సాక్షి, హరియాణా: డేరా స్వచ్ఛసౌదా నేరాల్లో అరెస్ట్ అయిన గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ తల్లిదండ్రలను చూసి కన్నీరు పెట్టుకుంది. గరువారం దీపావళి సందర్భంగా కూతురు హనీప్రీత్ సింగ్‌ను చూడటానికి ఆమె తల్లిదండ్రలు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ హరియాణలోని అంబాలా జైలుకు వెళ్లారు. వారిని అక్కడ చూసిన హనీప్రీత్ సింగ్ కన్నీరుమున్నీరైంది.
దీపావళి సందర్భంగా హనీప్రీత్‌కు కొవ్వత్తులు, స్వీట్లును కానుకగా ఇచ్చారు. అయితే వచ్చిన వారు ఆమె తల్లిదండ్రులేనా అని అనుమానం జైలు అధికారులకు వచ్చింది. అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న మీదటనే వారికి హనీ ప్రీత్‌ను కలిసే అవకాశం కల్పించారు. వారితోపాటు ఆమె తరపు న్యాయవాది కూడా జైలుకు వెళ్లారు. అయితే అతన్ని హనీప్రీత్‌తో మాట్లాడనివ్వలేదు.
డేరా సచ్చా సౌదాలో గర్మీత్‌తో కలిసి నేరాలకు పాల్పడినందున హనీప్రీత్‌ను హరియాణ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాజస్థాన్‌లోని గురుసర్ మోదియాలో కోట్ల రూపాయలు విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో హనీప్రీత్‌కు ఆస్తులున్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment