dead bodies
-
వారి మృతదేహాలు భద్రపర్చండి
సాక్షి, హైదరాబాద్: ఏటూరునాగారం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు వారి కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వాలని స్థానిక పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపర్చాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమని, మత్తు పదార్థం/విషమిచ్చి పట్టుకుని కాల్చి చంపారని, తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంటూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కాలవల ఐలమ్మ (మీనా) సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఆగమేఘాలపై పోస్టుమార్టం: పిటిషనర్ పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌గా సృష్టించడం కోసం కాల్పులు జరిపారు. మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయి. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరుతూ ఐలమ్మ ఆదివారమే జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు ఈ మెయిల్ పంపారు. అయినా ఆమెను, కుటుంబసభ్యులను పోలీసులు అనుమతించలేదు.బూటకపు ఎన్కౌంటర్ కానప్పుడు మృతదేహాన్ని చూపించడానికి అభ్యంతరం ఏంటీ?..’అని ప్రశ్నించారు. అయితే అప్పటికే పోస్టుమార్టం ముగిసిపోయిందని జీపీ చెప్పడంతో.. కుటుంబసభ్యులు చూడకముందే ఆగమేఘాల మీద పోస్టుమార్టం ఎందుకు చేశారో పోలీసులు చెప్పాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. నిపుణుల బృందం పోస్టుమార్టం పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజ్ వాదనలు వినిపిస్తూ.. ‘అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిస్పందించారు. ఎదురుకాల్పుల్లో మరణించిన వారిని భద్రతాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సమీప ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సెక్ నిపుణుల బృందం అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసింది. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు.మృతదేహాలను అక్కడే ఫ్రీజర్‌లో భద్రపరుస్తారు. కుటుంబసభ్యులు చూడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు..’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలని ఏటూరునాగారం ఎస్హెచ్ఓను ఆదేశించారు. పోస్టుమార్టంలో పాల్గొన్న నిపుణులు, వైద్యుల పూర్తి వివరాలు తమ ముందుంచాలని చెబుతూ, తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. -
శిథిలాల్లో 30 మృతదేహాలు
బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి. -
500 మంది సైనికుల మృతదేహాలు.. ఉక్రెయిన్‌కు అప్పగించిన రష్యా
కీవ్: రష్యా శుక్రవారం 501 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ మొదలయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో సైనికుల మృతదేహాలను అప్పగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డొనెట్స్క్లోని అవ్డివ్కాపై పట్టుకోసం రష్యా ఆర్మీతో జరిగిన పోరులో వీరంతా వీరమరణం పొందారని వెల్లడించారు. మృతులను అధికారులు గుర్తించాక కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇలా ఉండగా, గురువారం రాత్రి తమ భూభాగంపైకి రష్యా ఏకంగా 135 షహీద్ తదితర డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. చాలా వరకు డ్రోన్లను కూలి్చవేశామని పేర్కొంది. నష్టం, మృతుల వివరాలను మాత్రం తెలపలేదు -
ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్‌పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్(50) కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్‌తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
Wayanad Landslides: ఎటు చూసినా వినాశనమే
వయనాడ్/తిరువనంతపురం: ప్రకృతి ప్రకోపానికి గురై శవాల దిబ్బగా మారిన కేరళలోని వయనాడ్ జిల్లా మారుమూల కుగ్రామాల వద్ద అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కుంభవృష్టి వర్షాలతో నానిన కొండచరియలు పడటంతో బురదలో కూరుకుపోయిన ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మీ, సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మరణాల సంఖ్య 167కి పెరిగింది. 191 మంది జాడ తెలియాల్సి ఉంది. 219 మంది గాయపడ్డారు. చిధ్రమైన చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వందలాది మందిని సమీప పట్టణాల ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ గ్రామస్థుల మరణాలతో వారి బంధువుల, ఆక్రందనలు, తమ వారి జాడ కోసం కుటుంబసభ్యుల వెతుకులాటతో ఆ ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాల కింద బ్రతికుంటే బాగుణ్ణు అని ఆశ, ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనన్న భయాలతో వందలాది మంది ఆత్మీయులు, మిత్రుల రాకతో ఆ ప్రాంతాల్లో విషాధం రాజ్యమేలింది. కొండపై నుంచి వచ్చిన వరద, బురద ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో బుధవారం ఉదయం మాత్రమే పూర్తిస్తాయిలో సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టగలిగారు. రెండ్రోజుల్లో 1,592 మందిని కాపాడినట్లు కేరళ సీఎం విజయన్ చెప్పారు.వేయి మందిని రక్షించిన ఆర్మీ: యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలతో రంగంలోకి దిగిన భారత సైన్యం దాదాపు 1,000 మందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, తీరగస్తీ దళాలు సంయుక్తంగా చేపడుతున్న రెస్క్యూ ఆప రేషన్లతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్లు, తాత్కాలిక వంతెనల సాయంతో ఘటనాస్థలి నుంచి వారికి జాగ్రత్తగా తీసు కొస్తున్నారు. కొందరు మానవహారంగా ఏర్పడి ఆ వలి ఒడ్డు నుంచి కొందరిని ఇటువైపునకు తీసు కొస్తూ సాహసంచేస్తున్నారు. డాగ్ స్క్వాడ్లతో పాటు స్థానికు తమ వంతు సాయం చేస్తున్నారు. శిబిరాలకు 8,017 మందిని తరలించారు.ఆదుకుంటున్న బెలీ వంతెనలు: 330 అడుగుల పొడవైన తాత్కాలిక బెలీ వంతెనలు నది ప్రవాహం ఆవలివైపు చిక్కుకున్న బాధితులను ఇటువైపు తీసు కొచ్చేందుకు ఎంతగానో ఉపయో గపడుతున్నాయి. 690 అడుగుల బెలీ వంతెనలను ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి తెప్పి స్తున్నారు. మేప్పడి–చూరల్మల వంతెన నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపడు తున్నారు. నిఘా హెలికాప్టర్లు కొండప్రాంతాలు, నదీ ప్రవాహం వెంట తిరుగుతూ బాధితుల జాడ కోసం అన్వేషణ కొనసా గిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీదిగ్భ్రాంతికర ఘటనలో సహాయక చర్యలు, పునరావాసం తదితర చర్యల పురోగతిపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. కేరళకు పూర్తిస్థాయిలో కేంద్రం మద్దతిస్తోందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఘటనాస్థలిని సందర్శించిన సందర్భంగా చెప్పారు.కుగ్రామాల్లో శ్మశాన వైరాగ్యంభారీ శిలలు పడి నేలమట్టమైన ఒక ఇంట్లో నాలుగైదు మంది కుటుంబసభ్యులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అలాగే బురదలో కూరుకుపోయిన విషాద దృశ్యం అక్కడి సహాయక బృందాలను సైతం కంటతడి పెట్టించింది. ముండక్కై జంక్షన్, చూరల్మల ప్రాంతాల్లో భీతావహ దృశ్యాలు అక్కడి ప్రకృతి విలయాన్ని కళ్లకు కట్టాయి. ‘‘ ముండక్కై గ్రామంలో ఘటన జరిగిన రోజు దాదాపు 860 మంది జనం ఉన్నారు. వాళ్లలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలీదు’ అని స్థానికులు వాపోయారు. ‘‘చెట్లను పట్టుకుని కొందరు, చెట్టు కింద పడి మరికొందరు, బురదలో కూరుకుపోయి ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. కురీ్చలో కూర్చుని, మంచాల మీద పడుకుని ఉన్న మృతదేహాలను గుర్తించాం’’ అని సహాయక బృందాలు వెల్లడించాయి. ‘‘అంతా కోల్పోయా. అందర్నీ కోల్పోయా. నాకు ఇక్కడ ఇంకా ఏమీ మిగల్లేదు’ అంటూ ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించారు. ‘‘బురదలో కాలు పెట్టలేకున్నాం. మావాళ్లు ఎక్కడున్నారో’’ అంటూ ఒకరు కంటతడి పెట్టుకున్నారు. 10 శాతం ఇళ్లు మిగిలాయి ముండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయని ఓ అంచనా. విధ్వంసం తర్వాత 450 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 49 ఇళ్లే మిగిలాయి. బాధితులు అంగన్వాడీ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.ముందుగానే హెచ్చరించాం: అమిత్ షాకుంభవృష్టిపై వారం క్రితమే ముందస్తు హెచ్చరికలు చేశామని రాజ్యసభలో వయనాడ్ విషాదంపై తాత్కాలిక చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ‘‘ ముందు జాగ్రత్తగా జూలై 23వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ నుంచి 9 బృందాలను కేరళకు పంపించాం. వయనాడ్‌లో విలయం మొదలవగానే జిల్లా కలెక్టర్ నుంచి ఈ బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే వాళ్లంతా రంగంలోకి దిగారు. అన్వేషణ, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కేరళకు పూర్తి స్థాయిలో మోదీ సర్కార్ అండగా నిలుస్తుంది. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి జనాన్ని వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25న రెండుసార్లు హెచ్చరికలు పంపాం. 20 సెం.మీ. భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. స్థానికులను ఎందుకు తరలించలేదు?’’ అని కేరళ సర్కార్‌ను అమిత్ ప్రశ్నించారు.పంపింది ఆరెంజ్ అలెర్ట్... అదీ 29న: విజయన్అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు తిరువనంతపురంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీవరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. వర్షాలొస్తాయని భారత వాతావరణ శాఖ వయనాడ్ జిల్లాకు సాధారణ ఆరెంజ్ అలర్ట్‌ను 29వ తేదీన మాత్రమే పంపింది. 20 సెంటీమీటర్లలోపు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్, 24 సెం.మీ.లోపు వర్షాలకు రెడ్ అలర్ట్ ఇస్తారు. కానీ వయనాడ్ జిల్లాలో అసాధారణంగా 572 మిల్లీమీటర్లకు మించి కుంభవృష్టి నమోదైంది. ఇంతటి భారీ వర్షసూచన వాతావరణశాఖ చేయలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం ఆరుగంటలకు రెడ్ అలర్ట్‌ను పంపించారు. వరదపై హెచ్చరించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి హెచ్చరిక రాలేదు. అయినా ఇది పరస్పర విమర్శలకు సమయం కాదు’’ అని అన్నారు. -
Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
ముంబైలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం!
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గిర్గావ్ చౌపటీలో గల నాలుగు అంతస్తుల భవనంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారని, ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఒక ప్రకటనలో తెలిపింది. భవనంలో చాలామంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ముంబైలోని గిర్గామ్ చౌపటీ ప్రాంతంలోని గోమతి భవన్లో లెవల్-2లో మంటలు చెలరేగాయని బీఎంసీ తెలిపింది. 10 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే పని కొనసాగుతోంది. మంటలు భవనంలోని మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తమకు ఈ సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం పది అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భవనం నుంచి దహనమైన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలోని మూడో అంతస్తులో ఈ మృతదేహాలు కనిపించాయని అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు #WATCH | Maharashtra: Fire broke out at Gomti Bhawan Building in Mumbai's Girgaon Chowpatty. Firefighting operations are underway. pic.twitter.com/jZHbCxkNUF — ANI (@ANI) December 2, 2023 -
మణిపూర్ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :మణిపూర్ హింసలో మృతి చెంది ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్చురీల్లో మగ్గుతున్న 175 మృతదేహాల్లో 169 మృతదేహాల వివరాలను గుర్తిచారు. ఆరు అన్‌ఐడెంటిఫైడ్‌గా మిగిలిపోయాయి.169 గుర్తించిన మృతదేహాల్లో 81 బాడీలను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయగా 88 ఎవరూ క్లెయిమ్ చేయలేదు. మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాల పరిస్థితిపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదక ఇచ్చింది.దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది.క్లెయిమ్ చేయని మృతదేహాలను మార్చురీలో నిరవధికంగా ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. మృతదేహాలను ఖననం లేదా దహనం చేయడానికిగాను మణిపూర్ ప్రభుత్వం 9 ప్రదేశాలను ఎంపిక చేసిందని కోర్టు తెలిపింది.క్లెయిమ్ చేసిన మృతదేహాలకు సంబంధించి అంత్యకక్రియలను వారి బంధువులు ఈ 9 ప్రదేశాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చని పేర్కొంది.ఇక గుర్తించి క్లెయిమ్ చేయని మృతదేహాల అంత్యక్రియల సమాచారాన్ని వారి బంధువులకు తెలపాలని ఆదేశించింది. వారం రోజుల్లోపు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు చేయొచ్చని తెలిపింది. షెడ్యల్ తెగల జాబితాలో గిరిజనులు కాని మైతేయి సామాజిక వర్గాన్ని కలిపే విషయాన్ని పరిశీలించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ ఏడాది మేలో మణిపూర్‌లో భారీ ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ హింసలో మొత్తం 170 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. ఇదీచదవండి..నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే...
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక బృందంలోని ఒకరు ఆ క్షణంలో వణికిపోయారు. మృతదేహాలలో నుంచి ఒక చెయ్యి అతని కాలును పట్టుకోవడంతో అతను నిలువెల్లా కంపించిపోయారు. గత శుక్రవారం (జూన్ 2) నాడు ఒడిశాలో రైలుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలమంది మృతి చెందారు. ఆ మృతదేహాలను ఒక స్కూలుగదిలో ఉంచారు. అక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్లగానే మృతదేహాల్లో నుంచి ఒక చేయి అతని కాలు పట్టుకుంది. దీంతో మొదట అతను భయపడిపోయారు. తరువాత తేరుకుని తన కాలు పట్టుకున్న శరీరాన్ని పరిశీలనగా చూశారు. అ శరీరంలోని రెండు కాళ్లూ తెగిపోయి ఉన్నాయి. అతని చేతులు సవ్యంగానే ఉన్నాయి. ఆ చేతులతోనే అతను రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వ్యక్తి కాళ్లు పట్టుకుని, తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. దీనిని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే బాధతుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితునికి తక్షణం చికిత్స ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రమాదం అనంతరం అధికారుల పరిశీలన, మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది మృతిచెందగా, 1200 మంది గాయపడ్డారు. చదవండి: ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన -
ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలు కుటుంబాలు అయినవారని కోల్పోయాయి. కొంతమంది ఇంటి పెద్దను కోల్పోగా, కొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తల్లిని కోల్పోగా, మరికొందరు తండ్రిని కోల్పోయారు... ఇలా చాలా జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి. అయితే ప్రస్తుతం మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడంతో అవి ఎవరివనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఈ నేపద్యంలో ఒక మృతదేహం తమవారిదేనంటూ ఐదుగురు వాదనకుదిగడం కనిపించింది. దీంతో వీరి సమస్య పరిష్కారం కోసం డీఎన్ఏ సహాయం తీసుకోనున్నారు. ఈ రైలు ప్రమాదంలో మొత్తం 288 ప్రాణాలు కోల్పోగా, 205 మృతదేహాలకు శవపంచనామా పూర్తయ్యింది. మిగిలిన మృతదేహాలకు ఈ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. ఈ ప్రమాదంలో వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. బాధితుడు మెహమ్మద్ ఇనామ్ ఉల్ హక్ మాట్లాడుతూ తన ఇద్దరు బావలతో పాటు తన సోదరుడు కూడా ఈ రైలు ప్రమాదంలో మృతిచెందాడని, వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వచ్చామన్నారు. ఇందుకోసం ఇక్కడ నాలుగు రోజులుగా తిరుగుతున్నామన్నారు. ఏఐఐఎంలో ఒక బావ మృతదేహం లభ్యంకాగా, మరో బావ, సోదరుని మృతదేహం కోసం వెదుకులాట సాగించామన్నారు. తన మరో బావ మృతదేహం లభ్యమైనా, అది తమవారిదేనంటూ ఐదుగురు బాధితులు చెబుతున్నారన్నారు. దీంతో డీఎన్ఏ టెస్టు చేసి, ఆ మృతదేహం ఎవరిదో నిర్ధారించి, ఆ బాధిత కుటుంబానికి అధికారులు అందజేస్తారన్నారు. అయితే ఇందుకోసం మరింత సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో 12 ఏళ్ల మనుమడిని కోల్పోయిన తాత నిజాముద్దీన్ మాట్లాడుతూ తన మనుమని మృతదేహం లభ్యమైనప్పటికీ ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుని, మరో మనుమని మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కేవలం తన ఒక మనుమని మృతదేహాన్ని తీసుకుని వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బాధితులకు రూ. 2000 నోట్లు! -
కరెంట్ షాక్‌తో 40 మంది మృతి?
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) మంగళవారం వెల్లడించింది. ‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్‌హెడ్ లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్ఐఆర్లో నమోదుచేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు. మార్చురీలో వందకుపైగా మృతదేహాలు రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు షురూ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వీకరించారు. స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్‌కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది. -
శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా?
ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఎక్కువరోజులు కుళ్ళిపోకుండా చూడటం కష్టసాధ్యమైనదని అన్నారు ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ఎ. షరీఫ్. విషాదంలో విషాదం... భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది చనిపోయినట్టు చెబుతున్నారు అధికారులు. చాలావరకు మృతదేహాలను వారి బంధువులు గుర్తించి తీసుకుని వెళ్లగా మరికొన్నిటిని భువనేశ్వర్ ఎయిమ్స్ సహా మరికొన్ని ప్రయివేటు ఆసుపత్రులలో భద్రపరిచారు. అవన్నీ అనాధ శవాలుగా మిగిలిపోయాయి. వందకుపైగా గుర్తుతెలియని మృతదేహాలు వీటిలో ఇంకా గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య వందకు పైగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మృతదేహాలను భద్రపరచడంలో ఒడిశా ప్రభుత్వం పెను సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఎక్కువ రోజులపాటు మృతదేహాలు కుళ్ళిపోకుండా చూడటంలో సిబ్బందికి అనేక ఇబ్బందులెదురవుతూ ఉన్నాయి. ఎక్కువరోజులు కష్టమే... ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ శాఖాధిపతి డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ ఛిద్రమైన శవాలను ఎక్కువ రోజులు భద్రపరచడం మంచిది కాదు. మొదటి పన్నెండు గంటల్లోనే మృతదేహాన్ని సరైన ప్రమాణాలను పాటించి జాగ్రత్తపరిస్తే తప్ప వాటిని ఎక్కువరోజులు భద్రపరచలేము. ఈ సంఘటన జరిగి ఇప్పటికే 80 గంటలు పైబడడంతో వీటిని కుళ్లిపోకుండా చూడటం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి ఆదివారం రోజున 139 మృతదేహాలు తీసుకుని వచ్చారు. వారి బంధువులెవరైనా వచ్చి గుర్తిస్తారని వాటిని ఐదు ఫ్రీజర్ల సాయంతో భద్రపరచి ఉంచారు. 30 గంటలు దాటిన తర్వాత నుంచి వాటిని డీకంపోజ్ కాకుండా ఉంచటానికి మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. -
ఎటు చూసినా రక్తపు మడుగే:ఒడిశా ప్రమాద బాధితుడి ఆవేదన
తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్ దాస్ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు 13 కోచ్‌లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడు జనరల్ కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు. ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్డిఆర్ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్‌లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ తెలిపారు. As a passenger on the Coromandel Express from Howrah to Chennai, I am extremely thankful to have escaped unscathed. It probably is the biggest train accident related incident. Thread of how the incident unfolded 1/n — Anubhav Das (@anubhav2das) June 2, 2023 (చదవండి: పట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్ కమిటీ) -
నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్, కళ్యాణ్, త్రినాథ్, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు) -
‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ రాధా ఆర్కేడ్లోని ‘డెక్కన్ కార్పొరేట్ ’లో జరిగిన అగ్నిప్రమాదంలో గల్లంతైన ఉద్యోగుల అవశేషాలు ఆదివారం సాయంత్రానికి కూడా లభించలేదు. గల్లంతైన జునైద్, వశీం, జహీర్‌ల్లో శనివారం సాయంత్రం ఒకరి అవశేషాలు లభించగా, మరో ఇద్దరివి వెలికితీసే పనిలో పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన గురువారం నుంచి వేడి సెగలు కక్కుతున్న ఈ భవనం ఆదివారం నాటికి కాస్త చల్లబడింది. దీంతో డ్రోన్లకు బదులుగా నేరుగానే గాలింపు చేపట్టారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కూలిన శ్లాబుల కింద రెండు మృతదేహాలు (అవశేషాలు) ఉండి ఉంటాయని భావిస్తున్నారు. శ్లాబులు పెద్ద పరిమాణంలో ఉన్న నేపథ్యంలో కూలీలు తీయలేకపోతుండటంతో జేసీబీ వంటివి వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ యంత్రాలను వినియోగిస్తే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ అంతస్తుల్లో ఆస్తి నష్టం కూడా జరగలేదు.. గాలింపు బృందాలు ఆదివారం భవనంలోని అన్ని అంతస్తులనూ పరిశీలించాయి. సెల్లార్–1, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండు, మూడో అంతస్తుల్లోని సరుకు మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. నాలుగో అంతస్తులో ఉన్న సామాను, సంచులతో పాటు ఐదు, ఆరో అంతస్తుల్లోని రహీం ఇంటిలోని ఫర్నీచర్ యథాతధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ పొగ, మసి చూరుకుపోవడం తప్పించి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంటున్నారు. శనివారం లభించిన అవశేషాలతో పాటు ఆ ముగ్గురు యువకుల బంధువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చదవండి: అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు -
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి.. ఫోన్ సిగ్నల్స్ మాత్రం వారివే!
హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే ఈ బాడీస్‌ను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. నిన్న రాత్రి వరకు వాళ్ల ఆచూకీ తెలియరాలేదు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి వారివేనా కాదా? అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలోనే గల్లంతైన యువకుల ఫోన్ సిగ్నల్స్ చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?
గౌరిబిదనూరు: ఈ నెల 9వ తేదీన కర్నాటకలో తాలూకాలోని తొండేబావి రైల్వే స్టేషను సమీపంలో రైలు పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించడం కలకలానికి కారణమైంది. ఇది ఆత్మహత్య, లేక ప్రమాదమా, మృతులు ఎవరు అనేది మిస్టరీగా మారింది. బుధవారం ఆ మిస్టరీ వీడింది. మృతులు తొండేబావి రైల్వేస్టేషను దగ్గరే నివాసముంటున్న మైలారప్ప (50), భార్య పుష్పలత (45), వీరి కుమార్తె మమత (25)గా పోలీసులు గుర్తించారు. మైలారప్ప చిన్నకారు రైతు. మమతకు ఇటీవల భర్త కుటుంబ కలహాలతో విడాకులు ఇవ్వడంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి కాపురం చెడిపోవడం వారు తట్టుకోలేకపోయారు. దీంతో ముగ్గురూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరో కూతురి ఫిర్యాదుతో.. మైలారప్ప మరో కుమార్తె దాక్షాయణి ద్యావరహళ్లిలో ఉంటుంది. మూడురోజుల నుంచి ఫోను చేసినా స్విచాఫ్ అని వస్తోంది. కంగారు పడిన ఆమె మంగళవారం రాత్రి తొండేబావిలోని ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటికే మృతదేహాలకు అంత్యక్రియలు చేసి వారి దుస్తులను భద్రపరిచారు. ఫోటోలను, దుస్తులను చూపించగా దాక్షాయణి తన తల్లిదండ్రులు, సోదరివి అని గుర్తుపట్టి విలపించింది. -
కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
-
విజయవాడ కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు
-
‘కృష్ణా’లో గల్లంతైన ఐదుగురూ మృత్యువాత
పెనమలూరు/పటమట (విజయవాడ తూర్పు): కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురూ మృత్యువాత పడ్డారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం) మరో మూడు మృతదేహాలు దొరికాయి. విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన షేక్ బాజీ (15), షేక్ హుస్సేన్ (15), తోట కామేష్ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్ (14), పిన్నింటి శ్రీను, షేక్ ఖాశిం అలీ స్నేహితులు. బాజీ, కామేష్ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్ చదువుతున్నారు. వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్ ఆడి, యనమలకుదురు పాయ నుంచి మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డుకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు నదిలో స్నానానికి దిగారు. కొద్దిసేపటికే వారంతా మునిగిపోవటం గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్న పశువుల కాపర్లు, జాలర్లకు చెప్పటంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దర్శిపేటలో విషాదఛాయలు ఇనకొల్లు గుణశేఖర్, తోట కామేష్ మృతిచెందడం, షేక్ హుస్సేన్, షేక్ బాజీ, మద్దాల బాలు గల్లంతవడంతో దర్శిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఇంకొల్లు గుణశేఖర్, దూదేకుల హుస్సేన్, మద్దాల బాలుకు తండ్రి లేకపోవటంతో వారి తల్లులే పండ్లు, పూలవ్యాపారం చేస్తూ తమ రెక్కల కష్టంపై పిల్లల్ని సాకుతున్నారు. మృతిచెందిన పిల్లల కుటుంబాలన్నీ నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే. -
వర్షాల వేళ విషాదం.. ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి
భారీ వర్షాల వేళ డ్యామ్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అకాల మరణం చెందారు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోడ్మెరా జిల్లాలో రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం సెలవు రోజు కావడంలో ఎంజాయ్మెంట్ కోసం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వారంతా ఓ పడవలో డ్యామ్ చూసేందుకు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో, పడవలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది నీటిలో మునిగిపోయి అకాల మరణం చెందారు. మరణించిన వారిని సీతారాం యాదవ్ (40), శివమ్ సింగ్ (17), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్ (14), సెజల్ కుమారి (16), పాలక్ కుమారి (14),హర్షల్ కుమార్ (8), భావ (5)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. పడవ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందంలో రంగంలోకి దిగి డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటి వరకు వారి డెడ్‌బాడీలు మాత్రం బయటకు తీసుకురాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు డ్యామ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ❗️Boat Tragedy: Eight members of family die after boat capsizes in Panchkhero Dam, Jharkhand One survivor swam to safety. The dead were aged from 5-40, seven of them under the age of 18. @RT_India_official pic.twitter.com/IsVG99QC3W — @NabaKumarRay (@Naba_Kumar_Ray) July 17, 2022 -
వీడని మిస్టరీ!
సాక్షి రాయచోటి : గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలు బయటపడిన సంఘటన సంచలనంగా మారింది. కారణాలు తెలియక ఒకవైపు..వారి వివరాలు లభించక మరోవైపు.. పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. మృతుల తలలకు గాయాలు ఉండడంపై హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే నిందితులు ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి.. ఘాట్ లోయలోకి విసిరేసి వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ మృతి చెంది దాదాపు 10–12 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కేవలం వారి ఒంటిపై ఉన్న దుస్తులు, గొలుసులు, ఇతర చిన్నపాటి ఆధారాల మేరకు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారి–44లో అనునిత్యం వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో ఘాట్ లోయలో మృతదేహాలను పడేసినట్లు స్పష్టమవుతోంది. అసలు వారెవరు? కడప–రాయచోటి సరిహద్దు ప్రాంతంలోని ఐదవ మలుపు వద్ద కొండకింద లోయలో కనిపించిన ఆ మృతదేహాలు ఎవరివి అన్నది అంతుచిక్కడం లేదు. అసలు వారెవరు...ఎక్కడి వారు...ఎందుకు చంపాల్సి వచ్చింది...ఇతర వివరాల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు ఇన్ఫార్మర్ల ద్వారా కూపీ లాగుతూ మరోవైపు ఉన్న ఆధారాల మేరకు విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన టైలర్ పేరు మృతుని షర్టుపై ఉండటంతో సంబంధిత టైలర్ ద్వారా ఆరా తీశారు. అయితే అతను చాలా ఏళ్ల క్రితమే టైలర్ వృత్తిని మానుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అయితే షర్టుపై ఉన్న గుర్తుల నేపధ్యంలో రాయచోటి ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలకు సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తోటల వద్ద కాపలాదారుల వివరాల సేకరణ ప్రధానంగా మృతుల్లో ఒక వ్యక్తి మెడలో సిల్వర్ గొలుసు, మహిళ నైటీ ధరించి ఉండడం చూసి మృతులు యానాదులు లేదా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మామిడి, చీనీ తోటల వద్ద కాపలా దారులుగా ఎక్కువగా వారే ఉంటారు కనుక వారి వివరాలు సేకరిస్తున్నారు. తోటల వద్ద జరిగిన గొడవే హత్యలకు కారణంగా ఉండవచ్చన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ కేసులపై ఆరా వైఎస్సార్ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామాల్లో వారం, పది రోజులుగా కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆస్తుల వ్యవహారంలో గొడవలు జరిగి మృతి చెందినట్లయితే వ్యవహారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు కాకపోయినా గ్రామాల్లో అదృశ్యమైన వారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు బృందాలతో గాలింపు మృతుల వివరాలు కనుగొనేందుకు ప్రత్యేకంగా ఏడెనిమిది పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు దర్యాప్తులో ముందుకు వెళుతున్నాయి. దర్యాప్తు ముమ్మరం గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలకు సంబంధించి వైఎస్సార్‌తోపాటు అన్నమయ్య జిల్లాలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన్చంగా వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన మహిళా పోలీసులకు సమాచారం అందించాం. గ్రామాల్లో కనిపించని వారితోపాటు మిస్సింగ్ వివరాలు కూడా తెప్పించుకుంటున్నాం. కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తూ మిస్టరీని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తోటల వద్ద కాపలా ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నాం. – కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ, వైఎస్సార్ జిల్లా -
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 19 మంది మృతి
ముంబై: ముంబై: ముంబైలోని కుర్లా ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో 19 మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. నాయక్ సాగర్ సొసైటీలో ఉన్న ఈ భవనం సోమవారం అర్థరాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో ఒకవైపు పూర్తిగా కుప్పకూలిపోయిందని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. కూలిపోకుండా మిగిలిన భాగంలోని వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింది వెలికితీత మొదలు పెట్టారు. 10 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 9 మంది ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. భవనం బాగా పాతబడిందని, ఎప్పుడైనా కూలే ప్రమాదముందని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నా ఎవరూ ఇళ్లు వదల్లేదని అధికారులు తెలిపారు. 2013 నుంచి బీఎంసీ నోటీసులిస్తున్నా మరమ్మతులకు కూడా అంగీకరించలేదన్నారు. రిస్క్ తీసుకొని భవనంలోనే ఉంటామని, ఖాళీ చేయబోమని చెప్పినట్టు అదనపు మున్సిపల్ కమిషనర్ అశ్విని భిండే వెల్లడించారు. -
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
-
Hyderabad: ఉస్మానియాలో శవాల తారుమారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో అపరాధం జరిగింది. ఒకరికి చెందిన మృతదేహాన్ని మరొకరికి అప్పగించిన ఘటన చోటుచేసుంది. దీంతో మృతుడి బంధువులు నిరసనకు దిగారు. పోలీసులు తమ తప్పు తెలుసుకుని.. అంత్యక్రియలు నిర్వహించిన శవానికి గురువారం రీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రి మార్చురీకి తరలించిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివరాంపల్లికి చెందిన పాండురంగాచారి (70) కట్టెల మిల్లులో దినసరి కూలీ. ఈ నెల 10న మైలార్‌దేవ్‌పల్లిలో స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాండురంగాచారి ఈ నెల 12న మృతి చెందాడు. పని నిమిత్తం వెళ్లి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు యజమానిని సంప్రదించారు. అతను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉస్మానియా మార్చురీలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో సంజీవరెడ్డి నగర్‌కు చెందిన ఇతరులు పొరపాటున పాండురంగాచారి మృతదేహం తమకు చెందినదేనని అంగీకరించడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు పాండురంగాచారి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం పాండురంగాచారి కుటుంబీకులు మార్చురీకి వచ్చారు. అదేరోజు మిస్సింగ్ కేసు నమోదైన మరో వ్యక్తి మృతదేహాన్ని వారికి చూపించారు. అది పాండురంగాచారి శవం కాదని వారు నిర్ధారించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో.. అప్పటికే అంత్యక్రియలు నిర్వహించిన పాండురంగాచారి మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తరలించారు. పోలీసుల నిర్వాకంతో రెండు కుటుంబాల సభ్యులు మనోవేదనకు గురయ్యారు. -
ఏ జన్మ సంబంధమో..
వారి సావాసం శవాలతో.. వారి సంపాదన అంత్యక్రియలతో.. వారి నిత్య సంభాషణ ముడిపడేది చావుతో.. రైలు పట్టాల నుంచి రుద్రభూమి వరకు వారే. ఆఖరి దశ నుంచి అంత్యక్రియల వరకు వారే. రైలు తాకిడికి ఖండితమైపోయిన దేహాలకు, లోకం కంట పడకుండా పాడైపోయిన శరీరాలకు దిక్కూమొక్కూ వారే. ఎప్పటి రుణానుబంధమో అనాథ మృతదేహాలకు అన్నీ తామే అయ్యి సద్గతులు అందిస్తున్నారు వారు. ఏ జన్మ సంబంధమో వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ పని చేసే వారిని ‘తోటి’ అని పిలుస్తారు. కోటికొకరు ఎన్నుకునే ఈ వృత్తిలో జిల్లా వారూ ఉన్నారు. జలుమూరు: రైలు కింద పడి ఒకరు మృతి చెందారు.. తోటీ రావాలి. రైలు ప్రమాదంలో ఒకరి మృతదేహం దొరికింది.. తోటీ రావాలి. ఒకరి శవం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.. తోటీని పిలవాలి. ముక్కలైపోయిన శరీరమొకటి పట్టాల పక్కన ఉంది...తోటీ రావాల్సిందే. శవం అన్న పేరు వినడానికి చాలా మంది భయపడతారు. అనడానికి కూడా ఆందోళన చెందుతారు. చూసేందుకు జంకుతారు. కానీ ఈ తోటీల బతుకంతా శవాలతోనే. జీతమెంత తీసుకుంటారో గానీ ఈ సత్కార్యాలు చేసి బోలెడంత పుణ్యంతో పాటు వారి కుటుంబీకుల ఆశీస్సులు కూడా అందుకుంటున్నారు వీరు. తెలిసిన వారి దహన సంస్కారాల్లో పాల్గొనడానికి మొహమాట పడే రోజుల్లో.. నిత్యం ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న గొప్ప మనుషులు వీరు. అనాథ శవాల పాలిట సంస్కార ప్రదాతలు ఈ ‘తోటీ’లు. పది మంది బృందం శ్రీకాకుళం జిల్లా తిలారు నుంచి శిర్లపాడు (ఇచ్ఛాపురం) వరకు, తిలారు నుంచి విజయనగరం వరకు పది మంది తోటీలు ఈ పని చేస్తుంటారు. స్టేషన్ల మధ్య జరిగే ప్రమాదాల సమాచారం అందుకున్న క్షణాల్లో ఇద్దరు చొప్పున అక్కడ ప్రత్యక్షమై అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైలు పట్టాల వెంబడి.. తోటీల అవసరం ఎక్కువగా ఉండేది రైలు పట్టాల వద్దే. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా మారిన వారికి వీరే దిక్కు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ వీరు ఠక్కున అక్కడ ప్రత్యక్షమవుతారు. సొంత మనుషుల్లా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా, కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం జంకు, సంకోచం లేకుండా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. వృత్తి సంతృప్తినిస్తోంది.. 15 ఏళ్లుగా ఈ వృత్తి చేస్తున్నాను. మొదటి ఏడాదిలో కొంత భయం ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం పవిత్రంగా భావిస్తాం. ఈ వృత్తి సంతృప్తినిస్తోంది. – రాజారావు బంధువుల అంత్యక్రియల్లోనూ.. అనాథ శవాలతోపాటు కొన్ని సందర్భాల్లో మా బంధువుల మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేశాను. అలాంటి సమయాల్లోనే మద్యం అలవాటైపోయింది. తెగిపడిన మృతదేహాలను ఏరి పోగు చేసి ఒక్క చోట చేర్చడానికి ధైర్యం కావాలి. ఈ 17 ఏళ్లలో వందల శవాలకు అంతిమ సంస్కారాలు చేశాను. – వెంకటరావు వారి సేవలు వెలకట్టలేనివి.. తోటీల సేవలు వెలకట్టలేనివి. మేం డబ్బులు ఇచ్చినా అనాథ శవాలకు దహన సంస్కారాలు, పాతిపెట్టడం వంటివి చేయడం సాధారణ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో సొంత వారు కూడా దగ్గరకు రాలేని దుస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఎంతో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ పనులు చేస్తున్నారు. వారికి నిజంగా చేతులెక్కి మొక్కాలి – ఎస్.కె షరీఫ్, పలాస జీఆర్పీ ఎస్ఐ -
ఆరిన కంటి దీపాలు
చందర్లపాడు/సాక్షి, అమరావతి: మునేరులో సోమవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టి అజయ్ (12), గురజాల అజయ్ చరణ్ (14) సోమవారం ఉదయం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన విషయం విదితమే. వీరంతా గ్రామంలోని మునేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, యానాదులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారుల జాడ కోసం సోమవారం రాత్రి నుంచే మునేరుతోపాటు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నల్లవాగు వరద మునేరులో కలిసే ప్రదేశంలో ఏర్పడిన గోతిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ బిడ్డలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటారని గంపెడాశతో రాత్రి నుంచి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు. నందిగామ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఏటి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులంతా కూలీ కుటుంబాల వారే మృత్యువాతపడిన పిల్లల తల్లిదండ్రులంతా కూలీలే. కాయకష్టం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. మైల దానయ్య, ఆంథోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాకేష్ (11) స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కర్ల గురవయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు బాలయేసు (12)తో పాటు కుమార్తె ఉంది. ఆ బాలుడు స్థానిక పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి గురవయ్య గతంలో మరణించడంతో ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయింది. ఇక జట్టి సుందరరావు, అరుణలకు ఇద్దరు సంతానం కాగా చిన్నవాడైన అజయ్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే గురజాల మరియమ్మ భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. ఆమె కుమారుడు అజయ్ చరణ్(14)ను అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటున్నారు. అజయ్చరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, మాగులూరి సుబ్బారావు మేరీ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. మూడవ కుమారుడైన సన్నీ (12) 7వ తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారులంతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వంట కట్టెలు తేవడానికి సైకిళ్లపై వెళ్లి మునేరులో దిగి మృత్యువాత పడ్డారు. ఏటూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ గ్రామానికి ఓ వైపు మునేరు మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. 2016 అగస్టు 16న నందిగామ చైతన్య కళాశాలలో చదువుతున్న తోటరావులపాడు, జయంతి, చెరువు కొమ్ముపాలెం, నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఐదుగురు చిన్నారులు మునేరులో దిగి దుర్మరణం పాలయ్యారు. రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. బుధవారం ఈ సొమ్మును అందజేయనున్నారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి ఆదిమూలపు సంతాపం కాగా, విద్యార్థుల మృతిపై విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సంక్రాతి సెలవులు, కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
ఇద్దరి మృతదేహాలు లభ్యం
సంగం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై బీరాపేరు వంతెన వద్ద గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో వాగులో గల్లంతైన ఐదుగురిలో ఇద్దరి మృతదేహాలను శనివారం గుర్తించారు. గురువారం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహించారు. ప్రమాదంలో గల్లంతైన కర్రా పుల్లయ్య(60), కర్రా నాగరాజు (40) మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు తండ్రి, కొడుకు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్రా సంపూర్ణమ్మ, కర్రా పద్మ, దివానపు ఆదెమ్మ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. వారి ఆచూకీ కోసం ఫైబర్ బోట్లు, నాటు పడవలతో, వలలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. -
కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ
సాక్షి, యశవంతపుర: బెంగళూరులోని రాజాజీనగర ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం రెండు కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది తెచ్చిపెట్టింది. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీరిగ్గా 15 నెలల తరువాత వారి కుటుంబాలు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు. వివరాలు.. చామరాజపేటకు చెందిన మహిళ (40), కేపీ అగ్రహారకు చెందిన వ్యక్తి (35)లు 2020 జూలైలో కరోనాతో ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజులకే మరణించారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో కొత్తగా మార్చురీని నిర్మించి, పాత మార్చురీని ఉపయోగించడం మానేశారు. పై ఇద్దరి మృతదేహాలు పాత మార్చురీలో ఉన్నట్లు సిబ్బంది ఇటీవల గుర్తించి వారి బంధువులకు తీసుకెళ్లాలని సమాచారం పంపారు. కానీ బీబీఎంపీ రికార్డుల్లో అప్పట్లోనే వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించినట్లు, అంత్యక్రియలు పూర్తయి డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు ఉంది. ఇప్పుడీ మానసిక క్షోభ ఏమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి ఈ అమానుషంపై విచారణ చేయాలని మాజీ మంత్రి సురేశ్‌కుమార్ కార్మిక శాఖ మంత్రి శివరామ్ హెబ్బార్‌ను డిమాండ్ చేశారు. నిర్లక్యం వహించిన బీబీఎంపీ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కోవిడ్ శవాలనూ, కొనఊపిరితో ఉన్నవారినీ వదల్లే
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ టేకర్లుగా పనిచేసిన భార్యభర్తలు ఆ వృత్తికే కళంకం తెచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగులతో పాటు కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచీ నగలు, సొత్తు కాజేశారు. మొత్తం ఏడు కేసులు నమోదైన ఉన్న వీళ్లని ఇలా చోరీ చేసిన సెల్‌ఫోన్ ఆధారంగానే గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. 2017లో నాగర్‌కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ ప్రేమ వివాహం చేసుకుని కూకట్పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజును సెకండ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది జగద్గిరిగుట్ట నుంచి టిమ్స్‌కు తీసుకొచ్చేందుకు నియమించుకున్నారు. ఇలా ఏర్పడిన పరిచయాలతోనే తన భార్య లతశ్రీని టిమ్స్‌లో పేషెంట్ కేర్ టేకర్‌గా చేర్చాడు. కొన్నాళ్లకు రాజు కూడా అలాంటి ఉద్యోగంలోనే చేరాడు. అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్‌లోని కోవిడ్ రోగులపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17–మే 25 మధ్య ఏడు నేరాలు చేశారు. లతశ్రీ ముందుగా మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించేది. అక్కడ ఎవరూ లేకపోతే తన భర్త రాజును పిలిచేది. అక్కడకు వెళ్లే అతగాడు శవాలపై ఉన్న నగలు తీసి జేబులో వేసుకుని ఏమీ తెలియనట్లు డ్యూటీ చేసేవాడు. ఈ సొత్తును జగద్గిరిగుట్టలోని జగదాంబ జువెల్లర్స్‌లో కుదువ పెట్టి అప్పులు తీర్చడంతో పాటు జల్సాలు చేశారు. కేసు వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కోవిడ్‌తో మరణించిన ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు, యూసూఫ్‌గూడకు చెందిన పరహత్ సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు, దిద్దులు, జవహర్‌నగర్‌కు చెందిన భిక్షపతి తల్లి మెడలోంచి గుండ్ల మాల తస్కరించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగానే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు కాజేశారు. ఈమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఈ భార్యభర్తలు టిమ్స్‌లో డ్యూటీకి వెళ్లడం మానేశారు. ఓ మృతదేహం నుంచి వీళ్లు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ కూడా తస్కరించారు. ఇటీవల దీన్ని ఆన్ చేయడంతో పోలీసులకు క్లూ లభించి ఇద్దరూ చిక్కారు. విచారణలో తాము చేసిన నేరాలు అంగీకరించారు. వీరి నుంచి పది తులాల బంగారం సహా రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాదీనం చేసుకున్నారు. మరో రెండు సంస్థల్లో తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గాజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల్ని పట్టుకున్న గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ తదితరుల్ని అభినందించిన డీసీపీ రివార్డు ప్రకటించారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్: బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్ (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్ కలర్ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం మెండు జోసఫ్(బాబి) తండ్రి రవికుమార్ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. -
నేల బావి ప్రమాదం.. ముగ్గురు మైనర్ల మృతి
సాక్షి, తూర్పుగోదావరి: నిన్న బైక్ అదుపు తప్పి పాడు పడిన నేలబావిలో పడి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మంగవారం వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, దోసకాయలపల్లిలో జరిగిన ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, దోసకాయలపల్లికి చెందిన లలిత పద్మాకుమారి కొడుకు గుమ్మడి సనీల్ (17), తుమ్మలపల్లి నుంచి సెలవులకు వచ్చిన తన చిన్నమ్మ కస్తూరి అచ్చుతరాణి కుమారుడు కస్తూరి అభిరామ్ (7)తో కలిసి బైక్‌పై గుమ్ములూరులో ఉంటున్న మరో చిన్నమ్మ చిన్నం పాప ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి వారి పిల్లలు చిన్నం వీర్రాజు (17), చిన్నం శిరీష (13)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒకే బైక్‌పై నలుగురు దోసకాయలపల్లికి బయలు దేరారు. అయితే ఈ మార్గంలోని పుంత రోడ్డు మలుపులో బైకును తిప్పే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పాడుపడిన నేలబావిలో పడిపోయారు. ఇదే సమయంలో బైక్‌పై చివరన కూర్చున్న అభిరామ్ దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం మేరకు.. వెంటనే గజఈతగాళ్లను రప్పించారు. డీఎస్పీ నార్త్ జోన్ కడలి వెంకటేశ్వర్రావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితోపాటు రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు -
సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు
ఉత్తరకాశీ: భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్ఘాట్ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్థాని కులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదంతా మున్సిపల్, జిల్లా అధికారుల నిర్లక్ష్య వల్లనేనని మండిపడుతున్నారు. కోవిడ్ బారిన పడి చనిపో యిన వారికి కూడా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు జరుపుతున్నారని, కుక్కలు పీక్కు తింటున్న మృతదేహాల్లో వైరస్ బారిన పడినవి కూడా ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాగీ రథి నదిలో నీటి మట్టం పెరగడంతో సరిగా కాలని మృతదేహాలు కొన్ని వరదలో కొట్టుకుపోగా, మిగతా వాటిని కుక్కలు లాక్కెళుతున్నాయని అం టున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా.. ఆ వీడియోలు వారం క్రితం నాటివనీ, కేదార్ఘాట్ను శుభ్రం చేసేలా మునిసిపల్ సిబ్బంది అప్రమత్తం చేశామని వివరించారు. -
హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి
డెహ్రాడూన్: కరోనా వైరస్ మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ప్రతీ ఇంట్లోనూ కరోనా వచ్చిన వారిని దూరంగా ఉంచుతున్నారు. అలా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంగతి వర్ణనాతీతం. కరోనాతో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటి కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడుతున్నారు. వారికి ఎక్కడ సోకుతుందో అని భయపడి దూరంగా ఉండే వారికి అంతిమ సంస్కారాలు కానిస్తున్నారు. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసి అక్కడి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర కాశీలోని భాగీరథీ నదీ తీర ప్రాంతంలోని కేదార్ ఘాట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరోనాతో మృతి చెందినవారికి భాగీరథీ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొన్నింటిని చితి పేర్చి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలు సగం మాత్రమే కాలినా వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో వీధి కుక్కుల అక్కడికి చేరుకొని సగం కాలిన శవాల శరీర బాగాలను పీక్కు తింటున్నాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఒక వ్యక్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. ''ఇది చాలా హృదయవిదారకం.. భాగీరథి నదీ తీరానా సగం కాలిన శవాలను కుక్కుల పీక్కు తింటుంటే నా మనసు చెమ్మగిల్లింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో మృతదేహాల ఒడ్డుకు కొట్టుక వస్తున్నాయి. వీధి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మృతదేహాలు కరోనా సోకినవారివైతే వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం' Uttarakhand | Residents claim that dogs are eating half-burnt COVID bodies at Kedar Ghat, Uttarkashi. After receiving complaints from locals, we have assigned a person at Kedar Ghat for cremation of half-burnt bodies: Municipality president Ramesh Semwal pic.twitter.com/9IvC9ysC6O — ANI (@ANI) June 1, 2021 -
పడవలు బోల్తా ఘటన: ఆరుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, విశాఖపట్నం: సీలేరు నదిలో నాటుపడవలు బోల్తా ఘటనలో గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం రేపు(బుధవారం) గాలింపు చర్యలు చేపట్టనున్నారు. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటన విదితమే. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో ఐదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. చదవండి: విశాఖ హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య -
కలకలం: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు
లక్నో/ పాట్నా: పవిత్రమైన గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూడు, నాలుగు కిలో మీటర్ దూరం వరకు దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కరోనా మృతదేహాలను నది ఒడ్డున పడవేశారు. మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో వాటిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్, బిహార్‌లోని బక్సార్ జిల్లాలో పారుతున్న గంగానది చెంత ఈ దుస్థితి ఏర్పడింది. యూపీలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలకు అంత్యక్రియలు చేసే శ్మశానం కూడా నిండి ఉండడం.. కుటుంబసభ్యులు నిరాకరించడం వంటి వాటితో ఇక విధిలేక కొందరు ఆస్పత్రుల నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు గంగానది ఒడ్డున కరోనా మృతదేహాలను పడేశారని తెలుస్తోంది. దీంతోపాటు బిహార్‌లోని బక్సర్ జిల్లా నగర్ పరిషద్ పట్టణంలో పారుతున్న గంగానదిలోనూ మృతదేహాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీలోని హమీర్పూర్ ఏఎస్పీ అనూప్‌కుమార్ స్పందించారు. హమీర్పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం.. పూడ్చడం వంటివి చేయరని.. అలా నదిలో పారవేస్తారని ఏఎస్పీ తెలిపారు. అప్పుడప్పుడు నదిలో మృతదేహాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయంతో కూడా చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాలను నది నీటిలో వదిలేస్తున్నారని ఆయన వివరించారు. మొత్తం గంగానది ఒడ్డున 150కి పైగా మృతదేహాలు లభించాయని తెలుస్తోంది. చదవండి: ‘నా వయసు 97 ఏళ్లు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’ చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
తనవాళ్లు చనిపోయారు అని తెలియక ..7రోజులపాటు సహజీవనం చేసాడు
-
నిర్లక్ష్యం.. ఆస్పత్రిలో కరోనా మృతదేహలు తారుమారు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండానే తమకు చెందిన మృతదేహమే అనుకుని అంత్యక్రియలు నిర్వహించేశారు. తీరా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆరాతీసేసరికి అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అహ్మద్‌పురకాలనీకి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన మహిళ (78) కొవిడ్ తో బాధపడుతూ రెండ్రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. కాగా, ఇదే సమయంలో గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళ (65) కొవిడ్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు మృతదేహాలను ప్యాక్‌చేసి పోస్టుమార్టం గది పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన బంధువులెవరూ లేరు. గాయత్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మహిళ చనిపోయిందని గాయత్రినగర్ వాసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని పరిశీలించకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేశారు. అనంతరం మైనారిటీ వర్గం వారు వచ్చి తమ బంధువు మృతదేహం గురించి వెదకగా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి అధికారులు గాయత్రి నగర్ వాసులను పిలిపించారు. అక్కడ ఉన్న మృతదేహాలను మళ్లీ పరిశీలించగా గాయత్రినగర్ మహిళ మృతదేహం అక్కడే ఉంది. ఇంతకు ముందు తీసుకెళ్లిన మృతదేహాన్ని చూడలేదని తెలపడంతో మైనారిటీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, అడిషనల్ కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. రెండు వర్గాలను సముదాయించారు. దీంతో మైనారిటీ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మృతదేహం తారుమారుపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపడుతున్నారు. చదవండి: కరోనా టీకా వేయించుకున్న 105 ఏళ్ల బామ్మ -
అరకు ప్రమాదం: హుషారుగా వెళ్లి.. విషాదంగా..
సాక్షి, హైదరాబాద్: అరకు లోయలో బస్సు పడిన ప్రమాద ఘటన బాధితులు శనివారం రాత్రి నగరానికి బయలుదేరారు. నలుగురి మృతదేహాలను సైతం ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించారు. షేక్‌పేట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదం నుంచి బయట పడిన 16 మందిని భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. శుక్రవారం అరకు లోయలో బస్సు పడిపోయిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 23 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో కలిసి మొత్తం 27 మంది హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్లారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి విశాఖలో అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో.. ప్రమాదం తర్వాత విశాఖ నుంచి తిరిగి వస్తూ.. ప్రమాదం నుంచి త్రుటిలో బయటిపడి ఇళ్లకు చేరుకోవడంతో 16 మంది కుటుంబ సభ్యులకు కొంత ఊరట కలిగించింది. మృతుల కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా.. శనివారం ఉదయం అరకు లోయ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ విశాఖపట్నం వెళ్లారు. మృతులు, గాయపడిన కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు కూడా అక్కడికి బయలుదేరారు. వీరు విశాఖపట్నానికి వెళ్లేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమాన టికెట్లు అందించారు. చదవండి: కామారెడ్డిలో ఆర్టీసీ బస్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం -
విషాదం: ఐదు రోజులు గడుస్తున్నా..
సాక్షి, పశ్చిమగోదావరి: ఈ నెల 18న గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ సభ్యుల మృతదేహాలు ఇంకా లభించలేదు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన ఇంటి యజమాని నరసయ్యకు కరోనా సోకి మృతి చెందడంతో మనస్తాపానికి గురై కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.. మృతులు భార్య సునీత, కుతూరు అపర్ణ, కుమారుడు ఫణికుమార్లుగా గుర్తించారు. ఐదు రోజులు గడుస్తున్న మృతదేహాలు లభించకపోవడంతో గోదావరి పరివాహక పోలీస్స్టేషన్లకు కొవ్వూరు పోలీసులు సమాచారం అందించారు. ('మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం') గత మంగళవారం రాత్రి ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య.అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం’’అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది. -
మానవత్వానికి మసక..!
ఈ నెల 22న గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన యువకుడు అకస్మాత్తుగా చనిపోయాడు. అదే సమయంలో అతడి మిత్రుడికి కరోనా అని తేలింది. దీంతో మృతి చెందిన యువకుడికి కరోనా సోకి ఉంటుందనే భయంతో కుటుంబ సభ్యులూ అతని అంత్యక్రియలకు వెనకడుగు వేశారు. పాడే మోసే వాళ్లూ కరువవ్వడంతో స్థానిక సర్పంచ్ చొరవతో మృతదేహాన్ని జేసీబీలో వేసుకుని శ్మశానవాటికకు తరలించారు. సాక్షి, మహబూబ్‌నగర్: ‘‘మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు..’’ అన్నాడో సినీ కవి. ఉమ్మడి పాలమూరులో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనబడుతోంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా మానవత్వాన్ని మంటగలుపుతోంది. పాడే మోసే వాళ్లను అటుంచితే కరోనాతో.. ఆ లక్షణాలతో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులే ముందుకు రావడం లేదు. కనీసం వారిని కడసారి చూసేందుకూ బంధువులు ఇష్టపడడం లేదు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో అందరూ ఉన్నా అనాథగా మారిన నారాయణపేటకు చెందిన ఓ శవాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ సూచనలతో వైద్య సిబ్బందే ఇటీవల ఖననం చేశారు. కాగా జిల్లాకేంద్రానికి చెందిన రెండు, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు చెందిన మరో మృతదేహాలు మూడ్రోజుల పాటు మార్చురీలోనే ఉండిపోయాయి. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు రంగంలో దిగిన వైద్యులు, పోలీసుల సహకారంతో మృతుల కుటుంబీకులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి, వారికి అప్పగించారు. ఇలాంటి సంఘటనలు జిల్లాస్పత్రిలో నిత్యాకృత్యమయ్యాయి. కరోనా రోగులకు చికిత్స చేయడం ఓ ఎత్తైతే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించడం సర్కారు ఆస్పత్రి వైద్యులకు సవాలుగా మారుతోంది. కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి మృతదేహాన్ని అప్పగిస్తున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది యంత్రాలే సాధనాలుగా.. బతుకున్నంత కాలం దూరంగా ఉన్నా.. కనీసం చావైనా దగ్గరికి చేరుస్తుందనేది నానుడి. కానీ కరోనా రక్కసి, చావు తర్వాత కూడా మనిíÙని మనిషికి దగ్గరికి చేర్చడం లేదు. కరోనా లక్షణాలతో చనిపోయినా మృతదేహాలను ముట్టుకునేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడడం లేదు. మృతదేహాన్ని కాటికి తీసుకెళ్లేందుకు ఆ నలుగురూ కరువౌతున్నారు. దీంతో జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, అంబులెన్సులే అంత్యక్రియల సాధనాలుగా మారుతున్నాయి. స్థానికులు సైతం మృతదేహాలను తమ ప్రాంతాలకు తీసుకురావద్దని, అంత్యక్రియలు వేరే ప్రాంతాల్లో చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. దీంతో కరోనా మృతులకు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక అద్దె ఇళ్లలో ఉంటోన్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యజమానులు చెప్పినట్టుగా నడుచుకోకపోతే ఇల్లు ఖాళీ చేయమనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కనీసం బంధువులను ఇంటికి రానీయడమే కాదు, బంధువుల ఇళ్లకూ వెళ్లొద్దనే ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా మృతుల అంత్యక్రియల్లో జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులే పరిమితికి లోబడి పీపీ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయవచ్చంటున్నారు. ఎన్–95 మాస్క్ చేతి గ్లౌజులు, ఫేస్‌షీల్డ్ ధరించాలని సూచిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొంత దూరం వచ్చి వాడిన మాస్క్, గ్లౌజులు, ఫేస్‌ఫీల్డ్ దహనం చేయాలంటున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత రెండు సార్లు తలస్నానం చేయాలంటున్నారు. ఇదే క్రమంలో వైద్యసిబ్బంది సైతం అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలో సోడియం పిచికారీ చేస్తారు. కాగా కరోనాతో చనిపోయిన వారి దేహంపై ఆ వైరస్ అత్యధికంగా పది గంటల పాటు బతికి ఉంటుందని ఆ తర్వాత చచ్చిపోతుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు. జూలై 7 నారాయణపేటకు చెందిన ఓ మహిళతో పాటు అతడి కుమారుడు కరోనా లక్షణాలతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చేరారు. వైద్య నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళా చికిత్స పొందుతూ ఈ నెల 16న చనిపోయింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాలని నారాయణపేట వైద్యుల ద్వారా మృతురాలి బంధువులకు సమాచారమిచ్చారు. వారు ఆ మృతదేహానికి మాకెలాంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో ఆస్పత్రి సిబ్బందే మృతురాలి కుమారుడితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు మహిళను చూసి నారాయణపేటలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని ఆస్పత్రిలో చేరే ముందే ఇళ్లు ఖాళీ చేయించినట్లు తెలిసింది. ఇటీవల కరోనాతో మృతి చెందిన జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. జూలై 11 దేవరకద్ర మండలం ఇసరంపల్లికి చెందిన మహిళ కరోనాతో గాంధీలో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని గ్రామంలో తీసుకురావద్దని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి చాంద్రాయణగుట్టలో అంత్యక్రియలు నిర్వహించారు. జూలై 18 మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ వృద్దుడు కరోనాతో మృతి చెందాడు. అతని బంధువులు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకురావడాన్ని చూసిన అక్కడి స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసుల చొరవతో అంత్యక్రియలు జరిగాయి. జూలై 25 గద్వాలకి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్లో ఉన్న సదరు వ్యక్తి అదే రోజు రాత్రి చనిపోయాడు. రెండు రోజుల ముందే అతడి కుమారుడికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులెవరూ ముందుకురాలేదు. చివరకు రంగంలో దిగిన వైద్యసిబ్బంది మృతుడి కుమారులు ఇద్దరికి పీపీకిట్లు ఇచ్చి వారి ద్వారా అంత్యక్రియలు చేయించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ట్రాలీ ఆటోకు రూ.10వేలు ఇచ్చారు. -
ఖననం.. మానవత్వం హననం
సాక్షి, బళ్లారి: కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండగా మరింత క్షోభించేలా అధికార సిబ్బంది వ్యవహరించారు. కరోనా బాధితుల మృతదేహాలను పెద్ద గొయ్యి తీసి అందులో విసిరివేయడం అందరినీ నివ్వెరపరచింది. బళ్లారిలో సోమవారం జరిగిన ఘటన వీడియోలు మంగళవారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారిలోని విమ్స్ కోవిడ్ విభాగంలో కోవిడ్‌కు చికిత్స పొందుతూ బళ్లారికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, సిరుగుప్పకు చెందిన 31 ఏళ్ల యువకుడు, కొప్పళ జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన ఇద్దరు (41, 52ఏళ్లు) వ్యక్తులు, చిత్రదుర్గంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, శ్రీరంగాపురం క్యాంప్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తి, హŸసపేటకు చెందిన ఇద్దరు కన్నుమూశారు. తొమ్మిది మంది మరణాలతో ఆస్పత్రి ప్రాంగణంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కరోనా మృతుల అంత్యక్రియలను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉన్నందున అంబులెన్సుల్లో నల్లరంగు బ్యాగ్‌లలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. విడిగా సమాధి చేయకుండా పొక్లెయినర్‌తో పెద్ద గొయ్యిని తీసి అన్నిటినీ గొయ్యిలో విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను సస్పెండ్ చేసినట్లు మంత్రి శ్రీరాములు చెప్పారు. -
సర్కారు దవాఖానాల్లో దారుణం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగులతో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోవిడ్–19 ప్రత్యేక లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్(ఎల్ఎన్జేపీ)ఆసుపత్రిలో మృతదేహాలున్న బెడ్స్ పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న భయంకర దృశ్యాలున్న వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీంతో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల్లో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దవాఖానాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అలాగే, దీనిపై స్పందించాల్సిందిగా కేంద్రానికి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స ఇతర సౌకర్యాల వివరాలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను కోర్టుకు అందజేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందని, ఈ విషయంలో కేంద్రం జారీ చేసిన నిబంధనలను పాటించడం లేదని మండిపడింది. మృతదేహాలకు ఆసుపత్రులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంది. ఢిల్లీలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులపై 17లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి డైరెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి సంబంధించిన వీడియోలను మీడియాలో చూసిన తరువాత ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్నామని పేర్కొంది. ‘పేషెంట్లకు చికిత్స చేస్తున్న వార్డులోనే మృతదేహాలను ఉంచారు. లాబీలో, వెయిటింగ్ ఏరియాల్లోనూ మృతదేహాలను ఉంచారు. పేషెంట్లకు ఆక్సిజన్ కానీ, మరే ఇతర వైద్య సదుపాయాలు కానీ కల్పించలేదు. రోగులు ఏడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఢిల్లీలోని 2 వేల పడకలున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో పరిస్థితి ‘అత్యంత భయంకరంగా, దారుణంగా, దయనీయంగా’ ఉందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ యాప్‌లోని సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్స్ 5,814 ఉండగా, అందులో 2,620 మాత్రమే ఆక్యుపై అయిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. -
కరోనా మృతదేహాలను పట్టించుకోరా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులు, కరోనా మృతదేహాల పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు అనుసరిస్తున తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పేషెంట్లను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని వ్యాఖ్యానించింది. మృతదేహాలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని పేర్కొంది. కరోనా పేషెంట్లు చనిపోతే కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారమివ్వడం లేదని ఆగ్రహించింది. వైరస్ కారణంగా చనిపోయిన వ్యక్తి మృతదేహం చెత్తకుప్పలో వెలుగు చూసిన ఘటనపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. (‘వారిని చంపింది కరోనా కాదు’) కాగా శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం కోవిడ్ పేషెంట్లపై ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు, అంత్యక్రియ నిర్వహణపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓవైపు కేసులు పెరిగిపోతుంటే ఢిల్లీలో కోవిడ్ పరీక్షలు తగ్గించడమేంటని ప్రశ్నించింది. వీటన్నింటిపైనా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పూర్తి నివేదిక అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా దేశంలో కరోనా మరింత విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్ను దాటి నాలుగో స్థానానికి పాకింది. ప్రస్తుతం దేశంలో 2,97,535 కేసులు నమోదయ్యాయి. (24 గంటల్లో10,956 కేసులు .. 396 మరణాలు) -
మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?
న్యూఢిల్లీ: మొదటిసారిగా కోవిడ్–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్ ఇతరులకు సోకుతుందా? శరీరంలోని ఏఏ అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపుతోంది? అనే విషయాలను ఈ పోస్టుమార్టం ద్వారా పరిశీలించనుంది. ఈ అధ్యయనంలో పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల నిపుణుల సాయం కూడా తీసుకోనున్నట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు. ‘ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే దీనికోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లాక ఏఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. మృత శరీరంలో ఎంత కాలం జీవిస్తుంది? వంటి అంశాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’అని డాక్టర్ గుప్తా చెప్పారు. కోవిడ్ బాధిత మృతదేహాలకు పోస్టుమార్టం చేపట్టినట్లయితే మార్చురీ సిబ్బందికి, పోలీసులకూ సోకడంతోపాటు మార్చురీ పరిసరాల్లోనూ వైరస్ ప్రభావం ఉంటుందని భావించిన ఐసీఎంఆర్.. శవపరీక్ష వద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. -
మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాంతక వైరస్ నేపథ్యంలో మృతదేహాలకు కూడా కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మృతదేహాలకు పరీక్షలు చేయకపోతే త్వరలోనే మూడో స్టేజ్‌కు చేరుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ముందు వాదించారు. (కరోనా ఎఫెక్ట్: పది, ఇంటర్ పరీక్షలు రద్దు) పలు రాష్ట్రాల్లో చనిపోయిన వైద్యులకు పరీక్షలు నిర్వహించిన తరువాతనే వైరస్ బయటపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను అనుసరిస్తోందో తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు దీనిపై పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. (దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా: అంత్యక్రియలపైనా అలజడి
సాక్షి, న్యూఢిల్లీ : చెన్నైకి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సైమన్ హెర్కులస్ కరోనా వైరస్ బారిన పడి ఏప్రిల్ 19వ తేదీన మరణించారు. ఆయన మృతదేహాన్ని కిల్పాక్ ప్రాంతంలోని శ్మశానంలో ఖననం చేసేందుకు మున్సిపల్ అధికారులు అనుమతించారు. అక్కడికి మృతదేహం తీసుకెళ్లాక ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించలేదు. దాంతో అన్నానగర్‌లోని శ్మశానానికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతోపాటు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్, శానిటేషన్ వర్కర్, మున్సిపల్ ఉద్యోగి, ఇతరులు అంబులెన్స్‌ను వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. రాత్రి పొద్దుపోయాక పోలీసుల రక్షణలో మున్సిపల్ అధికారులు మృతదేహాన్ని ఖననం చేశారు. తవ్వేందుకు గునపం లాంటి సాధనాలు లేకపోవడంతో అధికారులు చేతులతో గొయ్యి తవ్వాల్సి వచ్చింది. అంతకుముందు మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 69 ఏళ్ల ప్రముఖ డాక్టర్ జాన్ ఎల్ సైలో మరణించగా, ఆయన మృతదేహాన్ని ఝాలుపరలోని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించకుండా పెద్ద ఎత్తున శ్మశానాన్ని చుట్టుముట్టారు. వారెవరు కరోనా సోకకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా మృతదేహాన్ని ఆ శ్మశానం ఖననం చేస్తే తమకు కరోనా సోకుతుందంటూ గొడవ చేశారు. చివరకు ఈ మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ డాక్టర్ ఫామ్ హౌజ్‌లో ఖననం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అంత్యక్రియలకు కూడా అనుమతించకుండా క్వారెంటైన్లో ఉంచారు. ప్రముఖ డాక్టర్ల విషయంలోనే ఇలా జరిగితే ఇక సామాన్యుల విషయంలో ఇంకెలా జరిగిందో ఊహించవచ్చు. అధికారులు ఎంత నచ్చ చెబుతున్నప్పటికి కరోనా మృతదేహాల విషయంలో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఘర్షణలు చెలరేగుతున్నాయి. (చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు..) మృతదేహాల వల్ల వైరస్ సోకదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా బాధిత మృతదేహాల విషయంలో ‘కడావర్స్ డోంట్ ట్రిన్సిమిట్ డిసీస్’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెప్పింది. అంటే మృతదేహాలు రోగాలను వ్యాప్తి చేయవు అని అర్థం. వైరస్ బారిన పడి మరణించిన వారని ఖననం చేయడం కంటే కాల్చి వేయడమే మంచిదన్నది కూడా కేవలం అపోహ మాత్రమేనని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాల నుంచి కుటుంబ సభ్యులకుగానీ, వైద్య సిబ్బందికిగానీ వైరస్ సోకే ప్రమాదం లేదంటూ భారత్ ప్రభుత్వం కూడా అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేటప్పుడు వైద్య సిబ్బంది, మార్చురి సిబ్బంది చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్‌లు వేసుకోవాలని, మృతదేహాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు అవే జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ నేరుగా మృతదేహాలను ముట్టుకోరాదని సూచించారు. అంత్యక్రియలప్పుడు వాటిని నిర్వహించే పూజారులు, బంధు మిత్రులు మృతదేహానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని, నలుగురైదుగురికి మించి కుటుంబ సభ్యులు హాజరుకారాదని మార్గదర్శకాలు సూచించారు. కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? -
విద్యార్థుల మృతదేహాలను రప్పించండి
సాక్షి, అమరావతి: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌కుమార్ మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఖర్చుకు వెనకాడవద్దని సీఎం స్పష్టం చేశారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. -
కరోనా మృతదేహాల నిర్వహణ ఇలా..!
న్యూఢిల్లీ: కోవిడ్–19తో మరణించిన వారి మృతదేహాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, మృతదేహం వద్ద పనిచేసే వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. వాటిలో ముందు జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ నివారణ, వాతావరణం వైరస్‌తో కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైనవి ఉన్నాయి. ‘దగ్గు, తుమ్ము సమయంలో వెలువడే డ్రాప్లెట్స్ కారణంగానే కరోనా వైరస్ ప్రధానంగా వ్యాపిస్తుంది. మృతదేహం ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయితే, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పోస్ట్‌మార్టం సమయంలో మృతదేహంలోని ఊపిరితిత్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని అందులో వివరించారు. శ్మశానాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్‌లు, గ్లవ్స్‌ను వినియోగించడం వంటి నిర్ధారిత జాగ్రత్తలు తీసుకోవాలని శ్మశానంలోని సిబ్బందికి వివరించాలన్నారు. మృతదేహాన్ని ముట్టుకోకుండా చివరి చూపు చూడొచ్చని, ఇతర మతపరమైన ప్రక్రియలు కూడా నిర్వహించవచ్చని వివరించారు. మృతదేహానికి స్నానం చేయించడం, హత్తుకోవడం, ముట్టుకోవడం మాత్రం చేయవద్దని హెచ్చరించారు. అంత్యక్రియల అనంతరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా శుభ్రంగా స్నానం చేయాలని సూచించారు. అయితే, అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరుకావడం మంచిది కాదని పేర్కొన్నారు. మత సంప్రదాయాల ప్రకారం నదీజలాల్లో కలిపేందుకు మృతదేహానికి సంబంధించిన బూడిదను సేకరించవచ్చని, దాని వల్ల వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. -
కలకలం.. డ్రైనేజీలో మరో రెండు శవాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది కాల్వలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు బయటపడం కలకలం రేపింది. గోకుల్‌పూరిలోని యమున తూర్పు కాల్వ డ్రైనేజీలో ఆదివారం.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు శవాలను ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు ఎవరివి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ శవాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రమాదశాత్తు కాల్వలో పడి మరణించారా..? లేక ఢిల్లీ అల్లర్లలో భాగంగానే వీరు కూడా మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘర్షణలు చోటుచుకున్న ప్రాంతంలోనే ఈ మృతదేహాలు లభ్యం కావడం గమనార్హం. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు ఇంటలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన విషయం విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ అల్లర్లో భాగంగానే వీరిని హత్యచేసి.. కెనాల్లో పడేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు తుది నివేదికను ఇవ్వాల్సి ఉంది. కాగా ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
మృతదేహాల అప్పగింతపై నేడు విచారణ
-
దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి?
సాక్షి, గాంధీఆస్పత్రి: చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, వాటిని ఏం చేయాలో చెప్పాలని కోరుతూ ప్రభుత్వ ప్లీడర్(జీపీ)కి లేఖ రాసేందుకు గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ఎన్కౌంటర్లో మృతిచెందిన మహ్మద్ అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు అదే రోజు ఫోరెన్సిక్ వైద్యులు బృందం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మెడికల్ కాలేజీ లో భద్రపరిచారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యం లో ఈనెల 13 వరకు గాంధీ మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు సూచించింది. చదవండి: దిశ కేసులో ‘ఫైనల్ రిపోర్ట్’ దీంతో నలుగురి మృతదేహాలను 9న గాంధీ మార్చురీకి తీసుకొచ్చి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచారు. ఫ్రీజర్ బాక్సుల్లో పెట్టిన మృతదేహాలు వారం రోజుల తర్వాత క్రమంగా కుళ్లిపోతాయి. ఎంబామింగ్ చేసి ఫార్మల్ డీహైడ్ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే పాడవకుండా ఉంటాయి. దీంతో మృతదేహాలకు ఎంబామింగ్ చేయాలని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ణయించారు. అయితే ఎంబామింగ్ చేస్తే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేందుకు అవకాశం ఉండకపోవడం, మరోపక్క మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభమయ్యే దశకు చేరుకోవడంతో ఫోరెన్సిక్ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. ఇలాంటి కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాలకు ఎంబా మింగ్ చేయాలనే నిబంధన ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం, ఫోరెన్సిక్ వైద్య బృందం సోమవారం దీనిపై చర్చించారు. తర్వాత మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని కోరుతూ జీపీకి లేఖ రాయా లని నిర్ణయించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచమని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. గడువు ముగిసింది కనుక మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని మంగళవారం జీపీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన కె.సజయ, మీరా సంఘమిత్ర, వి.సంధ్యారాణి, ఎం.విమల దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వద్ద పిటిషన్లు ప్రస్తావించాలని ధర్మాసనం ఆదేశించింది. చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి -
దిశ నిందితుల మృతదేహాలను ఇవ్వండి
నారాయణపేట/మక్తల్: ‘అయ్యా. మా బిడ్డలు తప్పు చేసిండ్రు నిజమే.. వారికి తగిన శిక్ష పడింది సరే.. కనీసం మృతదేహాలైనా ఇవ్వండయ్యా.. మా పిల్లలు చనిపోయారని తెలిసినప్పటినుంచి కంటికి కునుకు లేదు.. కడుపుకు తిండిలేదు.. అంటూ దిశ సంఘటన నిందుతులు నవీన్, శివ, చెన్నకేశవులు, ఆరిఫ్ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తంచేశారు. మా పిల్లలు చేసిన తప్పుకు మేము కూడా శాన బాదపడినం.. విచారణ పూర్తిచేసి కోర్టు తీర్పు ఇస్తుందనుకున్నాం.. కానీ ఇట్లా చనిపోతారని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతీయ మానవహక్కుల కమిష న్ ఫిర్యాదుతో మృతదేహాలు ఇంటికి రాకపోవడం, మళ్లీ హైకోర్టు మృతదేహాలను భద్రపరచాలని చెప్పడంతో అంత్యక్రియలకు ఇంకా సమయం పడుతుందని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో.. దిశ హత్య కేసులో చటాన్‌పల్లి వద్ద ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు కోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన నిందితుల కుటుంబీకులకు మళ్లీ ఎదురుచూపులు తప్పలేదు. బందోబస్తు కొనసాగింపు దిశ హత్యకేసులో నిందితులైన నవీన్, చెన్నకేశవులు, శివ గ్రామామైన గుడిగండ్ల, ఏ–1 నిందితుడు జక్లేర్ గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిందితుల కుటుంబాలపై నిఘా పెట్టారు. ఆయా గ్రామాలు నాలుగు రోజుల పాటు నిర్మానుష్యంగా మారాయి. జరిగిన సంఘటనపై ఒక వైపు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను చూసి జనమంతా విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకెన్ని రోజులు? తప్పుచేసిన వారిని శిక్షించమని మేమే చెప్పాం. కోర్టులో కేసు నడుస్తుంది. 14 రోజుల టైం పడుతుందని చెప్పిండ్రు. కానీ వారం రోజులకే చనిపోయేలా చేసిండ్రు. తల్లితండ్రీ లేని నా కోడలు ఇప్పుడు గర్భవతి. దానికి ఏదైనా ఆసరా చూపి న్యాయం చేయండి సారూ. – కుర్మన్న, చెన్నకేశవులు తండ్రి న్యాయం జరుగుతుందనుకుంటున్నా ఎన్కౌంటర్లో మృతిచెందిన మా పిల్లలపై విచారణ చేపట్టిన ఢిల్లీ సారోళ్లతో మాకు న్యాయం జరుగుతుందనుకుంటున్నా. తప్పుచేసిన మా పిల్లలను శిక్షించమని చెప్పాం. కాని ఇలా సంపుతారని అనుకోలేదు. జర తొందరగా మృతదేహాలు ఇస్తే చివరి కార్యం చేసుకుంటాం. – హుసేన్, ఆరిఫ్ తండ్రి అన్యాయం చేసిండ్రు.. పిల్లలు చేసిన తప్పుకు చట్టప్రకారం శిక్ష పడుతుందనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన సారోళ్లు, హైకోర్టు తీర్పుతోనైనా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. – రాజప్ప, శివ తండ్రి -
హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు
-
దిశ : గాంధీకి చేరుకున్న నిందితుల మృతదేహాలు
సాక్షి, హైదరాబాద్ : చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు -
మెడికల్ కాలేజీకి మృతదేహాల తరలింపు
సాక్షి, మహబూబ్‌నగర్ : ‘దిశ’కేసులో ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు నిందితుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల పహారా మధ్య శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు, అధికారుల రాకపోకల కారణంగా జిల్లా ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగడంతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే మృతదేహాలను మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర శివారులో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. సోమవారం వరకు మృతదేహాలను అక్కడే భద్రపరచనున్నారని సమాచారం. -
ఆలస్యంగా వస్తామంటూ..
సాక్షి, పీలేరు: మండలంలోని నెట్టిబండ సమీపంలో సోమవారం ఇద్దరు యువకులు రైలు పట్టాల వద్ద గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలై వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. స్థానిక కావలిపల్లెకు చెందిన సాయి (19), యర్రావారిపాళెం మండలం, ఓఎస్ గొల్లపల్లెకు చెందిన బి. శివకుమార్ (26) ఇరువురూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విదితమే. చిత్తూరు మార్గంలోని రైల్వే గేటు నుంచి తిరుపతి రైల్వే మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు ఉన్నట్లు సోమవారం తెల్లవారుజామున 5–6 గంటలకు గుర్తించారు. మృతదేహాల వద్ద లభించిన ఏటీఎం కార్డు ఆధారంగా మృతులను పోలీసులు గుర్తించి సమాచారం చేరవేయడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కుమారులు ఆత్మహత్య చేసుకోడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై పడేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయంగా శివకుమార్ తండ్రి వెంకట్రమణ, సాయి తండ్రి రాజన్న మంగళవారం పీలేరులో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వస్తామంటూ.. శివకుమార్, సాయి ఇరువురూ ఆదివారం రాత్రి తమ తల్లిదండ్రులతో మాట్లాడారు. పీలేరులో ఉన్నామని, ఆలస్యంగా ఇంటికి వస్తామని చెప్పారని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఆది వారం రాత్రి పొద్దుపోయినా సాయి ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటలకు అతడి తండ్రి సాయికి ఫోన్ చేశారు. తాను క్రాస్ రోడ్డులో ఉన్నానని, ఇంటికి వస్తానని సాయి చెప్పడంతో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండిపోయారు. అయితే సాయి, శివకుమార్ మృతదేహాలు రైలు పట్టాలపై పడి ఉన్నాయని తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సెల్ఫోన్లు ఏమయ్యాయి..? సాయి, శివకుమార్ వద్ద ఎప్పుడూ సెల్ఫోన్లు ఉంటాయని, ప్రమాదం జరిగిన తరువాత అవి ఏమయ్యాయో తెలియడం లేదని మృతుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తమ కుమారుల మృతిపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. మృతదేహాలకు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు
రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం క్రైం: తమ వారి మృతదేహాల కోసం 38 రోజులపాటు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కడచూపు దక్కకపోయినా.. ఇన్నాళ్లకు తమ వారి మృతదేహపు ఆనవాళ్లయినా దొరికాయని కొందరు.. తమ వారి ఆచూకీ నేటికీ దొరక్క మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గతనెల 15న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాద ఘటనలో.. బోటు వెలికితీత చివరి రోజైన మంగళవారం బోటులోనే 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో బుధవారం ఉదయం వారంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. తల ఉంటే మొండెం లేకపోవడం, మొండెం ఉంటే తల లేకపోవడంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. లభ్యమైన ఏడు మృతదేహాలలో ఐదింటిని కాకినాడకు చెందిన సంగాడి నూకరాజు (55), మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ (62), నల్గొండ జిల్లా హలియా గ్రామానికి చెందిన సురభి రవీంద్ర (25), వరంగల్ జిల్లా కడిపి కొండ గ్రామానికి చెందిన కొమ్ముల రవి (40), బస్కే ధర్మరాజు (48) మృతదేహాలుగా గుర్తించారు. ఆరో మృతదేహం తల, మొండెం లేకుండా కింది భాగం మాత్రమే ఉండగా.. అది మంచిర్యాలకు చెందిన కారకూరి రమ్యశ్రీ (24)దని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అతి పాత పట్టిసీమకు చెందిన బోటు సహాయకుడు కర్రి మణికంఠదని అతని తండ్రి నరసింహారావు చెప్పారు. ఎటూ తేల్చకోలేని అధికారులు దాని శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. దుస్తులు, తాయెత్తు ఆధారంగా.. కాకినాడకు చెందిన బోటు సరంగు (డ్రైవర్) సంగాడి నూకరాజు మృతదేహాన్ని ఆయన వేసుకున్న టీషర్ట్ ఆధారంగా అతని కుమారుడు ధర్మారావు గుర్తించారు. వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కే ధర్మరాజును అతను వేసుకున్న బ్లూషర్ట్, బ్లాక్ ప్యాంట్ ఆధారంగా అతని బంధువులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కొమ్ముల రవి మృతదేహాన్ని జేబులో ఉన్న ఆధార్ కార్డు, పర్సు ఆధారంగా, కాకినాడకు చెందిన బోటు అసిస్టెంట్ డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ మృతదేహాన్ని మెడలో తాయత్తు, వేసుకున్న టీషర్ట్ ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నల్గొండ జిల్లా హాలియాసాగర్‌కు చెందిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ సురభి రవీంద్ర మృతదేహాన్ని అతడు ధరించిన రెడీమేడ్ షర్ట్ ఆధారంగా అతని సోదరుడు మహేష్ గుర్తించాడు. ఆ పుర్రె ఎవరిదో.. ఏడో మృతదేహానికి సంబంధించి తల (పుర్రె) మాత్రమే ఉండటంతో అది మహిళదా, పురుషునిదా అనే విషయం తేలలేదు. దానిని ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించి డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి ఉందని వైద్యాధికారి సీహెచ్ రమేష్‌కిశోర్ తెలిపారు. ఈ బాలుడెవరో.. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట లభించిన బాలుడి మృతదేహాన్ని విశాఖపట్నానికి చెందిన మధుపాడ అఖిలేష్ (5) లేదా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6)దిగా భావిస్తున్నారు. అఖిలేష్ మేనమామ ఆ మృతదేహం తమ వాడిది కాదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు. మొత్తంగా మూడు మృతదేహాల శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. -
ట్రక్కులో 39 మృతదేహాలు
లండన్: లండన్ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్‌గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్‌లోని హోలీహెడ్ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్య్రూ మారినర్ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్ వెనుకభాగంలో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు. -
ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు
సాక్షి, రాజమహేంద్రవరం : బోటు ప్రమాదం జరిగి 41వ రోజు మంగళవారం మరో ఏడు మృతదేహాలను గోదావరి నది నుంచి బయటకు తీశారు. కచ్చులూరు సంఘటన స్థలం నుంచి ఈ మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 8.45 గంటల సమయంలో రెండు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో వాటిని మార్చరీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాత మృతదేహాలను వారికి అప్పగిస్తారు. మృతదేహాలు బోటులోని ఒక రూమ్‌లో ఉండిపోవడంతో కుళ్లిపోయాయి. బోటు అడుగు భాగాల్లో గాలింపు రంపచోడవరం: కచ్చులూరు మందం వద్ద బోటును వెలికితీసిన తరువాత ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ బృందాలు బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంకా లభించాల్సిన మృతదేహాలు కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారని తెలిపారు. -
బోటును వెలికితీయడంతో బయటపడ్డ మృతదేహాలు
-
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
-
తెల్ల జెండాలతో వచ్చి.. శవాలను తీసుకెళ్లారు
శ్రీనగర్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాక్‌కు కొత్తేమి కాదు. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత పాక్ మరింత చెలరేగిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చాలా సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అందుకు తగ్గట్టుగానే భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికి తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. వీరి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ సైన్యం ప్రయత్నించినప్పటికి కుదరలేదు. దాంతో చేసేదేంలేక ఈ నెల 13న కాల్పులకు స్వస్థి పలికి.. తెల్ల జెండాలు చూపుతూ వచ్చి తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. తెల్ల జెండాలతో రావడంతో మృతదేహాలను తీసుకెళ్లడానికి భారత సైన్యం అంగీకరించింది. -
వాంటెడ్.. శవాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం అవుతున్నాయి మహాప్రభో.. మాకు శవాలు కావాలి, ఇస్తారా..’అంటూ బీబీనగర్ ఎయిమ్స్ రాష్ట్ర సర్కారుకు మొరపెట్టుకుంది. అయితే, గాంధీ ఆసుపత్రి నుంచి శవాలను పంపిస్తామని వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) హామీ ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ నుంచి బీబీనగర్‌లోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థులకు అనాటమీ డిసెక్షన్ కోసం శవాలు అవసరం. అయితే, గాంధీ ఆసుపత్రివారు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు శవాలను విక్రయిస్తారు. ఒక్కో శవం ఖరీదు దాదాపు రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుంది. అయితే, ఎయిమ్స్‌కు శవాలను ఉచితంగా ఇస్తారా లేదా విక్రయిస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు. చాలా సందర్భాల్లో శవాల కొరత ఉంటుంది. సందడి లేని ఎయిమ్స్... ప్రభుత్వం ఎంతో కృషి చేసి రాష్ట్రానికి ఎయిమ్స్ సాధించింది. అందుకోసం బీబీనగర్‌లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచి్చంది. అక్కడ నిమ్స్ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. ఎయిమ్స్ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ఎంతో కృషిచేశారు. అటువంటి ఎయిమ్స్ తరగతులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం అవుతున్నా ఎటువంటి సందడి లేకపోవడం గమనార్హం. ఎయిమ్స్ కేంద్ర పరిధిలో ఉండటంతో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఎయిమ్స్ ప్రారంభమంటే ప్రధానమంత్రి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటారని, కానీ బీబీనగర్ ఎయిమ్స్‌కు అలా చేసే అవకాశాలు లేవని అంటున్నాయి. ముఖ్యమంత్రితోనైనా ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు చేస్తే బాగుండేదన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది. పలు సందర్భాల్లో డీఎంఈతో చర్చలు జరిపిన ఎయిమ్స్ వర్గాలు ఇప్పుడు ఒక్క ముక్క కూడా ఏమీ చెప్పడంలేదంటున్నారు. అక్టోబర్ తర్వాతే ఓపీ సేవలు... ఎంబీబీఎస్ తరగతులతోపాటే ఓపీ సేవలు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. ఇప్పటికే నిమ్స్ అక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తోంది. ఓపీ సేవల ప్రారంభానికి అనువైన వాతావరణం అక్కడుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఎయిమ్స్ వర్గాలు మాత్రం అక్టోబర్ తర్వాత ఓపీ సేవలు మొదలు పెడతామని చెబుతున్నట్లు సమాచారం. అప్పటిదాకా నిమ్స్ సేవలు కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. -
మార్చురీలో శవాలకు ప్రాణం పోసే యత్నం!
ముంబై : జలగాన్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చనిపోయిన ఇద్దరు యువకులను బ్రతికించటానికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యువకుల శవాలను పూర్తిగా ఉప్పులో దాచిపెట్టి ఉంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు జలగాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు లేఖ రాశారు. దీనిపై ఎమ్ఐడీసీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రంజిత్ శిర్సత్ మాట్లాడుతూ.. ‘‘ పూర్తి వివరాలు తెలిసే వరకు ఏ విషయాన్ని ధ్రువీకరంచలేము. ఇప్పటికే మేము ఆసుపత్రి డీన్‌కు లేఖ రాశాము. మాస్టర్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం నీటిలో మునిగి చనిపోయారు. అదే రోజు వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం జలగాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఆ రోజు రాత్రి మార్చురీలో ఏం జరిగిందో మాకు తెలియద’’ని ఆయన అన్నారు. అయితే ఆ ఇద్దరు యువకుల మృతదేహాలకు శనివారం ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావటం గమనార్హం. -
స్వగ్రామం చేరిన మృతదేహాలు
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): గుంటూరు సమీపంలోని చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు, అతని భార్య సూర్య భవాని, కుమార్తె సోనాక్షి, కుమారుడు గీతేశ్వర్, బావమరిది కటికిరెడ్డి అనోద్కుమార్ల మృతదేహాలు అంబులెన్స్‌లో సోమవారం రాత్రి 11 గంటలకు స్వగ్రామం చేరుకున్నాయి. పాలకొల్లు మండలం సబ్బేవారిపేటలో ఇంటి వద్ద ఉదయం నుంచి మృతదేహాల కోసం ఎదురు చూసిన బంధువులు, మిత్రులు, స్థానికులకు మృతుల ముఖాలు చూపించకుండానే అంబులెన్సులు యడ్లబజారులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. అనోద్‌కుమార్ తండ్రి శ్రీనివాసరావు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. డాడీ.. అమ్మా భవాని.. ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లేవాడివి.. డాడీ ఇప్పుడే వస్తాననేవాడివి అంటూ అనోద్‌కుమార్ తండ్రి శ్రీనివాసరావు కుమారుడిని తలచుకుని కన్నీళ్లు పెట్టారు. అమ్మా భవాని... అమ్మా భవానీ అంటూ కుమార్తెను, మనవరాళ్లని అమ్మా సోనా అంటూ తలచుకుని ఏడుస్తుంటే చూసేవారి హృదయాలు ద్రవించాయి. విధి చిన్నచూపు.. స్వయంకృషితో ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.. మూడు పదుల వయసు దాటక ముందే మృత్యుఒడికి చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు (వెంకట్) (30), భార్య సూర్యభవాని (28), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5)తో పాటు సూర్యభవాని తమ్ముడు కటికిరెడ్డి అనోద్‌కుమార్ మృతిచెందారన్న వార్తతో స్థానిక సబ్బేవారిపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంధు,మిత్రుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మిత్రులంతా వెంకట్ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేశ్వరరావు, మణికంఠ ఇరువురు అన్నదమ్ములు. తండ్రి పట్టాభిరామయ్య పండ్ల వ్యాపారం చేసేవారు. తల్లి జానమ్మ, తల్లిదండ్రులు ఇద్దరూ సుమారు 15 ఏళ్ల క్రితం కాలం చేశారు. వెంకటేశ్వరరావు, మణికంఠలు అప్పటికి మైనర్లు. ఏ పనీ చేతకాని వయసు వారిది. తండ్రి నిర్వహించిన పండ్ల వ్యాపారాన్ని మేనమామల సూచనలు, సలహాలతో అన్నదమ్ములిద్దరు కొంతకాలం చేశారు. ఫొటోగ్రఫీ నేర్చుకుని పదేళ్ల క్రితం పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్‌కు ఎదురుగా లక్ష్మీ శ్రీపట్టాభి పేరుతో ఫొటోగ్రఫీ, డిజిటల్ వర్క్స్‌ను ప్రారంభించారు. తండ్రి హయాంలో నిర్మించిన ఇంటిని చక్కగా రీమోడలింగ్ చేసుకున్నారు. స్డుడియో వర్కు మీద దూర ప్రాంతాలకు వెళ్లడానికి మారుతీ వ్యాన్ కూడా కొనుగోలు చేసుకున్నారు. వారం రోజుల క్రితమే కృష్ణాజీ మల్టీఫ్లెక్స్ సమీపంలో శ్రీ గాయత్రి రెస్టారెంట్‌ను లాంచనంగా ప్రారంభించారు. వీరి ఎదుగుదలను విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను కబళించింది. ప్రమాద సమయంలో తమ్ముడు మణికంఠ వాహనం నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఎప్పుడూ వారు వారి మారుతీవ్యాన్‌లో వెళ్లేవారు. అయితే దైవదర్శనం కోసం ఎక్కువమంది ప్రయాణించాల్సి ఉందని వెంకటేశ్వరరావు మిత్రుడికి చెందిన వాహనంలో వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. దేవుడు అన్యాయం చేశాడు నేను పండ్ల వ్యాపారం చేస్తా. నాకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. వెంకట్ నా మేనమామ కొడుకు. చిన్నప్పట్నుంచి కష్టజీవి. స్వయంకృషితో పైకి వచ్చాడు. ఇలా కుటుంబం అంతా మరణిస్తారని ఊహించలేదు. సొంతంగా ఫొటోగ్రఫీ వర్క్ చేసుకుంటూ బీజీ అయ్యాడు. ఈ మధ్యనే హోటల్ పెట్టాలని లాంచనంగా జూన్ 26న ముహూర్తం చేశాడు. – పవన్, మృతుడు వెంకట్ బంధువు చాలా మంచి కుటుంబం చాలా మంచి కుటుంబం అందరితోనూ కలిసిమెలసి ఉండేవారు. ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఎవరితోనూ విభేదాలు లేవు. వారి పిల్లల ఆటపాటలు, మాటలే గుర్తుకు వస్తున్నాయి. వీరంతా స్వామి దర్శనానికి వెళ్లి ప్రమాదానికి గురవ్వడం నమ్మలేకపోతున్నాం. రెండు రోజుల ముందు మా కళ్లెదురుగానే ఉన్న ఆ కుటుంబం ఇలా ప్రమాదానికి గురవ్వడం చాలా బాధగా ఉంది. ఒకే కుటుంబంలో అందరూ మృతి చెందడం కాలనీ వాసులను కలచి వేసింది. - రాజన్ పండిట్, స్థానికుడు, సబ్బేవారిపేట తీరని వేదన మృతుడు మా మేనమామగారి అబ్బాయి. సుమారు 12 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి అన్నదమ్ములు ఇద్దరూ మేనమామ సంరక్షణలోనే ఉన్నారు. ఆయన కూతురినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కుటుంబం అంతా మరణించడం బాధాకరం. ఈ ఘటన మాకు తీరని వేదనను మిగిల్చింది. – కుంపట్ల నాగ శ్రీనివాసు, మృతుని తండ్రి మేనల్లుడు -
ప్రాణం తీసిన దాగుడు మూతలు!
రాజవొమ్మంగి, (రంపచోడవరం): తప్పిపోయారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటారనుకున్న ఆ పిల్లలు ఓ చెక్కపెట్టెలో విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లడిల్లిపోయిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెంలో ఈ హృదయ విదారక ఘటన శనివారం వెలుగు చూసింది. గత నెల 25వ తేదీన చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత కుమార్ (11)కు అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన చీడెం కార్తీక్ (9)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా కలసి తిరిగారు. బయటకు వెళ్లినవారు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామంలో కొంత మంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా బంతి తరగతి గదిలోకి వెళ్లడంతో అటుగా వెళ్లిన పిల్లలకు పెట్టెలోంచి దుర్వాసనతో కూడిన నీరు కారడం గమనించి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. వారు అక్కడికి వచ్చి పెట్టె తెరచి చూడటంతో విగత జీవులుగా మారిన పిల్లలు కనిపించారు. శరీరాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న కార్తీక్ తల్లిదండ్రులు భవాని, కన్నయ్య.. ప్రశాంత కుమార్ అమ్మమ్మ లక్ష్మి, తండ్రి నూకరాజు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డతీగల మండలం మట్లపాడు గ్రామానికి చెందిన బేలెం ప్రశాంత్ కుమార్‌కు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో చిన్నయ్యపాలెంలోని అమ్మమ్మ పెంచుకుంటోంది. జడ్డంగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు కార్తీక్ స్వగ్రామం రాజవొమ్మంగి మండలంలోని నెల్లిమెట్ల. చిన్నయ్యపాలెంలో గంగాలమ్మ పండుగకు బంధువుల ఇంటికి వచ్చాడు. మృతులిద్దరూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన వారే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు స్నేహితులైన వీరిద్దరూ దాగుడుమూతల ఆటలాడుకుంటూ చెక్కపెట్టెలో దాక్కోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని, ఆ చెక్కపెట్టె పైన ఉండే బరువైన మూత, గొళ్లెం కూడా దానికదే పడిపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక సీఐ బి.రాజారావు, తహసీల్దార్ కె. శ్రీనివాస్, రాజవొమ్మంగి ఎస్సై వినోద్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఎవరెస్ట్‌పై బయటపడుతున్న మృతదేహాలు
టిబెట్: ఎవరెస్ట్ పర్వతం గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఏటా ఎంతో మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. గెలుపునే ఈ ప్రపంచం గుర్తిస్తుందన్నట్లు... మంచు పొరల్లో చిక్కుకుపోయిన వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే తాజాగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతుండటంతో, ఇన్నాళ్లూ మంచు కిందే ఉండి పోయిన మృతదేహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పర్వతంపై చైనా వైపున్న (ఉత్తర) ప్రాంతంలో కనిపించిన మృతదేహాలను చైనా యంత్రాంగం తొలగిస్తోంది. ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టింది. ‘భూగోళం వేడెక్కుతుండటం(గ్లోబల్ వార్మింగ్) వల్ల ఎవరెస్టుపై ఉన్న హిమనీనదాలు, మంచు ఫలకాలు వేగంగా కరగిపోతున్నాయి. ఇంతకాలం మంచు కింద ఉండిపోయిన మృతదేహాలు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయ’ని నేపాల్ పర్వతారోహణ సంఘం(ఎన్ఎంఏ) మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ షెర్పా చెబుతున్నారు. ఎవరెస్ట్‌పై సుమారు 200 మృతదేహాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మూసీ ఒడ్డున ఇద్దరి మహిళా మృతదేహాలు లభ్యం
-
స్వగ్రామానికి చేరిన చిన్నారుల మృతదేహాలు
చందంపేట/హైదరాబాద్: అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నారుల మృతదేహాలు శుక్రవారం వారి స్వగ్రామానికి చేరుకున్నాయి. జిల్లాలోని నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన పాస్టర్ శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల పిల్లలు సాత్విక (18) సుహాస్‌నాయక్ (16) జైసుచిత (14) గత డిసెంబర్ 24న అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం కొలిరివిల్లే ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ముగ్గురు పిల్లల మృతదేహాలను స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను మూడు ప్రత్యేక అంబులెన్స్‌లలో స్వగ్రామమైన గుర్రపుతండాకు తరలించారు. పాస్టర్ శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల స్నేహితులు, వివిధ చర్చిల పాస్టర్లు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చర్చిలో ప్రార్థనలు శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చిన పిల్లల మృతదేహాలను తొలుత హైదరాబాద్ నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చికి తరలించారు. నాలుగు గంటలపాటు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తల్లిదండ్రులు, బంధుమిత్రుల కన్నీటి నివాళి అనంతరం మృతదేహాలను స్వస్థలమైన నల్లగొండ జిల్లా గుర్రపుతండాకు అంబులెన్స్‌లలో తరలించారు. చలిమంటలతో ప్రమాదం.. స్కాలర్షిప్ కింద ఉచితంగా చదివిస్తామంటూ అమెరికాలోని ‘బైబిల్ మిషనరీ’సంస్థ ముందుకు రావడంతో శ్రీనివాస్‌నాయక్ తమ ముగ్గురు పిల్లల్ని అమెరికాలోని ‘ఫ్రెంచ్ కామ్’నగరానికి పంపారు. క్రిస్మస్ ముందురోజు ప్రీ క్రిస్మస్ వేడుకలను స్నేహితుల ఇంట ఘనంగా జరుపుకున్నారు. తీవ్రమైన చలికారణంగా డిసెంబర్ 24న రాత్రి కట్టెలతో చలిమంట వేసుకున్నారు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న సమయంలో మంటలు పెద్దవై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎంబామింగ్ ఆలస్యం కావడం వల్లే.. ‘విషయం తెలుసుకున్న మరుసటి రోజు మేం అక్కడకు చేరుకున్నాం. మృతదేహాలను ఇండియాకు తీసుకురావడం కష్టమని, ఈ నెల 12న అక్కడే అంత్యక్రియలు చేయాలని నిశ్చయించుకున్నాం. అదే సమయంలో ‘కొలియర్ విల్ బైబిల్ మిషన్’వాళ్లు మృతదేహాలకు ఎంబామింగ్ చేసి ఇక్కడకు వచ్చేలా సహకరించారు. మొత్తం రూ.30 లక్షల వరకు ఖర్చు అయింది. దీనికి మా బంధువులు, శ్రేయోభిలాషులు సహకరించారు. ఎంబామింగ్ త్వరగా అయిఉంటే పదిరోజుల ముందే పిల్లల మృతదేహాలను ఇక్కడకు తీసుకువచ్చేవాళ్లం’అని పిల్లల తల్లిదండ్రులు విలపించారు. శనివారం మధ్యాహ్నం గుర్రపుతండాలో అంత్యక్రియలు చేయనున్నట్లు శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కాగా, శ్రీనివాస్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్, ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. -
తండ్రీకొడుకుల మృతదేహాలు వెలికితీత
గుంటూరు, మంగళగిరి: రాజధాని పరిధిలో హత్యకు గురైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మండలంలోని రాజధాని పరిధిలోని కురగల్లు– నీరుకొండ గ్రామాల మధ్య ఈ–14 రోడ్డులో పోలీసులు పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేలవాయికి తరలించారు. మేలవాయికి చెందిన వేముల లక్ష్మయ్య, సురేష్ పొక్లెయిన్ డ్రైవర్ల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం మృతదేహాలను వెలికితీయడానికి సమయం చాలక ఆదివారం ఉదయం ఏఎస్సీ లక్ష్మీనారాయణ, నార్త్‌జోన్ డీఎస్పీ జీ రామకృష్ణ, రూరల్ సీఐ బాలాజి, ఎస్ఐ వీరనాయక్‌లు సిబ్బందితోపాటు గుంటూరు డాక్టర్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒడ్డుకు చేర్చిన మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల అదుపులో నిందితుడు! జంట హత్యలలో ప్రధాన ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తండ్రీకుమారులు వేముల లక్ష్మయ్య, సురేష్‌లు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ నరేష్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో మరెవరైనా ఉన్నారా ?ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ట్రంకురోడ్డుపై మృతదేహాల కలకలం
నెల్లూరు, కావలిఅర్బన్: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ట్రంకురోడ్డు మీద చెక్క రిక్షాలోని రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. కావలి పరసర ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. వీటికి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించా రు. అనాథ శవాలు కావడంతో మున్సిపల్ సిబ్బం ది ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిం చాల్సి ఉంది. శ్మశానికి తరలించడానికి వీటిని ఓ రిక్షా కార్మికుడికి అప్పగించారు. అయితే అతను ట్రంకురోడ్డులో వెళ్తూ మధ్యలో మద్యం షాపు కనిపించడంతో ఆగి ఫూటుగా మద్యం తాగేసి పడిపోయాడు. సుమారు 2 గంటల పాటు ట్రంకురోడ్డు పక్కనే మద్యం మత్తులో నిద్రించాడు. రిక్షాపై మృతదేహాలు ఉండడం, దుర్గంధం వెదజల్లుతుండడంతో అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు, పాదచారులు గుర్తించి భయాందోలళనకు గురయ్యారు. మద్యం మత్తులో నుంచి తేరుకున్న రిక్షా కార్మికుడు మృతదేహాలను శ్మశానవాటికకు తరలించాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటను చోటు చేసుకుందని స్థానికులు మండిపడ్డారు. -
లారీని ఢీకొన్న అంబులెన్స్.. ఇద్దరి మృతి
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇసుకగుంట సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అబ్దుల్‌గౌస్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ దక్షిణ బజారువీధికి చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు అనిల్ బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్బారావుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు. ఇటీవల సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అతన్ని భార్య పద్మావతి బెంగళూరులో ఉన్న కుమారుడి దగ్గరకు తీసుకెళ్లారు. కుమారుడు తన తండ్రిని కొలంబియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో స్వగ్రామానికి తిరిగి పంపించేందుకు బెంగళూరులోని మాండ్యా జిల్లా పాండూపూర్ ప్రాంతానికి చెందిన అంబులెన్స్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సుబ్బారావు(59), పద్మావతి(54), అనిల్(31), అంబులెన్స్ డ్రైవర్ గిరీష్(27), అతని స్నేహితుడు సందేష్(26) గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో ఉన్న వంతెన వద్ద శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని అంబులెన్స్ ఢీకొంది. సుబ్బారావు, అంబులెన్స్ డ్రైవర్ గిరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బారావు భార్య పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు. అనిల్, సందేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
స్మశానంలో మృతదేహాలతో నిరసన
-
బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు
-
క్వారీ ప్రమాద ఘటన కేసు..
-
గల్లంతైన మరో మృతదేహం లభ్యం
-
మిస్టరీ డెత్: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం
-
తాంత్రిక పూజలకు కుటుంబం బలి!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం అనుమానాస్పదరీతిలో చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ విషయమై ఢిల్లీ అదనపు డీసీపీ వినీత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..కుటుంబ సభ్యుల్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, మరో వృద్ధురాలు(75) నేలపై చనిపోయి ఉందని తెలిపారు. అలాగే వీరి నోటికి టేప్ అంటించారన్నారు. పోలీసుల తనిఖీల్లో ఈ ఇంట్లో తాంత్రిక పూజలకు సంబంధించి చేతిరాతతో ఉన్న పేపర్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని తెలుస్తోందన్నారు. ఈ కాగితాల్లో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యుల్ని చేతులకు కట్లు, కళ్లకు గంతలు కట్టారన్నారు. అంతేకాకుండా అరవకుండా నోటికి టేప్‌ను అంటించారన్నారు. కుటుంబసభ్యుల్లో తాంత్రిక శక్తులతో ప్రభావితమైన ఒకరు మిగిలిన 10 మందిని హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని కుమార్ తెలిపారు. తొలుత నిందితుడు అందరికీ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక వారందర్నీ ఉరితీసి ఉంటాడని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని వృద్ధురాలు స్పృహలోకి రావడంతో ఆమెను సదరు వ్యక్తి గొంతుకోసి చంపాడన్నారు. ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. మృతుల్ని నారాయణ్ దేవీ భాటియా(75) ఆమె కుమార్తెలు ప్రతిభ(60), మనవరాలు ప్రియాంక(30)లతో పాటు నారాయణ్ దేవీ పెద్ద కుమారుడు భూపీ భాటియా(46) అతని భార్య సవిత(42), సవిత ముగ్గురు పిల్లలు, చిన్నకుమారుడు లలిత్(42), అతని భార్య టీనా(38)గా గుర్తించామన్నారు. వీరిలో ప్రియాంకకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందనీ, ఈ ఏడాది చివరల్లో వివాహం జరగనుందని వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించామన్నారు. ఈ కుటుంబాన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని కుమార్ పేర్కొన్నారు. రోజూ ఉదయాన్నే షాపును తెరిచే కుటుంబం ఉదయం 7.30 గంటలైనా బయటకు రాకపోవడంతో పొరుగున ఉండే అమ్రిక్ సింగ్ ఇంట్లోకి వెళ్లాడన్నారు. ఘటనాస్థలాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడన్నారు. సంత్‌నగర్‌లో ఉన్న రెండంతస్తుల సొంతింటిలో బాధిత కుటుంబం గత 20 ఏళ్లుగా నివసిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసు విషయమై పోలీసులతో మాట్లాడారు. -
ముప్పై ఏళ్ల విషాదం
1983 జూలై 23న ఓ లారీ.. ఉప్పొంగిన వరద కారణంగా కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల వాగులో గల్లంతయ్యింది. లారీలో ఉన్న 12 మందిలో నలుగురు కష్టంగా ఒడ్డుకు చేరారు. మరో నలుగురి మృతదేహాలు అప్పట్లోనే లభించాయి. మిగిలిన నలుగురు ఏమయ్యారో, ఎక్కడున్నారో ఆచూకీ దొరకలేదు. సుమారు ముప్పై ఏళ్ల కిందటి మాట ఇది! వారం రోజుల కిందట.. ఇసుక తవ్వకాల్లో భాగంగా ఇరుకుల్ల వాగులో ఓ లారీ క్యాబిన్, ఆ క్యాబిన్లో అస్థిపంజరాలు, కపాలాలు బయటపడ్డాయి! ఏళ్ల తరబడి తమ వాళ్ల కోసం ఎదురు చూస్తున్న మృతుల కుటుంబాలు వెంటనే ఇరుకుల్ల వాగుకు చేరుకున్నాయి. అక్కడి అస్థి పంజరాలు, కపాలాలు, లారీ క్యాబిన్లో బయటపడిన ప్లాస్టిక్ బ్యాగులు, పాలిస్టర్ దుస్తుల ఆనవాళ్లను చూసి తమ వాళ్లుగా గుర్తించాయి. ఇరవై తొమ్మిదేళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన తమ వాళ్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన ఆ కుటుంబాలు.. తమ వాళ్లు లేరని తెలిసే లోగా ఆర్థికంగా చితికిపోయాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఆ ఒక్క ప్రమాదం ఆ కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదో అత్యంత విషాద ఘటన. ఇరుకుల్ల వాగులో చేదు జ్ఞాపకం ఆ ఘటన జరిగిన రోజు.. భారీ వర్షం వరదలతో ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై వరద పోవడంతో పెద్దపల్లి నుంచి కేశవపట్నానికి పశువుల లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. ఆ లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రై వర్ అబ్దుల్ ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఆ ఘటన నుంచి మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి.. ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు. గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు, పశువుల వ్యాపారి ముగ్ధుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామిలు ఉన్నారు. ఆ ప్రమాద ఘటన క్రైమ్ నంబర్ 160/89 గా నమోదు అయ్యింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు క్రేన్ సహాయంతో లారీని బయటికి తీసే ప్రయత్నం చేసినా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది. గల్లంతయిన వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబ సభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దాంతో ఆ అవశేషాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వస్తారని ఎదురుచూపులు సంతకు వెళ్లొస్తామని ఇంటి బయటకు వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి చేరాల్సిన వారు తిరిగి ఇంటికి చేరుకోలేదు. తమ వాళ్లు ప్రయాణించిన లారీ ముంచెత్తిన వరదల్లో కొట్టుకు పోయిందన్న వార్త కుటుంబసభ్యుల గుండెలు బరువెక్కేలా చేసినా, బతికే ఉంటారన్న ఆశను కూడ ఎక్కడో మినుకుమినుకుమంటూ ఉంది. ఆ ఆశతోనే వారు ఏళ్ల తరబడి నిరీక్షించారు. ఏడాది... రెండేళ్లు.. ఐదేళ్లు.. పదేళ్లు.. పాతికేళ్లు.. ఇలా ఎన్నేళ్లు చూసినా కాలం మాత్రం జవాబు చెప్పలేదు. చివరకు మూడు దశాబ్దాలు ముగిసిపోయే సమయంలో ఆ నాలుగు కుటుంబాలకు అసలు నిజం తెలిసింది తమ వాళ్లు లేరని! కాల క్రమంలో ఇంటి పెద్దలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. జీవితాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడీ నిజం తెలిశాక బరువెక్కిన గుండెలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డున పడిన ఖాన్ల కుటుంబాలు కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన జహీరాబేగం కుమారులు ముగ్ధుంఖాన్, దౌలత్ ఖాన్లు. దౌలత్ ఖాన్ గల్లంతయిన లారీ ఓనర్. అతని అన్న ముగ్ధుంఖాన్ పశువుల వ్యాపారి. ఇద్దరూ పెద్దపల్లి పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసి లారీలో సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరగా మార్గమధ్యలో జరిగిన ఈ ప్రమాదంలోనే గల్లంతయ్యారు. ముగ్ధుంఖాన్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఘటన తర్వాత కుటుంబ పెద్ద ఆచూకీ లేక అనేక అవస్థలు పడుతున్న వీరికి.. కొడుకు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. బతికున్నప్పుడు పది మందికి ఉపాధి, పట్టెడన్నం పెట్టిన దౌలత్‌ఖాన్ కుటుంబం ఇప్పడు దీనావస్థలో.. నిర్మాణంలో ఉన్న ఇల్లు మధ్యలోనే ఆగిపోయి శిధిలావస్థకు చేరుకుంది. ఉండడానికి ఇల్లు సైతం లేక పక్కింట్లో అద్దెకు ఉంటూ కూలీపనితో పూట గడుపుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు కూతుళ్లకు తల్లి కూలి పని చేసి పెళ్లిళ్లు చేస్తే.. వారిలో ఓ బిడ్డ భర్త సైతం మృతి చెందారు. విధి తమ పాలిట శాపంగా మారందని ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు దుఃఖంతో రోజులు గడుపుతోంది. శంకర్ గల్లంతు.. కుటుంబం ఛిన్నాభిన్నం వరదల్లో కొట్టుకుపోయిన లారీలో గల్లంతైన కరీంనగర్ కు చెందిన మరోవ్యక్తి లింగపల్లి శంకర్. శంకర్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కాగా, శంకర్ ఆచూకీలేక అతని భార్య మనోవేదనతో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి అడ్రస్ లేక, తల్లికానరాని లోకాలకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని బంధువులు చేరదీయడంతో తలోచోట పెరిగి పెద్దవారయ్యారు. పెళ్లిళ్లూ అయ్యాయి. తవ్వకాల్లో లారీ ఆనవాళ్లు బయటపడ్డాయని తెలియడంతో కూతుళ్లు, కొడుకు ఇరుకుల్లకు చేరుకున్నారు. అస్థికలు కనిపించాయి. వెంకటస్వామి ఇంట.. విషాదమే అంతా.. కల్లెపల్లి వెంకటస్వామి ఇంట అంతా విషాదమే. వెంకటస్వామికి భార్య ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు. ఇద్దరు కొడుకులు తండ్రి పై బెంగతో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెద్ద గల్లంతై ఆచూకీ లేకపోవడంతో ఉన్న ఇల్లు అమ్మి, కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది వెంకటస్వామి భార్య రూతమ్మ. వెంకటస్వామి పశువుల వ్యాపారి కావడంతో అప్పట్లో ఆ కుటుంబం కాస్త స్థోమత ఉన్నదే అయినప్పటికి ఇరుకుల్ల ఘటనతో చిన్నాభిన్నమై పుట్టెడు కష్టాలను అనుభవిస్తోంది. కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతూ ‘‘ఆ రోజు సంతకు పోయిండు.. అంతే ఇంక తిరిగిరాలేదు’’ అని ఆవేదన చెందుతోంది. మేమూ బతుకుతమని అనుకోలేదు ఇరుకుల్లలో లారీ కొట్టుకుపోయిన దాంట్లో మేమూ కూడా బతుకుతమనుకోలేదు. పెద్దపల్లి అంగడిలో లారీ లోడ్ చేసుకుని వచ్చేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలైంది. వర్షం బాగా వస్తోంది. వంతెనపై నుంచి వరదపోతుంది. మా ముందు కారు, చేతక్ ఉన్నాయి. లారీ క్యాబిన్లో మొత్తం పది మందిమి ఉన్నాం. మధ్యలోకి పోయేసరికి వరద ఎక్కువై లారీ కొట్టుకు పోయింది. నాతోపాటు ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి వాగులో ఈదుకుంటూ కష్టంగా బయటపడ్డం. – మల్లేశం, ప్రత్యక్షసాక్షి, కేశవపట్నం, కరీంనగర్ జిల్లా ఇరవైతొమ్మిదేండ్ల నుంచి చూస్తనే ఉన్నం మా ఆయన ఎప్పుడొస్తడా అని ఇరవై తొమ్మిదేండ్ల నుంచి చూస్తున్నం. బాబాలు చెప్తరంటే ఐదారు వేల రూపాయలు ఖర్చు పెట్టి అట్ల చెప్పించుకున్నం. అంతా వెతికినం. కానీ మా ఆయన జాడ తెలువలే... కోర్టులెంబడి పొమ్మంటే అట్ల పోయినం. అధికారుల దగ్గరికి తిరిగినం. ఏం పత్తా దొరకలే. చివరకు మొన్న వాగులో తవ్వకాల్లో ఎల్లినయంటే పోయినం.. పుర్రెలు దొరికినయ్. – గౌసియా బేగం, ముగ్ధుం ఖాన్ భార్య అమ్మా అంగడికి పోయత్తమని పోయిండ్రు.. ఇగ రాలేదు అమ్మా అంగడిపోయత్తమని పోయిండ్రు... పొద్దుగూకే దాక చూసినా రాకపోతే ఏడ్చుడూ మొదలు పెట్టినా నా కొడుకులేరని. అప్పటికే ఓ కొడుక్కు ముగ్గురు పిల్లలు, ఇంకో కొడుక్కు ఒక్కలు. మరుసటి రోజు ఒకరొచ్చి వాగుల కొట్టుకుపోయిండ్రని చెప్పిన్రు. ఆ రోజు నుంచి ఇప్పటికీ కూడా నా కొడుకులు వత్తరని తెల్లందాకా, పొద్దుందాక ఎదురుచూస్తున్న. ఇప్పుడు బొక్కలు తేలినయ్ అని చెప్పిన్రు. మా బతుకులు ఆగమైపోయినయ్. – జహీరాబేగం, దౌలత్, ముగ్ధుంఖాన్ల తల్లి ఆధారం పోయింది.. ఆగమై పోయినం మా ఆయన అంగడికని పోయిండు.. అటే పోయిండు. వాగులో లారీ బోర్లపడి చనిపోయిండని చెప్పిండ్రు గానీ శవమైతే అప్పుడు దొరకలే. ఐదుగురు ఆడపిల్లలు, ఐదుగురు మగ పిల్లలు సంతానం. వారంతా చిన్నపిల్లలు కావడం వల్ల పెద్దదిక్కు లేక ఎటూ తిరగలే.. ఇద్దరు పిల్లలు తండ్రి మనాది పెట్టుకుని చచ్చిపోయిండ్రు. మిగిలిన పొల్లగండ్లను కొంగుపట్టి అడుక్కుంటూ, కూలీ కైకిలి చేసి సాదుకున్న. ఇప్పుడు కూడా కూలీ కైకిలి చేసుకునే బతుకుతున్నం. – కల్లెపెల్లి రూతమ్మ, వెంకటస్వామి భార్య మా నాన్న చనిపోయినప్పుడు చిన్న పిల్లలం మా నాన్న కటికె శంకర్ ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి, తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. నాన్న పోయిన రంధితో ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దీంతో మా బంధువులు చేరదీయడంతో ఈ స్థాయిలో ఉన్నాము. వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాము. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నవి ఉంటాయని అనుకున్నాము. – సరిత, కటికె శంకర్ పెద్దకూతురు – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
విశాఖ ప్రజలకు వింత కష్టాలు
-
20 శవాలతో ఎగ్జిబిషన్
-
శవాలతో ఎగ్జిబిషన్
సిడ్ని : ఈ ఎగ్జిబిషన్‌లోకి అడుగు పెట్టగానే మనషుల శవాలు స్వాగతం పలుకుతాయి. శరీర భాగాలు మిమ్మల్ని భయపెడతాయి. మన శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది. అవయవాలు ఎలా పనిచేస్తాయి. ఏ పని చేసినపుడు ఏ కండరం కదులుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవచ్చు. ఏకంగా 20 శవాలు, 200లకు పైగా విడి శరీర భాగాలను ప్రదర్శనలో ఉంచారు. సిడ్నీ నగరంలో మనషుల శవాలతో, శరీర భాగాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనిషి శరీర భాగాల పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై ఓ అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్ధేశమని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్లు చెప్పిన శవాల సంగతులు.. ఈ ప్రదర్శనలో ఉంచిన శవాలను చక్కగా తీర్చిదిద్దిన డాక్టర్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు ఆ శవాలు ఇష్టపూర్వకంగా ప్రదర్శనకు ఇచ్చినవి కావని, అవి చైనాకు చెందిన ఓ నిషేధిత ఫాలున్ గాంగ్ తెగకు చెందినవిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. వారందరూ మరణ శిక్ష విధించబడిన ఖైదీలు అయ్యిండొచ్చన్నారు. వారిని తీవ్రంగా హింసించడం వల్లే వారు మరణించారని తెలిపారు. ప్రదర్శన నిర్వాహకుడు టామ్ జాలర్ మాట్లాడుతూ.. శవాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికి ఈ శవాల ప్రదర్శనను చూడ్డానికి ప్రజలు మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. -
సిరియాలో మరో విష దాడి!
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినవారిలోనూ, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందికి గురైన వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. పలు భవనాల్లో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను సిరియా, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా ఖండించాయి. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలనీ, విషవాయువు ప్రయోగం జరిగినట్లు తేలితే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ క్రూరత్వానికి ఇది మరో ఆధారంగా నిలుస్తుందని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. 42 మంది వారివారి ఇళ్లలో చనిపోయి ఉండటాన్ని గుర్తించామనీ, వీరంతా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం వల్లనే మరణించినట్లు తెలుస్తోందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చనీ సహాయక సిబ్బంది చెప్పారు. చిన్నారులు, మహిళలు సహా అనేక మంది శవాలు ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఉండటాన్ని చూపుతూ పలు వీడియోలు విడుదలయ్యాయి. మృతుల నోళ్లు, ముక్కుల నుంచి తెల్లని నురగ బయటకు రావడం వీడియోల్లో కనిపించింది. అవి నకిలీ వీడియోలు: సిరియా రసాయనిక దాడి జరిగిందనడాన్ని సిరియా అధికారిక మీడియా ఖండించింది. తిరుగుబాటుదారులే అంతర్జాతీయంగా మద్దతు పొందటం కోసం నకిలీ వీడియోలను విడుదల చేశారని పేర్కొంది. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు కూడా రసాయనిక దాడి అబద్ధమని పేర్కొన్నాయి. ప్రస్తుతం డౌమా పట్టణాన్ని సిరియా భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం తూర్పు గౌటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం డౌమా మాత్రమే. శనివారం మధ్యాహ్నం వైమానిక దాడి జరిగిన తర్వాత తమకు కళ్లు మండుతున్నాయనీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందం టూ 15 మంది వైద్యశాలలకు వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఓ ప్రభుత్వ హెలికాప్టర్ వచ్చి గుర్తు తెలియని రసాయనాన్ని వెదజల్లిందనీ, దీని వల్ల ఇంకా అనేకమంది ప్రజలు విషవాయువు బారిన పడ్డారని సహాయక సిబ్బంది వివరించారు. నిరంతరాయంగా జరుగుతున్న దాడుల వల్ల మృతదేహాలను వెతకడం కష్టంగా ఉందనీ, మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని వారు అంటున్నారు. విషపూరిత క్లోరిన్ వాయువుతో ప్రభుత్వ దళాలు దాడిచేసినట్లు ‘వైట్ హెల్మెట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. 40 నుంచి 70 మంది విషవాయువు కారణంగా మరణించి ఉంటారని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి సిరియా జరిపిన వైమానిక దాడులతో కలిపి మృతుల సంఖ్య 80కి పైగానే ఉంటుందంది. అసద్ ఓ జంతువు: ట్రంప్ సిరియా అధ్యక్షుడు అసద్ ఓ జంతువనీ, ఆయన చర్యను మతిలేనిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇరాన్, రష్యాల మద్దతుతోనే సిరియా రెచ్చిపోతోందన్నారు. ‘డౌమాను సిరియా సైన్యం చుట్టుముట్టి ఇతరులను అక్కడకు వెళ్లనివ్వడం లేదు. అసద్‌కు మద్దతునిస్తున్న రష్యా, ఇరాన్‌లే ఇందుకు బాధ్యులు. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైనిక చర్య చేపట్టి ఉంటే నేడు అసద్ అనే వ్యక్తి ఉండేవాడే కాదన్నారు. -
బహ్రెయిన్‌లో ఆపద్బాంధవులు
రాయికల్(జగిత్యాల): ఉన్న ఉరిలో ఉపాధి కరువవడంతో బహ్రెయిన్ దేశంకు వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మికులు పడుతున్న కష్టాలను చూసి చలించి పోయిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రాధారపు సతీశ్‌కుమార్ 2012లో 25మంది సభ్యులతో కలిసి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాకు చెందిన ఊట్‌పెల్లికి చెందిన బొలిశెట్టి వెంకటేష్, మెట్‌పెల్లికి చెందిన లింబాద్రి, వేంపేట్‌కు చెందిన మగ్గిడి రాజేందర్‌తోపాటు వివిధ జిల్లాకు చెందిన సభ్యులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. బహ్రెయిన్‌లోని వివిధ కంపెనీ ల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఏదైన ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన, మృతిచెందిన వారందిరికీ అండదండగా ఉంటూ ఆపద సమయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. క్షతగాత్రులకు కుటుంబసభ్యుల్లా సేవలందిస్తున్నారు. మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతూ మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ సభ్యులంతా కలిసి తమకు వచ్చిన జీతంలో కొంత డబ్బును జమ చేస్తున్నారు. మల్లాపూర్ మండలం సాతారంకు చెందిన కొమ్మ శంకర్, కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బట్టు సేవ్య, గాం«ధారి మండలం కొడంగల్‌కు మారుకంటి బాబు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటకి చెందిన సాయన్న, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవనగర్‌కి చెందిన రాజన్న, నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరకి చెందిన అల్లెపు గంగారం ఇటీవల బహ్రెయిన్‌లో మృతిచెందగా వారి మృతదేహాలను సొంతఖర్చులతో స్వగ్రామాలకు పంపించారు. మెట్‌పెల్లి మండలం రంగరావుపేటకు చెందిన గుగ్లావత్ రాజేందర్ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి పోగా మందుల ఖర్చులు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన సాయన్నకు పక్షవాతం రావడంతో, ఖానాపూర్ మండలానికి చెందిన బైరగొని సంజీవ్ కడుపులో కణితి పెరగడంతో వారు స్వగ్రామానికి వెళ్లేలా విమాన ఛార్జీలు అందజేశారు. అంతే కాకుండా కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన రాజన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 20వేలు అందజేశారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్, ఎంపీ కవిత అభినందించారు. సేవ.. సంతృప్తినిస్తుంది నిరక్షరాస్యులైన కార్మికులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి బెహరాన్ దేశంకు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారిని ఆదుకోవడంతోపాటు, తోచిన సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25మంది సభ్యులతో కలిసి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేశారు. తద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. – రాధారపు సతీశ్‌కుమార్ -
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టు మృతదేహాలు
-
అవి హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్..!
సాక్షి, చెన్నై: వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల లభ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి. అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్‌లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 3లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన కుటుంబాలను అదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాక చనిపోయిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. -
మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట చెరువులో కలకలం సృష్టించిన మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదు మృతదేహాలు లభించగా నలుగురు తమిళనాడులోని సేలం జిల్లా, కడు మదురైకి చెందిన మురుగేశణ్, కరియణ్ణన్, జయరాం, మురుగేశణ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఐదు మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తమిళనాడు నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, మీడియా కూడా రిమ్స్‌కు చేరుకున్నారు. అయితే ఈ మరణాలపై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికి హత్యలేనని ఆరోపించింది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది. -
చనిపోయిన వారు తమిళ కూలీలేనా...
సాక్షి కడప/రాజంపేట/ఒంటిమిట్ట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఒంటిమిట్ట చెరువులో ఏం జరిగింది.. ఐదుగురు ఒకేసారి చనిపోవడం వెనుక కారణాలు ఏమిటి.. చనిపోయిన వారంతా తమిళ కూలీలేనా.. ఎవరిని కదిపినా ఇదే చర్చ సాగుతోంది.. చూసిన వారందరూ తమిళ కూలీలేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవులు సమీప ప్రాంతాల్లోనే ఉండడంతో.. రైళ్లలో వచ్చి నేరుగా అడవుల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూలీల సమాచారం పసిగట్టి వెంబడించడంతోనే కొందరు నీళ్లలోకి దూకి ఉంటారని ప్రజా సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనను బట్టి చూస్తే రెండు, మూడు రోజుల కిందటే చెరువులో పడినట్లు తెలుస్తోంది. చెరువులో ఎలా పడ్డారు....వారిని ఎవరైనా వెంబడించారా...లేకపోతే హత్య చేసి పడేశారా అన్నది తెలియలేదు. పోలీసులు కూడా అనుమానాస్పదం కిందనే కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట చెరువులో ఒకేసారి ఐదు మృతదేహాలు కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట ఫార్టెసు పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేపట్టేందుకు తమిళ తంబీలు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అదే రాత్రి చెర్లోపల్లె గ్రామంలో పలువురు గ్రామస్తులను విచారించారు. గ్రామసమీపంలోని పొలాలకు దగ్గరలో ఉన్న చెరువు పెద్దకుంటలో మృతదేహాలు లభ్యంకావడంతో పోలీసుల గాలింపునకు ఆధారంగా నిలుస్తోంది. ఎర్రచందనం లారీ డ్రైవర్ పరారీ అయినట్లు, అందులోని 30 మంది తమిళతంబీలు పోలీసులను చూసి పారిపోయే తరుణంలో ఐదుగురు చెరువు పెద్దకుంటలో పడి మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం నిర్ధారించడంలేదు. ప్రమాదవశాత్తా.. ఆత్మ‘హత్య’ చెరువు పెద్దకుంటలో లభ్యమైన ఐదు మంది తమిళ తంబీలు ప్రమాదవశాత్తు పడ్డారా? లేక ఎన్కౌంటర్ చేసి పడేశారా..పోలీసులకు చిక్కుతామనే ఆత్మహత్య చేసుకున్నారా.. ఇవి స్థానికుల్లో నెలకొన్ని అనుమానాలు. పోలీసులకు తమిళతంబీలు ఎదురు తిరిగిన పరిస్ధితిలో ఈ సంఘటన జరిగిందా? అని కూడా పలువురు అనుమానిస్తున్నారు. ఓ పోలీసు అధికారికి గాయాలు అయినట్లు ఒంటిమిట్టలో చెప్పుకోవడం జరుగుతోంది. సంఘటన స్ధలానికి చేరుకున్న ఓఎస్డీ నయూం అస్మీ మృతదేహాలను పరిశీలింంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కూంబింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. మృతిచెందిన వారు తమిళతంబీలని ఇప్పుడు చెప్పలేమని, విచారణలో తేలాల్సి ఉందన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాణ, ఆర్డీఓ వీరబ్రహ్మం, తహసీల్దారు శిరీష, సీఐ రవికుమార్, సబ్‌డివిజన్‌లోని పలువురు ఎస్ఐలు ఉన్నారు.ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా మృతదేహాలను పరిశీలించారు. రిమ్స్‌కు చేరిన మృతదేహాలు ఒంటిమిట్ట చెరువులో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను ఆదివారం సాయంత్రం రిమ్స్ మార్చురీకి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే టీవీల ద్వారా ప్రచారం జరగడం, పోలీసులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సమాచారాన్ని అందించిన నేపథ్యంలో మిస్సింగ్ అయిన వారి బంధువులు కడపకు చేరుకునే అవకాశం ఉంది. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన వారికి సంబంధించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం అస్మి తెలిపారు. -
ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం..
-
అయ్యో! ఎంత ఘోరం
పెద్దాపురం: అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మొన్ననే భార్యనే పొగట్టుకుని రెండు నెలల కాలేదు. అంతలోనే చిన్న పాపతో పాటు తను కూడా తనువు చాలించాడా! జోస్యుల సురేష్ వద్ద పలువురు కన్నీటి పర్యంతం కావడం పలువురి హృదయాలను కలచివేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నలజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెద్దాపురం కాకర్ల వారి వీధికి చెందిన జోస్యుల సురేష్, అతడి చిన్న కుమార్తె ఏడాదిన్నర వయస్సున్న నిశ్చల మృతదేహాలు బుధవారం వారి స్వగృహానికి చేరాయి. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కుమార్తె, మనుమరాలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమంటూ సురేష్ తండ్రి జోగేశ్వర శర్మ, తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. స్వల్పగాయాలతో బయటపడిన పెద మనుమరాలు సువర్చల(5)ను హృదయానికి హత్తుకుని తల్లడిల్లిన తీరుతో కాకర్లవారి వీ«ధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో మమేకమై.. పురోహిత్యం చేస్తూ అందరితో మమేకమయ్యే సురేష్ మృతదేహాన్ని చూసి పలువురు చలించిపోయారు. పట్టణంలోని అన్ని దేవాలయాలు, వైశ్య కుటుంబీకులకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన సురేష్ మరణ వార్త విన్న పట్టణంలో పలువురు ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. -
పేద కుటుంబాలకు ఆసరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతి నెలా సగటున రెండు వేల మరణాలు నమోదవుతున్నాయి. మృతుల్లో అధిక శాతం పేదలే ఉంటున్నారు. మృతదేహాలను సొంత ఖర్చులతో ఇళ్లకు తీసుకెళ్లలేని స్థితిలో వీరు ఉంటున్నారు. ప్రైవేటు వాహనాల యాజమానులు చెప్పిందే ధరగా ఉంటోంది. దూరాన్ని బట్టి కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. మృతదేహాల తరలింపు ప్రస్తుతం పెద్ద ఖర్చుగా మారుతోంది. దీంతో పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆస్పత్రులలో చనిపోయిన వారిని ఉచితంగా ఇళ్ల వద్దకు చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం 18 జిల్లాల్లో 50 వాహనాలతో ఈ సేవలను అందిస్తున్నారు. రెండో దశలో మరో 45 వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. జనవరి చివరి వారంలో కొత్త వాహనాల సేవలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16,552 మృతదేహాల తరలింపు.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మృతదేహాల తరలింపు కార్యక్రమాన్ని 2016 నవంబర్ 18న ప్రారంభించింది. దీని కోసం రూ.50 కోట్లను విడుదల చేసింది. మొదటి దశలో 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఉచిత మార్చురీ సేవల కార్యక్రమంతో 2018 జనవరి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,552 మృతదేహాలను ఇళ్ల వద్దకు చేర్చారు. ఒకేసారి రెండు మృతదేహాలను తరలించేలా ఈ వాహనాలను తయారు చేయించారు. మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు బాడీ ఫ్రీజర్లను అమర్చారు. మృతుల బంధువులు అదే వాహనంలో వెళ్లేలా సీట్లను అమర్చారు. ప్రతి వాహనానికి ఒక సహాయకుడిని నియమించారు. ఉచిత మార్చురీ వాహనాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీవీకే–ఈఎంఆర్‌ఐకి అప్పగించింది. ప్రతి వాహనానికి నెలకు రూ.60 వేల చొప్పన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆయా ఆస్పత్రులలోని ప్రాంతీయ వైద్యాధికారి గానీ, సూపరింటెండెంట్ గానీ ధ్రువీకరించిన తర్వాతే ఉచిత వాహనాల సేవలను కేటాయిస్తున్నారు. -
శవాలను పీక్కుతింటున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: మనిషి బతికున్నప్పుడు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చనిపోయిన తర్వాత శవానికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అయితే.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. మార్చురీ సిబ్బంది వచ్చిన శవాలకు సకాలంలో పోస్టుమార్టం చేయకపోవడమే కాక.. ఉన్నవాటికీ రక్షణ కల్పించలేక పోతున్నారు. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ శవాన్ని ఎలుకలు, పందికొక్కులు పీక్కుతినడం చర్చనీయాంశమైంది. సమయం మించిందని అప్పగించి వెళితే.. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన ఉమ(21) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే సాయంత్రం ఆరు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధు వులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కుప్పలుగా శవాలు.. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. వీటిని భద్రపరిచేందుకు 32 ్రíఫీజర్ బాక్సులు, ప్రత్యేకంగా ఓ గది ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకు బాడీలను భద్రపరిచే వీలుంది. అప్పటికే బాడీ డీకంపోజ్ అయితే డంప్ రూమ్‌లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి. తగిన బాక్స్‌లు లేకపోవడం వల్లే.. నిర్దేశిత సమయంలో వచ్చిన శవాలకు అదే రోజు పోస్టుమార్టం చేస్తుండగా, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చిన వాటిని ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచి, పోలీసుల పంచనామా తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు పంచనామా ఇన్‌టైమ్‌లో చేయకపోవడం, బంధువులు సకాలంలో రాకపోవడం వల్ల కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు శవాన్ని బాక్స్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫ్రిజర్ బాక్సులన్నీ శవాలతో నిండిపోవడంతో ఆ తర్వాత వచ్చిన వాటిని వార్డులో ఓ మూల పడేయాల్సి వస్తోంది. వస్తున్న శవాల నిష్పత్తికి తగ్గట్టు మార్చురీని అభివృద్ధి చేయకపోవడం.. ఎప్పటికప్పుడు శవాలను దహనానికి తరలిం చకపోవడం ఇందుకు కారణాలని వైద్యనిపు ణులు చెపుతున్నారు. ఉస్మానియా మార్చురీ మూసీ నదిని ఆనుకుని ఉంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి భవనానికి మరమ్మతులు నిర్వహించక పోవ డంతో పందికొక్కులు, ఎలుకలు, కుక్కలకు నిలయంగా మారింది. వీటిని నియంత్రించా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిజానికి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచిన శవాలను పందికొక్కులు, ఎలుకలు కొరికే అవకాశం లేదు. బాక్స్‌లో కాకుండా వార్డులో ఓ మూలన పడేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
ఛీ, శవాలతో వ్యాపారమా !
సాక్షి, తెనాలిరూరల్ : అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలే అతని టార్గెట్.. కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుని మరీ బీమా కట్టించడం అతని ప్రత్యేకత.. సహజ మరణాలను ప్రమాద మరణాలుగా చిత్రీకరించడంలో అతను సిద్ధహస్తుడు.. పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్(56) మరణాన్ని కూడా గురువారం అదే క్రమంలో చిత్రీకరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ప్రాంతానికి చెందిన రాజు నాయక్. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంటుగా పని చేసే రాజు నాయక్ తెనాలి మండలం పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన రమావత్ కస్నానాయక్‌కు బంధువు శ్రీనునాయక్ ద్వారా పరిచయం. దూరపు బంధువు. రెండేళ్లుగా టీబీ వ్యాధితో తీసుకుంటున్న కస్నా నాయక్ మరికొద్ది నెలల్లో మృతి చెందుతాడని భావించి, అతని కుటుంబసభ్యులను ఒప్పించి, ప్రమాద బీమా కట్టించాడు. బీమా సంస్థ నుంచి వచ్చే మొత్తంలో 60 శాతం తనకు, 40 శాతం మృతుడి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా ఒప్పందం రాసుకున్నాడు. కస్నా నాయక్ భార్య భద్రికి భర్త మరణిస్తే వెంటనే ఆ విషయాన్ని తనకు తెలియజేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో కస్నా నాయక్ బుధవారం ఉదయం ఇంట్లో మృతి చెందాడు. వెంటనే ఈ విషయాన్ని భార్య, ఇద్దరు అల్లుళ్లు రాజునాయక్‌కు ఫోను ద్వారా తెలియజేశారు. అతను శ్రీనునాయక్, మరో వ్యక్తిని తీసుకుని కారులో పెదరావూరుకు చేరుకున్నాడు. కస్నా నాయక్ అల్లుళ్లకు చెందిన ఆటోలో మృతదేహాన్న పెదరావూరు నుంచి చుండూరు మండలం చినపరిమికి వెళ్లే డొంక రోడ్డు వైపునకు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, కారును ఎక్కించారు. వెంటనే ఆటోలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి పేరు నమోదు చేయమనడంతో అనుమానం వచ్చి.. కస్నా నాయక్ మృతదేహాన్ని పరిశీలించిన వైద్యశాల సిబ్బంది మృతుడు చనిపోయి చాలా సేపు అయిందని, తీసుకెళ్లి పొమ్మని సూచించారు. మృతుడి వివరాలను వైద్యశాలలో నమోదు చేయాలని, ప్రమాదంలో మృతి చెందినట్టు సంబంధిత రసీదులు కావాలని రాజునాయక్, శ్రీనునాయక్, మరి కొందరు సిబ్బందిని అడగడంతో అనుమానం వచ్చిన వైద్యులు, సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తాలూకా ఎస్ఐ డి. జయకుమార్ వివరా లు తెలుసుకుని ఘటన జరిగిందని చెప్పిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రక్తం, వాహనాలకు సంబంధించిన గాజుముక్కలు వంటివి లేకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలిస్తే ఒంటిపై గాయాలూ లేవు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేయాలంటూ రాజునాయక్ పోలీసులను అడగడం గమనించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజునాయక్, శ్రీనునాయక్‌తో పాటు కస్నానాయక్ భార్య, ఇద్దరు అల్లుళ్లు ప్రస్తుతం నిందితులుగా పోలీసుల అదుపులో ఉన్నారు. -
ముక్కలుగా నరకటానికి మూడు రోజులు..!
టోక్యో(జపాన్) : ఒక మనిషిని హత్య చేయడానికే చాలా ధైర్యం ఉండాలి. అలాంటిది హత్య చేసి ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ‘మొదటిసారి హత్య చేసి ఆ డెడ్ బాడీని ముక్కలుగా నరకటానికి మూడు రోజులు పట్టింది... రెండోసారి మాత్రం ఒక్కరోజులో పని పూర్తయింది.’ ఓ యువకుడు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని చెప్పాడు. జపాన్‌లో ఓ యువకుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిదిమంది దారుణంగా హత్య చేశాడు. నేరాలు అతి తక్కువగా జరిగే జపాన్‌లో అతడు దారుణహత్యలకు పాల్పడ్డాడు. అంతటితో అగకుండా ఆ మృతదేహాలను ముక్కలుగా నరికి తన అపార్టుమెంట్ ఫ్లాట్‌లో పడేశాడు. తకహీరో షయిరాయిషి(27) అనే వ్యక్తి బాలికలను, మహిళలను మాయమాటలు చెప్పి తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. వారి వద్ద ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కునేవాడు. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ దారుణమారణకాండకు పాల్పడుతున్నాడు. అతని బారిన పడిన వారిలో ఎనిమిది మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారు. హతుల్లో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ ను వెంటబెట్టుకుని అక్కడికి రాగా తకహిరో అతడి ఉసురు కూగా తీసుకున్నాడు. మహిళల అదృశ్యంపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి రూంలో తలలు, చేతులు, మిగతా, శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ విసిరేసినట్లుగా పడి ఉన్నాయని పోలీసులు చెప్పారు. అంతేకాక దాదాపు 240 ఎముకలు లభ్యమయ్యాయని వారు తెలిపారు. శరీర భాగాలను డీఎన్ఏ టెస్టుకు పంపి మృతులను గుర్తించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. -
దారుణ విషాదం..దర్యాప్తు ముమ్మరం
-
దారుణ విషాదం.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ఐదుగురు మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం చందానగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అతడి ఆత్మహత్యకు సంబంధించి కీలక ఆధారాలు దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సెల్ఫోన్ల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిగతావారి సెల్ఫోన్లను ప్రభాకర్‌రెడ్డి కావాలనే మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవిల గురించి కుటుంబ సభ్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నారు. షేర్ మార్కెట్ వ్యాపారంలో నష్టపోయాడు, ఎంతమంది పేర్లతో షేర్ ఖాతాలు నిర్వహిస్తున్నాడనే వివరాలు ఆరా తీస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభాకర్‌రెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న కొల్లూరు సమీపంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు, పిన్ని, ఆమె కూతురు విగతజీవులుగా పడివుండటాన్ని మంగళవారం గుర్తించారు. తనతోపాటు ఉన్న నలుగురికి విషమిచ్చి తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షేర్ల మార్కెట్లో వచ్చిన నష్టాల కారణంగానే ప్రభాకర్‌రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. -
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
-
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
హైదరాబాద్: నగర శివార్లలోని కొల్లూరు సమీపంలో వెలుగుచూసిన ఐదుగురి మృతి కేసులో దర్యాప్తు చేపట్టామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. మృతులు పటాన్చెరు అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించామన్నారు. వీరికి మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చూడటానికి వెళ్తున్నట్టు చెప్పి కారులో వెళ్లారని వెల్లడించారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన బంధువు రవీందర్‌రెడ్డి, అతడి భార్య లక్ష్మికి డిమాట్ ఖాతాలున్నాయని.. వీటి ద్వారా రూ. కోటి 30 లక్షల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఐదు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన కొడుకు షేర్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఇందులో నష్టాలు వచ్చాయని ప్రభాకర్‌రెడ్డి తండ్రి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక లావాదేవిల కారణంగా కొంతకాలంగా బాధల్లో ఉన్నాడని, దసరాకు కూడా తమ ఇంటికి రాలేదని వెల్లడించారు. షేర్ మార్కెట్లో ఎలాంటి నష్టం వచ్చినా అధైర్యపడొద్దని చాలాసార్లు చెప్పినట్టు ప్రభాకర్‌రెడ్డి బంధువు రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘నా వ్యాపారాన్ని ప్రభాకర్‌రెడ్డి, నా భార్య లక్ష్మి చూసుకుంటోంది. వ్యాపారంలో నష్టం వచ్చిన సంగతి నాకు తెలియదు. ఎంత నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం ఆమెదికాదు. ప్రభాకర్‌రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి. మేం ఆర్థికంగా నష్టాల్లో లేము. బాగానే ఉన్నామ’ని రవీందర్‌రెడ్డి చెప్పారు. -
ఓఆర్ఆర్ వద్ద యువతుల మృతదేహాలు
-
షాక్: ఓఆర్ఆర్ వద్ద అయిదు మృతదేహాలు..
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలోని ఇంద్రాణినగర్ వద్ద అయిదు గుర్తుతెలియని మృతదేహాలు బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు యువతులు(22), ఒక మహిళ(40) మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. మృతులను పటాన్చెరు అమీన్పూర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబంగా గుర్తించారు. మృతులు.. ప్రభాకర్ రెడ్డి, మాధవి, హిందూజా, లక్ష్మీ, వర్షిత్ రెడ్డి. శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పిన వారు.. శవమై కనిపించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండ్రోజుల క్రితం పటాన్చెరువు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైనట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వీరంతా ఎపీ 28 DM 3775 కారులో బయలుదేరారు. వీరెక్కడికి వెళ్లారో తెలియక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా వీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. ఆర్థిక కారణాలు వల్లే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొల్లూరు సమీపంలో మృతదేహాలు కలకలం -
డేరా బాబా ఆశ్రమంలో 600 అస్థిపంజరాలు
-
డేరా’లో 600 శవాల ఖననం
► విచారణలో వెల్లడించిన మాజీ ఉపాధ్యక్షుడు చంఢీగడ్: డేరా ఆశ్రమంలోని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో సుమారు 600 మంది శవాలను పాతిపెట్టినట్లు తాజాగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో గుర్మీత్ నమ్మిన బంటు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు డా. పీఆర్ నైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన తగిన ఆధారాలను కూడా అధికారులకు సమర్పించారు. శవాలను పాతిపెట్టిన చోటల్లా ఓ జర్మన్ శాస్త్రవేత్త సలహా మేరకు మొక్కలను నాటినట్లు నైన్ తెలిపారు. -
అశ్రు నయనాలతో అంతిమ యాత్ర
స్వస్థలాలకు చేరిన మృతదేహాలు తీర్థయాత్రల కోసం వెళ్లి తమిళనాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలు ఆదివారం జిల్లాకు చేరుకున్నాయి. తమవారి మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కొల్లూరు : తీర్థయాత్రలో అసువులుబాసిన మృతుల అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య జరిగింది. తెనాలి పట్టణ, పరిసర గ్రామాలు, గుంటూరు నగరానికి చెందిన సుమారు 42 మంది ఈ నెల 13వ తేదీ కన్యాకుమారి వరకు తీర్థయాత్రకు వెళ్లడం, తిరునల్వేలి సమీపంలో ఆగి ఉన్న వీరి బస్సును వెనుక ఉంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతదేహాలు ఆదివారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నాయి. కొల్లూరు మండలంలోని అనంతవరం, ఈపూరు గ్రామాలకు చెందిన నాగవర్ధిని (43), కన్నెగంటి రామయ్య (63), దేశు వెంకటరామారావు (65) మృతదేహాలను తమిళనాడు నుంచి అధికారులు తీసుకొచ్చారు. అపశ్రుతితో జాప్యం మృతదేహాలు అంబులెన్స్‌ల్లో శనివారం రాత్రే బయలుదేరాయి. ఆదివారం మధ్యాహ్నానికే చేరుకోవాల్సి ఉంది. అయితే ఓ అంబులెన్స్ 30 కిలోమీటర్ల వచ్చిన తర్వాత తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడ్ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు డ్రైవర్, అంబులెన్స్‌ను అదుపులోకి తీసుకొని మరో అంబులెన్స్‌ను సమకూర్చిపంపారు. దీంతో జాప్యం చోటుచేసుకుంది. ప్రత్యేక బస్సులో క్షతగాత్రులు, మిగిలిన యాత్ర బృంద సభ్యులను అధికారులు స్వస్థలాల్లో దిగబెట్టారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. పూర్తయిన సత్యం అంత్యక్రియలు తెనాలిరూరల్ : రోడ్డు ప్రమాద బాధితులు ఆదివారం సాయంత్రం తెనాలి చేరుకున్నారు. బాధితులను తీసుకువచ్చేందుకు, మృతదేహాలను తరలించేందుకు వెళ్లిన కొల్లూరు తహసీల్దార్, ఎస్ఐ ఈ బస్సులోనే బాధితులతో కలసి వచ్చారు. స్వల్ప గాయలతో క్షేమంగా తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులను చూసి బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు. సన్నిహితులే ఆత్మబంధువులై.. ప్రమాదంలో మృతి చెందిన వంట మాస్టర్ సత్యం మృతదేహానికి తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ పైడి హజరత్తయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సత్యంకు సన్నిహితులైన మద్దాల జగన్నాథరావు, రమణమ్మ దంపతులు, సత్యం ఉండే ఇంటి యజమాని రాజారావు, మరికొందరు స్థానికులు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. 25 ఏళ్లుగా తెనాలిలో ఉంటున్న సత్యంతో తనకు 15 ఏళ్లుగా పరిచయం ఉందని, తన సంబంధీకుల గురించి ఎన్నిసార్లు అడిగినా, నాకు మీరున్నారు, ఏదన్నా జరిగితే మీరే అన్నీ చేయాలంటుండే వాడే మినహా ఏ వివరాలు చేప్పేవాడు కాదని జగన్నాథరావు గుర్తుచేసుకున్నారు. -
శవాలను వెలికి తీసి.. మేకప్ వేసి..
సాక్షి, ప్రత్యేకం : సొంత వారిని కోల్పోతే కలిగే బాధ అనిర్వచనీయం. వారిపై ఉన్న ప్రేమకు గుర్తుగా దాన ధర్మాలు చేయడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ, ఇండోనేసియాలోని దక్షిణ సులావేసి నివసించే ఓ తెగ మాత్రం ఓ చిత్రమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆత్మీయులు మరణిస్తే వారికి కర్మకాండలు నిర్వహించకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచుకుంటారు టొరాజా తెగ ప్రజలు. అలా కొన్నేళ్ల పాటు ఇంట్లో ఉంచుకున్న అనంతరం మృత దేహాలను పూడ్చి పెడతారు. మరణించిన వారి శరీరాల నుంచి దుర్వాసన వెలువడకుండా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో స్నానం చేయిస్తారు. పూడ్చిన మృతదేహాలను ప్రతి ఏడాది పంట చేతికి వచ్చిన సమయంలో వెలికితీస్తారు. వారికి ఇష్టమైన వస్తువులను అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తి బాలిక/మహిళ అయితే ఆమె తలను దువ్వి, మంచి దుస్తులు వేసి అందంగా అలంకరిస్తారు. బాలుడు/పురుషుడు అయితే అతనికి ఇష్టమైన కళ్లజోడు, సిగరెట్, దుస్తులు లాంటి వస్తువులతో అందంగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు. ఊరేగింపు అనంతరం గేదెలు, పందులను బలి ఇస్తారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని టొరొజా ప్రజల నమ్మకం. మాట్లాడే భాషను రాతలో కూడా చూపిన తొలి తెగ టొరొజానే. అయితే, టొరొజా తెగలో మరణించిన వారి మృత దేహాలను వెలికి తీసి ఊరేగింపు చేసే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. 'మా ఆత్మీయులను ఇలా పలకరిచడం అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. చనిపోయిన వారి గురించి మేం ఎన్నడూ బాధపడం. మరణం తర్వాత కూడా వారు మాతో మమైకమే ఉంటున్నప్పుడు బాధ దేనికి. పంట చేతికి రావడం, మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం రెండూ సంతోష సందర్భాలే' నని టొరొజా తెగకు చెందిన ఓ వ్యక్తి చెప్పారు. -
చెరువులో తల్లీబిడ్డల మృతదేహాలు
♦ కోలారు తాలూకాలో విషాదం ♦ కొద్దిరోజుల కిందటే మిస్సింగ్ కేసు కోలారు : అనుమానాస్పద రీతిలో తల్లి, ఇద్దరు బిడ్డల మృతదేహాలు సోమవారం సాయంత్రం తాలూకాలోని శెట్టిమాదమంగల చెరువులో బయటపడ్డాయి. మృతురాలిని జ్యోతి (32)గా గుర్తించారు. మాలూరు తాలూకాలోని వీరకపుత్ర గ్రామంలోని తన పుట్టి నింటిలో నివాసం ఉంటోంది. 4 సంవత్సరాల కుమారుడు, రెండున్నర సంవత్సరాల కుమార్తెతో కలిసి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శవాలు నీటిపై తేలుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు,. చెరువు గట్టుపైనే ఒ పొదలో మృతురాలు జ్యోతి చెప్పులు, బట్టల బ్యాగ్ కనిపించింది. ఘటన ఆత్మహత్య లేదా హత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాస్తి పోలీస్ స్టేషన్లో కొద్దిరోజుల క్రితం జ్యోతి ఇద్దరు పిల్లలతో కనిపించడం లేదని ఫిర్యాదు నమోదైంది. బంధువులు వారి మృతదేహాలను గుర్తించారు. జ్యోతికి ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన గోవిందప్పతో వివాహమైంది. కుటుంబ కలహాలతో పుట్టింటికి చేరుకుంది. గత ఆదివారం భర్త ఇంటికి వెళతానని పుట్టినింటిలో చెప్పి వెళ్లిపోయింది. అయితే భర్త ఇంటికి కూడా వెళ్లక పోవడంతో తల్లి రెడ్డమ్మ మాస్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, కోలారు రూరల్ ఇన్స్పెక్టర్ శివరాజ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శవాలను వెలికి తీసి పోస్టు మార్టం కోసం కోలారు ఎస్ఎన్ఆర్ ఆస్పత్రికి తరలించారు. -
గుర్తు తెలియని 5వేల మృతదేహాలు
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో గుర్తు తెలియని మృతదేహాలు సంఖ్య పెరిగిపోతోంది. తాజా రిపోర్టుల ప్రకారం 2016లో ఒక్క పశ్చిమ బెంగాల్లోనే సుమారు 5వేల గుర్తింపులేని మృతదేహాలు ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇందులో అధికంగా రాజధాని కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు సంఘటనలు, ప్రమాదాల నుంచి తీసుకువచ్చినవేనని పేర్కొంది. అంతేకాకుండా వీటిలో ఎక్కువ శాతం హత్య కేసులే ఎక్కువగా ఉండటం విశేషం, వీటి ద్వారా రాష్ట్రంలో మర్డర్ కేసులు పెరిగిపోతున్నాయని ఎన్సీఆర్బీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్ర, తమిళనాడులు మొదటి స్థానాల్లో ఉన్నాయి. రికవరీ చేసిన మృత దేహాల్లో ఎక్కువ శాతం రైలు పట్టాలు, నదీ తీరాల్లో దొరికినవే. వీటి మీద ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, ఎక్కువ గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య పెరగిపోతోందని, అంతేకాకుండ మరిన్ని కేసుల్లో అసంపూర్తి సమాచారం ఉండటంతో కేసులను విచారించడంలో ఆలస్యమౌతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కోసం టెక్నాలజీనీ అభివృద్ధి పరిచినప్పటికి ఈ సమస్య ప్రభుత్వానికి సవాలుగా మారింది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసులు సరికొత్త పద్దతిని అనుసస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్లలో దంతాలను భద్రపరిచే లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి ద్వారా డీఎన్ఏ పరీక్షల ద్వారా కేసులను పరిస్కరించే ఆలోచనల్లో పోలీసు యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. -
హాస్టల్ గదిలో మృతదేహం
పరిగి(పెనుకొండ) : పరిగిలోని సాంఘిక సంక్షేమ వసతి గహం (హాస్ట ల్) గదిలో గుర్తు తెలియని ఓ వద్ధుడి(60) మృతదేహాన్ని శనివారం కనుగొన్నట్లు ఎస్ఐ అంజనయ్య తెలిపారు. హాస్టల్ లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికెళ్లి చూడగా.. మృతదేహం ఉందన్నారు. అయితే బాగా ఉబ్బిపోయి ఉండడంతో గుర్తు పట్టేందుకు కూడా వీల్లు కాలేదన్నారు. మతుడు ఇదే ప్రాంతంలో పగలంతా భిక్షాటన చేసి, రాత్రిళ్లు హాస్టల్‌కు వచ్చి నిద్రపోయేవాడని పేర్కొన్నారు. రెం డు, మూడు రోజుల కిందట చనిపోయి ఉంటాడని, అది అనారోగ్యంతో అయి ఉంటుందని భావిస్తున్నారు. గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో... గుత్తి(గుంతకల్లు) : గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. మతుడు ఎవరైందీ తెలియరాలేదన్నారు. అతని వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. వారం రోజులుగా ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తుండేవాడని స్థానికులు చెప్పారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు తెలిపారు. -
చావును గౌరవించరా?
మైల పడుతుందన్న అద్దె ఇంటి యజమానులు నడిరోడ్డుపై మృతదేహం సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు మైలంటూ.. మలినమంటూ.. నిర్జీవదేహాన్ని దరికి రానీయకుండా అద్దె ఇల్లు ఆచారాల గోడ కట్టగా.. చెత్త కుప్పలే బంధువులయ్యాయి.. ముళ్ల పొదలే ఆత్మీయులయ్యాయి.. శవాన్ని అక్కున చేర్చుకున్న మురుగు కాలువలు మనుషుల్లో మాయమైన మానవత్వాన్ని తమలో కలుపుకొని దూరంగా కదిలిపోయాయి. సొంత గూడు లేని నిరుపేద తండ్రి శవం.. మనుషులకు దూరంగా.. నగర శివారుకు దగ్గరగా.. అనాథగా పడి ఉండటాన్ని చూసి ఆ ఆడ బిడ్డ గుండెల్లో ద్రవించిన కన్నీటి పొర పాషాణ హృదయాలను తాకలేకపోయింది.. తాత అచేతన స్థితి వంక బేలగా చూస్తున్న పసిబిడ్డ చూపు జనన, మరణాల మాలిన్యమెక్కడంటూ తల్లి కన్నీటి చారికల సాక్షిగా మనిషిగా బతుకుతున్న మట్టిబొమ్మలను ప్రశ్నించింది. తెనాలి/తెనాలి రూరల్ : ప్రాణం పోయిన శరీరాన్ని అంతిమ సంస్కారాల వరకు ఇంట్లో ఉండనిస్తే మైల పడుతుందన్న అద్దె ఇంటి యజమానుల విశ్వాసం ఇల్లు లేని ఎందరినో కడగండ్ల పాలు చేస్తోంది. అద్దెకు ఉండే ఇంట్లో ఎవరైనా ఆకస్మికంగా ప్రాణాలను కోల్పోతే, ఆ భౌతికకాయాన్ని వీధిలోనే ఉంచేయటం అనివార్యం. ప్రత్యామ్నాయం దొరక్కపోతే అట్నుంచి అటే శ్మశానస్థలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ప్రాణప్రదమైన తమలో ఒకరు కాలంచేస్తే, ఏ దిక్కూ లేనట్టుగా అనాథ శవంగా రోడ్డుపై ఉంచాల్సిన నిస్సహాయతకు కుమిలిపోతుంటారు. తెనాలిలో జరిగిన ఘటన ఇందుకో నిదర్శనం. మృతదేహంతోనే ఎదురుచూపులు... పట్టణంలోని నందులపేటకు చెందిన మిండాల వెంకట్రావు (45) ముఠా కార్మికుడు. సిమెంటు దుకాణాలు, కొబ్బరిబొండాలు కొట్టేచోట.. ఏరోజు ఏ పని దొరికితే దానితోనే జీవనోపాధి. భార్య ఆదిలక్ష్మి. తను కూడా ఇంటిపనులతో భర్తకు ఆసరానిస్తోంది. కుమార్తెలు జ్యోతి, శాంతికి పెళ్లిళ్లు చేశారు. కలోగంజో తాగుతూ అద్దె ఇంట్లోనే హాయిగా సాగిపోతున్న కుటుంబమది. నాలుగు రోజుల క్రితం వెంకట్రావుకు ఆరోగ్య సమస్య ఎదురైంది. కామెర్ల వ్యాధిగా చెప్పారు. చేతిలో డబ్బుల్లేవు. తోటి కార్మికులే స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వెంకట్రావు, ఆదివారం రాత్రి ఆసుపత్రి నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేశాడు. అక్కడి సిబ్బందికీ సమాచారం లేదు. సోమవారం ఉదయానికి బుర్రిపాలెం రోడ్డులోని జెండా చెట్టు దగ్గర్లో రోడ్డుపక్క పడి ఉన్నాడు. గుర్తించిన కొందరు.. భార్యాబిడ్డలకు సమాచారం అందించారు. కంగారుపడుతూ వచ్చిన ఆదిలక్ష్మి విగతజీవుడైన భర్తను చూసి భోరుమంది. నడిరోడ్డుపై ఎదురుచూపులు... మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, అద్దె ఇంటి యజమానులు అంగీకరించలేదు. దగ్గర్లో బంధువులు ఎవరూ లేరు. దీనితో శవాన్ని బుర్రిపాలెంరోడ్డు చివర పాలాద్రి కాలువ వద్దకు తరలించారు. రెండో కుమార్తె శాంతిని అక్కడుంచి, ఆదిలక్ష్మి స్వస్థలంలోని బంధువులకు కబురు పంపేందుకు వెళ్లింది. తండ్రి మృతదేహం వద్ద ఎండలోనే బిడ్డతో సహా శాంతి కూర్చుండిపోయింది. ఏడుస్తున్న బిడ్డకు ఇడ్లీ ముక్కతో ఆకలి తీర్చింది. దారంట వెళుతున్న ఎందరో ఈ దృశ్యం చూసి విచారం వ్యక్తం చేశారు. సాయంత్రానికి స్థానికులే ఆటో మాట్లాడి వెంకట్రావు మృతదేహాన్ని స్వగ్రామమైన పొన్నూరు దగ్గర్లోని నండూరుకు తరలించారు. ’మనిషి శవం ఇంట్లో ఉంచితే మైల పడటం ఏమిటి? నిత్యం వేలు, లక్షల శవాలను తన గర్భంలో దాచుకుంటున్న భూమి ఎంత మైలపడాలి? అలాంటపుడు భూమిపై ఎందుకు ఉంటున్నాం? మైల పడటం అన్న మాటే తప్పు’ అంటూ ’మీ ఇల్లెక్కడ’ నాటకంలోని ఓ పాత్ర చేసిన హితబోధ.. మన సమాజానికి ఎప్పటికి ఎక్కుతుందో? -
శవాలకూ బిల్లేస్తున్నారు
సర్కారీ ఆస్పత్రుల్లో దుస్థితి తణుకు అర్బన్ : ఔను.. ఇది నిజం. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లోనూ శవాలకు బిల్లు వేస్తున్నారు. ఠాగూర్ సినిమాలో చూపించినట్టు వైద్యం పేరిట కాదుగానీ.. పోస్టుమార్టం ఖర్చులంటూ సొమ్ములు వసూలు చేస్తున్నారు. అడిగినంత డబ్బు ముట్టజెప్పకపోతే మృతదేహాలు శ్మశాన వాటికకు కదిలే పరిస్థితి లేదు. అనుమానాస్పద మరణాలు, విషం మింగిన కేసులు, హత్యలు, ఆత్మహత్య కేసులకు సంబంధించి మార్చురీల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రులు, భీమవరం తదితర కేంద్రాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సామగ్రి.. రసాయనాల పేరుతో.. మెడికో లీగల్ కేసులు (ఎంఎల్సీ)లుగా వ్యవహరించే అనుమానాస్పద మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి కేసులకు సంబంధించి సదరు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మృతదేహాల నుంచి గుండె, ఊపిరితిత్తులు, చిన్నపేగు, బోన్ వంటి అవయవాలను సేకరించి వాటిని రసాయనాలతో నింపిన పెట్టెల్లో భద్రపర్చి.. వాటిని కాకినాడ లేదా విజయవాడలేని ప్రాంతీయ ఫార్మాసిక్ ల్యాబొరేటరీలకు పంపించాల్సి ఉంటుంది. అవయవాలను భద్రపరిచేందుకు ప్రధానంగా ఫార్మాలిన్‌తోపాటు ఇతర రసాయనాలు, ప్లాస్టిక్ బాటిల్స్ అవసరమవుతాయి. వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇలాంటి సామగ్రి, రసాయనాలు అందటం లేదు. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు మార్చురీ సిబ్బంది మృతుల సంబంధీకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కాలువలో లభ్యమయ్యే మృతదేహాల పోస్టుమార్టం విషయంలో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతోంది. కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కు పోయి బాధతో ఉన్న వారినుంచి ఇలా సొమ్ములు గుంజటం విమర్శల పాలవుతోంది. అడిగినంత సొమ్ము ఇస్తేనే.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ణి శుభ్రంగా ఇస్తారని.. లేదంటే దానిని నిలువునా చీరేసి.. అవయవాలు బయటకు కనిపించేలా ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొమ్ములు చెల్లించలేని పేద వర్గాలకు చెందిన కొన్ని మృతదేహాలకు స్థానికంగా చందాలు వసూలు చేసి తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సుమారు 300కు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఈ తరహా వసూళ్లతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.1,500 ఇచ్చాను మా మావయ్య ఓ ప్రమాదంలో చనిపోతే శవాన్ని తణుకు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చురీలో పోస్టుమార్టం చేసే సమయంలో సిబ్బందికి రూ.1,500 ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని అడిగితే.. రసాయనాలు, సామగ్రి కొనాలని తెగేసి చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ సొమ్ము ఇచ్చాం. ఎ.రామారావు, తణుకు సరఫరా లేదు మృతదేహాల అవయవాలను భద్రపరిచి ల్యాబ్‌లకు పంపే క్రమంలో ఉపయోగించే కెమికల్స్, సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. వాటి సరఫరా లేకపోవడంతో బాధితుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చిస్తున్నా సరిపోవడం లేదు. డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
ఆ మిస్టరీల వెనుక నయీం భాయ్!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: కరుడుగట్టిన నేరగాడు... చుట్టూ మహిళా సైన్యం... టార్గెట్ చేసిన వాళ్ళను ముక్కలుగా నరికిపారేసే సంస్కృతి... గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించి ఒక్కొక్కటగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలివి. ఈ పూర్వాపరాలను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలకు నయీమ్‌తో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే రూఢీ చేయడానికి సరైన ఆధారాలు లభించాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాటి మృతదేహాల పరిస్థితులు, ఏళ్ళుగా నగర శివార్లలోనే మకాం ఉన్న నయీమ్, అతడి ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. ఆ హత్యలు–కరుడుగట్టిన నేరగాడి ప్రమేయంపై అనుమానించడానికి కారణాలు ఇవీ... కేస్–1: మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది. అనుమానాలకు కారణం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన చుట్టూ ‘గడాఫీ సైన్యాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు. యువతులు, మహిళలకు వివిధ రకాలైన సాయుధ శిక్షణలు ఇచ్చి రక్షణగా పెట్టుకున్నాడు. అంతేకాదు... అనేక దారుణ హత్యల్ని సైతం వారితోనే చేయించాడు. నిత్యం అతడి వెంటే ఉండే కి‘లేడీ’ల సహకారంతోనే తన ఇంట్లో హత్య చేసిన నదీం, నస్రీన్ మృతదేహాలను కొత్తూర్, మంచిరేవుల వరకు తీసుకువెళ్ళి పడేశాడు. మెహదీపట్నం బస్టాండ్‌లో మహిళ మృతదేహంతో కూడిన సూట్‌కేస్‌ను తీసుకువచ్చింది మహిళలే. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో కలిసి టోలిచౌకి వైపు నుంచి వచ్చారు. నయీమ్ డెన్ బయటపడిన ప్రాంతాలు ఆ మార్గంలోనే ఉన్నాయి. కేస్–2: సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్ వద్ద 2010 డిసెంబర్ 20న ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు స్పష్టమైంది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో ఈ మృతదేహం కాళ్లు లభించాయి. దీని తల ఇప్పటికీ లభించకపోగా... కేసు సైతం కొలిక్కి రాలేదు. అనుమానాలకు కారణం: పాశవిక హత్యలకు నయీమ్ కేరాఫ్ అడ్రస్. 1996లో మావోయిస్టు ఈదన్నను చంపి ముక్కలు చేసి వేర్వేరుగా విసిరేశాడు. ఆపై బెల్లి లలితను టార్గెట్ చేసిన నయీమ్ తన అనుచరులతో దారుణంగా చంపించి 16 ముక్కలు చేయించి ఎక్కడెక్కడో పడేశాడు. రామ్‌కోఠిలో లభించిన మృతదేహం పరిస్థితీ ఇదే కావడంతో పాటు నయీమ్ డెన్స్‌లో మైనర్లు సైతం ఎక్కువ మంది ఉండే వారని, నస్రీన్ అనే 17 పని పిల్లను దారుణంగా చంపేశాడని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేస్–3: వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనుమానాలకు కారణం: నయీమ్‌కు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు వనస్థలిపురం ప్రాంతంలోనూ డెన్స్ ఉన్నాయి. ఎన్కౌంటర్ తర్వాత అక్కడి నయీమ్ అనుచరుల ఇళ్ళపై దాడులు చేసిన పోలీసులు నగదు, ఆస్తిపత్రాలతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హతుడిది శివారు జిల్లాలై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ రెండు జిల్లాల్లోనూ నయీమ్‌కు విస్తృతమైన నెట్వర్క్ ఉంది. అనుచరులు, శత్రువులు, టార్గెట్లు సైతం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. -
గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలం సుందరపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం గోదావరిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. తామరపల్లికి చెందిన సాయికృష్ణ (20), వీర వెంకట పవన్ (18) మరో స్నేహితునితో కలిసి బుధవారం గోదావరిని చూసేందుకు వెళ్లారు. అయితే వీరిద్దరూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రంతా గాలించినా వీరి ఆచూకి లభ్యం కాలేదు. గురువారం ఉదయం ఇద్దరి శవాలు గట్టుకు కొట్టుకు వచ్చాయి. తమ పిల్లల ఆచూకి కోసం రాత్రంతా కళ్లు కాయలు కాసేలా నిరీక్షించిన తల్లిదండ్రులు, బంధువులు పిల్లల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. -
నీటితొట్టెలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
రామకుప్పం (చిత్తూరు జిల్లా) : రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామంలో తల్లీకూతుళ్లు నీటి తొట్టెలో శవాలై తేలారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన సరస్వతి, ఆమె కుమార్తె పవిత్ర (13)లు పొలాల్లోని నీటితొట్టెలోనిర్జీవులై ఉండగా కొందరు రైతులు శనివారం మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సరస్వతి భర్త రామకృష్ణప్ప ఆచూకీ లేకుండాపోవడంతో గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూగర్భంలోనే కార్మికుల మృతదేహాలు
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీయడం లో అసాధారణమైన జాప్యం జరుగుతోంది. గని ప్రమాదం జరిగి (గురువారం సాయంత్రం 6 గంటల వరకు) 27 గంటలు గడిచాయి. మృతదేహాలు బయట కు తీసుకురావడంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం మధ్యాహ్నం గనిలోని 52 లెవెల్ వన్ డీప్ వద్ద జంక్షన్ ఫాల్ జరగడంతో ఆర్బీసీ కార్మికులు పోల్సాని హన్మంతరావు, రమావత్ కిష్టయ్య, మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం.. బండ కింద నలిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు గురువారం కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు కూలడంతో సహాయ కచర్యలు చేపట్టడంలో రెస్క్యూసిబ్బంది శ్రమిస్తున్నారు. -
భూగర్భంలోనే ఊపిరొదిలారు
► శాంతిఖని గనిలో కూలిన పైకప్పు ► జంక్షన్ వద్ద ఘటన ► ఒకరికి గాయూలు ► ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న 20 మంది ► బండరాయి కిందనే మృతదేహాలు ► కొనసాగుతున్న సహాయక చర్యలు నిత్యం భూగర్భంలోనే పనిచేసే ముగ్గురు సింగరేణి కార్మికులే అక్కడే ఊపిరి వదిలారు. ప్రమాదవశాత్తు భూగర్భంలోని జంక్షన్ రూఫ్‌ఫాల్ (పై కప్పు కూలి) కావడంతో బండ కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. మందమర్రి ఏరియా ఏరియా శాంతిఖని గనిలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి(ఆదిలాబాద్) : బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని భూగర్భగనిలో బుధవా రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు బలయ్యూరు. ఒకరు గాయూలతో బయటపడగా సుమారు 20 మంది కార్మికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తోటి కార్మికుల కథనం ప్రకారం.. కార్మికులు ఎప్పటిలాగే మొదటి షిఫ్టు డ్యూటీకి హాజరయ్యారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం సుమారు 1.45 గం టల సమయంలో గనిలోని 52 లెవల్ వన్‌డీప్ జంక్షన్లో ఉన్న పంపు వద్దకు చేరుకుని ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని నీళ్లు తాగారు. గని రక్షణ అధికారి సంతోష్‌రావు అటు వైపు వచ్చి వెళ్లిపోయూడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా జంక్ష న్ ప్రాంతంలోని పైకప్పు(సుమారు ఐదు ఫీట్ల వెడల్పు, 14 ఫీట్ల మందం కలిగిన బండ) కూలింది. దీంతో అక్కడే ఉన్న ఆర్బీసీ(సపోర్టుమెన్)లు పోల్సాని హన్మంతరావు(58), రమావత్ కిష్టయ్య(52), మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం(53) బండ కింద నలిగిపోయూరు. కొద్ది దూరంలో ఉన్న మరో 20 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. వీరంతా కొద్ది గంటల తర్వాత ఉపరితలానికి చేరుకున్నారు. గాయపడిన జనరల్ మజ్దూర్ కార్మికుడు చీమల శంకర్ స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముమ్మరంగా సహాయక చర్యలు విషయం తెలిసిన వెంటనే మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల అధికారులు గని వద్దకు వచ్చి రామకృష్ణాపూర్ నుంచి రెస్క్యూ సిబ్బందిని రపించారు. వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కప్పు కూలిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాకీలు, ఇతర సపోర్టుల సహాయంతో బండరారుు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యూరు. గురువా రం తెల్లవారుజాము లేదా మధ్యాహ్నం వరకు బండ కింద ఉన్న కార్మికుల మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తరలివచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ప్రమాద ఘటన విషయం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ జి.వివేకానంద, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బెల్లంపల్లి ఏరియా జీఎం కె.రవిశంకర్, టీఆర్ఎస్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ నాయకులు గని వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తోటి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గనిలోకి మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారు లు, కార్మిక సంఘాల నాయకులు దిగి ప్రమాదస్థలిని పరిశీలించారు. శోకసంద్రంలో మృతుల కుటుంబాలు సింగరేణి అధికారులు సమాచారాన్ని వెంటనే చేరవేయకపోవడంతో కొన్ని గంటల పాటు మరణ వార్త సదరు కార్మిక కుటుంబాలకు తెలియలేదు. తర్వాత విషయం తెలియగానే మృతి చెందిన హన్మంతరావు, పోశం, కిష్టయ్య కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయా యి. గనిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 రోజులుగా మొత్తుకున్నా.. శాంతిఖని గని ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా కనబడుతోంది. గనిలోని 52 లేవల్, ఒకటో డీప్ జంక్షన్ వద్ద పైకప్పు నుంచి శబ్దాలు వస్తున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని కార్మికులు 15 రోజులుగా మొత్తుకున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ప్రమాదం జరిగిన స్థలంలో తాగునీటి పంపుతో పాటు మూడు కన్వేయర్ బెల్టులు, రెండు ఎస్డీఎల్ యంత్రా లు, రెండు గాలి సరఫరా చేసే ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. వీటి శబ్దాల వలన గని పైకప్పు కూలే సమయంలో సంకేతం ఏమీ వినబడకపోవ డం వల్లే కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టలేక పోయారనే అభిప్రాయా లు సైతం వ్యక్తమవుతున్నారుు. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. గనిలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా గనుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. గని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలను అన్ని రకాల ఆదుకోవాలి. - నల్లాల ఓదెలు, ప్రభుత్వ విప్ రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ముగ్గురు కార్మికులు బల య్యూరు. సింగరేణి అధికారులే బాధ్య త వహించాలి. మృతుల కుటుంబాల కు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. - వి.సీతారామయ్య, ఎస్సీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బాధ్యులను సస్పెండ్ చేయాలి ప్రమాదానికి కారకులైన సింగరేణి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఘటనకు గని మేనేజ ర్, రక్షణ అధికారి పూర్తి బాధ్యత వహించాలి. డీజీఎంఎస్ పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదం జరిగింది. గనిలో అధికారులు దిగకుండా కార్మికులను పంపి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. - రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రక్షణపై శ్రద్ధ లేకనే.. గనిలో కంటీన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టాలనే ఆతృత తప్ప గని అధికారులకు రక్షణపై శ్రద్ధ లేదు. కొద్ది రోజుల నుంచి జంక్షన్ వద్ద శబ్దం వస్తున్న ట్లు కార్మికులు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. - ఎస్.రాజమొగిళి, ఐఎన్టీయూసీ -
చెన్నైలో తవ్వే కొద్దీ శవాలు
మార్చురీల్లో పేరుకుపోతున్న మృతదేహాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: వరదలతో అతలాకుతలమైన చెన్నైలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. చెత్తాచెదారం తొలగించేటప్పుడు బయటపడుతున్న శవాలు అంత్యక్రియలకు నోచుకోక ప్రభుత్వ మార్చురీల్లో పేరుకుపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు చెన్నై చెరువులా మారిపోయింది. వరదల్లో కొట్టుకుపోయి, విద్యుదాఘాతానికి గురై వందలాది మంది మృతి చెందారు. నీటిలో గల్లంతైన వారి మృతదేహాలు కొన్ని లభ్యం కాగా, వందలాది శవాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 230 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా కనీసం వెయ్యి మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా నగరంలో పారిశుధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెత్తను తొలగిస్తున్న క్రమంలో అందులో కూరుకుపోయిన శవాలు బయటపడుతున్నాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీకి చేరుస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మృతదేహాలను భద్రపర్చలేక మార్చురీల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మార్చురీ సామర్థ్యానికి మించి శవాలు వస్తున్నాయి. మిన్నకుండిపోతున్న బంధువులు వరద నీటిలో నాని కుళ్లిపోయిన శవాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ఉబ్బిపోయిన తమవారి శవాలను గుర్తించే వీలులేదని బంధువులు మిన్నకుండిపోతున్నారు. దీంతో మార్చురీల్లో మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య పెరిగిన పక్షంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండటంతో మార్చురీల్లోని వరద మృతదేహాల సంఖ్య గోప్యంగా మారింది. మార్చురీల్లోని శవాల వివరాలు వెల్లడించ వద్దని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నోరు మెదపడం లేదు. -
బర్త్ డే రోజు అదృశ్యం.. శవమై ప్రత్యక్షం
రాయ్‌పూర్: నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు యువతులు బుధవారం ఓ డ్యామ్‌లో శవమై కనిపించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కోర్బా జిల్లా బాంగో టౌన్లో ఎరినా(23) నివాసం ఉండేది. ఆమె స్నేహితురాలు నీలు యాదవ్(22) పాలీ ప్రాంతంలో ఉండేది. ఈ నెల 5న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితురాలు నీలుతో కలిసి బయటకు వెళ్లింది. కూతురి ఆచూకీ తెలియకపోవడంతో 6న ఎరినా తండ్రి ఫిర్యాదు చేశారని పాలీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీఎస్ శర్మ తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు యువతుల మృతదేహాలు కోర్బా లోని బాంగో డ్యామ్‌లో కనిపించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి యువతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందితే యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఎవరైనా హత్య చేశారా అనేది బయటపడుతుందన్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టినట్లు సీఎస్ శర్మ వివరించారు. -
రాజమండ్రి ఆస్పత్రిలో శవ రాజకీయాలు
-
తాడేపల్లి పరిధిలో మృతదేహాలు స్వాధీనం
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మూడు మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట సమీపంలో పంటపొలాల్లో ఓ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బకింగ్‌హామ్ కెనాల్లో 30 ఏళ్ల యవకుడి మృతదేహంతోపాటు వడ్డేశ్వరంలోని ఏపీఎస్టీ క్యాంప్ సమీపంలో రహదరి వద్ద 35 ఏళ్ల వ్యక్తి మృతదేహన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుంచనపల్లి గ్రామంలో ప్రొక్లెయిన్‌తో మట్టిపెళ్లలు తొలగిస్తుండగా.. ఆ క్రమంలో 25 ఏళ్ల మహిళపై అవి పడ్డాయి. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మహిళ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యలా?..హత్యలా?
దుత్తలూరు : మండలంలోని నర్రవాడ బైపాస్‌రోడ్డు సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం వెనుక గుంతలో ఒకే కుటుంబానికి నలుగురు మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 రోజుల క్రితం వీరు ఇంటి నుంచి వెళ్లారు. అయితే గురువారం గుంతలో నలుగురి మృతదేహాలు ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించడంతో వెలుగుచూసింది. అయితే ఇన్ని రోజులు వీరు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారో కూడా తెలియనట్టుగా కుటుంబ యజమాని ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో మృతదేహాలు సైతం ఒకరిపై ఒకరు పడి ఉండటం కూడా ఆత్మహత్యలా? హత్యలా? అనే అనుమానం తలెత్తుతోంది. ఉదయగిరి మండలం నేలటూరుకు చెందిన మేడేపల్లి వెంకటేశ్వర్లు (60), చెన్నమ్మ దంపతుల కుమార్తె పద్మకు దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ మజరా గుదేవారిపాళెంకు చెందిన మద్దిపాటి హరికృష్ణతో (మేడేపల్లి చెన్నమ్మ తమ్ముడు) 18 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి హరికృష్ణ, మామ వెంకటేశ్వర్లుతో కలిసి గుంటూరులో వడ్డీ, స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో హరికృష్ణ స్వగ్రామం గుదేవారిపాళెంలో వ్యవసాయం చేసుకుందామని భార్య, మామకు చెప్పాడు. దీనికి వారిద్దరు నిరాకరించడంతో పదేళ్ల క్రితమే హరికృష్ణ వారిని గుంటూరులోనే వదిలేసి ఒక్కడే స్వగ్రామానికి వచ్చాడు. మామ వెంకటేశ్వర్లుకు వ్యాపారంలో మళ్లీ నష్టాలు రావడంతో నాలుగేళ్ల క్రితం కుమార్తె పద్మ (36), మనవరాలు శ్రావణసంధ్య(15), మనమడు శ్రావణ్‌కుమార్ (13)ను తీసుకుని గుదేవారిపాళెంలో వదిలి పెట్టాడు. వెంకటేశ్వర్లు బెంగళూరులో పని చేస్తూ అప్పుడప్పుడూ అల్లుడు, కూతురు దగ్గరికి వచ్చేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి భార్యాభర్తల నడుమ తగాదా జరుగుతుండేది. పిల్లలకు మంచి చదువు కావాలని, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని వాదోపవాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన కూతురు ఇంటికి వచ్చి నీ భర్త ఎటువంటి సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. నీ పిల్లల భవిష్యత్ ఏమిటని బాధపడేవాడు. తనతో పాటు పిల్లలను గుంటూరుకు పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తానని తెలిపాడు. ఈ విషయం పద్మ తన భర్త హరికృష్ణకు చెబితే అతను నిరాకరించాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం హరికృష్ణ పొలానికి వెళ్లగా వెంకటేశ్వర్లు వచ్చి కుమార్తె, మనమరాలు,మనమడును తీసుకుని గుంటూరుకు వెళ్తున్నామని చుట్టు పక్కల వారికి చెప్పి వెళ్లారు. అయితే హరికృష్ణ మిన్నకుండిపోయాడు. కాగా, గురువారం నర్రవాడ బైపాస్ ప్రాంతంలో గొర్రెల కాపరి గొర్రెలు మేపుతుండగా ఆ ప్రాంతం నుంచి భరించలేని దుర్వాసన వచ్చింది. కలియ చూడగా గుడి వెనుక ఉన్న చెన్నయ్యగుంతలో కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు శవాలను గమనించి స్థానికులకు సమాచారమందించాడు. ఈ విష యం దావనంలా వ్యాపించింది. అయితే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లి శిథిలం కావడంతో గుర్తుతెలియన మృతదేహాలుగా భావించారు. స్థానికులు మృతదేహాలను పరిశీలించి గుదేవారిపాళెంకు చెందినవారివిగా గుర్తించారు. సంఘటన స్థలంలో విషగుళికల ప్యాకెట్, కూల్‌డ్రింక్ ఖాళీ బాటిల్ ఉన్నాయి. దీన్ని బట్టి వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావి స్తున్నా.. ఇన్ని రోజులుగా భార్యా బిడ్డలు కనిపించకపోయినా భర్త వారి ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, దుత్తలూరు ఎస్సై సైదులు సంఘటన స్థలాన్ని పరిశీలించి హరికృష్ణ వద్ద ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు మృతి చెందటం చూసి పలువురు చలించి పోయారు. శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం నర్రవాడ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, శ్రావణసంధ్య గత సంవత్సరం దుత్తలూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివింది. ఈ సంవత్సరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఎక్కడా చేరలేదని సమాచారం. -
మృతులను గౌరవించాలి
ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి 30 కార్పస్ క్యారీ బ్యాగ్స్ అందించిన ఏఎస్పీ శ్రీహరి గుంటూరు క్రైం : మృతదేహాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహాలను విదేశాల తరహాలో గౌరవంగా తరలించేందుకు ఐటీ కోర్ ఏఎస్సై కొట్టే శ్రీహరి రూపొందించి తీసుకొచ్చిన కార్పస్ క్యారీ బ్యాగ్‌లను శనివారం ఆయన పరిశీలించారు. గుర్తు తెలియని మృతదేహాలను చాపలు, పాత గోతాలు, ఫ్లెక్సీల్లో చుట్టి తరలించడం లాంటి ఘటనలను చూసి చలించిన ఏఎస్సై ఇంటర్ నెట్లో పరిశీలించి ఖర్చుకు వెనుకాడకుండా కార్పస్ క్యారీ బ్యాగ్ (మృతదేహాలను తరలించే సంచి)లను తయారు చేశారు. 30 బ్యాగ్‌లను శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి అందజేశారు. వాటిని తిలకించిన ఎస్పీ ఏఎస్సైని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో వున్న మృతదేహాలనైనా తరలించ డానికి కార్పస్ క్యారీ బ్యాగ్‌లు ఎంతగానో దోహద పడతాయని చెప్పారు. 30 బ్యాగులను గుర్తు తెలియని మృతదేహాలు అధికంగా వుండే తాడేపల్లి, కొత్తపేట, గుంటూరు రూరల్ (నల్లపాడు), మేడికొండూరు పోలీస్స్టేషన్లకు కేటాయిస్తామని తెలిపారు. వారంలో మరో 70 అందజేస్తా.. మృతదేహాలను తరలిస్తున్న విధానంలో మార్పు తీసుకురావాలనే కార్పస్ క్యారీ బ్యాగ్‌లను రూపొందించానని ఏఎస్సై శ్రీహరి చెప్పారు. రెండు నెలలు శ్రమించి నల్ల చెరువుకు చెందిన ఓ దర్జీ సహకారంతో వీటిని రూపొందించానని తెలిపారు. మరో వారం రోజుల్లో ఇంకో 70 రూపొందించి అందజేస్తానని ఎస్పీకి వివరించారు. మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరిస్తే దర్యాప్తు సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. బ్యాగ్‌లను సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ జే భాస్కరరావును ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో డీస్పీలు బి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్, సీఐ కే.శ్రీనివాసరావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రెప్పల మాటున ఉప్పెన
లోకేష్, రాజు మృతదేహాలు లభ్యం విజయ్ కోసం బంధుమిత్రుల గాలింపు తుదిలేని కుటుంబ సభ్యుల కన్నీటి వేదన సాగర్‌నగర్(విశాఖపట్నం) : కన్నవారికి కడుపు కోత మిగులుస్తూ గురువారం గల్లంతైన బి.లోకేష్, పి.రాజు మృతదేహాలు సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న తీరంలో శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన వీరు జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానానికి దిగి కెరటాలకు బలైన విషయం తెలిసిందే. వీరితోపాటు గల్లంతైన ఆకుల విజయకాంత్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు తీరం వెంబడి గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కుప్పకూలిన తల్లిదండ్రులు చెట్టంత కొడుకులు ప్రయోజకులవుతారని, అండగా ఉంటారని ఆశించిన కన్నవారి కలలు కల్లలయ్యాయి. లోకేష్, రాజు మృతదేహాలు లభించడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా పెద్దపెట్టున రోదించారు. క్షేమంగా ఉన్నారేమో.. ఎలాగైనా తిరిగి వస్తారేమోనని మిణుకుమిణుకుమంటున్న చిన్నపాటి ఆశ కూడా చెదిరిపోవడంతో కుప్పకూలిపోయారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని ఆనందిస్తున్న సమయంలో విధి తమపై చిన్నచూపు చూసిందని లోకేష్ నాన్నమ్మ చంద్రవతి వాపోయింది. రాజు తల్లిదండ్రుల పరిస్థితీ అలాగే ఉంది. స్నేహితులతో సరదాగా వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడన్న ఆశంతా ఆవిరైపోయిందని... మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుతో విలపిస్తున్నారు. మృతదేహాలకు పీఎం పోలీస్‌ల ఆధ్వర్యంలో పంచనామా చేసి కేజీహెచ్‌కు తరలించారు. విజయ్ కోసం ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గాలిస్తున్నారు. తొందరగా వచ్చేస్తానన్నాడు నైట్ డ్యూట్ చేసి ఇంటికొచ్చాను. టిఫిన్ చేస్తుండగా బయలు దేరాడు. తొందరగా వచ్చేస్తాను నాన్నా.. అని స్నేహితులతో కలిసి వెళ్లాడు. మరి తిరిగిరాడనుకోలేదు. చిన్నోడని గారాబంగా పెంచాను. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. -బి.వి.వి.రామారావు, లోకేష్ తండ్రి తమ్ముడూ... ఎక్కడున్నావు? విజయ్‌కాంత్ మృతదేహం కోసం తెల్లవారుజాము నుంచి పదిమంది స్నేహితులం గాలిస్తున్నాం. ఎక్కడా లభించలేదు. తెన్నేటిపార్కు, జాలరీపేట, సాగర్‌నగర్, తిమ్మాపురం బీచ్ వరకు వెదుకుతున్నాం. - లక్ష్మణ్, విజయ్‌కాంత్ అన్న, ఆరిలోవ -
సువర్ణముఖి నది నుంచి మృతదేహాలు వెలికితీత
విజయనగరం : సువర్ణముఖి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురి మృతదేహాలను స్థానికులు గురువారం వెలికి తీశారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం తోటపల్లి గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో బుధవారం స్థానికులు కృష్ణ (40)తో పాటు అతడి మేనల్లుళ్లు నాగేంద్ర (10) మహేంద్ర (11)లు స్నానానికి దిగారు. ఆ క్రమంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు పిల్లలిద్దరూ నదిలో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మేనమామ కృష్ణ... వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో అతడు కూడా గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నదిలో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో గురువారం ఉదయం సంఘటన స్థలానికి 200 మీటర్ల దూరంలో మృతదేహాలను కనుగొన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరెస్ట్‌పై శవాల గుట్టలు
-
3 మృతదేహాలు ఢీల్లీకు తరలింపు
-
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
-
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేలకు పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. వేలమంది ప్రజలు గడ్డకట్టిన చలిలోనే వణికిపోతూ.. రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు. ఈ తీవ్ర ధాటికి భారత్‌లోనే 53 మంది మృతి చెందగా.. 240 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. -
శేషాచలం ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
-
సమస్యల వలయంలో రాజావాడి ఆస్పత్రి
సాక్షి, ముంబై: నగరంలో శవాలను భద్రపరిచే రాజావాడి ఆస్పత్రి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 27 ఏళ్ల కిందట నిర్మించిన ఈ కేంద్రం పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థకు చేరుకుంది. రోజురోజుకు శవాల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రి సామర్థ్యం మాత్రం పెరగలేదు. గతంలో కొలాబా, బాంద్రా, వడాల ప్రాంతంలోని మృత దేహాలను పోస్టుమార్టం కోసం జే.జే.ఆస్పత్రిలోని కెరోనరీ కోర్టుకి తీసుకొచ్చేవారు. బాంద్రా, దహిసర్ ప్రాంత మృతదేహాలను కూపర్ ఆస్పత్రికి, వడాల, ములుండ్ ప్రాంత మృత దేహాలను రాజావాడికి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. కాగా 1999 జూలై 26న కెరోనరీ కోర్టును మూసివేసి పోలీసు శాఖకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం రాజావాడి ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పాడవుతున్న ర్యాక్‌లు...సిబ్బందికి ఇబ్బంది 1988లో నిర్మించిన ఈ కేంద్రంలో 45 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉంది. 21 పోలీసు స్టేషన్ల పరిధి నుంచి మృత దేహాలు ఇక్కడికి తీసుకొస్తారు. శవాలను భద్రపరిచేందుకు ర్యాక్‌లు ఖాళీ లేకపోవడంతో అత్యవసర సమయంలో నేల పైనే ఉంచాల్సివస్తోంది. దీంతో సిబ్బందికి ఇబ్బందులు పడుతున్నారు. అనాథ శవాలను ఎక్కువరోజులు భద్రపరచాల్సి వస్తోందని, దీంతో ర్యాక్‌లు పాడైపోతున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఆస్పత్రిలోని ఏసీ యంత్రాలు కూడా పాతకాలం నాటివి కావడంతో తరుచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన ఈ కేంద్ర స్థలం అద్దె విషయంపై బీఎంసీ, హోం శాఖ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది. ఇప్పటికైనా ఆస్పత్రి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రివర్గాలు కోరుతున్నాయి. -
ఇద్దరు చిన్నారుల దుర్మరణం
శనిగకుంట(మంగపేట) : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. చెరువులో నీట మునిగి ఇద్దరు బాలికలు మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికల తల్లిదండ్రుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంకిడి రాంబాబు, సత్యవతి దంపతుల కూతురు శ్రుతిలయ(8), యాలం లక్ష్మీనారాయణ, సుమలత దంపతుల కూతురు శ్వేత(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. ఇదే గ్రామ శివారులోని చెరువులో కొద్దిరోజులుగా కొందరు గ్రామస్తులు చేపలు పడుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వర్రావు మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలను మూసివేసి శనివారం తిమ్మంపేటలో జరిగిన స్కూల్‌కాంప్లెక్స్ మీటింగుకు వెళ్లాడు. దీంతో తమ కుటుంబ సభ్యులు చెరువులో పడుతున్న చేపలను చూసేందుకు కొందరు విద్యార్థులు వెళ్లగా వారితో శ్రుతిలయ, శ్వేత కూడా వెళ్లారు. ఇంటిపై కప్పుకునే ఎట్టె గడ్డిని కోసేందుకు వెళ్లిన శ్రుతిలయ తల్లి సత్యవతి వారిద్దరిని చూసి చెరువుకు ఎందుకు వచ్చారని మందలించి ఇంటికి వెళ్లండని హెచ్చరించింది. దీంతో వారు వెనక్కి తిరగడంతో ఇంటికి వెళ్లారని భావించిన సత్యవతి సాయంత్రం వరకు పనిముగించుకుని ఇంటికి చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు బాలికలు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో ఎవరింటి వద్దరుునా ఉన్నారనే అనుమానంతో రాత్రి 10 గంటల వరకు ఊరంతా వెతికారు. అరుునా ఆచూకీ లభ్యం కాకపోవడంతో చెరువులో పడి ఉంటారా ? అనే అనుమానంతో బాలికల తల్లిదండ్రులు గ్రామస్తులతో రాత్రి 10.30 గంటల నుంచి నీటిలో వెతకగా రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యూరుు. సమాచారం అందుకున్న మంగపేట డిప్యూటీ తహసీల్దార్ పుల్యాల రాజయ్య, ఎస్సై ముస్కెం శ్రీనివాస్. ఏఎస్సై పిట్ట శ్యామ్‌సుందర్ వీఆర్వో ఎస్కే మున్వర్ ఆదివారం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని పంచనామా చేశారు. షాక్‌తో మృతిచెందారని మృతుల తల్లిదండ్రుల అనుమానం గ్రామంలోని కొందరు కొద్ది రోజులుగా కరెంటుతో చెరువులో చేపలు పడుతున్నారని, ఈ క్రమంలోనే చెరువులోకి దిగిన తమ పిల్లలు విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉంటారని శ్రుతిలయ తల్లిదండ్రులు మంకిడి రాంబాబు, సత్యవతి అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఒడ్డు వెంట చనిపోరుున చేపలు ఏరుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోపడి మృతిచెందారా ? లేక చేపల వేటకు వినియోగించిన కరెంటు షాక్‌తో మృతి చెందారా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ముక్కుపచ్చలారని చిన్నారులు చెరువులో పడి మృతిచెందిన సంఘటనతో శని గకుంట గ్రామంలో శనివారం అర్ధరాతి నుంచి ఆదివారం ఉదయం వరకు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇక బీఎంసీ ఆస్పత్రుల్లో పోస్ట్‌మార్టం
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకవేళ రోగీ చనిపోతే పోస్టుమార్టం కోసం ఇతర ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పని లేదు. అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం పనులు పూర్తి చేసి శవాన్ని బంధువులకు అప్పగించనున్నారు. దీంతో ఇటు మృతుని బంధువులు, అటు విధినిర్వహణలో ఉన్న పోలీసుల శ్రమ పూర్తిగా తగ్గనుంది. బీఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లు, అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదు. కొన్ని అస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో సమయాభావం, సిబ్బంది కొరత వల్ల అక్కడ శవాలు క్యూలో ఉంటాయి. దీంతో వైద్యులకు పని భారం ఎక్కువై మరసటి రోజు శవ పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు ఆస్పత్రుల్లో శవ పరీక్ష పనులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జరుగుతాయి. దీంతో మృతుల బంధువులు గంటలకొద్దీ ఆస్పత్రుల్లో పడిగాపులు పడాల్సి ఉంటుంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇదే పరిస్థితి పోలీసులకు కూడా ఎదురైతుంది. బీఎంసీ ఆస్పత్రుల్లో శవ పరీక్ష నిర్వహించేందుకు సంబంధించిన సర్క్యులర్ రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. -
వేధింపులకు తల్లీకూతురు బలి
⇒ కొడుకు పుట్టలేదని వివాహితకు చిత్రహింసలు ⇒ పుట్టింటి నుంచి ఇంటికొస్తే చంపేస్తామని బెదిరించిన భర్త, అత్త ⇒ ఏడాది కూతురు సహా బావిలో దూకి బలవన్మరణం ⇒ ధారూరు మండలం అవుసుపల్లిలో విషాదం ⇒ వివరాలు సేకరించిన డీఎస్పీ, తహసీల్దార్ ధారూరు: వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. మగపిల్లాడు పుట్టలేదని భర్త, అత్త చిత్రహింసలకు గురిచెయ్యడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో సహా బావిలో దూకి తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలోని అవుసుపల్లిలో చోటచేసుకుంది. వికారాబాద్ డీ ఎస్పీ స్వామి, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొల్ల అలిమా(25)ను మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లి నివాసి గాజుల లాల్ మహ్మద్ 2007లో వివాహం చేసుకున్నాడు. రూ. 30 వేల నగదు, 3 తులాల బంగారం, ఇతర సామగ్రిని అలిమా కుటుంబీకులు కట్నంగా ఇచ్చారు. లాల్ మహ్మద్ ఓ కిరాణ కొట్టు నడిపిస్తున్నాడు. తరచూ పూనకం ఊగుతూ జనాల నుంచి డబ్బులు లాగుతుంటాడు. దంపతులకు కూతురు ముస్కాన్(5) ఉంది. ఏడాది క్రితం రెండో సంతానంగా నూర్జహాన్(1)పుట్టింది. కొడుకు పుడుతాడని ఆశించిన అలిమా భర్త లాల్ మహ్మద్, అత్త బొగ్దాద్‌బీ తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వారు అలిమాను వదిలించుకోవాలని భావించారు. తన కొడుకు లాల్ మహ్మద్‌కు రెండో వివాహం చేయాలని బొగ్దాద్‌బీ పథకం వేసింది. 15 రోజులుగా అలిమాను భర్త, అత్తలు వేధిస్తూ కొట్టడం ప్రారంభించారు. నిత్యం చిత్రహింసలు పెడుతూ ప్రత్యక్ష నరకం చూపించసాగారు. ‘నువ్వు చస్తే నా కొడుకుకు వేరే పెళ్లి చేస్తాను.. అప్పుడు కొడుకు పుడుతాడు.. నువ్వు చావకుంటే మేమే చంపుతాం’ అంటూ అత్త బొగ్దాద్‌బీ బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న అలియా సోదరులు, కుటుంబీకులు వారం రోజుల క్రితం రాళ్లచిట్టెంపల్లికి వెళ్లి పంచాయతీ పెట్టాలని యత్నించారు. వారిని అలియా భర్త, అత్తలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. మంగళవారం తిరిగి అలిమాను భర్త, అత్త కలిసి చితకబాదారు. పుట్టిల్లు అయిన అవుసుపల్లిలో తల్లిదండ్రులు, కుటుంబీకులు లేని సమయంలో వదిలేసి వెళ్లారు. తిరిగి రాళ్లచిట్లెంపల్లికి వస్తే చంపేస్తామన్నారు. జీవితంపై విరక్తి చెందిన అలిమా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో బుధవారం గ్రామ సమీపంలో బావులెక్కడెక్కడ ఉన్నాయోనని వెతికింది. రాత్రి గ్రామంలోని తన మేనమామ దస్తుమియా ఇంట్లో నిద్రించింది. గురువారం ఉదయం 7 గంటల సమయంలో అలిమా బహిర్భూమికి వెళ్తానని తన కూతురు నూర్జహాన్ ఎత్తుకొని బయలుదేరింది. బంధువు సాబేరా అనుమానించి ఆమె వెంట వెళ్లేందుకు యత్నించింది. స్నానం చేస్తాను షాంపూ కావాలని అలిమా ఆమెకు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లింది.అలిమా గ్రామ శివారులోని ఆశయ్య బావికి వెళ్లింది. ముందుగా తన కూతురు నూర్జహాన్ను బావిలో తోసేసి అనంతరం తనూ దూకింది. కొద్దిసేపటి తర్వాత సాబెరా అలిమా కోసం గాలించగా బావిలో తల్లీకూతురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు మృతదేహాలు వెలికితీశారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ స్వామి, ధారూరు తహసీల్దార్ విజయ, సీఐ రంగా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలిమా శరీరంపై గాయాలు కనిపించాయి. అలిమా పెద్దకూతురు ముస్కాన్ రాళ్లచిట్లెంపల్లిలో ఉండడంతో తను ప్రాణాలతో బయటపడింది. తను చనిపోతే ఏడాది వయసున్న కూతురు నూర్జహాన్ దిక్కులేనిది అవుతుందని భావించిన అలిమా పాపను కూడా తనతో పాటు తీసుకెళ్లిందని మృతురాలి బంధువులు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం అత్తింటి వారు అన్నంలో క్రిమిసంహారక మందును కలిపి అలిమాకు తినిపించేందుకు యత్నించగా, రెండు ముద్దలు తిన్న ఆమె వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కాగా అలిమా మతిస్థిమితం కోల్పోయిందని చిత్రీకరించి పలు మాత్రలు కూడా మింగించారన్నారు. ఆమెను గుప్త నిధుల కోసం బలిచ్చేందుకు కూడా యత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. పరారీలో భర్త, అత్త.. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. తల్లీకూతురి ఆత్మహత్యకు కారణమైన లాల్ మహ్మద్, అతడి తల్లి బొగ్దాద్బీపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని డీఎస్పీ స్వామి పేర్కొన్నారు. ఈమేరకు మోమిన్‌పేట సీఐ రంగా ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగుతుందని తెలిపారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు సందర్శించి వివరాలు సేకరించారు. -
నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
⇒ 20న అదృశ్యమై.. నదిలో శవాల్లా తేలారు.. ⇒ అనారోగ్యమే కారణం అంటున్న బంధువులు ⇒ కూతురు మృతిపై అనుమానాలు ⇒ ప్రమాదవశాత్తూ మరో వృద్ధురాలి మృతి ⇒ మృతులంతా విజయవాడ వాసులు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణా రైల్వే బ్రిడ్జి దిగువన కృష్ణానదిలో గురువారం ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే బ్రిడ్జి కింది భాగంలో 7వ ఖానా వద్ద ఒక మహిళ, ఒక బాలిక మృతదేహాలను మత్య్సకారులు గుర్తించారు. అలాగే ఆంజనేయస్వామి దేవాలయం పుష్కరఘాట్ కింద భాగంలో నీటిలో తేలాడుతున్న వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులని పోలీసులు తొలుత భావించారు. తాడేపల్లి సీఐ ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాల వీడియో క్లిప్పింగ్‌లను విజయవాడ పోలీసులకు పంపారు. సమాచారం అందుకున్న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన రెండు మృతదేహాలు విజయవాడ అయోధ్యనగర్‌లో ఈ నెల 20న అదృశ్యమైన మహిళ మంత్రి ఈశ్వరమ్మ (33) ఆమె కుమార్తె రాధ(11)విగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్ రైల్వే గేటు పక్కన సూర్యకాలనీకి చెందిన మంత్రి ఈశ్వరమ్మ భర్త అప్పలనాయుడు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుంచి అదే ప్రాంతంలో పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడిని కొంతకాలం కిందట ఊర్మిళానగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉంచింది. కుమార్తెను ఆమె దగ్గరే ఉంచుకుని స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. ఏం జరిగిందో తెలియదు గానీ, 20వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి వచ్చిన తల్లీకూతుళ్లు కృష్ణానదిలో శవమై కన్పించారంటూ ఈశ్వరమ్మ మరిది రామారావు పోలీసులకు తెలిపారు. ఆమెకు ఆరోగ్యం సరిగాలేదని యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లతో ఎలా బతకాలి అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బంధువులు చెబుతున్నారు. కుమార్తె మృతిపై అనుమానాలు? అయితే కుమార్తె రాధిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక నాలుక బైటకు వచ్చి పల్లతో నొక్కబడి ఉంది. సహజంగా ఉరి వేసుకున్నప్పుడో, గొంతు నులిమి చంపినప్పుడో మాత్రమే ఇలా నాలుక బైటకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బహుశా తల్లి ఈశ్వరమ్మ కూతురు రాధికను గొంతు నులిమి కృష్ణా నదిలోకి పడేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా తల్లిని ముందు నదిలో తోసి కుమార్తె గొంతు నులిమి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఘటనలో వృద్ధురాలు.. ఆంజనేయస్వామి గుడి ఎదురు పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో లభించిన వృద్ధురాలి మృతదేహం విజయవాడ గాంధీనగర్‌కు చెందిన మాసెట్టి స్వరాజ్యలక్ష్మి (85)గా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం గుడి కి అని చెప్పి ఇంటినుంచి తిరిగి రాలేదని కొడుకు కోటేశ్వరరావు తెలిపారు. వెతుకుతుండగా నదిలోమునిగి మృతి చెందినట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తన తల్లికి గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేదని గుడికి వెళ్లేముందు కృష్ణానదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటుందని ఆయన చెప్పాడు. -
ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే...
* సిద్దిపేటకు చెందిన ప్రేమ జంట హైదరాబాద్‌లో ఆత్మహత్య * అల్వాల్ రైల్వేట్రాక్ వద్ద కనిపించిన మృతదేహాలు సిద్దిపేట రూరల్/అర్బన్: తెలిసీతెలియని వయసులో ఓ అమ్మాయి.. మరో అబ్బాయి మదిలో రూపుదాల్చిన ‘ఆకర్షణ’ మొగ్గలు.. ప్రేమ పేరుతో పువ్వులుగా వికసించాయి. అది ఆకర్షణో..? ప్రేమో..? తెలుసుకునే లోపే వీరిని ఆవహించిన ఆందోళన భూతం ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ఫలితంగా నవమాసాలు మోసిన తల్లులకు.. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రులకు తీరని శోకం మిగిలింది. ఆ యువ జంట నడుమ చోటు చేసుకున్న నాలుగు నెలల పరిచయం.. ప్రేమగా మారింది.. వివాహం చేసుకుందామంటే కులం, పెద్దరికం అడ్డుగా నిలిచాయి.. ఇంట్లో వారిని ఒప్పించలేక.. విడిగా ఉండలేక ఆ ప్రేమికులిద్దరూ ఈ లోకాన్నే వదిలేశారు. తమ ప్రేమను నిరాకరించిన తల్లిదండ్రులకు కోలుకోలేని శిక్ష విధించారు. సిద్దిపేటకు చెందిన విజయ్ (20), మాధవి (18) బుధవారం హైదరాబాద్‌లోని అల్వాల్ వద్ద రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు వదిలారు. నాలుగు నెలల పాటు ఆశల పల్లకీలో ఊరేగిన ప్రేమ ప్రయాణం.. రైలు పట్టాలపై వీరిని విగత జీవులుగా మిగిల్చింది. మృతులిద్దరూ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే వారు. ప్రేమ జంట మరణవార్త సిద్దిపేటవాసులను కలచివేసింది. కన్నబిడ్డలను కోల్పోయిన వారి రోదనలతో మోయిన్‌పురా, గణేష్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం
-
అనాథలనా..!
కావలి: ఏ తల్లి కన్నబిడ్డలో వారు..కాలం తీరిపోయి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆఖరి మజిలీలో ఆరడగుల గుంతలో ప్రశాంతంగా నిద్రించే అదృష్టానికి కూడా నోచుకోలేని దురదృష్టవంతులు వారు. చివరకు పందులు, కుక్కలకు ఆహారంగా మారుతున్నారు. కావలి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే వారికి ఆ గతి పడుతోంది. అనాథ మృతదేహాలనే ఉద్దేశంతో ఖననం చేయకుండానే శ్మశానంలో ఓ మూలన పడేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. కావలి పరిసర ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన గుర్తుతెలియని వారి మృతదేహాలను పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తుంటారు. అనారోగ్యంతో మృతిచెందిన వారు, రైలు, రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసిన వారి మృతదేహాలు ఏరియా ఆస్పత్రికి చేరుతుంటాయి. వారి తాలుకూ కుటుంబసభ్యులు, బంధువుల కోసం కొద్ది రోజుల పాటు ఎదురుచూసి ఎవరూ రాని సందర్భాల్లో ఖననం చేసేందుకు మున్సిపాలిటీకి అప్పగిస్తారు. అయితే మున్సిపాలిటీ సిబ్బందిలో కొందరు మానవత్వాన్ని మరుస్తున్నారు. అనాథల మృతదేహాలను రాత్రివేళలో తీసుకొచ్చి వైకుంఠపురం హిందూ శ్మశానవాటికలో వదిలేస్తున్నారు. వాటిని పందులు, కుక్కలు పీక్కు తినడం గమనించిన స్థానికులు విలవిలలాడిపోతున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు అప్పుడప్పుడూ మృతదేహాల భాగాలను కుక్కలు తీసుకొచ్చి ఇళ్ల మధ్య పడేస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మున్సిపల్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠపురం మధ్యలో ఉన్న ఈ శ్మశాన వాటిక మీదుగానే పెంకుల ఫ్యాక్టరీ గిరిజనకాలనీ, చెరువుకట్ట సంఘం, కావలి పెద్దచెరువు వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. కుళ్లిపోయిన మృతదేహాల నుంచి వెదజల్లుతున్న వాసనతో వారు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనాథల మృతదేహాలను ఖననం చేసేలా చర్యలు చేపట్టాలని కావలి వాసులు కోరుతున్నారు. ఈ సమస్యను కావలి మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. -
పడారుపల్లి శివారులో వ్యక్తి దారుణహత్య
నెల్లూరు(క్రైమ్): ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు పడారుపల్లిలోని శివారులో జాతీయ రహదారికి సమీపంలో ముళ్లపొదల్లో దుర్గంధం వెదజల్లుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 5.5 అడుగుల ఎత్తులో ఉన్న మృతుడు చామనఛాయ రంగులో, గడ్డంతో ఉన్నాడు. ముళ్లపొదల్లో కేవలం బనియను, డ్రా యర్‌తో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. సమీపంలో మృతుడి ప్యాంటు, చొక్కా గుర్తించారు. గొంతు కోయడంతో పాటు ఛాతిపై ఆయుధంతో నరికిన ఆనవాళ్లు, చేతివేళ్లు తెగివున్నా యి. ఘటనా స్థలానికి కొద్దిదూరం వరకు రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి. ఎక్కడో హతమార్చి.. ఘటన స్థలంలోని పరిస్థితుల ప్రకారం ఆ వ్యక్తిని ఎక్కడో హత్యచేసి జాతీయ రహదారికి సమీపంలోని ఈ ప్రాంతంలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుండటంతో హత్య జరిగి రెండు రోజులైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కత్తి లేదా గొడ్డలితో బలంగా నరకడం, పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్యచేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. హత్యచేసే సమయంలో చేతులు అడ్డం పెట్టడంతో చేతి వేళ్లు తెగి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం మృతదేహం వద్ద నుంచి సమీపంలోని జాతీయ రహదారి వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. దీనిని బట్టి ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారనే అనుమానం బలపడుతోంది. క్లూస్‌టీం ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుబయటే పోస్టుమార్టం
మెదక్ రూరల్ :పేరుకే డివిజన్లో పెద్దాస్పత్రి. ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. ముఖ్యంగా గదులు సమస్య వేధిస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతదేహాలకు ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. ఒక వేళ అనాథ మృతదేహాలు వస్తే వాటిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు. దీంతో సచ్చినా కష్టాలు తప్పడం లేదు. మెదక్ ఏరియా ఆస్పత్రికి మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, చేగుంట, కౌడిపల్లితో పాటు పలు పీహెచ్‌సీల నుంచి ప్రజలు చికిత్సల నిమిత్తంతో పాటు ప్రమాదాల్లో మరణిస్తే పోస్టుమార్టం కోసం ఇక్కడికి రావాల్సిందే. కానరాని సౌకర్యాలు... మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఓ గదిని కేటాయించారు. కానీ అది చాలా ఇరుకుగా ఉంది. కనీసం అందులోకి గాలి, వెలుతురు కూడా రాని పరిస్థితి. మరో ఇరుకు గదిలో శవాలను భద్రపరిచే ఒక ఫ్రీజర్ ఉంది. అది దశాబ్దాల క్రితం చెడిపోవడంతో అది కూడా మూలన పడింది. దీంతో గత్యంతరం లేక ఆరు బయటనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేక పోవడంతో బయట నుంచి బకెట్లలో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్టుమార్టం మృతదేహాలను బద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్ల, (మార్చురీ) యూనిట్ లేదు. పోస్టుమార్టం చేయాలి అంటే రెండు పెద్ద సైజు బెంచీలతో పాటు విశాలమైన గది ఉండాలి. అదే గదిలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలను భద్ర పరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో ఉండాలి. గదిలో మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు వాడే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఏరియా ఆస్పత్రిలో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు. దీంతో అనాథ మృతదేహాలను రోజుల తరబడి ఓ గదిలో ఉంచ డంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఈ సమస్యను గతంలోనే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిధులు మంజూరైతే విశాలమైన గదితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
‘చావు’కొచ్చింది !
►ప్రకాశం బ్యారేజీ, కృష్ణాతీరంలో తేలుతున్న మృతదేహాలు ►బయటకు తీసింది మొదలు భద్రపరిచే వరకు ‘భారం’ ►గుర్తుతెలియని మృతదేహాలతో నానా ఇక్కట్లు.. ►జేబులు గుల్లవుతున్నాయని తాడేపల్లి పోలీసుల గగ్గోలు తాడేపల్లి రూరల్: మృతదేహం అంటేనే తాడేపల్లి పోలీసులు ఠారెత్తిపోతున్నారు. కృష్ణానదిలో తేలే ప్రతి మృతదేహాన్ని బయటకు తీసింది మొదలు పంచనామా, పోస్టుమార్టం, అనంతరం బంధువులు వచ్చేవరకు భద్రపరచడం ఇవన్నీ పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. వీటి కోసం శాఖా పరంగా ఎలాంటి నిధులు లేకపోవడంతో చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఈ డ్యూటీ అంటేనే భయపడిపోతున్నారు. కృష్ణాతీరం, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు పెరిగాయి. వీటికి తోడు రోడ్డు ప్రమాదంలో మృతులకు, ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా పోలీసులే పోస్టుమార్టం చేయించాల్సి వస్తోంది. ఏడాదిలో తాడేపల్లి పోలీసులు 70కి పైగా మృత దేహాలకు పంచనామా జరిపి, పోస్టుమార్టం చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా గుర్తుతెలియని మృతదేహాలతోనే వారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ►ఈ నెలలో ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులు 18 మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. పంచనామాలు, పోస్టుమార్టాలు రోజువారీ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కానిస్టేబుళ్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ►గుర్తు తెలియని మృతదేహాలతోనే పోలీసులు ఇబ్బందుల పాలవుతున్నారు.కుళ్లిన మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీసే సమయంలో పోలీసుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ►దుర్వాసన తట్టుకోలేక ఆ మృతదేహాలను బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ‘మందు’ పోయించకుండా పని జరగదు. దీని కోసం పోలీసులు తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ►కృష్ణా నది ఇసుక తిన్నెల్లో నుంచి మృతదేహాలను రోడ్డుపైకి తెచ్చి మార్చురీకి తరలించేందుకు ఏ వాహనదారుడు ముందుకు రావడం లేదు. పోలీసులు బెదిరించి తీసుకు వచ్చినా, నాలుగొందలో ఐదు వందలో వదిలించుకోవాల్సి వస్తోంది. ►ఇక మృతదేహం ఉందని తెలియగానే కేసు దర్యాప్తునకు వచ్చే అధికారులకు మర్యాద చేయడం కూడా పోలీసులకు అదనపు భారంగా మారింది. ►ఇలా అన్నీ పూర్తి చేసి ఒక్కో మృతదేహాన్ని మార్చురీకి తరలించాలంటే సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వీటి కోసం నిధులు ఏమీ లేకపోవడంతో ఈ భారం కానిస్టేబుళ్లపైనే పడుతోంది. ►గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరచడం పోలీసులకు తలకు మించిన పని అవుతోంది. ►కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. కుటుంబీకులు, బంధువుల కోసం ఇలాంటి మృతదేహాలను ఎక్కువ రోజులు భద్రపరచాల్సి వస్తోంది. దీని కోసం ఏసీ మార్చురీ రూములు అవసరం అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ►తాడేపల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను మంగళగిరి పంపిస్తుంటారు. అక్కడ పోస్టుమార్టం గదిలో తలుపులు ఊడిపోయి, కిటికీలకు చెక్కలు ఊలిపోయి, ఎలుకలు, పందికొక్కులే కాక, నక్కలు, కుక్కలు యథేచ్ఛగా మృతదేహాలను భక్షించేందుకు అనువుగా ఉంటుంది. పోనీ, దగ్గరలో ఉన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పంపిద్దామంటే ‘సరిహద్దు’ సమస్య. ►ఇక మిగిలింది గుంటూరు ప్రభుత్వాసుపత్రే. అక్కడకు పంపించాలంటే మరో మూడు వేలు అదనపు ఖర్చు అవుతుంది. దీంతో మృతదేహాల తరలింపు డ్యూటీలంటే నే పోలీసులు భయపడిపోతున్నారు. -
కన్నీటిని ఆపేదెవరు?
సాక్షి, గుంటూరు : గుంటూరు-విజయవాడ సరిహద్దులో కృష్ణానది తీరం వెంబడి వున్న ఇసుక తిన్నెల్లో కూర్చోవాలనీ, ఊసులాడుకోవాలనీ ని త్యం పలు జంటలు, మహిళలు,విద్యార్థినులు వస్తుంటారు. వీరిలో కొందరు కృష్ణానదిలో మృతదేహాలుగా తేలుతున్నారు. తాడేపల్లి మండలం సీతానగరం, కనకదుర్గమ్మ వారథి, ఉండవల్లి ఇసుక రేవు, కొండవీటివాగు, బకింగ్ హామ్ కెనాల్ వంటి ప్రాంతాల వద్ద పలువురు నదిలో దూకి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏడాదిలో సుమారు 150 మంది ఇక్కడ ప్రా ణాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. నదిలోపడి చనిపోయిన 26 మంది ఆచూకీని పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు గుంటూరు వైపు ప్రకాశం బ్యారేజీ వద్ద నిఘా ఉంచడం గానీ, రక్షణ చర్యలు చేపట్టటం గానీ చేయడం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేయ టం పోలీసులకు పరిపాటిగా మారిందంటున్నారు. ►ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీస్ అవుట్‌పోస్టు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయంటున్నారు. ►సీతానగరం ఇసుక తిన్నెల వద్దకు వచ్చిన మహిళలు, విద్యార్థినులపై ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడం, అత్యాచారయత్నాలకు పాల్పడడం వంటి సంఘటనలు గతంలో జరిగినప్పటికీ పోలీసులు తీసుకున్న చర్యలు నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు. సూసైడ్ జోన్‌గా మారిన కృష్ణాతీరం ►తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణా తీరం సూసైడ్ జోన్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఇసుక తిన్నెల వద్ద తిరుగాడే అనేక మంది తెల్లవారుజాముకల్లా శవాలై కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అధిక శాతం మంది విద్యార్థినులు, మహిళలే ఉండటం గమనించదగ్గ విషయం. ►ఇక్కడ ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసుల పర్యవేక్షణ లోపంతో వీటిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ►ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం వారి తల్లిదండ్రులకు కడుపుకోతగా మారింది. ►మూడు రోజుల కిందట కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు కృష్ణానదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ►శనివారం రాత్రి నది ఒడ్డున విద్యార్థినుల బ్యాగులు లభ్యమైనప్పటికీ అందులో ఉన్న వివరాల ప్రకారం వారి తల్లిదండ్రులకు గానీ, కళాశాల యాజమాన్యానికి గానీ విషయం తెలియపరచడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరించారనే విమర్శలు వచ్చాయి. ►ఆదివారం ఉదయం మృతదేహాలు తేలిన తరువాత సమాచారం అందించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు రాత్రంతా నిద్రలేకుండా విలపిస్తుంటే పోలీసుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ తెలియపరచకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ►నదిలో పడి మృతి చెందిన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యకు గురయ్యారా? అన్న విషయాన్ని తేల్చడంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. -
విద్యార్థులను చిదిమేసిన లారీ
ఎడపల్లి: ఒకే గ్రామంలో ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వృద్ధాప్యంలో కుమారులు తమ కు అండగా ఉంటారని భావించారు. అ యితే అంతలోనే లారీ రూపంలో మృ త్యువు వారిని వెంటాడింది. ఎడపల్లి మండ లం నెహ్రూనగర్ గ్రామంలో లారీ ఢీకొని సయ్యద్ గౌస్ (13), ముజాయిద్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం మదర్సాలో చదివేందుకు ఇళ్ల నుంచి బయలు దేరిన కొద్దిసేపటికేవారు చనిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృతదేహాలు నుజ్జునుజ్జుయ్యాయి. తమ కు మారుడు సయ్యద్ గౌస్‌ను బాగా చదివించి ప్ర యోజకుడిని చేయాలని తల్లిదండ్రులు అహ్మ ద్, షహీన్బీ భావించారు. అందుకోసం రా త్రింబవళ్లు కష్టపడి సెట్రింగ్ పని చేస్తూ కొడుకును చదివించారు. అంతలోనే కుమారు డు అనంతలోకాలకు వెళ్లడంతో దంపతులను అపడం ఎవరితరం కాలేదు. అలాగే ఈ ప్రమాదంలో మరో విద్యార్థి ముజాయిద్ చనిపోవడంతో అతని తల్లిదండ్రులు షేక్ అహ్మద్, హసీనాబేగం తీవ్ర మనోవేదనకు గురయ్యా రు. కొడు కు మరణించడంతో దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. రోజూ కూలి పనిచేసి తమ కుమారుడిని చదివిస్తున్నామని, అంతలోనే తమను వదిలి వెళ్లిపోయాడని కన్నీరుమున్నారుగా విలపిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థుల మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు ఆదివారం పోలీసులకు అభ్యమయ్యాయి. వాటిని కరీంనగర్‌కు చెందిన శ్రీనిధి, మరొకరు బాచుపల్లికి చెందిన నిశితారెడ్డిగా పోలీసులు గుర్తించారు. జూన్ 8న విజ్ఞానయాత్ర కోసం వెళ్లిన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో 24 మంది లార్జీడ్యాం వరద నీటి ప్రవాహం కారణంగా బియాస్‌నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు 23 మృతదేహాలను బయటకు తీశారు. మరో విద్యార్థి శ్రీహర్ష, టూర్ ఆపరేటర్ ప్రహ్లాద్ మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది. మృతదేహాలను విమానంలో హైదరాబాద్‌కు తరలించనున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
నగరం ఘటనపై కేసు నమోదు
-
ఇక్కడి ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం ?
-
నగరం ప్రమాదమెలా జరిగింది ?
-
మృత్యు ఘడియలు
-
ఎందరో ఆపద్బాంధవులు!
తెల్లవారుజామునే మంటలు.. చుట్టుముడుతున్న అగ్ని కీలలు.. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలి 16 మంది మరణించగా.. ఇంకా ఎంతోమంది ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో ఎంతోమంది ఉదారంగా ముందుకొచ్చారు. బూడిదకుప్పల నడుమ, మాంసపుముద్దల మధ్య నుంచి వెళ్తూ.. తమకు చేతనైనంత సాయం చేశారు. కూర్చున్నవాళ్లు కూర్చున్నట్లే మరణించినా, ఇంట్లో పడుకున్న తల్లీబిడ్డలు పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోయినా.. అలాంటివాళ్ల మృతదేహాలను బయటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక క్షతగాత్రుల పరిస్థితి మరీ దారుణం. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మాంసపు ముద్దల్లా పడి ఉన్న అనేకమందిని బయటకు తీసుకొచ్చి, వారిని ఆస్పత్రులకు తరలించడం కూడా కష్టమే. అక్కడున్న పోలీసు సిబ్బంది, వైద్యసిబ్బంది చాలా తక్కువమంది. అలాంటి తరుణంలో స్థానికులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా.. తమంతట తాముగా ముందుకొచ్చి వారిని ఆస్పత్రులకు తరలించారు. తమ చేతులమీదుగా వారిని తీసుకొచ్చి, వీలైనంత వరకు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. వీరి సేవలను పోలీసులు కూడా ప్రశంసించారు. స్థానికుల సాయం లేకపోతే తాము అంత త్వరగా బాధితులను తరలించలేకపోయేవారిమని డీఎస్పీ వీరారెడ్డి కూడా మీడియాతో అన్నారు. స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం సంభవించిందని చెప్పినప్పుడు ముందుగా స్పందించినది డీఎస్పీ వీరారెడ్డే. ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు.