ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది.
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు.