
పులివెందుల అభివృద్ధిపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీనికి డిసెంబర్‌లో శంకుస్థాపన చేయాలని చెప్పారు. పులివెందుల శిల్పారామానికి సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సూచించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ (పాడా)పై ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. పాడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment