కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు | bhuma nagireddy given notice to K.Satyanarayana | Sakshi
Sakshi News home page

కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు

Published Sun, Dec 21 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

bhuma nagireddy given notice to K.Satyanarayana

సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి, తనపై చట్ట విరుద్ధంగా రౌడీషీటును తెరవడానికి కారణమైన కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ ఎ. రవికృష్ణ, మరో ముగ్గురు పోలీసు అధికారులపై పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభా హక్కుల తీర్మానానికి నోటీసును ఇచ్చారు. ఆయన శనివారం హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31వ తేదీన నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన  నోటీసులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement