Honeypreet Insan
-
హనీప్రీత్‌కు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను దోషిగా తేల్చిన అనంతరం చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. హనీప్రీత్ బెయిల్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించిందని, అయితే ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దత్తపుత్రికగా చెబుతారు. హింసను ప్రేరేపించారనడానికి ఆమెకు వ్యతిరేకంగా హర్యానా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ హనీప్రీత్ బెయిల్‌ను కోరుతున్నారని న్యాయవాది తెలిపారు.గత ఏడాది పంచ్కులలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన 15 మందికి వేర్వేరు కోర్టుల్లో బెయిల్ లభించిందని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనగా, ఆమె బెయిల్ అప్పీల్‌ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత ఏడాది ఆగస్ట్ 25న గుర్మీత్ సింగ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఆరు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. -
సావంత్‌కు ‘సవతి’ షాక్!
రోహ్తక్ : డేరా బాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో ప్రధాన నిందితురాలు అయిన హనీప్రీత్ ఇన్సాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. డేరా బాబా-హనీప్రీత్‌ల అనుబంధంపై ‘సవతి’ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి రాఖీ సావంత్‌పై పరువునష్టం దావా దాఖలైంది. హనీప్రీత్ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదయినట్లు రోహ్తక్ పోలీసులు తెలిపారు. రాఖీ ప్రధాన పాత్రలో గుర్మీత్-హనీలపై రూపుదిద్దుకున్న సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో తాజా వివాదం చర్చనీయాంశమైంది. రూ.5కోట్లు డిమాండ్ : ‘‘నటి రాఖీ సావంత్ అడ్డగోలుగా మాట్లాడి నా కూతురి(హనీప్రీత్) పరువుతీసింది. తప్పును ఒప్పుకుని 30 రోజుల్లోగా క్షమాపణలు చెప్పిందా సరేసరి. లేదంటూ రూ.5 కోట్లు చెల్లించాలి’’ అని ఆశా తనేజా డిమాండ్ చేశారు. అసలు రాఖీ ఏమంది? : గత ఆగస్టులో గుర్మీత్, హనీప్రీత్‌లు అరెస్టయిన సందర్భంలో రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ వారి అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక దశలో నేను(రాఖీ) డేరా బాబాకు చాలా దగ్గరయ్యాను. మా ఇద్దరిదీ పవిత్రబంధం. ఎందుకోగానీ హనీప్రీత్‌కు ఇది నచ్చేదికాదు. బాబాకు నాకు మధ్య సాన్నిహిత్యాన్ని ఆమె(హనీ) జీర్ణించుకోలేకపోయేది. ఆయనను పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతిని అవుతానోనని హనీ భయపడేది’’ అంటూ రాఖీ బాంబు పేల్చారు. తద్వారా గుర్మీత్-హనీప్రీత్లది తండ్రీకూతుళ్ల బంధం కాదని బయటపెట్టేయత్నం చేశారు. జైలులోని గుర్మీత్, హనీప్రీత్ : లైంగికదాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడటంతో డేరా బాబా గుర్మీత్ జైలుకు వెళ్లారు. ఆయనకు శిక్ష ఖరారు సమయంలో పంచకుల, రోహ్తక్ సహా హరియాణాలోని పలు పట్టణాలు, పంజాబ్‌లోని ఒకన్ని చోట్ల డేరా అనుచరులు హింసకు పాల్పడ్డారు. నాటి అల్లర్లలో 20మందికిపైగా చనిపోయారు. ఆయా కేసులకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా ఉన్న హనీప్రీత్.. అనంతరకాలంలో అరెస్టయ్యారు. గుర్మీత్ నేరాలలోనూ ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసు ద్యాప్తులో వెల్లడైంది. -
‘నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు’
సాక్షి, అంబాలా : గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచకుల అల్లర్ల కేసును వాదిస్తున్న ముగ్గురి లాయర్లకు ఫీజు ఇచ్చేందుకు తన దగ్గర ఒక్కరూపాయి కూడా లేదని హనీప్రీత్ ఇన్సాన్ జైలు అధికారులకు లేఖ రాశారు. పంచకుల అల్లర్ల తరువాత సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్నికల్పించాలని ఆమె జైలు అధికారులకు కోరారు. డేరా సచ్చాసౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రేప్ కేసులో 20 పంచకుల కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగిన అల్లర్లకు హనీప్రీత్ సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అల్లర్ల కోసం హనీ ప్రీత్ రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును సిట్ అధికారలు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లకు ఫీజు చెల్లించేందుకుతన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని.. సీజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ఆమె జైలు అధికారులను కోరారు. పంచకుల అల్లర్ల తరువాత 38 రోజులు పాటు హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డేరాకు సంబందించిన బ్యాంక్‌కు ఖాతాలతో పాటు హనీప్రీత్ బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. -
జైల్లో నిద్రలేని రాత్రి
అంబాలా : డేరాబాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్.. మొదటి రోజు జైల్లో నిద్రలేకుండా గడిపినట్లు పోలీసులు తెలిపారు. నిన్నమొన్నటిదాకా విలాసాల్లో మునిగితేలిన హనీప్రీత్‌కు పోలీస్ ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలుస్తోంది. పంచకుల జైల్లో ఆమె కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పంచకుల నుంచి అంబాలా సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పంచకుల జైల్లో రిమాండ్ ఖైదీగా ఆమె గడిపిన క్షణాలను పోలీసులు గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ చేసిన తొలిరోజున హనీప్రీత్ జైల్లో రాత్రి భోజనం కూడా చేయలేదని తెలుస్తోంది. అధిక సమయం మౌనంగా ఉండడంతో పాటూ.. తనలోతానే మాట్లుకునేదట. హనీప్రీత్‌తో పాటు ఆమె ముఖ్య అనుచరురాలు సుఖ్దీప్ కౌర్ కూడా ఆమె ఉన్నట్లు సామాచారం. హనీప్రీత్, సుఖ్దీప్ కౌర్‌లను ఇతర మహిళ నేరస్థులతో కాకుండా ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచినట్లు తెలుస్తోంది. వీరున్న గదికి అత్యంత పటిష్టమైన బధ్రతను పోలీసులు ఏర్నాటు చేశారు. హనీప్రీత్‌ను ప్రతిక్షణం గమనించేలా ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. ఇదిలా ఉండగా.. హనీప్రీత్‌ను అరెస్ట్ చేసిన తరువాత.. గుర్మీత్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె పోలీసులను అభ్యర్తించినట్లు తెలుస్తోంది. -
అసలు నిజం ఒప్పుకున్న హనీప్రీత్..
ఛండీగఢ్ : వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు. 38 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పంచకుల అల్లర్లకు పథకం అమలు చేసింది తానేనని నేరాన్ని అంగీకరించారు. ఈమేరకు ఆమె నోరువిప్పి, నిజాలు వెళ్లగక్కారని హరియాణా సిట్ అధికారులు బుధవారం వెల్లడించారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దోషిగా తేలి, అరెస్టయిన అనంతరం హరియాణ, పంజాబ్ లలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సీబీఐ కోర్టు ఉన్న పంచకుల పట్టణంలోనైతే హింస తీవ్రరూపం దాల్చడం, అల్లర్లలో 38 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విదితమే. ఈ ఘటనలకు సంబంధించి సూత్రధారిగా భావిస్తోన్న హనీప్రీత్ ను ఇటీవలే అరెస్టు చేశారు. పక్కాగా అమలు చేసిన హనీప్రీత్ : ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో పంచకుల కోర్టు ఆగస్టు 25న గుర్మీత్ ను దోషిగా నిర్ధారించింది. అదే రోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు తీర్పు రావడానికి వారం రోజుల ముందే, అంటే ఆగస్టు 17న డేరా ఆశ్రమంలో కీలక సమావేశం ఒకటి జరిగింది. గుర్మీత్, హనీప్రీత్, డేరా ముఖ్యులు కొందరు పాల్గొన్న ఈ భేటీలో వ్యతిరేక తీర్పు వస్తే ఏం చెయ్యాలనేదానిపై ఒక స్కెచ్ గీశారు. ఆ పథకం ప్రకారమే బాబా అరెస్టైన వెంటనే పలు ప్రాంతాల్లో అల్లర్లు రేపారు. సాధారణ ప్రజలే టార్గెట్ గా హింసకు పాల్పడ్డారు. ఇందుకు అవసరమైన సరంజామా, డబ్బులను డేరా ముఖ్యులు సరఫరా చేశారు. ల్యాప్ టాప్ లో కీలక సమాచారం : ఏయే ప్రాంతాల్లో అల్లర్లు రేపాలో ముందే పథకాన్ని రచించడంతోపాటు అందుకు అయ్యే ఖర్చును ఒక్కో డేరా ముఖ్యుడికి అప్పజెప్పారు. ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో అల్లర్లు చేయించారు, ఎంతెత డబ్బులు ఇచ్చారు అన్న సమాచారం మొత్తాన్ని హనీప్రీత్ తన ల్యాప్ టాప్ లో స్టోర్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కనిపించకుండా పోయిన ఆ ల్యాప్ టాప్ దొరికితే గనుక అందులోని సమాచారం కేసుకు మరింత ఉపయుక్తం కానుందని సిట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
హనీప్రీత్ రిమాండ్ పొడిగింపు
సాక్షి,చండీగర్: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీస్ కస్టడీని పంచ్‌కుల కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అత్యాచార కేసుల్లో డేరా బాబాను దోషిగా నిర్ధారించిన క్రమంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి హనీప్రీత్‌ను ఈనెల 3న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడిన కారణంగా తాము ఆమెను ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకువెళ్లాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. హనీప్రీత్ రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరారు. హర్యానా పోలీసుల అభ్యర్థన మేరకు మూడు రోజుల పాటు ఈనెల 13 వరకూ హనీప్రీత్ రిమాండ్‌ను పంచ్‌కుల కోర్టు పొడిగించింది. -
హనీప్రీత్ అరెస్ట్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పంచకుల : డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాల్ మే కుచ్ కాలా హై (అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది) అని పేర్కొన్నారు. వారికి(పంజాబ్ పోలీసులకు) అంతా తెలుసు. హనీప్రీత్ ను ట్రాకింగ్ చేయటం.. అరెస్ట్ అంతా వారి మాధ్యమంగానే జరిగింది. మా(హర్యానా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. కానీ, వాళ్లు అలా చేయలేదు. అందుకే అరెస్ట్ లో జాప్యం జరిగింది అని ఖట్టర్ వ్యాఖ్యానించారు. హనీప్రీత్‌ను మంగళవారం ఛండీగఢ్ హైవేలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెతోపాటు మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ నేత హర్మిందర్ సింగ్ జస్సీ కూతురు రామ్ రహీమ్ కొడుకును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సహకారంతోనే హనీప్రీత్ తప్పించుకోవాలని ప్రయత్నించిందని.. తన పరపతిని ఉపయోగించి హనీకి భద్రత కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. గతంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవటంతోనే పంచకుల రణరంగంగా మారిందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచకుల సెక్టార్-20 లోని రాంపూర్ జైల్లో విచారణ ఎదుర్కుంటున్న హనీప్రీత్ ఎలాంటి విషయాలను వెల్లడించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై లైడిక్టర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న హనీప్రీత్
హరియాణా : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెంపుడు కుమార్తె హనీప్రీత్‌ను హరియాణా పోలీసులు బుధవారం పంచకుల కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం.. ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుర్మిత్తో సంబంధాలు, అరెస్ట్ సమయంలో హింస, ఆశ్రమంలో అరాచకాలపై హనీప్రీత్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా కోర్టులో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గుర్మిత్ తనకు తండ్రిలాంటివారని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హనీప్రీత్ అన్నారు. గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము మూడు గంటల వరకూ ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో తనకు ఛాతీనొప్పి వస్తున్నట్లు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. హనీప్రీత్ పరీక్షలు నిర్వహించి వైద్యులు...ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హింసాకాండ చెలరేగిన విషయం విదితమే. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ జాబితాలో హనీప్రీత్ ఇన్సాన్ది మొదటి పేరు కావడం గమనార్హం. -
హనీప్రీత్.. చిక్కదు.. దొరకదు..!
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులు దాటినా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ జాడ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇందుకు కారణం పోలీసుల తనిఖీల సమాచారం హనీప్రీత్‌కు అందడేనని నిఘావర్గాలు భావిస్తున్నాయి. గత ఆగస్టు 25వ తేదీన అత్యాచారాల కేసులో గుర్మీత్‌ను దోషిగా తేల్చాక హరియానాలో అల్లర్లు జరిగాయి. ఆపై డేరాలలో జరుగుతున్న అకృత్యాలు, మరిన్ని ఆరోపణలపై తనను అరెస్ట్ చేస్తారని భయాందోళనకు గురై హనీప్రీత్ పరారైంది. ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకోవాలని చూస్తున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. గత 33 రోజుల నుంచి ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నా ఆమె జాడ తెలియడం లేదు. కొందరు అనుచరులు ఆమెకు పోలీసు తనిఖీల సమాచారం లీకులిస్తున్న కారణంగానే ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నాట్లు భావిస్తున్నారు. వాస్తవానికి గుర్మీత్‌కు శిక్షపడ్డ ఆగస్టు 25న, ఆ మరుసటిరోజు హనీప్రీత్ జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్నారు. ఆ తర్వాత ఆమె మద్ధతుదారులు, గుర్మీత్ అనుచరుల సాయంతో ఆమె పరారైన విషయం తెలిసిందే. కొందరు అనుచరుల సాయంతో హనీప్రీత్ ఎప్పటికప్పుడూ తన మకాం మారుస్తోందని, అవసరమైతే దేశం దాటి వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పరారవుతూ తనగోతిని తానే తవ్వుకుంటుందని హనీప్రీత్‌ను ఉద్దేశించి అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహమ్మద్ అకిల్ వ్యాఖ్యానించారు. అయితే త్వరలో ఆమెను అదుపులోకి తీసుకోవడం ఖాయమని చెప్పారు. ఆమెకు సాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
-
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
సాక్షి, కర్నాల్: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్, గుర్మీత్‌లకు శారీరక సంబంధం ఉందంటూ ఇటీవల పేర్కొన్న విశ్వాస్.. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు తన ప్రాణాలు రక్షించాలని కోరుతూ గురువారం కర్నాల్ పోలీసులను ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఎస్హెచ్ఓ రాజ్బీర్ సింగ్ తెలిపారు. ఓవైపు గుర్మీత్‌కు జైలుశిక్ష నేపథ్యంలో పరారైన హనీప్రీత్ కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుండగా మరోవైపు విశ్వాస్ గుప్తా తన మాజీ భార్య హనీప్రీత్ వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. హనీప్రీత్, డేరా సచ్ఛా సౌదాల విషయాలు మరిన్ని వెల్లడిస్తానని భావించి కొందరు తనకు ఫోన్‌చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు విశ్వాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహం అనంతరం హనీప్రీత్‌ను గుర్మీత్ తన వద్దకు పంపలేదని, వారిద్దరే ఏకాంతంగా గడిపేవారని చెప్పడం కూడా తనపై హత్యకుట్రకు ఓ కారణమై ఉంటుందన్నారు. చంఢీగఢ్‌లో డేరా చీఫ్ గుర్మీత్, హనీప్రీత్‌లకు వ్యతిరేకంగా ఎన్నో విషయాలు వెల్లడించినప్పటినుంచీ గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హనీప్రీత్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. కాగా, గత ఆగస్టు 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత హనీప్రీత్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
హనీప్రీత్ ఏ తప్పు చేయలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక, మోస్ట్ వాంటెడ్ హనీప్రీత్ సింగ్ ఇండియాలోనే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించబోతుందని సమాచారం. ఈ మేరకు బెయిల్ దరఖాస్తు దాఖలు చేయనున్నట్లు ఆమె తరపు న్యాయవాది ప్రదీప్ ఆర్య మీడియాకు వెల్లడించారు. ‘‘గుర్మీత్ శిక్ష, తర్వాత పరిస్థితులు, బాబాకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం గురించి చెడుగా వార్తలు రావటంపై హనీప్రీత్ బాధపడ్డారు. అల్లర్లకు ఆమె కారణమన్న పోలీసుల వాదన ముమ్మాటికీ తప్పు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాం’’ అని ప్రదీప్ ఆర్య తెలిపారు. అంతేకాదు బెయిల్ అప్లికేషన్‌పై సంతకం చేసేందుకు హనీప్రీత్ లజ్‌పత్ నగర్‌లోని తన కార్యాలయానికి వచ్చినట్లు ప్రదీప్ చెప్పారు. అయితే ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తనకు ఖచ్ఛితంగా తెలీదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఆలస్యం కావొచ్చని, కానీ, పిటిషన్‌ను త్వరగా పరిశీలించాలని తాను న్యాయమూర్తిని కోరతానని ప్రదీప్ తెలిపారు. ఆగష్టు 25న పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసుల్లో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌కు 20 ఏళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు కారణమని పేర్కొంటూ 43 మంది మోస్ట్ వాంటెడ్ జాబితాను హర్యానా పోలీస్ శాఖ ప్రకటించగా, అందులో హనీప్రీత్ పేరు టాప్‌లో ఉంది. దీంతో లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో బిహార్‌సహా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు. -
హనీప్రీత్ కోసం కొనసాగుతున్న వేట
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో పంచ్కులలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి తాజాగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. వీరిద్దరూ విదేశాలకు పారిపోకుండా వీరిపై లుక్అవుట్ నోటీస్ జారీ అయిన విషయం విదితమే. డేరాలో చురుకుగా వ్యవహరించే ప్రదీప్ గోయల్ ఇన్సాన్‌ను ఆదివారం రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హర్యానా పోలీసులతో కూడిన సిట్ అదుపులోకి తీసుకుంది. ఇక ఆదిత్య ఇన్సాన్ బావ ప్రకాష్ అలియాస్ విక్కీని మొహాలీలో అరెస్ట్ చేసినట్టు పంచ్‌కుల డీసీపీ మన్బీర్ సింగ్ తెలిపారు. ఇక శనివారం అరెస్ట్ అయిన వ్యక్తిని విజయ్‌గా గుర్తించినట్టు వెల్లడించారు. డేరా బాబాను దోషిగా నిర్ధారించిన అనంతరం హర్యానా, పంజాబ్‌లలో జరిగిన హింసాకాండలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
డేరాబాబా దత్తపుత్రిక ప్రాణానికి ముప్పు..
సాక్షి, పంచకుల: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. డేరాబాబా అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమెను మట్టుబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో హరియాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హనీప్రీత్ కోసం గాలిస్తున్నామని హరియాణ పోలీస్ అధికారి బీఎస్ సంధూ మీడియాకు తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రహస్య విచారణ జరుపుతున్నట్లు వచ్చిన వార్తను ఆయన ఖండించారు. గత నెల 25న ఆమె గుర్మీత్‌ను రోహ్తక్ జైలులో కలిసే ప్రయత్నం చేసింది. జైలు వర్గాలు ఆమెను అనుమతించకపోవడంతో డేరా అనచురుల వాహనంలో వెళ్లిన ఆమె మళ్లీ కనిపించలేదు. గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో హనీప్రీత్ సూచనల మేరకే డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెపై లుక్అవుట్ జారీ చేశారు. -
హనీకి షెల్టర్ ఇచ్చి అరెస్టు.. నో ఆన్సర్స్
పంచకుల: డేరా సచ్చా సౌదాకు సంబంధించిన కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ మందులషాపు యజమానిని అరెస్టు చేసింది. గత నెల 25న జరిగిన హింసాత్మక ఘటన సమయంలో అతడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్కు ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా ఆమెకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేశాడని, ఆమె అవసరానికి తగిన వస్తువులు చేరవేశాడనే ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. పంచకులలోని సెక్టార్ 20లో మందుల దుకాణం నడుపుతున్న సత్పాల్ సింగ్ అనే వ్యక్తిని తాము అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఆగస్టు 25కు ముందు ఆ తర్వాత అతడి కదలికలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడమే కాకుండా, తమకు అంతకుముందే అతడి గురించి అందిన సమాచారంతో ఆ వివరాలను పోల్చి చూస్తున్నట్లు తెలిపారు. అయితే, వీలయినంత మేరకు పోలీసులకు సహకరించకూడదనే దోరిణితో అతడు వ్యవహరిస్తున్నాడని, సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్నాడని ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పంచకుల కమిషనర్ తెలిపారు. -
హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు
సాక్షి, ఛండీగఢ్: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కోసం వేట మొదలైంది. గుర్మీత్‌ను తప్పించేందుకు వ్యూహరచన చేసిన ఆరోపణలపై ఆమెను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. గుర్మీత్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం రోహ్తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గుర్మీత్‌ను తప్పించేందుకు యత్నించారు. అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(నేర విభాగం) సుమిత్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది. ఇక ఫ్లాన్ వెనుక హనీప్రీత్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం కావటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. హనీప్రీత్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లు పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ ధృవీకరించారు. అదే సమయంలో ఎర్ర బ్యాగ్ ద్వారా హింసకు పాల్పడాలంటూ అనుచరులకు హనీప్రీత్ సంకేతాలిచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న నగదుతో ఉడాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గుర్మీత్ హనీప్రీత్ సంబంధం ఏంటి? -
'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'
సాక్షి, రోహ్తక్: డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్ గుప్తా అన్నారు. హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్మీత్, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో గుప్తా విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. బాబా నివాసమైన గుఫాలో తాను ఉండేవాడినని చెప్పారు. బాబా, హనీలు శృంగారంలో పాల్గొంటుండగా తాను చూశానని తెలిపారు. ఇది గమనించిన బాబా విషయం బయటకు చెబితే తనను చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా హనీని బాబా తన వెంట తీసుకెళ్లేవారని, తమ జంటను(గుప్తా-హనీప్రీత్) ఏకాంతంగా ఏ రోజు వదల్లేదని చెప్పారు. గుప్తా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన డేరా సచ్చా సౌదా అనుచరులు అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. బాబా ఒత్తిడి కారణంగా కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని విశ్వాస్ తెలిపారు. గుప్తాకు డేరా సచ్చా సౌదా అనుచరుల నుంచి అపాయం ఉండటంతో ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉంటున్నారు.