
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ రేపటి (శుక్రవారం)తో ముగియనుంది. (సిట్ నివేదికను సమర్పించండి : హైకోర్టు)
కాగా, విచారణ ఇంకా పూర్తి కానందున శ్రీనివాసరావు రిమాండ్ గడువు మరో రెండు వారాలు పొడిగించాలని సిట్ విశాఖపట్నం కోర్టులో మెమో దాఖలు చేసింది. అలాగే నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని మరో మెమో దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా సాక్షుల నుంచి వివరాల సేకరణకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నోటీసులు ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment