అమ్మానాన్ననుకలిపేద్దాం
కర్నూలు: విడిపోవడమే సమస్యకుపరిష్కార కాదని ఆలోచించి అడుగువేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారండీఎస్పీ బంగ్లాలో నిర్వహించిన ఫ్యామిలీకౌన్సిలింగ్‌కు మొత్తం ఆరు జంటలుహాజరయ్యాయి. ఎస్పీగా బాధ్యతలుచేపట్టిన తర్వాత మొదటిసారిగాఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు హాజరై రెండుజంటలకు ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు.
కర్నూలు పట్టణానికి చెందిన సంపత్‌కుమార్, శిరీష దంపతులకు రెండేళ్ల క్రితంపెళ్లి అయింది. ఆడపడుచు నుంచి సమస్యలు ఎదురవుతుండటంతో వేరుకాపురం పెట్టాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించింది. వారి ఇరువురివాదనలను విన్న ఎస్పీ విడిపోవడంసమస్యకు పరిష్కారం కాదని అత్తనుపోషించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. మీరు విడిపోతే ఏడాది పాపభవిష్యత్తు అంధకారమవుతుందంటూపాపను ఎత్తుకుని ముద్దాడారు. చివరికివారికి రాజీ కుదిర్చారు. మొత్తం ఆరుజంటలు హాజరు కాగా, మూడుజంటలు కలసి కాపురముండేందుకుఅంగీకరించగా, మరో మూడు జంటలువిడిపోయేందుకే మొగ్గు చూపడంతోవచ్చే వారం ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కుహాజరుకావాలని సూచించారు.
షరీన్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్ కూడాఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఆశ్రయించాడు.అదే వీధిలోని ముస్లిం యువతినిప్రేమించి ఈ ఏడాది మార్చి 21వ తేదీనదుర్గా భోగేశ్వరస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. నెల రోజుల పాటు కలసికాపురం చేశాడు. కూతురిని పుట్టింటివారు తీసుకువెళ్లి కాపురానికి పంపడంలేదంటూ అతను కౌన్సిలింగ్ చైర్మన్‌కుఫిర్యాదు చేశారు. కర్నూలు డీఎస్పీమనోహర్‌రావు, మహిళా సీఐ గౌతమి,హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, మహిళాహెడ్ కానిస్టేబుల్ సులోచన రాణి,సభ్యులు నాగశేషయ్య, ఇందుమతి,పాపయ్య గుప్త, లెనిన్ బాబు తదితరులు కౌన్సిలింగ్ కార్యక్రమంలోపాల్గొన్నారు.