పంచకుల : ఇన్నాళ్లు పోలీసులకు కనిపించుకుండాపోయిన హనీప్రీత్ సింగ్‌కు ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయాన్ని పంజాబ్ పోలీసులు శోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిస్తే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించనున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అరెస్టు అయిన తర్వాత పంచకులలో డేరాలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ప్రాణనష్టం కలిగించడంతోపాటు ఆస్తి నష్టం కూడా కలిగించారు. ఈ అల్లర్లకు కారణం గుర్మీత్ కూతురుగా చెప్పుకునే హనీప్రీత్ అని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆమెపై ఆరోపణలు నమోదుచేసి అరెస్టు చేసే లోపే ఆమె తప్పించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులకు కనిపించకుండా దాదాపు 39 రోజులుగా ఉన్నారు.
అయితే, ఆమె అనూహ్యంగా మంగళవారం మీడియా ముందుకు వచ్చి జిరాక్‌పురా-పాటియాలా హైవే వద్ద పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించిన పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం నుంచి ఆమెను ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు తప్పించుకొని ఉంటున్న ఆమెకు ఎవరు ఆశ్రయం ఇచ్చారనేది కీలకంగా మారింది. 'మంగళవారం 2గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశాం. ఆమెను ఇంకా విచారించాల్సి ఉంది. అలాగే, ఆమెకు ఇన్నాళ్లు ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం కూడా మేం కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది' అని ఈ కేసును విచారిస్తున్న కమినర్ ఏఎస్ చావ్లా తెలిపారు.
హనీప్రీత్‌కు ఇన్నాళ్లు ఆశ్రయం ఇచ్చిందెవరు?
Published Wed, Oct 4 2017 1:10 PM | Last Updated on Wed, Oct 4 2017 2:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment