Honeypreet Singh
-
హనీప్రీత్‌కు బెయిల్
పంచకుల: 2017లో పంచకుల హింస కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్కు ఇక్కడి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం ఇక్కడి మరో కోర్టు ఆమెపై హింసాకాండకు సంబంధించి ఉన్న దేశద్రోహం ఆరోపణలను విరమించుకుంది. వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు డిఫెన్స్ న్యాయవాది ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. దీంతో అంబాలా జైలులో ఉన్న హనీప్రీత్ బుధవారం విడుదలైంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన 2017, ఆగస్టులో జరిగిన ఘర్షణల్లో హనీప్రీత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమెపై రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. 2017, అక్టోబర్ నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో హనీప్రీత్ ఉన్నారు. -
అది ఆమె లైఫ్.. అభ్యంతరాలు ఎందుకు?
పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్‌గా మారిన కరణ్‌జీత్ కౌర్ అలియాస్ సన్నీ లియోన్ బయోపిక్ వివాదాస్పదంగా మారింది. కరణ్‌జీత్ కౌర్:ది అన్‌టోల్డ్ స్టోరీ వెబ్‌సిరీస్‌పై మత వర్గాలు మండిపడుతున్నాయి. సన్నీ ఇంటిపేరులోని కౌర్‌ను తొలగించాల్సిందేనంటూ అకాలీ దళ్ పార్టీ పట్టుబడుతుండటం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సన్నీకి భారీ ఎత్తున్న మద్ధతు వచ్చిపడుతోంది. ‘సుఖ్వీందర్ కౌర్.. రాధే మా అయినప్పుడు, గుర్మీత్ సింగ్.. రామ్ రహీమ్ బాబా అయినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదేం?. సన్నీ ఇప్పుడు ఆమె అసలు పేరు వాడుకుంటుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?. అది ఆమె లైఫ్.. నేరం కాదు’ అని ఒకరు, ‘సన్నీని నిందించే ముందు.. హనీ సింగ్(యోయో హనీ సింగ్) సెక్సీ సాంగ్‌ల సంగతి గురించి మాట్లాడండి’ అంటూ ఒకరు... హనీప్రీత్ ఇన్సాన్ లైఫ్, గుర్మీత్‌తో ఆమె లింకులపై అకాళీ దల్ మౌనంగా ఎందుకుంది? అని మరోకరు... రాధేమా-హనీప్రీత్ సింగ్ కంటే సన్నీ ఎంతో బెటర్... ఇలా పలువురు అకాలీ దళ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ, రచ్చ.. రచ్చగా సాగుతోంది. అభ్యంతరం అదొక్కటే... ‘ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టం. ఆమె పోర్న్‌స్టారే కానీ, ఇంకేదైనా కానీ. కానీ, ఒక్కసారి పేరు చివర కౌర్ ను వదిలేసుకున్నాక.. తిరిగి మళ్లీ చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసమే ఇదంతా. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పేరు చివర కౌర్ తొలగించాల్సిందే. ఈ వ్యవహారంపై ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు లేఖ కూడా రాశాం. స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అకాలీ దళ్ నేత మాంజీదర్ సిస్రా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా.. మంచి స్పందనే లభించింది. -
పంచకుల కోర్టుకు హనీప్రీత్..
సాక్షి, చండీగఢ్: డేరా బాబా సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాన్‌ను పంచకుల ఘర్షణ కేసుకు సంబంధించి బుధవారం పంచ్‌కుల జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆమె సహచరుడు సుఖ్దీప్ కౌర్‌ను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. గత ఏడాది అక్టోబర్ 3న హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఆమెపై పోలీసులు రాజద్రోహం అభియోగాలనూ నమోదు చేశారు. డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారిస్తే అల్లర్లను ప్రేరేపించాలని హనీప్రీత్ ఓ డేరా సభ్యుడికి రూ 1.25 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. -
హనీ దగ్గర మనీ లేదు!
‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ 2002లో చేసిన అత్యాచారాలకు మొన్న ఇరవై ఏళ్ల జైలు శిక్ష, ముప్పై లక్షల జరిమానా ఖరారైంది. తెలిసిన వార్త ఎందుకు చెబుతున్నారు అని మీరు అనుకునే లోపే అసలు విషయంలోకి వచ్చేస్తాం. రామ్ రహీమ్ ఇష్టతనయ, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. ‘నో హనీ, నో మనీ’ అని లబోదిబోమంటోంది. ‘‘కోర్టులో కేసు కొట్లాట్టానికి కూడా క్యాష్ కరువైంది. నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. దుడ్లన్నీ ఐస్ అయిపోయినయ్. చలికాలం కదా లాయర్లు ‘ఐసొద్దు, హాట్ హాట్ నోట్స్ ఇవ్వు’ అంటున్నారు. కనుక కోర్టు నాయందు దయ ఉంచి బ్యాంకు ఫ్రిజ్జు ఓపెన్ చేయనిస్తే మంచి లాయర్‌ను పెట్టుకుని నా అమాయకత్వాన్ని నిరూపించుకుంటాను’ అని బోరుమందట. వాడెవడో అత్యాచారం చేస్తే ఈవిడ అమాయకత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? పెంపుడు తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే ఆశ్రమం చుట్టూ ఉన్న పంచకుల ఏరియాలో అల్లర్లకు 41 మంది చనిపోయారు. 260 మంది గాయాల పాలయ్యారు. ఆ అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ ఈ మేడమేనంట. అదీ కేసు. లేదు క్యాషు! -
కన్నీరు పెట్టుకున్న హనీప్రీత్
సాక్షి, హరియాణా: డేరా స్వచ్ఛసౌదా నేరాల్లో అరెస్ట్ అయిన గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ తల్లిదండ్రలను చూసి కన్నీరు పెట్టుకుంది. గరువారం దీపావళి సందర్భంగా కూతురు హనీప్రీత్ సింగ్‌ను చూడటానికి ఆమె తల్లిదండ్రలు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ హరియాణలోని అంబాలా జైలుకు వెళ్లారు. వారిని అక్కడ చూసిన హనీప్రీత్ సింగ్ కన్నీరుమున్నీరైంది. దీపావళి సందర్భంగా హనీప్రీత్‌కు కొవ్వత్తులు, స్వీట్లును కానుకగా ఇచ్చారు. అయితే వచ్చిన వారు ఆమె తల్లిదండ్రులేనా అని అనుమానం జైలు అధికారులకు వచ్చింది. అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న మీదటనే వారికి హనీ ప్రీత్‌ను కలిసే అవకాశం కల్పించారు. వారితోపాటు ఆమె తరపు న్యాయవాది కూడా జైలుకు వెళ్లారు. అయితే అతన్ని హనీప్రీత్‌తో మాట్లాడనివ్వలేదు. డేరా సచ్చా సౌదాలో గర్మీత్తో కలిసి నేరాలకు పాల్పడినందున హనీప్రీత్‌ను హరియాణ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాజస్థాన్‌లోని గురుసర్ మోదియాలో కోట్ల రూపాయలు విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో హనీప్రీత్‌కు ఆస్తులున్నట్లు గుర్తించారు. -
కోట్లల్లో విరాళాలు...స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమెదే..
-
స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమే...
సాక్షి,న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది వెల్లడైంది. ఆర్టీఐ సమాచారం కింద వెలుగులోకి వచ్చిన ఈ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. డేరా బాబా వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనుచరులు, డేరా మద్దతుదారులు అందించిన విరాళాలను వాడుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుర్మీత్ వ్యాపార వ్యూహాలు, సినీ, ఈవెంట్ రంగాల్లో ప్రవేశానికి హనీప్రీత్ సూచనలే కారణమని తెలిసింది. మత విశ్వాసాలు, ఆథ్యాత్మిక కార్యక్రమాల పేరిట డేరా బాబా ఏటా కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దేశవిదేశాల నుంచి వసూలు చేసేవారు. ఈ నిధులను వ్యాపార కార్యక్రమాల విస్తరణకు వినియోగించడంతో డేరా సచ్చా సౌథా కాస్తా అనతికాలంలోనే కార్పొరేట్ సామ్రాజ్యంగా విస్తరించింది. మరోవైపు సామాజిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కావడంతో డేరా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందింది. సంస్థ ఆర్థిక లావాదేవీల వివరాలను ఇచ్చేందుకు ఆదాయ పన్ను శాఖ నిరాకరించినా ఆర్టీఐ కింద సమాచారం కోరడంతో బాబా విన్యాసాలు వెలుగుచూశాయి. 2010-11లో డేరా రూ 50 కోట్ల పైగా నికర లాభం ఆర్జించింది. అంటే సంస్థ టర్నోవర్ ఏ రేంజ్లో ఉందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో డేరా నికర లాభం 30 కోట్లు కాగా, అనుబంధ సంస్థ షా సత్నం జీ రీసెర్చి ఫౌండేషన్ 16.5 కోట్లు నికర లాభం సాధించింది.హనీప్రీత్ సింగ్ తన నెట్వర్కింగ్ నైపుణ్యాలతో సంస్థకు నిధులు, విరాళాలు సమకూర్చేదని చెబుతున్నారు. హనీప్రీత్ పాత్ర ఏంటి.. హనీప్రీత్ సలహా మేరకే గుర్మీత్ మ్యూజికల్ నైట్స్ ప్రారంభించారని డేరా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యూజికల్ నైట్స్ డేరా అనుచరుల్లో క్రేజ్‌ను సంతరించుకున్నాయి. ఇవి ఎంతలా ఆదరణ పొందాయంటే ఒక్కో రాత్రికి కోట్ల రూపాయలు డేరాకు వచ్చిపడేవని తెలుస్తోంది. ఈ షోల్లో గుర్మీత్ సింగ్ తన గానకళకు పదునుపెట్టి తన పాపులర్ సాంగ్స్ లవ్ చార్జర్‌ను ఆలపిస్తూ భారీ మొత్తాలను షోలకు రాబట్టేవాడు. డేరా సినిమాలు కూడా హనీప్రీత్ ఆలోచనల్లోంచే పుట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఆ డబ్బు ఎక్కడ..? డేరా ఆదాయంలో విరాళాలతో పాటు మ్యూజిక్ షోలు, సినిమాలు ప్రధాన వనరులుగా చెబుతారు. నగదు విరాళాల ద్వారా ప్రధాన ఆదాయం డేరాకు సమకూరుతోంది. అయితే డేరా ప్రాంగణంలో పోలీసుల సోదాల్లో కొద్దిపాటి నగదు మాత్రమే లభ్యం కావడం పలు సందేహాలకు తావిస్తోంది. అక్రమంగా దాచిన నగదు నిల్వలను గుర్మీత్ అనుచరులు డేరా నుంచి బయటకు పంపారని భావిస్తున్నారు. హర్యానాలోని సిర్సాలో డేరా ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 28 రాత్రి హనీప్రీత్ రెండు పెద్ద సైజ్ ట్రావెల్ బ్యాగ్‌లతో అదృశ్యమయ్యారనే ప్రచారం సాగింది. హనీప్రీత్ ఈ సొమ్మును ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.డేరాలో సాగుతున్న దర్యాప్తులో మనీల్యాండరింగ్ ఆరోపణలనూ విచారిస్తున్నారు. -
హనీప్రీత్‌కు ఆశ్రయం ఇచ్చిందెవరు?
పంచకుల : ఇన్నాళ్లు పోలీసులకు కనిపించుకుండాపోయిన హనీప్రీత్ సింగ్‌కు ఎవరు ఆశ్రయం ఇచ్చారనే విషయాన్ని పంజాబ్ పోలీసులు శోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిస్తే వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించనున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అరెస్టు అయిన తర్వాత పంచకులలో డేరాలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ప్రాణనష్టం కలిగించడంతోపాటు ఆస్తి నష్టం కూడా కలిగించారు. ఈ అల్లర్లకు కారణం గుర్మీత్ కూతురుగా చెప్పుకునే హనీప్రీత్ అని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆమెపై ఆరోపణలు నమోదుచేసి అరెస్టు చేసే లోపే ఆమె తప్పించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులకు కనిపించకుండా దాదాపు 39 రోజులుగా ఉన్నారు. అయితే, ఆమె అనూహ్యంగా మంగళవారం మీడియా ముందుకు వచ్చి జిరాక్పురా-పాటియాలా హైవే వద్ద పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించిన పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం నుంచి ఆమెను ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు తప్పించుకొని ఉంటున్న ఆమెకు ఎవరు ఆశ్రయం ఇచ్చారనేది కీలకంగా మారింది. 'మంగళవారం 2గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశాం. ఆమెను ఇంకా విచారించాల్సి ఉంది. అలాగే, ఆమెకు ఇన్నాళ్లు ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం కూడా మేం కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది' అని ఈ కేసును విచారిస్తున్న కమినర్ ఏఎస్ చావ్లా తెలిపారు. -
మీడియా ముందుకు హనీప్రీత్..
సాక్షి, న్యూఢిల్లీ: జైలుపాలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తాను దేశం వదిలి ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే కోర్టులో లొంగిపోతానని ఆమె వెల్లడించారు. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా గుర్మీత్.. తనను లైంగికంగా వేధించలేదని చెప్పారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కోర్టు ముందు లొంగిపోతారని కథనాలు వచ్చాయి. ఈక్రమంలో ఆమె అన్యూహంగా 'సీఎన్ఎన్ న్యూస్18', 'ఇండియా టుడే' చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కోసం వెతుకుతున్న హర్యానా పోలీసుల కళ్లుగప్పి మరీ ఆమె ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం గమనార్హం. గుర్మీత్, తనకు మధ్య ప్రవిత్ర అనుబంధం ఉందని, తన మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ' మా గురించి చెప్తున్నదంతా అబద్ధమే. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రి-కూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని హనీప్రీత్ పేర్కొన్నారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం పంచకులలో అల్లర్ల రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని, కానీ అందుకు ఆధారాలు ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. గుర్మీత్ అమాయకుడని, ఆయనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళుతామని ఆమె చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, గుర్మీత్ విడుదల అవుతారని ఆమె అన్నారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తన మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. అతని గురించి మాట్లాడబోనని ఆమె తెలిపారు. -
హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. రహస్య వారసుడు?
సాక్షి, న్యూఢిల్లీ: రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ గురించి రోజుకొక రహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని కోరుకున్నారట. తమకు కొడుకు పుడితే.. డేరా స్వచ్ఛసౌదాకు అతన్ని వారసుడిగా కొనసాగించవచ్చునని భావించారట. కానీ, వారి రహస్య వారసుడి ప్లాన్ వర్కౌట్ కాలేదని డేరా ఫాలోవర్లు చెప్తున్నారు. గుర్మీత్, హనీప్రీత్ మధ్య రహస్య అనుబంధం గురించి వారు పలు విస్మయకర వాస్తవాలను తెలిపారు. డేరాలో హనీప్రీత్‌పై గుర్మీత్ అత్యాచారం.. గుర్మీత్ చాటుగా హనీప్రీత్ రాసలీలలు నడిపేవాడని, వారి మధ్య శారీరక సంబంధం ఉందని ఇప్పటికే పలు కథనాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డేరా శిష్యులు వీరి అనుబంధం గురించి పలు విషయాలు వెల్లడించారు. హనీప్రీత్ గుర్మీత్ సన్నిహిత సహచరిగా మారకముందు.. గుహాలో ఆమెపై గుర్మీత్ అత్యాచారం జరిపాడని తెలిపారు. తన ప్రైవేటు చాంబర్ అయిన గుహాలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ అత్యాచారం జరిపిన కేసులో శిక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సాధ్వీల తరహాలోనే హనీప్రీత్‌పై కూడా గుర్మీత్ లైంగిక దాడి జరిపారని, కానీ గుర్మీత్ బెదిరింపులకు తలొగ్గి.. ఆ తర్వాత ఆయన నుంచి పలు ప్రయోజనాలు పొంది.. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచి ఉంటుందని డేరా శిష్యులు చెప్తున్నారు. ఓ రోజు హనీప్రీత్ గుహలోకి వెళుతుండటం తాము చూశామని, ఏడుస్తూ ఆమె గుహ నుంచి బయటకు వచ్చిందని వస్తూ ఆమె గుర్మీత్ మాజీ డ్రైవర్లు అయిన ఖట్టా సింగ్, అతని కొడుకు గురుదాస్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజున తాను, తన కజిన్ గుహకు రక్షణగా ఉన్నామని గురుదాస్ చెప్పారు. 'హనీప్రీత్ చాలా ఆందోళనగా కనిపించింది. ఆమె నేరుగా డేరాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న తన తాత దగ్గరికి పరిగెత్తుకెళ్లింది. ఆమె తాత గొడవ చేయకుండా గుర్మీత్ గూండాలు చూశారు' అని ఆయన చెప్పారు. వారసుడి కోసం ప్రయత్నించారు.. కానీ! గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్ రహస్యంగా వారసుడి కోసం ప్రయత్నాలు చేశారు. తమకు కొడుకు పుట్టాలని, అతన్ని డేరా సామ్రాజ్యానికి వారసుడిని చేయాలని వారు భావించారు. గుర్మీత్ సొంత కొడుకు జస్మీత్ సింగ్‌ను డేరా వారసుడిగా ప్రకటించాలన్న వాదనను హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, తమ కొడుకుకే వారసత్వ పట్టాం కట్టాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని గుర్మీత్ మాజీ శిష్యుడు గురుదాస్ సింగ్ తోర్ తెలిపారు. 2007లో జస్మీత్ను డేరా వారసుడిగా గుర్మీత్ ప్రకటించినప్పటికీ.. హనీప్రీత్ ఒత్తిడితో తన నిర్ణయాన్ని గుర్మీత్ మార్చుకున్నాడని, అయితే, అనుకోని పరిస్థితులు.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వారసుడి ప్రయత్నాలకు బ్రేక్ పడిందని తెలిపారు. 2002లో డేరాలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ సాక్షిగా ఉన్న తోర్.. గుర్మీత్-హనీప్రీత్ అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇద్దరూ డేరాలో భార్యాభర్తల్లాగే గడిపేవారని చెప్పాడు. ఇదే విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. డేరాలోని ప్రైవేటు చాంబర్లో గుర్మీత్-హనీప్రీత్ శృంగారానికి పాల్పడే వారని, ఆ సమయంలో డేరా బయట తాను వేచి ఉండే వాడినని గుప్తా గతంలో మీడియాకు చెప్పారు. -
గుర్మీత్‌ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..!
సాక్షి, ముంబై: వివాదాస్పద బాబా, రేప్ కేసులో శిక్ష పడిన గుర్మీత్ రాంరహీం సింగ్ జీవితకథ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట సినిమా తెరకెక్కించేందుకు హాట్ భామ రాఖీ సావంత్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో గుర్మీత్ దత్తపుత్రిక, సన్నిహితురాలు హనీప్రీత్ ఇన్సాఫ్గా రాఖీ సావంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాఖీ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గుర్మీత్ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్య అంశాలను ఈ సినిమాలో చూపిస్తానని, గుర్మీత్, హనీప్రీత్ గురించి తనకు చాలాకాలంగా తెలుసునని చెప్పుకొచ్చింది. 'మూడున్నరేళ్లుగా గుర్మీత్, హనీప్రీత్ గురించి నాకు తెలుసు. పలు సందర్భాల్లో వారిని నేను కలిశాను. డేరా పరిసరాల్లో నిర్మించిన గుహాలోకి సైతం నేను వెళ్లాను. గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా నన్ను పిలిచారు' అని రాఖీ తెలిపింది. గుర్మీత్ సినిమాల కోసం హనీప్రీత్ ఆడిషన్స్ నిర్వహించేదని తెలిపింది. 'ఓసారి గుర్మీత్, హనీప్రీత్ నన్ను ఓ హోటల్‌కు పలిచారు. గుర్మీత్ సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలను హనీప్రీత్ పిలిచేది. హోటల్లో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. అక్కడ బాత్రూమ్లో కొన్ని మూలికలు చూశాను. పాపపు ఉద్దేశంతో వాటిని అక్కడ ఉంచినట్టు నేను భావించాను. అతని నిజమైన ఉద్దేశాలు గ్రహించి నేను బెంబేలెత్తిపోయాను. నన్ను చంపేస్తాడేమోనని భయపడ్డాను' అని రాఖీ చెప్పింది. గుర్మీత్‌కు తాను సన్నిహితంగా ఉండటం చూసి హనీప్రీత్ ఆందోళన చెందేదని రాఖీ పేర్కొంది. 'తన ప్రియుడిని నేను పెళ్లి చేసుకుంటానేమోనని హనీప్రీత్ భయపడేది. గుర్మీత్ తన మహిళా శిషురాళ్లను లైంగికంగా దోచుకుంటున్న విషయం నాకు అప్పటికీ తెలియదు' అని చెప్పుకొచ్చింది. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. రేప్ కేసులో గుర్మీత్ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె కోసం రెండు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో సోమవారం ముందస్తు బెయిల్‌కు హనీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పంజాబ్-హర్యానా హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించింది. అజ్ఞాతంలో ఉన్న హనీతోపాటు డేరా బాబా సహచరులైన ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్‌ను అరెస్టు చేయాలని పంచకుల కోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో.. ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఆమె ఢిల్లీలోని తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆమె న్యాయవాది ఇంటికి వెళుతుండగా నమోదైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది ప్రదీప్ ఆర్య ద్వారా ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోలీసుల గాలింపులు డేరా బాబా గుర్మీత్ సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్, ఇతర సహచరుల కోసం హర్యానా పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గాలించారు. ఆమె కోసం ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2లోనూ సోదాలు జరిగాయి. డేరా బాబా అకృత్యాలు, ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లులో హనీతోపాటు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. వీరి గురించి అంతర్జాతీయంగా అలర్ట్ ప్రకటించారు. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
-
హనీప్రీత్‌పై అంతర్జాతీయ అలర్ట్
సాక్షి,చండీగర్: డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, ఇతర నిందితులు పవన్, ఆదిత్యా ఇన్సాన్‌లపై అంతర్జాతీయ అలర్ట్‌ను ప్రకటించినట్టు హర్యానా డీజీపీ బీఎస్ సంధూ శనివారం వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని చెప్పారు. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్‌కు వీరు సన్నిహితులు. కాగా, పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, విచారణ స్వతంత్రంగా సాగుతున్నదని డీజీపీ తెలిపారు. హనీప్రీత్, పవన్ ఇన్సాన్, ఆదిత్య ఇన్సాన్ల ప్రైవేట్ ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. డేరా చీఫ్‌ను రేప్ కేసులో దోషిగా నిర్థారించిన అనంతరం చెలరేగిన అల్లర్లపై విచారణ సరైన దిశలో సాగుతున్నదన్నారు. -
హనీప్రీత్ ఎక్కడుందో నాకు తెలుసు: నటి
డేరా స్వచ్ఛసౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం చెలరేగిన అలర్ల వెనుక హనీప్రీత్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గుర్మీత్‌పై నమోదైన పలు కేసులలోనూ ఆమె ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుర్మీత్‌కు శిక్ష పడి.. జైలుకు వెళ్లిననాటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమె నేపాల్‌లో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఆమె పేరుకే గుర్మీత్ దత్తపుత్రిక అని, కానీ, చాటుగా గుర్మీత్ రాసలీలలు సాగించేదని, వారు ఏకాంతంగా గడిపేవారని పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌పై బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్ గురించి తనకు ఏడెనిమిదేళ్లుగా తెలుసునని రాఖీ తెలిపింది. డేరా బాబా గుర్మీత్‌పై తాను ఒక బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నామని, ఈ సినిమాలో డేరా బాబా ప్రియురాలు హనీప్రీత్ సింగ్‌గా తాను నటిస్తానని ఆమె పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ ఎక్కడో ఉందో తనకు తెలుసునని, ఆమె నేపాల్‌లో లేదని, లండన్‌లో ప్రస్తుతం ఉందని రాఖీ తెలిపింది. తన సోదరుడు రాకేశ్ సావంత్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో డేరా బాబాగా రజా మురద్ నటిస్తారని పేర్కొంది.