హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు! | Honeypreet Insan Former Husband seeks police protection | Sakshi
Sakshi News home page

హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!

Published Fri, Sep 29 2017 8:23 AM | Last Updated on Fri, Sep 29 2017 11:42 AM

Honeypreet Insan Former Husband seeks police protection

సాక్షి, కర్నాల్‌: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్, గుర్మీత్‌లకు శారీరక సంబంధం ఉందంటూ ఇటీవల పేర్కొన్న విశ్వాస్.. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు తన ప్రాణాలు రక్షించాలని కోరుతూ గురువారం కర్నాల్‌ పోలీసులను ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాజ్‌బీర్ సింగ్ తెలిపారు. ఓవైపు గుర్మీత్‌కు జైలుశిక్ష నేపథ్యంలో పరారైన హనీప్రీత్ కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుండగా మరోవైపు విశ్వాస్ గుప్తా తన మాజీ భార్య హనీప్రీత్ వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు.

హనీప్రీత్, డేరా సచ్ఛా సౌదాల విషయాలు మరిన్ని వెల్లడిస్తానని భావించి కొందరు తనకు ఫోన్‌చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు విశ్వాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహం అనంతరం హనీప్రీత్‌ను గుర్మీత్ తన వద్దకు పంపలేదని, వారిద్దరే ఏకాంతంగా గడిపేవారని చెప్పడం కూడా తనపై హత్యకుట్రకు ఓ కారణమై ఉంటుందన్నారు. చంఢీగఢ్‌లో డేరా చీఫ్ గుర్మీత్, హనీప్రీత్‌లకు వ్యతిరేకంగా ఎన్నో విషయాలు వెల్లడించినప్పటినుంచీ గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హనీప్రీత్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు.

కాగా, గత ఆగస్టు 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత హనీప్రీత్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement