పంచకుల: 2017లో పంచకుల హింస కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్‌సాన్‌కు ఇక్కడి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం ఇక్కడి మరో కోర్టు ఆమెపై హింసాకాండకు సంబంధించి ఉన్న దేశద్రోహం ఆరోపణలను విరమించుకుంది. వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు డిఫెన్స్ న్యాయవాది ఆర్‌ఎస్ చౌహాన్ తెలిపారు. దీంతో అంబాలా జైలులో ఉన్న హనీప్రీత్ బుధవారం విడుదలైంది.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన 2017, ఆగస్టులో జరిగిన ఘర్షణల్లో హనీప్రీత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెపై రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. 2017, అక్టోబర్ నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో హనీప్రీత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment