Ravikrishna
-
మ్యాజిక్ రిపీట్ అయ్యేలా..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగా నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్గా చేశారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. తొలి భాగంలో చేసిన రవికృష్ణ మలి భాగంలోనూ హీరోగా నటిస్తున్నారు. అయితే హీరోయిన్గా అనశ్వర రాజన్ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు మేకర్స్. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం మాట్లాడుతూ– ‘‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా, ఈ తరం ఆడియన్స్‌కు నచ్చేలా విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమాను తీస్తున్నాం’’ అని అన్నారు. -
బీసీలకు 60 సీట్లు ఇవ్వాల్సిందే.. అన్నీ పార్టీలకు బీసీ సింహగర్జన సభ డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ హుడా కాంప్లెక్స్: అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు 60 అసెంబ్లీ సీట్లతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కేటాయించాలని రాజకీయ పార్టీలను బీసీ సింహగర్జన సభ డిమాండ్ చేసింది. బీసీలకు సముచిత స్థానం కల్పించని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. బీసీలకు 60 సీట్లు ఇవ్వాలిందేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా అంతే సంఖ్య లో సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఈట లను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ మనుగడ ఉంటుందని సభలో నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ సింహగర్జన సభ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుర్గయ్యగౌడ్, అమృతరావు, చిన్న శ్రీశైలం యాదవ్, గొడుగు మహేశ్, నవీన్ యాదవ్, కుందారం గణేశ్‌చారి తదితరులు ఇందులో పాల్గొ న్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యారు. కులానికో సీటు.. బీసీలకే ఓటు నినాదంతో.. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ అలా జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. రెడ్లకు 40 టికెట్లు ఇచ్చిందని, జనాభాలో 60శాతం ఉన్న బీïసీలకు మాత్రం 23 టికెట్లే ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. మంత్రివర్గంలోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని ప్రకటిస్తామని.. ‘కులానికో సీటు.. బీసీలకే ఓటు’నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని.. చట్టసభల్లో బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాకే మహిళా బిల్లును ఆమోదింపజేయాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలని కోరారు. అగ్రకుల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను నిలుపుతామని ప్రకటించారు. -
అలిపిరి చెక్‌పోస్టు వద్ద పిస్టల్ కలకలం..
సాక్షి, తిరుపతి: అలిపిరి చెక్ పోస్టు వాహనాల తనిఖీలో పిస్టల్ దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. ఒరిస్సాకు చెందిన రామన్ పాణిగ్రహి అనే వ్యక్తి కారులో స్టీరింగ్ క్యాబిన్లో పిస్టల్ పెట్టుకుని తిరుమలకు బయలుదేరాడు. అలిపిరి వద్ద తనిఖీ చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక అతనికి గన్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. దీంతో అతని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామన్ విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. సీవీఎస్ఓ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. నిందితుడు పలు కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. ‘తనకు వివాదాలు ఉన్నట్లు, సేఫ్టి కోసమే గన్ కొన్నట్లు అతను చెబుతున్నాడు. అంతేకాక పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఒంటరిగా గన్‌తో రావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని’ రవికృష్ణ చెప్పారు. -
నిష్పక్షపాతంగా విచారిస్తాం: ఎస్పీ
► చెరుకులపాడు హత్య కేసుపై ఎస్పీ వ్యాఖ్య వెల్దుర్తి రూరల్: కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులుతో కలిసి చెరుకులపాడు గ్రామంలో ఆదివారం పర్యటించారు. నారాయణ రెడ్డి హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారని, నిష్పక్షపాతంగా విచారిస్తామని ఆయన తెలిపారు. నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేశామని చెప్పారు. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, తమ గ్రామం ప్రశాంతంగా ఉండేదని, తాజాగా అలజడుల కారణంగా తమ నాయకుడినే కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వారికి అభయమిచ్చారు. హతుడు సాంబశివుడు కుటుంబాన్ని ఎస్పీ బృందం పరామర్శించింది. అతని తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తామెవరం ఏనాడూ ఫ్యాక్షన్ జోలికి వెళ్లలేదని, నారాయణరెడ్డి హత్యను అడ్డుకోబోయిన తన కుమారుడిని హత్య చేశారని, వ్యవసాయంతో జీవనం సాగించే తమకు ఈ దుస్థితి పట్టిందని కుటుంబీకులు వాపోయారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను పరామర్శించారు ఎస్ఐపై వెల్లువెత్తిన ఫిర్యాదులు స్థానిక ఎస్ఐ తులసీనాగప్రసాద్‌పై నారాయణరెడ్డి కుటుంబీకులు, గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తుల పలు ఫిర్యాదులు చేశారు. తమ తమ్ముడు నారాయణరెడ్డి హత్యకు ఎస్ఐ పరోక్ష కారకుడని, అతని ప్రోద్బలంతోనే ప్రత్యర్ధులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్దారని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతోపాటు ముఖ్యంగా ఎస్ఐ పాత్ర ఉందంటూ శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్‌ను.. గర్భవతిని అయినా గ్రామంలో పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే ఎస్సై అవమానించి అసభ్యకరంగా మాట్లాడాడంటూ సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కోసం పలుమార్లు అక్రమ ఇసుక, తదితర అసాంఘిక కార్యలాపాలపై వార్తలు రాసిన విలేకరులపై సైతం అక్రమ కేసులు బనాయించాడని రైతులు, గ్రామస్తులు ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నానని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. తాను కప్పట్రాళ్లను అభివృద్ధి చేస్తున్న తీరును ఉదహరించారు. గ్రామంలోని రచ్చకట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతూ నారాయణరెడ్డి హత్య తరువాత జిల్లాలో అన్ని ఫ్యాక్షన్ గ్రామాలలో ఇటు ఫ్యాక్షనిస్టులుగా ఉన్న అనుమానితులను, అటు అలసత్వం వీడాలంటూ పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. అనుమానితులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏ గ్రామంలోనైనా ఎవరికైనా ఏ చిన్న సమస్య ఎదురైనా, పోట్లాటలకు దారితీసే పరిస్థితులు ఎదురైనా తన నంబరు 9440795500కు ఫోన్ చేసి తెలపాలన్నారు. -
టీడీపీ నేత వద్ద భారీగా పట్టుబడిన నగదు!
చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దమకాను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి బ్యాగుతో ఎదురు రాగా ఆపి తనిఖీలు చేశారు. బ్యాగులో పెద్ద ఎత్తున నగదు ఉండడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వెంటనే ఆళ్లగడ్డ ఏఎస్పీ రవికృష్ణ వద్దకు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం దీన్ని ధ్రువీకరించడం లేదు. కాగా ఆ వ్యక్తి నుంచి రూ.40 వేలే పట్టుబడినట్టు చెబుతుండగా... స్థానికులు మాత్రం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఉంటుందంటున్నారు. పోలీసులు వాదన ప్రకారం చూస్తే రూ.40వేలకే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఏఎస్పీ వద్ద ప్రవేశపెడతారా? అన్న దానికి సమాధానం లభించాల్సి ఉంది. కాగా, పట్టుబడిన ఆ వ్యక్తి టీడీపీ నేతగా స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
-
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి, తనపై చట్ట విరుద్ధంగా రౌడీషీటును తెరవడానికి కారణమైన కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ ఎ. రవికృష్ణ, మరో ముగ్గురు పోలీసు అధికారులపై పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభా హక్కుల తీర్మానానికి నోటీసును ఇచ్చారు. ఆయన శనివారం హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31వ తేదీన నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. -
అమ్మానాన్ననుకలిపేద్దాం
కర్నూలు: విడిపోవడమే సమస్యకుపరిష్కార కాదని ఆలోచించి అడుగువేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారండీఎస్పీ బంగ్లాలో నిర్వహించిన ఫ్యామిలీకౌన్సిలింగ్కు మొత్తం ఆరు జంటలుహాజరయ్యాయి. ఎస్పీగా బాధ్యతలుచేపట్టిన తర్వాత మొదటిసారిగాఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు హాజరై రెండుజంటలకు ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు పట్టణానికి చెందిన సంపత్‌కుమార్, శిరీష దంపతులకు రెండేళ్ల క్రితంపెళ్లి అయింది. ఆడపడుచు నుంచి సమస్యలు ఎదురవుతుండటంతో వేరుకాపురం పెట్టాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించింది. వారి ఇరువురివాదనలను విన్న ఎస్పీ విడిపోవడంసమస్యకు పరిష్కారం కాదని అత్తనుపోషించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. మీరు విడిపోతే ఏడాది పాపభవిష్యత్తు అంధకారమవుతుందంటూపాపను ఎత్తుకుని ముద్దాడారు. చివరికివారికి రాజీ కుదిర్చారు. మొత్తం ఆరుజంటలు హాజరు కాగా, మూడుజంటలు కలసి కాపురముండేందుకుఅంగీకరించగా, మరో మూడు జంటలువిడిపోయేందుకే మొగ్గు చూపడంతోవచ్చే వారం ఫ్యామిలీ కౌన్సిలింగ్కుహాజరుకావాలని సూచించారు. షరీన్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్ కూడాఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించాడు.అదే వీధిలోని ముస్లిం యువతినిప్రేమించి ఈ ఏడాది మార్చి 21వ తేదీనదుర్గా భోగేశ్వరస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. నెల రోజుల పాటు కలసికాపురం చేశాడు. కూతురిని పుట్టింటివారు తీసుకువెళ్లి కాపురానికి పంపడంలేదంటూ అతను కౌన్సిలింగ్ చైర్మన్కుఫిర్యాదు చేశారు. కర్నూలు డీఎస్పీమనోహర్రావు, మహిళా సీఐ గౌతమి,హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, మహిళాహెడ్ కానిస్టేబుల్ సులోచన రాణి,సభ్యులు నాగశేషయ్య, ఇందుమతి,పాపయ్య గుప్త, లెనిన్ బాబు తదితరులు కౌన్సిలింగ్ కార్యక్రమంలోపాల్గొన్నారు. -
టీవీక్షణం: బుల్లితెర మన్మథుడు
మన్మథుడు అనగానే నాగార్జున గుర్తొస్తాడు. అంతవరకూ రొమాంటిక్ హీరోగా మనసులు దోచిన నాగ్, ‘మన్మథుడు’ సినిమాలో అమ్మాయిలంటే పడనివాడిగా కనిపించాడు. ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఓ మన్మథుడు తయారయ్యాడు. అతడే... రవికృష్ణ! ‘మొగలిరేకులు’ ఫాలో అయిన వాళ్లందరికీ ‘దుర్గ’గా పరిచితుడు రవికృష్ణ. సౌమ్యుడిగా, మంచి ప్రేమికుడిగా నటించాడందులో. ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ తమకూ ఉంటే బాగుణ్నని అమ్మాయిలు ఫీలయ్యేంతగా అలరించాడు. కానీ జీ తెలుగులో ప్రసారమయ్యే ‘వరూధినీ పరిణయం’ సీరియల్‌తో తన ఇమేజ్‌ని మార్చి పారేశాడు. ఇందులో అతడు ప్రేమికుడు కాదు. అమ్మాయిల పొడే గిట్టనివాడు. ఆడపిల్ల నీడను కూడా అసహ్యించుకుంటాడు. అలాంటి పాత్రలో రవిని చూసి మొదట లేడీ ఫ్యాన్సంతా షాకయ్యారు. కానీ రొటీన్‌కి భిన్నంగా అతడు ప్రదర్శిస్తోన్న నటన చూసి ఫిదా అయిపోయారు. చిన్నప్పట్నుంచీ అమ్మాయిల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటాడు హీరో. దాంతో అమ్మాయి అంటేనే సమస్య అని ఫిక్సయిపోతాడు. తల్లిని తప్ప అక్కని, చెల్లెలిని కూడా నమ్మనంతగా ద్వేషం పెంచుకుంటాడు. అలాంటివాడి జీవితంలోకి వరూధిని ప్రవేశిస్తుంది. మరి ఈ మన్మథుడి మనసులో ఆమె చోటు ఎలా సంపాదిస్తుంది, అతడితో తాళి ఎలా కట్టించుకుంటుంది అన్నదే సస్పెన్స్. అది తెలుసుకోవాలంటే... వేచి చూడాల్సిందే! నాలుగు స్తంభాలాట సీరియల్‌ని జీడిపాకంతో ఎందుకు పోలుస్తారో కలర్స్ చానెల్లో వచ్చే ‘ఉతరన్’ చూస్తే అర్థమవుతుంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఈ ధారావాహిక సా...గు...తూ...నే ఉంది. ఇప్పటి కింకా ముగింపు దరిదాపుల్లోకి కూడా రాలేదు. చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు స్నేహితురాళ్ల కథతో 2008లో మొదలైంది ‘ఉతరన్’. వాళ్లు పెద్దైపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల మధ్య అపార్థాలు తలెత్తాయి. గొడవలు పెరిగాయి. ద్వేషాలు రగిలాయి. వేదనలు మిగిలాయి. ఆ రెండు జంటల మధ్య జరిగిన నాలుగు స్తంభాలాట కొన్నేళ్లకు ముగిసింది. ఆ తర్వాత వాళ్ల పిల్లలు వయసుకొచ్చి కొత్త కథ మొదలెట్టారు. వాళ్ల కూతుళ్లు మీఠీ, ముక్తలు ప్రధాన పాత్రధారులయ్యారు. వీళ్లిద్దరికీ ఇద్దరు హీరోలు జతయ్యారు. మళ్లీ నాలుగు స్తంభాలాట మొదలు! ఆకాశ్ (మృణాల్జైన్)ని పెళ్లాడి మోసపోయిన మీఠీ (టీనా దత్తా), పుట్టింటికి చేరుకుంటుంది. అప్పటికే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన ఆకాశ్ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతణ్ని వదిలించుకోవడం కోసం విష్ణు (అజయ్ చౌదరి)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ అప్పటికే విష్ణు, ముక్త (శ్రీజిత డే) ప్రేమలో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. చూద్దాం... ఈ నాలుగు స్తంభాలాట ఇంకా ఎన్నాళ్లు సా...గు...తుం...దో!