rowdy sheet
-
సర్పంచ్ శ్రీనివాస్‌పై రౌడీషీట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌పై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత మార్చి 13వ తేదీనే రౌడీషీట్ ఓపెన్‌చేసినట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. పురుమల్ల శ్రీనివాస్‌పై 24కుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఫోర్జరీ, చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, దురాక్రమణలు, భూ దందాల నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు సదరులేఖలో ఉంది. శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది. కాగా.. పోలీసులు ముందస్తు వ్యూహంతోనే ఆయనపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గత సీపీ సత్యనారాయణ పదేపదే శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలతో పీడీయాక్టు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అతను అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడం, పై నుంచి ఒత్తిడితో వెనకడుకు వేసినట్లు తెలిసింది. ఇటీవల శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే శ్రీనివాస్‌పై నమోదు చేసిన రౌడీషీట్‌ను పోలీసులు తెలివిగా బయటకు తీసినట్లు చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతనిపై కొన్నిరోజుల్లో పీడీయాక్టు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీపీ సుబ్బారాయుడును సంప్రదించగా శ్రీనివాస్‌పై మార్చిలోనే రౌడీషీట్ తెరిచినట్లు స్పష్టం చేశారు. -
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
-
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసుల రౌడీషీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీన్ని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్ని వదిలేసి.. ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మహిళపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు
-
వైరల్ వీడియో ఆధారంగా మహిళపై రౌడీషీట్
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాదిక్ అనే మైనర్ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే సాదిక్ అనే మైనర్ బాలుడు ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, దీంతో ఆ అమ్మాయికి వరుసకు చిన్నమ్మ అయిన గీతాంజలి సాదిక్‌పై దాడి చేసినట్టు సమాచారం. గీతాంజలితో పాటు ఆమె కుమారుడు కూడా సాదిక్‌ను చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గీతాంజలిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. -
‘పరివర్తన’తో సత్ఫలితాలు
విజయనగరం టౌన్: పదేళ్లకు పైబడి నేరచరిత్ర కలిగి, సాధారణ జీవనం గడుపుతూ పోలీస్ నిఘాలో ఉన్న నేరస్తులపై ఉన్న హిస్టరీ షీట్లను మూసివేస్తూ ఎస్పీ జి.పాలరాజు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పరివర్తన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్లలో 85 షీట్లను మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత నేరస్తుల జీవన విధానాన్ని, నడవడికను పరిశీలించి, వారు పరివర్తన చెందారని నిర్ధారించుకున్న తర్వాతనే హిస్టరీ షీట్లను మూసివేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 920 హిస్టరీ షీట్స్‌లో (ఇందులో 40 డీసీ షీట్లు, 61 కేడీ షీట్లు, 639 అనుమానిత షీట్లు, 180 రౌడీ షీట్లు) ఇందులో 85 హిస్టరీషీట్స్ (ఐదు డీసీ షీట్స్, 2 కేడీషీట్స్, 46 రౌడీషీట్లు, 32 అనుమానిత షీట్లు) మూసి వేశామన్నారు. పాత నేరస్తులపై ఈ షీట్స్ ఉండడం వల్ల సమాజంలో వారి కుటుంబానికి సరైన గౌరవం లేకపోవడం, వారిపై నిరంతరం పోలీసులు నిఘా ఉండడం వల్ల ప్రజల్లో చిన్న చూపునకు గురవడం జరుగుతుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడకుండా ఉన్న వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, Ð5éరి జీవన విధానంలో మార్పు వచ్చిన మార్పులను, నడవడికను పరిశీలించి, వారు సక్రమంగా కుటుంబంతో జీవిస్తున్నారా? లేదా? అన్న విషయం గురించి గత ఆరు నెలలుగా వివిధ రకాలుగా పోలీసు రికార్డులను పరిశీలించారు. వారు మంచిగా జీవనం సాగిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిపై గల హిస్టరీ షీట్లను మూసివేస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఇక వారిపై ఎటువంటి పోలీసు నిఘా ఉండదని, పోలీసుల వేధింపులు ఉండవని, సక్రమంగా కుటుంబాలతో జీవించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నేరస్తులలో మార్పు తీసుకురా>వడం, వారిలో నిజాయితీగా పరివర్తన తీసుకురావడం వంటి చర్యలను చేపట్టడం వలన మాత్రమే నేరాలను అదుపులోనికి తీసుకురావడంతో పాటూ నేరస్తులలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఇటీవల హిస్టరీ షీట్ కలిగిన వండాన ధర్మారావు అనే పాత నేరస్తుని కుమార్తె ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చదువుకుని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగం సాధించుకున్నారన్నారు. ఇదోక శుభ పరిణామమని తెలిపారు. 60 శాతం నేరాలు అనేవి పదే పదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల వల్ల మాత్రమే జరుగుతున్నాయన్నారు. వీటిని గుర్తించి అనవసరమైన వ్యక్తులపై నిఘాను తగ్గించి, అవసరమైన నేరస్తులపై నిఘాను మరింతగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హిస్టరీ షీట్లను మూసివేస్తున్నట్లుగా ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం పలువురు పాత నేరస్తులు మాట్లాడుతూ హిస్టరీ షీట్లు తొలగించినందుకు ఎస్పీ పాలరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి సందర్భంలోనూ తప్పులు చేయబోమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, పార్వతీపురం ఏఎస్పీ దీపికా ఎమ్.పాటిల్, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు ఎవి.రమణ, ఎఎస్.చక్రవర్తి, టి.త్రినాథ్, దాసరి లక్ష్మణరావు, సీఐలు రఘు శ్రీనివాస్, చంద్రశేఖర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పాత నేరస్తులు పాల్గొన్నారు. -
వీడిన సంకెళ్లు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కృష్ణాజీవాడి రైతులపై రౌడీ ముద్ర తొలగింది. వారిపై రౌడీషీట్ తొలగిస్తున్నట్లు ఎస్పీ శ్వేత ప్రకటించారు. 2014 జనవరి 12న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి గ్రామంలో మక్కల తూకంలో తేడాను గమనించిన రైతులు వ్యాపారిని నిలదీశారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో అప్పటి తాడ్వాయి ఎస్ఐ రాంబాబు వచ్చి లారీని బలవంతంగా పంపించారు. దీంతో రైతులు ఎస్ఐని నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. సంఘటనలో 22 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు రౌడీషీట్ తెరిచారు. ఈ కేసును కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విచారించారు. సరైన సాక్ష్యాలను చూపడంలో పోలీసులు విఫలమవడంతో 2016 మార్చి 31న కేసు కొట్టేశారు. అయినా.. పోలీసులు రౌడీషీట్ తొలగించలేదు. ఈ విషయమై నవంబర్ 9న ‘సాక్షి’మెయిన్ పేజీలో ‘రైతన్నపై రౌడీ ముద్ర’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ శ్వేత స్పందించారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో నోటీసు బోర్డుపై ఉన్న రైతుల ఫొటోలను తొలగించి, ఎల్లారెడ్డి డీఎస్పీతో విచారణ జరిపించారు. రౌడీషీట్ నమోదైన వారిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారిలో 19 మందిని సత్ప్రవర్తన కలిగిన వారుగా గుర్తించి వారిపై రౌడీషీట్లను ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ శ్వేత ‘సాక్షి’తో తెలిపారు. ఒకరిపై మాత్రం కేసు కొనసాగుతుందన్నారు. -
రౌడీషీటర్ మహేష్‌నాయుడు అరెస్ట్
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌కు చెందిన రౌడీషీటర్ జల్లి మహేష్‌నాయుడును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బాలనరసింహులు గురువారం తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఇదే గ్రామానికి చెందిన జయకిశోర్రెడ్డి, నరసింహారెడ్డి, నరసింహ ఇళ్లపైకి వెళ్లి దుర్భాషలాడి, అంతుచూస్తానని భయాందోళనకు గురిచేశాడని నిందితుడిపై కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఉదయం నెహ్రూనగర్‌లో ఉన్నాడనే సమాచారం రాగా సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. -
నాపై రౌడీషీట్ ఎత్తేయండి!
- ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వినతి - పరిశీలించాలంటూ జిల్లా పోలీసులకు ప్రభుత్వ ఆదేశం - త్వరలో రౌడీషీట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం! సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనపై ఉన్న రౌడీషీట్ ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. ఆయన స్వయంగా సీఎం చంద్రబాబును కలసి ఈ మేరకు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వినతిని పరిశీలించాలంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. భూమాపై రౌడీషీట్ ఎత్తివేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం తన అభిప్రాయాల్ని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి అధికారపార్టీలో చేరిన తర్వాత భూమాపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేసేందుకు పావులు కదపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే కేసుల్ని నమోదు చేస్తారని, అధికారపార్టీలో చేరితే అవే కేసుల్ని ఎత్తివేస్తారనే భావన ప్రజల్లో బలంగా నెలకొనే ప్రమాదముందనే ఆందోళన అధికారపార్టీలోని నేతల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. కేసు నేపథ్యమిదీ..: నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 2014, అక్టోబర్ 31న నిర్వహించారు. చివర్లో రోడ్ల విస్తరణపై భూమా నాగిరెడ్డి మాట్లాడుతుండగా.. సమావేశం ముగిసిందంటూ అధికారపార్టీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన బెల్‌కొట్టారు. ఇది ఇరువర్గాలమధ్య దాడులదాకా వెళ్లింది. మాజీమంత్రి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గాయపడ్డారు. చైర్పర్సన్ చాంబర్ అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన కౌన్సిలర్లను సమావేశం ముగిశాక మునిసిపల్ వైస్‌చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ పరామర్శించి వస్తుండగా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనల గురించి మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, ఫరూక్‌లు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేశారు. దీనిపై దళిత కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్‌ను అవమానించారంటూ అట్రాసిటీ కేసు, గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై హత్యాయత్నానికి కుట్రపన్నినట్టు భూమాపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వెంటనే రాత్రిసమయంలో ఆయన్ను అరెస్ట్ చేసి విచారించారు. మరుసటిరోజు భూమా, ఆయన అనుచరులైన ఏడుగురు కౌన్సిలర్లతోపాటు ఏవీఆర్ ప్రసాద్‌లపై రౌడీషీట్ నమోదైంది. -
హత్యలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం
గూడూరు : వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో హత్యలకు పాల్పడినవారిపై రౌడీషీట్ కేసులు ఓపెన్ చేస్తామని గూడూరు సీఐ బి.రమేష్‌నాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం మండలంలోని మట్టెవాడ శివారు కొంగరగిద్దలో ఈ నెల 20న హత్యకు గురైన ఇరుప ఈశ్వర్ కేసులో నిందితులైన దంపతుల అరెస్టు చూపారు. సీఐ కథనం ప్రకారం.. కొంగరగిద్ద గ్రామానికి చెందిన ఈశ్వర్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడి పక్కింట్లో ఈసం నర్సయ్య, ఈరమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా నర్సయ్య భార్య ఈరమ్మ అనారోగ్యానికి గురికాగా, భర్తతో దూరంగా ఉంటోంది. పైగా రాత్రి వేళ దయ్యాలు, భూతాలు అంటూ కలవరించడం, ఓ రోజు పక్కింట్లో ఉంటున్న ఇరుప ఈశ్వర్ పేరు కలలో పలకడంతో, ఆ దంపతుల నడుమ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో నర్సయ్య భూత వైద్యులను సంప్రదించగా వారు ఈశ్వర్, ఈరమ్మ మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పంట చేనుకు వెళ్తున్న ఆ దంపతులకు మోటార్ మరమ్మతు కోసం వ్యవసాయబావి వద్దకు వెళ్తున్న ఈశ్వర్ తారసపడ్డాడు. దీంతో నర్సయ్య అతడిని ఆపి ‘ నా భార్యకు నీకు ఉన్న సంబంధం ఏమిటని’ నిలదీశాడు. అలాంటిదేమి లేదని ఈశ్వర్ గద్దించడంతో కోపం వచ్చిన నర్సయ్య చేతిలో ఉన్న గొడ్డలితో అతడి మెడపై నరికాడు. కిందపడిపోయిన అతడి చాతిపై మరోమారు నరకగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఎవరూ తమను చూడలేదని నిర్ధారించుకున్న దంపతులు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి మొక్కజొన్న చేనులో పడేశారు. ఈ హత్యపై ఈ నెల 21న మృతుడి అక్క మేడ కౌసల్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నిందితులు భయపడి మట్టెవాడ సర్పంచ్ భర్త రేగ సాంబయ్య వద్దకు వెళ్లి నిజం ఒప్పుకున్నారు. సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రమేష్‌నాయక్ తెలిపారు. సమావేశంలో ఎస్సై వై.సతీష్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, నవీన్ పాల్గొన్నారు. -
యలమంచిలి రాముపై రౌడీషీటు
కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు ఇతనే విజయవాడ సిటీ: కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాముపై మాచవరం పోలీసులు రౌడీషీటు తెరిచారు. గతేడాది డిసెంబర్లో పటమట పంటకాల్వ రోడ్డులో ఫైనాన్స్ వ్యాపారం పేరిట రాము ఓ మహిళను బెదిరించి లొంగదీసుకోవడంతో పాటు ఆమెను పలు రకాలుగా వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. బాధిత మహిళ ఫిర్యాదుపై మాచవరం పోలీసులు పలు సెక్షన్ల కింద యలమంచిలి రాము సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో రాముపై పోలీసుల రౌడీషీటు తెరిచారు. ఇదిలా ఉండగా కేసులో నిందితుడైన చెన్నుపాటి శ్రీనివాసరావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినట్టు తెలిసింది. స్థానిక పోలీసుల వద్ద లొంగిపోయి బెయిల్ తీసుకోవాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో పోలీసుల వద్దకు రానున్నట్టు సమాచారం. సత్యానందంకు రిమాండ్ కాలమనీ కేసులో నాలుగో నిందితుడు ఎం.సత్యానందంను పీటీ వారెంట్‌పై ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మాచవరం పోలీసులు గురువారం హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ నిందితుడికి ఈ నెల 12వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ర్యాగింగ్ చేస్తే రౌడీషీట్
-
ర్యాగింగ్ చేస్తే రౌడీషీట్
* యోచిస్తున్న రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు * ర్యాగింగ్ ఫ్రీ ఏపీపై త్వరలో నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్ ఘటనల్ని పోలీసు విభాగం సీరియస్‌గా తీసుకుంది. ర్యాగింగ్ చేసిన వారిపై రౌడీషీట్ తెరవడంతో పాటు ఆ యా కళాశాలల యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయాలని భావిస్తోంది. ర్యాగింగ్ వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయడంతో పాటు రిషీ వ్యాలీ వంటి ప్రఖ్యాత స్కూళ్లలో ఉన్న మెంటారింగ్ విధానంపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కల్పించాలని యోచిస్తోంది. ర్యాగింగ్ ఫ్రీ ఏపీ స్థాపన కోసం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ సమన్లు జారీ చేయడం, భవిష్యత్తులో వీరికి పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగం రాకుండా నివేదిక రూపొందించడం వంటి కఠిన నిర్ణయాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. తీవ్రమైన స్థాయిలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని కాలేజీ నుంచి బహిష్కరించడం, మరోచోట అడ్మిషన్ లభించకుండా సర్టిఫికెట్లపై ‘ర్యాగర్’ స్టాంప్ వేయడం వంటి అంశాలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసు విభాగం నిర్ణయించింది. -
‘నేనే ప్రధాని అయితే...’
అప్పుడు సాయంత్రం ఐదుగంటలు... బీజేపీ ఆఫీసులో ఇరవై మంది వరకు అర్జీలు పట్టుకుని కిషన్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒకరొకరుగా సాయం కోరడం... కిషన్‌రెడ్డి వెంటనే పి.ఎ. ద్వారా సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం, వాళ్లు సంతృప్తిగా వెళ్లడం... జరిగిపోతున్నాయి. వచ్చిన వారిలో ఒకతను తన రౌడీషీట్ తీయించమంటున్నాడు. మరో వ్యక్తి ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించమంటున్నాడు. ‘చూడన్నా... నువ్వొచ్చి నన్నడిగినంత సులభంగా నేను అధికారిని అడగకూడదు. ఇది సాధ్యమా కాదా అని వచ్చినోడికి తెల్వకపోయినా ఎమ్మెల్యేకైనా తెలియాలి కదా అనుకుంటారు. నీకు ఇంకేదన్నా కావాలంటే రా’ అని సముదాయించి పంపేశారు. ఈ అష్టావధానం రోజూ ఉంటుందా? ఇప్పుడు తక్కువ. మరో గంటకు ఆఫీసు నిండిపోతుంది. అందరినీ సమాధాన పరచాలంటే సహనం ఉండాలేమో! చాలా. ఎమ్మెల్యే చెబితే ఏ పనయినా అవుతుందనుకుంటారు. కోర్టులో కేసు రాజీ చేసుకోక ముందే రౌడీ షీట్ తొలగించమని ఎలా చెబుతాం. ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన వ్యక్తిని ఆ ఉద్యోగంలో మళ్లీ చేర్చుకోమని అధికారులకు చెప్పాలంటే ముందు నా మనసుకు అది కరెక్టేననిపించాలి కదా? అంతరాత్మ సమ్మతించని పనిని చేయరన్న మాట? ఎంత వేగంగా పనులు చేస్తానో అంత కచ్చితంగానూ ఉంటాను. జరగని పనిని చేస్తానంటూ తిప్పుకోను. రాజకీయ రంగం, ఉద్యమాల గురించి తెలిసిందెప్పుడు? నేను ఆరవ తరగతికి రాకముందే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఎస్పీఎల్గా క్లాసులు బాయ్‌కాట్ చేయడం వంటివన్నీ జరిగిపోయాయి. పరీక్షలు లేకుండానే అందరినీ ప్రమోట్ చేసేశారు. కాలేజ్కొచ్చాక బుద్ధిమంతుడిలా చదువుకున్నారా? చదువుకున్నాను అంతే. కాలేజ్ నుంచి వచ్చి బీజేపీ ఆఫీసులో గడపడం, ఏ రాత్రికో అక్క వాళ్లింటికి వెళ్లడం! అప్పుడు పార్టీ ఆఫీసు వి.రామారావు గారింట్లో ఉండేది. దత్తాత్రేయ, రామారావు ఓ రోజు... ‘ఇక్కడికే వచ్చేయరాదా’ అన్నారు. ఇంటికి వెళ్లి పుస్తకాలు, దుస్తులు సర్దుకుని పార్టీ ఆఫీసుకొచ్చేశాను. వారలా అనకపోయి ఉంటే... బహుశా ఉద్యోగం చేసుకుంటూ ఉండే వాణ్ణేమో! రాజకీయరంగంలో ఆత్మసంతృప్తినిచ్చిన సంఘటన... తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంద కృష్ణతో కలిసి గుండె జబ్బుల పిల్లలకు వైద్యం కోసం ఉద్యమం చేశాం. గుండె ఆపరేషన్‌కు ఐదారు లక్షలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును భరించే స్తోమత లేని వారే అందరూ. పుట్టపర్తిలో ఉచితంగా ఆపరేషన్లు చేసేవారు. కానీ ఆరేళ్ల తర్వాత కానీ ఆపరేషన్ తేదీ వచ్చేది కాదు. చాలా మంది ఈ లోపే చనిపోయేవారు. ఈ పరిస్థితుల్లో శోభన్ అనే పదేళ్ల కుర్రాడు అక్కడే మరణించాడు. ఇక ఏదయితేనేం పూర్తిగా తేల్చుకోకుండా వదలకూడదని శోభన్ పార్థివదేహంతో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చున్నాం. ఆ ఉద్యమంతో అనుకున్నది సాధించారా? నూటికి నూరు పాళ్లు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ‘‘మీరు కోరినట్లే గుండె జబ్బు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాను. కానీ నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నాను. మెడ మీద కత్తి పెడితే ఎలా?’’ అన్నారు. ఈ ఉద్యమం కారణంగానే ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు. మీరే కనుక ప్రధానమంత్రి అయితే చేసే మొదటి పని? పై అధికారి నుంచి కింద వరకు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం తక్కువ. తక్కువ అనేకంటే లేదనడమే సబబు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వంటి ప్రజా ప్రతినిధులలోనూ ఉండడం లేదు. అయితే మేము ఐదేళ్లకోసారి ప్రజల మధ్యకు వెళ్లి వారిని సమాధాన పరిచి ఓట్లడగాలి. ఉద్యోగికి ఆ అవసరం కూడా లేదు. రాజకీయరంగంలో స్ఫూర్తి? చిన్నప్పుడు అనుకోకుండా ఆర్ఎస్ఎస్ కవాతు చూశాను. అది నా కంట పడకపోతే వేరుగా ఉండేవాడినేమో. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం పిలుపుతో స్ఫూర్తి పొందాను. జనతాపార్టీలో చేరి 1977లో యువజన విభాగం అధ్యక్షుడినయ్యాను. 1980లో జనతాపార్టీ నుంచి బీజేపీ ఆవిర్భవించినప్పుడు అందులోకి మారాను. హైదరాబాద్ పార్టీ ఆఫీస్ జీవితానికీ, ఢిల్లీ పార్టీ ఆఫీసు జీవితానికీ తేడా ఎలా ఉండేది? ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో 11 ఏళ్లు ఉన్నాను. గోవిందాచార్య, నరేంద్రమోదీ, నేను ముగ్గురం మూడు గదుల్లో ఉండేవాళ్లం. హైదరాబాద్ ఆఫీసులో ఉన్నప్పుడు మరీ చిన్నవాణ్ణి. కీలకమైన బాధ్యతలేవీ ఉండేవి కాదు. ఇక్కడి ఆఫీసులో దత్తాత్రేయ, నేనూ స్థిరనివాసులం. మా ఇద్దరి కోసం చిన్న మెస్ కూడా నడిచేది. దత్తాత్రేయ ఎజ్డీ మీద రాత్రి 10-11 గంటల వరకు స్నేహితులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లే వాళ్లం. మొదట్లో నేను బండి తుడిస్తే ఆయన నడిపేవారు. తర్వాత నేనే తుడిచి నేనే నడపడం మొదలైంది. అదే క్రమాన్ని పార్టీని నడపడంలోనూ పాటించినట్లున్నారు? నిజమే. ఆయన ముందు, నేను తర్వాత. స్వచ్ఛ్ భారత్ దేశానికి కొత్తగానీ మనకు గతంలో క్లీన్ అండ్ గ్రీన్ వంటి పేర్లతో పరిచయమే కదా? అది ఉద్యోగులతో చేయించిన కార్యక్రమం. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేయిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమం. మిగతా రాజకీయ నాయకులకూ మీకూ తేడా ఏదైనా ఉందా? నా దగ్గరకు గణేశ్ చందాలని, గుడి కట్టుకోవడానికి విరాళాలని ఎవరూ రారు. ‘ఆయన ఎవరి దగ్గరా ఏమీ తీసుకోడు, ఇక ఆయనేం ఇస్తాడు’ అని బాహాటంగానే అంటారు. మరి ఎన్నికలకు ఇంటి నుంచి కావ్యగారు డబ్బు సర్దాల్సిందేనా? ఎన్నికలప్పుడు విరాళాలు తీసుకుంటాను. ‘నువ్వెప్పుడూ ఏమీ అడగలేదు సార్! ఈ పదివేలు దగ్గర పెట్టుకోండి, ఈ ఐదువేలు తీసుకోండి’ అంటూ తోచినంత ఇచ్చి వెళ్తారు. మీ దినచర్య ఎలా ఉంటుంది? ఆరు గంటలకు నిద్ర లేచేటప్పటికే జనం వచ్చి ఉంటారు. వారందరితో మాట్లాడిన తర్వాత నా పనులు. పూజ చేసుకుని మరోసారి (ఈ మధ్యలో వచ్చిన వారిని) జనాన్ని కలవడం, బ్రేక్‌ఫాస్ట్ చేసి తొమ్మిదింటికి బయటపడడం. హైదరాబాద్‌లో ఉంటే ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదో ఒక చోట పర్యటిస్తాను. రాముణ్ణి మాత్రమే పూజిస్తారా? అలా అని ఏమీ లేదు. సాయిబాబా, వెంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి అందరినీ ఇష్టపడతాను. మా ఊళ్లో (రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్) రాముడికి గుడి కట్టాను. శ్రీరామనవమికి, బ్రహ్మోత్సవాలకు తప్పకుండా ఊరికి వెళ్తాను. సినిమాలు చూస్తారా? పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు చూశాను. కమలహాసన్, శ్రీదేవి, కె.విశ్వనాథ్ సినిమాలిష్టం. ఇప్పటివాళ్ల పేర్లే గుర్తుండడం లేదు. మీతో కలసి బయటకు వెళ్లాలని ఇంట్లో వాళ్లకుంటుందిగా! బంధువుల ఫంక్షన్లకు వెళ్తాం. రెండేళ్లకోసారి టూర్లకెళ్తాం. మా ఆవిడ ఏమీ అనదు కానీ మా పాప మాత్రం ‘టూర్లో కూడా ఈ దుస్తులేంటి? మోడరన్‌గా వేసుకో నాన్నా’ అని కోప్పడుతుంది. మీ ఆవిడ కోప్పడే సందర్భాలు ఉండవా? నాకు వేగంగా తినడం అలవాటు. పొరమాలినప్పుడు ‘‘మెల్లగా తింటే కొంపలు మునుగుతాయా’’ అని నీళ్లందిస్తుంది. మీరు ఏమేమి ఇష్టంగా తింటారు? వైట్ రైస్, గడ్డ పెరుగు ఉంటే ఇంకేమీ చూడను. అభిమాన నాయకుడు? వాజ్‌పేయి. ఆయన వస్తున్నారంటే ఆ మీటింగులకు వెళ్లేవాడిని. 1980లో తొలిసారి ఆయన గురించి విన్నాను. పదహారేళ్ల వయసులో పడిన ముద్ర! అది ఎప్పటికీ చెరగదు. ఇంటర్య్వూ : వాకా మంజులారెడ్డి -
లంచం ఇవ్వకుంటే రౌడీషీటే...
* వస్త్ర వ్యాపారికి ఎస్ఐ బెదిరింపు * రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం ఎంవీపీ కాలనీ : లంచం ఇవ్వకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కడం పోలీసు శాఖలో కలకలం రేపింది. వస్త్ర వ్యాపారి నుంచి గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏం జరిగిందంటే.. వస్త్ర వ్యాపారులు రాజ్‌కుమార్ మోది, దినేస్ మోది ప్లాట్ కొనుగోలు నిమిత్తం పాండ్యన్ అనే వ్యక్తికి రూ.15 లక్షలు అడ్వాన్సగా ఇచ్చారు. రోజులు గడుస్తున్నా అతను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. అడ్వాన్స తిరిగి ఇచ్చేయాలని వారు అడగడంతో పాండ్యన్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల 22న అతను ఇంటికి వచ్చినట్టు తెలుసుకున్న రాజ్‌కుమార్ మోది ఎనిమిది మంది అనుచరులతో అతని వద్దకు వెళ్లి కొట్టి వదిలేశాడు. వారిపై ఈ నెల 23న పాండ్యన్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రాజ్‌కుమార్ మోది మాత్రం ముందస్తు బెయిల్ పొందాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు అతనికి ఫోన్ చేసి రూ.1.5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారు. దీంతో రాజ్‌కుమార్ మోది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం ఇచ్చేందుకు గురువారం రాజ్‌కుమార్ మోది వాల్తేరు జోన్ పోలీసుస్టేషన్లో ఎస్ఐను కలిశాడు. పక్క గదిలోని కానిస్టేబుల్ లక్ష్మణరావుకు ఇవ్వమని ఆయన చెప్పడంతో అక్కడి వెళ్లాడు. రూ. లక్ష లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్కడినుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఎస్ఐ రామారావును అరెస్టు చేశారు. -
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
-
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
హైదరాబాద్ : నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం తిరస్కరించారు. నియమాల ప్రకారం, సభ్యుల మద్దతు ఉన్నందున నోటీసును అంగీకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై రౌడీషీ తెరిచారని.. ఇవాళ తనకు జరిగిందని....రేపు మరొకరికి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే..ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు. అలాగే నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులపైనా ఇలాంటి కేసులే పెడుతున్నారని అన్నారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ బాధ వినాలని భూమ నాగిరెడ్డి పదేపదే స్పీకర్‌ను కోరారు. పోడియం ముందుకు వచ్చిన మరీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాత్రం నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటున్నానని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్...భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు... ప్రివిలేజ్ మోషన్‌ను... ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తానని ప్రకటించారు. -
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
-
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి, తనపై చట్ట విరుద్ధంగా రౌడీషీటును తెరవడానికి కారణమైన కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ ఎ. రవికృష్ణ, మరో ముగ్గురు పోలీసు అధికారులపై పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభా హక్కుల తీర్మానానికి నోటీసును ఇచ్చారు. ఆయన శనివారం హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31వ తేదీన నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. -
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: భూమా
కర్నూలు : ప్రజా ప్రతినిధులపై రౌడీషీట్ నమోదు చేస్తూ అధికార పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
మాకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత
-
మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హెచ్చరిక నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని కర్నూలు టీడీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తున్నారు భూమాను కేసులో ఇరికించేందుకు డీజీపీ, సీఎంలతో చర్చించామని చెబుతున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి నాతండ్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, ఎంతదూరమైనా పోరాడుతాం సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డికి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక వస్తుందంటూ టీడీపీ నేతలు బాహాటంగా చేస్తున్న ప్రకటనల తర్వాత, ఈ విషయంలో తన భయం తనకున్నందునే తానీమాట చెప్తున్నానన్నారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కేసులు నమోదు చేశారని తప్పుబట్టారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎంతదూరమైనా పోరాడుతామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ఉప ఎన్నిక వస్తుందంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. భూమాను కేసులో ఎలా ఇరికించాలనే విషయమై డీజీపీ,సీఎంలతో చర్చించామని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తన తండ్రికి గాని, తన కుటుంబానికి గాని ఇబ్బంది జరిగితే సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె ఇంకా ఏం చెప్పారంటే... నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందనే విషయమై కొన్ని టీవీ చానెళ్లు ఏకపక్షంగా చూపిస్తున్నాయి. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాగిరెడ్డికి ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉన్నా చైర్పర్సన్ సులోచన గౌరవించలేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నపుడు ప్రొటోకాల్‌నూ పాటించకుండా ఎజెండా ముగిసిందంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘తలుపులు వేయండ్రా...’ అని నా తండ్రి చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఆయనపై మూడు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారు. పథకం ప్రకారం హత్యాయత్నం చేయాలనుకుంటే పోలీసులు, మీడియా వాళ్లు అందరూ ఉండగా చేస్తారా? పోలీసులకు కేసు పెట్టేటపుడు ఆ ఆలోచన కూడా రాలేదా? రెండు పార్టీలు కొట్టుకున్నపుడు ఇద్దరిపైనా కేసులు పెట్టాలి కదా? నాగిరెడ్డిపైనే కేసు ఎలా పెట్టారు? అసెంబ్లీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాలు వాగ్వాదాలకు, గొడవ పడుతున్నపుడు కూడా స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేతలపై ఇలాగే కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరుస్తారా? టీడీపీ వారిపై మేము ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకోవడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే చేతులు పెకైత్తి ‘పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’ అని సమాధానమిస్తున్నారు. నా తల్లిదండ్రులు ఏనాడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. రౌడీయిజం, గూండాయిజం చేసి ఉంటే నా తండ్రి నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా, నా తల్లి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారే కాదు. నా తల్లి చనిపోయిన షాక్‌నుంచి మేము తేరుకోకముందే నాన్నను మానసికంగా బలహీనుడిని చేయాలనే కేసు మోపారు. జిల్లా ఎస్పీకి బుద్ధి లేదా?: మైసూరారెడ్డి నాగిరెడ్డిపై రౌడీషీటు తెరవడం అనేది దుర్మార్గమైన చర్య. ఐపీఎస్ చదువుకున్న జిల్లా ఎస్పీ అధికారపక్షం ఒత్తిడులకు తలొగ్గి బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఒక వ్యక్తిపై రౌడీ షీటుకు అవకాశం కల్పిస్తూ జారీ అయిన 743 స్టాండింగ్ ఆర్డర్‌కు ఎలాంటి రాజ్యాంగ బద్ధత లేదని, వాటికి ఎలాంటి నియమ నిబంధనల స్వభావం లేదని 1999, మార్చి 30వ తేదీన ‘మహ్మద్ ఖదీర్ వర్సెస్ హైదరాబాద్ పోలీసు కమిషనర్’ కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారికి ఇది తెలియదా? స్థానిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీటీసీలు సమావేశానికి వెళ్తుంటే ముస్లిం ఎమ్మెల్యేపైనా, అంబటి రాంబాబుపైనా దాడి చేసిన వారిపై ఇప్పటికీ కేసులు పెట్టలేదు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రోజా, సునీల్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారు. ‘సరస్వతీ’ భూముల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌పై అకారణంగా రౌడీషీటు పెట్టారు. -
మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ
తమ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అనుక్షణం ప్రజాసంక్షేమం కోసమే పనిచేసే తమ తండ్రి భూమా నాగిరెడ్డి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అనవసరంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని అన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాల్లో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.. * నంద్యాల అభివృద్ధికి నాన్నగారు సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు. ప్రతి ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు పెట్టించి, దాని పర్యవేక్షణను పోలీసులకు అప్పగించారు. * మున్సిపల్ ఛైర్మన్ సులోచన అసలు ఛైర్మన్లా కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకూడదన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ప్రోటోకాల్‌ను పట్టించుకోలేదు. * వేరే ఫ్లోర్‌లీడర్ ముందు కూర్చున్నారన్న చిన్న విషయానికి ఆమె బెల్లుకొట్టి వెళ్లపోతుంటే, నాన్న లేచి.. తాను మాట్లాడాలని చెప్పారు. అయినా ఆమె పట్టించుకోలేదు. * డోర్లు వేయండిరా అన్న ఒక్క మాటకు ఇన్ని కేసులు పెట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కుంది. సులోచన ఎవరి మద్దతుతో ఇవన్నీ చేస్తున్నారో అందరూ గమనిస్తారు. ప్రజలు తప్పకుండా వాళ్లకు బుద్ధి చెబుతారు * నిజంగా హత్యాయత్నం చేయాలంటే మీడియా ముందు, పోలీసుల ముందు ఎందుకు చేస్తారు? * రెండు పార్టీలు కొట్టుకున్నప్పుడు భూమా నాగిరెడ్డి మీద కేసులు పెట్టినవాళ్లు.. అటు సులోచన మీద మేం కేసులిస్తే ఎందుకు తీసుకోవట్లేదు? * రెండు రోజుల్లోనే మూడు కేసులు పెట్టి, రౌడీషీట్ కూడా తెరిచారు. ఇంతే వేగంతో ఇతర కేసులు కూడా డీల్ చేస్తే, ఈపాటికి కర్నూలు జిల్లాలో సగం కేసులు పరిష్కారం అయిపోయేవి. * కేసులు ఎందుకు పెట్టారంటే.. పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. పోలీసులను వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వండి. * అసెంబ్లీలో రెండు పార్టీల వాళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చాలాసార్లు ఇలా జరిగాయి. ఇప్పటివరకు ఎక్కడైనా ఎవరిమీదైనా కేసులు పెట్టారా? * రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు నేరచరిత్ర లేని కౌన్సిలర్లమీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద నిజానిజాలు చూడకుండా, ఇలా వరుసపెట్టి మూడు కేసులు, రౌడీషీట్ తెరవడం తగునా? * మేం టీడీపీ వాళ్లమీద కేసులు పెడితే ఒక్కటీ తీసుకోలేదు. వాళ్ల మీద విచారణ లేదు, అరెస్టులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్లమీదే కేసులు పెడుతున్నారు * ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఉండేదేమోగానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలో లేదు. ఆ పేరుచెప్పి భయపెట్టడానికి ప్రయత్నించకండి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటివాటిని మేం ప్రోత్సహించేది లేదు. * నాన్నగారు ఎన్ని త్యాగాలు చేశారో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తెలుసు. ఆయన నిజంగానే రౌడీయిజం చేసి ఉంటే ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆయన వెంట అంతమంది వచ్చేవారు కారు. * అమ్మను కోల్పోయిన షాక్ లోంచి మా కుటుంబం ఇంకా బయటకు రాలేదు. నాన్న ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా ప్రజల కోసమే తిరుగుతున్నారు. అంత బిజీలో ఉండి.. ఇలా ఎందుకు చేస్తారు? * మీరు భయపెడితే భయపడటానికి మేమేం తప్పులు చేయడంలేదు. దాన్ని గుర్తుంచుకోండి. * ఈ కేసులు ఏవీ లేకముందే.. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని, భూమా నాగిరెడ్డి మీద కేసులు ఎలా పెట్టాలో మాకు తెలుసని టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జి సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఆయన ఎవరి అండతో ఇలా చెబుతున్నారో అందరికీ తెలుసు. * మా కుటుంబానికి ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా దానికి బాధ్యత చంద్రబాబుదే. ఆయన మద్దతు లేకుండా ఇలా.. అది కూడా రౌడీషీట్ పెట్టకముందే చెప్పడం సాధ్యం కాదు. * టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చాలామందిని చంపేశారు. తప్పుడు కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఒక్క కేసు మీద కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు. ప్రజలంతా చూస్తున్నారు.. మీరు జాగ్రత్తగా ఉండాలి. * పోలీసులకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. ఒత్తిడి ఉందని ఒకవైపు మాత్రమే పనిచేయడం తగదు. ఇలా అన్యాయం చేయొద్దు. * నాన్నగారి మీద మూడు కేసులు పెడితే.. వాటిలో ఒక కేసు మీదే రిమాండుకు పంపారు. అంటే మిగిలినవి తప్పని వాళ్లకు కూడా తెలుసు. ఈ గొడవ జరిగినప్పుడు నలుగురికి గాయాలయ్యాయి. ఆ నలుగురిలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కేవలం ఛైర్పర్సన్ సులోచన మాత్రమే ఫిర్యాదు చేశారు. * న్యాయవ్యవవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్లీన్ చిట్‌తో నాన్న బయటకు వస్తారన్న విశ్వాసం మాకుంది. ఆయన వచ్చాక ఛైర్మన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తాం. -
'భూమాపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషం'
కర్నూలు : నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భూమా నాగిరెడ్డిపై పోలీసులు రెండు హత్యాయత్నం కేసులు, ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
సెటిల్మెంట్లు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం
ధర్మవరం : జిల్లాలో సెటిల్మెంట్లు, పంచాయితీ లు ఎవరు చేసినా, అవి తన దృష్టికి వచ్చినట్లయితే అలాంటి వారిపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. సోమవారం ధర్మవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతితో కలసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యం గా ధర్మవరంలాంటి ప్రాంతంలో బయటి వ్యక్తులు పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. మట్కా, దొంగనోట్ల చలామణి, తదితర నేరాలపైనా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులు కాళ్లరిగేలా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకూడదని, వారికి సత్వర న్యాయం చేయాలన్న తలంపుతో ప్రజాబాట నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత తేదీలో పు పరిష్కరిస్తామని రసీదులో నమోదు చేస్తున్నామన్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడి సమస్యను పరిష్కరించిన తరువాత తనకూ సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశిత తేదీ లోపు పరిష్కారం కాని సమస్యలపై రివ్యూ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సభ్యు లు దీర్ఘ కాల పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించే ందుకు కృషి చేస్తారని ఎస్పీ వెల్లడించారు. తొలుత తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహంచిన ప్రజాబాటలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించామన్నారు. హిందూపురంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా జిల్లాలోని పెన్నా, చిత్రావతి, మద్దిలేరు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ అన్నారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం బలహీన వర్గాల వారి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఇసుకను.. అదీ ట్రాక్టర్ల ద్వారా మాత్రమే రవాణా చేసేలా చర్యలు చేపడతామన్నారు. అలాంటి వారు తప్పని సరిగా సంబంధిత మండల పరిధిలోనే ఇసుకను వినియోగించుకోవాలని, అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై మైనింగ్ శాఖ అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే ప్రైవేటు సైట్లలో ఇసుకను విక్రయించే అనుమతులున్నాయని, వారు కూడా కేవలం రాష్ట్రంలో మాత్రమే విక్రయించుకోవచ్చని అన్నారు. అందులోనూ అక్రమాలు చో టుచేసుకోకుండా లైజన్ ఆఫీసర్లను నియమించి ఇసుక ఎక్కడికి రవాణా అవుతోంద న్న విషయాలపై నిఘా ఉంచుతామని చెప్పారు. మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ వాహనాలను ఆయా పట్టణాల్లోకి నిర్దేశించిన సమయంలో మాత్రమే వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ధర్మవరంలో పని చేయని నిఘా కెమెరాలను వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక జర్నలిస్టులు ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఇసుక దందాను అడ్డుకోండి : ఎస్పీకి కేతిరెడ్డి వినతి ధర్మవరం: నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ఇసుక అక్ర మ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని, దీనిని అరికట్టాలని ధర్మవ రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్పీ రాజశేఖర్‌బాబును కో రారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ఆయ న ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. అక్రమార్కులు చిత్రావతి నది నుంచి ఇసుకను డంప్‌లకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి రాత్రికి రాత్రే లారీల ద్వారా బెంగళూరుకు రవాణా చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ఫలితంగా తాగునీరు సైతం లభించక పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ఇక ధర్మవరంలో శాంతిభద్రతల పరిరక్షణ కు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయడం లేదని, వాటిని పునరుద్ధరించాలని ఎస్పీని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు బగ్గిరి బయపరెడ్డి, శివారెడ్డి, వడ్డేబాలాజీ, కనంపల్లి భాస్కరరెడ్డి, కత్తేకొట్టా కిష్ట, పోతిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
చెట్టే కదా అని నరికేస్తే..రౌడీషీట్
గుంతకల్లు టౌన్ : ప్రత్యర్థుల తోటల్లో చెట్లు నరికే విష సంస్కృతిని విడనాడకుంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని గుంతకల్లు డీఎస్పీ సీహెచ్ రవికుమార్ స్పష్టం చేశారు. ఆదివారం గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండాలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ మండల కన్వీనర్ గోవింద్‌నాయక్ పొలంలో 150 మామిడి మొక్కలను అదే గ్రామానికి చెందిన వారు నరికి వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులగుట్టపల్లి పెద్దతండాకు చెందిన మనేనాయక్ తండ్రి కమెలేనాయక్పై 2013లో ఓ కేసు నమోదైంది. ఈ కేసు మరో 15 రోజుల్లో తుది విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తన తండ్రికి శిక్ష పడకుండా కాపాడేందుకు ఫిర్యాదురాలితో రాజీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేత గోవింద్నాయక్ని కోరాడు. తాను చెప్పినా వారు వినే పరిస్థితిలో లేరని గోవింద్‌నాయక్ చెప్పడంతో మనేనాయక్ కక్ష పెంచుకున్నాడు. రాజునాయక్ అనే మరో నిందితుడు కూడా గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ గ్రామంలో గోవిందనాయక్ వల్ల వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి గోవింద్‌నాయక్‌ను ఆర్థికంగా దెబ్బ తీయాలనుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన రాత్రి పొలంలోకి వెళ్లి 150 మామిడి మొక్కలను నరికివేశారు. సోమవారం నిందితులు పులగుట్టపల్లి బస్టాప్ వద్ద వుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ రామయ్య, ఏఎస్ఐ శ్రీరాములు పాల్గొన్నారు. నిందితుల ఫొటోలతో ఫ్లెక్సీలు జిల్లాలో రైతులు సాగు చేసిన పండ్ల తోటలను నరికివేసి ఆర్థికంగా నష్టపరిచే నిందితులపై రౌడీషీట్లను ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల ఫొటోలతో కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు వేయించే వినూత్న ఒరవడికి గుంతకల్లు నుండే శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజూ అన్ని పల్లెల్లో రాత్రి వేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తామన్నారు. పండ్ల తోటల పెంపకందార్లకు ఎవరినుండైనా హాని ఉన్నట్లయితే వారి వివరాలను సేకరించి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఇరువురికీకౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య స్నేహసంబధాల్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో వర్గ, రాజకీయ కక్షలను ఎవరైనా ప్రోత్సహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం పులగుట్టపల్లిపెద్దతాండాలో మామిడి మొక్కలను నరికేసిన మనేనాయక్, రాజునాయక్‌ల ఫోటోలతో వేయించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను డీయస్పీ రవికుమార్, రూరల్ సీఐ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ ఫ్లెక్సీలను గుంతకల్లు పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో వేయించి, కరపత్రాల ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా హెచ్చరికలు జారీ చేయనున్నామని వారు తెలిపారు. నిందితులకు ఎస్పీ కౌన్సెలింగ్ గుత్తి : మామిడి మొక్కలు నరికివేత ఘటనలో నిందితులకు ఎస్పీ రాజశేఖర్‌బాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం గుత్తి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు నిందితులను తరలించారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఐ మోహన్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
పవర్ పోలిస్
ఎన్నికల వేళ.. పైగా రాష్ట్రపతి పాలన.. అధికారులే సుప్రీంలు.. రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేయడానికి పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. చట్టం పదును పెరగడంతో పోలీస్‌లకు మరింతగా ‘పవర్స్’ వచ్చాయి. దీంతో చట్టం ఎవరికీ చుట్టంగా మారే అవకాశాలు లేవు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎంతమాత్రమూ పనిచేయవు. నలుగురు గుమిగూడి అల్లరి చేస్తుంటే అక్కడికి చేరి యువకులు, పార్టీ కార్యకర్తలు న్యాయం చెబుతామనో.. జరుగుతున్న సన్నివేశాన్ని చూద్దామనుకోవడమూ ఇబ్బందుల్ని సృష్టించుకోవడమే అవుతుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవు. ఎక్కడైనా గొడవ.. వివాదం జరుగుతోంది.. పోలీసుల రాకను గమనించి అసలు నిందితులు పారిపోతే అక్కడ చూసే వారిని ముందుగా విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి హామీ పత్రాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు గొడవలు, వివాదాలు సృష్టించే ప్రమాదం ఉన్న నాయకులను పోలీసులు ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు తహశీల్దార్ సమక్షంలో వారి నుంచి ఒక హామీ పత్రాన్ని తీసుకుంటారు. ఆస్తి, కాకుంటే నగదు హామీగా చూపుతూ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే అలాంటి వ్యక్తులపై తిరిగి కేసులు నమోదు చేస్తారు. హామీగా ఇచ్చిన ఆస్తి, నగదును జప్తు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి హామీ పత్రాలను తీసుకునే ప్రక్రియను తొలిసారిగా ప్రారంభించారు. దీంతో ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం కూడా బైండోవర్ అయిన నాయకులు, కార్యకర్తల నుంచి హామీ పత్రాలను తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ నేరాల్లో రౌడీషీట్.. క్రిమినల్ ప్రోసిజర్ కోడ్(సీఆర్పీసీ) చట్టంలోని 106, 107, 108, 110(ఈ), (జీ) సెక్షన్ల కింద రెండు అంత కంటే ఎక్కువ పర్యాయాలు తహశీల్దార్ ఎదుట బైండోవర్ అయిన వ్యక్తులపై రౌడీషీట్ ప్రారంభించవచ్చు. గుంపుగా వెళ్లి మరో గుంపుపై గొడవకు దిగడం, సమాజాన్ని ప్రశాంతంగా లేకుండా సమస్యలు సృష్టించడం వంటి నేరాల్లో తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తుంటారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు బైండోవర్ అయిన వ్యక్తిపై షీట్ ప్రారంభించవచ్చు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, వారి దైనందిన కార్యక్రమాలకు ఇబ్బందులు సృష్టించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేసే ఏ వ్యక్తిపైనైనా పోలీసులు ఏపీ పట్టణ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. సాధారణంగా వీటిని చాలా చిన్న కేసులుగా భావిస్తుంటారు. వరుసగా రెండేళ్లలో రెండు, అంతకంటే ఎక్కువ సందర్భాల్లో ఈ చట్టం కింద కేసు నమోదయితే వారిపై రౌడీషీట్ తెరిచే అవకాశం ఉంది. ఎవరైనా వ్యక్తి, సమూహం అయినా కుల, మత రాజకీయ ఘర్షణలకు పాల్పడితే వారిపై కూడా రౌడీషీట్ తెరిచే అవకాాశం ఉంది. మద్యం తాగి అల్లర్లు చేయడం, మద్యం తదితర మత్తు పదార్థాల రవాణా, దౌర్జన్యాలు, వ్యాపార కేంద్రాలు, దుకాణాల వద్ద మామూళ్లు వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై కూడా రౌడీషీట్ తెరుస్తారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు భావించినా ఇదే పరిస్థితి. పోలింగ్ రోజున కేంద్రాల వద్ద రిగ్గింగ్‌కు పాల్పడినా, పోలింగ్ పెట్టెలను ఎత్తుకెళ్లినా, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినా అంతే సంగతులు. పోలింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగినా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినా వారి మెడకు రౌడీషీట్ చుట్టుకున్నట్లే. గ్రామాల వారీగా సమాచారం సిద్ధం గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నాయకులు, వ్యక్తుల జాబితా పోలీసుల వద్ద సిద్ధంగా ఉంది. వీరందరినీ మునిసిపల్, జెడ్పీ, సాధారణ ఎన్నికల సందర్భంగా మరోసారి బైండోవర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా వేశారు. ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులను అంచనా వేయడంతోపాటు సమస్యలు సృష్టించిన వ్యక్తులపైనా దృష్టి సారించారు. తమ స్టేషన్ల పరిధిలోని సమస్త సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఎక్కడ, ఎవరు తోక జాడించినా కత్తెర వేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై రౌడీషీట్ ప్రారంభించే అవకాశాలూ ఉన్నాయి. ఒకసారి రౌడీషీట్ తెరిస్తే పోలీసు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. అంతే కాదు ఎపుడు, ఏ తరహా ఎన్నికలు వచ్చినా.. విద్వేషాలు చెలరేగినా.. గొడవలు జరిగే ప్రమాదమున్నా ప్రతి సంఘటనకు ముందే రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపిస్తారు. తమదైన శైలిలో కాసింత గట్టిగానే కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే స్థానిక తహశీల్దార్ ఎదుటా బైండోవర్ చేస్తారు. అంతేకాదు గొడవలు సద్దుమణిగేదాకా స్టేషన్లో ఉంచుకొనే అవకాశం ఉంది. ఒక్కసారి రౌడీషీట్ తెరిస్తే దాన్ని తిరిగి మాఫీ చేసుకోవడం అంత సులభం కాదు. -
రౌడీషీటర్లపై నిఘా పెంచండి
గుంటూరు, న్యూస్‌లైన్ :నేరచరిత్ర ఉన్నవారిపై రౌడీషీట్లు ప్రారంభించడంతోపాటు రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ఫైల్‌ను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో 50మంది రౌడీషీటర్లు ఉండగా తరచూ వివిధ కేసుల్లో చిక్కుకునేవారి వివరాలు అడిగారు. రౌడీషీటర్ల కదిలికలపై ఎప్పటికప్పుడు ఠాణాలకు సమాచారం ఉండాలని ఆదేశించారు. నేర చరిత్ర ఉంటే వారిపై వెంటనే రౌడీషీట్లు ప్రారంభించాలన్నారు. పలు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించడంతోపాటు దొంగతనాలు, హత్య లు, మహిళలలపై వేధింపులకు సంబంధించి న ఫైళ్లను వేరువేరుగా పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ తీరుపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్‌ను ఆవరణాన్ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఐజీ వెంట అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపినాథ్, ఇన్చార్జీ డీఎస్పీ సుబ్బారెడ్డి, సీఐ ఆళహరి శ్రీనివాస్ ఉన్నారు. -
హత్య కేసులో నిందితుల లొంగుబాటు
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పడమటిగూడెం గ్రామంలో ఈ నెల 2న జరిగిన కాంబోజీ రాములు హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయూరు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి గురువారం నిందితుల వివరాలు వెల్లడించారు. అమె కథనం ప్రకారం.. పడ మటిగూడెం గ్రామానికి చెందిన చిర్ర యూకయ్య, హన్మంతు, ఉప్పలయ్య సోదరులు. వారి సోదరితో అదే గ్రామానికి చెందిన కాంబోజ రాములు వివాహేతర సంబం ధం సాగిస్తున్నాడు. అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి సదరు మహిళ సోదరులు పలుమార్లు రాములును హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి మాట పెడచెవిన పెట్టడంతో అతడిని మట్టుబెట్టేందుకు ముగ్గురు కలిసి పథకం పన్నారు. అక్టోబర్ 2వ తేదీ తెల్లవారుజామున రాములు బైక్‌పై పొలం వద్దకు వెళుతుండగా అప్పటికే రోడ్డుపై కాపుకాచిన ముగ్గురు అతడిని అడ్డుకుని గొడ్డళ్లతో దారుణంగా నరి కి చంపారు. అనంతరం గొడ్డళ్లను వారి పొలం వద్ద పెట్టి పరారయ్యూరు. వారి కోసం తీవ్రంగా గాలి స్తున్న క్రమంలోనే వారు పోలీసుల ఎదుట లొంగిపోయూరు. నిందితులపై రౌడీషీట్ నిందితుడు యూకయ్య మీద పీఎస్‌లో రౌడిషీట్ ఉందని, మిగతా ఇద్దరిపై కూడా ఓపెన్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. సమావేశంలో తొర్రూరు సీఐ సార్ల రాజు, ఎస్సై వై.వీ.ప్రసాద్, పీఎస్సై రవీందర్, హెడ్‌కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రవీందర్, పీసీలు నాగేశ్వర్రావు, బుచ్చిరాజు, మోహన్, కృష్ణంరాజు, రమేష్, రవి, సురేష్, రమేష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.