Dera Sacha Sauda
-
లేటు వయసులో జాక్‌పాట్.. రూ.5కోట్లు గెలుచుకున్న వృద్ధుడు
చండీగఢ్: అదృష్టం తలుపుతడితే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి అంటారు. పంజాబ్ డేరాబస్సికి చెందిన ఓ వృద్ధుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 88 ఏళ్ల వయసులో అతనికి జాక్‌పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి పూలమాలలు వేసి అభినందించారు. లాటరీ గెలుచుకున్న ఇతని పేరు మహంత్ ద్వారకా దాస్. డేరాబస్సిలోని త్రివేది క్యాంప్‌లో నివాసముంటున్నాడు. 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అయితే ఇతనికి ఓ అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒకరోజు అదృష్టం తన తలుపుతట్టి కుటుంబం తలరాత మారుతుందని ఆశించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత అదే నంబర్‌కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. లాటరీ గెలుచుకున్న వృద్ధుడు.. ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు రానుంది. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని మహంత్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన లాటరీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: హిమగర్భంలో భారీ ఉల్క -
హనీప్రీత్‌కు బెయిల్
పంచకుల: 2017లో పంచకుల హింస కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్కు ఇక్కడి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం ఇక్కడి మరో కోర్టు ఆమెపై హింసాకాండకు సంబంధించి ఉన్న దేశద్రోహం ఆరోపణలను విరమించుకుంది. వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు డిఫెన్స్ న్యాయవాది ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. దీంతో అంబాలా జైలులో ఉన్న హనీప్రీత్ బుధవారం విడుదలైంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన 2017, ఆగస్టులో జరిగిన ఘర్షణల్లో హనీప్రీత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెపై రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. 2017, అక్టోబర్ నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో హనీప్రీత్ ఉన్నారు. -
‘రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ చత్తర్‌పతి హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇందర్జిత్ స్వాగతించారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో పాటు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి న్యాయం దక్కిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2002 మేలో డేరా సచ్చాసౌదాలో సాధ్వీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ సాధ్వి ఇచ్చిన ఫిర్యాదును తాను నిర్వహించే ‘పూచ్ సచ్’అనే పత్రికలో చత్తర్‌పతి ప్రచురించారని తెలిపారు. 2002 అక్టోబర్ 24న చత్తర్‌పతి ఆయన నివాసంలోనే హత్యకు గురైన కేసును 2003లో రిజిష్టర్ చేయగా 2006లో సీబీఐకు అప్పగించారన్నారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ కోర్టు రామ్‌రహీమ్‌తో పాటు, మరో ముగ్గురిని దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రామ్‌రహీమ్‌కు కఠినశిక్ష విధించాలన్న చత్తర్‌పతి కుమారుడు అన్షూ్షల్ డిమాండ్‌కు ఐజేయూ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. -
డేరా బాబాను కాపాడేందుకు దిగ్గజ లాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌథ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన ఆశ్రమంలో పలువురిని సామూహికంగా నపుంసకులుగా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తనకు మద్దతుగా వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఆరుషి హత్య కేసులో తల్వార్లకు విముక్తి కల్పించిన లక్నోకు చెందిన న్యాయవాదులు తన్వీర్ అహ్మద్ మిర్, ధ్రువ్ గుప్తాలు ఈ కేసులో డేరా బాబా తరపున వాదనలు వినిపించనున్నారు. డేరా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్, ఇద్దరు వైద్యుల సాయంతో దాదాపు 400 మంది డేరా అనుచరులను బలవంతంగా వృషణాలు తొలగించడం ద్వారా నపుంసకులుగా మార్చారని సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 1న డేరా బాబాపై చార్జిషీట్ నమోదు చేసింది. వైద్యులు పంకజ్ గార్గ్, ఎంపీ సింగ్‌ల సహకారంతో గుర్మీత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని సీబీఐ ఆరోపిస్తోంది. పంచ్‌కుల ప్రత్యేక న్యాయస్ధానంలో డేరా బాబాపై సీబీఐ ఈ మేరకు అభియోగపత్రాన్ని నమోదు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు గుర్మీత్ సింగ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. -
‘నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు’
సాక్షి, అంబాలా : గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచకుల అల్లర్ల కేసును వాదిస్తున్న ముగ్గురి లాయర్లకు ఫీజు ఇచ్చేందుకు తన దగ్గర ఒక్కరూపాయి కూడా లేదని హనీప్రీత్ ఇన్సాన్ జైలు అధికారులకు లేఖ రాశారు. పంచకుల అల్లర్ల తరువాత సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్నికల్పించాలని ఆమె జైలు అధికారులకు కోరారు. డేరా సచ్చాసౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రేప్ కేసులో 20 పంచకుల కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగిన అల్లర్లకు హనీప్రీత్ సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అల్లర్ల కోసం హనీ ప్రీత్ రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును సిట్ అధికారలు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లకు ఫీజు చెల్లించేందుకుతన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని.. సీజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ఆమె జైలు అధికారులను కోరారు. పంచకుల అల్లర్ల తరువాత 38 రోజులు పాటు హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డేరాకు సంబందించిన బ్యాంక్‌కు ఖాతాలతో పాటు హనీప్రీత్ బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. -
కన్నీరు పెట్టుకున్న హనీప్రీత్
సాక్షి, హరియాణా: డేరా స్వచ్ఛసౌదా నేరాల్లో అరెస్ట్ అయిన గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ తల్లిదండ్రలను చూసి కన్నీరు పెట్టుకుంది. గరువారం దీపావళి సందర్భంగా కూతురు హనీప్రీత్ సింగ్‌ను చూడటానికి ఆమె తల్లిదండ్రలు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ హరియాణలోని అంబాలా జైలుకు వెళ్లారు. వారిని అక్కడ చూసిన హనీప్రీత్ సింగ్ కన్నీరుమున్నీరైంది. దీపావళి సందర్భంగా హనీప్రీత్‌కు కొవ్వత్తులు, స్వీట్లును కానుకగా ఇచ్చారు. అయితే వచ్చిన వారు ఆమె తల్లిదండ్రులేనా అని అనుమానం జైలు అధికారులకు వచ్చింది. అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న మీదటనే వారికి హనీ ప్రీత్‌ను కలిసే అవకాశం కల్పించారు. వారితోపాటు ఆమె తరపు న్యాయవాది కూడా జైలుకు వెళ్లారు. అయితే అతన్ని హనీప్రీత్‌తో మాట్లాడనివ్వలేదు. డేరా సచ్చా సౌదాలో గర్మీత్తో కలిసి నేరాలకు పాల్పడినందున హనీప్రీత్‌ను హరియాణ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాజస్థాన్‌లోని గురుసర్ మోదియాలో కోట్ల రూపాయలు విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో హనీప్రీత్‌కు ఆస్తులున్నట్లు గుర్తించారు. -
మీడియా ముందుకు హనీప్రీత్..
సాక్షి, న్యూఢిల్లీ: జైలుపాలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తాను దేశం వదిలి ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే కోర్టులో లొంగిపోతానని ఆమె వెల్లడించారు. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా గుర్మీత్.. తనను లైంగికంగా వేధించలేదని చెప్పారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కోర్టు ముందు లొంగిపోతారని కథనాలు వచ్చాయి. ఈక్రమంలో ఆమె అన్యూహంగా 'సీఎన్ఎన్ న్యూస్18', 'ఇండియా టుడే' చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కోసం వెతుకుతున్న హర్యానా పోలీసుల కళ్లుగప్పి మరీ ఆమె ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం గమనార్హం. గుర్మీత్, తనకు మధ్య ప్రవిత్ర అనుబంధం ఉందని, తన మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ' మా గురించి చెప్తున్నదంతా అబద్ధమే. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రి-కూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని హనీప్రీత్ పేర్కొన్నారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం పంచకులలో అల్లర్ల రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని, కానీ అందుకు ఆధారాలు ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. గుర్మీత్ అమాయకుడని, ఆయనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళుతామని ఆమె చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, గుర్మీత్ విడుదల అవుతారని ఆమె అన్నారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తన మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. అతని గురించి మాట్లాడబోనని ఆమె తెలిపారు. -
హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. రహస్య వారసుడు?
సాక్షి, న్యూఢిల్లీ: రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ గురించి రోజుకొక రహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని కోరుకున్నారట. తమకు కొడుకు పుడితే.. డేరా స్వచ్ఛసౌదాకు అతన్ని వారసుడిగా కొనసాగించవచ్చునని భావించారట. కానీ, వారి రహస్య వారసుడి ప్లాన్ వర్కౌట్ కాలేదని డేరా ఫాలోవర్లు చెప్తున్నారు. గుర్మీత్, హనీప్రీత్ మధ్య రహస్య అనుబంధం గురించి వారు పలు విస్మయకర వాస్తవాలను తెలిపారు. డేరాలో హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. గుర్మీత్ చాటుగా హనీప్రీత్ రాసలీలలు నడిపేవాడని, వారి మధ్య శారీరక సంబంధం ఉందని ఇప్పటికే పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డేరా శిష్యులు వీరి అనుబంధం గురించి పలు విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ గుర్మీత్ సన్నిహిత సహచరిగా మారకముందు.. గుహాలో ఆమెపై గుర్మీత్ అత్యాచారం జరిపాడని తెలిపారు. తన ప్రైవేటు చాంబర్ అయిన గుహాలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ అత్యాచారం జరిపిన కేసులో శిక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సాధ్వీల తరహాలోనే హనీప్రీత్‌పై కూడా గుర్మీత్ లైంగిక దాడి జరిపారని, కానీ గుర్మీత్ బెదిరింపులకు తలొగ్గి.. ఆ తర్వాత ఆయన నుంచి పలు ప్రయోజనాలు పొంది.. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచి ఉంటుందని డేరా శిష్యులు చెప్తున్నారు. ఓ రోజు హనీప్రీత్ గుహలోకి వెళుతుండటం తాము చూశామని, ఏడుస్తూ ఆమె గుహ నుంచి బయటకు వచ్చిందని వస్తూ ఆమె గుర్మీత్ మాజీ డ్రైవర్లు అయిన ఖట్టా సింగ్, అతని కొడుకు గురుదాస్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజున తాను, తన కజిన్ గుహకు రక్షణగా ఉన్నామని గురుదాస్ చెప్పారు. 'హనీప్రీత్ చాలా ఆందోళనగా కనిపించింది. ఆమె నేరుగా డేరాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న తన తాత దగ్గరికి పరిగెత్తుకెళ్లింది. ఆమె తాత గొడవ చేయకుండా గుర్మీత్ గూండాలు చూశారు' అని ఆయన చెప్పారు. వారసుడి కోసం ప్రయత్నించారు.. కానీ! గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ రహస్యంగా వారసుడి కోసం ప్రయత్నాలు చేశారు. తమకు కొడుకు పుట్టాలని, అతన్ని డేరా సామ్రాజ్యానికి వారసుడిని చేయాలని వారు భావించారు. గుర్మీత్ సొంత కొడుకు జస్మీత్ సింగ్‌ను డేరా వారసుడిగా ప్రకటించాలన్న వాదనను హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, తమ కొడుకుకే వారసత్వ పట్టాం కట్టాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని గుర్మీత్ మాజీ శిష్యుడు గురుదాస్ సింగ్ తోర్ తెలిపారు. 2007లో జస్మీత్ను డేరా వారసుడిగా గుర్మీత్ ప్రకటించినప్పటికీ.. హనీప్రీత్ ఒత్తిడితో తన నిర్ణయాన్ని గుర్మీత్ మార్చుకున్నాడని, అయితే, అనుకోని పరిస్థితులు.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వారసుడి ప్రయత్నాలకు బ్రేక్ పడిందని తెలిపారు. 2002లో డేరాలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ సాక్షిగా ఉన్న తోర్.. గుర్మీత్-హనీప్రీత్ అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇద్దరూ డేరాలో భార్యాభర్తల్లాగే గడిపేవారని చెప్పాడు. ఇదే విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. డేరాలోని ప్రైవేటు చాంబర్లో గుర్మీత్-హనీప్రీత్ శృంగారానికి పాల్పడే వారని, ఆ సమయంలో డేరా బయట తాను వేచి ఉండే వాడినని గుప్తా గతంలో మీడియాకు చెప్పారు. -
హనీప్రీత్.. చిక్కదు.. దొరకదు..!
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులు దాటినా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ జాడ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇందుకు కారణం పోలీసుల తనిఖీల సమాచారం హనీప్రీత్‌కు అందడేనని నిఘావర్గాలు భావిస్తున్నాయి. గత ఆగస్టు 25వ తేదీన అత్యాచారాల కేసులో గుర్మీత్‌ను దోషిగా తేల్చాక హరియానాలో అల్లర్లు జరిగాయి. ఆపై డేరాలలో జరుగుతున్న అకృత్యాలు, మరిన్ని ఆరోపణలపై తనను అరెస్ట్ చేస్తారని భయాందోళనకు గురై హనీప్రీత్ పరారైంది. ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకోవాలని చూస్తున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. గత 33 రోజుల నుంచి ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నా ఆమె జాడ తెలియడం లేదు. కొందరు అనుచరులు ఆమెకు పోలీసు తనిఖీల సమాచారం లీకులిస్తున్న కారణంగానే ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నాట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గుర్మీత్‌కు శిక్షపడ్డ ఆగస్టు 25న, ఆ మరుసటిరోజు హనీప్రీత్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్నారు. ఆ తర్వాత ఆమె మద్ధతుదారులు, గుర్మీత్ అనుచరుల సాయంతో ఆమె పరారైన విషయం తెలిసిందే. కొందరు అనుచరుల సాయంతో హనీప్రీత్ ఎప్పటికప్పుడూ తన మకాం మారుస్తోందని, అవసరమైతే దేశం దాటి వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పరారవుతూ తనగోతిని తానే తవ్వుకుంటుందని హనీప్రీత్‌ను ఉద్దేశించి అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహమ్మద్ అకిల్ వ్యాఖ్యానించారు. అయితే త్వరలో ఆమెను అదుపులోకి తీసుకోవడం ఖాయమని చెప్పారు. ఆమెకు సాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
-
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
సాక్షి, కర్నాల్: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్, గుర్మీత్‌లకు శారీరక సంబంధం ఉందంటూ ఇటీవల పేర్కొన్న విశ్వాస్.. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు తన ప్రాణాలు రక్షించాలని కోరుతూ గురువారం కర్నాల్ పోలీసులను ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఎస్హెచ్ఓ రాజ్బీర్ సింగ్ తెలిపారు. ఓవైపు గుర్మీత్‌కు జైలుశిక్ష నేపథ్యంలో పరారైన హనీప్రీత్ కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుండగా మరోవైపు విశ్వాస్ గుప్తా తన మాజీ భార్య హనీప్రీత్ వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. హనీప్రీత్, డేరా సచ్ఛా సౌదాల విషయాలు మరిన్ని వెల్లడిస్తానని భావించి కొందరు తనకు ఫోన్‌చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు విశ్వాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహం అనంతరం హనీప్రీత్‌ను గుర్మీత్ తన వద్దకు పంపలేదని, వారిద్దరే ఏకాంతంగా గడిపేవారని చెప్పడం కూడా తనపై హత్యకుట్రకు ఓ కారణమై ఉంటుందన్నారు. చంఢీగఢ్‌లో డేరా చీఫ్ గుర్మీత్, హనీప్రీత్‌లకు వ్యతిరేకంగా ఎన్నో విషయాలు వెల్లడించినప్పటినుంచీ గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హనీప్రీత్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. కాగా, గత ఆగస్టు 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత హనీప్రీత్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
వామ్మో : డేరా సచ్చ సౌదా ఆస్తులు అన్ని కోట్లా?
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు చెందిన డేరా సచ్చ సౌదా గురించి సంచలన విషయాన్ని హర్యానా ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదని, కోట్ల ఆస్తులను గుర్మీత్ కలిగిఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. నేడు పంజాబ్, హర్యానా హైకోర్టుకు కట్టర్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో, డేరా సచ్చ సౌదా ఆస్తుల విలువ రూ.1,453 కోట్లుగా తెలిపింది. ఇవి కేవలం డేరా ప్రధాన కార్యాలయం సిర్సాలోనివేనని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్మీత్ రామ్ రహీమ్ ఆర్గనైజేషన్‌కు సుమారు రూ.1600 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు కూడా వెల్లడించింది. హర్యానా వెలుపల డేరా కలిగి ఉన్న ఆస్తుల వివరాలను ప్రభుత్వం లెక్కకట్టలేదు. ప్రభుత్వం అంచనావేసిన దానికంటే అధికంగానే గుర్మీత్ డేరాకు ఆస్తులున్నట్టు కూడా వెల్లడవుతోంది. సాధ్వీలపై అత్యాచార కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు విధించిన సమయంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున్న అల్లర్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో వచ్చిన నష్ట్రాన్ని పూరించడానికి డేడేరా సచ్చ సౌదా ఆస్తుల వివరాలను లెక్క కట్టాలని పంజాబ్, హర్యానా హైకోర్టులు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
గుర్మీత్ డేరాలో ‘బిగ్‌బాస్’!
చండీగఢ్: సెలబ్రిటీలు పాల్గొనే ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం బిగ్‌బాస్ తరహా షోను డేరా సచ్చా సౌదాలో చీఫ్ గుర్మీత్ సింగ్ నిర్వహించేవారట. గుర్మీత్ దత్తత తీసుకున్నట్లుగా చెప్తున్న హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తుండటం తెలిసిందే. ‘డేరాలో బిగ్‌బాస్ తరహా కార్యక్రమాన్ని గుర్మీత్ 6 జంటలతో నిర్వహించేవారు. 28 రోజులపాటు 6 జంటలు అక్కడ నివసించేవి’ అని ఆయన తెలిపారు. గుర్మీత్‌కు హనీప్రీత్ దత్తపుత్రిక అని చెప్పడం కేవలం ఒక ముసుగు అనీ, వారిద్దరూ భార్యాభర్తల్లానే ఉండేవారని విశ్వాస్ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినా 2009 నుంచి హనీప్రీత్ గుర్మీత్‌కు భార్యగా అతని వద్దే ఉంటోందన్నారు. హనీప్రీత్ గుర్మీత్ ప్రియురాలు విశ్వాస్ మాట్లాడుతూ ‘హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. గుర్మీత్ చట్టబద్ధంగా ఆమెను దత్తత తీసుకోలేదు. పైకి అలా చెప్పుకున్నారంతే. ఆమె గుర్మీత్ ప్రియురాలు. 1999లో గుర్మీత్ ఆదేశాల మేరకే నేను హనీప్రీత్‌ను పెళ్లి చేసుకున్నా. వారిద్దరికీ లైంగిక సంబంధం ఉంది. అది నేనే ప్రత్యక్షంగా చూశాను. ఎవరికైనా చెబితే చంపేస్తానని అప్పట్లో గుర్మీత్ నన్ను బెదిరించారు. ఆమె ఎప్పుడూ గుర్మీత్తోనే ఉండేది. డేరాలోని గుర్మీత్ నివాసం గుఫాలో వారిద్దరూ గడిపేవారు. ఇద్దరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని చాలాసార్లు బెదిరించారు. మాపై కేసులు పెట్టారు. నన్ను చంపేయమని గుర్మీత్ తన అనుచరులను ఆదేశించాడు. జైలులో ఉన్నా అతను చాలా బలవంతుడు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికుంటానో లేదో కూడా తెలీదు’ అని చెబుతూ విశ్వాస్ మీడియా సమావేశం నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. -
డేరా బాబా ఆశ్రమంలో 600 అస్థిపంజరాలు
-
డేరా’లో 600 శవాల ఖననం
► విచారణలో వెల్లడించిన మాజీ ఉపాధ్యక్షుడు చంఢీగడ్: డేరా ఆశ్రమంలోని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో సుమారు 600 మంది శవాలను పాతిపెట్టినట్లు తాజాగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో గుర్మీత్ నమ్మిన బంటు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు డా. పీఆర్ నైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన తగిన ఆధారాలను కూడా అధికారులకు సమర్పించారు. శవాలను పాతిపెట్టిన చోటల్లా ఓ జర్మన్ శాస్త్రవేత్త సలహా మేరకు మొక్కలను నాటినట్లు నైన్ తెలిపారు. -
హనీప్రీత్ ఎక్కడుందో నాకు తెలుసు: నటి
డేరా స్వచ్ఛసౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం చెలరేగిన అలర్ల వెనుక హనీప్రీత్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గుర్మీత్‌పై నమోదైన పలు కేసులలోనూ ఆమె ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుర్మీత్‌కు శిక్ష పడి.. జైలుకు వెళ్లిననాటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమె నేపాల్‌లో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఆమె పేరుకే గుర్మీత్ దత్తపుత్రిక అని, కానీ, చాటుగా గుర్మీత్ రాసలీలలు సాగించేదని, వారు ఏకాంతంగా గడిపేవారని పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌పై బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్ గురించి తనకు ఏడెనిమిదేళ్లుగా తెలుసునని రాఖీ తెలిపింది. డేరా బాబా గుర్మీత్‌పై తాను ఒక బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నామని, ఈ సినిమాలో డేరా బాబా ప్రియురాలు హనీప్రీత్ సింగ్‌గా తాను నటిస్తానని ఆమె పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ ఎక్కడో ఉందో తనకు తెలుసునని, ఆమె నేపాల్‌లో లేదని, లండన్‌లో ప్రస్తుతం ఉందని రాఖీ తెలిపింది. తన సోదరుడు రాకేశ్ సావంత్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో డేరా బాబాగా రజా మురద్ నటిస్తారని పేర్కొంది. -
డేరా మేనేజర్ హత్యకేసు విచారణ 18నుంచి
-
డేరా మేనేజర్ హత్యకేసు విచారణ 18నుంచి
పంచకుల: డేరా సచ్చా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో రోజూవారీ విచారణ ఈనెల 18న సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రారంభం కానుంది. జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, రంజిత్ సింగ్ హత్యా కేసుల విచారణను కోర్టు శనివారం చేప్టటింది. రెండు కేసులను వేర్వేరుగా విచారించాలని, ఛత్రపతి కేసు విచారణను మళ్లీ సెప్టెంబర్ 22న చేపడతామని తెలిపింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు వీరిని 2002లో కిరాతకంగా హతమార్చారు. ఈ రెండు కేసుల్లోనూ ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ప్రధాన సాక్షిగా ఉన్న గుర్మీత్ డ్రైవర్ కట్టా సింగ్ మరోమారు తన వాంగూల్మాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోర్టును కోరాడు. గుర్మీత్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో 2012లో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. కట్టాసింగ్ పిటిషన్ విచారణను కోర్టు సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. -
డేరా ఐటీ చీఫ్ అరెస్ట్
సాక్షి,సిర్సాః డేరా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌పై విచారణ వేగవంతమైన క్రమంలో బుధవారం సిర్సాలో డేరా సచ్చా సౌథా ఐటీ విభాగం హెడ్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్మీత్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణై జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో పరారీలో ఉన్న ఐటీ హెడ్ వినీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. డేరా బాబాను దోషిగా నిర్ధారించిన పంచ్‌కుల కోర్టు నుంచి ఆయన తప్పించుకునేందుకు హనీప్రీత్ కుట్ర పన్నిందనే అభియోగాలపై ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది. అంతకుముందు భటిండా జిల్లా సలబత్‌పురా డేరా కేంద్రం ఇన్‌ఛార్జిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలబత్‌పురా డేరా హెడ్ జోరా సింగ్‌ను రాజద్రోహం, ఇతర అభియోగాలపై అరెస్ట్ చేశామని భటిండా ఐజీ ఎంఎస్ చిన్నా చెప్పారు.గత నెలలో పంచ్‌కుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం హింసకు ప్రేరేపించారని జోరాపై ఆరోపణలున్నాయి. భటిండా జిల్లాలోని సలబత్‌పురా డేరా కేంద్రం పంజాబ్‌లోనే అతిపెద్ద సెంటర్ కావడం గమనార్హం. -
అతనో కామ పిశాచి: డాక్టర్
-
అతనో కామ పిశాచి: డాక్టర్
సాక్షి, రోహ్తక్ : జైలు గోడల మధ్య డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ నలిగిపోతున్నాడు. మానసిక సంఘర్షణతో కుంగిపోతున్నాడు. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఒక్కోక్షణం ఊపిరి ఆగినట్లు ఫీల్ అవుతున్నాడు. నరకప్రాయంగా ఉన్న జీవితంగా గురించి నిరంతరం చింతిస్తున్నాడు. ఇవి గుర్మీత్‌ను పరీక్షించడానికి శనివారం రోహ్తక్ జైలుకు వెళ్లిన డాక్టర్ల బృందంలో ఒకరు చెప్పిన విషయాలు. తన పేరును సీక్రెట్‌గా ఉంచమని కోరిన ఆ డాక్టర్.. సంచలన విషయాలను వెల్లడించారు. గుర్మీత్ ఓ కామ పిశాచని, జైలులో ఉంటున్న నాటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్న ఆయన మనోవేదనకు గురౌతున్నట్లు చెప్పారు. ఆ వేదన వల్ల సాధారణ జైలు శిక్ష.. అతనికి మరణ దండనగా కనిపిస్తోందని తెలిపారు. సరిగా నిద్ర పట్టకపోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, జైలు గోడలను చూస్తూ ఉండిపోవడం లాంటి లక్షణాలు దీన్నే సూచిస్తున్నాయని అన్నారు. గుర్మీత్ ప్రస్తుత పరిస్థితిని చికిత్స ద్వారా నయం చేయొచ్చని చెప్పారు. ఆలస్యం అయితే అసలుకే మోసం వస్తుందని అభిప్రాయపడ్డారు. గుర్మీత్ డ్రగ్స్ తీసుకునే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. 1988 తర్వాత నుంచి ఆయన మద్యం సేవించడం మానేశారని తెలిసింది. అయితే, ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి తెప్పించుకునే సెక్స్ టానిక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా వినియోగించినట్లు డాక్టర్ వివరించారు. -
గుర్మీత్ ఆశ్రమంలో అబార్షన్ సెంటర్లు
-
గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మి.. బావిలో శవమై..
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కారణంగా కొందరు పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరు ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఆయనను నమ్మి మోసపోయి నిండు ప్రాణాలు బలితీసుకోవడం మొదలుపెట్టారు. గుర్మీత్‌ను నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డేరాలో పెద్ద మొత్తంలో నిర్మిస్తున్న హోటల్స్, రిసార్ట్స్ బిజినెస్‌లో భాగంగా దాదాపు రూ.3.10కోట్లు పెట్టుబడి పెట్టిన సోమ్‌వీర్ అనే వ్యక్తి తన నిండు ప్రాణం బలితీసుకున్నాడు. లైంగికదాడి, మోసంవంటి కేసుల్లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక తాను పెట్టిన సొమ్మంతా బూడిదపాలయినట్లేనని భావించిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి 12 ఎకరాల భూమిని కూడా డేరాకు గుడ్డి నమ్మకంతో ఇచ్చాడు. బుధవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి శుక్రవారం ఓ బావిలో శవమై తేలాడు. పెట్టుబడి కోసం 25 ఎకరాల భూమిని అమ్ముకోవడమే కాకుండా 12 ఎకరాలను డేరాకు అప్పజెప్పి దెబ్బతిన్న నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు
ఛండీగఢ్: డేరా బాబా అనుచరులు తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉన్న వివిధ రకాలైన 33 లైసెన్స్డ్ ఆయుధాలను అనుచరులు సిర్సా సదర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దినేష్‌కుమార్ తెలిపారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు ఇరవయ్యేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రహటక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గుర్మీత్ అరెస్ట్ అనంతరం ఆయన అనుచరులు పాల్పడిన అల్లర్లలో 41 మంది చనిపోవటంతోపాటు భారీ మొత్తంలో ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే సచ్ఛాసౌదా కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆశ్రమంలో ఉన్న పలువురు బాలలను విడిపించారు. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు డేరా అనుచరుల వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని పోలీసులు అల్టిమేటం ఇచ్చారు. దీనికి స్పందించిన డేరా అనుచరులు సోమవారం తమ వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకులతోపాటు 9మిమీ పిస్టళ్లను పోలీసులకు అప్పగించారు. -
గుర్మీత్‌కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్ల్లోకి ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతోపాటు ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి మరో షాకిచ్చింది. అత్యాచారం కేసులో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. దీంతోపాటు ఆయనపై పలు ఇతర ఆరోపణలు రావటంతో జెడ్ కేటగిరీ భద్రతను ఇటీవల రద్దు చేయటంతోపాటు గుర్మీత్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్ల్లోకి ఉన్న ప్రవేశానుమతిని కేంద్రం రద్దు చేయడం గమనార్హం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై అన్ని విమానాశ్రయాల అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ముంబైలో సమావేశమైన ఐఎఫ్‌టీడీఏ మండలి గుర్మీత్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుర్మీత్తోపాటు ఆయన వారసురాలిగా పేరున్న హనీప్రీత్ కౌర్ సభ్యత్వం కూడా రద్దు చేసింది. అంతేకాదు, గుర్మీత్‌కు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీఏఏ)లో ఉన్న సభ్యత్వాన్ని కూడా వచ్చే సోమవారం నుంచి నిలుపుదల చేస్తున్నట్లు సంఘం నేత అశోక్ పండిట్ తెలిపారు. గుర్మీత్ రాంరహీం సింగ్ 2015లో ఎంఎస్‌జీ: దిమెస్సెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. వీరిద్దరితో ఇకపై ఎలాంటి సినిమాలు తీయరాదని ఐఎంపీఏఏ, ఐఎఫ్‌టీడీఏ నిర్ణయం తీసుకున్నాయి. -
నేను నపుంసకుడిని: గుర్మీత్
-
నేను నపుంసకుడిని: గుర్మీత్
సాక్షి, న్యూఢిల్లీ/చండీగఢ్ : అత్యాచారాల కేసులో 20 ఏళ్ల జైలుశిక్షకు గురైన ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కీలకాంశం ఏంటంటే.. శిక్ష నుంచి బయటపడేందుకు తానో నపుంసకుడినని ఈ రాక్‌స్టార్ బాబా చెప్పుకున్నారు. అయితే తాను 1990 నుంచి నపుంసకుడిగా మారానని, అలాంటిది 1999 ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో తాను ఇద్దరు మహిళలను అత్యాచారం చేశానన్నది అసత్య ప్రచారమేనని పేర్కొన్నారు. అసలు ఆ ఆరోపణల్లో ఇసుమంతైనా నిజంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో భాగంగా జస్టిస్ జగ్దీప్ కుమార్‌కు ఆయన చెప్పుకొచ్చారు. తాను అమాయకుడినని, ఎలాంటి తప్పులు చేయలేదని న్యాయమూర్తికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. గుర్మీత్ చెప్పేవన్నీ అసత్యాలేనని సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. మీకు ఇద్దరు కూతుళ్లున్నారు కదా.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా గుర్మీత్ మౌనం వహించినట్లు సమాచారం. ఆపై ఈ కేసులో బాధితురాలు గుర్మీత్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు. అశ్రమంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి ఇంట్లో వాళ్లకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్మీత్ బెదిరించేవారని చెప్పారు. కుటుంబ సభ్యులను హత్య చేయిస్తానని పలుమార్లు హెచ్చరించినట్లు కోర్టుకు బాధితురాలు వెల్లడించారు. నిందితుడు బాబాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు వివరాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటుగా ఒక్కో కేసులో రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
గుర్మీత్‌కు పద్మ అవార్డు ఇవ్వాలి!
2017లో 89 మందికి పద్మ పురస్కారాలు గుర్మీత్ పేరిట అత్యధికంగా 4,208 నామినేషన్లు అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగుచూసింది. 2017 పద్మ అవార్డులకుగానూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓవరాల్‌గా 18, 768 దరఖాస్తులు రాగా, అత్యధికంగా 4,208 మంది గుర్మీత్ పేరును పద్మ అవార్డులకు ప్రతిపాదించడం గమనార్హం. దీంతోపాటుగా ఇప్పటివరకూ గుర్మీత్ సింగ్ తన పేరును ఐదు పర్యాయాలు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. మూడు పద్మ అవార్డులలో ఏదైనా ఒకటి ఇచ్చి గౌరవించాలని గుర్మీత్ పేరు ప్రతిపాదించిన వారిలో హరియానాలోని హిస్సార్ కు చెందిన సెయింట్ జార్జ్ సోనెట్, ఇండియా సెయింట్ జార్జ్ ఉన్నారు. సిర్సాలోని గుర్మీత్ డేరా ఆశ్రమం నుంచే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రాక్‌స్టార్ బాబాగా, ఆధ్యాత్మిక గురువుగా, నటుడిగా పేరొందిన గుర్మీత్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. సిర్సాకు చెందిన అమిత్ అనే వ్యక్తి 31 సార్లు నామినేట్ చేయగా, సునీల్ అనే వ్యక్తి 27 పర్యాయాలు పద్మ అవార్డు కోసం గుర్మీత్ పేరున దరఖాస్తు చేశారు. ఇంకా అభా, ఆదిత్య, అక్బర్, అల్ఫెజ్, బల్జిందర్, మిల్కీ, గజల్, కోమల్, జానీ, జెస్సీ, ఐశ్వార్ అనే పేర్లతో చాలామంది ఈ అవార్డు కోరినట్లు సమాచారం. మురళీ మనోహర్ జోషీ, శరద్ పవార్, లోకసభ మాజీ స్పీకర్ దివంగత నేత పీఏ సంగ్మా, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నేపథ్యగాయకుడు కేజే ఏసుదాసు సహా 89 మందికి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో పద్మ అవార్డులను అందజేసింది. మరోవైపు రెండు అత్యాచార కేసుల్లో డేరా చీఫ్ గుర్మీత్(50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల (ఒక్కో కేసులో పదేళ్లు) కఠిన కారాగార శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెల్లడించారు. దీంతోపాటు ఒక్కో కేసుకు రూ. 15 లక్షల చొప్పున జరిమానాను కూడా విధించగా, బాధితురాళ్లకు రూ.14 లక్షల చొప్పున అందజేయనున్నారు. -
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
-
రాబందు రెక్కల చప్పుడు
జీవన కాలమ్ కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. పాపం, దేవుడు నిస్సహాయుడు. అడ్డమయిన వాళ్లకీ కొంగు బంగారమవుతాడు. అయితే, హేతువాదులు కొంగుల్ని మరిచిపోయి బంగారాన్ని తప్పు పడతారు. నిజమైన విశ్వాసం నికార్సయిన సౌందర్యం. పబ్బం గడవడానికి పెట్టుబడిగా ఉపయోగించే విశ్వాసం– భయంకరమైన వికృతం. అందువల్లనే విశ్వాసం పెట్టుబడిగా ఉన్న, ప్రతీదీ వీధిన పడుతోంది. ఇలాంటి విశ్వాసానికి వికటమైన రూపం– డేరా సచ్చా సౌదా గుర్మిత్ రామ్ రహీమ్. చానళ్ల పేర్లు అనవసరం. ఒకాయన పెద్ద బొట్టుతో, దుశ్శాలువాతో టీవీ తెర అంతా ఆక్రమించి కూచుంటాడు. విశ్వాసాన్ని నమ్ముకున్న ఒక తల్లి ‘రెంట చింతల’నుంచి అడుగుతుంది– మా రెండో అబ్బాయికి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి బాబూ– అని. ఈయన చెప్తాడు– ‘‘ప్రతీ బుధవారం మర్రి ఆకు నెత్తిన పెట్టుకుని, దాని మీద చింతగింజని ఉంచి స్నానం చెయ్యమనండి. ఆరువారాలు చేశాక– కావిరంగు పంచె కట్టుకుని మీ ఊళ్లో ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఆ చింతగింజని పాతిపెట్టమనండి. ఆరో రోజుకి ఉద్యోగం రాకపోతే నాదగ్గరికి రండి 1,500 రూపాయల తావీజు కడతాను’’అంటాడు. ఇది విన్నాక–దిక్కుమాలిన జ్యోతిషం మీదా, దేవుడిమీదా నమ్మకం మంటగలవకుండా ఎందుకుంటుంది? విశాఖపట్నం బీచిలో తెన్నేటి పార్కు ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక జ్యోతిష్కులు ఉంటారు. తోక తెగిన చిలక బోనుల నిస్సహాయంగా బయటికి వస్తుం ది. దానికి రెండే అలవాట్లు– బొత్తిలో కార్డు లాగితే బియ్యం గింజలు వస్తాయి. లాగుతుంది. ఆ కార్డు ఈ ‘మనిషి’ భవిష్యత్తు. ‘‘నీ కూతురి పెళ్లి ఈ సెప్టెంబరులో అవుతుంది’’ అంటాడు చిలకయ్య. అది అయిదు రూపాయల సంతోషం– పల్లెటూరి మనిషికి ఇక్కడ పెట్టుబడి ఏమిటి?– విశ్వాసం. మనిషి ఆశకి ఊతం కావాలి. దాన్ని ఎదుటి వ్యక్తి కలిగిస్తున్నాడన్న నమ్మకం రావాలి. అందుకూ చెల్లింపు. దానికి చిలక స్థాయి చాలు రైతుకి. దేవుడిని చంకన ఎత్తుకుని తాను దేవుడి ప్రతినిధినంటూ– వెనుకబడిన వర్గాల తరఫున ముందుపడిన ‘రాబందు’ జిగ జిగా మెరిసే కళ్లజోళ్లతో, అమెరికా మార్కు బనీన్లతో, అందంగా దువ్విన గెడ్డంతో, స్ఫురద్రూపంతో, పాప్ పాటలతో, సినిమా నిర్మాణ సంరంభంతో, మెర్సిడిస్ కార్ల హంగులతో, కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. ఇప్పుడు చిలక స్థానంలో రాబందు ఉంది. ఇక ‘రాబందు’కి కొదవేముంది? విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న ఎందరు బాబా లు? విశ్వాసానికి కొలబద్ధలు లేవు. ప్రజల ఎగబాటే వారి శక్తి. హర్యానా సత్యలోక్ ఆశ్రమాధిపతి రామ్‌పాల్ బాబా లీలలు, స్వాధీన్ భారత్ సుభాష్ సేన రామ్ వృక్ష యాదవ్, బెంగళూరులో ధ్యాన్ పీఠానికి చెందిన నిత్యానంద లీలలు, ఇంకా ఒక కొలిక్కిరాని ఆశారామ్ లీలలు, సనాతన్ ధన్ హుగ్లీ బాలక్ బ్రహ్మచారి– ఇలా ఎందరు? తనని నమ్మ వచ్చిన ఇద్దరు మహిళల్ని మానభంగం చేసి, గర్వంగా 15 సంవత్సరాలు కేసు నడిపి, తన చుట్టూ ఉన్న ‘దన్ను’ కారణంగా తనకేమీ జరగదని గర్వంగా రొమ్ము విరిచి, మొన్నటి తీర్పుకి 300 కార్లతో విహారంగా వచ్చిన ‘గ్లామరు’బాబా 20 ఏళ్లు జైలుశిక్ష పడ్డాక కోర్టులో ‘‘నన్ను క్షమించండి మొర్రో’’అని నిస్సహాయంగా కూలబడి ఏడవడం ఎందుకు? ఇంతకాలం లక్షల మందిని నమ్మించి, చంకన ఎత్తుకున్న దేవుడు ఏమయ్యాడు? మతాన్ని, దేవుడిని ఎరచూపి– కింద మధ్యతరగతి ప్రజానీకం ‘విశ్వాసా’లను సమీకరించి వ్యవస్థల్ని ఏర్పరచుకున్న ఇలాంటి బాబాలు– ఇంకా మతంలోనూ, సంప్రదాయంలోనూ తమ మాలాలు ఉన్న ‘నిస్సహాయమైన’ వ్యవస్థకి పట్టే చీడపురుగులు. పాపం, తెన్నేటి పార్కుకి ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక అతి చిన్న నమూనా. ప్రాథమికమైన విశ్వాసం అతని కొంగుబంగారం. ఉపాధి మాత్రమే అతని లక్ష్యం. కాని ఈదేశంలో దేవుడు, మతాన్ని పొగరుగా వ్యాపారం చెయ్యగల–దుర్మార్గమయిన స్వార్థానికి విశ్వరూపం గుర్మీత్ రామ్ రహీమ్. పంజాబు కట్టలు తెంచుకునే ఆవేశానికీ, పరిమితి లేని విశ్వాసానికి ప్రతీక. తాము నమ్మిన విలువలకి ప్రాణం ఇచ్చే స్వభావం ఆ జాతిది. ఇక్కడే జైన బౌద్ధ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సిక్కు మతాలు విస్తరించాయి, వేళ్లు నిలదొక్కుకున్నాయి. అయితే మధ్య మధ్య కుళ్లు చూపిన ఓ భయంకరమైన ‘వేరు’ కథ ఈ గుర్మీత్ రామ్ రహీమ్‌ది. మరో 20 ఏళ్లు– వెర్రి తలలు వేయించిన విశ్వాసానికి గమ్యాన్ని ఈ ‘రాబందు’ గుర్తు చేస్తూనే ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు -
డేరా ఆశ్రమంపై సీపీఎం జెండాలు
నల్లగొండ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరాబాబా(గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్)కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఉన్న డేరాబాబా ఆశ్రమ స్థలంలో బుధవారం సీపీఎం నాయకులు జెండాలు పాతారు. డేరాబాబాకు ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన ఆస్తులను ప్రజలకు పంచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గుర్మీత్‌ను తప్పించడానికి డేరా ప్లాన్..!!
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంను తప్పించేందుకు డేరా అనుచరులు ప్లాన్ వేశారు. అవును. శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో దోషిగా తేల్చిన అనంతరం ఆయన్ను తప్పించడానికి డేరా అనుచరులు ప్రయత్నించినట్లు హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు ఆ ప్లాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. అసలు ప్లానేంటి.. దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటకు గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి, బాబాను అక్కడి నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు. వాస్తవంగా ఏం జరిగింది.. గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చింది. హరియాణా పోలీసులు బాబాను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. స్కార్పియో కారులో ఆయన్ను ఎక్కించారు. బాబాకు అటు వైపు, ఇటు వైపు భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు. కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్ నుంచి వెళ్లాలి. అక్కడే కాపు కాశారు డేరా అనుచరులు. అనుకున్న ప్రకారం.. స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు. బాబాను తమకు అప్పగించాలని పెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసు వాహనం నుంచి ఆరుగురు ఆఫీసర్లు కిందకు దిగారు. వారిని చూసిన డేరా అనుచరులు షాక్ తిన్నారు. సాధారణ గార్డులు దోషికి భద్రతా ఉంటారు. కానీ ఆరుగురు ఆరి తేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడం వారికి మింగుడు పడనివ్వలేదు. బాబాను తప్పించాలా? లేదా వెనక్కు వెళ్లిపోవాలా? అనే ఆప్షన్లు వారి ముందు మిగిలాయి. ఇందులో వారు మొదటి దాన్ని ఎంచుకుని కారును ఆఫీసర్ల మీదుగా పొనివ్వాలని డ్రైవర్‌కు చెప్పారు. ఇంతలో ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంతమంది పోలీసులు బారియర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని డేరా అనుచరులను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్లో నిజాలు.. బాబాను తప్పించేందుకు వేసిన ప్లాన్‌ను గురించిన వివరాలన్నింటిని ఎఫ్ఐఆర్లో హరియాణా పోలీసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డేరా అనుచరుల కారు నుంచి ఆటోమేటిక్ మెషీన్ గన్, పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
డేరా బాబా గుర్మీత్‌కు శిక్ష వెనక ఆ 8 మంది..
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అత్యాచారం కేసుల్లో దాదాపు 15 ఏళ్ల ఆలస్యంగానైనా 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష పడడానికి ఎనిమిది మంది ప్రాణాలకు తెగించి పోరాడడమే కారణం. 1. ఇద్దరు సాధ్వీలు డేరా సచ్ఛా సౌధాలో ఉంటున్న ఓ సాధ్వీ తనపై బాబా అత్యాచారం జరిపాడంటూ అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి పేరిట 2002లో ఆకాశరామన్న లేఖ రాశారు. ఆ లేఖను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటాగా తీసుకొని సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తులో లేఖ రాసిన సాధ్వీతోపాటు మరో సాధ్వీ బాబా బెదిరింపులకు భయపడకుండా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను సీబీఐ అధికారులకు వివరించారు. మరో 40 మంది సాధ్వీలపై కూడా బాబా అత్యాచారం జరిపారంటూ వారు ఆరోపించారు. అయితే ఆ విషయాన్ని అంగీకరించేందుకు ఇతర సాధ్వీలు ఎవరూ ముందుకు రాలేదు. బాబాపై కేసు నమోదయ్యాక ఏళ్లపాటు, వందల మైళ్ల దూరం ప్రయాణించి ఈ ఇద్దరు సాధ్వీలు అధికారుల ముందు, కోర్టుల ముందు సాక్ష్యాలు చెబుతూ వచ్చారు. 2 రంజిత్ సింగ్ అత్యాచారానికి గురైన ఓ సాధ్వీకి స్వయాన అన్న. డేరా సచ్ఛా సౌధాలో అప్పుడు ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆకాశరామన్న పేరిట లేఖ తానే రాసి అది ఓ స్థానిక పత్రికలో ప్రచురితమయ్యేలా చేశారు. లేఖ విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. అది కూడా బాబా రామ్ రహీమ్ సింగ్ చేయించారన్న ఆరోపణపై కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. 3. రామ్‌చందర్ ఛత్రపతి హర్యానా నుంచి వెలువడుతున్న స్థానిక పత్రిక ‘పూరా సచ్’ పత్రిక సంపాదకుడు. సాధ్వీకి జరిగిన అన్యాయం గురించి ఆకాశరామన్న పేరిట రంజిత్ సింగ్ రాసిన లేఖను ప్రచురించారు. ఈ లేఖనే హైకోర్టు సుమోటాగా తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆయన ఇంటివెలుపల 2002లో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతినిపై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలతో 28 రోజులపాటు ఢిల్లీ ఆస్పత్రిలో మత్యువుతో పోరాడి మరణించారు. తనపై దాడికి కుట్ర పన్నింది బాబానేనంటూ ఆయన తన మరణ వాంగ్మూలంలో ఆరోపించారు. 4. అంశూల్ ఛత్రపతి జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి కుమరుడు. 21వ ఏట తండ్రిని పోగొట్టుకున్న అంశూల్ తన తండ్రి నమ్ముకున్న విలువల కోసం పోరాటం సాగించారు. తన తండ్రి హత్యతోపాటు బాబా డేరాలో జరుగుతున్న చీకటి కార్యకాలపాలపై దర్యాపు జరపాల్సిందిగా ఇటు సీబీఐ, అటూ హైకోర్టు చుట్టూ తిరిగారు. తన తండ్రి ప్రచురించిన సాధ్వీ లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖనే కోర్టు సుమోటాగా స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2003లో కేసు దర్యాప్తులో భాగమైన ఆయన సిబీఐ విచారణకు సహకరిస్తూ వచ్చారు. 5. జడ్జీ జగ్దీప్ సింగ్ జడ్జీ జగ్జీప్ సింగ్ ఎన్ని వర్గాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా లొంగకుండా, తానిచ్చే తీర్పు కారణంగా తనకు, తన కుటుంబానికి హాని కలిగే ఆస్కారం ఉందని తెలిసి కూడా నిర్భయంగా నిజాయితీగా కేసు విచారణ జరిపి దోషికి తగిన శిక్ష విధించారు. తనకంటూ ప్రత్యేక ప్రచారం కోరుకోని ముక్కుసూటి వ్యక్తి ఆయన. హర్యానాలోని జింద్‌కు చెందిన ఆయన పంజాబ్ యూనివర్శిటీలో లా చదివారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో లిటిగేటర్‌గా వత్తిని ప్రారంభించారు. 2012లో హర్యానా జుడీషియల్ సర్వీసులో చేరారు. 2016లో సీబీఐ కోర్టుకు జడ్జీగా నియమితులయ్యారు. అదే ఏడాది ఓ రోజు తాను కారులో వెళుతుండగా ఓ యాక్సిడెంట్ జరిగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తన కారాపి అంబులెన్స్‌కు కాల్ చేశారు. అంబులెన్స్ సకాలంలో వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయనే స్వయంగా తన కారులో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు మొదటిసారిగా ప్రజలకు ఆయన పేరు పరిచయం అయింది. 6. పోలీసు డీఐజీ ములింజా నారాయణన్ పంజాబ్, హర్యానా హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించినప్పుడు ములింజా నారాయణన్ ఢిల్లీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (స్పెషల్ క్రైమ్స్)కు పని చేస్తున్నారు. ఆయన ఈ కేసు విచారణను పర్యవేక్షించారు. ఈ కేసును త్వరగా కొట్టివేయాల్సిందిగా పలువురి నుంచి తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని అప్పట్లో ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు బాబాకు శిక్ష పడిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచే కాకుండా తన పోలీసు అధికారుల నుంచి కూడా కేసును మూసివేయాల్సిందిగా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిపారు. ఆయన 2009లో పదవీ విరమణ చేశారు. 7. మాజీ సీబీఐ డైరెక్టర్ విజయ్ శంకర్ ఈ కేసులో 2007లో చార్జిషీటు దాఖలు చేసినప్పుడు విజయ్ శంకర్ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసును నీరుగార్చాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ నాయకుల నుంచి తనపై ఒత్తిళ్లు వచ్చాయని ఆయన కూడా తెలిపారు. దర్యాప్తు సందర్భంగా ఓసారి పంచకులలోని సీబీఐ కార్యాలయాన్ని డేరా సచ్ఛా కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసులు సకాలంలో రావడం వల్ల ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. 8. గుర్మీత్ పారిపోయే ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు తన బ్లాక్ కమాండో భద్రతతోపాటు తన ప్రైవేటు సెక్యూరిటీతో పంచకులలోని సెక్టార్ వన్ కోర్టు కాంప్లెక్స్‌కు కారులో వచ్చిన గుర్మీత్ సింగ్ తనను దోషిగా నిర్ధారించి శిక్ష విధిస్తారని గ్రహించి ప్రైవేటు సెక్యూరిటీ సాయంతో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సకాలంలో గ్రహించిన హర్యానా పోలీసులు, పారా మిలటరీ దళాలు సింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కమాండోలతో పెనుగులాట కూడా జరిగింది. ప్రైవేటు సెక్యూరిటీలో ఒకరు పోలీసులపైకి కాల్పులు కూడా జరిపారు. అయినా పోలీసులు భయపడకుండా తమ విధులను నిర్వర్తించారు. బాబా కోర్టు కాంప్లెక్స్ దాట గలిగితే పారిపోయే అవకాశం ఉండేది. ఎందుకంటే కోర్టు చుట్టూ వేలాది మంది ఆయన అనుచరులు గుమిగూడి ఉన్నారు. -
‘డేరా’ ఖాళీ అవుతోందిలా..!
సిర్సా(హర్యానా): పటిష్ట బందోబస్తు మధ్య డేరా సచ్ఛా సౌద భవనాల్లో ఉన్న సిబ్బందిని, అనుచరులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సుమారు 700మందిని బయటకు తీసుకువచ్చారు. బాబా గుర్మీత్ రాం రహీం సింగ్‌కు రేప్ కేసులో శిక్ష ఖరారైన తర్వాత గత రెండు రోజులుగా పంజాబ్, హర్యానాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరుగలేదని అధికారులు వెల్లడించారు. సిర్సాలోని డేరా కొత్త ప్రధాన కార్యాలయంలో ఇంకా 200మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారమని డిప్యూటీ కమిషనర్ ప్రభ్‌జ్యోత్ సింగ్ తెలిపారు. వారిని కూడా క్రమంగా బయటకు తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే డేరా పాత కార్యాలయంలో ఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి, ఇళ్లకు పంపించామని చెప్పారు. డేరా సిబ్బంది సహకారం తీసుకుని వారిని బస్సుల్లో సొంతూళ్లకు పంపామన్నారు. సిబ్బంది అంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారేనని అన్నారు. అంతేకాకుండా 18 మంది బాలికలను 34 మంది బాలురను బయటకు తీసుకువచ్చామని చెప్పారు. అయితే, వారు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇళ్లకు వెళ్లాలనుకున్న వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను ప్రభుత్వ ఆశ్రమకేంద్రాల్లో చేర్పిస్తున్నామన్నారు. వాళ్లంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. డేరా నిర్వాహకులు తమకు ఈ విషయంలో సహకరిస్తున్నారని చెప్పారు. డేరా ప్రధానకార్యాలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, సైన్యం, పోలీసు పహారా కాస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి సిర్సాలో కర్ఫ్యూ సడలించారు. కాగా, ఇప్పటివరకు 6,500మంది డేరా అనుచరులను బయటకు రప్పించి వారిని బస్సుల్లో ఇళ్లకు పంపినట్లు సమాచారం. -
శిక్షను సవాల్ చేయనున్న గుర్మీత్ సింగ్
రోహ్తక్: అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 20 సంవత్సరాల జైలు శిక్ష తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తరఫు న్యాయవాదులు సూచన ప్రాయంగా తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని రోహ్తక్ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆశ్రమంలో సాధ్వీలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన జడ్జి జగ్దీప్ సింగ్.. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2002నాటి అత్యాచారం కేసును సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించలేకపోయిందని గుర్మీత్ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. గుర్మీత్ గొప్ప సంఘ సవకుడు: సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయడానికి ముందు వాదనలు వినిపించిన గుర్మీత్ సింగ్ న్యాయవాదులు.. బాబాను గొప్ప సంఘ సేవకుడిగా పేర్కొన్నారు. పేదల కోసం ఆయన ఎన్నో సేవలు చేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని కఠినశిక్షలేవీ వేయవద్దని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ మాత్రం గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది. అన్నీ విన్న జడ్జి చివరికి గుర్మీత్‌కు 10 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు. (చదవండి: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష) -
'గుర్మీత్ రాంరహీం సింగ్‌ను ఉరితీయాలి'
పంజాబ్, హరియాణాలో క్షణక్షణం ఉత్కంఠ రెండు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ వారణాసిలో గుర్మీత్‌కు వ్యతిరేకంగా సాధువుల నిరసన సాక్షి, పంజాబ్, హరియాణా: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు మరికాసేపట్లో శిక్ష పడనున్న నేపథ్యంలో పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పోలీసుల నిఘా నీడలో గడుపుతున్నాయి. డేరా మద్దతుదారులను ఎదుర్కొనేందుకు అడుగడుగునా పోలీసులు, భద్రతాదళాలు భారీగా మోహరించారు. బలగాల కవాతు నిర్వహిస్తూ.. ప్రజలు శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని, వీధుల్లోకి, రోడ్లమీదకు రావొద్దని పిలుపునిస్తున్నారు. ఇక గుర్మీత్ జైలులో ఉన్న రోహతక్‌లో బలగాలు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీచేశారు. రోహతక్ జైలుకు ప్రత్యేక హెలికాప్టర్లో రానున్న సీబీఐ జడ్జీ కారాగారంలోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో రోహతక్ పూర్తిగా భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లింది. పంజాబ్, హరియాణాలోని చాలా పట్టణాలు, నగరాల్లోనూ భద్రతా దళాలు, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తూ..పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోవైపు గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత భద్రతా సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో పంజాబ్, హరియాణాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. 'గుర్మీత్‌ను ఉరితీయాలి' అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రాంరహీం సింగ్‌పై హిందూ సాధువులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్మీత్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలో సాధువులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుర్మీత్‌ను ఉరితీయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. -
డేరాను డేర్‌తో నడిపించేది ఈమే..!
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ (30). ‘తండ్రి ముద్దుల కూతురు, పరోపకారి, దర్శకురాలు, సంపాదకురాలు, నటి’ ఇవి సోషల్ మీడియాపై హనీ ప్రీత్ సింగ్ పరిచయ వాక్యాలు. డేరా చీఫ్ గుర్మీత్‌కు ఈమె దత్త పుత్రిక. ఈమె ట్విటర్ అకౌంట్‌కు 10 లక్షల మంది, ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తండ్రితో ‘ఎంఎస్‌జీ 2 – ద మెసెంజర్’, ఎంఎస్‌జీ – ద వారియర్ లయన్ హార్ట్’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. అంతేకాదు గుర్మీత్ నటించిన చిత్రాలకు ఈమే దర్శకురాలు, ఎడిటర్ కావటం విశేషం. ఈమెకు సొంతంగా "www. HoneypreetInsan.me' అనే వెబ్సైట్ కూడా ఉంది. ‘అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు’ అని ఈ సైట్లో పెద్దగా రాసి ఉంటుంది. ‘50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గురుపా’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి చీకటి క్షణాన్ని తేజోవంతం చేసినందుకు ధన్యవాదాలు’ అని ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా హనీప్రీత్ ట్వీట్ చేశారు. ఇప్పుడు తండ్రి గైర్హాజరీలో డేరా సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత హనీప్రీత్‌దే. గుర్మీత్ సీబీఐ కోర్టుకు వచ్చినపుడు తండ్రితోపాటుగా ఈమె కూడా వచ్చింది. గుర్మీత్ సింగ్ భార్య హర్జీత్ కౌర్. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. -
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్టక్:రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్టక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. ‘రోహ్టక్లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. ఇక గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ న్యూఢిల్లీ: రామ్ రహీమ్ సింగ్ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ పీఆర్వో మధుర్ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్ తెలిపారు. -
కోతుల్లాగ ప్రవర్తిస్తే ఇలాగే అవుతుంది: నటి
ముంబై: డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్ రాంరహీం సింగ్ దోషీగా తేలడంపై బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా భిన్న శైలిని అనుకరిస్తున్నారు. అసలు మనం కోతుల్లాగా మెదడు వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారని నటి అభిప్రాయపడ్డారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారని, ఇలాంటి పనులు తనను కొన్నిసార్లు ఆందోళనకు గురిచేస్తుంటాయని ఆమె చెప్పారు. పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందన్నారు ట్వింకిల్. జనాలు నమ్ముతున్న కొద్దీ ఇలాంటి బాబాలు మంచి కంటే చెడును వ్యాప్తి చేస్తారన్నారు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా మనలో మార్పు వస్తే చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు. -
డేరాల విధ్వంసం.. రాబర్ట్ వాద్రా ఆందోళన!
న్యూఢిల్లీ: హరియానాతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధ్వంసకాండపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తీవ్రంగా స్పందించారు. డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం మద్ధతుదారులు చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ 36 మంది మృతిచెందడంతో పాటు 250కి పైగా మంది గాయపడ్డారని.. దీనికి హరియానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదివారం ఆయన డిమాండ్ చేశారు. గుర్మీత్ అనుచరుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించి, ఎన్నోసార్లు విచారణ చేపట్టి వేధించారని.. ఇంటిగ్రిటీ లేదని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హరియానాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించలేని వ్యక్తి సీఎం హోదాలో ఉండేందుకు అనర్హుడని వాద్రా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గుర్మీత్ ఆస్తులు వేలం వేసి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని పంజాబ్, హరియానా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించడాన్ని వాద్రా మెచ్చుకున్నారు. స్వేచ్ఛగా ప్రాణాలతో బతికేందుకు హరియానా ప్రజలకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే దేశంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2002లో జరిగిన అత్యాచారాల కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హరియాణలో ఆయన మద్దతుదారులు హింసాకాండను సృష్టించారు. -
డేరాలో ప్రత్యేక కరెన్సీ
సిర్సాః డేరా సచా సౌథా ప్రధాన కార్యాలయంలో గుర్మీత్ సింగ్ అనుచరులు ఏకంగా ప్రత్యేక కరెన్సీని రూపొందించుకున్నారు. వేయిఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు, సంస్థల్లో చిల్లర కొరతను అథిగమించేందుకు రూ 10, రూ5 ప్లాస్టిక కాయిన్లు, టోకెన్లను కస్టమర్లకు ఇస్తున్నారు. వీటిపై ధన్‌ధన్ సద్గురు...డేరా సచా సౌథా సిర్సా అని రాసి ఉంటుంది. ఈ టోకెన్లు, కాయిన్లను కస్టమర్లు సచ్ షాపుల్లో చూపించి తర్వాత తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఓ కస్టమర్ రూ 70 విలువైన ఏదైనా వస్తువును కొనుగోలు చేసి షాపు ఓనర్‌కు రూ 100 ఇస్తే మిగిలిన రూ 30కి మూడు పది రూపాయల విలువైన ప్లాస్టిక టోకెన్లను ఇస్తారు. ఈ ప్లాస్టిక్ కాయిన్లకు భిన్న రంగుల కోడ్‌ను షాపు ఓనర్లు మెయింటైన్ చేస్తున్నారు. డేరా చీఫ్ గుర్మీత్‌ను రేప్ కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేచ్చిన క్రమంలో డేరా క్యాంపస్‌ను సందర్శించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకూ భారత కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కాయిన్స్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు డేరా ప్రాంగణాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడంతో గతంలో తనకు ఇచ్చిన రూ 10 విలువైన ఇలాంటి మూడు కాయిన్లను ఉపయోగించలేకపోతున్నానని సమీప బెగూ గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. -
టెన్షన్: డేరా ఆశ్రమంలో ఇంకా 30వేలమంది!
సిర్సా: హరియాణలోని సిర్సా పట్టణంలో ఇంకా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాజధాని చండీగఢ్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్సా పట్టణంలో ఉన్న డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమంలో 30వేల మంది గుమిగూడి ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వెయ్యి ఎకరాల ఆశ్రమంలో తిష్టవేసిన 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు ఆశ్రమం వీడి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు, సైన్యం ఆశ్రమాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఆశ్రమంలోని వారు వెంటనే బయటకు రావాలని సందేశం పంపుతున్నా.. లోపలున్న డేరా మద్దతుదారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 15 ఏళ్ల కిందటి లైంగిక దాడి కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో హరియాణలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి తెగబడి.. హింసాకాండను సృష్టించారు. ఈ నేపథ్యంలో రోహతక్‌లోని జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించబోతున్నారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో రోహతక్‌లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరోవైపు గుర్మీత్‌కు శిక్ష నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా దళాలు హరియాణ అంతటా పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో సిర్సాలోని గుర్మీత్ ఆశ్రమంలో 30వేలమంది పొంచి ఉండటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. -
డేరా కమామిషు!
69 ఏళ్ల చరిత్ర.. గుర్మీత్ బాధ్యతలు చేపట్టాకే వివాదాలు మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన డేరా సచ్ఛా సౌదా(డీఎస్ఎస్)కు 69 ఏళ్ల చరిత్ర ఉంది. డీఎస్ఎస్కు గుర్మీత్ నాయకత్వం చేపట్టినప్పటి నుంచి దీని నడక కొత్త పుంతలు తొక్కింది. డేరాల నేపథ్యం హిందూ ఆశ్రమాల మాదిరిగా పనిచేసే ఆధ్యాత్మిక కేంద్రాలను అవిభక్త భారత్‌లోని పంజాబ్, సింధ్, ఫక్తూనిస్తాన్లలో డేరాలుగా పిలుస్తారు. పంజాబ్‌లో అతిపెద్దది, మొదటిది అయిన డేరా రాధాస్వామీ సత్సంగ్ బియాస్‌ను 1891లో ప్రారంభించారు. పంజాబ్, హరియాణాలో 9000కుపైగా డేరాలున్నాయని ఓ అంచనా. డేరా రాధాస్వామీ సత్సంగ్తోపాటు డీఎస్ఎస్, డేరా నూర్మహల్, డేరా సచ్‌ఖండ్ బలాన్, డేరా నిరంకారీ, డేరా నాంధారీ ఎక్కువ మంది అనుచరులున్న డేరాలు. రోజూవారీ జీవితంలో తాము ఎదుర్కొంటున్న అగ్రవర్ణాల ఆధిపత్యం డేరాల్లో లేకపోవడం బడుగువర్గాలకు నచ్చింది. తమకు తాముగా పీఠాధిపతిగా ప్రకటించుకుని, భక్తుల కోసం ప్రసంగాలు, ప్రవచనాలు చేసే గురువులు, బాబాలు ఈ ప్రాంతంలో 19వ శతాబ్దం నుంచి డేరాలు ప్రారంభించారు. డీఎస్ఎస్ స్థాపన, విస్తరణ.. మస్తానా బలూచీ అనే క్షత్రియ సన్యాసి అవిభక్త పంజాబ్ (ప్రస్తుత హరియాణా)లోని సిర్సాలో డీఎస్ఎస్ను స్థాపించారు. 1948–60 మధ్యకాలంలో ఇక్కడ నామ్ శపథ్ అనే ధ్యానం ఎలా చేయాలో మస్తానా బోధించారు. డీఎస్ఎస్ తర్వాతి అధినేత అయిన సత్నామ్సింగ్ డేరాను 1960 నుంచి 1990 మధ్య విస్తరించారు. 1990 ఏప్రిల్‌లో గుర్మీత్ అధిపతి అయ్యారు. డేరా వెబ్సైట్లో బాబా గుర్మీత్ పేరును సెయింట్ డాక్టర్ గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ ఇన్సాన్‌గా ప్రస్తావించడమేగాక ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల మంది అనుచరులున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా ముఖ్య పట్టణమైన సిర్సాలో వెయ్యి ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందీ డీఎస్ఎస్ ప్రధానకేంద్రం. దీనిలో హొటెల్, సినిమాహాలు, క్రికెట్ మైదానం, క్రీడా గ్రామం, స్టూడియో, బయోగ్యాస్ ప్లాంట్ ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా బాబాను కలవడం అసాధ్యం. డేరా వెలుపల బాబా గుర్మీత్ అనుచరులు నడిపే 40 దుకాణాలున్నాయి. ఆకర్షిస్తున్న డేరా కార్యక్రమాలు దేశంలోనూ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ వంటి ఇతర దేశాల్లో కలిపి డీఎస్ఎస్కు 46 ఆశ్రమాలున్నాయి. డీఎస్ఎస్ చేపట్టే అనేక సేవా కార్యక్రమాలు లక్షలాది అనుచరులను ఆకట్టుకుంటున్నాయి. డేరా రెండో గురువు పేరిట సత్నామ్జీ గ్రీన్–ఎస్ వేల్ఫేర్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయం అందిస్తున్నారు. కోల్‌కతా అగ్నిప్రమాదం, జలంధర్ ఫ్యాక్టరీ ప్రమాదం, ఉత్తరాఖండ్ వరదల్లోనూ సంస్థ తరఫున వందలాది మంది వైద్యులు, వలంటీర్లు పనిచేశారు. రాజకీయ క్రీ‘డేరా’! దేశంలో స్వయం ప్రకటిత స్వామిజీలు, బాబాలు, గురువులతో అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల బంధం విడదీయరానిదిగా మారుతోంది. ఇందుకు గుర్మీత్ సింగ్ మినహాయింపేం కాదు. ఇతనికి కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం, న్యాయస్థానం దోషి అని తేల్చాక కూడా ప్రధాన పార్టీల నేతలు స్పందించకపోవడాన్ని బట్టి డేరా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దళిత, బీసీల ఓట్ల కోసమే... పంజాబ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో నిమ్న తరగతులకు చెందినవారు పెద్దసంఖ్యలో డేరా అనుచరులున్నారు. వారి ఓట్లను పొందేందుకే రాజకీయపార్టీలు డేరా మద్దతు కోసం పోటీపడుతున్నాయి. 2014లో బీజేపీకి మొదలైన డేరా మద్దతు లోక్‌సభ ఎన్నికలు, హరియాణా అసెంబ్లీ ఎన్నికల వరకు, ఆ తర్వాతా కొనసాగుతోంది. డేరా వర్గం ఓట్లు అటు కేంద్రంలో ఇటు హరియాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు తోడ్పడ్డాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణాకు వచ్చిన నాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని మోదీ సిర్సా బహిరంగసభలో, అంతకు పూర్వం పాల్గొన్న సభల్లోనూ, గుర్మీత్‌ను కీర్తించారు. గతంలోనే అమిత్ షా, పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అనేక మంది నాయకులు డేరా కేంద్రాన్ని సందర్శించారు.గుర్మీత్‌ను దోషిగా తేల్చిన శుక్రవారానికి పదిరోజుల ముందు... ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు కార్యక్రమానికి హరియాణా విద్యా శాఖ మంత్రి రాంవిలాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డేరాలో క్రీడల ప్రోత్సాహం పేరుతో తన శాఖ నిధుల నుంచి మంత్రి రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. భారత యోగా ఫెడరేషన్ ఇటీవల క్రీడల్లో గురువులకిచ్చే ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య’ అవార్డుకు డేరా చీఫ్ పేరును సిఫార్సు చేసింది. గుర్మీత్ది ‘గొప్ప ఆత్మ’ (నోబుల్ సోల్) అని శుక్రవారం బీజేపీ నేత సాక్షి మహారాజ్ కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ గుర్మీత్ సింగ్‌పై కేసులు.. ► తనతో విభేదించిన డేరా మేనేజర్ రంజిత్‌సింగ్ హత్యకు గుర్మీత్ రామ్‌రహీమ్‌సింగ్ 2002 జూలైలో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. డేరా ప్రధాన కేంద్రం సిర్సాలో సాధ్వీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని రంజిత్‌సింగ్ ఆకాశరామన్న లేఖలు పంపిణీ చేశాడని అనుమానించారు. ► డేరా ప్రధాన కార్యాలయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ వార్తా కథనాలు రాసిన సిర్సాకు చెందిన రాంచందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడు 2002 అక్టోబర్ 23న హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ప్రమేయముందంటూ గుర్మీత్‌తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ► 2014 డిసెంబర్ 23న డేరా ప్రధాన కేంద్రంలో గుర్మీత్ తన అనుయాయులైన 400 మంది వృషణాలను నొక్కేసి నిర్వీర్యులను చేశారన్న ఆరోపణలపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. ► సిక్కుల మతగురువు గురు గోవింద్ సింగ్ మాదిరిగా గుర్మీత్ దుస్తులు ధరించారంటూ 2007లో భటిండా పోలీసులు కేసు నమోదు చేశారు. ► సిర్సాలో డేరా కార్యకర్తలకు ఆయు«ధ శిక్షణనిస్తున్నారంటూ భారత సైన్యం పేర్కొంది. ఆయుధ శిక్షణపై పరిశీలన జరిపి వివరాలు తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులిచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎవరీ గుర్మీత్?
రాజస్తాన్‌లోని గంగానగర్ జిల్లాలోని శ్రీ గురుసార్ మోడియా గ్రామం గుర్మీత్ స్వస్థలం. జాట్ సిక్కు, సంపన్న రైతు మఘర్ సింగ్, నసీబ్ కౌర్‌ల ఏకైక సంతానం.1967 ఆగస్టు 15న గుర్మీత్ పుట్టారు. డేరా సచ్చా సౌదా మతగురువు షా సత్నామ్... గుర్మీత్‌ను ఏడేళ్ల వయసులోనే తనతో తీసుకెళ్లి సచ్చా సౌదాలో చేర్పించారు. పేరును గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌గా మార్చారు. గుర్మీత్‌కు 23 ఏళ్ల వయసు ఉన్నపుడు మత గురువు హోదాను ప్రసాదించి సెప్టెంబర్ 23, 1990లో తన వారసుడిగా ప్రకటించారు షా సత్నామ్. గుర్మీత్‌కు భార్య హర్జీత్ కౌర్, కొడుకు జస్మీత్, కూతుళ్లు చరణ్‌ప్రీత్, అమర్‌ప్రీత్ ఉన్నారు. హనీప్రీత్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. హనీప్రీత్ పంజాబీ సినీనటి, దర్శకురాలు. గుర్మీత్ సహా కుటుంబంలో అందరి పేరు చివరన ‘ఇన్సాన్ (మనిషి)’ అనే పదం ఉంటుంది. సకల కళావల్లభుడు గుర్మీత్ వేషధారణ రాక్‌స్టార్‌ను తలపిస్తుంది. జిగేల్మని మెరిసిపోయే ఆభరణాలు, వస్త్రధారణతో కనిపిస్తుంటారు. చలువ కళ్లజోడు, టీషర్టులు, రంగురంగుల చొక్కాలతో కనిపిస్తారు. ఆధ్యాత్మిక గురువు, దానశీలి, గాయకుడు, ఆల్‌రౌండర్ క్రీడాకారుడు, సినిమా దర్శకుడు, నటుడు, ఆర్ట్ డైరెక్టర్, సంగీత దర్శకుడు, రచయిత, గేయ రచయితగా ట్వీటర్ ప్రొఫైల్‌లో రాసుకున్న గుర్మీత్‌ను సకల కళావల్లభుడిగా చెప్పొచ్చు. ట్వీటర్లో ఆయనకు 37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వయంగా పాటలు రాసి, సంగీతం సమకూర్చి ఆల్బమ్స్ విడుదల చేస్తుంటారు. ఆధునిక సంగీతం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నానని చెప్పుకుంటారు. యూనివర్సల్ లేబుల్ కింద పాటల ఆల్బమ్స్‌ను విడుదల చేస్తుంటారు. 2014లో వచ్చిన హైవే లవ్ చార్జర్ ఆల్బమ్ మూడురోజుల్లోనే 30 లక్షల కాపీలు అమ్ముడైంది. సంగీత ప్రదర్శనలూ ఇస్తుంటారు. దేశంలోని వివిధ నగరాల్లో ఆయన ‘రు–బా–రు నైట్స్’ పేరిట వంద ప్రదర్శనలు ఇచ్చారు. రచన– దర్శకత్వం– స్క్రీన్ ప్లే– మాటలు– పాటలు సినిమాల్లోనూ గుర్మీత్‌కు ఆసక్తి మెండు. తన సినిమాల్లో తానే హీరో, తానే దర్శకుడు, కథ, మాటలు, పాటలు... ఇలా అన్నీ తానే. మెసెంజర్ ఆఫ్ గాడ్ (ఎంఎస్‌జీ) పేరిట రెండు సినిమాలను 2015లో తీశారు. దుష్టశక్తులు, గ్రహాంతరవాసుల నుంచి మానవాళిని కాపాడే గురూజీ పాత్రలో గుర్మీత్ నటించారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులను నడుపుతారు. తర్వాత ఎంఎస్‌జీ: ద వారియర్ లయన్హర్ట్, హింద్ కా నపాక్కో జవాబ్, జట్టూ ఇంజనీర్... అనే మూడు సినిమాలను తీశారు. దేశవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ఈయన సినిమాలు విడుదలవుతుంటాయి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈయన పేరుంది. ఎందుకో తెలుసా.. ఒక సినిమాలో అత్యధిక బాధ్యతలు నిర్వర్తించినందుకు. ఎంఎస్‌జీ–2 సినిమాకు గుర్మీత్ ఏకంగా 43 బాధ్యతలు నిర్వర్తించాడు. అకల్తక్త్తో వివాదం సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్‌ను పోలిన వస్త్రధారణ చేయడం ద్వారా సిక్కుల ఆగ్రహానికి గురయ్యారు గుర్మీత్. 2007లో జరిగిన ఈ సంఘటన సిక్కులకు, గుర్మీత్ అనుయాయులకు మధ్య ఉద్రిక్తతల కారణంగా ఘర్షణలు జరిగాయి. సిక్కుల మనోభావాలను దెబ్బతీశాడని కేసు నమోదైంది. మధ్యవర్తులు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో గుర్మీత్ ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పినా సిక్కుల మత వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత మండలి ‘అకల్తక్త్’ సంతృప్తి చెందలేదు. క్షమాపణ సరిగా కోరలేదని అభిప్రాయపడింది. 2015 సెప్టెంబర్ 27న క్షమాపణను అంగీకరించినా సిక్కుల వ్యతిరేకతతో మళ్లీ ఉపసంహరించుకుంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ మనోభావాలను దెబ్బతీశాడని రగిలిపోయిన సిక్కు యువకులు 2007 జూలై 16న గుర్మీత్‌పై దాడి చేశారు. దీని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 2008లో ఆయన కాన్వాయ్‌పై బాంబుదాడి జరిగింది. ఇందులో గుర్మీత్‌కు ఏమీ కానప్పటికీ 11 మంది అనుయాయులు గాయపడ్డారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. జడ్ ప్లస్‌లో 36 మంది సుశిక్షితులైన కమాండోలను భద్రత నిమిత్తం కేటాయిస్తారు. విలాసవంతమైన జీవనశైలి ఖరీదైన కార్లపై మోజు. బుల్లెట్ ప్రూఫ్ లెక్సస్, మెర్సిడెజ్ ఎస్‌యూవీల్లో తిరుగుతుంటారు. చిత్రమైన కార్లను డిజైన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా మందీమార్బలంతో తరలివెళతారు. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. డేరా సచ్చా సౌదాకు దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. డేరా ఆస్తులు కాకుండా గుర్మీత్ వ్యక్తిగత సంపద విలువ... 250 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డేరా విధ్వంసకాండ
- తగలబడ్డ హరియాణా, పంజాబ్ - 36 మంది మృతి.. 269 మందికి గాయాలు పంచకుల/చండీగఢ్/న్యూఢిల్లీ: హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు భగ్గుమన్నాయి. డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను రేప్‌కేసులో శుక్రవారం సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించటంతో ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ ఆయన అభిమానులు బీభత్సం సృష్టించారు. వీరి విధ్వంసకాండతో రెండు రాష్ట్రాల్లో 36 మంది చనిపోగా.. 269 మంది గాయపడ్డారు. డేరా అభిమానులు పెట్రోలు బాంబులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. పంచకులలో వీరి ఉన్మాదానికి కనబడ్డ వస్తువల్లా అగ్నికి ఆహుతైంది. రైలు, బస్సు, కారు, బైక్ అనే తేడా లేకుండా ప్రతి వాహనాన్నీ అన్యాయంగా తగలబెట్టేశారు. భవనాలనూ ఆందోళనకారులు వదల్లేదు. పంచకులలో ఎటుచూసినా వాహనాలను తగులబెట్టిన అగ్నికీలలే ఎగిసిపడ్డాయి. తమ ఉన్మాదాన్ని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. మొత్తంగా హరియాణాలోని పంచకుల, సిర్సాలతోపాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ అల్లర్లలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ శివార్లలో డేరా ఉన్మాదులు ఓ రైలు బోగీని తగులబెట్టారు. రాజస్తాన్‌లోనూ ప్రభుత్వ వాహనాలు, శ్రీ గంగానగర్ జిల్లాలో లేబర్ కోర్టు సహా రెండు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుబెట్టారు. డేరాల ప్రాబల్యమున్నచోట.. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలోనూ 32 దాడి కేసులు నమోదయ్యాయి. డేరా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మాన్సా, బతిండా, ఫిరోజ్‌పూర్, పటియాలా, బర్నాలా, ఫరీద్కోట్ ప్రాంతాలతోపాటుగా హరియాణాలోని పంచకుల, సిర్సాతోపాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ (144 సెక్షన్) విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పంజాబ్‌లోని మాన్సాలో ఆదాయపన్ను శాఖ భవనాన్ని తగులబెట్టగా.. మిగిలిన చోట్ల రైళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, భవనాలకు నిప్పంటించారు. మోగా, ఫిరోజ్‌పూర్ మధ్యనున్న దాగ్రు రైల్వే స్టేషన్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పంచకులలో విధ్వంసం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసంతోపాటుగా మూడు టీవీచానెళ్ల ఓబీ వ్యాన్లను తగులబెట్టారు. రెండింటిని ధ్వంసం చేశారు. ఓ చానెల్ వాహనంపై దాడిచేయటంతో కెమెరామెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినా విధ్వంసం ఆగలేదు. డేరా కార్యాలయాల్లో సోదాలు కోర్టు ఆదేశాలతో సిర్సాతోపాటుగా హరియాణాలోని డేరా ప్రధాన కార్యాలయంతోపాటుగా 30 వేర్వేరు కేంద్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న అనుచరులు, భక్తులను పంపించేశారు. ఈ సోదాల్లో ఓ ఏకే 47, ఆరు పిస్టళ్లు, రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 3వేల లాఠీలు, హాకీ స్టిక్స్, పెద్ద సంఖ్యలో డీజిల్, పెట్రోల్ బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేరా అభిమానులపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. డేరాకు సంబంధించిన 24 వాహనాలను సీజ్ చేసి వాటి నుంచి ఐదు పిస్టళ్లు, 79 రౌండ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి హరియాణాలో 552 మందిని అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్ సంధు వెల్లడించారు. ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, డేరా చీఫ్‌పై అభియోగాలు నమోదైన కేసులో దోషులకు సాధారణంగా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. పలు కేసుల్లో ఇది జీవితఖైదుగా కూడా మారే అవకాశం ఉంది. అసలేం జరిగింది? 2002 నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా డేరా చీఫ్ గుర్మీత్‌ను సీబీఐ కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో వేల మంది డేరా అభిమానులు, కార్యకర్తలు కోర్టుముందు గుమిగూడారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో.. అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముందస్తుగానే అల్లర్లపై ప్రణాళికతో సిద్ధమై వచ్చిన ఆందోళనకారులు.. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. సీబీఐ కోర్టు ఉన్న హరియాణాలోని పంచకుల కేంద్రంగానే ఈ గొడవలు ప్రారంభమైనా ఈ సమాచారం దావానలంలా వ్యాపించింది. నిఘావర్గాల హెచ్చరికలు బేఖాతరు! డేరా చీఫ్ అభిమానుల విధ్వంసపు ఆలోచనల సంగతిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ముందుగానే సమాచారం అందించింది. మూడేళ్ల క్రితం హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఇదేవిధంగా అన్యాయాలకు పాల్పడిన బాబా రాంపాల్‌ను అరెస్టు చేసే సందర్భంలో అతని అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన విషయం సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ గుర్మీత్‌పై కోర్టు తీర్పు ఆధారంగా విధ్వంసానికి అతని అభిమానులు ప్రయత్నించే అవకాశం ఉందని హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ సూచించింది. అయితే సూచనలను ఇరు ప్రభుత్వాలూ పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. హింస మొదలవుతూనే.. పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారంటే ఎంత పకడ్బందీగా దాడులకు వ్యూహరచన జరిగిందో అర్ధమవుతుంది. వీఐపీ సౌకర్యాల్లేవు! కోర్టు తీర్పు నేపథ్యంలో డేరా చీఫ్ రాంరహీమ్ గుర్మీత్ సింగ్‌కు గతంలో కేటాయించిన ‘జడ్ ప్లస్’ భద్రతను హరియాణా ప్రభుత్వం వెనక్కుతీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎస్ దేశీ వెల్లడించారు. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో డేరా చీఫ్‌కు వీఐపీ వసతులు కల్పిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కాగా, జైలు చుట్టుపక్కల భారీ సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించారు. వదంతులను నమ్మొద్దని, సంయమనం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచించారు. డేరా అభిమానుల విధ్వంసంతో పంజాబ్–హరియాణాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. జమ్మూ శివార్లలోని ప్రధాన రైల్వేస్టేషన్లో ఈ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులను ఆపేశారు. దీంతో వైష్ణోదేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంజాబ్, హరియాణాల్లో జరిగిన విధ్వంసకాండను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. పంచకుల డీసీపీ సస్పెన్షన్ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటంతో విఫలమయ్యారంటూ వివాదానికి కేంద్రబిందువైన పంచకుల డీసీపీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా, కోర్టు సమీపంలో భారీగా జనాలు గుమిగూడుతున్నా వారిని చెదరగొట్టడంలో విఫలమయ్యారని హరియాణా హోం శాఖ అదనపు కార్యదర్శి రాం నివాస్ పేర్కొన్నారు. హరియాణా, పంజాబ్‌లలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి, పారామిలటరీ బలగాల చీఫ్‌లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. పరిస్థితి అదుపులో ఉందని హరియాణా, పంజాబ్ డీజీపీల నుంచి సమాచారం అందినట్లు సమావేశం అనంతరం రాజీవ్ మెహర్షి వెల్లడించారు. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లలో 20వేలకు పైగా పారామిలటరీ బలగాలను మోహరించారు. రేప్ కేసులో దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్పై 2002 నాటి ఓ అత్యాచారం కేసులో సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. దీనిపై శుక్రవారం విచారించిన పంచకుల సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్.. డేరాచీఫ్ను దోషిగా తేల్చారు. గుర్మీత్ అరెస్టుకు ఆదేశాలు జారీచేయటంతోపాటుగా సోమవారం ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. తనను దోషిగా తేల్చటంతో రాంరహీమ్ ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన తరపు న్యాయ వాది తెలిపారు. అరెస్టు ఆదేశాలు వెలువడగానే.. డేరాచీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు రాంరహీమ్ వచ్చిన వాహన శ్రేణి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికా>ప్టర్‌లో రోహ్తక్ జైలుకు తరలించారు. కాగా, సీబీఐ కోర్టు న్యాయమూర్తి సోమవారం సునారియా జైలుకెళ్లి గుర్మీత్‌కు విధించాల్సిన శిక్షలను ఖరారు చేయనున్నారు. ఖట్టర్‌ను తొలగించబోం: బీజేపీ డేరా ఉన్మాదకాండ నేపథ్యంలో హరియాణా సీఎం ఖట్టర్‌ను తొలగించాలన్న విపక్షాల డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. ‘హరియాణా, పంజాబ్‌లలో జరిగిన ఘటనలు దురదృష్టకరం. అయినా విధ్వంసం మొదలైన మూడుగంటల్లోనే ప్రభుత్వం పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఇది సీఎం ఖట్టర్ వైఫల్యమేమీ కాదు. ఆయన్ను తొలగించాలన్న ఆలోచనేదీ లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి, హరియాణా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. డేరా ఆందోళనకారుల విధ్వంసకాండతో జరిగిన నష్టాన్ని ఆ సంస్థ ఆస్తుల నుంచే రికవరీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
గుర్మీత్ తీర్పు: జైలుకే జడ్జి!
ఛండీగఢ్: జంట అత్యాచార కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సోమవారం శిక్షలు ఖరారు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పంచకులలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను జైలు నుంచి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జగ్దీప్ సింగ్నే రోహతక్ జైలుకు తీసుకెళ్తామని హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ సంధు వెల్లడించారు. ఛండీగఢ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఒకవేళ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనకు శిక్షలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక అల్లర్లలో పంచకులలో 30 మంది, సిస్రాలో ఆరుగురు చనిపోగా, 269 మంది గాయపడినట్లు డీజీపీ సంధు వెల్లడించారు. జడ్జికి భద్రత కల్పించండి: కేంద్ర హోంశాఖ రాష్ట్రాన్ని వణికిస్తున్న డేరా అనుచరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ కేంద్రం హర్యానా ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గుర్మీత్‌ను దోషిగా తేల్చిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌కు హైలెవల్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖ నుంచి హర్యానా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. తీర్పు అనంతరం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో జడ్జికి భద్రత పెంచాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హోంశాఖ వర్గాలతో చర్చించి అవసరమైతే జగ్దీప్ సింగ్‌కు సీఆర్పీఎఫ్ లేక సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తామని హర్యానా పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే హర్యానాతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు సృష్టించిన భీభత్సం, హింసలో 31 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉండటంతో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సంయమనం పాటించినందుకు పంజాబ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. -
డేరాలంటే ఏమిటీ? వాళ్లకింత బలం ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: డేరా అన్న పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని అంటారు. డేరా అంటే తాత్కాలిక గుడారం లేదా తాత్కాలిక సమావేశ స్థలం. ఎండ తగులకుండా డేరాను వేసుకొని ప్రజలు లేదా ఆధ్యాత్మికవాదులు, తమ నాయకులు లేదా ఆధ్యాత్మిక గురువులు చెప్పే మాటాలను వినేందుకు ఈ డేరాల కింద సమావేశమయ్యేవారు. కాలక్రమంలో డేరాలకు శబ్దార్థం మారుతూ వచ్చింది. మజిలీ, మజ్లీస్ అని, అన్న పానీయాలు అందుబాటులో ఉండే చోట అనే అర్థం కూడా వచ్చింది. ఒకప్పుడు డేరాలంటే తాత్కాలికంగా తాళ్లతో కట్టేవే ఉండేవి. ఇవి కూడా ఆధునిక హంగులను పులుముకుని ఏసీ గదులుగా మారిపోయాయి. ఏదేమైనా పంజాబ్ రాష్ట్రంలో విస్తరించిన డేరాలకు అర్థం చెప్పాలంటే ఆధ్యాత్మిక అంశాల గురించి బోధించే గురువుండే గుడారం. ఒక్కో ఆధ్యాత్మిక గురువుది ఒక్కో గుడారం. ప్రతి గుడారానికి ఓ పేరుంటుంది. గుళ్లు, గోపురాల్లాగే ఓ ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉండే ఈ డేరాలు, అంటే గుడారాలు చాలా చోట్ల సిమెంట్‌తో నిర్మించిన పక్కా మందిరాలుగా కూడా మారిపోయాయి. మతాలకు, డేరాలకు ప్రత్యక్ష సంబంధం ఏమీ ఉండదు. ఆయా మతాల విశ్వసించే గురువులనుబట్టి వారి బోధనలు ఉంటాయి. సిక్కు పవిత్ర గ్రంధం ‘గురు గ్రంథ్ సాహిబ్’ను నమ్మే గురువు ఆ గ్రంధంలో ఉన్న బోధనలే ప్రజలకు విడమర్చి చెప్పవచ్చు. సిక్కు మతాలే కాకుండా ఇతర మతాలకు చెందిన గురువులు కూడా పంజాబ్‌లో డేరాలను నిర్వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పదివేలకుపైగా డేరాలు ఉంటాయన్నది పంజాబ్ యూనివర్శిటీ పొలిటికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పనిచేస్తున్న రోంకీ రామ్ అంచనా. అత్యాచారం కేసులో అరెస్టై జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌ది అందులో ఒక డేరా. డేరా సచ్ఛా సౌదా అన్నది దాని పేరు. ఆయన దేవుళ్లు, మతాలు అన్ని సమానమని చెప్పడానికే తన పేరును ‘గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్’గా మార్చుకున్నారు. డేరాలకు ఓ సిక్కు, క్రిస్టియన్, ముస్లిం లేదా బౌద్ధ మతస్థుడు ఎవరైన నాయకుడిగా అంటే గురువుగా ఉండవచ్చు. ఆ డేరాకు తానే గురువన్న హోదాలో ప్రజలకు ప్రబోధనలు చేయవచ్చు. లేదా ఫలానా గురువు వారసుడినంటూ బోధనలు చేయవచ్చు. ఉదాహరణకు డేరా సచ్‌ఖంద్ బల్లాన్ ‘రవిదాసియా ధర్మాన్ని’ పాటిస్తుంది. అంటే గురువు రవిదాస్ బోధనలను ఆచరిస్తోంది. సచ్ఛా సౌధా, నిరంకారీస్, నాంధారీస్, బినియర్వాలా, రవిదాసియాస్, రాధా సోయామీస్ తదితర డేరాలను సిక్కు యేతర డేరాలుగా పరిగణిస్తారు. సచ్ఛా సౌధా, నిరంకారీస్ లాంటి డేరాలను సిక్కులు నిర్వహిస్తున్నప్పటికీ వాటిని సిక్కు డేరాలుగా గుర్తించడం లేదు. వారు సిక్కుల పవిత్ర గ్రంధాన్ని విశ్వసించి అందులోని బోధనలను చేయడం లేదు. వారు తమకు నచ్చిన అంశాలను నచ్చిన తీరుగా బోధిస్తున్నారు. ఎక్కువ వరకు చాలా డేరాల్లోని గురువులు అన్ని మతాల్లో ఉన్న మంచి అంశాలను ఎంపిక చేసుకొని బోధించడం వల్ల అవి ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండడంతో డేరాలకు వెళ్లే ప్రజల సంఖ్య నానాటికి పెరుగుతూ వచ్చింది. ఫలానా మతం వారికంటూ గిరిగీసుకోక పోవడమే ఈ డేరాల గొప్ప గుణం. దళితులే ప్రధానాకర్షణ పంజాబ్ లాంటి రాష్ట్రంలో డేరాలకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం కొన్ని వందల సంవత్సరాలుగా దళితులను హిందూ, గురుద్వార్, చర్చి, మసీదుల్లోకి అనుమతించక పోవడమే. ఇప్పటికీ కూడా వారికి చాలా చోట్ల అనుమతి లేదు. దేశవ్యాప్తంగా సరసారి 16 శాతం దళితులుంటే ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 33 నుంచి 34 శాతం మంది దళితులు ఉన్నారు. వీరికి డేరాల్లోకి అనుమతి ఉండడంతో వారు ఎక్కువగా డేరాల్లోకి ప్రవేశించడం ఆచారంగా మారింది. పైగా డేరాల్లో ఏ మతస్థులు కూడా తక్కువ కులాల వారిని తక్కువచేసే చూడరు. అలా చూడకూడదని, ప్రజలంతా సమ భావంతో మెలగాలని డేరాల్లో బోధిస్తారు. కనుక డేరాల సంస్కతి ఎక్కువగా నచ్చే ప్రజలు ఉన్నారు. రాజకీయాలకు దూరంగా.... పంజాబ్ నుంచి హర్యానా వరకు విస్తరించిన డేరాలు సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకని చాలా డేరాలు సహజంగానే దూరంగా ఉంటాయి. కానీ అవి కూడా సమాజానికి లోపలే ఉండడం వల్ల సమాజం ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. అందుకనే కొన్ని డేరాలు ఎన్నికల్లో ఫలానా రాజకీయ పార్టీకి ఓటేయండి అంటూ పిలుపు కూడా ఇస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా డేరాలను సందర్శిస్తారు. వారికి కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలసుకుంటారు. వాటిని తీరుస్తామని, అందుకు ప్రతిఫలంగా తమను గెలిపించాలని కోరుతుంటారు. ఇలా రాజకీయ నాయకులు, డేరాల గురువులు పరస్పరం సహకరించుకునే కొత్త సంస్కతి వేళ్లూనుకుంటోంది. హేతువాదిగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు డేరాలను సందర్శించారు. డేరాల మాటున చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు, అరెస్ట్ అవుతున్న వారు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా స్వల్పం. -
హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు
సాక్షి, హరియాణా: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హరియాణా సర్కారుకు శనివారం చివాట్లు పెట్టింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గుర్మీత్ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గుర్మీత్ ఆస్తుల వివరాలను ఈ నెల 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి. పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
గుర్మీత్ కళ్లలో కన్నీటి సుడులు
సాక్షి, హరియాణా: డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట వేదం.. ఆయన అడుగేస్తే ఓ సంచలనం.. ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను చూసినా చుట్టూ భారీ భద్రతా వలయం.. ఒక్కసారి ఆయన చూపు తాకడం కోసం లక్షలాది మంది అభిమాన గణం ఎదురుచూపులు.. ఓ వీవీఐపీను పోలి ఉంటుంది ఆయన జీవితం. ఉత్తర భారతంలో ఎంతో మంది అభిమానులను, మద్దతుదారులను కూడగట్టుకున్న ఆయన పేరు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుతో దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇద్దరు మహిళా స్వాధీలపై అత్యాచారం కేసులో ఆయన్ను శుక్రవారం సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం కేసులో ఆయనకు ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది. న్యాయస్థానం తీర్పుతో డేరా చీఫ్ షాక్‌కు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జైలుకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన కళ్లలో కన్నీటి సుడులు తిరగాయి. సాధారణ బాబాలు, సాధువులతో పోల్చితే గుర్మీత్ అనుభవించిన జీవితం విభిన్నం. బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. రాక్‌స్టార్‌గా మ్యూజిక్ వీడియోలు చేసినా.. అదో క్రేజ్..!. గుర్మీత్ జీవితంలోని పలు ఆసక్తికర విశేషాలను ఓ సారి చూద్దాం. ♦ గుర్మీత్ అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పట్ణణాలు, గ్రామాల్లో ఆయనకు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. ఆయన కోసం ప్రాణమిచ్చేందుకు సిద్ధమని కూడా కొందరు అభిమానులు అంటూ ఉంటారు. ♦ రాజకీయంగానూ గుర్మీత్ బలాఢ్యులే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలో ఆయన భాజపాకు మద్దతు ప్రకటించారు. డేరా సచ్చా సౌధా నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రముఖ నేతలతో పాటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ కూడా పాల్గొన్నారు. ఇక పంజాబ్‌లో అప్పట్లో భాజపా-అకాళీదళ్ ప్రభుత్వానికి ఆయన మద్దతు ప్రకటించారు. ♦ 2008లో గుర్మీత్ లక్ష్యంగా దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ కింద సెక్యూరిటీ పొందుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. ♦ తొలి రోజు జైల్లో గుర్మీత్ యోగాతో తన రోజును ప్రారంభించారు. దీన్ని బట్టి ఆయనకు రోజూ యోగా చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. యోగా అనంతరం టీ, రెండు ముక్కల బ్రెడ్‌ను గుర్మీత్ ఆహారంగా తీసుకుంటారని తెలిసింది. ♦ గుర్మీత్‌కు నటనంటే విపరీతమైన ఆసక్తి. తన పలుకుబడిని ఉపయోగించి రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’(ఎంఎస్‌జీ), ‘మెసెంజర్ ఆఫ్ గాడ్2’ సినిమాల్లో వెండి తెరపై మెరిశారు. ఈ సినిమాలకు సహ రచయితగా కూడా వ్యవహరించారు. లెదర్ దుస్తులు, వజ్రాలు అంటే గుర్మీత్‌కు ప్రేమ. ప్రేమ అనే పదం సరిపోదనుకుంటే పిచ్చి అని కూడా చెప్పుకోవచ్చు. లెదర్, డైమండ్లతో తయారుచేయించిన దుస్తుల్లో కనిపిస్తూ సినిమాల్లో సందేశాలు ఇచ్చారు. ♦ 'లవ్ చార్జర్' అనే మ్యూజిక్ వీడియోతో గుర్మీత్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో మెగా హిట్ అయిందని.. దాదాపు 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని డేరా సచ్చా సౌధా అప్పట్లో చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ♦ సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా పేర్కొనే డేరా సచ్చా సౌధా 1948లో స్థాపితమైంది. 1990లో దీని బాధ్యతలను గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా డేరాకు ఐదు కోట్ల మంది మద్దతుదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంటోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, సబ్సిడీపై ఆహార వస్తువులు, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఈ సంస్థ ముఖ్యంగా దళితులు, నిమ్న కులాలకు చెందినవారిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ♦ తుది తీర్పు సందర్భంగా పంచకులలోని సీబీఐ కోర్టుకు వెళ్లే ముందు కూడా గుర్మీత్ తన దర్పాన్ని ప్రదర్శించుకున్నారు. దాదాపు 200 కార్ల కాన్వాయ్‌తో కోర్టుకు చేరుకున్నారు. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌ను పంచకుల సీబీఐ న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. ఈ నెల 28న ఆయనకు జైలు శిక్ష ఖరారు చేయనుంది. ♦ గుర్మీత్ అరెస్టు తర్వాత పంజాబ్, హరియాణాల్లో డేరాకు గల 32 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. హరియాణాలోని సిర్సాలో గల డేరా హెడ్ క్వార్టర్స్ నుంచి గుర్మీత్ అనుచరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
చీకటి నిజాలు: 'పితాజీ మాఫీ' అంటే రేప్
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ ఆగడాలకు సంబంధించిన సంచలన నిజాలను ఇద్దరు సాధ్వీ(రేప్‌కు గురైన మహిళలు)లు కోర్టులో బయటపెట్టారు. తన ప్రత్యేక మందిరంలో గుర్మీత్ మహిళలపై ఎలా అత్యాచారాలకు పాల్పడే వాడన్న విషయాలను కళ్లకు కట్టినట్లు పంచకుల సీబీఐ కోర్టులో జడ్జిలకు వివరించారు. గుర్మీత్‌కు 'గుఫా'(ప్రత్యేక నివాసం) ఉండేదని, అక్కడకు తనకు నచ్చిన మహిళలను తీసుకెళ్లి పలుమార్లు రేప్ చేసేవాడని చెప్పారు. గుఫాకు కాపలాగా మహిళా గార్డులు మాత్రమే ఉంటారని తెలిపారు. 'పితాజీ మాఫీ' అనే పదాన్ని 'రేప్'కు ప్రత్యామ్నాయంగా వినియోగించేవారని పేర్కొన్నారు. సాక్షుల్లో ఒకరైన హర్యానాకు చెందిన మహిళ తాను 1999 జులై నుంచి డేరాలో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఆర్థించిన తన అన్నను చంపేశారని సీబీఐ జడ్జి ఏకే వర్మకు ఆమె తెలిపారు. 1999 ఆగష్టులో గుర్మీత్ తనపై అత్యాచారానికి పాల్పడే వరకూ 'పితాజీ మాఫీ' అంటే తనకు తెలియదని చెప్పారు. రేప్‌కు గురికాక ముందు డేరాలోని మహిళలంతా తనను 'పితాజీ మాఫీ' జరిగిందా? అని ప్రశ్నించేవారని వెల్లడించారు. 1999 సెప్టెంబర్‌లో గుర్మీత్ తనపై అత్యాచారానికి పాల్పడట్లు మరో మహిళ తెలిపారు. ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు పోతాయని గుర్మీత్ వార్నింగ్ కూడా ఇచ్చారని వెల్లడించారు. -
భారత్ వెళ్తున్నారా.. ప్రాణాలకు ముప్పే!
మెల్బోర్న్ : భారత్ వెళ్లే తమ దేశ ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేల్చుతూ పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆస్ట్రేలియా అధికారులు తమ పౌరులకు వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ మంత్రిత్వశాఖ (డీఎఫ్ఏటీ) ఈ హెచ్చరికలు జారీ చేసింది. గుర్మిత్ కేసు తీర్పు అనంతరం హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ మొదలై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో దాదాపు 30 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారని, కావున అత్యవసర పని ఉంటే తప్పా భారత్‌కు ఇప్పట్లో వెళ్లకూడదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న పంచకుల కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం (ఆగస్ట్ 28న) ఖరారు చేయనుండటంతో శుక్రవారం భారత్‌లో విధ్వంసకాండ మొదలైందని, ఒకవేళ భారత్ వెళ్తున్నారంటే పూర్తి అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎఫ్ఏటీ ఆస్ట్రేలియా పౌరులకు సూచించింది. -
కోహ్లీ-గుర్మిత్.. ఓ స్పెషల్ బంధం
సాక్షి, న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా నేత గుర్మిత్ రామ్ రహీం సింగ్ అనుచరులు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అలజడిని సృష్టిస్తున్నారు. అత్యాచార కేసులో ఆయన్ని దోషిగా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణం నుంచే హింసను రాజేస్తున్నారు. హింసాత్మక ఘటనలతో పంజాబ్, హర్యానాలు అట్టుడికిపోతున్నాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే గుర్మిత్ పరమ భక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒకరనే విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కోహ్లీ సక్సెస్ సీక్రెట్ తానేనని గతంలో చాలాసార్లు గుర్మిత్ స్వయంగా చెప్పుకున్నారు. నిరంతర సాధన చేయాలని సూచించటంతోనే కోహ్లీ ఈస్థాయిలో ఉన్నాడంటూ గతేడాది ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అంతేకాదు స్టార్ బాక్సర్ విజయేందర్ సింగ్ ప్రపంచ స్థాయి బాక్సర్ అయ్యేందుకు కూడా తానే కారణమంటూ ప్రకటించుకున్నారు కూడా. ఇక ఇప్పుడు గుర్మిత్ లైంగికదాడి కేసులో అరెస్టయ్యాక ఆ పాత వీడియోను దులిపి వైరల్ చేస్తున్నారు. కోహ్లీ, అశిష్ నెహ్రా మరియు విజయ్ దహియాలు అందులో తనకు తాను దైవంగా చెప్పుకునే గుర్మిత్ ను కొలుస్తున్నట్లు అందులో ఉంది. ప్రత్యేకంగా మోకాళ్ల మీద వినయంగా కూర్చుని ఆశీర్వాదం తీసుకున్నాడు కోహ్లీ. వీడియో పాతదే అయినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియోతో ట్రోల్ చేసేస్తున్నారు. @RoflGandhi_ Mazak udate the na aap Gurmeet Ram Rahim ka. Ye dekho, Virat Kohli Ko cricket unhone hi sikhayi hai. -
ఆ బాబా సీక్రెట్ ఏంటి?
బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది నిమ్నజాతీయులు ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. 2002లో ఆయనపై హత్య, అత్యాచార కేసు నమోదైంది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఎవరీ డేరాలు.. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు గుర్మీత్ ప్రారంభించిన డేరా సచ్చా సౌధాలో చేరారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలు అంటారు. ఈ గ్రూపులో చేరిన అత్యధికులు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరాల సంస్కృతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మధ్యయుగ కాలం నుంచి ఉత్తర భారతదేశంలో డేరాలు ఉన్నాయి. డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు. డేరా సచ్చాసౌదాను యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌కు భంగీదాస్ అనే వ్యక్తి బాధ్యత వహిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకుని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతో పాటు వారిని చికిత్స కోసం కూడా సిర్సాకు తరలిస్తారు. ఇక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు. పేదల పాలిట పెన్నిధి.. డేరాల్లో సభ్యులకు సబ్సిడితో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్ ద్వారా అందించే వాటి కన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తుంది. పంజాబ్‌లోని సంగ్రూర్, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్ కోట్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం. ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు. -
బాబాపై రేప్ కేసు: అట్టుడుకుతున్న 2 స్టేట్స్!
చండీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీం సింగ్‌పై నమోదైన రేప్ కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించబోతుండటంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. గుర్మీత్‌పై రేప్ కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో పంచకుల పట్టణానికి ఆయన మద్దతుదారులు పోటెత్తారు. ఇప్పటికే 30వేలమంది గుర్మీత్ మద్దతుదారులు పంచకులలోని ఆయన ఆశ్రమానికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. గుర్మీత్ మద్దతుదారులు రాకుండా పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు చేస్తున్నా.. పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు వస్తున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డేరా స్వచ్ఛ సౌదా మద్దతుదారులకు పిలుపునిచ్చారు. 2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు 'రాక్‌స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాంరహీం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాయలంలో తమపై లైంగిక దాడి జరిగిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. 2007లో విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ఇద్దరు మహిళల నుంచి వాంగ్మూలం సేకరించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను గుర్మీత్ ఖండించారు. పంచుకులలోని సీబీఐ కోర్టు శుక్రవారం ఈ కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పంచకులకు పెద్దసంఖ్యలో వస్తుండటంతో పోలీసులకు, నిఘా వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. -
రేప్ కేసు ఆరోపణలు.. రహీమ్ వెంట మేమున్నాం
సిర్సా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛ సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్ధతు క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఆయనపై నమోదయిన రేప్ కేసులో పంచుకుల సీబీఐ కోర్టు ఆగష్టు 25న తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గుజర్ల సంఘం ఆయన వెంట నిలుస్తున్నట్లు ప్రకటించింది. గుజ్జర్ గౌరవ్ సమ్మన్ పేరటి ఆయన డేరా(ఆశ్రమం)లో సమావేశం నిర్వహించింది. కులదీప్ సింగ్ భాటి నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ గుజ్జర్ల సంఘ నేతలు, హర్యానాకు చెందిన 84 ఖాప్ నేతల అధ్యక్షుడు హర్యానా ధర్మేంద్ర భగత్ కూడా హాజరయ్యారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిస్వార్థంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకు ఏదైనా అన్యాయం జరిగితే, ఐదు కోట్ల గుజ్జర్ తెగ మొత్తం ఆయన వెంట ఉందని నేతలు ప్రకటించారు. కొన్ని జాతి వ్యతిరేక శక్తులు కుట్ర పన్ని ఆయన్ని ఈ కేసులో ఇరికించాయి అని వాళ్లు తెలిపారు. ఇక గుజ్జర్ల నేతల సానుభూతి ప్రకటనను రామ్ రహీమ్ స్వాగతించారు. సుమారు లక్ష మంది ఆయన మద్ధతుదారులు ఇప్పటికే సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పారా మిలటరీ దళాలను హర్యానా ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోర్టు తీర్పును గౌరవించాలని, సంయమనం పాటించాలని ఆయన మద్ధతుదారులు పోలీస్ శాఖ కోరింది.