
► విచారణలో వెల్లడించిన మాజీ ఉపాధ్యక్షుడు
చంఢీగడ్: డేరా ఆశ్రమంలోని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో సుమారు 600 మంది శవాలను పాతిపెట్టినట్లు తాజాగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో గుర్మీత్ నమ్మిన బంటు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు డా. పీఆర్ నైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన తగిన ఆధారాలను కూడా అధికారులకు సమర్పించారు. శవాలను పాతిపెట్టిన చోటల్లా ఓ జర్మన్ శాస్త్రవేత్త సలహా మేరకు మొక్కలను నాటినట్లు నైన్ తెలిపారు.