూడేరు మండలం మరుట్ల, కనగానపల్లి మండలం కొండ్రెడ్డిపల్లి, బెళుగుప్ప మండలం వీరాంజినేయ కొట్టాల, బ్రహ్మసముద్రం మండలం విఎన్ హళ్లి, గుమ్మగట్ట మండలం మారెమ్మపల్లి తాండ, పామిడి మండలం పామిడి ఆర్ఎస్, యల్లనూరు మండలం పిఎం కొండాపురం, బుక్కపట్నం మండలం నాయనవారిపల్లి, నల్లగుట్టపల్లి, బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లి, రామగిరి మండలం ఆకుతోట్ల, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి పాఠశాలలు మూతపడ్డాయి. చిలమత్తూరు మండలంలో 6, ధర్మవరం మండ లంలో 10, గాండ్లపెంటలో 4, గార్లదిన్నెలో 2, గోరంట్లలో 7, గుడిబండలో 2, గుంతకల్లులో 2, కదిరిలో 3, కొత్త చెరువులో 4, కుందిర్పిలో 4, లేపాక్షి మండలం శిరివరం, మడకశిరలో 8, ముదిగుబ్బలో 10, నల్లచెరువులో 4, నల్లమాడలో 2, నంబులపూలకుంటలో 5, నార్పలలో 2, ఓబులదేవచెరువులో 7, పరిగిలో 2, పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లి, పెనుకొండ లో 5, రొద్దంలో 5, రొళ్లలో 10, శెట్టూరులో 3, శింగనమలలో 2, సోమందేపల్లిలో 5, తాడిపత్రిలో 2, తలుపులలో 11, యాడికిలో 4, తనకల్లు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. సూపర్వైజర్ను నియమించాల్సిందేనని శ్రీనివాసన్ మరోసారి తేల్చిచెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్ అలీ ఆ పోస్టుకు సరిపోతాడని బ్లడ్ బ్యాంకు ఇన్చార్జ్ డాక్టర్ శివకుమార్ చెప్పగా.. ఏపీసాక్స్ ద్వారా నియమితుడైన అలీ ఏవిధంగా సరిపోతాడని శ్రీనివాసన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాంపొనెంట్స్ వాడకానికి ఎప్పుడు అనుమతి లభిస్తుందో తెలియడం లేదు. -
జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు పేదలకు ఉత్తమ వైద్య సేవలను అందించే క్రమంలో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ తెలిపారు. వికాస సౌధలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. బెంగళూరు, రాయచూరు సహా ఆరు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించాలనే యోచన కూడా ఉందన్నారు. కొందరు వైద్యులు రోగులను దోచుకుంటున్నారని, ఈ విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. అనంతరం ప్రసంగించిన ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ వైద్యులు తమ ముందుంచిన పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే ఉత్తమ సేవలు అందిస్తున్నాయని కితాబునిచ్చారు. అందరికీ టెన్షనే... ఈ సందర్భంగా మంత్రి ఖాదర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘ప్రతి ఒక్కరికీ ఏదోక టెన్షన్ ఉంటుంది. మంత్రిగా నాకూ టెన్షన్ ఉంది. మా అధికారం తాత్కాలికం, మీ సేవలు శాశ్వతం’ అని వైద్యులనుద్దేశించి అన్నారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అనేక పథకాలున్నాయని చెబుతూ, వాటిని పూర్తి చేసేంత వరకు వేరే పథకాలు వద్దని ముఖ్యమంత్రికి కూడా సూచించానని తెలిపారు. తొలుత ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైద్యుల వేతనాలను పెంచాలని కూడా కోరానని వెల్లడించారు. ‘మంత్రి గోల్ కీపర్ మాదిరి. తొమ్మిది గోల్స్‌ను ఆపి, పదో గోల్‌ను వదిలేస్తే...అతనికి మూఢినట్లే. తొమ్మిది మంచి పనులను చేసిన మంత్రి పదో సందర్భంలో విఫలమైతే...అతని గ్రహచారం’ అని ముక్తాయింపునిచ్చారు. -
700 ఎంబీబీఎస్ సీట్లకు కోత
* మౌలిక వసతులు కల్పించలేదని ఎంసీఐ కీలక నిర్ణయం * తెలంగాణలో 150, సీమాంధ్రలో 550 సీట్ల తరుగుదల * మరో 100 సీట్లకు కూడా కోత పడే అవకాశం సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలతో మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 700 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. ఢిల్లీలో బుధవారం జరిగిన భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో గాంధీ, ఆంధ్రా, గుంటూరు, సిద్ధార్థ, రంగరాయలాంటి ప్రముఖ కళాశాలలకూ మినహాయింపునివ్వలేదు. త్వరలో మరో 100 సీట్లకూ కోత పడనుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ వైద్య సీట్లకు ఇంత భారీగా కోత విధించిన దాఖలాలు లేవు. చివరకు జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సీట్లకు ఇంతగా కోత పడలేదు. ఈ ఘనతను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ కళాశాలల్లో 2,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే మౌలిక వసతులు కల్పించలేదని, రోగులకు తగిన పడకలు లేవని, తగిన సంఖ్యలో సిబ్బంది లేరన్న ప్రధాన కారణాలతో 10 కళాశాలల్లోని 600 సీట్లకు కోత విధించారు. మరో వంద సీట్లకు నెల్లూరు కొత్త కళాశాలకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పర్యవేక్షించేందుకు ఇద్దరు వైద్య సంచాలకులు ఉన్నప్పటికీ ఈ నష్టాన్ని నివారించలేకపోయారు. ఫలితంగా తెలంగాణ 150, సీమాంధ్ర 550 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయాయి. ఇక ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 1,850 సీట్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత దురదృష్టకర పరిస్థితి ఎప్పుడూ లేదని వైద్యరంగ నిపుణులు వాపోతున్నారు. -
ఈసారీ ప్రవేశాల్లేవ్..!
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నారు. పనులు పూర్తవుతున్నాయి..ప్రొఫెసర్లు వచ్చేస్తున్నారంటూ హడావుడి చేశారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నాయంటూ గొప్పలు చెప్పారు. ఈ ఏడాది నుంచే వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతున్నాయని చిలుక పలుకులు పలికారు. తీరా ‘ఎక్కడున్నావు కంబళీ అంటే, వేసిన చోటే ఉన్నాను గొంగళీ అన్నదట’ అనే సామెత చందాన తయాైరె ంది నెల్లూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిస్థితి. సాక్షి, నెల్లూరు : నిధుల మంజూరులో జాప్యంతో పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పట్లో అధికారంలో ఉన్న ఆనం వారి హడావుడి చూసి ఇక్కడే సీట్లు పొందవచ్చని ఊహల్లో తేలిన విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం కళాశాల మంజూరు : నెల్లూరుకు ప్రభుత్వ వైద్యకళాశాలను మంజూరు చేస్తూ 2012లో జీఓ విడుదలైంది. నగరంలోని డీఎస్సార్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న 60 ఎకరాల స్థలంలో రూ.362 కోట్లు వెచ్చించి కళాశాల నిర్మించాలని నిర్ణయించారు. ఎస్ఎస్ కన్సల్టెంట్స్ రూపొందించిన కళాశాల నమూనాతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆర్భాటంగా సమావేశం నిర్వహించి నిర్మాణ తీరుతెన్నులను వివరించారు. మొదట 150 సీట్లతో ప్రారంభించి భవిష్యత్తులో 260 సీట్లకు పెంచాలని నిర్ణయించినట్లు గొప్పలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. పూర్తికాని పనులు : వైద్య విద్యార్థులకు మొదటి సంవత్సరంలో అనాటమి, ఫిజియాలజి, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. అనాటమికి థియేటర్, మిగిలిన వాటికి ల్యాబ్‌లు తప్పనిసరి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పది మంది ట్యూటర్లు అవసరమవుతారు. వీరితో పాటు బోధనేతర సిబ్బంది సరేసరి. ఈ క్రమంలో వందలాది మంది నియామకం జరగాల్సి ఉంది. ఇవన్నీ కావాలంటే ముందు కళాశాల భవన నిర్మాణం పూర్తవడం తప్పనిసరి. నిబంధనల మేరకు కళాశాల నిర్మాణం పూర్తయి, మౌలిక వసతులతో పాటు ఆధునిక వైద్యపరికరాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సంతృప్తి వ్యక్తం చేస్తేనే సీట్లు మంజూరు చేస్తారు. వీటిలో చాలా పనులు జరగకపోవడంతో ఈ ఏడాదికి ఆ బృందం పర్యటన వాయిదా పడినట్టేనని తెలుస్తోంది. మరోవైపు ఇంకా సుమారు రూ.280 కోట్లతో పనులు చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఈ ఏడాదికి కాదు కదా వచ్చే ఏడాదికి కూడా పూర్తయ్యేలా లేవు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే పనులు త్వరితగతిన పూర్తైవచ్చే ఏడాదైనా కళాశాల ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ఏడాదికి లేనట్టే : వైద్య కళాశాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి 2013-14 విద్యాసంవత్సరానికే కళాశాలను ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. మాటలకే పరిమితైన ఆయన నిధుల విడుదలలో జాప్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పరిపాలనా భవనం, సిబ్బంది, విద్యార్థుల వసతిగృహాల భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇక పలు రకాల వసతులు కల్పించడంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకం చేపట్టాలి. అంతా సవ్యంగా సాగివుంటే ఈ నెలలోనే ఎంసీఐ బృందం కళాశాల సందర్శనకు రావాల్సివుంది. అయితే ఆ బృందం పర్యటనను వాయిదా వేయించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ నెల 20న లేఖ రాశారు. రాష్ట్ర విభజనతో పాటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్మాణాలు పూర్తి చేయలేకపోయామని, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కొత్తగా 150 సీట్లు వస్తాయని విద్యార్థులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నెల్లూరుకు ప్రభుత్వ వైద్యకళాశాల వచ్చినా రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. -
ప్రమాదంలో వైద్య విద్య
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కళాశాలలో సౌకర్యాలు సక్రమంగా లేని కారణంగా ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం తరగతులకు అనుమతి ఇవ్వరాదంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీ ఐ) బృందం నివేదిక సమర్పించడమే ఇందుకు కారణం. దీంతో వచ్చే ఏడాది మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఎంసీఐ నుంచి ఇద్దరు సభ్యులు సూర్యప్రకాశ్రావ్, భరత్షా గత ఫిబ్రవరిలో మెడికల్ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం నివేదికను సమర్పించారు. మంజూరు చేసింది రాజన్నే.. 2008లో పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీని వాస్ షష్టి పూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. అనంతరం దీనికి రూ. 100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో ఖలీల్‌వాడీ గ్రౌండ్లో మెడిక ల్ కళాశాల పనులు ప్రారంభించారు. 2011 డిసెంబర్లో ప్రారంభం కావాల్సి ఉండగా పను లు ఆలస్యంగా జరిగాయి. 2013 మే-16,17 లో ఎంసీఐ బృందం తొలిసారిగా పరిశీలన చేపట్టింది. అప్పుడే ఆ బృందం మొదటి సంవత్సరానికి అనుమతి కోసం కొద్దిగా పేచీ పెట్టింది. దీంతో జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలు మా ర్లు ఢిల్లీకి వెళ్లి అనుమతి కోసం కృషి చేశారు. ఎట్టకేలకు జూలైలో ఎంసీఐ మొదటి సంవత్స రం తరగతుల నిర్వహణకు పచ్చజెండా ఊపిం ది. వంద మంది విద్యార్థులతో ఆగస్టు-5న తరగతులు ప్రారంభమయ్యాయి. రెండవ సంవత్సరం కోసం అధికారులు ఎంతో కృషి చేయవల్సి వచ్చింది. సౌకర్యాల లేమితో కళాశాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవీ అసౌకర్యాలు రెండవసారి పరిశీలనకు వచ్చిన ఇద్దరు సభ్యు ల ఎంసీఐ బృందం కళాశాలలోని అసౌకర్యాలను ఎత్తి చూపింది. ఇంటెన్సీవ్ కార్డియాక్ కేర్ యూనిట్, ఫార్మకాలజీ, పాథలాజికల్ క్లీనిక్‌లు లేవని నివేదికలో పేర్కొంది. మైక్రోబయాలాజీ విభాగంలో పైకప్పు ఉడిపోయే దశలో ఉందంటూ నివేదించింది. సెంట్రల్ ఫొటోగ్రఫీ యూనిట్ లేకపోవడం, విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బందికి వసతి గృహాలు లేకపోవడం, గ్రం థాలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడం తదితర అంశాలను పే ర్కొంది. ప్రొఫెసర్లు నాలుగురు, అసోసియేషన్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగురు, రెసిడెంట్ వైద్యులు ఏడుగురు, జూ నియర్ రెసిడెంట్ వైద్యులు ఆరుగురు తదితరులతో పాటు మొత్తం కళాశాలకు కేటాయించిన 99 మం ది ప్రొఫెసర్లలో కేవలం 30 మంది మాత్రమే ఉండడం బృందం తప్పుపట్టింది. వివిధ విభాగాలకు సం బంధించిన ఆరోగ్యపరీక్షలకు సరిప డా సౌకర్యాలు సైతం లేవని బృం దం తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 2014-15 విద్యా సంవత్సరానికిగాను రెండవ సంవత్సరం100 సీట్ల ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. ఎం సీఐ బృందం ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం కళాశాలకు రెండో సంవత్సరానికి అనుమతి రాదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నేడు అభివృద్ధి కమిటీ సమావేశం నేడు మెడికల్ కళాశాలలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరుగనుంది. కళాశాలలో సౌకర్యాల ఏర్పాటు, ఎంసీఐ పేర్కొన్న అంశాలను చర్చించనున్నారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాంతరా వ్, అడిషనల్ డెరైక్టర్ , కళాశాల ప్రిన్సిపాల్ హాజరుకానున్నారు. -
మూడు కొత్త పీజీ వైద్య కోర్సులు!
ప్రభుత్వానికి వైద్య విద్యాశాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో మూడు కొత్త పీజీ వైద్య కోర్సులను ఏర్పాటు చేసేందుకు వైద్య విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 33 విభాగాల్లో 1180 వరకూ పీజీ వైద్య సీట్లున్నాయి. కొత్తగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్ఫ్యూజన్ మెడిసిన్ (ఇమ్యునొ హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), ఎమర్జెన్సీ మెడిసిన్/నియోనెటాలజీ కోర్సులకు సంబంధించిన సీట్లకు అనుమతి కోరుతూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి ప్రతిపాదనలు పంపనున్నారు. ఉస్మానియా, గాంధీ, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల, తిరుపతిలోని స్విమ్స్, కర్నూలు మెడికల్ కళాశాలతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ఇతర కళాశాలల్లో ఈ మూడు కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఎంసీఐ అనుమతి ఇస్తే 2014-15 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, లేదంటే 2016-17 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరో వైద్య కళాశాల!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. దీని ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఈ కళాశాల నిర్మాణానికి రూ. 363 కోట్లు అవసరమవుతాయని వైద్యవిద్యా శాఖ అధికారులు అంచనా వేశారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ఆవరణలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యా శాఖ అధికారులు రెండ్రోజుల క్రితమే ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం నగరంలో 250 ఎంబీబీఎస్ సీట్లతో ఉస్మానియా , 200 సీట్లతో గాంధీ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో కోటి జనాభా ఉన్నారని, మరో వైద్య కళాశాల ఉంటే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కొత్తగా ఏర్పడే కళాశాలలో 150 సీట్లు ఉండాలని, 750 పడకలతో ఆస్పత్రిని అనుబంధంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆస్పత్రి నిర్మాణానికి నిధులను 14వ ఆర్థిక సంఘం నుంచి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఎంసీఐ అనుమతి లభిస్తే వచ్చే ఏడాది నాటికి కళాశాలను పూర్తి చేయాలని, లేదంటే 2015-16 నాటికైనా 150 సీట్లతో కళాశాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వైద్య విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, ప్రభుత్వం ఇటీవలే 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ నిజామాబాద్‌లో వైద్య కళాశాలను నిర్మించిన సంగతి తెలిసిందే.