
సాక్షి, మహబూబ్‌నగర్ : ‘దిశ’కేసులో ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు నిందితుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల పహారా మధ్య శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు, అధికారుల రాకపోకల కారణంగా జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగడంతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే మృతదేహాలను మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర శివారులో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. సోమవారం వరకు మృతదేహాలను అక్కడే భద్రపరచనున్నారని సమాచారం.