‘డేరా’ ఖాళీ అవుతోందిలా..!
సిబ్బంది అంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారేనని అన్నారు. అంతేకాకుండా 18 మంది బాలికలను 34 మంది బాలురను బయటకు తీసుకువచ్చామని చెప్పారు. అయితే, వారు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇళ్లకు వెళ్లాలనుకున్న వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను ప్రభుత్వ ఆశ్రమకేంద్రాల్లో చేర్పిస్తున్నామన్నారు. వాళ్లంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. డేరా నిర్వాహకులు తమకు ఈ విషయంలో సహకరిస్తున్నారని చెప్పారు. డేరా ప్రధానకార్యాలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, సైన్యం, పోలీసు పహారా కాస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి సిర్సాలో కర్ఫ్యూ సడలించారు. కాగా, ఇప్పటివరకు 6,500మంది డేరా అనుచరులను బయటకు రప్పించి వారిని బస్సుల్లో ఇళ్లకు పంపినట్లు సమాచారం.