Dera Chief
-
పంచకుల కోర్టుకు హనీప్రీత్..
సాక్షి, చండీగఢ్: డేరా బాబా సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను పంచకుల ఘర్షణ కేసుకు సంబంధించి బుధవారం పంచ్‌కుల జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె సహచరుడు సుఖ్దీప్ కౌర్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గత ఏడాది అక్టోబర్ 3న హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఆమెపై పోలీసులు రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. -
‘ఆ కేసులో డేరా బాబా స్టేట్మెంట్ నమోదు’
సాక్షి,న్యూఢిల్లీ: డేరా అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రాంగణంలో 400 మంది తన అనుచరుల వృషణాలను బలవంతంగా తొలగించారన్న కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీబీఐ విచారణను కోరుతూ హన్సరాజ్ చౌహాన్ అనే డేరా అనుచరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డేరా చీఫ్‌ను ప్రశ్నించినట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ రోహ్తక్ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు 2015, జనవరిలో ఈ అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. -
డేరా బాబా వ్యతిరేకులను ఖతం చేస్తాం
సాక్షి, చండీగఢ్ : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన జర్నలిస్టులు, హర్యానా పోలీస్ అధికారులు, డేరా మాజీ అనుచరులను చంపేస్తామని డేరా ఖుర్బానీ విభాగం హెచ్చరించింది. పాలక బీజేపీ, హర్యానా ప్రభుత్వాలు డేరా సచా సౌథాను మోసం చేశాయని కూడా ఖుర్బానీ విభాగం రాసిన లేఖలో ఆరోపించింది. గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న 200 మంది పిల్లలు ప్రతీకారం తీర్చుకుంటారని పేర్కొంది. ఈ లేఖను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చండీగఢ్‌లోని పలు మీడియా కార్యాలయాలకు చేరవేశారు. గతంలో డేరా సచ్చా సౌదాతో సంబంధం ఉన్న కొందరు తమ పత్రికల ద్వారా డేరా మద్దతుదారులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే డేరా ఖుర్బానీ విభాగం జారీ చేసిన హెచ్చరిక లేఖలపై హరియాణా పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన రామ్ రహీం సింగ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత హరియణాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. డేరా బాబా మద్దతుదారులు జరిపిన దాడుల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
డేరా చీఫ్‌గా గుర్మీత్ కుమారుడు
సాక్షి,సిర్సాః డేరా తదుపరి చీఫ్‌గా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కుమారుడు జస్మీత్ పగ్గాలు చేపట్టనున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో డేరా మేనేజ్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ విపాసన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుమాడికే డేరా బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్ అంగీకరించారు. గుర్మీత్, హనీప్రీత్ తర్వాత డేరా సచా సౌథాలో మూడవ అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2002లో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. గుర్మీత్‌ను జైలుకు తరలించినప్పటి నుంచి హనీప్రీత్ ఆచూకీ గల్లంతైంది. గుర్మీత్ పారిపోయేందుకు హనీప్రీత్ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుర్మీత్ మరో సన్నిహిత సహచరుడు ఆదిత్య ఇన్సాన్ సైతం అదృశ్యమయ్యారు. మరోవైపు విపాసన శుక్రవారం నుంచి డేరాలో కనిపించడం లేదు. రాజస్ధాన్‌లోని గంగానగర్ జిల్లా గుర్సార్మోదియాకు వెళ్లారని డేరా వర్గాలు తెలిపాయి. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఆమె డేరా చీఫ్ స్వస్థలమైన గంగానగర్ జిల్లాకు వెళ్లారని, ఆయన కుమారుడు జస్మీత్‌కు కొన్ని కీలక పత్రాలు అందించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.అయితే ఆమె ఫోన్ స్విఛాఫ్ కావడం, తిరిగి డేరాకు చేరుకోకపోవడంతో ఆమె అరెస్ట్ భయంతో పారిపోయారని భావిస్తున్నారు. -
డేరా హత్య కేసులు.. తుది వాదనలు
సాక్షి, సిర్సా: జంట హత్యల కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భవితవ్యంపై నిర్ణయాన్ని పంచకుల సీబీఐ న్యాయస్థానం వాయిదా వేసింది. కీలక సాక్షిగా భావిస్తున్న గుర్మీత్ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న పిటిషన్‌పై సెప్టెంబర్ 22 తేదీన తేలుస్తామని న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కట్టా సింగ్ తరపు న్యాయవాది ధృవీకరించారు కూడా. తన చీకటి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చారనే జర్నలిస్ట్ రామ్ చంద్ర ఛత్రపది, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌లను హత్య చేయించారన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుకాగా, నేడు ప్రత్యేక కోర్టులో తుది వాదనలు జరిగాయి. ఇక కేసులో ఆరుగురు నిందితులు కోర్టుకు నేరుగా హాజరుకాగా, అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనువాదకుడిని నియమించాలా? అని జడ్జి కోరగా... అందుకు గుర్మీత్ అక్కర్లేదని చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ రహీమ్ నుంచి హని ఉందనే భయంతో గతంలో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చానని, అనుమతి ఇస్తే ఇప్పుడు అసలు విషయాలను చెబుతానంటూ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ చెబుతున్నాడు. స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు కూడా తాను సిద్ధమని చెప్పాడు. అంతేకాదు డేరా బాబా దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్ సింగ్ పుణే, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ లో దాక్కుని ఉండొచ్చన్న అనుమానాలు అతను వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ సిర్సాలోనే ఆమె తలదాచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కట్టా సింగ్ అంటున్నాడు. ఇక గుర్మీత్ విచారణ నేపథ్యంలో గతంలో మాదిరి అల్లర్లు చోటు చేసుకోకుండా పంచకులలో 5 బెటాలియన్లతో భద్రతా ఏర్పాట్లను చేశారు. 2002 లో డేరా సభ్యుడు రజింత్ సింగ్‌ను, సిర్సా జర్నలిస్ట్‌లను అనుచరులతో చంపించాడన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ కేసులో ప్రత్యేక న్యాయ స్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.