డేరా స్వచ్ఛసౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన అనంతరం చెలరేగిన అలర్ల వెనుక హనీప్రీత్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. గుర్మీత్‌పై నమోదైన పలు కేసులలోనూ ఆమె ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుర్మీత్‌కు శిక్ష పడి.. జైలుకు వెళ్లిననాటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆమె నేపాల్‌లో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఆమె పేరుకే గుర్మీత్ దత్తపుత్రిక అని, కానీ, చాటుగా గుర్మీత్ రాసలీలలు సాగించేదని, వారు ఏకాంతంగా గడిపేవారని పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌పై బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్ గురించి తనకు ఏడెనిమిదేళ్లుగా తెలుసునని రాఖీ తెలిపింది. డేరా బాబా గుర్మీత్‌పై తాను ఒక బయోపిక్ చిత్రాన్ని తీయబోతున్నామని, ఈ సినిమాలో డేరా బాబా ప్రియురాలు హనీప్రీత్ సింగ్‌గా తాను నటిస్తానని ఆమె పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ ఎక్కడో ఉందో తనకు తెలుసునని, ఆమె నేపాల్‌లో లేదని, లండన్‌లో ప్రస్తుతం ఉందని రాఖీ తెలిపింది. తన సోదరుడు రాకేశ్ సావంత్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నానని, 'అబ్ హోగా ఇన్సాఫ్' పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాలో డేరా బాబాగా రజా మురద్ నటిస్తారని పేర్కొంది.
హనీప్రీత్ ఎక్కడుందో నాకు తెలుసు: నటి
Published Wed, Sep 20 2017 8:05 PM | Last Updated on Fri, Sep 22 2017 9:11 PM
Advertisement
Advertisement