రౌడీషీటర్ మహేష్‌నాయుడు అరెస్ట్
Published Fri, Apr 14 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌కు చెందిన రౌడీషీటర్ జల్లి మహేష్‌నాయుడును అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బాలనరసింహులు గురువారం తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఇదే గ్రామానికి చెందిన జయకిశోర్‌రెడ్డి, నరసింహారెడ్డి, నరసింహ ఇళ్లపైకి వెళ్లి దుర్భాషలాడి, అంతుచూస్తానని భయాందోళనకు గురిచేశాడని నిందితుడిపై కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఉదయం నెహ్రూనగర్‌లో ఉన్నాడనే సమాచారం రాగా సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement