Remand Extend
-
24 వరకు రిమాండ్‌లో నీరవ్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. భారత్‌కు నీరవ్‌ను తిరిగి అప్పగించే కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్‌వర్త్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నాట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీరవ్ హాజరయ్యారు. మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్‌ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్ తరఫున వేరే బెయిల్ పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్‌కు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నీరవ్ కార్ల వేలం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేసింది. నీరవ్‌కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్లైన్లో వేలం వేసింది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. -
‘శ్రీనివాసరావుకు మరో రెండు వారాలు రిమాండ్ పెంచండి’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ రేపటి (శుక్రవారం)తో ముగియనుంది. (సిట్ నివేదికను సమర్పించండి : హైకోర్టు) కాగా, విచారణ ఇంకా పూర్తి కానందున శ్రీనివాసరావు రిమాండ్ గడువు మరో రెండు వారాలు పొడిగించాలని సిట్ విశాఖపట్నం కోర్టులో మెమో దాఖలు చేసింది. అలాగే నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని మరో మెమో దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సాక్షుల నుంచి వివరాల సేకరణకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నోటీసులు ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. -
హనీప్రీత్ రిమాండ్ పొడిగింపు
సాక్షి,చండీగర్: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీస్ కస్టడీని పంచ్‌కుల కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అత్యాచార కేసుల్లో డేరా బాబాను దోషిగా నిర్ధారించిన క్రమంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి హనీప్రీత్‌ను ఈనెల 3న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడిన కారణంగా తాము ఆమెను ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకువెళ్లాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. హనీప్రీత్ రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని కోరారు. హర్యానా పోలీసుల అభ్యర్థన మేరకు మూడు రోజుల పాటు ఈనెల 13 వరకూ హనీప్రీత్ రిమాండ్‌ను పంచ్‌కుల కోర్టు పొడిగించింది. -
ఏఎస్సైకు రిమాండ్ పొడిగింపు
కరీంనగర్: పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను కరీంనగర్ కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. వడ్డీ వ్యాపారిగా మారి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మోహన్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కరీంనగర్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసుతో సంబంధమున్న ఎస్పీ జనార్ధనరెడ్డిపై ఇప్పటికే ఉన్నతాధికారులు వేటు చేశారు. మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు శాఖ సిద్ధమవుతోంది. -
రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. -
రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
-
సుఖేష్ గుప్తా రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: బంగారం దిగుమతికి సంబంధించి మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ను మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యూవెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్‌ల రిమాండ్‌ను సీబీఐ కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో సోమవారం న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ను పొడిగించారు. బంగారం దిగుమతి వ్యవహారంలో ఎంఎంటీసీకి రూ.194 కోట్లు నష్టం చేకూర్చారంటూ ఎంబీఎస్ డెరైక్టర్‌తోపాటు ఎంఎంటీసీకి చెందిన అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.