సాక్షి, హైదరాబాద్: సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాంచందర్ చత్తర్‌పతి హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మిత్ రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి సబీనా ఇందర్‌జిత్ స్వాగతించారు. బాధిత జర్నలిస్టు కుటుంబంతో పాటు, యావత్ జర్నలిస్ట్ సమాజానికి న్యాయం దక్కిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
2002 మేలో డేరా సచ్చాసౌదాలో సాధ్వీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ సాధ్వి ఇచ్చిన ఫిర్యాదును తాను నిర్వహించే ‘పూచ్ సచ్’అనే పత్రికలో చత్తర్‌పతి ప్రచురించారని తెలిపారు. 2002 అక్టోబర్ 24న చత్తర్‌పతి ఆయన నివాసంలోనే హత్యకు గురైన కేసును 2003లో రిజిష్టర్ చేయగా 2006లో సీబీఐకు అప్పగించారన్నారు. పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ కోర్టు రామ్‌రహీమ్‌తో పాటు, మరో ముగ్గురిని దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రామ్‌రహీమ్‌కు కఠినశిక్ష విధించాలన్న చత్తర్‌పతి కుమారుడు అన్షూ్షల్ డిమాండ్‌కు ఐజేయూ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు.
‘రామ్‌రహీమ్‌ను దోషిగా తేల్చడాన్ని స్వాగతిస్తున్నాం’
Published Sun, Jan 13 2019 2:40 AM | Last Updated on Sun, Jan 13 2019 2:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment