ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు | 33 weapons recovered from Dera Sacha Sauda headquarters in Sirsa | Sakshi
Sakshi News home page

ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు

Published Mon, Sep 4 2017 4:52 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు

ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు

ఛండీగఢ్‌: డేరా బాబా అనుచరులు తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉన్న వివిధ రకాలైన 33 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను అనుచరులు సిర్సా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దినేష్‌కుమార్‌ తెలిపారు. రేప్‌ కేసులో డేరా సచ్ఛా సౌదా ఛీఫ్‌ గుర్మీత్‌ రాంరహీం సింగ్‌కు ఇరవయ్యేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రహటక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

గుర్మీత్‌ అరెస్ట్‌ అనంతరం ఆయన అనుచరులు పాల్పడిన అల్లర్లలో 41 మంది చనిపోవటంతోపాటు భారీ మొత్తంలో ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే సచ్ఛాసౌదా కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆశ్రమంలో ఉన్న పలువురు బాలలను విడిపించారు. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు డేరా అనుచరుల వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని పోలీసులు అల్టిమేటం ఇచ్చారు. దీనికి స్పందించిన డేరా అనుచరులు సోమవారం తమ వద్ద ఉన్న సింగిల్‌ బ్యారెల్‌, డబుల్‌ బ్యారెల్‌ తుపాకులతోపాటు 9మిమీ పిస్టళ్లను పోలీసులకు అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement