సాక్షి, చండీగఢ్: డేరా బాబా సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను పంచకుల ఘర్షణ కేసుకు సంబంధించి బుధవారం పంచ్‌కుల జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె సహచరుడు సుఖ్దీప్ కౌర్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గత ఏడాది అక్టోబర్ 3న హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఆమెపై పోలీసులు రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment