
సాక్షి,చండీగర్: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీస్ కస్టడీని పంచ్‌కుల కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అత్యాచార కేసుల్లో డేరా బాబాను దోషిగా నిర్ధారించిన క్రమంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి హనీప్రీత్‌ను ఈనెల 3న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడిన కారణంగా తాము ఆమెను ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకువెళ్లాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. హనీప్రీత్ రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరారు. హర్యానా పోలీసుల అభ్యర్థన మేరకు మూడు రోజుల పాటు ఈనెల 13 వరకూ హనీప్రీత్ రిమాండ్‌ను పంచ్‌కుల కోర్టు పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment