అంబాలా : డేరాబాబా గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్.. మొదటి రోజు జైల్లో నిద్రలేకుండా గడిపినట్లు పోలీసులు తెలిపారు. నిన్నమొన్నటిదాకా విలాసాల్లో మునిగితేలిన హనీప్రీత్‌కు పోలీస్ ట్రీట్‌మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలుస్తోంది. పంచకుల జైల్లో ఆమె కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పంచకుల నుంచి అంబాలా సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పంచకుల జైల్లో రిమాండ్ ఖైదీగా ఆమె గడిపిన క్షణాలను పోలీసులు గుర్తు చేసుకున్నారు.
అరెస్ట్ చేసిన తొలిరోజున హనీప్రీత్ జైల్లో రాత్రి భోజనం కూడా చేయలేదని తెలుస్తోంది. అధిక సమయం మౌనంగా ఉండడంతో పాటూ.. తనలోతానే మాట్లుకునేదట. హనీప్రీత్‌తో పాటు ఆమె ముఖ్య అనుచరురాలు సుఖ్‌దీప్ కౌర్ కూడా ఆమె ఉన్నట్లు సామాచారం. హనీప్రీత్, సుఖ్‌దీప్ కౌర్‌లను ఇతర మహిళ నేరస్థులతో కాకుండా ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచినట్లు తెలుస్తోంది. వీరున్న గదికి అత్యంత పటిష్టమైన బధ్రతను పోలీసులు ఏర్నాటు చేశారు. హనీప్రీత్‌ను ప్రతిక్షణం గమనించేలా ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. ఇదిలా ఉండగా.. హనీప్రీత్‌ను అరెస్ట్ చేసిన తరువాత.. గుర్మీత్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె పోలీసులను అభ్యర్తించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment